Actress Sowmya Menon is going to act in SARA Movie - Sakshi
Sakshi News home page

Sowmya Menon: సర్కార్ వారి పాట నటి.. 'సర' అంటూ వచ్చేస్తోంది!

Published Sun, Aug 6 2023 9:59 PM | Last Updated on Mon, Aug 7 2023 10:40 AM

Actress sowmya menon is going to Acts In SARA Movie - Sakshi

అటు గ్లామ‌ర్, ఇటు యాక్టింగ్‌తో సినిమాల్లోకి దూసుకువ‌చ్చిన హీరోయిన్ సౌమ్య మీనన్.  కానీ సూప‌ర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయాలనే కోరికతో ‘సర్కారి వారిపాట’ మూవీలో చిన్న క్యారెక్టర్ చేసింది భామ. ఇవాళ సౌమ్య బర్త్‌ డే కావడంతో అభిమానులకు క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది కేరళ కుట్టి. శ్రీ వాయుపుత్ర ఎంటర్టైన్మెంట్ అండ్ శ్రీవత్స క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న లేడీ ఓరియంటెడ్ చిత్రం ‘సర’.  ఈ చిత్రంలో సౌమ్య మీనన్ రెండు డిఫరెంట్ షేడ్స్‌ ఉన్న క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. వి.శశిభూషణ డైరెక్షన్‌లో ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు. 

(ఇది చదవండి: తమన్నా చేయి పట్టుకున్న అభిమాని.. హీరోయిన్ ఏం చేసిందంటే?)

కాగా.. మలయాళంలో కినవల్లి, ఫ్యాన్సీ డ్రెస్, చిల్డ్రన్స్ పార్క్.. లాంటి సూపర్ హిట్ సినిమాలలో హీరోయిన్‌గా చేసింది సౌమ్య. ప్రస్తుతం సౌమ్య చేతిలో ఓ కన్నడ , రెండు మలయాళ, తెలుగు సినిమాలు ఉన్నాయి. అయితే.. తెలుగులో కూడా ట్యాక్సీ అనే సినిమా చేసింది. కానీ దానికంటే ముందే సర్కారు వారి పాట రిలీజ్ అయ్యేసరికి అందరి దృష్టిలో పడింది.

అంతే కాకుండా సౌమ్య మంచి డాన్సర్ కూడా.. కొన్ని మలయాళీ ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్స్‌లో ఆడిపాడింది. అందంతో కట్టిపడేస్తోన్న సౌమ్య మీనన్ లేడీ ఒరియంటెడ్ మూవీ చేయనుండడంతో టాలీవుడ్‌ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. సర చిత్రంతో బర్త్ డే బ్యూటీ సక్సెస్ సాధిస్తుందని అభిమానులు విషెస్ చెబుతున్నారు. మూవీ ఫస్ట్ లుక్‌తో పాటు.. త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తామని మేకర్స్ తెలిపారు. 

(ఇది చదవండి: ఆస్కార్‌ అంటే ఏంటో తెలియదు: ది ఎలిఫెంట్ విస్పరర్స్ నటి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement