sowmya
-
ఇన్ఫోసిస్, విప్రోలాంటి సంస్థల్లో ఉద్యోగం కాదనుకుని కానిస్టేబుల్‌గా..!
ఇన్ఫోసిస్, విప్రోలాంటి పెద్ద సంస్థల నుంచి మంచి ప్యాకేజీతో ఉద్యోగం వెదుక్కుంటూ వస్తే... ఏ అమ్మాయికైనా సంతోషమే. అయితే సౌమ్య మాత్రం ఆ సంతోషాన్ని కాదనుకుంది. కారణం... పోలిస్ ఉద్యోగంపై ఆమెకు ఉన్న ఇష్టం. ప్రస్తుతం పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. సౌమ్య ఉద్యోగ ఎంపిక చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. అయితే ఆమె మాత్రం... ‘ఇది తొలి అడుగు. ఐపీఎస్ నా లక్ష్యం’ అంటుంది....జనగామ జిల్లా తిరుమలగిరికి చెందిన ఉప్పునూతల సౌమ్య ఒకవైపు చదువులో రాణిస్తూనే దుక్కి దున్నడం, పురుగు మందు పిచికారీ చేయడం, కలుపు తీయడంలాంటి వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండేది. కానిస్టేబుల్ శిక్షణ సమయంలో బెస్ట్ ఆల్‌రౌండర్, ఇండోర్ ట్రోఫీలను గెలుచుకున్న సౌమ్య 2024 బ్యాచ్ స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీసింగ్ అవుట్ పరేడ్‌లో 1,211 మంది మహిళా ట్రైనీలకు పరేడ్ కమాండర్‌గా వ్యవహరించింది.అమ్మ బడిలో...‘మా అమ్మకు చదువుకోవాలని ఉండేది. కానీ కుటుంబ సమస్యలతో సాధ్యపడలేదు. అందుకే మా చదువులపై ఎప్పటికీ రాజీపడలేదు. మాకు రోజూ లెక్కలు చెప్పేది. గూడూరులోని జిల్లా పరిషత్ హైస్కూల్లో నేషనల్ క్యాడెట్ కార్పస్‌ను ప్రవేశపెట్టినప్పుడు పోలీస్ యూనిఫాం పట్ల ఇష్టం ఏర్పడింది. నేను పదవ తరగతి చదివే సమయానికి నా స్నేహితుల్లో చాలామందికి పెళ్లి జరిగింది. అయితే పెళ్లి విషయంలో తల్లిదండ్రులు నన్ను ఎప్పుడూ బలవంతం చేయలేదు. నేను ఎంత చదివితే వారికి అంత సంతోషం. మా గ్రామం నుంచి ఎవరూ పాఠశాల స్థాయి దాటి ముందుకు సాగలేదు’ అంటుంది బీటెక్ చేసిన సౌమ్య. తెలంగాణలో కానిస్టేబుల్‌గా పనిచేయడానికి ముందు సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌గా ఎంపికైంది సౌమ్య. ఢిల్లీలో కొంత కాలం పాటు పనిచేసింది. ఎలాంటి కోచింగ్‌లపై ఆధారపడకుండా స్వతంత్రంగా పారామిలిటరీ కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించడం తన మీద తనకు ఉన్న నమ్మకాన్ని మరింత పెంచింది.ఢిల్లీ నుంచి తిరిగి ఇంటికి...‘తల్లిదండ్రులకు చాలా దూరంగా ఉంటున్నాను. వారు ఎలా ఉన్నారో ఏమిటో!’ అనే దిగులుతో తిరిగి సొంత ఊరికి వచ్చింది సౌమ్య.మళ్లీ..ఎంతోమందికి ఆశ్చర్యం!‘బంగారంలాంటి ఉద్యోగాన్ని వదిలి ఇలా వచ్చావేమిటి’ అని అడిగిన వాళ్లకు సౌమ్య ఏం జవాబు చెప్పిందో తెలియదుగానీ... అదే సమయంలో మరో అవకాశం ఆమెను వెదుక్కుంటూ వచ్చింది. తెలంగాణలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. ఇంట్లోనే ఉంటూ రాత్రింబవళ్లు కష్టపడి చదువుకుని కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికైంది. ‘ఐపీఎస్ కచ్చితంగా సాధిస్తాను. ఇది గొప్ప కోసం చెబుతున్న మాట కాదు. ఆత్మవిశ్వాసంతో చెబుతున్న మాట’ అంటుంది సౌమ్య స్వరంతో ఉప్పునూతల సౌమ్య.నా బిడ్డ సాధించింది... ఇంకా ఎంతో సాధిస్తుంది!పోలిస్ అకాడమీలో మహిళా ట్రైనీలకు పరేడ్ కమాండర్‌గా వ్యవహరించిన సౌమ్యను చూసి పొంగిపోయాను. నాలాగా నా పిల్లలు చదువుకు దూరం కావద్దు అనుకున్నాను. చదువులోనే కాదు వ్యవసాయ పనుల్లోనూ కూడా సౌమ్య కష్టపడి పనిచేస్తుంది. నా బిడ్డ సాధించింది. ఇంకా ఎంతో సాధిస్తుంది.– అరుణ, సౌమ్య తల్లి – కొత్తపల్లి కిరణ్ కుమార్, సాక్షి, జనగామఫొటోలు: గోవర్ధనం వేణుగోపాల్ -
హైదరాబాద్ ఒక ఈవెంట్లో మెరిసిన, బిగ్ బాస్ అశ్విని శ్రీ ,సౌమ్య జాను (ఫొటోలు)
-
నార్సింగి : సెలూన్ ప్రారంభోత్సవంలో బిగ్ బాస్ సెలబ్రిటీలు సందడి (ఫొటోలు)
-
తమిళ డైరెక్టర్ నా జీవితంతో ఆడుకున్నాడు: మలయాళ నటి
ఓ తమిళ డైరెక్టర్ తనను కీలుబొమ్మలా వాడుకున్నాడంటోంది మలయాళ నటి సౌమ్య. 18 ఏళ్ల వయసులో అతడు చేసిన పాడుపని, వేధింపుల వల్ల నరకయాతన అనుభవించానంటోంది. ఇప్పటికైనా తన పేరును పోలీసుల ముందు బయటపెడతానని చెప్తోంది.18 ఏళ్ల వయసులో..తాజాగా ఓ ఇంటర్వ్యూలో సౌమ్య మాట్లాడుతూ.. 18 ఏళ్ల వయసులో కాలేజీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు ఒక తమిళ సినిమాలో అవకాశం వచ్చింది. అప్పుడు నా పేరెంట్స్‌కు సినిమాల గురించి పెద్దగా ఏమీ తెలియదు. అయితే నటి రేవతి మా ఇంటికి దగ్గర్లోనే ఉండేది. తనను చూసి నేను కూడా ఊహల ప్రపంచంలో తేలిపోయాను. ఆ ఆఫర్‌కు ఓకే చెప్తూ స్క్రీన్ టెస్ట్‌కు వెళ్లాను. అప్పుడు నాది చిన్నవయసు కావడంతో నాకంత తెలిసేది కాదు.ఆమెకు బదులుగా అతడు..కానీ ఆ సినిమా డైరెక్టర్‌ను కలిసిన ఫస్ట్ మీటింగ్‌లోనే నాకు ఇబ్బందిగా అనిపించింది. ఈ విషయం ఇంట్లో చెప్పాను. అప్పటికే అతడు మా నాన్నను కలిసి స్క్రీన్ టెస్ట్ కోసం ఇప్పటికే చాలా డబ్బు ఖర్చు చేశామంటూ ఒప్పించాడు. తనతో అవుట్డోర్ షూట్‌కు తొలిసారి వెళ్లినప్పుడు అతడేమీ నాతో మాట్లాడలేదు. నిజానికి ఆ సినిమాకు అతడి భార్య దర్శకురాలు అని అగ్రిమెంట్ పేపర్లో రాసుంది. కానీ రియాలిటీలో మాత్రం ఆమెకు బదులుగా అతడే సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. అతడి భార్య లేని సమయంలో..తను నన్ను కోపంగా చూస్తూనే కంట్రోల్లో పెట్టుకున్నాడు. ఒకరోజు ఆ దంపతులు వారి ఇంటికి తీసికెళ్లారు. (వారికి ఓ కూతురు ఉండేది కానీ తండ్రి అత్యాచారం చేశాడంటూ ఇంటి నుంచి పారిపోయింది) సడన్‌గా నన్ను కూతురిలా భావిస్తూ నాతో చాలా మంచిగా ఉన్నారు. రుచికరమైన భోజనం పెడుతూ బాగా చూసుకున్నారు. ఓ రోజు ఆ డైరెక్టర్ అతడి భార్య లేని సమయంలో నా దగ్గరకు వచ్చి ముద్దు పెట్టాడు.బలవంతంగా..ఒక్కసారిగా షాకయ్యాను. నేనే ఏదైనా తప్పు చేశానా? అని భయపడిపోయాను. నా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు. అయినా రిహార్సల్స్ కోసం ప్రతిరోజు అక్కడికి వెళ్లేదాన్ని. అలా అతడు నెమ్మదిగా నన్ను అడ్వాంటేజ్‌గా తీసుకున్నాడు. ఓ రోజయితే బలవంతంగా నాపై అత్యాచారం చేశాడు. ఇలా చాలాసార్లు నన్నొక బానిసగా చూశాడు.నాతో బిడ్డను కంటానని..నన్ను కూతురిగా పిలుస్తూనే నాతో బిడ్డను కంటానని చెప్పేవాడు. నాతో ఆడుకున్నాడు అని చెప్తూ ఎమోషనలైంది. ఇదంతా నిస్సిగ్గుగా బయటకు చెప్పడానికి 30 ఏళ్లు పట్టిందని, కచ్చితంగా అతడి పేరు పోలీసులకు వెల్లడిస్తానంది. అలాగే తనను వేధించిన ఓ నటుడి పేరు హేమ కమిటీ రిపోర్టులో ఉందని పేర్కొంది. చదవండి: హత్యకు ముందు రేణుకాస్వామి పరిస్థితి.. ఫోటోలు వైరల్ -
Sowmya Janu Photos: రంజాన్ విందు ఇచ్చిన నటి సౌమ్యజాను (ఫొటోలు)
-
బిగ్ బాస్ ఫేమ్ గీతూ పై జూనియర్ ఆర్టిస్ట్ సౌమ్య శెట్టి ఫైర్
-
ఈ హీరోయిన్ను గుర్తుపట్టారా? మహేశ్ సూపర్ హిట్ మూవీలో (ఫొటోలు)
-
నటి సామ్యా జానుపై కేసు నమోదు
-
Sowmya Janu Photos: హోంగార్డ్‌పై దాడి..ట్రెండింగ్ లో నటి సౌమ్య జాను (ఫొటోలు)
-
సర్కార్ వారి పాట చిన్నది.. క్రేజీ అప్డేట్తో వచ్చేసింది!
అటు గ్లామర్, ఇటు యాక్టింగ్‌తో సినిమాల్లోకి దూసుకువచ్చిన హీరోయిన్ సౌమ్య మీనన్. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయాలనే కోరికతో ‘సర్కారి వారిపాట’ మూవీలో చిన్న క్యారెక్టర్ చేసింది భామ. ఇవాళ సౌమ్య బర్త్ డే కావడంతో అభిమానులకు క్రేజీ అప్డేట్ ఇచ్చింది కేరళ కుట్టి. శ్రీ వాయుపుత్ర ఎంటర్టైన్మెంట్ అండ్ శ్రీవత్స క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న లేడీ ఓరియంటెడ్ చిత్రం ‘సర’. ఈ చిత్రంలో సౌమ్య మీనన్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో కనిపించనున్నారు. వి.శశిభూషణ డైరెక్షన్లో ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు. (ఇది చదవండి: తమన్నా చేయి పట్టుకున్న అభిమాని.. హీరోయిన్ ఏం చేసిందంటే?) కాగా.. మలయాళంలో కినవల్లి, ఫ్యాన్సీ డ్రెస్, చిల్డ్రన్స్ పార్క్.. లాంటి సూపర్ హిట్ సినిమాలలో హీరోయిన్గా చేసింది సౌమ్య. ప్రస్తుతం సౌమ్య చేతిలో ఓ కన్నడ , రెండు మలయాళ, తెలుగు సినిమాలు ఉన్నాయి. అయితే.. తెలుగులో కూడా ట్యాక్సీ అనే సినిమా చేసింది. కానీ దానికంటే ముందే సర్కారు వారి పాట రిలీజ్ అయ్యేసరికి అందరి దృష్టిలో పడింది. అంతే కాకుండా సౌమ్య మంచి డాన్సర్ కూడా.. కొన్ని మలయాళీ ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్స్‌లో ఆడిపాడింది. అందంతో కట్టిపడేస్తోన్న సౌమ్య మీనన్ లేడీ ఒరియంటెడ్ మూవీ చేయనుండడంతో టాలీవుడ్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. సర చిత్రంతో బర్త్ డే బ్యూటీ సక్సెస్ సాధిస్తుందని అభిమానులు విషెస్ చెబుతున్నారు. మూవీ ఫస్ట్ లుక్‌తో పాటు.. త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తామని మేకర్స్ తెలిపారు. (ఇది చదవండి: ఆస్కార్ అంటే ఏంటో తెలియదు: ది ఎలిఫెంట్ విస్పరర్స్ నటి) -
జబర్దస్త్‌లో రష్మీ అవుట్.. ఆమె స్థానంలో సౌమ్య రావు (ఫొటోలు)
-
ప్రసవం ముందు వరకు డ్యూటీ.. మేయర్‌పై ప్రశంసలు
జైపూర్ నగర్ నిగమ్ (గ్రేటర్) మేయర్‌గా పనిచేస్తున్న డాక్టర్ సౌమ్య గుర్జర్ గురువారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం ఈ మహిళా మేయర్‌పై ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు. అదేంటి బిడ్డకు జన్మనిస్తే పొగడ్తలు ఎందుకని ఆశ్చర్యపోతున్నారా.. అసలు విషయం ఏంటటే. తను ప్రసవించే కొన్ని గంటల ముందు వరకు కూడా సౌమ్య మేయర్‌గా తన బాధ్యతలు నిర్వర్తించారు. విధుల్లో పాల్గొని ప్రజా పాలనకు అసలైన అర్థం చెప్పారు. ఈ విషయాన్ని మేయర్ స్వయంగా వెల్లడిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. దీంతో ప్రస్తుతం సౌమ్య స్టోరీ నెట్టింట్లో వైరల్‌గా మారింది. నిండు గర్భిని అయిన మేయర్ బుధవారం రాత్రి వరకు అధికారులతో సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఆస్పత్రిలో చేరగా గురువారం ఉదయం అయిదు గంటల సమయంలో మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా మేయర్ స్పందిస్తూ.. పని దేవునితో సమానమని పేర్కొన్నారు. ‘పనే నాకు దైవం. బుధవారం రాత్రి వరకు మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్‌లో పాల్గొన్నాను. ప్రసవ నొప్పులతో 12.30 గంటలకు హాస్పిటల్లో చేరాను. దేవుడి ఆశీస్సులతో గురువారం ఉదయం క్షేమంగా ప్రసవమైంది’ అని ట్వీట్లో వివరించారు.. తొలుత రాజస్తాన్ పదవిలో ఉన్నపపుడు సౌమ్య ఒక బిడ్డకు జన్మనిచ్చారు. అనంతరం జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీచేసి గెలుపొంది ఏకంగా మేయర్ పదవిని దక్కించుకున్నారు. రెండోసారి గర్భం దాల్చారు. అయినా క్రమం తప్పకుండా మేయర్ కార్యాలయానికి వచ్చి విధులు నిర్వర్తించారు. గత నెలలోనే మేయర్ హోదాలో మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్‌ను కూడా సమర్పించారు. ఫిబ్రవరి 7న రాజస్థాన్‌లో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పర్యటనలోనూ ఆమె పాల్గొన్నారు. అయితే గర్భంతో ఉన్న సమయంలో కూడాపనిచేయడం ఉత్తేజంగా, ఒక సవాలుగా ఉందన్నారు. క్రమశిక్షణతో బాధ్యతలు నిర్వర్తిస్తూ అందరి ప్రశంసలు దక్కించుకున్నారు. మహిళా స్ఫూర్తికి నిదర్శనంగా నిలిచిన సౌమ్యకు దేశ ప్రజల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి: 'నేను ఏలియన్ని' మస్క్ షాకింగ్ కామెంట్ వైరల్ : 'హెలికాప్టర్ కొనేందుకు లోన్ ఇప్పించండి' Work is Worship! देर रात तक निगम ऑफिस में मीटिंग ली, प्रसव पीड़ा शुरू होने पर रात्रि 12:30 बजे कुकुन हॉस्पिटल में भर्ती हुई और सुबह 5.14 पर परमपिता परमेश्वर की कृपा से पुत्र को जन्म दिया। मैं और बच्चा दोनों स्वस्थ हैं। pic.twitter.com/nMULHwNGWn — Dr Somya Gurjar (@drsomyagurjar) February 11, 2021 -
సున్నా నుండి శిఖరం వరకు
జీవితంలో కోరుకున్న స్థాయికి ఎదగాలనే కలలు ఒక్కోసారి నిజం కాకపోవచ్చు. భవిష్యత్తు అంతా శూన్యంలా అనిపించవచ్చు. అంతమాత్రాన జీవితమే లేదని నిరాశకు గురికావల్సిన పనిలేదు అని నిరూపిస్తోంది సౌమ్య. ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌కు చెందిన సౌమ్య పైలట్ కావాలని కలలు కంది. శిక్షణ కూడా పూర్తి చేసుకుంది. కానీ, పైలట్ జాబ్ పొందలేక జిమ్‌లో రిసెప్షనిస్ట్‌గా చేరింది. కాల్సెంటర్లో పనిచేసింది. ఇప్పుడు 35 మందికి ఉద్యోగావకాశాలు ఇచ్చి సొంత కంపెనీని నడుపుతోంది. కృషి, పట్టుదల ఉంటే ఎంచుకున్న మరో రంగంలోనూ ఉన్నతిని సాధించవచ్చని నిరూపిస్తోంది. పదిహేనేళ్ల క్రితం పైలట్ కావాలని సౌమ్య ఎన్నో కలలు కన్నది. అందుకు ఆమె తల్లిదండ్రులూ వెన్నుదన్నుగా నిలిచారు. 65 లక్షల రూపాయలు ఖర్చు చేసి అమెరికాలో పైలట్ శిక్షణ పూర్తి చేసింది. అప్పటికి సౌమ్య వయసు 19 ఏళ్లు. శిక్షణ ముగిసేనాటికి అమెరికాలో ఆర్థికమాంద్యం అక్కడి ఉద్యోగవకాశాలను కల్పించలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా పైలట్‌గా ఉద్యోగం దొరకలేదు. ‘2006లో అలా నా కెరియర్ ప్రారంభమయ్యేలోపు ముగిసిపోయింది. శిక్షణ తర్వాత జాబ్ రావడం ఖాయం అనుకున్నాను. ఏడాది పాటు చేయని ప్రయత్నం లేదు. కానీ, ఆర్ధికమాంద్యంంతో పెద్ద పెద్ద కంపెనీలన్నీ దివాలాతీశాయి. నాకు జాబ్ రాలేదు. మున్ముందు ఏం చేయాలో అర్ధం కాలేదు. అంతా శూన్యంగా అనిపించింది. విసిగిపోయి ఇండియా వచ్చేశాను. 2008లో జిమ్‌లో రిసెప్షనిస్ట్‌గా చేరాను. అప్పుడు నా జీతం రూ.5000లు మాత్రమే. ఆ జాబ్ చేస్తూనే కాల్ సెంటర్లో చేరాను. రాత్రి పూట కాల్‌సెంటర్ ఉద్యోగం, పగటి పూట జిమ్‌లో రిసెప్షన్. ఈ సమయంలోనే రాబర్టో కావల్లి, గొట్టి వంటి బ్రాండ్ల నుండి దుస్తులను దిగుమతి చేసుకుంటూ వ్యాపారం చేస్తున్న ఒకావిడ పరిచయం అయ్యింది. ఆమె నుండి 20 డ్రెస్సులను అప్పు మీద తీసుకున్నాను. నా ఫ్రెండ్స్‌కు సెల్‌ఫోన్ ద్వారా ఆ డ్రెస్సుల గురించి, వాటి ధరల గురించి చెప్పాను. ఒక గంటలో ఆ 20 డ్రెస్సులను అమ్మేశాను. దాంతో నూటికి నూరు శాతం లాభం వచ్చింది. అంతే.. కాల్ సెంటర్ ఉద్యోగం మానేసి దుస్తుల వ్యాపారంలోకి దిగాను. అక్కడ నుంచి డిజైనర్ల దగ్గర నుంచి తీసుకున్న విభిన్న మోడల్ దుస్తులను ఆన్లైన్లో మార్కెటింగ్‌కి పెట్టాను. ఈ బిజినెస్‌లో రాత్రింబవళ్లు మునిగితేలాను. స్నాప్‌డీల్, ఫ్లిప్‌కార్ట్ ఇతర పెద్ద, చిన్న ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లలో బట్టలు అమ్మడం విస్తృతం చేశాను. రీటెయిల్ బిజినెస్ ద్వారా స్వదేశీ, విదేశీ కంపెనీలను కాంటాక్ట్ చేస్తుంటాను. ఇప్పుడు ప్రతిరోజూ వివిధ బ్రాండ్స్‌కి చెందిన 10 వేల డ్రెస్సులను అమ్ముతున్నాను. అమెరికా, కెనడా, ఐరోపాలో కూడా బ్రాంచ్‌ల ఏర్పాటు చేశాను. ప్రస్తుతం 35 మంది ఉద్యోగులు నా ఆధ్వర్యంలో పనిచేస్తున్నాను. ప్రస్తుతం కరోనా కారణంగా వ్యాపారం తగ్గినట్టుగా అనిపిస్తున్నా.. త్వరలోనే ఇది పుంజుకుంటుంది. ప్రముఖ బ్రాండెడ్, డిజైనర్ మాస్కుల వినియోగం బాగా పెరిగింది’ అంటూ తెలియజేసింది సౌమ్య. జీవితంలో ముందుకు సాగడానికి ఒక దారి మూసుకుపోతే వేల దారులు మనకోసం తప్పక తెరిచి ఉంటాయి. అవకాశాల దారుల్లో మన కలలను నెరవేర్చుకుంటూ ముందుకు సాగడమే మార్గం అంటున్న సౌమ్య లాంటి వారు నేటితరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. –ఆరెన్నార్ -
ఉరుముతున్న మెరుపు
చారిత్రక పునాదుల మీద జీవించే వర్తమానం రేపటికి చరిత్ర అవుతుంది. చరిత్ర మిగిల్చిన ఆనవాళ్లను, అనుభవాలను ఆధారం చేసుకుని ముందుకు నడిచే వాళ్లు లెక్కకు మించినంత మంది ఉంటారు. చరిత్రను సృష్టించే వాళ్లు కొందరే ఉంటారు. చరిత్ర సృష్టించిన కొందరిలో ఒకమ్మాయి గుగులోత్ సౌమ్య. మహిళల ఫుట్‌బాల్ విభాగంలో ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ఆడిన తొలి తెలంగాణ అమ్మాయి సౌమ్య. తండాలోని ఈ మెరుపు అంతర్జాతీయంగా ఉరుముతోంది. సౌమ్య సొంతూరు నిజామాబాద్ జిల్లాలోని కిషన్‌తండా. సౌమ్య తల్లిదండ్రుల కల ఆమెను క్రీడాకారిణిని చేసింది. అయితే వాళ్లు కలగన్నది ఆమె క్రీడాకారిణి కావాలని కాదు. ఆమె క్రీడాకారిణి అవుతుందని వాళ్లు కలలో కూడా అనుకోలేదు. వాళ్లుండే తండాలో ఆడపిల్లల చదువు.. కంటికి కనిపిస్తూ కురవకుండా తేలిపోయే మేఘమే. సౌమ్య తండ్రి గోపి సెకండరీ గ్రేడ్ టీచర్. ఆమె తల్లి ధనలక్ష్మి చదువుకోలేదు. వాళ్లకు సౌమ్యకంటే ముందు ఇద్దరమ్మాయిలున్నారు. సౌమ్య తర్వాత ఒక అబ్బాయి. మొత్తం నలుగురు పిల్లలు. ఆ అమ్మానాన్నల కల... పిల్లలందర్నీ చదివించి తీరాలని. అందుకోసం వాళ్లు పడిన శ్రమ చిన్నదేమీ కాదు. సౌమ్య తండ్రి తనకు పోస్టింగ్ ఉన్న చోట ఉద్యోగానికి వెళ్లాలి. సొంతూర్లో ఉన్న పొలం పనులు చూసుకోవాలి. వాటి చుట్టూ జీవితాన్ని అల్లుకుంటే పిల్లలను చదివించడం కుదరని పని. అందుకే ధైర్యం చేసి ఓ నిర్ణయానికి వచ్చారా దంపతులు. ధనలక్ష్మి నిజామాబాద్‌లో ఓ చిన్న ఇంటిని అద్దెకు తీసుకుని నలుగురు పిల్లలను స్కూలుకు పంపించింది. గోపి తన ఉద్యోగం, సొంతూర్లో పనులు చూసుకుంటూ వారానికోసారి నిజామాబాద్‌కు వచ్చి భార్యాపిల్లలను చూసుకునేవాడు. అమ్మానాన్నల కష్టం పిల్లలకు తెలుస్తూనే ఉంది. సంపన్నులు కాకపోయినప్పటికీ తమ కోసం వాళ్లు అమరుస్తున్న సౌకర్యాలను అర్థం చేసుకున్నారు పిల్లలు. చక్కగా చదువుకుంటున్నారు. అప్పుడు జరిగిందో మిరకిల్. కాలం నిర్ణయించింది సౌమ్య సిక్స్›్త క్లాస్ వరకు నిజామాబాద్ జిల్లా నవీపేటలోని జిల్లా పరిషత్ స్కూల్లో చదివింది. సెవెన్త్ క్లాస్‌కి నిజామాబాద్‌లోని రాఘవ స్కూల్లో చేరింది. జూన్‌లో చేరింది. జూలైలో ఇంటర్ స్కూల్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ టోర్నమెంట్‌కు సెలక్షన్ జరగాలి. వరుసగా వర్షాలు. స్టూడెంట్స్ సెలక్షన్స్‌కి కూడా తెరిపినివ్వడం లేదు. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ నాగరాజుకు టెన్షన్ పెరిగిపోతోంది. పాత స్టూడెంట్స్ కొందరుంటారు, మరికొందరు కొత్త వారిని సెలెక్ట్ చేస్తే బావుంటుంది, వాతావరణం సహకరించడం లేదు. తోటి టీచర్లతో పిచ్చాపాటి కబుర్లలో మనసులో మాట బయటకొచ్చింది. అప్పుడు ఓ టీచర్ ‘కొత్తగా చేరిన ఓ అమ్మాయి పీఈటీ క్లాసుల్లేనప్పుడు కూడా గ్రౌండ్లో పరుగెడుతుంటుంది. పరుగులో ఒడుపు కూడా ఉంద’ని చెప్పారు. అలా సౌమ్య కోచ్ నాగరాజు దృష్టిలోకి వచ్చింది. వాళ్లు ఊహించినట్లే ఆమె ఆ ఏడాది జరిగిన వంద మీటర్లు, రెండు వందలు, నాలుగు వందల మీటర్ల పరుగు పందెంలో బంగారు పతకాలందుకుంది. కోచింగ్ ఇస్తే మంచి క్రీడాకారిణి అవుతుందనిపించింది నాగరాజుకి. స్కూల్లో అన్ని రకాల ఆటలనూ ప్రాక్టీస్ చేయిస్తున్నప్పుడు సౌమ్య ఫుట్‌బాల్ కిక్ చాలా మెళుకువగా ఇస్తోందని గమనించారాయన. సౌమ్య ఫుట్‌బాల్ క్రీడాకారిణి కావడానికి అది తొలి ఘట్టం. అయితే... అసలైన ట్విస్ట్‌లు కూడా అక్కడే మొదలయ్యాయి. అమ్మ ‘ససేమిరా’ ‘మీ అమ్మాయి బాగా ఆడుతోంది. రొటీన్‌గా స్కూల్లో అందరితో కలిపి ఓ గంటసేపు ఆడించడం కాదు, ఆమెకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తాను’ అని సౌమ్య తల్లి ధనలక్ష్మితో చెప్పారు నాగరాజు. ఆయన మాట పూర్తయ్యేలోపే ఆమె వీల్లేదంటే వీల్లేదని ఖండితంగా చెప్పేసింది. ఆమె ఆందోళన కూడా సమంజసమే. పిల్లల్ని చదివించుకోవడానికి సొంత ఊరు కాదని, భర్త ఉద్యోగం చేసే ఊరు కూడా కాదని నిజామాబాద్‌కి వచ్చింది. నలుగురిలో ముగ్గురు ఆడపిల్లలు. ఇప్పటి దాకా సాకింది ఒక ఎత్తయితే, ఇక ముందు సంరక్షణ ఒక ఎత్తు. వయసొచ్చిన పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. తమ దారిన తాము నడిచి పోతున్న ఆడపిల్లలకు.. తమ దారిలో ఎన్ని ప్రమాదాలు పొంచి ఉంటాయో తెలియదు. తల్లిగా తనకు తెలుసు. అందుకే ఆమె అంత కచ్చితంగా వ్యతిరేకించింది. పైగా ఏ పొరపాటు జరిగినా... తండాలో ఉన్న అందరిలా గోప్యంగా బతుకు వెళ్లదీయకుండా చదువులంటూ పట్టణం బాట పట్టారని నలుగురూ నాలుగు మాటలు అంటారేమోననే భయం. సౌమ్య ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేయడానికి సౌమ్య తల్లి ఏ మాత్రం సుముఖంగా లేదని నిర్ధారణ అయిన తర్వాత సౌమ్య తండ్రి నిజామాబాద్‌కి వచ్చే వరకు ఎదురు చూశారు కోచ్. ధనలక్ష్మి చెప్పినంత ఖండితంగా చెప్పలేదు కానీ గోపి కూడా దాదాపుగా అదే మాట చెప్పారు. ఆ మాటతో నాగరాజుకి ఆశ వదులుకోక తప్పలేదు. అయితే... తన ఆశ స్టేడియంలోకి వస్తుందని అతడు ఊహించలేదు. బ్యాగ్ వదిలేసి పరుగెత్తింది సౌమ్య కళ్ల ముందే అంతా జరుగుతోంది. కోచ్ ఇంటికి వచ్చి తల్లిని, తండ్రిని అడగడం చూసింది. తల్లి ఒప్పుకోకపోయినా తండ్రి ఒప్పుకుంటాడేమోనని ఆశపడింది. అమ్మానాన్నలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడమూ విన్నది. ఫుట్‌బాల్ కోచింగ్‌కి అన్ని దారులూ మూసుకుపోతున్నట్లు అర్థమైంది. ఓ రోజు ఉదయం స్కూలుకి రెడీ అవుతోంది. ఆమె ఇంటి ముందు నుంచే పొరుగున ఉంటున్న ముగ్గురు అక్కచెల్లెళ్లు స్నేహ, నమ్రత, మేఘన వెళ్తున్నారు. వాళ్లు వెళ్తున్నది స్పోర్ట్స్ స్టేడియంకేనని, ఫుట్‌బాల్ ప్రాక్టీస్కేనని సౌమ్యకు తెలుసు. వాళ్లను రోజూ చూస్తూనే ఉంటుంది. ఆ రోజు ఎప్పటిలా చూస్తూ ఊరుకోవడం సాధ్యం కాలేదామెకి. స్కూలు బ్యాగ్ ఇంట్లోనే వదిలేసి, వాళ్లమ్మ అరుస్తున్నా పట్టించుకోకుండా స్టేడియానికి పరుగెత్తింది. కోచ్ ముందు నిలబడి ‘నేను ప్రాక్టీస్ చేస్తా’నని చెప్పింది. ఇంతటి సినీఫక్కీలో మొదలైంది సౌమ్య ఫుట్‌బాల్ ప్రస్థానం.అండర్ ఫోర్టీన్తో మొదలైన సౌమ్య ఫుట్‌బాల్ కెరీర్ అండర్ సిక్స్టీన్లను దాటి అండర్ నైన్టీన్కి చేరింది. కోల్‌కతా టోర్నమెంట్లో మంచి స్కోర్ చేసింది. ముంబయిలో జరిగిన ఉమెన్ ఇండియన్ లీగ్ టోర్నమెంట్‌తోపాటు దేశంలో అనేక టోర్నమెంట్లు ఆడింది. సౌతాఫ్రికాలోని జోహన్నాస్బెర్గ్లో జరిగిన బ్రిక్స్ అండర్ సెవెంటీన్లో ఆడింది. బ్రెజిల్, రష్యా, చైనాలతో పోటీ పడింది. అండర్ ఎయిటీన్ సాఫ్ (సౌత్ ఏషియన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్) కప్ టోర్నమెంట్లో ఆడింది. ఆ పోటీలో మనదేశానికి కాంస్య పతకం వచ్చిది. భారత మహిళల ఫుట్‌బాల్ టీమ్ గెలుచుకున్న తొలి ఇంటర్నేషనల్ మెడల్ అది.ఈ మే నెల ఐదు నుంచి 22 వరకు పంజాబ్‌లో నేషనల్ లెవెల్ టోర్నమెంట్లు జరగనున్నాయి. మెరుపువేగంతో కదిలి తల అడ్డం వేసి బంతిని ఆపి ప్రత్యర్థి జట్టుని నిలువరించడానికి సౌమ్య సిద్ధంగానే ఉంది. పాదరసంలా కదులుతూ బంతిని గోల్ చేయడానికి ఆమె పాదాలు చురుగ్గా ఉన్నాయి. ఎటొచ్చీ ధర్మసంకటం పరీక్షల రూపంలో ఎదురైంది. ఆమెకు డిగ్రీ ఫస్టియర్ పరీక్షలు కూడా అప్పుడే ఉన్నాయి. ‘‘స్కూల్లో అయితే టోర్నమెంట్‌కు అనుమతించి పరీక్షలు మళ్లీ పెట్టేవాళ్లు. ఇప్పుడేం చేయాలో తెలియడం లేదు’’ అన్నది సౌమ్య. ప్రకృతి పరీక్షనూ నెగ్గింది సౌమ్య ఇష్టంతో, తల్లిదండ్రుల అయిష్టంతో మొదలైన ఫుట్‌బాల్ ప్రాక్టీస్‌కు అన్నీ అనుకూలంగా ఏమీ కలిసి రాలేదు. ప్రకృతి కూడా తనవంతు పరీక్ష పెట్టింది. అది 2015. నేపాల్‌లో అండర్ ఫోర్టీన్ టోర్నమెంట్‌కి వెళ్లింది సౌమ్య. ఖాట్మండులోని దశరథ స్టేడియంలో ఆడాలి. ఆటకు అంతా సిద్ధమవుతున్నారు. ఒక్కసారిగా పెళపెళమంటూ పెద్ద శబ్దం. ‘ఏమై ఉంటుందీ’ అని అందరూ దిక్కులు చూశారు. కాళ్ల కింద భూమి కదులుతోంది. స్టేడియం ఉయ్యాలలా ఊగుతోంది. అది భూకంపం అని తెలిసింది. ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ ‘భూకంపం ఎలా ఉంటుందో నేపాల్కెళ్లి చూసొచ్చాను’ అని నవ్వుతూ అంది సౌమ్య. ‘‘భూకంపం కారణంగా ఆ టోర్నమెంట్ ఆగిపోయింది. మా టీమ్‌లో ఎవరికీ ఏమీ కాలేదు. నిజామాబాద్‌కి వచ్చిన తర్వాత తెలిసిన వాళ్లంతా వచ్చి, మేము క్షేమంగా తిరిగి వచ్చినందుకు సంతోషించారు’’ అన్నది. భూకంపం కారణంగా సౌమ్య అప్పుడు ఆడలేకపోయింది. ఇప్పుడు మళ్లీ కాలం పరీక్ష పెట్టిందామెకు. పుస్తకాలా, ఫుట్‌బాలా తేల్చుకోమంటోంది. ఆమె తండ్రి గోపికి కూతురు పరీక్షలు రాస్తే బావుణ్ననే ఉంది. సౌమ్య పెద్దక్క స్వప్న బీటెక్ చేసి సివిల్స్‌కి ప్రిపేరవుతోంది. రెండో అక్క స్వర్ణ బీఎస్సీ నర్సింగ్ చేసి పారామెడికల్ కోచింగ్ తీసుకుంటోంది. సౌమ్యను ఐపీఎస్‌గా చూడాలని ఆ తండ్రి కల. సౌమ్యకు మాత్రం ఉమెన్ ఫుట్‌బాల్ టీమ్‌లో సీనియర్ లెవెల్లో దేశం తరఫున ఆడాలని ఉంది. క్రిస్టియానో రోనాల్డ్ ఆమెకు ఇష్టమైన ఫుట్‌బాల్ క్రీడాకారుడు. ఆమె కెరీర్ కల క్రీడల చుట్టూ తిరుగుతోంది. మహిళల క్రికెట్ అనగానే మిథాలీరాజ్ గుర్తుకు వచ్చినట్లే భవిష్యత్తు తరానికి మహిళల ఫుట్‌బాల్ అంటే గుగులోత్ సౌమ్య గుర్తుకు రావాలని ఆశిద్దాం. వాకా మంజులారెడ్డి ఫొటోలు: రాజ్‌కుమార్, సాక్షి, నిజామాబాద్ వాళ్లమ్మగారి కోపం తగ్గింది సౌమ్య పేరెంట్స్ ఫుట్‌బాల్ ప్రాక్టీస్‌కి ఎంతకీ ఒప్పుకోకపోవడంతో ఆ అమ్మాయి ఫీజు మాఫీ చేయమని స్కూల్ ప్రిన్సిపల్‌ని రిక్వెస్ట్ చేశాను. ఆయన ఒప్పుకున్నారు కూడా. అప్పటికే ఎయిత్ క్లాస్ ఫీజు కట్టేశారు వాళ్ల నాన్న. నైన్త్, టెన్త్ క్లాసులకు ఫీజు రద్దు చేశారు ప్రిన్సిపల్. అలా ఏదో ఒక ప్రోత్సాహకం ఉంటేనయినా ఆ అమ్మాయిని ప్రాక్టీస్‌కి పంపిస్తారని నా ప్రయత్నం. నేషనల్స్‌కి సెలెక్ట్ అయిన తర్వాత కానీ వాళ్లమ్మగారు ప్రసన్నం కాలేదు. అప్పటి వరకు కోపంగానే ఉన్నారామె. సౌమ్య టోర్నమెంట్స్‌కి వెళ్తూనే టెన్త్ క్లాస్‌లో 7.3 జీపీఏ, ఇంటర్లో 902 మార్కులు తెచ్చుకుంది. ఇప్పుడు బీఎస్సీ ఫస్టియర్. కేర్ అకాడమీ కూడా ఆమెకు ప్రోత్సహిస్తోంది. ఫీజు మాఫీ చేయడమే కాకుండా స్పోర్ట్స్ ఎక్స్పెండిచర్ కోసం ఏటా పాతికవేలిస్తోంది. వచ్చే నెలలో పంజాబ్‌లో టోర్నమెంట్ ఉంది. ఇప్పటికే ఒరిస్సా రైజింగ్ స్టార్, కోలాపూర్ ఎఫ్‌సి క్లబ్‌లు ఆమెకు ఆఫర్ ఇచ్చాయి. నాగరాజు, కోచ్, కేర్ ఫుట్‌బాల్ అకాడమీ, నిజామాబాద్ -
చాక్లెట్ బ్యూటీస్
-
వివాహితది హత్యా.. ఆత్మహత్యా..?
అనంతపురం సెంట్రల్: నగరంలోని ఆరోరోడ్డులో బుధవారం జరిగిన సౌమ్య (25) అనే వివాహిత మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ఆత్మహత్య చేసుకుందని అత్తింటివారు చెబుతుండగా.. మెట్టినింటి వారే చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని పుట్టింటి వారు ఆరోపిస్తున్నారు. పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడిందని అత్తింటి వారు చెబుతున్నారు. పంటకు వాడే పురుగుమందు ఇంట్లోకి ఎలా వచ్చింది..? దానిని ఎవరు తీసుకొచ్చారు..? అనేది తెలియడం లేదు. అదనపు కట్నం తీసుకురాలేదన్న అక్కసుతో అత్తమామలే అంతమొందించి ఉంటారని సౌమ్య బంధువులు ఆరోపిస్తున్నారు. సౌమ్య మృతి చెందిన రోజు నుంచి ఈరోజు వరకు అత్తింటి వారిని అదుపులోకి తీసుకోలేదని, విచారణా చేపట్టలేదన్నారు. మహిళలపై నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకోవాల్సిన పోలీసులే ఉదాసీనంగా వ్యవహరించడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఊరు మారింది
గుజరాత్ రాష్ట్రంలోని బార్డోలి తాలూకాలో ఓ కుగ్రామం.. హాల్పట్టి. ఆదివాసీలు నివసించే గ్రామం అది. గవర్నమెంట్ స్కూల్లో టీచర్ పాఠం చెబుతోంది. ఓ నలుగురు పెద్ద మనుషులు వచ్చారు. వాళ్లలో ఒకతడి కంఠం ఖంగుమంది ‘వీళ్లకు పాఠాలు చెప్పడం ఆపెయ్. వీళ్లంతా చదువరులైతే రేపు మా పొలాల్లో పనులు చేసేదెవరు’ అని హుంకరించాడతడు. హాల్పట్టి పొలాలన్నీ జమీందారుల చేతుల్లోనే ఉన్నాయి. చిన్న రైతులు, ఆదివాసీల పొలాలు కూడా వాళ్ల చేతుల్లోకే వెళ్లిపోయాయి. పంటలు సరిగ్గా పండక, పంట పెట్టుబడి కోసం తెచ్చిన అప్పు పెరిగిపోవడంతో పొలాలు అప్పులోకే జమయ్యాయి. ఆ రైతులు తమ పొలాల్లోనే కూలీలయ్యారు. అప్పుడొచ్చింది సౌమ్య! హాల్పట్టి గ్రామంలోని ఆదివాసీ మహిళలకు కొడవలి చేతపట్టి పొలం పనులు చేయడమే కాదు, అదే చేతుల్తో రోజూ ఇంట్లో చేసే పనులతోనే కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చనే కొత్త ఆలోచనకు బీజం వేసింది సౌమ్య. ఆమెది ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్. ఢిల్లీలో హిందూ కాలేజ్ నుంచి కామర్స్‌లో డిగ్రీ చేసింది. అనేక స్టార్టప్ కంపెనీలకు మార్కెటింగ్ చేసింది. మార్కెటింగ్ రంగంలో మంచి సంపాదన ఉంది. మార్కెటింగ్ కంటే దానికి మూలమైన ఉత్పత్తి రంగం మీద ఆసక్తి పెరిగిందామెకు. అలా మొదలైందామె ప్రయాణం. గుజరాత్‌లోని బార్డోలి తాలూకా, హాల్పట్టి ఆదివాసీ తండా ఆమె కార్యక్షేత్రమైంది. స్థానిక మహిళలను చైతన్యవంతం చేసింది. అగాఖాన్ రూరల్ సపోర్టు ప్రోగ్రామ్ ద్వారా ఇరవై వేల రూపాయలతో వారికి గ్రైండర్, తిరుగలి తీసిచ్చింది. ఇద్దరే ముందుకొచ్చారు ఆ మహిళలు చేయాల్సింది కొత్తగా ఏమీ లేదు, రోజూ ఇంటి కోసం చేసుకునే మసాలాలనే ఎక్కువ మొత్తంలో చేసి ప్యాక్ చేయాలి. ఎండు మిర్చితో కారం, పసుపు కొమ్ములను ఎండబెట్టి పసుపు పొడి చేయడం వంటివే. పని చేయడానికైతే అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ ఒక బ్రాండ్ పేరుతో వ్యాపారం మొదలు పెట్టడానికి వెనుకడుగు వేశారు. ముప్పై మందిలో వ్యాపారం మొదలు పెట్టడానికి ధైర్యం చేసింది పాతికేళ్ల సోనమ్ బెన్, శోభన్‌బెన్‌లు మాత్రమే. తేజ్ మసాలా పేరుతో తయారు చేసి, తమ ఉత్పత్తులను తామే విక్రయించుకుంటున్నారు. పంచాయితీ భవనమే ఫ్యాక్టరీ ఈ మహిళలు అంతా కలిసి పని చేయాలనైతే అనుకున్నారు కానీ ఎక్కడ చేసుకోవాలి? ఒక చోట కూర్చుని పని చేసుకోవడానికి ఎవరివీ అంత విశాలమైన ఇళ్లు కాదు. ముడిసరుకు నిల్వ చేయడానికి అనువైనవి కూడా కాదు. ఎంత కరకుగా ఉన్న ఊరి పెద్దలయినా సరే... ఆడపిల్లలు ముందుకొచ్చి పని చేసుకుంటామంటే ముచ్చటపడతారు. అలాగే ఊరిపెద్ద గ్రామ పంచాయితీ కార్యాలయంలో ఒక గది ఇచ్చాడు. కారం, పసుపు, గరం మసాలా, మసాలా చాయ్ పౌడర్, చికెన్‌మసాలా, కొత్తిమీర– జీలకర్ర మసాలా, పావ్‌భాజీ మసాలా, పులావ్ మసాలాలు తయారయ్యాయి. 50, 100 గ్రాములు తూకం వేసి, ప్యాకింగ్ మెషీన్‌తో ప్యాక్ చేయడం కూడా నేర్చుకున్నారు. ఇక హైవే మీద ఒక గుడారం వేసి టేబుల్ వేసుకున్నారు. అదే వారి దుకాణం. నెలకు పాతిక కిలోల వరకు అమ్ముడవుతున్నాయి. ఈ దుకాణంతోపాటు వారం వారం సంతలకు కూడా వెళ్తారు. తేజ్ మసాలా హైవే మీద ప్రయాణించే దూరప్రాంతాల వాళ్లను చేరింది, కానీ ఉన్న ఊళ్లో ఇళ్ల నుంచి బయటకు రాని మహిళలకు తెలియడానికి చాలా రోజులు పట్టింది. ఆదివాసీ మహిళలు ఇంటింటికీ వెళ్లి తమను పరిచయం చేసుకున్నారు. ‘ఒకసారి వాడి చూద్దాం’ అని తీసుకున్న వాళ్లు వీటికి మంచి మార్కులు వేయడంతో డోర్ టు డోర్ మార్కెటింగ్ కూడా మంచి ఫలితాలనే ఇస్తోంది. ఐదు నెలల పాటు తాజాదనం తగ్గని క్వాలిటీ కూడా డిమాండ్ పెరగడానికి ఓ ప్రధాన కారణం. ‘ఉత్పత్తిని ఇంకా పెంచాలి’ నెలకు నలభై కిలోల మసాలాలు తయారవుతున్నాయిప్పుడు హాల్పట్టిలో. ఒక్కొక్కరికి నెలకు నికరంగా ఐదు వేల రూపాయలు మిగులుతున్నాయి. డిమాండ్ ఉంది. కాబట్టి నెలకు 80 కిలోలకు పెంచడం ఇప్పుడు వారి లక్ష్యం. వ్యాపార విస్తరణలో మరో ముందడుగు వేస్తున్నారిప్పుడు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో మార్కెట్ జోన్ కనిపించింది. బ్లాక్ డెవలప్మెంట్ అధికారులు కూడా సానుకూలంగా స్పందించారు. స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాలకు వీరి ఉత్పత్తులను కొనడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ మార్కెట్ తమ సొంతమైతే పరిశ్రమను విస్తరించడానికి మరెంతో సమయం పట్టదని ధీమాగా చెప్తున్నారు. అవకాశం వస్తే తన ఉనికిని చాటు కోవడానికి మహిళలు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. ఎన్ని ప్రతికూల పరిస్థితులలో బతుకీడుస్తున్నా సరే, చిన్న అవకాశాన్ని పట్టుకుని ఎదిగి తీరుతారు. – మంజీర -
కర్నాటకలో కాంగ్రెస్ విజయం ఖాయం
-
తాళిబొట్టు కోసం యముణ్ణి వెంటాడినట్టు వెంటాడింది!
‘‘నాకు తాళిమాల చాలా విలువైంది. దానిని లాక్కుపోతే చూస్తూ ఎలా ఉండను? దండ లేకుండా ఇంటికి వెళ్లేది లేదు’’ అనుకున్నాను. అందుకే వెంబడించాను. కేరళలోని కొల్లం జిల్లా, తెవలక్కార పట్టణం. సౌమ్య 28 ఏళ్ల యువతి. చక్కగా చురుగ్గా ఉంటుంది. భర్త టైలర్. ఇద్దరు పిల్లలు. శోభన ఐదవ తరగతి, సోనా మూడవ తరగతి. గడచిన వారం వరకు ఆమెను అందరూ ఓ సాధారణమైన సేల్స్గాళ్, ఇద్దరు బిడ్డల తల్లిగానే గుర్తించారు. ఇప్పుడామె కొల్లం జిల్లాలోనే సెలబ్రిటీ. సినిమా తారల కంటే ఎక్కువ క్రేజ్ ఆమెకిప్పుడు. కన్నుగీటి ఓవర్‌నైట్ సెలబ్రిటీ అయిన ప్రియాప్రకాశ్ వారియర్ కంటే ఈ వారియరే ఇప్పుడు అక్కడ ఫేమస్. సీన్ అంతగా మలుపు తిరగడానికి ఆమె ఏం చేసింది? సినిమా షూటింగ్‌ను తలపిస్తూ చేజ్ చేసింది. చైన్ స్నాచర్స్‌ను ఒడిసి పట్టుకుని చాచి కొట్టింది. తన తాళిమాల(మంగళసూత్రం)ను తెచ్చుకుంది. ఉద్యోగం నుంచి సాయంత్రం తన స్కూటీ మీద ఇంటికి వస్తున్నప్పుడు సౌమ్యను ఒక బైక్ వెంబడించింది. బైక్ మీద ఇద్దరు యువకులు ఆమె పక్కగా బండిని పోనిస్తూ ఆమె మెడలోని తాళిబొట్టు దండను లాక్కున్నారు. క్షణకాలం పాటు ఆగిపోయిన సౌమ్య వెంటనే తేరుకుంది. దారిన పోయే వారికి ఏం జరిగిందో తెలిసేలా ‘దొంగ... దొంగ... పట్టుకోండి’ అని అరుస్తూ స్కూటీ మీద గొలుసు దొంగలను వెంబడించింది. ‘దాదాపుగా మూడున్నర కిలోమీటర్ల దూరం వెంబడించి వారి బైక్ ను ఓవర్టేక్ చేసి వారి ఎదురుగా వచ్చింది. ఆ వేగంలో ఆమె స్కూటీ బైక్‌ను ఢీకొడుతూ ఆగింది. పరుగున వచ్చిన వారు, ఏం జరుగుతుందో తెలియకపోయినా సరే అరుపులతో గుమిగూడిన వారు బైక్ నడుపుతున్న యువకుడిని ఒడిసి పట్టుకున్నారు. సౌమ్య అతడి ముఖం మీద పిడిగుద్దులు గుద్దింది. చైన్ ఉన్న వాడు మాత్రం తప్పించుకుని పారిపోయాడు. ఈ లోపు కొందరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాళ్లు కూడా రంగంలో దిగారు. పారిపోతున్న దొంగను నిమిషాల్లోనే పట్టుకున్నారు. సౌమ్య దండ సౌమ్యకు చేరింది. కథ సుఖాంతం. ‘‘మెడలోని దండను వాళ్లు లాక్కుపోతే వెంబడించడానికి అంత ధైర్యం ఎలా వచ్చింది? అంత దూరం బండి మీద దొంగలను పట్టుకోవడానికి వెళ్లడమంటే చిన్న విషయం కాదు. నువ్వు చేసింది ఎంతటి సాహసమో తెలుసా?’’ అని ప్రశంసాపూర్వకంగా అడిగిన వాళ్లకు ఆమె చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? ‘‘నాకు తాళిమాల చాలా విలువైంది. దానిని లాక్కుపోతే చూస్తూ ఎలా ఉండను? దండ లేకుండా ఇంటికి వెళ్లేది లేదు’’ అనుకున్నాను. అందుకే వెంబడించాను. ఎలాగైనా వాళ్లను పట్టుకుని దండతోనే ఇంటికి వెళ్లాలనే కసితో వెంబడించాను. అందుకే భయం వేయలేదు’’ అంటోంది. ‘అమ్మాయిలంటే ఇలా ఉండాలి’ అని కేరళలో తల్లిదండ్రులు తమ పిల్లలకు సౌమ్యను రోల్‌మోడల్‌గా చూపిస్తున్నారు ఇప్పుడు. కేరళకే కాదు, సౌమ్య మొత్తం దేశానికే మోడల్ ఉమన్. – మంజీర -
‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’ స్టిల్స్
-
ఎన్నెన్నో వింతలు...
నందు, సౌమ్య జంటగా వీవీ వినాయక్ శిష్యుడు వరప్రసాద్‌ను దర్శకునిగా పరిచయం చేస్తూ హరిహర చలన చిత్ర పతాకంపై ఎస్. శ్రీకాంత్ రెడ్డి, రామమోహన రావు ఇప్పిలి నిర్మిస్తున్న సినిమా ‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’. ‘స్వామి రారా’ ఫేమ్ పూజా రామచంద్రన్ కీలక పాత్ర చేసిన ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకులకు ఉత్కంఠను కలిగించే పాయింట్‌తో తెరకెక్కిన చిత్రమిది. యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఉన్నాయి. యాజమాన్య మంచి సంగీతం ఇచ్చారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేశాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. మే నెలాఖరున చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమేరా: ఎస్. మురళీమోహన్‌రెడ్డి, సహ నిర్మాత: డి. శ్రీనివాస్ ఓంకార్. -
ముగ్గురు యువతుల అదృశ్యం
మెదక్ టౌన్: ముగ్గురు యువతులు అదృశ్యమైన ఘటనలు ఆలస్యంగా వెలుగుచూశాయి. మెదక్ పట్టణ పోలీసుల కథనం ప్రకారం.. రామాయంపేట మండలం దామరచెర్వు గ్రామానికి చెందిన జెల్ల శృతి (19) పట్టణంలోని చర్చికాంపౌండ్‌లో గల తన బంధువుల ఇంటికి ఇటీవల వచ్చింది. గత నెల 27న ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆమె ఆచూకీ లేకపోవడంతో శనివారం బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఉండే సౌమ్య (19) హైదరాబాద్‌లో బీటెక్ చేస్తోంది. మెదక్ పట్టణంలోని అజంపురా వీధిలో ఉండే మేనమామ అల్లం సంతోష్ ఇంటికి సంక్రాంతి సెలవులకు వచ్చింది. జనవరి 25న కడుపునొప్పిగా ఉంది. టాబ్లెట్స్ తెచ్చుకుంటానని చెప్పి ఇంట్లోంచి బయటకు వెళ్లిన సౌమ్య తిరిగి రాలేదు. దీంతో ఆమె మేనమామ శనివారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అలాగే పాపన్నపేట మండలం నార్సింగి గ్రామానికి చెందిన వంజరి రాధ (20) మెదక్ పట్టణంలో రెండేళ్లుగా ఉంటూ ఓపెన్ డిగ్రీ చేస్తుంది. ఈనెల 25న స్నేహితురాలి వద్దకు వెళ్తానని చెప్పి తిరిగి రాలేదు. దీంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు కేసులు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సాయీశ్వర్‌గౌడ్ తెలిపారు. -
చదువు మానుకోమన్నారని..
ఆదిలాబాద్ జిల్లా : తల్లిదండ్రులు చదువు మానుకోమన్నారనే మనస్తాపంతో ఓ డిగ్రీ విద్యారిని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన దండేపల్లి మండలం రెబ్బనపల్లిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. దాడి సౌమ్య(19) అనే విద్యార్థిని స్థానిక డిగ్రీ కాలేజీలో డిగ్రీ చదువుతుంది. తల్లిదండ్రులు గత కొంతకాలంగా చదువు మానుకోమంటున్నారు. దీంతో మనస్తాపంతో ఇంట్లో ఎవరూలేని సమయంలో సౌమ్య ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సౌమ్య ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. -
'పైసా' చిక ప్రేమ
మనసు దొంగిలించేవాళ్లు అనుకుంటే బీరువా తాళాలు అప్పగించినవాళ్లవుతారు.ఎక్కడ కాపు కాస్తున్నారో తెలీదు. ఎవరి మీద కన్నేశారో తెలీదు. మనం జాగ్రత్తగా లేకపోతే ఈ దొంగలు మనింటికే రావచ్చు. అరుణ్ హైదరాబాద్‌లో ఆటోవాలా. వయసు 24. అక్కడే ఉంటున్న సౌమ్య (పేరు మార్చాం) ఇంటర్ చదువుతోంది. వయసు 16. తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు సౌమ్య. కాలేజీకి వెళ్లొస్తుండే దారిలో అరుణ్ పరిచయం అయ్యాడు. ముందు ఫోన్లలోనే మాట్లాడుకునే ఇద్దరు ఆ తర్వాత ఫేస్ బుక్, చాటింగ్ వరకు వెళ్లారు. ఆ పరిచయం... కలిసి తిరిగేంతవరకు వెళ్లింది. ‘నువ్వు లేకుండా నేను ఉండలేను. మనం పెళ్లి చేసుకుందాం’ అని సడెన్‌గా అన్నాడు అరుణ్ ఒకరోజు. అంతే కాదు, మాయ మాటలతో సౌమ్య మనసు దోచుకున్నాడు. అరుణ్ తప్ప మరో ప్రపంచం లేనట్టుగా ఉంది సౌమ్యకు. చూస్తుండగానే ఆరు నెలలు గడచిపోయాయి. ఓ రోజు అరుణ్ (మూడు నెలల క్రితం) సౌమ్య దగ్గరకు వచ్చి, ‘నాకు కడుపులో అల్సర్ ఉందట. లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవాలంట. లేకపోతే బతకను. ఆరేడు లక్షలు అవుతుంది అంటున్నారు. నా దగ్గర అంత డబ్బు లేదు. నువ్వే ఎలాగైనా సర్దాలి’ అన్నాడు. సౌమ్య ప్రాణం విల్లవిల్లాడింది. కానీ అంత డబ్బు! ఎలా..? సౌమ్యకు దిక్కు తోచలేదు. రెండు మూడు రోజులుగా అరుణ్ అడగడం, సౌమ్య ఏమీ సమాధానం ఇవ్వకపోవడం జరుగుతూనే ఉంది. నాల్గవరోజు అరుణ్ ఫోన్ చేశాడు. ‘డబ్బు ఇవ్వకపోతే మనిద్దరికీ సంబంధం ఉందని అందరికీ చెబుతాను. మనం దిగిన ఫొటోలు అందరికీ పంచుతాను! నీ పరువు, మీ అమ్మనాన్నల పరువు పోతుంది’ అని వార్నింగ్ ఇచ్చాడు. సౌమ్య హతాశురాలైంది. నిజంగానే ఆ ఫొటోలు బయటపెడితే తన పరిస్థితి ఏంటి?! ఈ కష్టం నుంచి బయటపడటం ఎలా?’ అని ఆలోచించింది. ఒంట్లో బాగోలేదని ఆ రోజు ఇంట్లోనే ఉంది. అమ్మానాన్నలు ఆఫీస్లకెళ్లిపోయారు. బీరువా తాళాలు తీసి చూసింది. బంగారం, ఆ పక్కనే డబ్బు కనిపించాయి. నాన్నకు తెలియకండా ఆయన పర్సులోంచి ఎ.టి.ఎమ్ కార్డు కూడా తీసింది. అరుణ్‌కు ఫోన్ చేసి ఇంటికి రమ్మంది. వచ్చాక దాదాపు 30 తులాల బంగారం, 3 లక్షలకు పైగా నగదు ఇచ్చింది. ఎ.టి.ఎమ్ కార్డ్ తీసుకెళ్లి మరికొంత డబ్బు తీసి ఇచ్చింది. డబ్బు తీసుకుని అరుణ్ ఉడాయించాడు. సౌమ్య మళ్లీ ఆలోచనలో పడింది. ఇంట్లో ఈ విషయం తెలిస్తే ఊరుకోరు.. ఎలా? తనను తానే కట్టేసుకుని, దొంగలు పడి, దోచుకెళ్లినట్టుగా ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు చెప్పింది. ఈ ఏడాది ఫిబ్రవరి 2న జరిగిన ఈ సంఘటనను పోలీసులు దర్యాప్తు చేసి ఈ నెల 9న అరుణ్‌ని అరెస్ట్ చేసి, అసలు విషయం బయటపెట్టారు. ఇప్పుడీ విషయం గురించి మనమెందుకు మాట్లాడుకోవాలంటే.. మన ఇంట్లోనూ ఈ వయసు పిల్లలుంటారు. ఏది తప్పో, ఏది ఓప్పో తెలియని స్థితిలో కష్టాల ఊబిలో వారు పడిపోకూడదు. ప్రేమ పేరుతో ట్రాప్ చేసే వంచకుల చేతికి చిక్కకూడదు. అందుకు మనమేం చేయాలి? ► కుటుంబసభ్యుల మధ్య ఉండే ఆప్యాయతలు మాత్రమే అసలైన ప్రేమ అని అమ్మాయికి తెలియజెప్పాలి. ► ఎంతసేపూ పుస్తకాలు, మార్కులు, ర్యాంకుల గొడవలతో కాకుండా అమ్మాయి మానసిక వికాసానికి కావల్సిన పెద్దల అనుభవాలను జాగ్రత్తలుగా షేర్ చేసుకోవాలి. ► ఏ బాధ్యతా లేకుండా రోడ్లమీద తిరిగేవారే అమ్మాయిలను ట్రాప్ చేస్తుంటారు. అదికూడా అమాయకమైన అమ్మాయిలనే టార్గెట్ చేస్తుంటారు. తమ ట్రాప్‌లో పడేందుకు కావల్సిన అన్ని శక్తులనూ ఉపయోగిస్తుంటారు. ఆ విషయాన్ని అమ్మాయిలకి అర్థమయ్యేలా చెప్పాలి. ► పిల్లల చిన్న చిన్న సమస్యలను, అవసరాలను వాయిదా వేయకూడదు. చిన్న అవసరాలే కదా అని కొట్టిపారేయకుండా సాధ్యమైనంతవరకు తీర్చాలి. సమస్యను పూర్తిగా విని సానుకూలంగా స్పందించాలి. ► పిల్లలు తమ సమస్యలను, భావోద్వేగాలను పంచుకునేలా ఇంటి వాతావరణం ఉండాలి. ► సమాచారం వేగవంతంగా మారిన ఈ రోజుల్లో ప్రేమ పేరుతో జరిగే మోసాలు కూడా రెట్టింపు వేగంతో జరిగిపోతున్నాయి. అందుకని, పిల్లల స్నేహాలు, వారి ప్రవర్తనవైపు గమనింపు తప్పనిసరి. ► బోర్ కొడుతోందని టైమ్ పాస్ కోసం ప్రేమలో పడ్డవారి సంఖ్య ఇటీవల బాగా పెరుగుతోంది. కాబట్టి పిల్లలకి బోర్ అనిపించకుండా చదువుతో పాటు నృత్యం, సంగీతం, క్రీడలు, పుస్తకపఠనం... హాబీస్వైపుగా వారి దృష్టి మళ్లేలా చూడాలి. ► ‘ప్రేమలో పడ్డాం’ అని కౌన్సెలింగ్‌కు వచ్చే అమ్మాయిలు దాదాపు నిరుద్యోగులుగా తిరుగుతుండేవారినే ఇష్టపడటం చూస్తున్నాం’ అని కౌన్సెలర్లు చెబుతున్నారు. జాగ్రత్త అవసరం. - నిర్మలారెడ్డి ఇన్పుట్స్: యాదగిరి, సాక్షి, తుర్కయంజాల్ ఆకర్షణలు... లక్ష్యాలు ఒక బకెట్‌ను ముందు ఇసుకతో నింపాక అందులో రాళ్లు పట్టవు. అదే ముందు రాళ్లు వేసి, తర్వాత అంతే ఇసుకతో అదే బకెట్ నింపవచ్చు. పిల్లలు తెలియక తమ జీవితంలో ముందు ఇసుకనే నింపుకుంటున్నారు. రాళ్లుగా చెప్పుకునే లక్ష్యాలను వెనకేసుకోవాలనే జ్ఞానం వారికి ఉండటం లేదు. ఈ వయసులో ఆకర్షణలు ఇసుకతో సమానం అని, ఆ ఆకర్షణలో పడితే లక్ష్యాలను సాధించలేమని పిల్లలకు తెలియ చెప్పాలి. - డా. గీతాచల్లా, సైకాలజిస్ట్ మోసాలు పెరుగుతున్నాయి ప్రేమ పేరుతో నమ్మించి మోసాలు చేస్తున్న ఘటనలు ఇటీవల ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా టెన్త్, ఇంటర్మీడియెట్ అమ్మాయిలే ప్రేమ అనే ఆకర్షణలో పడుతున్నారు. తర్వాత మోసపోయి, బాధపడుతున్నారు. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే తల్లిదండ్రులు పిల్లలపై దృష్టిపెట్టి వారిని సరిదిద్దాలి. - భాస్కర్‌గౌడ్, ఏసీపీ, వనస్థలిపురం -
గైనిక్ కౌన్సెలింగ్
నా వయసు 25 ఏళ్లు. నాకు పెళ్లయి ఆర్నెల్లు అయ్యింది. ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయ్యింది. ఇప్పుడు మూడో నెల. నాకు బాగా వికారంగా, నీరసంగా ఉంటోంది. నిద్ర సరిగా పట్టడం లేదు. వాంతులు ఎక్కువగా అవుతున్నాయి. ఆకలి లేదు. పదిహేను రోజుల్లో రెండు కేజీల బరువు తగ్గాను. ఇలా అయితే లోపల బిడ్డ ఎలా పెరుగుతుందో అని ఆందోళనగా ఉంది. నా సమస్యకు సరైన పరిష్కారం చెప్పండి. - సౌమ్య, కర్నూలు ప్రెగ్నెన్సీ మొదలైన తర్వాత హెచ్‌సీజీ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఇది కొంతమందిలో చాలా తక్కువ పాళ్లలోనూ, మరికొంతమందిలో చాలా ఎక్కువగానూ విడుదల అవుతుంది. దీన్ని బట్టి... వారి వారి శరీర తత్వాన్ని బట్టి కొందరిలో తక్కువగానూ, మరికొందరిలో ఎక్కువగానూ వాంతులు అవుతుంటాయి. మరికొందరిలో ఎలాంటి లక్షణాలూ ఉండవు. కాబట్టి వాంతులు అవుతున్నాయని ఆందోళనపడాల్సిన అవసరం లేదు. కొద్ది కొద్ది మోతాదుల్లో ఎక్కువసార్లు సులువుగా జీర్ణమయ్యే ఆహారం తీసుకుంటూ ఉండండి. ద్రవపదార్థాలు అంటే... కొబ్బరినీళ్లు, మజ్జిగ, పండ్లరసాలు, ఎలక్ట్రాల్ ద్రవాలు, గ్లూకోజు నీళ్లు ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. పండ్లు కూడా ఎక్కువగా తింటూ ఉండాలి. ఇక పచ్చళ్లు, నూనె వస్తువులు, మసాలాలు ఎక్కువగా ఉండే పదార్థాలు ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. వాంతులు అవుతున్నా ఫర్వాలేదు, ఏదో ఒకటి తింటూ ఉండండి. అసలేవీ తినకపోతే అసిడిటీ వల్ల కడుపులో యాసిడ్ పేరుకొని పసరు వాంతులు, రక్తపు వాంతులు అయ్యే ప్రమాదం ఉంది. అవసరమైతే డాక్టర్ పర్యవేక్షణలో యాంటాసిడ్ మందులు లేదా వాంతులను, వికారాన్ని తగ్గించేందుకు యాంటీ ఎమెటిక్ మందులను వాడవచ్చు. మరీ నీరసంగా ఉంటే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్‌ను కలిసి చికిత్స చేయించుకోండి. అవసరాన్ని బట్టి సెలైన్ ఎక్కించుకోవడం/గ్లూకోజ్ పెట్టించుకోవడం చేయాల్సి రావచ్చు. అయితే మీరు ఆందోళపడాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు. డాక్టర్ వేనాటి శోభ సీనియర్ గైనకాలజిస్ట్ లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్.