తమిళ డైరెక్టర్‌ నా జీవితంతో ఆడుకున్నాడు: మలయాళ నటి | Actor Sowmya Accused a Tamil director | Sakshi
Sakshi News home page

నన్ను కూతురిగా భావిస్తూనే నాతో బిడ్డను కంటానన్నాడు.. ఓ రోజు..:నటి ఎమోషనల్‌

Published Thu, Sep 5 2024 8:51 PM | Last Updated on Sat, Oct 5 2024 3:08 PM

Actor Sowmya Accused a Tamil director

ఓ తమిళ డైరెక్టర్‌ తనను కీలుబొమ్మలా వాడుకున్నాడంటోంది మలయాళ నటి సౌమ్య. 18 ఏళ్ల వయసులో అతడు చేసిన పాడుపని, వేధింపుల వల్ల నరకయాతన అనుభవించానంటోంది. ఇప్పటికైనా తన పేరును పోలీసుల ముందు బయటపెడతానని చెప్తోంది.

18 ఏళ్ల వయసులో..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో సౌమ్య మాట్లాడుతూ.. 18 ఏళ్ల వయసులో కాలేజీ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్నప్పుడు ఒక తమిళ సినిమాలో అవకాశం వచ్చింది. అప్పుడు నా పేరెంట్స్‌కు సినిమాల గురించి పెద్దగా ఏమీ తెలియదు. అయితే నటి రేవతి మా ఇంటికి దగ్గర్లోనే ఉండేది. తనను చూసి నేను కూడా ఊహల ప్రపంచంలో తేలిపోయాను. ఆ ఆఫర్‌కు ఓకే చెప్తూ స్క్రీన్‌ టెస్ట్‌కు వెళ్లాను. అప్పుడు నాది చిన్నవయసు కావడంతో నాకంత తెలిసేది కాదు.

ఆమెకు బదులుగా అతడు..
కానీ ఆ సినిమా డైరెక్టర్‌ను కలిసిన ఫస్ట్‌ మీటింగ్‌లోనే నాకు ఇబ్బందిగా అనిపించింది. ఈ విషయం ఇంట్లో చెప్పాను. అప్పటికే అతడు మా నాన్నను కలిసి స్క్రీన్‌ టెస్ట్‌ కోసం ఇప్పటికే చాలా డబ్బు ఖర్చు చేశామంటూ ఒప్పించాడు. తనతో అవుట్‌డోర్‌ షూట్‌కు తొలిసారి వెళ్లినప్పుడు అతడేమీ నాతో మాట్లాడలేదు. నిజానికి ఆ సినిమాకు అతడి భార్య దర్శకురాలు అని అగ్రిమెంట్‌ పేపర్‌లో రాసుంది. కానీ రియాలిటీలో మాత్రం ఆమెకు బదులుగా అతడే సినిమాను డైరెక్ట్‌ చేస్తున్నాడు. 

అతడి భార్య లేని సమయంలో..
తను నన్ను కోపంగా చూస్తూనే కంట్రోల్‌లో పెట్టుకున్నాడు. ఒకరోజు ఆ దంపతులు వారి ఇంటికి తీసికెళ్లారు. (వారికి ఓ కూతురు ఉండేది కానీ తండ్రి అత్యాచారం చేశాడంటూ ఇంటి నుంచి పారిపోయింది) సడన్‌గా నన్ను కూతురిలా భావిస్తూ నాతో చాలా మంచిగా ఉన్నారు. రుచికరమైన భోజనం పెడుతూ బాగా చూసుకున్నారు. ఓ రోజు ఆ డైరెక్టర్‌ అతడి భార్య లేని సమయంలో నా దగ్గరకు వచ్చి ముద్దు పెట్టాడు.

బలవంతంగా..
ఒక్కసారిగా షాకయ్యాను. నేనే ఏదైనా తప్పు చేశానా? అని భయపడిపోయాను. నా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు. అయినా రిహార్సల్స్‌ కోసం ప్రతిరోజు అక్కడికి వెళ్లేదాన్ని. అలా అతడు నెమ్మదిగా నన్ను అడ్వాంటేజ్‌గా తీసుకున్నాడు. ఓ రోజయితే బలవంతంగా నాపై అత్యాచారం చేశాడు. ఇలా చాలాసార్లు నన్నొక బానిసగా చూశాడు.

నాతో బిడ్డను కంటానని..
నన్ను కూతురిగా పిలుస్తూనే నాతో బిడ్డను కంటానని చెప్పేవాడు. నాతో ఆడుకున్నాడు అని చెప్తూ ఎమోషనలైంది. ఇదంతా నిస్సిగ్గుగా బయటకు చెప్పడానికి 30 ఏళ్లు పట్టిందని, కచ్చితంగా అతడి పేరు పోలీసులకు వెల్లడిస్తానంది. అలాగే తనను వేధించిన ఓ నటుడి పేరు హేమ కమిటీ రిపోర్టులో ఉందని పేర్కొంది. 

చదవండి: హత్యకు ముందు రేణుకాస్వామి పరిస్థితి.. ఫోటోలు వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement