nandhu
-
సవారికి సిద్ధం
నందు, ప్రియాంక శర్మ జంటగా సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సవారి’. కాల్వ నరసింహ స్వామి ప్రొడక్షన్స్ పతాకంపై సంతోష్ మోత్కూరి, నిశాంక్ రెడ్డి కుడితి నిర్మించిన ఈ సినిమాని ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నట్లు చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘అన్ని వర్గాలను ఆకట్టుకునే లవ్ ఎంటర్టైనర్ చిత్రమిది. ఇప్పటికే విడుదలైన టీజర్, శేఖర్ చంద్ర సంగీతానికి మంచి స్పందన రావడంతో సినిమాకు క్రేజ్ వచ్చింది. రాహుల్ సిప్లిగంజ్ పాడిన ‘నీ కన్నులు..’ లిరికల్ సాంగ్‌కి ఇప్పటికే 5 మిలియన్ వ్యూస్ దక్కాయి. అదేవిధంగా ‘ఉండిపోయా..’ పాటకు కూడా అద్భుతమైన స్పందన వస్తోంది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్ సంస్థ ఏషియన్ సినిమాస్ మా సినిమా థియేట్రికల్ హక్కులను దక్కించుకున్నారు.. నైజాంలో వారు విడుదల చేయనున్నారు’’ అన్నారు. శ్రీకాంత్ గంట, శివ, మది తదితరులు ఈ చిత్రంలో నటించారు. -
ముగ్గురి ప్రేమ
మహేశ్వర క్రియేషన్స్ పతాకంపై కోటి వద్దినేని దర్శకత్వంలో మాలతి వద్దినేని నిర్మించిన చిత్రం ‘ఎందుకో ఏమో’. నందు, నోయల్, పునర్నవి భూపాలం నాయకా నాయికలుగా నటించిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇది. ‘‘వినాయక చవితి సందర్భంగా ఈ నెల 12న మా చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అని చిత్ర నిర్మాత మాలతి తెలిపారు. ఆమె ఇంకా మాట్లాడుతూ – ‘‘ఇది నా తొలి సినిమా. ఎంతో నిజాయితీగా చేసిన ప్రయత్నమిది. లవ్ స్టోరీతో పాటు కమర్షియల్ అంశాలు ఉన్న చిత్రం. మంచి కాన్సెప్ట్‌తో వచ్చే చిత్రాలను ప్రజలు ఆదరిస్తారు. మా సినిమా అలాంటిదే’’ అన్నారామె. కోటి వద్దినేని మాట్లాడుతూ– ‘‘ఇది ముగ్గురి మధ్య జరిగే ప్రేమకథ . ఫ్యామిలీ, యూత్‌ను మా సినిమా ఆకట్టుకుంటుంది. నందు, నోయల్, పునర్నవి ఎవరికి వారు పోటి పడి నటించారు. క్లైమాక్స్ మా చిత్రానికి హైలెట్. కథ, కధనాలు కొత్తగా ఉంటాయి’’ అన్నారు. నందు మాట్లాడుతూ– ‘‘మహిళా నిర్మాత సినిమాలో నటించడం నాకిది ఫస్ట్ టైమ్. ఎంతో అభిరుచితో నిర్మించిన ఈ చిత్రంలో నటించినందుకు హ్యాపీగా ఉంది. నాపై నమ్మకంతో నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు కోటి గారికి థ్యాంక్స్. ఈ సినిమా ద్వారా నోయల్, పునర్నవి మంచి స్నేహితులయ్యారు’’ అన్నారు. -
మూఢ నమ్మకాలపై సందేశం
నందు, అనురాధా, బాలాజీ, ప్రమీల ముఖ్య తారలుగా ఫణిరామ్ తూఫాన్ దర్శకత్వంలో శ్రీధర్ నిర్మించిన చిత్రం ‘ఐందవి’. ఎస్ఏ అర్మాన్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. నటుడు కాదంబరి కిరణ్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఫణిరామ్ తూఫాన్ మాట్లాడుతూ– ‘‘కొందరు యువతీ యువకులు సరదాగా గడుపుదామని ఇంటి నుంచి వెళతారు. అనుకోకుండా వారు ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్నారన్నదే ఈ సినిమా కథాంశం. మంచి సస్పెన్స్ థ్రిల్లర్. మూఢ నమ్మకాలను ఆశ్రయించొద్దనే సందేశాన్ని ఇస్తున్నాం’’ అన్నారు. ‘‘ఓ సక్సెస్ఫుల్ ఫార్ములాను అనుసరించి ఈ సినిమా నిర్మించాం. అతీంద్రియ శక్తులు, హారర్ అంశాలను ఇష్టపడే ప్రేక్షకులకు నచ్చుతుంది. త్వరలో రిలీజ్ చేయనున్నాం’’ అన్నారు శ్రీధర్. ∙బాలాజీ, ప్రమీల -
నవ్వుల్ నవ్వుల్
నందు, తేజస్విని ప్రకాష్ జంటగా నటించిన చిత్రం ‘కన్నుల్లో నీ రూపమే’. బిక్స్ ఇరుసడ్ల దర్శకత్వంలో భాస్కర్ భాసాని నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ– ‘‘వినోదాత్మకంగా తెరకెక్కిన చిత్రమిది. ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా నవ్వుకుంటూ చూడొచ్చు. నందు కెరీర్లో ఓ డిఫరెంట్ చిత్రమిది. తన గత చిత్రాలతో పోలిస్తే ఇందులో చాలా బాగా నటించాడు. నటి తేజస్విని పాత్రకు ఆడియన్స్ ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు. మాతో అసోసియేట్ అయిన నిర్మాతలు ఎస్. శ్రీకాంత్ రెడ్డి, రామ్మోహనరావులకు (హరిహర చలనచిత్ర) కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘ఈ నెల 29న విడుదల కానున్న మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాత. -
100 పర్సంట్ లవ్లా...
‘‘నిశ్చితార్థం నుంచి పెళ్లి లోపు జరిగే సంఘటనలతో తెరకెక్కిన చిత్రం ‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’. ‘100 పర్సంట్ లవ్’ సినిమాలా ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ సినిమా చూశాక నందూతో కమర్షియల్ సినిమాలు చేయొచ్చని చాలామందికి నమ్మకం కలుగుతుంది’’ అని నందు అన్నారు. నందు హీరోగా, సౌమ్య వేణుగోపాల్, పూజ రామచంద్రన్ హీరోయిన్లుగా వరప్రసాద్ వరికూటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’. హరహర చలన చిత్ర సమర్పణలో ఎస్. శ్రీకాంత్ రెడ్డి, రామమోహనరావు ఇప్పిలి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 6న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నందు మాట్లాడుతూ– ‘‘అదుర్స్, కృష్ణ, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ చిత్రాలకు వరప్రసాద్ పని చేశారు. ఆ పంథా కథల్లా ఉండే పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా ఇది. ఆయనతో సినిమా చేస్తే ఒక లైఫ్ ఇస్తాడనే నమ్మకం కలిగింది. స్నేహితులు, బంధువులు సినిమా బాగుందనడంతో మంచి సినిమా అనే నమ్మకం బలంగా ఉంది. నా భార్య గీతామాధురి (సింగర్) సినిమా చూసి, ‘మంచి సినిమా చేసావ్. ఇలాంటి కథలే చేయండి’ అంటూ సలహా ఇచ్చింది. మా చిత్రం చూసిన ప్రేక్షకులు ఎక్కడా నిరాశ పడరు. యాజమాన్య మంచి సంగీతం ఇచ్చారు’’ అన్నారు. -
పేరు.. డబ్బులు రావాలి – వినాయక్
‘‘ఎందుకో ఏమో’ టైటిల్‌లాగే టీజర్ కూడా చాలా ట్రెండీగా, ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్న కోటికి మంచి పేరు, నిర్మాతకు లాభాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఆల్ ది బెస్ట్’’ అన్నారు దర్శకుడు వీవీ వినాయక్. నందు, నోయల్, పునర్నవి ముఖ్య తారలుగా కోటి వద్దినేని దర్శకత్వంలో మాలతి వద్దినేని నిర్మిస్తోన్న సినిమా ‘ఎందుకో ఏమో’. ఈ చిత్రం టీజర్‌ను వినాయక్ విడుదల చేశారు. కోటి వద్దినేని మాట్లాడుతూ– ‘‘ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. మా నిర్మాత రాజీ పడకుండా, నాకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో అనుకున్నట్టుగా సినిమా తీయగలిగా. సెన్సార్ పనులు జరుగుతున్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలో ఆడియో, అదే నెలలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘మంచి లవ్ స్టోరీతో పాటు కమర్షియల్ హంగులు మా సినిమాలో ఉన్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుంది’’ అన్నారు మాలతి. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్, కెమెరా: జీయస్ రాజ్ (మురళి). -
హీరోయిన్గా మరో ఛాన్స్ కొట్టేసిన యాంకర్
బుల్లితెర మీద సత్తా చాటుతున్న యాంకర్స్ వెండితెర మీద కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే అనసూయ, రష్మీ లాంటి వారు వరుస అవకాశాలతో దూసుకుపోతుండగా మరికొందరు సత్తా చాటేందుకు కష్టపడుతున్నారు. అదే బాటలో బుల్లితెర స్టార్ యాంకర్ శ్రీముఖి వరుస అవకాశాలతో సత్తా చాటుతోంది. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న పీరియాడిక్ కామెడీ డ్రామా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఈ సినిమాలో లీడ్ క్యారెక్టర్లో నటిస్తున్న శ్రీముఖి హీరోయిన్ గా మరో ఛాన్స్ కొట్టేసింది. వి.ఎస్ వాసు దర్శకత్వంలో తెరకెక్కబోయే కొత్త చిత్రంలో శ్రీముఖి హీరోయిన్గా నటిస్తోంది. ‘కుటుంబ కథా చిత్రం’ అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నందు హీరోగా నటిస్తున్నాడు. కొత్తగా పెళ్లైన జంట నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాతో హీరోయిన్ గా ప్రూవ్చేసుకోవాలని భావిస్తోంది శ్రీముఖి. -
‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’ స్టిల్స్
-
ఎన్నెన్నో వింతలు...
నందు, సౌమ్య జంటగా వీవీ వినాయక్ శిష్యుడు వరప్రసాద్‌ను దర్శకునిగా పరిచయం చేస్తూ హరిహర చలన చిత్ర పతాకంపై ఎస్. శ్రీకాంత్ రెడ్డి, రామమోహన రావు ఇప్పిలి నిర్మిస్తున్న సినిమా ‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’. ‘స్వామి రారా’ ఫేమ్ పూజా రామచంద్రన్ కీలక పాత్ర చేసిన ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకులకు ఉత్కంఠను కలిగించే పాయింట్‌తో తెరకెక్కిన చిత్రమిది. యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఉన్నాయి. యాజమాన్య మంచి సంగీతం ఇచ్చారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేశాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. మే నెలాఖరున చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమేరా: ఎస్. మురళీమోహన్‌రెడ్డి, సహ నిర్మాత: డి. శ్రీనివాస్ ఓంకార్. -
మనుషులు.. మనసులు....
సంజీవ్, చేతనా ఉత్తేజ్, నందు, కారుణ్య ముఖ్య తారలుగా శ్రీమతి శైలజ సమర్పణలో శశిభూషణ్ దర్శకత్వంలో కమల్‌కుమార్ పెండెం నిర్మించిన సినిమా ‘పిచ్చిగా నచ్చావ్’. ఈ సినిమా ట్రైలర్‌ను నటుడు అవసరాల శ్రీనివాస్ రిలీజ్ చేశారు. ‘‘నేటి యువత చిన్న చిన్న విషయాలను అపార్థం చేసుకుంటున్నారు. తద్వారా మనుషులు, మనసులు విడిపోతున్నాయి. అలాంటి అయోమయంలో ఇరుక్కున్న ఓ యువకుడు ప్రేమకు సరైన నిర్వచనం తెలుసుకుని, తన పొరపాటుని ఎలా సరిదిద్దుకున్నాడు? అన్నదే చిత్ర కథ. ఈ నెల 17న సినిమాను విడుదల చేస్తున్నాం’’ అన్నారు దర్శక–నిర్మాతలు. -
రిలీజ్ వరకూ సస్పెన్సే!
‘‘ఇటీవల విడుదలైన ఆంజనేయస్వామి ముఖంతో ఉన్న పోలీసాఫీసర్ ఫస్ట్ లుక్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఆయన ఎవరో చెప్పమని పలువురు అడిగారు. సినిమా రిలీజ్ వరకూ ఆ స్పెషల్ స్టార్ ఎవరు? అనేది సస్పెన్సే’’ అన్నారు దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ల. రిచా పనయ్, ‘బాహుబలి’ ప్రభాకర్, బ్రహ్మానందం, కాట్రాజు, బ్రహ్మాజీ, ధనరాజ్, నందు ముఖ్య తారలుగా ఆయన దర్శకత్వంలో గురురాజ్ నిర్మిస్తున్న సినిమా ‘రక్షక భటుడు’. 60 శాతం చిత్రీకరణ పూర్తయింది. నిర్మాత మాట్లాడుతూ – ‘‘కథ వినగానే థ్రిల్ ఫీలయ్యా. ఈ నెల ప్రథమార్థం ఇంటర్వెల్ ఎపిసోడ్‌తో పాటు కీలక సన్నివేశాలు చిత్రీకరించాం. ఫిబ్రవరిలో జరిగే షెడ్యూల్‌తో షూటింగ్ మొత్తం పూర్తి చేస్తాం’’ అన్నారు. ‘‘నేను దర్శకత్వం వహించిన గత చిత్రాలు ‘రక్ష’, ‘జక్కన్న’ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఈ చిత్రకథాంశం ఉంటుంది’’ అని దర్శకుడు అన్నారు. ఈ చిత్రానికి కెమేరా: మల్హర్‌భట్ జోషి, సంగీతం: దినేశ్. -
అయోమయ ప్రేమ
నటుడు ఉత్తేజ్ కుమార్తె చేతన హీరోయిన్గా పరిచయమవుతోన్న చిత్రం ‘పిచ్చిగా నచ్చావ్’. సంజయ్, చేతన ఉత్తేజ్, నందు, కారుణ్య ముఖ్య పాత్రల్లో వి.శశిభూషణ్ దర్శకత్వంలో కమల్‌కుమార్ పెండెం నిర్మించారు. నిర్మాత రాజ్ కందుకూరి బ్యానర్ లోగోను, ఉత్తేజ్ హీరోయిన్ లుక్‌ను, హీరో నవీన్ చంద్ర టీజర్‌ను ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘లవ్‌లోని చిన్న చిన్న విషయాలను అర్థం చేసుకోకుండా నేటి యువత కోపం, ఈర్ష్య, ద్వేషం పెంచుకుని విడిపోతున్నాయి. అలాంటి అయోమయంలో ఇరుక్కున్న ఓ యువకుడు ప్రేమకు సరైన నిర్వచనం తెలుసుకుని, తన తప్పుని ఎలా సరిదిద్దుకున్నాడు? అన్నదే ఈ చిత్రకథ’’ అన్నారు. ‘‘త్వరలో పాటల్ని, సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు నిర్మాత. ఈ చిత్రానికి సమర్పణ: శ్రీమతి శైలజ. -
కొత్తగా సరికొత్తగా...
ప్రముఖ దర్శకులు వీవీ వినాయక్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన వరప్రసాద్ వరికూటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నందు, సౌమ్యవేణుగోపాల్ జంటగా ఆయన దర్శకత్వంలో హరి హర చలనచిత్ర పతాకంపై తెరకెక్కుతోన్న చిత్రం ‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నూతన సంవత్సర సందర్భంగా ప్రముఖ కెమెరామ్యాన్ ఛోటా.కె. నాయుడు విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘గతంలో ‘వరప్రసాద్ ఐ ఫోన్’ అనే వినూత్నమైన షార్ట్ ఫిల్మ్ తెరకెక్కించా. పూణే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ చిత్రానికి బెస్ట్ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ కేటగిరిల్లో అవార్డులు అందుకున్నా. ప్రస్తుతం చేస్తున్న ‘ఇంతలో ఎన్నెని వింతలో’ ఫ్యామిలీ అండ్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్. షూటింగ్ 50 శాతం పూర్తయింది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇంతవరకు ఎవరూ టచ్ చేయని కథాంశంతో తీస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్.మురళి మోహన్‌రెడ్డి, సంగీతం: యాజమాన్య, లైన్ ప్రొడ్యూసర్: శ్రీనివాస్ ఓంకార్. -
కూతురు ఎందుకొద్దు?
షార్ట్ ఫిల్మ్ ఆడపిల్ల ఇంటికి వెలుగు. అది మన ఇల్లా? ఇంకొకరి ఇల్లా అని కాదు. పుట్టినింట, మెట్టినింట సంతోషపు దివ్వెలు వెలిగించి, శాంతి సామరస్యాల పూల మొక్కలు నాటి, ఆ సుమ సౌరభాలను కుటుంబంలో అందరికీ పంచుతుంది ఆడపిల్ల. అంతటి అపురూమైన ఆడపిల్ల.. మన ఇంట పుట్టబోతోందంటే ఎందుకంత కలవరం? ఎందుకంత ఆలోచన? ఎందుకంటే ఆడపిల్ల మీద ఉండే ప్రేమ.. ఆమె భద్రతను గురించిన భయాన్ని కూడా కలిగిస్తుంది కాబట్టి. ఆ భయం.. ఆమె పట్ల తల్లిదండ్రులుగా, అన్నదమ్ములుగా మన బాధ్యతను మరింత పెంచుతుంది కాబట్టి. కానీ ప్రేమ ఉన్నప్పుడు ఇలాంటి భయాలను తట్టుకోలేమా? బాధ్యతలను ఇష్టంగా గుండెలపై మోయలేమా? తట్టుకోవాలి. మోయాలి. అది మనం ఆడపిల్లకు చేస్తున్న మేలు కాదు. మనకు మనం ఒక మంచి సమాజాన్ని నిర్మించుకోవడం కోసం స్వీకరించవలసిన ‘భారం’. ఆడపిల్ల, భారం.. అన్నవి మన సమాజంలో సమానార్థాలు. ఈ భావనను పోగొట్టేందుకు అనేక విధాలైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభుత్వాలు బాలికల సంక్షేమం కోసం, సంరక్షణ కోసం ప్రణాళికలు రచిస్తూ, పథకాలను అమలు చేస్తున్నాయి. ప్రముఖ వ్యక్తులు, సగటు పౌరులు కూడా ఎవరిస్థాయిలో వారు సమాజంలో మార్పు తెచ్చి, బాలికల మనుగడకు అవసరమైన పరిస్థితులను నెలకొల్పాలని చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు. ఇక సృజనశీలురు, కళాకారులైతే.. బాలికల పట్ల సమాజం ఆలోచనా ధోరణిని మార్చేందుకు తమ కళను ఒక సాధనంగా, శక్తిమంతమైన ఆయుధంగా మలచుకుంటున్నారు. అలాంటి ఒక సృజనాత్మక ఉద్వేగభరిత ఆయుధం.. ‘వై నాట్ ఎ గర్ల్’ లఘు చిత్రం. నిన్ననే విడుదలైన ఈ చిత్రం నిడివి 10 నిమిషాలు. ప్రాణం.. పది తరాలు. ఆపై తరతరాలు! సమాజంలో మార్పు వచ్చేంత వరకు. ‘వై నాట్ ఎ గర్ల్’ చిత్ర దర్శకుడు సునీల్ పప్పుల. నిర్మాత భార్గవి రెడ్డి. చిత్రంలోని యువ దంపతులు నందు, పావనిరెడ్డి. కథ వాళ్లిద్దరిదే. చూశాక అందరిదీ. ఇంటింటిదీ! అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. ఇంట్లో అందరూ సంతోషిస్తారు. భార్యాభర్తలు అప్పటికే మేఘాలలో తేలియాడుతూ ఉంటారు. ఫస్ట్ బేబీ మరి. అయితే ఆ తేలిపోవడం ఎంతోసేపు ఉండదు. ఇంట్లో అందరూ... పుట్టబోయేది అబ్బాయే అని అంటుంటారు. అబ్బాయే పుట్టాలని కూడా ఆశిస్తుంటారు. వీళ్లు హర్ట్ అవుతారు. వీళ్ల ఆలోచనలో ఉన్నది బిడ్డ మాత్రమే. ఆడబిడ్డా, మగబిడ్డా అని కాదు. వీళ్ల అనందానికి కారణమైంది బిడ్డ మాత్రమే. ఆడబిడ్డా, మగబిడ్డా అని కాదు. ఇంట్లో మాత్రం అందరికీ మగపిల్లాడే కావాలి. యువజంటలో ఆనందం ఆవిరైపోయి, ఆలోచన మాత్రం మిగులుతుంది. ఒకవేళ ఆడపిల్ల పుడితే..? ఈ సందేహం వాళ్లది కాదు. డెరైక్టర్ సునీల్‌ది. అక్కడి నుంచి కథను లాక్కొస్తాడు. నిజానికైతే.. సునీల్ ఈ కథను వాళ్ల అక్క చేతుల్లోంచి లాక్కొచ్చాడు! రెండోసారి ఆమె గర్భిణి అయినప్పుడు.. తనకు ఆడపిల్లే పుట్టాలని అనుకుంది. అనుకోవడం కాదు. కోరుకుంది. కోరుకోవడం కాదు. ఆశించింది. అయితే ఆమె ఆశ నెరవేరలేదు. మళ్లీ అబ్బాయే పుట్టాడు! ఆడపిల్ల కోసం కళ్లు కాయలు కాసేలా చూసి, మగపిల్లాడు పుట్టగానే కళ్లు ఉబ్బిపోయేలా ఏడ్చింది. సునీల్ ఆశ్చర్యపోయాడు. ఏమిటి ఈ ఎదురుచూపులు? ఏమిటి ఈ ఆశ నిరాశలు. ఎవరు పుట్టేదీ మన చేతుల్లో లేదని తెలిసీ.. మగపిల్లాడే పుట్టాలనీ, లేదంటే ఆడపిల్లే పుట్టాలని అనుకోవడం ఏమిటి అనుకున్నాడు. ఈ ధోరణి.. కొత్త దంపతులను అయోమయంలో పడేస్తుందని సునీల్‌కి అనిపించింది. అందుకే షార్ట్ ఫిల్మ్ తియ్యాలనుకున్నాడు. సునీల్ అక్కలా అబ్బాయి పుడితే ఫీల్ అయ్యేవాళ్లు సమాజంలో చాలా తక్కువమంది. అందుకే ఎక్కుమంది ఫీలింగ్స్‌కి తగ్గట్టు ఆడపిల్లను సబ్జెక్ట్‌గా తీసుకుని ‘వై నాట్ ఎ గర్ల్’ తీశాడు. చూసిన వాళ్లలో ఛేంజ్ వస్తుందని ఆశిస్తున్నాడు. ఈ షార్ట్ ఫిల్మ్‌ని నిర్మించిన భార్గవీరెడ్డికి... సునీల్‌కి ఉన్నట్లే.. ఓ అనుభవం ఉంది. వాళ్ల దగ్గరి బంధువుల్లో ఒకావిడ తనకు మూడోసారీ ఆడపిల్లే పుట్టిందని చెప్పి ఎవరికైనా దత్తతు ఇచ్చేయాలనుకుందట. అది విని భార్గవి షాక్ తిన్నారు. అలా ఈ ప్రొడ్యూజరు, డెరైక్టరూ కలిసి సొంత అనుభవాల్లోంచి ‘వై నాట్ ఎ గర్ల్’ తీశారు. ఒకేలా ఆలోచించేవారంతా కదిలి వచ్చి భ్రూణ హత్యల్ని ఆపాలని వీళ్లు కోరుతున్నారు. సినిమా చూడండి.. ఇంకా వీళ్లేం మార్పు తేవాలనుకుంటున్నారో తెలుస్తుంది. -
సినీతారల డైరీ సీక్రెట్స్
పొద్దుటి నుంచి పొద్దెక్కే దాకా సమయం ఎలా గడిచిపోతుందో తెలియడం లేదు. ఒక్కసారి రోజులో మనం చేసిన విషయాలన్నీ తీరిగ్గా కూర్చొని గుర్తు చేసుకుంటూ సరిగ్గా సమీక్షించుకుంటే.. మరుసటి రోజు నుంచి మనలో వచ్చే మార్పు మనకే ఆశ్చర్యం కలిగిస్తుంది. తప్పనిసరిగా మన తప్పుల్ని తగ్గిస్తుంది. దీనికి మనం పెద్దగా ఏం చేయాల్సిందేమీ లేదు. డైరీ రాస్తే చాలంటున్నారు నిపుణులు. అందుకేనేమో కొత్త ఏడాది ప్రారంభమవుతుందంటే చాలా మంది ఆలోచించే కొత్త విషయాల్లో డైరీ రాయడం కూడా ఒకటి అనేది నిస్సందేహం. ఈ నేపథ్యంలో డైరీ రైటింగ్ గురించి సినిమా సెలబ్రిటీలు ‘సాక్షి’తో పంచుకున్న స్వీయానుభవాలివి. - శిరీష చల్లపల్లి... రాసేస్తే రిలీఫ్ చిన్నప్పటి నుంచి డైరీ రాసే అలవాటుంది. ఇప్పటికీ రోజూ డైరీ రాసేందుకు ఇష్టపడతాను. అయితే పాత డైరీలు దాచుకోను. ఏడాది గడిచాక డైరీ ఒక్కసారి చదువుకొని పడేస్తాను. ఎందుకంటే అవి నాకు కొత్తగా, ఫన్నీగా అనిపిస్తాయి. స్కూల్ ఏజ్‌లో నేను డైరీ రాయడంలో అంత ఆనెస్ట్‌గా ఉండేదాన్ని కాదు. కానీ ఏళ్లు గడిచే కొద్దీ డైరీతో నిజాయతీగా ఉండటం అలవాటు చేసుకున్నాను. మూడ్ బాగోలేనప్పుడు నాకు డైరీ చాలా రిలీఫ్ ఇస్తుందని రియలైజ్ అయ్యాను. అందుకే ఇప్పటికీ అప్పుడప్పుడు డైరీ రాస్తుంటాను. మనం ఇతరులతో షేర్ చేసుకున్న విషయాలైనా కొంత వరకు మరచిపోతాం... కానీ, డైరీలో రాసుకున్న ప్రతి విషయం మనకు గుర్తుంటుంది. అవి గుర్తుకు తెచ్చుకున్నప్పుడల్లా ఒక డిఫరెంట్ ఫీల్ కలుగుతుంది. అందుకే ఐ లవ్ రైటింగ్ డైరీ. - అర్చన( వేద) డిజైన్ చేసేదాన్ని... ఆరో తరగతి నుంచి పర్సనల్ డైరీ రాయడమంటే నాకొక క్రేజ్ లాంటిది. ఆ ఏజ్‌లో పెద్దగా దాచిపెట్టుకోవాల్సిన సీక్రెట్స్ ఏవీ లేకపోయినా అదో ఫ్యాషన్‌గా ఫీల్ అయ్యేదాన్ని. క్లోజ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ ఫొటోలు కట్ చేసి అతికించి వాళ్ల గురించి నాకున్న ఫీలింగ్స్ వాటి కింద రాసి గ్లిట్టేర్ పెన్స్, ఫర్ఫ్యూమ్ పెన్స్‌తో డిజైన్లతో పేజీని అందంగా డెకరేట్ చేసి చూసుకొని మురిసి పోయేదాన్ని. ఆ డైరీలు ఇప్పటికీ నాతోనే ఉన్నాయి. ఎప్పుడైనా సరదాగా వాటిని తీసి చూసుకొని మురిసి పోతుంటాను. స్కూల్ గర్ల్ ఏజ్ నుంచి డ్రీమ్ గర్ల్ ఏజ్‌కు రాగానే ఫ్రెండ్స్‌తో, అమ్మతో కూడా షేర్ చేసుకోలేని విషయాలు కొన్ని ఉంటాయి. కాబట్టి అప్పుడు కొన్ని రోజులు రిస్క్ ఎందుకులే అనిపించి రాయడం మానుకున్నాను. - సంజన కంటిన్యూగా రాయలేను.. చిన్నప్పుడంటే స్కూల్ డైరీ రాసేవాడిని. ఆ తర్వాత సీరియస్‌గా అయితే డైరీ రాసే అలవాటు లేదు. ఎక్కువగా ఫీలింగ్స్, డైలీ షెడ్యూల్స్ రాసుకోవడానికే కదా డైరీ. కానీ చిన్నప్పటి నుంచి ప్రతిరోజూ రాత్రి కనీసం గంట సేపయినా ఫ్యామిలీతో కూర్చొని అన్ని విషయాలు డిస్కస్ చేసి ఎప్పటికప్పుడు రీఫ్రెష్ అయిపోవడం అలవాటు. అందుకేనేమో ఇప్పటివరకు డైరీ రాసే అవసరం రాలేదు. కానీ ఎవరైనా డైరీ ఇంపార్టెన్స్ గురించి బాగా చెబితే అప్పటికప్పుడు ఇన్స్పైర్ అయిపోయి.. వెంటనే కొత్త డైరీ తెచ్చుకొని అర్జంటుగా అన్నీ గుర్తు తెచ్చేసుకొని మరీ డైరీలో నింపేస్తుంటా. అయితే అది రెండు మూడు రోజులు మాత్రమే. ఆ తర్వాత అది పెట్టిన చోటే ఉండి పోతుంది. మళ్లీ ఎప్పడో అది తవ్వకాల్లో బయట పడినప్పుడు చదువుకొని మురిసిపోతాను. మంచో, చెడో.. ఎవరిదైనా పర్సనల్ డైరీ పొరపాటున నాచేతిలో పడితే చదివేస్తాను. ఫోన్ మెసేజ్‌లు కూడా అంతే. టకటకా చదివేస్తాను. అలా తెలిసినా కానీ ఎవరినీ టీజ్ చేయను. ఫన్ లవింగ్ గాయ్‌ని అయినా ఇట్లాంటి విషయాల్లో ఫీలింగ్స్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. సో.. అందులోని పర్సనల్ ఇన్ఫర్మేషన్ కామ్‌గా చదివి, వాళ్లను ఆ విషయాలను ఎప్పుడూ అడగకుండా, నాకు ఆ విషయం తెలుసని వాళ్లకు తెలియకుండా.. వారు ఎప్పుడైనా ఆ విషయాలు షేర్ చేస్తారా అని ఎదురు చూస్తానంతే. - నందు