నేనే పాపం చేశాను.. నాపై ఎందుకింత పగ?: నటి | Shaalin Zoya Talks About Neglect She Faces in Mollywood | Sakshi
Sakshi News home page

Shaalin Zoya: ఎవరికి ఏ పాపం చేశాను? నాపై ఎందుకింత కక్ష? ఆ భగవంతుడు..

Published Thu, Jan 18 2024 10:21 AM | Last Updated on Thu, Jan 18 2024 10:44 AM

Shaalin Zoya Talks About Neglect She Faces in Mollywood - Sakshi

ఒక్క ఛాన్స్‌.. ఒకే ఒక్క ఛాన్స్‌ కోసం పరితపించే నటీనటులు ఎందరో! కొందరు ఒక్క అవకాశంతోనే తమ సత్తా ఏంటో నిరూపించుకుంటారు. మరికొందరు ఆ అవకాశాన్ని సరిగా సద్వినియోగం చేసుకోలేకపోతారు. నెమ్మదిగా ఒక్కోమెట్టు ఎక్కుతూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటారు. నటి షాలిన్‌ జోయా ఈ కోవలోకే వస్తుంది. ఈ మలయాళీ ముద్దుగుమ్మ సీరియల్స్‌తో నటిగా కెరీర్‌ ఆరంభించింది. తర్వాత సినిమాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్కడ క్లిక్‌ అవడంతో వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతోంది.

తొక్కేయాలని చూస్తున్నారు
షాలిన్‌ సీరియల్స్‌కు గుడ్‌బై చెప్పేసి సినీనటిగా మారింది. ఆ మధ్యలో బుల్లితెర షోలకు హోస్ట్‌గానూ వ్యవహరించింది. మలయాళంలో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించిన ఈమె రాజమంత్రి మూవీతో తమిళ ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయమైంది. ఈ మధ్యే విడుదలైన కన్నగి అనే తమిళ చిత్రంలోనూ కీలక పాత్ర పోషించింది. అయితే తన ఎదుగుదలను తొక్కేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది షాలిన్‌. తాజాగా ఆమె మాట్లాడుతూ.. 'ఇప్పటివరకు మలయాళ ఇండస్ట్రీలో నాకు హీరోయిన్‌గా ఒక్క ఛాన్స్‌ రాలేదు. తమిళ్‌లో వచ్చింది, చేశాను. నేను మాలీవుడ్‌కు దూరంగా ఉంటున్నానని చాలామంది అనుకుంటున్నారు. అది నిజం కాదు, నన్నిక్కడ పెద్దగా పట్టించుకోలేదు. మంచి అవకాశాలు ఇవ్వడం లేదు. ఆ విషయం నాకు మాత్రమే తెలుసు. అవకాశాలొస్తేనే కదా నటిస్తాను.

ఎందుకని నాపై కక్ష
ఈ మధ్య ఓ వీడియో చూశాను. నేను కోలీవుడ్‌లో సినిమాలు చేస్తున్నానని నాకు ఇక్కడ సపోర్ట్‌ చేయొద్దంటున్నాడో పెద్దాయన. ఇదెంతవరకు కరెక్టో నాకు అర్థం కావడం లేదు. నేను ఎవరికీ ఏ పాపం తలపెట్టలేదు. ఎందుకని నా మీద ఇలా పగబడుతున్నారు. తమిళంలో లీడ్‌ రోల్‌ ఛాన్స్‌ రాగానే చాలా సంతోషించాను. అది నా చేతి నుంచి జారిపోకూడదని ఆ దేవుడిని ఎంతగానో ప్రార్థించాను. మలయాళంలో మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాను. వస్తే కచ్చితంగా చేస్తాను. నాకు డైరెక్షన్‌పై కూడా ఆసక్తి ఉంది. ఇప్పటివరకు ఎనిమిది షార్ట్‌ ఫిలింస్‌ రాసి, వాటికి దర్శకత్వం వహించాను' అని చెప్పుకొచ్చింది షాలిన్‌ జోయా.

whatsapp channel

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement