మూఢ నమ్మకాలపై సందేశం | Indavi Movie Official Theatrical release | Sakshi
Sakshi News home page

మూఢ నమ్మకాలపై సందేశం

Published Tue, Aug 21 2018 1:21 AM | Last Updated on Tue, Aug 21 2018 1:21 AM

Indavi Movie Official Theatrical release - Sakshi

బాలాజీ, ప్రమీల

నందు, అనురాధా, బాలాజీ, ప్రమీల ముఖ్య తారలుగా ఫణిరామ్‌ తూఫాన్‌ దర్శకత్వంలో శ్రీధర్‌ నిర్మించిన చిత్రం ‘ఐందవి’. ఎస్‌ఏ అర్మాన్‌ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. నటుడు కాదంబరి కిరణ్‌ ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. ఫణిరామ్‌ తూఫాన్‌ మాట్లాడుతూ– ‘‘కొందరు యువతీ యువకులు సరదాగా గడుపుదామని ఇంటి నుంచి వెళతారు. అనుకోకుండా వారు ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్నారన్నదే ఈ సినిమా కథాంశం. మంచి సస్పెన్స్‌ థ్రిల్లర్‌. మూఢ నమ్మకాలను ఆశ్రయించొద్దనే సందేశాన్ని ఇస్తున్నాం’’ అన్నారు. ‘‘ఓ సక్సెస్‌ఫుల్‌ ఫార్ములాను అనుసరించి ఈ సినిమా నిర్మించాం. అతీంద్రియ శక్తులు, హారర్‌ అంశాలను ఇష్టపడే ప్రేక్షకులకు నచ్చుతుంది. త్వరలో రిలీజ్‌ చేయనున్నాం’’ అన్నారు శ్రీధర్‌.
∙బాలాజీ, ప్రమీల

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement