
సాక్షి, కృష్ణా: నందిగామలో లక్ష్మీ అనే వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. పెట్రోల్ పోసుకొని ఒంటికి నిప్పంటించుకుంది. వెంటనే స్థానికులు ఆమెను రక్షించారు. తన భర్త చనిపోయి ఏడాది అవుతున్నా అత్తమామలు ఇంట్లోకి రానివ్వడం లేదని లక్ష్మీ ఆవేదన వ్యక్తం చేస్తోంది. పోలీసులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని.. అలాగే గ్రామ పెద్దల దగ్గర పంచాయితీ పెట్టించినా అత్తమామలు వారి మాట వినటంలేదని పేర్కొంది. అటు పోలీసులు ఇటు అత్తమామలు పట్టించుకోకపోవడంతోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు లక్ష్మీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment