కృష్ణా జిల్లా నందిగామ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో టీడీపీ తరపున తంగిరాల సౌమ్య పోటీ చేయనున్నారు.
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జిల్లా నందిగామ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో టీడీపీ తరపున తంగిరాల సౌమ్య పోటీ చేయనున్నారు. ఆమెను అభ్యర్థిగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మంగళవారం ఎంపిక చేశారు. సౌమ్య.. నందిగామ నియోజకవర్గం నుంచి గత సాధారణ ఎన్నికల్లో పోటీచేసి గెలుపొంది ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయకముందే మరణించిన తంగిరాల ప్రభాకర్ కుమార్తె.