ఎన్నెన్నో వింతలు... | Inthalo Enni Vinthalo movie shooting completed | Sakshi
Sakshi News home page

ఎన్నెన్నో వింతలు...

Apr 10 2017 12:04 AM | Updated on Sep 5 2017 8:22 AM

ఎన్నెన్నో వింతలు...

ఎన్నెన్నో వింతలు...

నందు, సౌమ్య జంటగా వీవీ వినాయక్‌ శిష్యుడు వరప్రసాద్‌ను దర్శకునిగా పరిచయం చేస్తూ హరిహర చలన చిత్ర పతాకంపై

నందు, సౌమ్య జంటగా వీవీ వినాయక్‌ శిష్యుడు వరప్రసాద్‌ను దర్శకునిగా పరిచయం చేస్తూ హరిహర చలన చిత్ర పతాకంపై ఎస్‌. శ్రీకాంత్‌ రెడ్డి, రామమోహన రావు ఇప్పిలి నిర్మిస్తున్న సినిమా ‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’. ‘స్వామి రారా’ ఫేమ్‌ పూజా రామచంద్రన్‌ కీలక పాత్ర చేసిన ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది.

దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకులకు ఉత్కంఠను కలిగించే పాయింట్‌తో తెరకెక్కిన చిత్రమిది. యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఉన్నాయి. యాజమాన్య మంచి సంగీతం ఇచ్చారు. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ పూర్తి చేశాం. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. మే నెలాఖరున చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమేరా: ఎస్‌. మురళీమోహన్‌రెడ్డి, సహ నిర్మాత: డి. శ్రీనివాస్‌ ఓంకార్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement