nandigama
-
కాంసన్ హైజెన్ పరిశ్రమలో అగ్నిప్రమాదం..
-
నందిగామలో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా నందిగామ కాంసన్ హైజెన్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఈ అగ్ని ప్రమాదం కారణంగా భారీ ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. అగ్ని ప్రమాదం కారణంగా మంటలు ఎగిసిపడుతున్నాయి.వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా నందిగామ సమీపంలోని కాంసన్ హైజెన్ పరిశ్రమలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు పోలీసు ధికారులు చెబుతున్నారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిప్రమాక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. పక్కనే ఉన్న ఇతర పరిశ్రమలకు మంటలు వ్యాపించకుండా ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదం కారణంగా మంటలు ఎగిసిపడుతున్నాయి. -
ఎక్కడి నుంచైనా పోటీకి సిద్ధం: మంత్రి జోగి రమేష్
సాక్షి, ఎన్టీఆర్: ఎక్కడి నుంచైనా తాను పోటీకి సిద్ధమని మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు తాను పోటీకి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా సీఎం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. కేశినేని నాని నిజం తెలుసుకొని, సీఎం జగన్ నాయకత్వంలో పనిచేసేందుకు వైఎస్సార్సీపీలో చేరారని తెలిపారు. నందిగామలో జగనన్న వాకింగ్ ట్రాక్‌ను మంత్రి జోగి రమేష్ శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, మొండితోక జగన్ మోహన్ రావు, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, తదితర నేతలు పాల్గొన్నారు. సుమారు రూ. కోటి రూపాయల వ్యయంతో 700 మీటర్ల వాకింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కేశినేని నానికి వైఎస్ జగన్‌పై అభిమానం ఉన్నా..చంద్రబాబు తిట్టమని చెప్పడం వల్లే సీఎంపై విమర్శలు చేశారని మండిపడ్డారు. నానికి విజయవాడ ఎంపీ స్థానం కేటాయించినట్లు తెలిపారు. విజయవాడ ఎంపీ స్థానాన్ని వైఎస్సార్సీపీ తన ఖాతాలో వేసుకోబోతుందని పేర్కొన్నారు. పెనమలూరులో ప్రత్యర్థిగా పార్థసారథి అయినా, చంద్రబాబు అయినా తన పోటీ అక్కడి నుంచే ఉంటుందని స్పష్టం చేశారు. -
దాని రీల్స్ చూస్తావా?.. భర్తపై అఘాయిత్యం
సాక్షి, ఎన్టీఆర్: నా మొగుడు నాకే సొంతం అనుకున్న ఓ భార్య.. భర్తపై అఘాయిత్యానికి తెగబడింది. బ్లేడ్‌తో మర్మాంగాన్ని కోసి ఆస్పత్రి పాలు జేసింది. నందిగామలోని అయ్యప్ప నగర్లో ఈ దారుణం చోటు చేసుకుంది. ముప్పాళ్ల గ్రామానికి చెందిన కోట ఆనంద్ బాబుకు గతంలో ఓ వివాహం జరిగింది. అయితే మనస్పర్థల కారణంగా ఆమెతో విడిపోయిన ఆనంద్.. ఐదేళ్ల కిందట వరమ్మ అనే రెండో వివాహం చేసుకున్నాడు. అయితే ఇన్నేళ్ల కాపురం తర్వాత మొదటి భార్య విషయంలో వరమ్మ ఆనంద్‌తో గొడవకు దిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో మాజీ భార్య రీల్స్ చూస్తున్నాడని అనుమానం పెంచుకున్న ఆమె.. భర్తతో గొడవకు పడుతూ వస్తోంది. ఈ క్రమంలో గత రాత్రి(శుక్రవారం) ఆనంద్ బాబు తన మొదటి భార్య Instagram వీడియోలు చూస్తుండటం గమనించిన వరమ్మ.. ఆగ్రహంతో ఊగిపోయింది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా.. బ్లేడ్‌తో భర్త మర్మాంగాన్ని కోసేసిందామె. తీవ్ర రక్తస్రావం కావడంతో బాధితుడ్ని నందిగామ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించి...మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. -
టీడీపీలో అగ్గిరాజేసిన కేశినేని నాని.. పచ్చ బ్యాచ్‌కు చుక్కలే!
రౌండప్ చేసి ఇబ్బంది పెడితే కన్ఫ్యూజన్లో ఎక్కువ కొట్టేస్తాను అంటాడు మహేష్ బాబు ఓ సినిమాలో. ఇప్పుడు బెజవాడ ఎంపీ కేశినాని కూడా మహేష్ బాబులా తయారయ్యాడు.. కన్ఫ్యూజన్లో దొరికిన వాళ్ళందర్నీ కెలుక్కుంటూ పోతున్నాడు. అవును బెజవాడ పండుగాడు కేశినేని నానితో అదే పెద్ద తిరకాసు.. ఆయన మానాన ఆయన్ను వదిలేస్తే పర్లేదు. విజయవాడ ఎంపీగా తన పనేదో తాను చేసుకుని పోయే రకం. అందరితో పులిహోరా కలుపుకుని పోయే రకం కాకున్నాపెద్దగా ఎవర్నీ ఇబ్బంది పెట్టే తత్త్వం లేకుండా ఉన్నంతలో అలా సాగిపోయే టైప్ నాయకుడు. అలాంటి మనిషిని కేవలం తనకు అలవిమాలిన చంచాగిరి చేయడం లేదని, సొంతంగా, వ్యక్తిగతంగా ఇమేజి బిల్డప్ చేసుకుని వెళ్తున్నాడు అనే కారణం చూపించి తన అనుయాయులు.. ప్రజల్లో ఇమేజి లేని వాళ్ళను పోగేసి చుట్టూరా రౌండప్ చేసి ఆయన్ను తరచూ డిస్టర్బ్ చేస్తూ వెళ్తున్నారు. విజయవాడ లోకసభ నియోజకవర్గం పరిధిలోని విజయవాడ వెస్ట్ (జలీల్ ఖాన్- బుద్ధా వెంకన్న) సెంట్రల్ (బోండా ఉమా) విజయవాడ ఈస్ట్ (గద్దె రామ్మోహన్) ఇంకా సిటీ పక్కనున్న నందిగామ (తంగిరాల సౌమ్య) నియోజకవర్గాల్లో నానికి ఇబ్బందులు కలిగించేలా చంద్రబాబు ఏర్పాట్లు చేసేసారు. ఈ నాయకులంతా పనిగట్టుకుని ఓ వర్గంలా ఏర్పడి సిట్టింగ్ ఎంపీకి ఇబ్బందులు కలిగించడమే లక్ష్యంగా పని చేస్తుంటారు. నగరంలో ఉంటున్న కేశినేని నానిని కాదని హైదరాబాద్‌లో బిజినెస్ చేసుకుంటున్న ఆయనను తమ్ముడు చిన్నిని విజయవాడ తీసుకొచ్చి ఆయనకు వ్యతిరేకంగా.. పోటీగా నాయకుడిగా తయారు చేస్తున్నారు. అయినా లెక్క చేయని నాని తన కుమార్తే శ్వేతను ఎమ్మెల్యేగా నిలబెట్టాలని చూస్తున్నారు. అసలు తండ్రికే విజయవాడలో చోటులేకుండా చేద్దాం అనుకున్న టీడీపీ పెద్దలు ఇప్పుడు ఆయన కూతుర్ని రానిస్తారా? ఖచ్చితంగా రానివ్వరు.. అలాగని నా రాత ఇంతే.. నా ప్రాప్తం ఇంతే అని ఊరుకునే రకం కాదు నాని. తనను ఇబ్బంది పెడుతున్న ఎవరూ నిద్రపోరాదు అనే కాన్సెప్ట్ మీద ఉంటూ విజయవాడ, చుట్టూ ఉన్న నియోజకవర్గాలను కెలుక్కుంటూ పోతున్నారు. మొన్న నందిగామ వైస్సార్సీపీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావుతో కబుర్లు, కుశల ప్రశ్నలు అయ్యాక ఆయన్ను మెచ్చుకుంటూ రెండు మాటలు చెప్పేసి నందిగామ టీడీపీలోకి ఓ నిప్పు పుల్ల విసిరేశారు. అదిప్పుడు రాజుకుంది. విజయవాడ తెలుగదేశం రాజకీయాలు రోడ్డున పడ్డాయి.గొట్టం గాళ్ళు అందరూ బయటకు వచ్చారు.@JaiTDP @IamBondaUma @kesineni_nani pic.twitter.com/kH8zKmLv9l— varra Raveendra reddy (@varra1987) June 9, 2023 వాస్తవానికి నందిగామ మొదటి నుంచీ కమ్మల ప్రాబల్యం ఎక్కువ ఉన్న నియోజకవర్గం. దేవినేని వెంకట రమణ , ఆయన సోదరుడు దేవినేని ఉమా (ఇద్దరూ టీడీపీలో మంత్రులుగా చేసారు). కానీ ఆ తరువాత అది ఎస్పీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా మారడంతో అక్కడ గతంలో టీడీపీ నుంచి తంగిరాల ప్రభాకర్ (2014-2019) గెలుపొందారు. ఆయన అకాలమరణంతో ఆయన కుమార్తె సౌమ్యను ఏకగ్రీవంగా ఎమ్మెల్యేగా చేశారు. ఆ తరువాత 2019లో మొండితోక జగన్మోహన్ రావు ఎమ్మెల్యేగా(వైఎస్సార్సీపీ) గెలిచారు. అయితే, ఇప్పుడు నాని అక్కడి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేతో రాసుకుపూసుకు తిరగడంతో టీడీపీ ఇంచార్జ్ సౌమ్యకు చిరాకు.. చికాకు కలిగింది. దీంతో ఆమె తన అనుచరులతో పార్టీ వాట్సాప్ గ్రూపుల్లో నానిని నైతికత లేని నాయకుడిగా పేర్కొంటూ పోస్టులు పెట్టిస్తున్నారు. ఇక నాని వర్గం.. ముదురు టెంకలు ఉన్న విజయవాడనే కెలికేసారు.. సౌమ్యను వదులుతారా..? అదే జోరుతో ఆమెను సైతం ట్రోల్ చేస్తూ పోతున్నారు. మొత్తానికి నాని దెబ్బకు నందిగామ టీడీపీలో నిప్పు రవ్వలు మొదలయ్యాయి. ఇది కూడా చదవండి: తొంగి చూసినట్లే ఈనాడు రాతలు!..మరి వాటికీ సమాధానాలు చెప్పొచ్చుగా? -
ఆంధ్రప్రదేశ్‌లో పథకాలు భేష్!
నందిగామ: ఆంధ్రప్రదేశ్‌లో పేదవారిని అభివృద్ధి పథంలో నడిపించేందుకు అమలు చేస్తున్న పథకాలు చాలా బాగున్నాయని బ్రెజిల్‌కు చెందిన సోషల్ సర్వీస్ బృందం ప్రతినిధి మలీష చెప్పారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారి పరిస్థితి, వారు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలు, గ్రామీణ ప్రాంతాల్లోని పరిస్థితులను అధ్యయనం చేసేందుకు బ్రెజిల్‌కు చెందిన ఈ బృందం గురువారం ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం మాగల్లు గ్రామానికి వచ్చింది. మలీష తదితరులు సహాయకుడు జయరాజు, కేడీసీసీబీ డైరెక్టర్ కొమ్మినేని రవిశంకర్‌తో కలిసి గ్రామంలో పర్యటించారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలు, గ్రామ సచివాలయం, గ్రామీణ బ్యాంకులు, జగనన్న లేఅవుట్లో నిర్మిస్తున్న ఇళ్లు, ,గ్రామంలో ప్రజలు నివసిస్తున్న తీరు, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారి పరిస్థితులపై అధ్యయనం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బ్రెజిల్లో ఉచితంగా స్థలం ఇచ్చి, ఇల్లు కట్టించే పద్ధతి లేదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి ఉచితంగా ఇల్లు కట్టించి ఇవ్వడం అభినందనీయమన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఉన్నాయన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామాల్లోనే అన్ని ప్రభుత్వ సేవలు అందడం అభినందనీయమన్నారు. పేదవారి అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అడిగి తెలుసుకొని అభినందించారు. -
నందిగామలో విషాదం.. విమానం ఎక్కాల్సిన యువకుడు అనుమానాస్పద మృతి!
నందిగామ/వత్సవాయి: మరికొద్ది సేపట్లో ఉన్నత విద్య కోసం లండన్ బయలుదేరి వెళ్లవలసిన ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందిన ఘటన ఎన్టీఆర్ జిల్లా నందిగామ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం నందిగామ శివారు హనుమంతుపాలెంకు చెందిన గాడిపర్తి వెంకటనారాయణ కొంతకాలంగా నందిగామ పట్టణంలో నివాసం ఉంటున్నారు. వెంకటనారాయణ, రాణి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు గోపీకృష్ణ లండన్‌లో ఉన్నత చదువులు చదువుతున్నాడు. రెండవ కుమారుడు గాడిపర్తి శివకృష్ణ (24) గత ఏడాది బీటెక్ డిగ్రీ పూర్తి చేశాడు. ఉన్నత చదువుల కోసం బుధవారం తెల్లవారుజామున లండన్ బయలుదేరేందుకు హైదరాబాదు వెళ్లవలసి ఉంది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం సుమారు 3:30 గంటల సమయంలో తన మిత్రులను కలిసి వస్తానని చెప్పి శివకృష్ణ ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్ విమానాశ్రయానికి వెళ్లేందుకు కుటుంబ సభ్యులు అంతా సిద్ధం చేశారు. బయటికి వెళ్లిన శివకృష్ణ ఎంతసేపటికీ తిరిగి రాలేదు. దీనికి తోడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో తల్లిదండ్రులు ఆందోళనతో మిత్రులను ఆరా తీశారు. అయినా ఆచూకీ తెలియలేదు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం నవాబుపేట సమీపంలోని పొలాల్లో చెట్టుకి ఉరివేసుకొని ఓ యువకుడి మృతదేహం కనిపించడంతో అటుగా వచ్చిన రైతులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే తమ కుమారుడి కోసం వెతుకుతున్న వెంకటనారాయణ కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి వెళ్లి మృతుడు శివకృష్ణగా గుర్తించారు. దీంతో వత్సవాయి పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు లండన్ వెళ్లి ఉన్నత చదువులు చదువుకోవాల్సిన శివకృష్ణ ఆకస్మిక మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మరి కొద్దిసేపట్లో బయలుదేరవలసిన తమ కుమారుడు ఎందుకు మృతి చెందాడో కూడా కుటుంబ సభ్యులకు అర్థం కాక తలలు బాదుకుంటున్నారు. ఎమ్మెల్యే,ఎమ్మెల్సీల పరామర్శ శివకృష్ణ మృతదేహానికి బుధవారం నందిగామ పట్టణంలో పంచనామా నిర్వహించారు. శివకృష్ణ మృతదేహాన్ని ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహనరావు, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణకుమార్ పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియపరిచారు. ఉన్నత చదువులకు లండన్ వెళ్లవలసిన శివకృష్ణ మృతి చెందడం బాధాకరమన్నారు. -
ధ్యానంతోనే మానసిక ప్రశాంతత
నందిగామ: ధ్యానంతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని, తద్వారా ఆరోగ్యంగా ఉంటారని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కాన్హా విలేజ్‌లోని హార్ట్ఫుల్నెస్ కేంద్రం, కాన్హా శాంతి వనాన్ని (రామచంద్రమిషన్) ఆయన సతీమణి సుద్నాసింగ్ చౌహాన్‌తో కలిసి ఆదివారం సందర్శించారు. గురూజీ కమ్లేష్ పటేల్(దాజీ)తో కలిసి ధ్యానం చేశారు. అనంతరం శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. ధ్యానం చేస్తే ఆనందమయ జీవితాన్ని గడుపుతారన్నారు. మురికి నీటి నుంచి విడిపోయి కమలం వికసించినట్లు జీవితం ఉండాలంటే ధ్యానం ఒక్కటే మార్గమని చెప్పారు. ధ్యానంతో అనేక రుగ్మతలు, ఒత్తిళ్లు దూరం అవుతాయని తెలిపారు. కాన్హా శాంతి వనాన్ని ఏర్పాటు చేసి కమ్లేష్ పటేల్ బీడు భూములను హరిత వనంలా మార్చారని అభినందించారు. కాన్హా శాంతి వనంలో టిష్యూ కల్చర్ ఎంతగానో ఆకర్షించిందన్నారు. మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లాలోని శుష్క భూములను సైతం హార్ట్ఫుల్నెస్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. గురూజీ కమ్లేష్ పటేల్ మాట్లాడుతూ.. ఆనందం కావాలంటే శాంతి కావాలని, అది ధ్యానంతోనే వస్తుందని అన్నారు. స్వచ్ఛమైన హృదయం కలిగిన వ్యక్తులు మాత్రమే రాజకీయాల్లోకి రావాలని అభిప్రాయపడ్డారు. యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతుండటం ఆందోళన కలిగించే విషయమని కమ్లేష్ పటేల్ అన్నారు. వీటిని అరికట్టేందుకు రూపొందించిన ‘నషా ముక్తి’యాప్‌తో పాటు ‘అవును.. మీరు దీన్ని చేయగలరు’(ఎస్.. యూకెన్ డూ ఇట్) అనే పుస్తకాన్ని శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కలిసి ఆవిష్కరించారు. మధ్యప్రదేశ్ పోలీస్ జావ్రా 24వ బెటాలియన్‌లో 6 హెక్టార్లలోని బంజరు భూమిలో 25 వేల మొక్కలు నాటి మినీ ఫారెస్ట్‌గా హార్ట్ఫుల్నెస్ కేంద్రం అభివృద్ధి చేసిందని గురూజీ గుర్తుచేశారు. హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సెంటర్లు, సబ్ సెంటర్లలో గ్రూప్ మెడిటేషన్ల ద్వారా మధ్యప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో వేలాది మంది మానసిక ప్రశాంతత పొందుతున్నారని తెలిపారు. అనంతరం సీఎం దంపతులు మొక్కలు నాటారు. కార్యక్రమంలో అభ్యాసీలు పాల్గొన్నారు. -
రూ.కోటితో విఘ్నేశ్వరుడు ధగధగ
సాక్షి, నందిగామ: ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని వాసవి మార్కెట్లో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుడు కోటి రూపాయల కరెన్సీ నోట్లతో భక్తులకు దర్శనమిచ్చారు. వాసవి మార్కెట్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితికి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రోజుకొక అలంకరణతో ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో శుక్రవారం గణనాథుడితో పాటు మండపాన్ని సైతం కరెన్సీ నోట్లతో అలంకరించారు. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. చదవండి: (చరిత్రలో తొలిసారి: రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం) -
భర్తతో విడాకులు.. మరో వ్యక్తితో రెండో పెళ్లి.. చివరికి ఏం జరిగిందంటే?
నందిగామ(ఎన్టీఆర్ జిల్లా): వివాహిత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన నందిగామ పట్టణ శివారులో బుధవారం జరిగింది. ఎస్ఐ పండు దొర కథనమ మేరకు.. విశాఖపట్నానికి చెందిన తనూజకు గతంలో చందర్లపాడు మండలం మునగాల పల్లి గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. అయితే అతనితో విడాకులు తీసుకుంది. 2015లో నందిగామ పట్టణానికి చెందిన షేక్ ఖాదర్‌వలి బాషాను తనుజ వివాహం చేసుకుంది. చదవండి: ఉద్యోగంలో చేరిన పది రోజులకే యువతి మృతి.. ఏం జరిగిందంటే? అప్పటి నుంచి తన పేరుకు ఫరహాన ఫాతిమాగా మార్చుకుంది. పట్టణ శివారు డీవీఆర్ కాలనీలో భర్తతో కలిసి నివసిస్తోంది. ఖాదర్‌వలి బాషా ఓ ప్రైవేట్ డ్రైవింగ్ స్కూల్లో డ్రైవర్‌గా పని చేస్తాడు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. తాను రెండో పెళ్లి చేసుకున్నప్పటి నుంచి తల్లిదండ్రులు తనతో మాట్లాడటం లేదన్న మనస్తాపంతో ఫాతిమా (తనూజ) (35) బుధవారం ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని మృతి చెందింది. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
వివాహేతర సంబంధం.. భర్తను అడ్డు తొలగిస్తే కలసి జీవించవచ్చని..
నందిగామ(ఎన్టీఆర్ జిల్లా): హత్య కేసును నందిగామ పోలీసులు రోజుల వ్యవధిలోనే ఛేదించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన శివకుమార్ అనే తాపీ మేస్త్రి ఈ నెల 5వ తేదీ రాత్రి హత్యకు గురయ్యాడు. ఈ ఘటనపై మృతుడి భార్య మాధవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసులో మొత్తం నలుగురి ప్రమేయం ఉన్నట్లు గుర్తించడమే కాకుండా ఇరువురు ప్రధాన నిందితులను అరెస్టు చేసి సోమవారం విలేకరుల ఎదుట ప్రవేశపెట్టారు. ఏసీపీ నాగేశ్వరరెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. పట్టణానికి చెందిన వేముల అంకమ్మరావు, ఉప్పుతోళ్ల గోవర్దనరావును అరెస్టు చేశారు. మరో ఇరువురు పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఏసీపీ తెలిపారు. కాగా ఫిర్యాదిదారైన మృతుని భార్యకు, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని, భర్తను అడ్డు తొలగిస్తే కలసి జీవించవచ్చనే దురుద్దేశంతోనే ఈ హత్యకు పథకం వేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ హెచ్ ఓ కనకారావు, ఎస్ఐ సురేష్ సిబ్బంది పాల్గొన్నారు. -
వివాహేతర సంబంధం.. ఒకే గదిలో ముగ్గురు.. చివరకు..
సాక్షి, కృష్ణా జిల్లా: వివాహేతర సంబంధం ఓ వ్యక్తి దారుణ హత్యకు దారి తీసింది. నందిగామ పట్టణంలోని ఎన్సీఆర్ క్లబ్ రోడ్డులో గురువారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు అందించిన వివరాల మేరకు.. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గుత్తి విజయ్, ఉష కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. మూడు రోజుల క్రితం నందిగామలోని ఓ హోటల్ పని చేసేందుకు వచ్చారు. ఈ క్రమంలో ఉషకు వరి అప్పాజీ అనే వ్యక్తితో కొంత కాలంగా పరిచయం ఏర్పడింది. ప్రస్తుతం ఆ ముగ్గురు కూడా ఒకే గదిలో నివాసం ఉంటున్నారు. ఉష, అప్పాజీ తో కూడా బాగా చనువుగా ఉంటోంది. అది నచ్చని విజయ్ నిద్రపోతున్న అప్పాజీని కత్తితో పీక కోసి హత మార్చాడు. ఆ సమయంలో అడ్డొచ్చిన ఉషకు కూడా తీవ్ర గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చదవండి: (ప్రియురాలికి స్నేహితురాలు వీడియోకాల్.. వక్రబుద్ధితో..) -
ఆరడుగుల తాచు పాము.. ప్రాణాలకు తెగించిన శునకం.. యజమాని వెళ్లి చూసేసరికి
నందిగామ: శునకాన్ని విశ్వాసానికి ప్రతీకగా చెప్తారు. పెంపుడు శునకాలు తమ యజమానుల కోసం ప్రాణాలను సైతం త్యజించేందుకు వెనుకాడవు. అటువంటి ఘటనే కృష్ణాజిల్లా నందిగామలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. తన యజమాని గెస్ట్ హౌస్‌లోకి ప్రవేశించిన తాచుపామును అడ్డుకునే క్రమంలో ఓ శునకం తన ప్రాణాలనే కోల్పోయింది. వివరాల్లోకి వెళితే.. నందిగామకు చెందిన వ్యాపారి నర్వనేని మురళికి పట్టణ శివారులో ఓ గెస్ట్ హౌస్ ఉంది. చదవండి: స్నేహితురాలి పుట్టినరోజు.. యువతుల కార్ల రేస్.. చివరికి ఏం జరిగిందంటే? అందులో ఒక ఆడ, ఒక మగ శునకాలు ఉన్నాయి. ఇవి రెండూ ఆరేళ్లుగా గెస్ట్ హౌస్‌కి కాపలా కాస్తున్నాయి. శనివారం రాత్రి పొద్దుపోయాక గెస్ట్ హౌస్‌లోకి దాదాపు ఆరడుగుల పొడవైన తాచు పాము ప్రవేశించింది. దానిని పసిగట్టిన మగ కుక్క కైజర్ పాముతో పోరాటానికి దిగింది. దానిని చంపేసింది. ఈ క్రమంలో పాము కాటుకు గురైన కైజర్ తానూ ప్రాణాలు విడిచింది. ఆదివారం ఉదయం గెస్ట్ హౌస్‌కు వెళ్లిన యజమాని, అక్కడి దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు. యజమాని కోసం ప్రాణాలకు తెగించి మరీ పోరాడిన శునకాన్ని సంప్రదాయబద్ధంగా ఖననం చేశారు. -
మద్యానికి దూరంగా.. అభివృద్ధికి దగ్గరగా..
నందిగామ: కొణతమాత్మకూరు.. కృష్ణా జిల్లాలో 17వందల పైచిలుకు జనాభా ఉన్న ఓ చిన్న గ్రామం. మద్యం అలవాటు ఇక్కడ ఎన్నో కుటుంబాలను ఆర్థికంగా, మానసికంగా చిదిమేసింది. విచ్చలవిడిగా తాగుతూ భార్యలను హింసించిన ఘటనలు ఇక్కడ కోకొల్లలు. ఇలాంటి ఊరు ఒక్కసారిగా మారిపోయింది. మద్యానికి వ్యతిరేకంగా మహిళలు సమర శంఖం పూరించడమే కారణం. ఇప్పుడు ఆ గ్రామం మద్యం ముట్టని ఊరుగా ఖ్యాతిగడిస్తూ అభివృద్ధికి పరుగులు పెడుతోంది. కృష్ణాజిల్లా నందిగామ మండలంలో ఉన్న ఈ గ్రామంలో ఒకప్పుడు ఎవరిష్టం వచ్చినట్లు వారు తాగడం.. రోజంతా కష్టపడి సంపాదించిన మొత్తం తాగుడుకే వెచ్చించడం జరిగేది. భర్తలు ఫుల్లుగా తాగడం, భార్యలను హింసించడం, మహిళలు రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన మొత్తాన్ని కూడా సారా కొట్టుకే తగలేయడం, డబ్బుల్లేని రోజు పుస్తెలను సైతం తాకట్టు పెట్టి తాగడం పరిపాటిగా ఉండేది. దీంతో విసిగిపోయిన మహిళలు పోరాటానికి శ్రీకారం చుట్టారు. మద్యం వ్యతిరేక ఉద్యమానికి బీజం వేశారు. దీంతో 2005 అక్టోబర్‌లో పంచాయతీ తీర్మానం చేశారు. మద్యం సీసాలను ధ్వంసంచేసి ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడేలా పోరాటం చేశారు. దీంతో జిల్లా ఉన్నతాధికారులు సైతం కదలి రావాల్సిన పరిస్థితులు తలెత్తాయి. వారు వచ్చి గ్రామంలోని మందుబాబులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇలా మూడు నెలలపాటు కొనసాగిన ఉద్యమం సత్ఫలితాన్నిచ్చింది. నాటి నుంచి నేటి వరకు ఈ గ్రామంలో మద్యానికి చోటులేదు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కొందరు ఈ గ్రామంలో బెల్ట్ షాపు ఏర్పాటుచేసేందుకు చేసిన ప్రయత్నాలను సైతం గ్రామస్తులు అడ్డుకున్నారు. అక్కడ అందరిదీ ఒకే మాట.. అన్ని గ్రామాల్లో మాదిరిగానే ఈ గ్రామంలో కూడా పలు పార్టీలను అభిమానించే వారున్నారు. అయితే, మద్యం మహమ్మారి విషయంలో మాత్రం వారందరిదీ ఒక్కటే మాట. పలు విషయాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నా.. మద్యం మహమ్మారి విషయంలో, అభివృద్ధి విషయంలో మాత్రం వీరు ఒక్క తాటిపైనే ఉంటారు. పొరుగునే తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ఉన్నప్పటికీ, గ్రామంలోకి మద్యం తీసుకువచ్చే ధైర్యం ఎవ్వరూ చేయలేరు. ఈ గ్రామస్తుల కట్టుబాటు అలాంటిది. ఉద్యమ స్ఫూర్తితో గ్రామాభివృద్ధి ఇక్కడ మహిళలు చేపట్టిన ఉద్యమం ఇచ్చిన స్ఫూర్తి.. గ్రామాభివృద్ధిలోనూ కొనసాగింది. దీంతో ఈ గ్రామంలో రెండు ఎత్తిపోతల పథకాలు, మండల పరిషత్ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, ప్రైమరీ హెల్త్ సెంటర్, ధాన్యం కొనుగోలు కేంద్రం వంటివి ఏర్పాటయ్యాయి. దీనికితోడు గ్రామంలోని అన్ని రహదారులు పూర్తిగా సిమెంటు రోడ్లుగా రూపాంతరం చెందాయి. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ సర్కార్ అందిస్తున్న సంక్షేమ పథకాలు వారి అభివృద్ధికి మరింత దోహదపడుతున్నాయి. ఇలా అన్ని గ్రామాల్లోనూ ప్రజలు కలిసికట్టుగా ఉంటే గ్రామ సీమలు అభివృద్ధిలో మహా నగరాలను మించిపోవడం ఖాయం. ఈమె పేరు కనమాల పుల్లమ్మ. ఈమె భర్త కృష్ణ. మద్యానికి బానిసై 15 ఏళ్ల క్రితం మృతిచెందాడు. అప్పటికి ఆమె ఉంటున్న గ్రామంలో మద్యపాన నిషేధం అమలుకాలేదు. ఇద్దరు కుమారులను పెంచేందుకు నానా కష్టాలు పడింది. రోజువారీ కూలీకి వెళ్లొచ్చిన డబ్బుతో పెద్ద కుమారుడు నాగరాజును డిగ్రీ వరకు చదివించింది. రెండో కుమారుడు వినయ్ ప్రభుత్వ స్కూల్లో చదువుకుంటూనే కూలి పనులకు వెళ్తూ కుటుంబానికి అండగా నిలిచాడు. కేవలం మద్యం మహమ్మారి వల్లే తన భర్త మరణించాడని ఆమె చెబుతోంది. ఇలా పుల్లమ్మ లాంటి అనేకమంది మహిళలు ఆ గ్రామంలో తమ భర్తల తాగుడు వ్యసనంతో పడ్డ కష్టాలు అన్నీఇన్నీ కావు. అభివృద్ధిలో అందరిదీ ఒకే మాట గ్రామస్తులు అభివృద్ధిని, రాజకీయాన్ని వేర్వేరుగా చూస్తారు. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే మా గ్రామంలో రాజకీయం ఉంటుంది. అధికారంలో ఎవరున్నా, గ్రామాభివృద్ధికి పాటుపడాల్సిందే. ఈ విషయంలో తేడా వస్తే గ్రామస్తులు సహించరు. అందరూ ఒకే తాటిపై ఉండబట్టే అభివృద్ధి సాధ్యపడుతోంది. ప్రతి విషయంలో పారదర్శకత ఉంటుంది. – మేడా కోటేశ్వరరావు, సర్పంచ్ కేసులు లేని గ్రామం కొణతమాత్మకూరు గ్రామం ఎన్నో విషయాల్లో ఆదర్శంగా నిలుస్తుంది. గ్రామంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉంటాయి. ఏడాదికి ఈ గ్రామం నుంచి ఒక్క కేసు కూడా నమోదు కాదు. ప్రమాదాలు, ఇతరత్రా కేసులు అడపాదడపా వస్తాయి. అన్ని గ్రామాలు ఇలా కట్టుబాటుతో ఉంటే, గ్రామసీమలు పట్టణ వాసులకు ఆదర్శంగా నిలుస్తాయి. – కనకారావు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ -
ఆయనే విద్యార్థి.. ఆయనే గురువు
నందిగామ: ఆయనో అధికారి.. విద్యార్థి మృతి ఘటనలో విచారణకు నందిగామ జెడ్పీ ఉన్నత పాఠశాలకు వచ్చారు. ‘విద్యార్థి ట్యాంక్ పైకి ఎలాఎక్కాడు? పాఠశాలకు మెట్లున్నాయా? ట్యాంక్‌కు అంత దగ్గరలో విద్యుత్ లైన్లు వెళ్లడం ఏమిటి’ అంటూ పాఠశాల సిబ్బంది, స్థానిక అధికారులపై ప్రశ్నల వర్షం కురిపిస్తూనే.. పదండి ఆ ట్యాంక్‌ను చూద్దాం.. అంటూ బయటకొచ్చి.. చకచకా గోడ ఎక్కేశారు. ఆపై ట్యాంక్ వద్దకు చేరుకుని.. ప్రమాదం జరిగిన తీరుపై స్వయంగా అవగాహనకొచ్చారు. ఇదంతా కింద నుంచి చూస్తున్న ఇతర అధికారులు అవాక్కవ్వడం వారి వంతైంది. ఇంతకీ ఎవరు ఈ అధికారి అనుకుంటున్నారా.. గతంలో ఓ రైతు వేషంలో ఎరువుల దుకాణానికి వెళ్లి అక్కడ జరుగుతున్న మోసాలను బయటపెట్టారు గుర్తుందా.. ఆయనే విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్. చదవండి: (అమ్మా కృష్ణవేణి వస్తే నా శవాన్ని ముట్టకోనివ్వద్దు..) వివరాలు ఇవీ.. పట్టణ శివారుల్లోని అనాసాగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన గోపీచరణ్ అనే విద్యార్థి ఆగస్టు 25వ తేదీన పాఠశాల పైభాగంలో వాష్‌రూమ్‌లపై గల నీటి ట్యాంక్‌ను కడిగేందుకు ట్యాంక్ పైకి వెళ్లి, విద్యుత్ షాక్‌తో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విచారణ నిమిత్తం గురువారం పాఠశాలను విజయవాడ సబ్ కలెక్టర్ ప్రవీణ్‌చంద్ పాఠశాలను సందర్శించారు. ఈ క్రమంలో అసలు సంఘటన ఎలా జరిగింది? అన్న విషయాన్ని నిర్థారించేందుకు స్వయంగా తానే ట్యాంక్‌పైకి ఎక్కారు. లెక్కల మాస్టారుగా.. అనంతరం విద్యార్థులతో కొద్దిసేపు మాట్లాడిన సబ్ కలెక్టర్ వారికి గణిత బోధన చేయడంతోపాటు సహపంక్తి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. సబ్ కలెక్టర్ వెంట డీఈఓ తాహెరా సుల్తానా, తహసీల్దార్ చంద్రశేఖర్, ఎంఈఓ బాలాజి, డెప్యూటీ తహసీల్దార్ రిబ్కా రాణి, ఎస్హెచ్ఓ కనకారావు ఉన్నారు. చదవండి: (సాగునీటి ప్రాజెక్టులపై సీఎం జగన్ సమీక్ష) -
Butterfly Park: కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌కు మణిమకుటం
వర్షాకాలం వచ్చిందంటే వాన జల్లులు, పిల్లకాలువల పరవళ్లతో పాటు పచ్చదనం వెల్లివిరుస్తుంది. అలాగే మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఎగిరే పూలు.. అదేనండీ సీతాకోక చిలుకలు వర్ణాల మేళవింపుతో కనువిందు చేస్తాయి. వీటిని చూసి ఆనందపడని హృదయం ఉండదంటే అతిశయోక్తి కాదు. ఒక సీతాకోక చిలుకను కనిపిస్తేనే తదేకంగా చూస్తూ ఉండిపోతాం.. అలాంటిది వందల సంఖ్యలో పలు రకాల సీతాకోక చిలుకలు రెక్కలు విప్పుతూ మన చుట్టూ తిరుగుతుంటే.. ఆ అనుభవం వర్ణనాతీతం. ఈ అద్భుతం కృష్ణా జిల్లాలో త్వరలోనే ఆవిష్కృతం కానుంది. ప్రభుత్వం అటవీ శాఖ ఆధ్వర్యంలో సీతాకోకచిలుకల పార్క్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నందిగామ: కృష్ణా జిల్లాలో కొండపల్లి రిజర్వు ఫారెస్ట్ దాదాపు 24 వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో పలు రకాల వన్య ప్రాణులు జీవిస్తున్నాయి. ఇబ్రహీంపట్నం సమీపంలోని మూలపాడు వద్ద 63 రకాల సీతాకోక చిలుక జాతులున్నట్లు గుర్తించిన అటవీ శాఖాధికారులు వీటి పరిరక్షణ, పునరుత్పత్తిపై దృష్టి పెట్టారు. ఇందుకోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దీంతో ఈ ప్రాంతానికే మణిహారంగా నిలిచేలా సీతాకోక చిలుకల పార్క్ అభివృద్ధికి సర్కారు పూనుకుంది. కేవలం సీతాకోక చిలుకల జాతిని పరిరక్షించడమే కాకుండా పెద్ద పార్క్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఈ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. అడుగడుగునా ఆకట్టుకునేలా...! 65వ నంబరు జాతీయ రహదారిపై ఇబ్రహీంపట్నం మండలం, మూలపాడు గ్రామం వద్ద నుంచి మూడు కిలోమీటర్లు లోపలకు వెళ్తే.. ఈ పార్క్‌ను చేరుకోవచ్చు. పార్క్‌కు వెళ్లే దారి ప్రారంభం నుంచి పార్క్ గేట్ వరకు సీతాకోక చిలుకల్లోని రకాలు, వాటి ప్రాముఖ్యతలు, ప్రకృతికి అవి చేసే మేలు, వాటి జాతులు... ఇలా అన్ని వివరాలతో కూడిన బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ ద్వారాన్ని తీర్చి దిద్దిన తీరు అమోఘం అని చెప్పక తప్పదు. అదేవిధంగా చిన్నారులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా సీతాకోక చిలుకల ఆకారంలోనే ఏర్పాటుచేసిన బల్లలు కూడా ఎంతో అందంగా కన్పిస్తాయి. చివరకు గార్డెనింగ్ కూడా సీతాకోక చిలుక ఆకారంలోనే ఏర్పాటుచేయడం ప్రత్యేకతను సంతరించుకుంటుంది. సీతాకోక చిలుకల పరిరక్షణే ధ్యేయం.. ఈ ప్రాంతంలో ఉన్న 63 రకాల సీతాకోక చిలుకలను పరిరక్షించడమే ధ్యేయంగా అటవీ శాఖాధికారులు పనిచేస్తున్నారు. ఇందులో భాగంగా అవి ఎక్కువగా ఇష్టపడి మకరందాన్ని గ్రోలే పుష్ప జాతులను పెంచుతున్నారు. జూలై నుంచి అక్టోబర్ మాసాల్లో వర్షా కాలం సీజన్లో వీటి పునరుత్పత్తి జరుగుతుంది. అప్పటికి పార్క్‌ను సిద్ధం చేయాలని అటవీ శాఖాధికారులు లక్ష్యం నిర్దేశించుకున్నారు. ముఖ్యంగా మన రాష్ట్రంలో విశాఖపట్నం తర్వాత అతి పెద్ద సీతాకోక చిలుకల పార్క్‌గా ఇది నిలుస్తుందని అటవీ శాఖాధికారులు చెబుతున్నారు. అదనపు ఆకర్షణగా ట్రెకింగ్.. ప్రస్తుతం ట్రెకింగ్‌కు మంచి క్రేజ్ ఉంది. చిన్నారులు మొదలుకొని వృద్ధుల వరకు చాలా మంది దీనిపై ఆసక్తి కనబరుస్తున్నారు. సీతాకోక చిలుక పార్క్‌కు సమీపంలోనే ట్రెకింగ్ కూడా ఉండటం అదనపు ఆకర్షణగా చెప్పవచ్చు. మొత్తానికి అతి త్వరలోనే జిల్లా వాసులకు ఓ మంచి ఆహ్లాదకరమైన, రమణీయమైన పార్క్ అందుబాటులోకి రానుంది. జూ పార్క్ ఏర్పాటుకు సైతం ప్రయత్నాలు.. కొండపల్లి రిజర్వు ఫారెస్ట్ ఎంతో అందమైన ప్రాంతం. అందులో సీతాకోక చిలుకల పార్క్ ఏర్పాటుచేయడం ద్వారా మరింత శోభ సమకూరనుంది. ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో సీతాకోక చిలుకలు ప్రధాన భూమిక పోషిస్తాయి. అటువంటి వాటిని పరిరక్షించుకోవడంతోపాటు ప్రజలకు ఆహ్లాదాన్ని పంచడం కోసం ఈ పార్క్ ఉపయోగపడుతుంది. దీనికి అదనంగా మినీ జూ పార్క్ ఏర్పాటు చేసేందుకు సైతం ప్రయత్నిస్తున్నాం. – బి.లెనిన్కుమార్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్, కొండపల్లి సెక్షన్ -
కృష్ణా: నందిగామలో ఎడతెరిపిలేని వర్షాలు
-
రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా..
సాక్షి, నందిగామ: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురు మహిళా కూలీలను వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొనడంతో వారు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రం శివారులో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. శంషాబాద్ మండలం మదన్‌పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పాత తండాకు చెందిన వరాత్య సక్కు (28), వర్త్యా లల్లీ (29)తోపాటు అదే తండాకు చెందిన ఘోరీ, అదే మండలం హల్లీకల్ తండాకు చెందిన పాత్లవత్ అరుణ (40)లు నందిగామ శివారులోని ఓ వెంచర్లో కూలీలుగా పనిచేస్తున్నారు. మంగళవారం సాయంత్రం సక్కు, లల్లీ, అరుణ కూలి పనులు ముగించుకొని తండాకు వెళ్లేందుకు బయలుదేరారు. నందిగామ శివారులోని మేకగూడ చౌరస్తా వద్ద ఉన్న అండర్‌పాస్ బ్రిడ్జి సమీపంలోకి వారు రాగానే వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అరుణ, సక్కు, లల్లీ అక్కడికక్కడే దుర్మణం చెందారు. వారిని ఢీకొట్టిన కారు కొంతదూరం వెళ్లి ఆగిపోవడంతో కారులోని వ్యక్తులు పరారయ్యారు. ప్రమాద వార్త తెలియగానే ఇన్స్పెక్టర్ రామయ్య, ట్రాఫిక్ ఎస్సై రఘు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాలను షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కారులో నల్ల దుస్తులు ధరించిన డ్రైవర్‌తోపాటు వెనుక సీట్లో ముగ్గురు కూర్చొని ఉన్నట్లు సీసీ కెమెరాలో రికార్డయిందని ఇన్స్పెక్టర్ రామయ్య తెలిపారు. పింఛన్ కోసం వెళ్లి ప్రాణాలు కాపాడుకున్న మహిళ.. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ముగ్గురు మహిళలతోపాటు మరో మహిళ ఘోరి కూడా రోజూలాగే వారితో కలసి ఇంటికి తిరిగి వెళ్లేది. మంగళవారం పింఛన్ ఇస్తారని తెలిసి ముందు గానే తండాకు వెళ్లిపోయింది. దీంతో మిగిలిన ముగ్గురు 6 గంటలకు బయలుదేరి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. విషయం తెలిసిన వెంటనే అక్కడికి వచ్చిన ఘోరి... సాయంత్రం వరకు తనతో కలసిమెలసి ఉన్న ముగ్గురు మృతిచెందడంతో గుండెలవిసేలా రోదించింది. ( చదవండి: ఆదమరచి నిద్రిస్తున్న వారిని.. అతి కిరాతకంగా.. ) -
మటన్ కొంటే హెల్మెట్ ఉచితం!
సాక్షి, నందిగామ: కోవిడ్–19 (కరోనా వైరస్) దెబ్బకు తెలుగు రాష్ట్రాల్లో చికెన్, మటన్ కొనుగోళ్లు ఒక్కసారిగా తగ్గిపోయాయి. దీంతో కొందరు వ్యాపారులు వారి ఆలోచనలకు పదునుపెట్టి ఆఫర్లు గుప్పిస్తూ వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. ఇదే తరహాలో కృష్ణాజిల్లా నందిగామ పట్టణంలోని పాతబస్టాండ్ ప్రాంతానికి చెందిన ఓ మాంసం వ్యాపారి ‘5 కేజీల మటన్ కొన్న వారికి హెల్మెట్ ఉచితం’ అంటూ ఆదివారం ప్రత్యేక ఆఫర్ ప్రకటించాడు. దీంతో అతని వద్ద విక్రయాలు జోరుగా సాగాయి. (చదవండి: ఉచితంగా 2 వేల ఐఫోన్ల పంపిణీ!) కాగా, కోవిడ్–19కు చికెన్‌కు సంబంధం లేదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చికెన్, గుడ్లతో ఈ వైరస్ సోకుతోందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని పౌల్ట్రీ ఫెడరేషన్ ఖండించింది. చికన్, గుడ్లు కారణంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందదని తెలిపింది. (చదవండి: ‘కోవిడ్’.. చికెన్‌తో నో డేంజర్!) -
మన ఆధ్యాత్మికత ప్రపంచానికి బహుమతి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఆందోళనలు, అనిశ్చితి, అభద్రతాభావం, శత్రుత్వా లతో నిండిన ప్రపంచంలో రామ చంద్ర మిషన్ వంటి సంస్థల బాధ్య తలు చాలా రెట్లు పెరిగాయని రాష్ట్ర పతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. కాన్హా శాంతివనం సంపూర్ణ జీవనానికి నమూనా వంటిదని ప్రశంసించారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఏర్పాటు చేసిన ఈ ధ్యాన కేంద్రం ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి గొప్ప ప్రదేశమని కొనియాడారు. ప్రపంచ వ్యాప్తంగా 150కి పైగా దేశాల్లో విస్తరించిన ఈ మిషన్ బలమైన ఆధ్యాత్మిక శక్తిగా మారిందని చెప్పారు. రామచంద్ర మిషన్ వ్యక్తిగత, సామాజిక మార్పును ప్రోత్సహిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. రాజయోగ ధ్యానా నికి గల ప్రాచీన సంప్ర దాయాన్ని ఆధునిక ప్రపంచంలో మిషన్ ప్రోత్సహిస్తోందన్నారు. భారత ఆధ్యాత్మికత ప్రపంచానికి అత్యంత విలువైన బహుమతి వంటిదన్నారు. నంది గామ మండలంలోని కాన్హా శాంతివనాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులు ఆదివారం సందర్శించారు. వనం గ్లోబల్ హెడ్‌క్వార్టర్‌ని రాష్ట్రపతి ప్రారంభించారు. మిషన్ స్థాపించి 75 వసంతాలు పూర్తి చేసు కున్న సందర్భంగా ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ధ్యాన కేంద్రాన్ని ఇక్కడ నిర్మించారు. ఇక్కడ నిర్వాహకులు 5 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా చివరి మొక్కను రాష్ట్ర పతి నాటి కేంద్రాన్ని పరిశీలించారు. అనంత రం అభ్యాసీలను ఉద్దేశించి ప్రసంగించారు. మహిళలు, రైతులు, చేతి వృత్తిదారులు, ప్రయోజనాలకు చేపట్టిన కార్యకలాపాలు, పర్యావరణం, జీవవైవిధ్య పరిరక్షణకు తీసు కుంటున్న చర్యలు ప్రశంసనీయమని, 5 లక్షల మొక్కలతో ఈ క్యాంపస్ ఆకు పచ్చని పరిసరాలతో అలరారుతోందన్నారు. సమున్నతులుగా తీర్చిదిద్దడానికి.. తమను తాము సమున్నతులుగా తీర్చిదిద్దు కోవాలన్న వారి కోరికను ఈ మిషన్ నెరవే ర్చుతుందని రాష్ట్రపతి తెలిపారు. మిషన్‌కు చెందిన అంతర్జాతీయ సమాజం భూమండ లాన్ని మెరుగైన ప్రాంతంగా తీర్చిదిద్దగలదని ఆకాంక్షించారు. సంతోషం, సంపూర్ణ సాను కూల శక్తియుక్తులతో అలరారే దిశగా మాన వాళిని పరివర్తన చెందించగలదన్న విశ్వా సాన్ని వెలిబుచ్చారు. ‘దాజీ వివరించిన ‘డిజై నింగ్ డెస్టినీ’లోని 5 సూత్రాలలో ఒకదాన్ని ఇక్కడ తప్పక నేను ప్రస్తావించాలి. మాన వత్వ గమ్యాన్ని రూపొందించాలి. ఇది మొదటగా మనతోనే ప్రారంభంకావాలి. ఆ తర్వాత ఇతరులకు విస్తరించాలి. అందరం కలిసి పనిచేస్తే మానవత్వ దిశను మార్చేం దుకు ఒకరోజు కచ్చితంగా వస్తుంది. ఇందుకు యువత సహకారం తీసుకుని మెరుగైన ప్రపంచాన్ని నిర్మించే ప్రయత్నాల్లో వారిని నిమగ్నం చేయాలి’అని పిలుపు నిచ్చారు. శాంతివనం.. ఓర్పుకు నిదర్శనం కాన్హా శాంతివనం మానవ ఓర్పుకు నిదర్శ నమని గురూజీ కమ్లేష్ డీ పటేల్(దాజీ) అన్నారు. ఐదేళ్లలో శాంతివనంలో ప్రపంచం లోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం నిర్మించడం వేలాది మంది అభ్యాసీకుల నిరంతర కృషి తోనే సాధ్యపడిందన్నారు. 1,400 ఎకరాల్లో శాంతి వనంలో నిర్మించిన ఐకానిక్ ధ్యాన కేంద్రం మానవాళి పరివర్తనకు కేంద్రంగా రూపాంతరం చెందుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 75 వసంతాలు పూర్తి చేసు కున్న సందర్భంగా ధ్యాన శిబిరాలను గత నెల 28 నుంచి ఈ నెల 9 వరకు 3 విడతలుగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్లు తమిళిసై, బండారు దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రపతికి ఘన వీడ్కోలు.. హైదరాబాద్ పర్యటన ముగించుకుని ఢిల్లీ బయలుదేరిన రాష్ట్రపతి కోవింద్‌కు బేగంపేట విమానాశ్రయంలో గవ ర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు ఘనంగా వీడ్కోలు పలికారు. -
కాన్హా శాంతివనాన్ని సందర్శించిన రాష్ట్రపతి
సాక్షి, హైదరాబాద్ : వ్యక్తిగత, సామాజిక పరివర్తనకు రామచంద్ర మిషన్ కృషి చేస్తోందని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని రామచంద్ర మిషన్ 75 వ వార్షికోత్సవ ఉత్సవాలకు రామ్‌నాథ్ కోవింద్ ఆదివారం హాజరయ్యారు. కాన్హా శాంతివనంలోని ధ్యాన కేంద్రాన్ని ఆయన హార్ట్ఫుల్నెస్ సంస్థ గ్లోబల్ హెడ్ క్వార్టర్‌గా ప్రకటించారు. దాదాపు 1,400 ఎకరాల్లో విస్తరించి ఉన్న కాన్హా శాంతివనాన్ని రాష్ట్రపతి గతంలో ఒకసారి సందర్శించారు. ప్రపంచంలోని 130 దేశాల్లో విస్తరించి ఉన్న కాన్హా ఆశ్రమానికి సంబంధించి అయిదు వేలకు పైగా ధ్యాన కేంద్రాలు ఉన్నాయి. వీటిలో అన్నింటికన్నా మిన్నగా నిర్మించిన కాన్హా శాంతివనాన్ని గ్లోబల్ హెడ్ క్వార్టర్‌గా రాష్ట్రపతి ప్రకటన చేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యాన మందిరంగా పేరుపొందిన దీనిలో ఒకేసారి లక్షమంది ధ్యానం చేసుకునేలా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి కోవింద్, గవర్నర్లు తమిళిసై సౌందరరాజన్, దత్తాత్రేయను రామచంద్ర మిషన్ చైర్మన్ దాజీ కమలేష్ పటేల్ ఘనంగా సన్మానించారు. కాగా ఆదివారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి రాష్ట్రపతి దంపతులు హెలికాప్టర్ ద్వారా కాన్హా ఆశ్రమానికి చేరుకున్నారు. సుమారు రెండు గంటల పాటు ఆయన కాన్హాలో గడిపారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళసై సౌందరరాజన్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, మహబూబ్ నగర్ కలెక్టర్ రొనాల్డ్ రాస్ తదితరులు పాల్గొన్నారు. (అతిపెద్ద ధ్యాన కేంద్రం ప్రారంభం) -
అతిపెద్ద ధ్యాన కేంద్రం ప్రారంభం నేడు
నందిగామ: ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. హార్ట్ఫుల్నెస్ సంస్థ గురూజీ కమ్లేశ్ డీ పటేల్ (దాజీ) మంగళవారం ఉదయం 11 గంటలకు ఈ ధ్యాన కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవానికి ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం కోసం సోమవారం ఉదయం నుంచే పలు దేశాల నుంచి అభ్యాసీలు తరలివస్తున్నారు. హైదరాబాద్ జంట నగరాల్లోని అన్ని డిపోల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. -
నందిగామలో ట్రాక్టర్ బోల్తా.. ముగ్గురు మృతి
సాక్షి, కృష్ణా : జిల్లాలోని నందిగామ మండలం జొన్నలగడ్డలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జొన్నలగడ్డ వద్ద 25 మంది కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడినవారిని నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కూలీలు ఖమ్మం జిల్లా మధిరకు పనికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కూలీలు ప్రయాణిస్తున్న టాక్టర్.. ఆటోను తప్పించే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. అతివేగం వల్లే ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న నందిగామ ఎమ్మెల్యే.. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. -
లారీని ఢీకొట్టిన కారు; నలుగురు మృతి
సాక్షి, నందిగామ : కృష్ణా జిల్లా నందిగామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం లారీని కారు ఢీ కొన్న ఘటనలో నలుగురు మృతిచెందారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. నందిగామ నుంచి నలుగురు యువకులు కారులో(ఏపీ16డీబీ 5587) విజయవాడకు బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న కారు అంబార్‌పేటకు చేరుకోగానే అతివేగంతో డీసీఎంను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు ఘటన స్థలంలోనే మృతిచెందారు. మరో యువకుడు ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. మృతులను నందిగామకు చెందిన దుర్గా, మనోజ్, అరవింద్, అనిల్‌గా గుర్తించారు. కాగా, ప్రమాద సమయంలో కారు 120 కి.మీ వేగంతో వెళ్తుంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ఏపీలో తొలి జీరో ఎఫ్ఐఆర్ నమోదు
సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లానందిగామ పరిధిలో మొట్ట మొదటి జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. తమ పరిధిలోకి రానప్పటికీ బాధితులు ఫిర్యాదులు చేస్తే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.. మొదటిసారిగా బాలుడి మిస్సింగ్ కేసు సంబంధించి కంచికచర్ల పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కంచికచర్ల పీఎస్ పరిధి కాకపోయినా కేసు నమోదు చేసిన పోలీసులు రెండు బృందాలతో బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మిర్యాలగూడ మండలం వీరంపాడులో బాలుడిని గుర్తించిన పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. (చదవండి: ఏపీ పోలీసుల సంచలన నిర్ణయం) -
నందిగామలో రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్లు
సాక్షి, నందిగామ: కృష్ణా జిల్లా నందిగామలో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు. భవన నిర్మాణం కార్మికుల సంఘం ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి కార్మికులతో కలిసి ర్యాలీగా వెళుతుండగా.. టీడీపీ నేత ఏచూరి రాము వారిని సన్మానించారు. ఈ సందర్భంగా ఇది తెలుగుదేశం పార్టీ విజయమని ఏచూరి రాము ప్రసంగించారు. అయితే ఇది తప్పు అని వైఎస్సార్సీపీ కార్యకర్త ఖాజా ఏచూరి రాము ప్రసంగాన్ని ఖండించారు. అవమానంగా భావించిన టీడీపీ నేత రాము తన అనుచరులతో ఖాజాపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఖాజా కాలికి గాయాలలయ్యాయి. అతడ్ని నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
సింధు హరితహారం
నందిగామ: రంగారెడ్డి జిల్లా నందిగామ మండల పరిధిలోని కాన్హా శాంతివనంలో రామచంద్ర మిషన్ గురూజీ కమ్లేష్ డీ పాటిల్ జన్మదినం సందర్భంగా శనివారం హరితహారం నిర్వహించారు. ఆశ్రమంలో కమ్లేష్, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు మొక్కలు నాటారు. శాంతివనం నర్సరీ నిర్వాహకులు శరవణన్ మాట్లాడుతూ.. గురూజీ జన్మదినం సందర్భంగా శనివారం దేశవ్యాప్తంగా 64 నగరాల్లో 64 వేల మొక్కలు నాటినట్లు తెలిపారు. -
ప్రియుడి ఇంటి ఎదుట యువతి ఆందోళన
సాక్షి, విజయవాడ(నందిగామ) : ఒంటరిగా ఉంటున్న మహిళను యువకుడు మాయ మాటలు చెప్పి లోబర్చుకుని గర్భవతిని చేసి ముఖం చాటేయటంతో బాధిత మహిళ బంధువులతో కలసి ప్రియుడి ఇంటి ముందు నిరసన చేపట్టిన ఘటన మండలంలో గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలోని వెల్లంకి గ్రామానికి చెందిన తోట లక్ష్మీప్రసన్నకు మూడేళ్ల క్రితం కంచికచర్ల పట్టణానికి చెందిన యువకుడితో వివాహమైంది. ఇద్దరి మధ్య విబేధాలు రావటంతో విడిపోయి వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో వెల్లంకి గ్రామానికి చెందిన షేక్ సలీం ఆమెకు దగ్గరయ్యాడు. వీరిరువురు కుటుంబ సభ్యులకు తెలియకుండా సుమారు రెండేళ్ల నుంచి ఇబ్రహీంపట్నంలో సహజీవనం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న సలీం కుటుంబ సభ్యులు అతడిని స్వగ్రామానికి తీసుకొచ్చారు. ఆ తరువాత కూడా కుటుంబ సభ్యులకు తెలియకుండా ఇబ్రహీంపట్నంలో ఉన్న ఆమెతో సంబంధం సాగించాడని మహిళ చెబుతోంది. ప్రస్తుతం ఆరు నెలల గర్భివతినని న్యాయం చేయాలని మహిళ కోరుతోంది. విషయం తెలుసుకున్న ఎస్ఐ రామగణేష్ గ్రామానికి చేరుకుని మహిళ, బంధువులతో మాట్లాడి అక్కడి నుంచి పంపించివేశారు. -
నూతన ఇసుక రీచ్‌ను ప్రారంభించిన మంత్రి
సాక్షి, కృష్ణా: నందిగామలో చెవిటికల్లు ప్రాంతంలో ఇసుకరీచ్, ఇసుక నిల్వ అమ్మక కేంద్రాన్ని పంచాయతీ రాజ్, గనుల శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇసుక మాఫియాకు కళ్లెం వేసేలా నూతన ఇసుక విధానం తీసుకువచ్చామన్నారు. వినియోగదారులకు ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. స్టాక్ యార్డ్‌లో లోడింగ్‌తో కలిపి టన్ను ఇసుక రూ.375 గా నిర్ణయించామన్నారు. 13 జిల్లాల్లో 41 స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేశామని తెలిపారు. అక్టోబర్ నాటికి 70 నుంచి 80 వరకు స్టాక్ పాయింట్లను అందుబాటులోకి తెస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు డాక్టర్ మొండితోక జగన్మోహన్రావు, సామినేని ఉదయభాను, వసంత కృష్ణప్రసాద్, ఏపీ ఎండీసీ అధికారులు పాల్గొన్నారు. -
విద్యా‘వ్యాపారం’..!
సాక్షి, వత్సవాయి : విద్యార్థులకు కార్పొరేట్ విద్యనందిస్తామని ప్రకటనలు గుప్పించి విద్యార్థులకు వల వేస్తున్న ప్రైవేటు పాఠశాలల్లో అంతా వ్యాపారమే సాగుతుంది. పుస్తకాల దగ్గర నుంచి విద్యార్థులకు కావాల్సిన అన్ని వస్తువులను పాఠశాలల్లోనే ఉంచి అమ్మకాలు సాగిస్తున్నారు. టెస్టు, నోట్ పుస్తకాల ధరలతో విద్యార్థుల తల్లిదండ్రులు బెంబేతెత్తుతున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులందరూ సంబంధిత పాఠశాలల్లోనే పుస్తకాలు కొనాలని షరతులు పెట్టడంతో ప్రైవేటు పాఠశాలల్లో పుస్తకాల వ్యాపారం జోరుగా సాగుతుంది. పాఠశాలల్లో చదివే విద్యార్థులు బహిరంగ మార్కెట్లో పుస్తకాలు కొనుగోలు చేయరాదని పాఠశాల యాజమాన్యం ఆదేశాలు జారీచేస్తున్నారని తల్లితండ్రులు చెబుతున్నారు. చేసిదిలేక రెట్టింపు రేట్లకే పాఠశాలల్లో పుస్తకాలు కొనుగోలు చేయవల్సివస్తుంది. పాఠ్య పుస్తకాల విక్రయాలకు పాఠశాలలు అడ్డాగా మారాయి. బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్న టెస్టు, నోట్ పుస్తకాలకు పాఠశాలల్లో విక్రయిస్తున్న వాటికి పొంతన ఉండడం లేదు. ఎంఆర్పీ ధరల కంటే ఎక్కువ శాతానికి పాఠశాలల్లో విక్రయిస్తున్నట్లు చెబుతున్నారు. నోట్ పుస్తకాలపై సంబంధిత పాఠశాల పేరు ఉంటుందని బహిరంగ మార్కెట్లో లభించే నోట్ పుస్తకాలను వినియోగించరాదని ఆంక్షలు విధిస్తున్నారు. అన్ని పాఠశాలల్లోనే.. విద్యార్థులు వేసుకునే యూనిఫాం నుంచి టైలు, బెల్టులు, ఐడెండిటీ కార్డులు, టెస్టు, నోట్ పుస్తకాలు అన్ని పాఠశాలలోనే కొనాలని షరతులు పెడుతున్నారు. బహిరంగ మార్కెట్లో కొన్న యూనిఫాంను, పుస్తకాలను అనుమతించేదిలేదని పాఠశాల యాజమాన్యం తల్లితండ్రులకు చెబుతున్నారు. మరికొన్ని పాఠశాలల నిర్వాహకులు మార్కెట్లో తమకు అనుకూలంగా ఉన్న షాపులను సిఫారసు చేస్తున్నారు. ఒకటో తరగతి నుంచి ఐదవ తరగతి వరకు నోట్, టెస్టు పుస్తకాలు 2 వేల నుంచి 5 వేల వరకు ఖర్చువుతున్నాయి. ఇక ఫీజులు, యూనిఫాం, తదితరలు ఖర్చులు కళ్లు బైర్లు కమ్మేటట్లు ఉన్నాయి. పట్టించుకోని అధికారులు ప్రైవేటు పాఠశాలల్లో వసతులు లేకపోయినా విద్యాశాఖాధికారులు పట్టించుకోవడంలేదు. పాఠశాలల్లో విశాలమైన తరగతి గదులతోపాటు గాలి వెలుతురు సక్రమంగా వచ్చేటట్లు ఉండాలి. ప్యాన్లు, లైట్లు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, ఆహాద్లకరమైన క్రీడాప్రాంగణం వంటి వసతులు ఉండాలి. కానీ ఇటువంటి వసతులు ఎక్కడా కనపడడంలేదు. ఇరుకుగదులు, రేకులషెడ్లు, చిన్నపాటి భవనాల్లో నడుస్తున్నాయి. ఇక క్రీడాప్రాంగణం ఎక్కడ ఉంటుందో కూడా విద్యార్థులకు తెలియదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇరుకుగదుల్లోనే ఉంటున్నారు. కానీ ఫీజులు విషయంలో మాత్రం ఎక్కడా రాజీపడరు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులకే సంవత్సరానికి రూ. 15 వేల వరకు ఖర్చు చేయవల్సివస్తుంది. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రైవేటు పాఠశాలలోను పేద విద్యార్థులకు 25 శాతం మేర సీట్లు కేటాయించాల్సి ఉండగా అది ఏ పాఠశాలలలోను కనపడడంలేదు. విద్యాశాఖాధికారులు సమగ్రం గా తనిఖీలు నిర్వహిస్తే చాలా పాఠశాలలలు మూ సివేయాల్సి వస్తుందనడంలో సందేహం లేదు. -
బాబు డ్రమాలు కుట్రలు నమ్మితే రాక్షసిని నమ్మినట్టే
-
మరోసారి బాబుకు ఓటేస్తే ఎవ్వరినీ బతకనివ్వరు
-
బాబుకు ఓటేస్తే అన్నీ నారాయణ స్కూళ్లే: వైఎస్ జగన్
నందిగామ(కృష్ణా జిల్లా): వైఎస్సార్ హయాంలో సుబాబుల్ పంట టన్నుకు రూ.4,400 ధర లభించేదని, చంద్రబాబు పాలనలో సుబాబుల్ పంట టన్నుకు కనీసం రూ.2500 కూడా లభించడం లేదని వైఎస్సార్సీపీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా జిల్లా నందిగామలో వైఎస్ జగన్ ప్రసగించారు. బాబు పాలనలో రైతులకు గిట్టుబాటు ధరలు లేక ఆవేదన చెందుతున్నారని, అగ్రిగోల్డ్ బాధితులు ఎక్కువగా ఉన్న ప్రాంతం నందిగామ నియోజకవర్గమని, బాధితులకు న్యాయం జరగకపోగా.. అగ్రిగోల్డ్ ఆస్తుల్ని చంద్రబాబు, లోకేష్, ఆయన బినామీలు దోచుకున్నారని ఆరోపించారు. బాబుకు ఓటేస్తే ప్రభుత్వ స్కూళ్లు ఉండవ్.. అన్నీ నారాయణ స్కూళ్లే చంద్రబాబుకు పొరపాటున ఓటేస్తే రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్లన్నీ మూతపడతాయనీ, ఇదివరకే 6 వేల ప్రభుత్వ స్కూళ్లు మూసేశారని, ఇకపై ఉన్న నాలుగు స్కూళ్లూ కూడా మూసేస్తారని అన్నారు. ఆ స్కూళ్ల స్థానంలో నారాయణ స్కూళ్లు వస్తాయని, ఆ స్కూళ్లలో ఇప్పుడు ఎల్కేజీ చదవడానికి రూ.25 వేలు వసూలు చేస్తున్నారని, బాబు అధికారంలోకి వస్తే ఫీజు రూ.లక్షకు పెంచుతారని విమర్శించారు. కాలేజీ చదువులకు తల్లిదండ్రులు ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ప్రస్తుతం దాపురించిందని అన్నారు. భూరికార్డులు తారుమారు చంద్రబాబు నాయుడికి ఒక్కసారి ఓటేసినందుకు భూసేకరణ చట్టాన్ని పూర్తిగా సవరించారని, అలాగే భూరికార్డులను పూర్తిగా తారుమారు చేశారని అన్నారు. మరోసారి బాబుకు ఓటేస్తే మీకు భూములుండవని ప్రజలను అప్రమత్తం చేశారు. ఇప్పుడు లారీ ఇసుక రూ.40 వేలు పలుకుతోందని, మరోసారి బాబుకు ఓటేస్తే లారీ ఇసుక రూ. లక్షకు చేరడం ఖాయమన్నారు. ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ, 108, 104, ఫీజురీయింబర్స్‌మెంట్ పథకాలన్నీ చంద్రబాబు పెట్టిన పథకాలు కాదు కాబట్టి క్రమ క్రమంగా తీసేస్తారని వైఎస్ జగన్ అన్నారు. మరోసారి ఓటేస్తే ఎవ్వరినీ బతకనివ్వరు చంద్రబాబుకు మరోసారి ఓటేస్తే తనను వ్యతిరేకించే ఎవ్వరినీ బతకనివ్వరని, మీ బంధువులను చంపి ఆ నేరాన్ని మీపైనే నెడతారని అన్నారు. చంద్రబాబుకు ఓటేస్తే స్కేల్ ఆఫ్ పైనాన్స్ పేరుతో బ్యాంకుల నుంచి వచ్చే రుణాలకు పూర్తిగా కటింగ్ పెడతారని ఆరోపించారు. బాబు అధికారంలో ఉన్న ఈ ఐదేళ్లలో ఆర్టీసీ, కరెంటు చార్జీలు ఎంత దారుణంగా పెంచారో అందరికీ తెలుసునని అన్నారు. బాబు గత చరిత్ర ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి.. 1994లో సంపూర్ణ మద్య నిషేదం, కిలో రూ.2 లకే బియ్యం ఇస్తామని టీడీపీ మేనిఫెస్టోలో పెట్టారు. ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చాక బియ్యం ధర రూ. 2 నుంచి ఐదున్నరకు పోయింది. మద్య నిషేధం చేయకుండా కొత్తగా మద్యం షాపులు వెలిశాయని అప్పటి విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన రేషన్ కార్డులు, పెన్షన్ ఎన్నికలు ముగియగానే చంద్రబాబు వెనక్కిలాగేసుకుంటారని ఆరోపించారు. బాబు వాగ్దానాలు ఒక్కసారి గమనించండి ఎన్నికలకు మూడు నెలల ముందు చంద్రబాబు నాయుడు చేస్తోన్న పనులు, వాగ్దానాలు ఒక్కసారి గమనించాలని ప్రజలను కోరారు. ఎన్నికల రాకపోయి ఉంటే అంతకు ముందున్న రూ.1000 పింఛన్ రూ.2 వేలకు పెంచేవాడా అని ప్రశ్నించారు. పైపెచ్చు ఎన్నికలయ్యాక రూ.3 వేలు ఇస్తానంటూ ఓటర్లను మభ్యపెడుతున్నారని విమర్శించారు. బాబు వస్తే వాళ్ల జాబులు, ప్రమోషన్లు పోతాయ్ చంద్రబాబు అధికారంలోకి వస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు జాబులు రావని అన్నారు. బీసీలకు ప్రమోషన్లు ఇవ్వవద్దంటూ పై అధికారులకు, కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు లేఖలు రాసిన విషయాన్ని గుర్తు చేశారు. బాబుకు ఓటేసి ఒకసారి మోసపోయాం.. మరోసారి ఓటేసి మోసపోవద్దని ప్రజలను కోరారు. విశ్వసనీయతకు ఓటేయాలని విన్నవించారు. పిల్లల్ని బడికి పంపిస్తే ప్రతి కుటుంబానికి రూ.15 వేలు చంద్రబాబు ఇచ్చే మూడు వేల రూపాయలకు మోసపోకండని గ్రామాల్లోని అక్కాచెల్లమ్మలకు, అవ్వ తాతలకు చెప్పాలని కోరారు. 14 రోజులు ఓపిక పట్టమని చెప్పండి.. మన పిల్లలను బడికి పంపిస్తే చాలు అన్న ఏటా రూ. 15 వేల రూపాయలు ఇస్తాడని ప్రతి అక్కాచెల్లమ్మకు చెప్పండి.. ఏ చదువైనా అన్న చదివిస్తాడని.. ఎన్ని లక్షలైనా కూడా భరిస్తాడని ప్రతి ఇంట్లో చెప్పండి. గతంలో డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు వచ్చేవి. ఇప్పుడు అది కనిపించని పరిస్థితి. ఎన్నికల తేదీ వరకు ఎంతైతే అప్పు ఉంటుందో ఆ మొత్తాన్ని నాలుగు దఫాలుగా మీ చేతికే అందిస్తాం. అంతేకాకుండా మళ్లీ బ్యాంకుల వద్ద నుంచి సున్నా వడ్డీకే రుణాలు వస్తాయని చెప్పండి. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలకు వైఎస్సార్ చేయూత కింద 75 వేల రూపాయలు నాలుగు దఫాలుగా చెల్లిస్తామన్నారు. అలాగే ప్రతి రైతన్నకు మే నెలలోనే 12,500 రూపాయలు ఇస్తామని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నందిగామ ఎమ్మెల్యే అభ్యర్థి మొండితోక జగన్మోహన్ రావు, ఎంపీ అభ్యర్థి పొట్టూరి వరప్రసాద్‌లను ఆశీర్వదించాలని కోరారు. -
పోరపాటున బాబుకు ఓటేస్తే పెన్షన్, రేషన్ కార్డు కట్
-
బాబుకు ఓటేస్తే ప్రభుత్వ స్కూళ్లు ఉండవ్.. అన్నీ నారాయణ స్కూళ్లే
-
ప్రజా సంపద కొల్లగొట్టిన టీడీపీ పాలన
సాక్షి, నందిగామ : దౌర్జన్యం చేయడం, దోచుకోవడం తప్ప తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజా సమస్యలు పరిష్కరించటం తెలియదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహన్రావు విమర్శించారు. నందిగామ నగర పంచాయతీ పరిధిలోని 3, 15వ వార్డుల్లో శుక్రవారం ఆయన పార్టీ నాయకులు, కార్యర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డుల్లోని ప్రతి గడపకు వెళ్లి జగన్మోహన్రెడ్డి ప్రకటించిన ‘నవరత్నాలు’ పథకాలను ప్రజలకు వివరిస్తూ, అధికారంలోకి వచ్చిన వెంటనే పథకాలు అమలవుతాయని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జగన్మోహన్రావు మాట్లాడుతూ టీడీపీ ఐదేళ్ల పాలన ప్రజా సంపదను కొల్లగొట్టడంతోనే సరిపోయిందన్నారు. టీడీపీ నేతలను ప్రజలు నిలదీస్తున్నారు తెలుగుదేశం పాలనలో ఘోరంగా విఫలమవడంతో సొంత పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, ప్రభుత్వం అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలపై నిలదీస్తున్నారన్నారు. ప్రతిపక్ష పార్టీల కౌన్సిల్ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డులను అభివృద్ధి చేయడంలో పక్షపాత వైఖరి అవలంబించారని మండిపడ్డారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి ఒక్క అవకాశమివ్వాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో పార్టీ పలు విభాగాల కన్వీనర్లు, కార్యదర్శులు కత్తురోజు శ్రీనివాసాచారి, నెలకుదిటి శివనాగేశ్వరరావు, చల్లా బ్రహ్మేశ్వరరావు (బ్రహ్మం), చిరుమామిళ్ల అశోక్‌బాబు, మంగునూరు కొండారెడ్డి, పసుపులేటి శ్రీనివాసరావు, షేక్ ఖాలిఖ్, కుక్కల సత్యనారాయణ ప్రసాద్, కొండా కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని ఆదరించాలి చందర్లపాడు : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహన్రావు కోరారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సాయంత్రం చందర్లపాడులో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీగా పార్టీ శ్రేణులు హాజరయ్యాయి. గడిచిన 20 ఏళ్లుగా ఈ నియోజకవర్గ ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. మార్పు కోసం ఒక్కసారి తనకు అవకాశం కల్పించాలన్నారు. జననేత అధికారంలోకి వస్తే పార్టీల కతీతంగా సంక్షేమ పథకాలు అందజేస్తామని చెప్పారు. గీతా మందిరం దగ్గర నుంచి మొదలైన ప్రచారం గ్రామంలోని ప్రధాన మార్గాల గుండా సాగింది. ఆయనకు పలు చోట్ల హారతులిచ్చి స్వాగతం పలికారు. ఎంపీపీ కస్తాల రవిబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి కోట బుచ్చయ్యచౌదరి, మండల కన్వీనర్ వెలగపూడి వెంకటేశ్వరరావు, యార్లగడ్డ సత్యనారాయణప్రసాద్, ముక్కపాటి నరసింహారావు పాల్గొన్నారు. -
ఫ్లెక్సీలు కళకళ.. కోడ్ వెలవెల!
సాక్షి, కోనాయపాలెం (చందర్లపాడు) : ఎన్నికల నగారా మోగింది. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. వచ్చే నెల 11న ఎలక్షన్స్ జరగనున్నాయి. అయినప్పటికీ కోనాయపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ బ్యానర్లు దర్శనమిస్తూనే ఉన్నాయి. జెడ్పీటీసీ సభ్యుడు వాసిరెడ్డి ప్రసాద్ ఇంటి ముందు పింఛన్లు, సంక్రాంతి కానుకలతో కూడిన బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. హరిజనవాడలోని వాటర్ ట్యాంకు వద్ద, అంగన్వాడీ కేంద్రం వద్ద తెలుగుదేశం ప్రభుత్వం చేసిన పనుల వివరాల జాబితాను రాశారు. ఎలిమెంటరీ పాఠశాల (చిన్నైస్కూల్) వద్ద చంద్రబాబు, లోకేష్ బొమ్మలతో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు ప్రచార పట్టికలు దర్శనమిస్తున్నాయి. ఇవి గ్రామంలోని జనసమర్థం ఉండే ప్రధాన రహదారుల వెంబడి ఉన్నప్పటికీ అధికారులు వీటిని తొలగించలేదు. ఎన్నికల నియమావళికి లోబడి అధికారులు వ్యవహరిస్తారో లేదో చూడాల్సి ఉంది. ఒత్తిళ్లకు తలొగ్గి వీటిని తొలగించని పక్షంలో సంబంధిత అధికారులపై ఎలక్షన్ కమిషన్‌కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తామని గ్రామస్తులు చెబుతున్నారు. మరి వీటిని తొలగిస్తారో లేదో వేచిచూడాల్సి ఉంది. తోటరావులపాడులో ఇలా.. తోటరావులపాడు గ్రామ ఎంట్రన్స్‌లో హైస్కూల్‌కు వెళ్లే ప్రధాన మార్గానికి ఎన్టీర్ మార్గ్ పేరు పెట్టి పెద్ద ఆర్చిని నిర్మించారు. ఈ ఆర్చికి ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్, తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యేలు దేవినేని వెంకటరమణ, తంగిరాల ప్రభాకరరావు ఫొటోలు ఏర్పాటు చేశారు. ఈ ఫొటోల డూమ్‌లలో లైటింగ్ ఏర్పాటు చేయడంతో పగలు, రాత్రి తేడా లేకుండా కాంతివంతంగా ప్రకాశిస్తున్నాయి. ఏటూరు గ్రామానికి వెళ్లే ఆర్అండ్బీ రహదారి వెంబడే ఈ ఆర్చి ఉండటం విశేషం. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటికీ అధికారులు ఈ ఆర్చికి అమర్చిన టీడీపీ నాయకుల ఫొటోలు కనపడకుండా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం విశేషం. -
పశువుల చోరీ ముఠా అరెస్టు
సాక్షి, నందిగామ: పలు ప్రాంతాల్లో పశువులను అపహరిస్తున్న ఓ దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు వివరాలను మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో షాద్‌నగర్ ఏసీపీ సురేందర్ వివరించారు. కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా ఓంనాబాద్ తాలుకా చుడుగుప్ప గ్రామానికి చెందిన మహమ్మద్ హస్మత్ అలియాస్ హస్మత్, మమమ్మద్ ఇలియాస్ ఖురేషీ అన్నదమ్ముళ్లు. వీరు రాజేంద్రనగర్ మైలార్‌దేవ్‌పల్లి సమీపంలోని షైక్ ఇ మజీద్ సమీపంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వీరికి అదే ప్రాంతానికి చెందిన ఫెరోజ్ ఖాన్, అమీర్ ఖురేషీ పరిచయం అయ్యారు. వీరు నలుగురు కలిసి ఓ ముఠాగా ఏర్పడి పశువులను దొంగిలించడం వృత్తిగా మార్చుకున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని గ్రామాలకు వెలుపల పశువుల పాకల నుంచి రాత్రి సమయాల్లో పశువులను అపహరించి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నారు. అయితే, మండల పరిధిలోని రంగాపూర్‌కు చెందిన శివగల్ల రాములు చెందిన రెండు ఎద్దులను గత జనవరి 18న గుర్తు తెలియని వ్యక్తులు అపహారించుకు పోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం మేకగూడ చౌరస్తా వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా ఈ నలుగురు దొంగలు ఓ వాహనంలో వెళ్తున్నారు. వీరి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో అదుపులోకి తీసుకొని విచారించగా పశువుల చోరీ వివరాలు తెలిపారు. వీరి వద్దనుంచి రూ.3.75 లక్షల నగదు, నాలుగు సెల్ఫోన్లు, మహీంద్రా గ్జైలో కారును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వివిధ ఠాణాల్లో అన్నపై 52, తమ్ముడిపై 42 కేసులు మహ్మద్ హస్మత్‌పై పలు పోలీస్స్టేషన్లలో 52 కేసులు నమోదు అయ్యాయని, అతడి సోదరుడు మహ్మద్ ఇలియాస్‌పై 42 కేసులు నమోదు అయ్యాయని ఏసీపీ సురేందర్ తెలిపారు. వీరిపై నాన్‌బెయిలబుల్ వారెంట్లు సైతం జారీ అయినట్లు వివరించారు. నలుగురు కలిసి ముఠాగా ఏర్పడి వీరు తమ వాహనంలోని మధ్య, వెనుకాల సీట్లు తొలగించి అందులో పశువులను తరలిస్తారని వెల్లడించారు. వీరిపై ఎల్బీనగర్, మీర్‌పేట, రాజేంద్రనగర్, చందానగర్, పటాన్చెరు, షాబాద్, శంకర్పల్లి, నార్సింగి, శంషాబాద్ తదితర ఠాణాల్లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. కేసును చేధించిన షాద్‌నగర్ రూరల్ సీఐ రామకృష్ణ, సీసీఎస్ ఇన్స్పెక్టర్ చంద్రబాబు, నందిగామ ఎస్సై వెంకటేశ్వర్లును ఈ సందర్భంగా ఏసీపీ సురేందర్ ప్రత్యేకంగా అబినందించారు. వీరికి రివార్డు అందజేయనున్నట్లు తెలిపారు. -
నందిగామలో టీడీపీకి షాక్
నందిగామ: కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలో టీడీపీకి షాక్ తగిలింది. జీడీఎంఎం కాలేజీ అధినేత గురవిందపల్లి ప్రసాద్ వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ వి.విజయసాయి రెడ్డి, గురవిందపల్లి ప్రసాద్‌కు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్, నందిగామ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
శిఖాను విచారించనున్న హైదరాబాద్ పోలీసులు
సాక్షి, హైదరాబాద్: ఎక్స్‌ప్రెస్ టీవీ చైర్మన్, కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్ చిగురుపాటి జయరామ్ హత్య కేసు దర్యాప్తును హైదరాబాద్ పోలీసులు ముమ్మరం చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌లోని నందిగామ పోలీసుల నుంచి తెలంగాణలోని హైదరాబాద్ పోలీసులకు ఈ కేసు బదిలీ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు శిఖా చౌదరి ప్రియుడే అని ఏపీ పోలీసులు తేల్చగా.. జయరామ్ భార్య పద్మశ్రీ దానిని ఖండించారు. జయరామ్ మేనకోడలు శిఖా పాత్రే ఈ కేసులో ప్రధానంగా ఉందని.. తన భర్త చావుకు శిఖాయే కారణమని ఆరోపించారు. ఈ నేపథ్యంలో జయరామ్ హత్యకేసును మొదటినుంచి దర్యాప్తు చేయాలని తెలంగాణ పోలీసులు భావిస్తున్నారు. జయరామ్ మామయ్య గుత్తా పిచ్చయ్య ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 419, 342, 346, 348, 302, 201, రెడ్‌విత్ 34 కింద కేసు నమోదు చేసుకున్నారు. ఏపీలో ఉన్న కేసు నిందితులను ఈరోజు హైదరాబాద్‌కు తరలించనున్నారు. హైదరాబాద్ చేరుకున్న అనంతరం శిఖాను పోలీసులు విచారించనున్నారు. (జయరామ్ హత్య కేసు మొదట్నుంచి మళ్లీ!) కీలకంగా మారనున్న ‘రీ–కన్స్ట్రక్షన్’... రంగంలోకి దిగిన పోలీసులు, క్లూస్ టీమ్‌లు, పలుచోట్ల తనిఖీలు నిర్వహించారు. జయరామ్ కారును స్వాధీనం చేసుకున్నారు. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరికీ నోటీసులు జారీ చేశారు. శిఖా చౌదరి ప్రియుడి ఫ్లాట్ నుంచి ఐతవరం టోల్గేట్ వరకు సీన్ రీ-కన్స్ట్రక్షన్ చేయనున్నారు. క్రైమ్ సీన్ రీ–కన్స్ట్రక్షన్ ప్రక్రియ కీలకం కానుంది. శిఖా ఇంట్లో అనేక అంశాలు పరిశీలించ నున్నారు. ఆపై గొడవ జరిగిన తీరు, మృతదేహాన్ని కారులోకి వాచ్‌మన్ సాయంతో తరలించిన తీరు సహా నందిగామ వరకు జరిగిన పరిణామాలను సరిచూస్తారు. ఈలోపే పలు ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డయిన ఫీడ్ సేకరించడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కేసులో సీసీ కెమెరాలు కీలకం కానున్నాయి. జయరామ్‌తో పాటు, నిందితుల కాల్ లిస్ట్, సెల్‌ఫోన్ సిగ్నల్ లొకేషన్ ఆధారంగా కేసును విచారించనున్నారు. హత్య వెనక దాగిన కుట్ర, జయరాం కుటుంబం లేవనెత్తిన అనుమానాల నివృత్తిపై పోలీసులు దృష్టి పెట్టారు. -
నందిగామలో వివాహిత ఆత్మహత్యాయత్నం
సాక్షి, కృష్ణా: నందిగామలో లక్ష్మీ అనే వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. పెట్రోల్ పోసుకొని ఒంటికి నిప్పంటించుకుంది. వెంటనే స్థానికులు ఆమెను రక్షించారు. తన భర్త చనిపోయి ఏడాది అవుతున్నా అత్తమామలు ఇంట్లోకి రానివ్వడం లేదని లక్ష్మీ ఆవేదన వ్యక్తం చేస్తోంది. పోలీసులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని.. అలాగే గ్రామ పెద్దల దగ్గర పంచాయితీ పెట్టించినా అత్తమామలు వారి మాట వినటంలేదని పేర్కొంది. అటు పోలీసులు ఇటు అత్తమామలు పట్టించుకోకపోవడంతోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు లక్ష్మీ తెలిపింది. -
రాకేష్‌రెడ్డి తండ్రి స్పందన..
సాక్షి, హైదరాబాద్: తన కుమారుడికి రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నాయని రాకేష్‌రెడ్డి తండ్రి ధ్రువీకరించారు. అతడిపై ఎటువంటి కేసులు లేవని చెప్పారు. ఎన్నారై వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో తన కుమారుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. రాకేష్ హత్య చేశాడంటే నమ్మలేకపోతున్నామన్నారు. శిఖా చౌదరి పరిచమైన తర్వాతే తమ కుమారుడి ప్రవర్తనలో మార్పు వచ్చిందన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టాలని కోరారు. (ఎవరీ రాకేష్ రెడ్డి..?) ‘మా అబ్బాయి చాలా మంచోడు. సాయం చేస్తాడు కానీ ప్రాణాలు తీసే రకం కాదు. శిఖా చౌదరి పరిచయం కాకముందు మా దగ్గరే ఉండేవాడు. ఆమె పరిచయం అయిన తర్వాత పూర్తిగా మారిపోయాడు. ఇంటికి రావడం కూడా మానేశాడు. ఆమె ఎప్పుడు పరిచయం అయిందో మాకు తెలియదు. శిఖాను నేనెప్పుడూ చూడలేదు. గతంలో మోసం కేసులో అన్యాయంగా అరెస్ట్ చేశారు. జయరాం హత్య కేసులో కావాలనే ఇరికించారు. అసలు అతడికి సంబంధమే లేదు. ఆర్థికంగా మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు. జయరాం ఎవరో మాకు తెలియదు. పోలీసులు దర్యాప్తు సక్రమంగా చేయాల’ని రాకేష్ తండ్రి అన్నారు. సీసీకెమెరాకు చిక్కాడు! రాకేష్‌రెడ్డి మద్యం కొనుగోలు చేసిన వీడియో పోలీసులకు లభించింది. కృష్ణా జిల్లా నందిగామలోని విజయా బార్లో రెండు బీరు బాటిళ్లు కొనుగోలు చేసి వెళుతున్న రాకేష్‌రెడ్డి సీసీకెమెరాకు చిక్కాడు. జయరాం మృతదేహం లభ్యమైన కారులోనూ మద్యం సీసాలు లభ్యమైనమైన సంగతి తెలిసింది. మద్యం మత్తులో కారు ప్రమదానికి గురైన జయరాం మృతి చెందినట్టుగా సీన్ క్రియేట్ చేయడానికి రాకేష్ విఫలయత్నం చేసినట్టు పోలీసులు గుర్తించారు. -
జయరాంకు బినామీగా శిఖా..!
సాక్షి, కృష్ణా: నాలుగురోజుల క్రితం జరిగిన కోస్టల్ బ్యాంకు డైరెక్టర్, ఎన్నారై చిగురుపాటి జయరాం (55) హత్య కేసులో పలు వాస్తవాలు బయటకు వస్తున్నాయి. టెక్ట్రాన్ కంపెనీ లావాదేవీల విషయంలో శిఖాకు, జయరాంకు మధ్య విభేదాలు వచ్చినట్టు తెలుస్తోంది. జయరాంకు తెలియకుండా కంపెనీ చెక్కులపై శిఖా సంతకాలు కూడా చేసినట్లు వెల్లడయింది. ఈ వ్యవహారంలో కోట్ల రూపాయాల టర్నోవర్ జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చెక్కులపై శిఖా ఫోర్జరీ సంతకాలు చేసినట్లు జయరాం తెలుసుకున్న తరువాత వారిద్దరి మధ్య విభేదాలు మరింత ముదిరాయి. శిఖా ఇచ్చిన చెక్కులు బౌన్సు కావడంతో జయరాం పలుమార్లు జైలుకు కూడా వెళ్లారు. టెక్ట్రాన్ కంపెనీ వ్యవహారాలను కూడా శిఖా ఎక్స్‌ప్రెస్ టీవీ కార్యాలయంలోనే జరిపేవారు. జయరాం హత్య కేసులో నిందితుడిగా ఉన్న రాజేష్.. శిఖాతో పాటు కంపెనీ సమావేశాలకు కూడా హాజరయ్యేవారు. ఇదిలావుడంగా అనేక కంపెనీల్లో జయరాం తరుఫున శిఖా బినామీగా వ్యవహరించారు. కాగా ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న రాకేష్‌రెడ్డిని ఇదివరకే పోలీసులు అరెస్టు చేశారు. శిఖాపై అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు ఆమె పాత్రపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. (జయరాంను చంపిందెవరో తెలిసిపోయింది..!) -
జయరాంను చంపిందెవరో తెలిసిపోయింది..!
సాక్షి, అమరావతి/హైదరాబాద్ : నాలుగురోజుల క్రితం జరిగిన కోస్టల్ బ్యాంకు డైరెక్టర్, ఎన్నారై చిగురుపాటి జయరాం (55) హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న రాకేష్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. రూ.4.5 కోట్ల వ్యవహారంలో జయరాంను రాకేష్ హత్య చేసినట్టు నిర్ధారణకు వచ్చినట్టు పేర్కొన్నారు. జయరాం, రాకేష్ విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న సమయంలోనే ఈ హత్య జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. హత్యను ప్రమాదంగా చిత్రీకరిచేందుకు రాకేష్ యత్నించాడని తెలిపారు. రాకేష్‌కు సహకరించిందెవరో తేలాల్సి ఉందని అన్నారు. ఈకేసులో జయరాం మేనకోడలు శిఖా చౌదరి పాత్రపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.(మేనకోడలు పాత్రపై అనుమానాలు!) మహాప్రస్థానంలో అంత్యక్రియలు.. చిగురుపాటి జయరాం భార్యాపిల్లలు ఆమెరికా నుంచి భారత్‌కు చేరుకున్నారు. జయరాం మృతదేహాన్ని జూబ్లిహిల్స్‌లోని ఆయన నివాసానికి తరలించారు. జయరాం ఇంటికి చేరుకున్న నందిగామ పోలీసులు ఆయన భార్య స్టేట్మెంట్ తీసుకున్నారు. హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో ఆదివారం మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. -
శిఖాను తప్పించేందుకే ఆ నిర్మాత వచ్చారా..!?
సాక్షి, అమరావతి/హైదరాబాద్ : కోస్టల్ బ్యాంకు డైరెక్టర్, ఎన్నారై చిగురుపాటి జయరాం (55) హత్య కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు రాజకీయ ఒత్తిళ్లు వస్తున్నట్టు తెలుస్తోంది. జయరాం హత్య వెనుక ఆర్థికలావాదేవీలు, కుటుంబ వివాదాలతో పాటు వివాహేతర సంబంధం కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో జయరాం మేనకోడలు శిఖా చౌదరి ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. (మేనకోడలు పాత్రపై అనుమానాలు!) శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో ఆమెను నందిగామ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శిఖాను నందిగామ రూరల్ సర్కిల్ ఆఫీస్‌లో విచారిస్తున్నారు. ఆమెతో పాటు మరో ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఆమెను కేసు నుంచి తప్పించేందుకు పోలీసులకు పెద్ద ఎత్తున ముడుపుల ఆశజూపుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. శిఖా కోసం సీని నిర్మాత కేపీ చౌదరి రావడంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరింది. స్టేషన్ వద్ద ఉన్న శిఖా కారును కేపీ చౌదరి తీసుకెళ్లారు. అమెరికా నుంచి వచ్చిన జయరాం కుటుంబ సభ్యులను కూడా పోలీసులు విచారిస్తున్నారు. మృతుని స్నేహితుల వివరాలపై వారిని ఆరా తీస్తున్నారు. -
మేనకోడలు పాత్రపై అనుమానాలు!
సాక్షి, అమరావతి బ్యూరో/హైదరాబాద్: కోస్టల్ బ్యాంకు డైరెక్టర్, ఎన్నారై చిగురుపాటి జయరాం (55) హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కృష్ణా జిల్లా నందిగామ మండలం ఐతవరం వద్ద హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారి పక్కన కారులో జయరాం మృతదేహాన్ని గురువారం అర్ధరాత్రి పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. వాహనంలో ఆయన మృతదేహం పడి ఉన్న తీరును బట్టి హత్యగా భావిస్తున్న పోలీసులు.. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వివాదాలతో పాటు వివాహేతర సంబంధం కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. జయరామ్ హత్య కేసులో ఆయన మేనకోడలు శిఖా చౌదరి పాత్రపై అనుమానాలు రేకెత్తడంతో శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో ఆమెను నందిగామ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను కంచికచెర్ల సర్కిల్ స్టేషన్లో ఉంచి జిల్లా ఎస్పీ త్రిపాఠి స్వయంగా విచారించారు. దాదాపు 20 గంటలపాటు విచారించినప్పటికీ అమె పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు సమాచారం. ఆమెతో పాటు మరో ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. మరోవైపు హైదరాబాద్‌లోని జయరామ్, శిఖా చౌదరి నివాసాల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. జయరామ్ ఎక్కడెక్కడికి వెళ్లారు? జయరామ్ సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అతను ఎక్కడెక్కడికి వెళ్లాడు అనే కోణంలో కృష్ణా జిల్లా పోలీసులు ఆరా తీస్తున్నారు. దాన్నిబట్టి మొదట దస్పల్లా హోటల్ వద్దకు వెళ్లి అక్కడి సీసీ టీవీ పుటేజీలను పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు. జయరామ్‌తో పాటు ఎవరైనా కొత్తవ్యక్తులు ఉన్నారా అనే కోణంలో హోటల్ సిబ్బందిని విచారించారు. హోటల్ వద్ద జయరామ్‌కు ఓ వ్యక్తి రూ. ఆరు లక్షలు ఇచ్చాడని, హోటల్ గది అప్పటికే ఓ యువతి పేరుమీద ఉన్నట్లు సమాచారం. హోటల్ నిర్వాహకులు మాత్రం ఈ విషయాన్ని ధ్రువీకరించడం లేదు. శిఖా చౌదరి పాత్రపై అనుమానాలు.. శిఖా చౌదరి.. జయరామ్‌కు మేనకోడలు, వ్యాపార భాగస్వామి. జయరామ్ ప్రారంభించిన ఏ వ్యాపారంలోనైనా ఈమె డైరెక్టర్‌గా వ్యవహరించారు. అతను నిర్వహించిన ఓ న్యూస్ చానల్లోనూ శిఖా చౌదరి కీలక బాధ్యతలు నిర్వర్తించారు. తన భార్యా పిల్లల కంటే ఈమెకే జయరామ్ ప్రాముఖ్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల శిఖా సోదరి మనీషా చదువు కోసం రూ. కోటి వరకు జయరామ్ చెల్లించినట్లు సమాచారం. జయరామ్ ఎప్పుడు అమెరికా నుంచి వచ్చినా శిఖా ఇంటికి రాత్రిపూట వచ్చి వెళ్లేవాడని ఆమె నివసిస్తున్న అపార్ట్మెంట్ వాచ్మెన్ చెబుతున్నాడు. గత నెల 29న రాత్రి కూడా ఆమె ఇంటికి జయరాం వచ్చి వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. జయరామ్ హత్యకు గురైన రోజున రాత్రి 11 గంటలకు ఇంటి నుంచి శిఖా చౌదరి ఒంటరిగా కారు తీసుకుని హడావుడిగా వెళ్లినట్లు విచారణలో తేలింది. హైదరాబాద్‌లోనే హత్యకు స్కెచ్! హత్య కేసులో నందిగామ పోలీసులకు పలు కీలక ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. వాటి ఆధారంగా హైదరాబాద్ కేంద్రంగా జయరామ్ హత్యకు కుట్ర జరిగినట్లుగా భావిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయమై జయరామ్ కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, కోస్టల్ బ్యాంక్ సిబ్బందిని పోలీసులు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే ఆయన మేనకోడలు పాత్రపై ఆరా తీశారు. దస్పల్లా హోటల్లో జయరామ్ పేరిట 10 రోజులుగా ఓ రూమ్ బుక్ చేయడం, అదే హోటల్లో గురువారం ఫార్మా కంపెనీ ప్రతినిధులతో సమావేశం జరగడం, అక్కడి నుంచే జయరామ్ ఓ తెల్లచొక్కా ధరించిన వ్యక్తితో కలిసి కారులో వెళ్లినట్లు స్పష్టమైన ఆధారాలు లభ్యమయ్యాయి. పతంగి టోల్గేట్ వద్ద నమోదైన సీసీ టీవీ ఫుటేజీలోనూ జయరామ్‌తోపాటు మరో ఇద్దరు ప్రయాణించినట్లు తేలింది. తెల్లచొక్కా ధరించిన వ్యక్తి కారు నడిపినట్లు గుర్తించారు. కారులో లభ్యమైన మద్యం బాటిళ్లు తదితరాలను బట్టి ఈ హత్యకు హైదరాబాద్‌లోనే కుట్ర పన్నినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. రాకేష్ ఎవరనే కోణంలో ఆరా.. జయరామ్ చెల్లులు సుశీలతోపాటు మేనకోడళ్లు శిఖా చౌదరి, మనీషాలతోపాటు డ్రైవర్ సతీష్‌తోపాటు గన్మెన్లను పోలీసులు విచారిస్తున్నారు. అదే సందర్భంలో మేనకోడలు శిఖా చౌదరి ప్రియుడుగా భావిస్తున్న రాకేష్ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. శిఖా చౌదరికి రాకేష్ రూ. 4.5 కోట్లు అప్పు ఇచ్చినట్లు సమాచారం. ఈ డబ్బుల విషయంలో రెండేళ్లుగా రాకేష్–శిఖా మధ్య గొడవలు జరుగుతున్నాయని, తన మేనకోడలి అప్పును తీరుస్తానని జయరామ్ హామీ ఇచ్చారని, అయితే ఆ తర్వాత డబ్బు సర్దుబాబు చేయకపోవడంతోనే వీరి ముగ్గురి మధ్య వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. ఆ వివాదమే హత్యకు దారితీసిందా? అన్న కోణంలో రాకేష్‌ను పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది. శ్రీకాంత్ అనే మరో యువకుడిపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు ఎంపీ తమ్ముడి కొడుకుతోనూ శిఖాకు పరిచయాలున్నాయని, బీర్ కంపెనీ పెడతానని అతని ద్వారా భారీగా పెట్టుబడి పెట్టించినట్లు విచారణలో తేలింది. ఆ సమయంలో ఏం జరిగింది? జయరాం స్వస్థలం విజయవాడ కాగా గత నెల 30న హైదరాబాద్ నుంచి బయల్దేరారు. పంతంగి టోల్‌ప్లాజా వద్ద గత నెల 31వ తేది రాత్రి 2గంటలకు ఆయన కారు సీసీ పుటేజీలో కనిపించింది. హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకోవడానికి 5 గంటల సమయం పడుతుంది. ఈ మిగతా సమయం ఎక్కడున్నాడన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కీలకం కానున్న ఫోరెన్సిక్ నివేదిక అనుమానస్పద స్థితిలో మృతి చెందిన జయరామ్ మృతదేహంపై పలు భాగాల్లో గట్టిగా దెబ్బలు తగిలిన దాఖలాలేమి కనిపించలేదు. మోచేయి కింద భాగంలో, పొట్ట ఎడమ వైపున, కుడివైపు ఛాతీ పైభాగంలోనూ కందిన గాయాలున్నాయి. ముక్కు, నోటి నుంచి రక్తం ధారగా కారింది. చేతులు నల్లగా ఉండడం, శరీరంలో నీలిరంగులోకి మారడంతో ఆయనపై ఏదైనా విషప్రయోగం చేశారా? కొట్టి హత్య చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం సందర్భంగా శరీర భాగాలను వైద్యులు సేకరించి విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. అక్కడి నుంచి నివేదిక అందాకే హత్య మిస్టరీ వీడే అవకాశం ఉందని పోలీసు భావిస్తున్నారు కేన్సర్ ఆస్పత్రిలో మృతదేహం జయరామ్ మృతదేహాన్ని శుక్రవారం రాత్రి హైదరాబాద్‌కు తరలించారు. జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 44లోని ఇంట్లో గత కొద్దిరోజులుగా జయరామ్ ఒక్కరే ఉంటున్నట్లు తెలుస్తోంది. అతడి భార్యా, పిల్లలు అమెరికాలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మృతదేహాన్ని బంజారాహిల్స్‌లోని బసవతారకం కేన్సర్ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. ఇదిలాఉండగా జయరామ్ భార్య పద్మశ్రీ, పిల్లలు అమెరికాలో ఉంటున్నారు. ప్లోరిడాలో మంచు తుఫాను వల్ల హైదరాబాద్ రావడానికి తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నట్లు తెలుస్తున్నది. ఆదివారం అంత్యక్రియలు జరుగుతాయని భావించినా సాధ్యమయ్యేట్లు కనిపించడం లేదు. గది తాళాలు ఇవ్వాలని దౌర్జన్యం చేసింది: వాచ్మెన్ వెంకటేశ్ జయరామ్ మృతిచెందిన మరుసటిరోజు శిఖా చౌదరి జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 44లోని జయరామ్ ఇంటికి వచ్చి రూం తాళాలు ఇవ్వాలని దౌర్జన్యం చేసినట్లు జయరామ్ ఇంటి వాచ్మెన్ వెంకటేశ్ తెలిపాడు. తాను తాళాలు ఇవ్వకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిందన్నారు. అదే సమయంలో ఆమెకు ఫోన్ రావడంతో వెళ్లిపోయినట్లు తెలిపాడు. ఆ రోజు రాత్రి డ్యూటీకి రాగానే జయరామ్ సార్‌కు ఫోన్ చేశానని, మీటింగ్‌లో ఉన్నాను తర్వాత ఫోన్ చేస్తానని చెప్పాడన్నాడు. ఆ తర్వాత గన్‌మెన్ ద్వారా జయరామ్ మృతి విషయం తెలిసిందని, ఎవరు హత్య చేశారో అంతు చిక్కడంలేదన్నారు. రెండేళ్ల కిందట జయరామ్ తల్లి చనిపోయిన సమయంలో శిఖా చౌదరికి, జయరామ్ కుటుంబ సభ్యుల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయని చెప్పాడు. తాను గత 20 ఏళ్లుగా జయరామ్ కంపెనీలో ఎలక్ట్రీషన్‌గా, వ్యక్తిగత సహాయకుడిగా, ఇంటి కాపలాదారుగా పనిచేస్తున్నట్లు తెలిపాడు. జయరామ్ వైన్ తప్ప మద్యం తాగడని ఆయన స్పష్టం చేశాడు. ఎవరిని అదుపులోకి తీసుకోలేదు : సర్వశ్రేష్ఠ త్రిపాటి, ఎస్పీ కంచికచెర్ల సర్కిల్ పోలీసు స్టేషన్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు జయరామ్ హత్య కేసుకు సంబంధించి ఆయన కోడళ్లు, డ్రైవర్, గన్మెన్లతోపాటు మరో ముగ్గురు అనుమానితులను ఎస్పీ త్రిపాఠి విచారించారు. ఈ సందర్బంగా ఆయన సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ.. ‘జయరామ్ హత్య కేసులో తాము ఎవరిని అదుపులోకి తీసుకోలేదు. కేవలం అనుమానితులను మాత్రమే విచారణ చేస్తున్నాం. త్వరలోనే కేసుని ఛేదిస్తాం’ అని తెలిపారు. -
జయరామ్ హత్యకేసులో కొత్త కోణం
సాక్షి, హైదరాబాద్ : కృష్ణా జిల్లాలో సంచలనం సృష్టించిన ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరామ్ (55) హత్య కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. జయరామ్ మేనకోడలు శ్రిఖా చౌదరి, ఆమె ప్రియుడు రాకేష్‌లు కలిసి ఈ హత్యకు పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. శ్రిఖా చౌదరి, రాకేష్‌లు ఒకరినొకరు ప్రేమించుకున్నారని, వీరి వివాహానికి ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదని సమాచారం. తన మేనకోడలును వదిలేయమని రాకేష్‌ను జయరామ్ కోరారని, వదిలేయడానికి రూ.3.5కోట్ల ఒప్పందం కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది.(వ్యాపారవేత్త జయరామ్ అనుమానాస్పద మృతి) ఒప్పందం ప్రకారం షికాను రాకేష్ వదిలేశాడు. కానీ జయరామ్ డబ్బులు ఇవ్వలేదు. దీంతో మళ్లీ ఒక్కటైన శ్రిఖా, రాకేష్‌లు జయరామ్‌ను హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. చనిపోయిన రోజు జయరామ్ ఇంటికి శ్రిఖా వచ్చినట్లుగా తెలుస్తోంది. వాచ్‌మెన్‌ను బెదిరించి ఇంటితాళాలు తీసుకొని ఇంట్లోకి వెళ్లిందని పోలీసుల విచారణలో తేలింది. రాకేష్ సహాయంతోనే జయరామ్‌ను షికా హత్యచేసిందని పోలీసులు భావిస్తున్నారు. శ్రిఖా చౌదరి, జయరామ్ సోదరి, రాకేష్, ఇద్దరు కారుడ్రైవర్లతో పాటు గన్‌మెన్‌న్లను పోలీసులు విచారిస్తున్నారు. కాగా, శుక్రవారం నాడు పోస్టు మార్టం నిర్వహించిన జయరామ్ మృతదేహాన్ని అదే రోజు రాత్రి హైదరాబాద్‌కు తరలించారు. విదేశాల్లో ఉన్న జయరామ్ భార్య, పిల్లలు ఆదివారం ఉయదం హైదరాబాద్‌కు వస్తారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. జయరామ్ భార్య, పిల్లలు వచ్చిన తర్వాతే అంత్యక్రియలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. -
జయరామ్‌పై విషప్రయోగం?
సాక్షి, విజయవాడ : కృష్ణా జిల్లాలో సంచలనం సృష్టించిన ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరామ్ (55) హత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి విచారణ ప్రారంభించారు. హత్యకోణం, ఆస్తితగాదాలు ఇలా అనేక కోణాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు. జయరామ్ కాల్‌డేటా ఆధారంగా ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకొని రహస్యంగా విచారిస్తున్నారు. ఆస్తి, ఆర్థిక వివాదాలపైనే దృష్టి పెట్టిన పోలీసులు.. నాలుగు బృందాలుగా ఏర్పడి జయరామ్ కుటుంబ సభ్యులను వేరు వేరుగా విచారించారు. జూబ్లీహిల్స్‌లోని జయరామ్ ఇంటికి చేరుకొని సీసీపుటేజీని పరిశీలించారు.హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌ను నందిగామ పోలీసులు తనిఖీ చేశారు. హోటల్లోని సీసీ పుటేజీని స్వాధీనం చేసుకొని పరిశీలించారు. జనవరి 31న ఆ హోటల్లో ఫార్మా కంపనీతో జయరాం సమావేశమయ్యారు. సమావేశం తర్వాత తెల్ల చొక్కా వేసుకున్న వ్యక్తితో జయరాం బయటకు వెళ్లినట్లు సీసీ పుటేజ్ ద్వారా గుర్తించారు. ఆ తెల్ల చొక్కా వ్యక్తి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. మరో వైపు జయరాం పోస్ట్‌మార్టంపై ఉత్కంఠ నెలకొంది. జయరాంపై విషప్రయోగం జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. జయరాం తలపై ఉన్న బ్లడ్ అతని ముక్కు నుంచి వచ్చినట్లుగా గుర్తించారు. శరీరం రంగుమారడంతో జయరాంపై విషప్రయోగం జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.జయరామ్ హత్యకు గురైన కారులో ఓ మహిళ కూడా ఉన్న పోలీసులు గుర్తించారు. (వ్యాపారవేత్త జయరామ్ అనుమానాస్పద మృతి) జయరామ్ సమీప బంధువైన ఓ మహిళను హైదరాబాద్ నుంచి నందిగామకు తీసుకొచ్చి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. జయరామ్‌ను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? జయరామ్ ఎక్కడెక్కడికి వెళ్లారు? ఎవరెవరిని కలిశారు? విజయవాడకు వస్తుండగా అతని కారును డ్రైవింగ్ చేసిన గుర్తు తెలియని వ్యక్తి ఎవరు? హత్యకోణం, ఆస్తితగాదాలు ఇలా అనేక కోణాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే కారులో ఉన్న రెండో వ్యక్తి ఎవరన్నది పోలీసులకు అంతుచిక్కడం లేదు. జయరామ్ కారులో మద్యం సీసాలు లభించడం అనుమానాన్ని రేకెత్తిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లెముందు జయరామ్ మద్యం సేవించారా? లేదా మధ్యలో స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నారా అనే కోణంలో పోలీసులు ఆరా తీసుస్తున్నారు. అయితే జయరామ్‌కు మద్యం సేవించే అలవాటు లేదని ఆయన డ్రైవర్ పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. కాగా, శుక్రవారం నాడు పోస్టు మార్టం నిర్వహించిన జయరామ్ మృతదేహాన్ని అదే రోజు రాత్రి హైదరాబాద్‌కు తరలించారు. విదేశాల్లో ఉన్న జయరామ్ భార్య, పిల్లలు ఆదివారం ఉయదం హైదరాబాద్‌కు వస్తారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. జయరామ్ భార్య, పిల్లలు వచ్చిన తర్వాతే అంత్యక్రియలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. -
కారులో ఎన్నారై మృతదేహం
సాక్షి, విజయవాడ : నందిగామ మండలం ఐతవరం సమీపంలో 65 నెంబర్ జాతీయ రహదారి పక్కన ఓ అనుమానాస్పద మృతదేహం లభ్యమైంది. కారులో రక్తపు మడుగులో పడివున్న మృతదేహాన్ని పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున గుర్తించారు. మృతుడు విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరాంగా నిర్ధారించారు. జయరాం ఓ ఫార్మా కంపెనీ ఎండీగా విధులు నిర్వర్తిస్తున్నాడని పోలీసులు తెలిపారు. కారులో మద్యం సీసాలు లభ్యమయ్యాయని, జయరాం హత్యకు గురైనట్టు నిర్ధారణకు వచ్చినట్టు పోలీసులు వెల్లడించారు. సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు ముమ్మురం చేశామని తెలిపారు. జయరాం కారును మరో వ్యక్తి నడుపుతున్నట్టు తేలిందని పేర్కొన్నారు. జయరాం తలపై బలమైన గాయం ఉందని వివరించారు. కారు నడిపిన వ్యక్తి పరారీలో ఉన్నాడని, అతన్ని పట్టుకుంటామని తెలిపారు. మృతుని బ్యాంక్ లావాదేవీలు, కాల్ డేటాపై దృష్టి పెట్టామని వెల్లడించారు. జయరాంకు ఎవరితోనైనా ఆస్తి తగాదాలున్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. రెండు రోజుల క్రితం జయరాం హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లినట్టు వాచ్మెన్ చెప్పాడని అన్నారు. గతరాత్రి రాత్రి 12గంటల సమయంలో రోడ్డు ప్రక్కన కారులో మృతదేహం ఉందన్న సమాచారం అందడంతో ఘటనాస్థలానికి చేరుకున్నామని తెలిపారు. అమెరికాలో ఉన్న మృతుని భార్యాపిల్లలకు సమాచారమిచ్చామని, జయరాం నెల క్రితమే అమెరికా నుంచి స్వదేశానికి వచ్చాడని పోలీసులు వెల్లడించారు. -
16 వాహనాలు ఢీ
నందిగామ: రంగారెడ్డి జిల్లా నందిగామ మండల పరిధిలోని హైదరాబాద్–బెంగళూరు 44వ జాతీయ రహదారిపై శనివారం ఉదయం దట్టమైన పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదం జరిగింది. వాహనాల డ్రైవర్లకు దారి కనబడని పరిస్థితి నెలకొంది. దీంతో షాద్‌నగర్ నుంచి హైదరాబాద్ వైపునకు వెళ్తున్న ఓ కారు ముందుగా వెళ్తున్న మరో కారును ఢీకొని అక్కడే ఆగిపోయింది. దాని వెనకాలే వస్తున్న కార్లు, లారీలు, బస్సులు ఒకదానికి మరొకటి వరుసగా 16 వాహనాలు ఢీకొన్నాయి. దీంతో పది కార్లు, రెండు బస్సులు, నాలుగు లారీలు దెబ్బతిన్నాయి. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. వరుస ప్రమాదాలతో ఒక్కసారిగా ట్రాఫిక్‌జాం ఏర్పడింది. దీంతో స్థానిక పోలీసులు వాహనాలను పాత జాతీయ రహదారి మీదుగా మళ్లించగా నందిగామ గ్రామంలోంచి పాత జాతీయ రహదారిపై వాహనాలు వెళ్లడంతో అక్కడా వాహనాల సంఖ్య పెరిగి ట్రాఫిక్‌జాం అయింది. సుమారు గంట అనంతరం ట్రాఫిక్ క్లియర్ కావడంతో వాహనదారులు ఊపిరిపీల్చుకున్నారు. -
నందిగామ వద్ద రోడ్డు ప్రమాదం
సాక్షి, రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా నందిగామ మండల పరిధిలో జాతీయ రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. పొగమంచు ఎక్కువగా ఉండటంతో వరుసగా పదహారు వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి మహబూబ్‌నగర్ వైపు ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని బాధితులు తెలిపారు. కాగా ఈ ఘటనతో ట్రాఫిక్‌కు భారీగా అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు పాత జాతీయ రహదారి నుంచి వాహనాలను మళ్లిస్తున్నారు. -
ప్రైవేటు ట్రావెల్స్‌పై టీడీపీ నేతల పైరవీలు
సాక్షి, విజయవాడ : సాధారణ ప్రజలు ప్రయాణించే బస్సులపై కూడా టీడీపీ నేతలు పైరవీలు చేస్తున్నారు. నందిగామలో ఒకే పర్మిట్‌తో బస్సులను తిప్పేందుకు ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యం ప్రయత్నిస్తోంది. జిల్లాలోని అనాసాగరం వద్ద బస్సులోని ప్రయాణికులను దించి వేరే బస్సు మార్చేందుకు యాజమాన్యం ప్రయత్నించడంతో అసలు బండారం బయటపడింది. ఒకే పర్మిట్‌తో బస్సులను నడుపుతున్న ప్రైవేటు ట్రావెల్స్ గుట్టురట్టు కావడంతో ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన అధికారులు ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన రెండు బస్సులను నందిగామ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇదిలా ఉండగా బస్సులను విడిచిపెట్టాలని టీడీపీ నేతలు పోలీసుల వద్ద పైరవీలకు దిగారు. ఫిర్యాదును వెనక్కు తీసుకోవాలంటూ ప్రయాణికులపై ఒత్తిడి తెస్తున్నారు. అక్రమాలను పాల్పడుతున్న ట్రావెల్స్‌ను ఎలా వెనుకేసుకొస్తారని.. వారి వైఖరిపై ప్రయాణికులు తీవ్రంగా మండిపడుతున్నారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆ ట్రావెల్స్‌పై చర్యలు తీసుకోవాల్సిందేనని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. -
కృష్ణా జిల్లాలో దొంగనోట్ల కలకలం..!
సాక్షి, విజయవాడ: జిల్లాలోని నందిగామలో దొంగనోట్లు ముద్రిస్తున్నారనే వార్త కలకలం రేపింది. పాత బైపాస్ రోడ్డులో గల ఓ ఇంట్లో దొంగ నోట్లు ముద్రిస్తున్నారనే పక్కా సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం ఉదయం దాడి చేశారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నోట్లు ముద్రించే సాధనంగా భావిస్తున్న ప్రింటర్ స్కానర్, మరికొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇంటికి తాళం వేసి సీజ్ చేశామని పోలీసులు వెల్లడించారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఎన్‌కేపాడులో.. విజయవాడ రూరల్ మండలంలోని ఎన్‌కేపాడులో దొంగనోట్లు ముద్రిస్తున్న షేక్ బాబు, షేక్ సుభాని, షేక్ జానీలను గురువారం ఉదయం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 75 వేల రూపాయలు విలువగల రూ. 100 నోట్లను, కంప్యూటర్, ప్రింటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
బోల్తా కొట్టించిన బురిడీ స్వామిజీ!
కంచికచర్ల (నందిగామ): అమాయక ప్రజలను నమ్మించి రూ.లక్షలు కాజేసి ఉడాయిస్తున్న బురిడీ స్వాములకు తెలుగు రాష్ట్రాల్లో కొదువలేకుండా పోతోంది. కృష్ణాజిల్లా కంచికచర్లలోని ఓ మహిళకు మాయమాటలు చెప్పి రూ.2లక్షలతో ఉడాయించిన ఓ బురిడీస్వామి ఉదంతం గురువారం వెలుగులోకి వచ్చింది. మోసపోయిన మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్ఐ దావాల సందీప్ తెలిపిన కథనం మేరకు హైదరాబాద్‌కు చెందిన తత్వపీఠ చైతన్యమఠం శ్రీ రామ శివచైతన్యం స్వామి, తేజస్వి మేనేజింగ్ ట్రస్టు సభ్యులు నాలుగు రోజుల క్రితం కంచికచర్ల సర్పంచి గద్దే ప్రసాద్ వద్దకు వచ్చి జాతకం చూస్తామని, ఆర్థిక, ఆనారోగ్య సమస్యలుంటే పూజలు చేసి పరిష్కరిస్తామని నమ్మబలికారు. దీనికి ఖర్చు రూ. 5లక్షల వరకు అవుతుందని తెలిపారు. అయితే తమ వద్ద అంత నగదు లేదని సర్పంచి ప్రసాద్ భార్య పావని రూ.2లక్షలు వారికి ముట్టజెప్పింది. మరిన్ని పూజలు చేయాల్సి ఉందని, మరలా తిరిగి వస్తామని చెప్పి బంగారపు శ్రీ చక్రం ఇచ్చి వెళ్లిపోయారు. అనంతరం పావని స్వామీజీ ఇచ్చిన శ్రీచక్రంను బంగారు షాపులో చూపించగా శ్రీ చక్రం నకిలీదని తేలింది. దీంతో పావని శ్రీరామ శివచైతన్యం స్వామి, తేజస్వినిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తత్వ పీఠ చైతన్య మఠం శ్రీరామ శివ చైతన్యం స్వామీ ఇటీవల రాజమండ్రిలోని పావని బంధువుల వద్దకు వెళ్లి పూజలు చేస్తామని చెప్పి వారి నుంచి కూడా ఇలాగే దాదాపు రూ.50లక్షలు కాజేశాడని తెలిసింది. సర్పంచి బంధువులు ఈ విషయాన్ని గద్దే ప్రసాద్‌కు తెలియ జేశారు. కాగా, శ్రీ రామ శివచైతన్యం స్వామితో పాటు తేజస్విని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. -
పూజల పేరుతో అమాయక మహిళలను..
సాక్షి, నందిగామ: కృష్ణా జిల్లాలో ఓ నకిలీ స్వామిజీ గుట్టు రట్టయింది. పూజల పేరుతో అందరి జీవితాలను మార్చేస్తానని చెప్పి అమాయక మహిళలను ఆకర్షిస్తున్న బాబా.. వారి నుంచి భారీగా డబ్బు గుంజుతున్నాడు. బాబా మోసాలను గ్రహించిన ఓ మహిళ పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన సమాచారం ప్రకారం.. రామ శివ చైతన్యం తత్వపీఠం నిర్వహిస్తూ గత కొంతకాలంగా స్వామిజీగా చలామణి అవుతున్నాడు. తనకు మంత్రతంత్రాలు తెలుసునని ప్రచారం చేసుకున్నాడు. తన మాటలు నమ్మి వచ్చిన ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని లక్షల్లో స్వాహా చేశాడు. ఈ క్రమంలో స్వామిజీని నమ్మి గద్దె పావని అనే మహిళ రూ. 2 లక్షల ను ముట్టుజెప్పింది. అయితే ఆయన అసలు రూపం గుర్తించిన సదరు మహిళ కంచికచర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేప్టటారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ. 30 లక్షల మేర వసూలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. విచారణ చేపడుతున్న పోలీసులు నకిలీ బాబాను అదుపులోకి తీసుకోనున్నారు. -
కృష్ణా జిల్లాలో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు
-
నందిగామలో రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్లు
సాక్షి, నందిగామ : కృష్ణా జిల్లా నందిగామలో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు. రైతు సమస్యలపై మార్కెట్ యార్డు అధికారులతో మాట్లాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై వాగ్వివాదానికి దిగి, గొడవ పడ్డారు. వైఎస్సార్సీపీ మద్దతుదారులైన రైతులు తెచ్చిన సుబాబుల్ కొనుగోలు చెయడానికి మార్కెట్ యార్డులోని అధికారులు నిరాకరించారు. దీంతో వైఎస్సార్ సీపీ నాయకులు మార్కెట్ యార్డు వద్ద రైతులకు మద్దతుగా ఆందోళన చేపట్టారు. అయినా లాభం లేకపోవడంతో మార్కెట్ యర్డ్లోని సుబాబుల్‌ని రైతులు జగ్గయ్య పేటకు తీసుకెళ్లాలని భావించారు. ట్రాక్టర్లలో సుబాబుల్‌ని తరలిస్తుండగా నందిగామ మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రైవేటు సిబ్బంది వారిని అడ్డుకున్నారు. రైతులు సుబాబుల్ తరలిస్తున్న ట్రాక్టర్లను నిలిపివేసిన అధికారులు వాటిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నాయకులు అక్కడికి చేరుకుని అధికారులతో మాట్లాడుతుండగా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు రెచ్చిపోయారు. వైఎస్సార్ సీపీ నాయకులపై మార్కెట్ యార్డు చైర్మన్ చిరుమామిళ్ల శ్రీనివాసరావు వర్గీయులు మాటల యుద్ధానికి దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకోవడంతో పరిస్థతి ఉద్రిక్తంగా మారింది. రైతులకు న్యాయం చేయాలంటూ వైఎస్సార్ సీపీ నేతలు స్టేషన్ బయట ఆందోళనకు దిగారు. -
మరో భూవివాదంలో ఎమ్మెల్యే బోండా
సాక్షి, విజయవాడ: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమ అక్రమాల పుట్ట రోజుకొకటి బయట పడుతున్నాయి. గతంలో విజయవాడలో స్వతంత్ర్య సమరయోధుడి భూమిని బోండా ఉమ కబ్జా చేయడంపై పెద్ద దుమారమే రేగింది. అనంతరం ఇద్దరు మహిళలు పెనమలూరు డెవెలప్మెంట్ పేరుతో తన 86 సెంట్ల భూమిని ఆక్రమించారని జాయింట్ కలెక్టర్‌ను ఆశ్రయించారు. అభివృద్ధి పేరుతో తమ భూమిని కాజేయాలని ఎమ్మెల్యే బోండా ప్రత్నిస్తున్నారని పెనమలూరుకు చెందిన ఉమాదేవి, లక్ష్మీ భవాని జాయింట్ కలెక్టర్‌నకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలు మరువకముందే.. తాజాగా మరో భూ వివాదం వెలుగులోకి వచ్చింది. స్థానిక సబ్బరాయనగర్ వెంచర్లో స్థలం ఇస్తామని రూ. 35 లక్షలు వసూలు చేసినట్టు నందిగామకు చెందిన సుబ్రహ్మణ్యం ఆరోపిస్తున్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో తనతో మాట్లాడి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తనతో చెప్పారని బాధితులు చెబుతున్నారు. కానీ ఇపుడు స్థలం లేదు, సొమ్ము లేదంటూ మాగంటి బాబు, వాసు, వర్మ అనే వ్యక్తులు బోండా ఉమ పేరు చెప్పి బెదిరిస్తున్నారని సుబ్రహ్మణ్యం ఆరోపిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేతో సహా నలుగురిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు నగర సీపీకి ఫిర్యాదు చేశాడు. -
యువతి ఆత్యహత్య
కంచికచర్ల (నందిగామ) : ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ యువతి చీరెతో దూ లానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కంచికచర్లలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం స్థానిక మోడల్ కాలనీకి చెందిన వల్లంశెట్టి అంజిలి (17) ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఓ చిల్లర దుకాణంలో పని చేస్తుంది. తల్లి మోడల్ కాలనీలో సమోసాలు తయారు చేస్తుంటుంది. అయితే ఒంట్లో బాగోలేదని అంజిలి పనికి వెళ్లలేదు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరెతో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్యహత్యకు కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న సీఐ అల్లు నవీన్ నరసింహమూర్తి, ఎస్ఐ సందీప్ ఘటనా స్ధలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
ట్రావెల్స్ బస్సు పాల వ్యాన్ ఢీ..ఒకరి మృతి
-
ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, వ్యాన్ ఢీ..ఒకరి మృతి
కృష్ణా జిల్లా : నందిగామ సమీపంలో జాతీయరహదారిపై కంచికచర్లలోని చెరువు కట్ట వద్ద మార్నింగ్ ట్రావెల్స్ బస్సు, పాల వ్యానును ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు పల్టీ కొట్టింది. పాల వ్యానును వేగంగా ఢీకొట్టడంతో వ్యాను డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు. బస్సులో ప్రయాణిస్తున్న 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుతోంది. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నందిగామ బైపాస్‌లో కారు దగ్ధం
-
గాలిపటం ఎగురవేస్తుండగా..
సాక్షి, నందిగామ: సంక్రాంతి పండుగ సందర్భంగా కృష్ణాజిల్లా నందిగామలో విషాదం చోటుచేసుకుంది. పట్టణంలో గాలిపటాలు ఎగరవేస్తుండగా భవనంపైనుంచి జారిపడి ఓ బాలుడు మృతిచెందాడు. చందర్లపాడు మండలం ముప్పాళ్ళ గ్రామానికి చెందిన నితీష్ కుమార్(15) గాలిపటం ఎగురవేస్తుండగా అపార్టుమెంట్‌పై నుంచి జారి కిందపడి మృతిచెందాడు. మృతుడు నందిగామలోని ఓ ప్రెవేట్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. -
కృష్ణా జిల్లాలో పలుచోట్ల పొగమంచు
సాక్షి, నందిగామ: కృష్ణాజిల్లాలో పలుచోట్ల పొగమంచు దట్టంగా అలుముకుంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే గన్నవరం విమానాశ్రయానికి విమాన రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. నందిగామ పరిసరాలను దట్టమైన పొగమంచు ఆవరించింది. 65వ నంబర్ జాతీయ రహదారిపై పొగమంచు తెరలుతెరలుగా రావడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దారి కనబడక వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఎండ వచ్చేవరకు వాహనాలను రోడ్డు పక్కన నిలిపివేస్తున్నారు. ఉదయం 8 గంటలు దాటినా పొగమంచు వీడలేదు. మార్నింగ్ వాక్కు వెళ్లేవారు, పసిపిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. గన్నవరంలోనూ.. గన్నవరం పరిసర ప్రాంతాల్లోనూ పొగమంచు ఆవరించింది. ఎయిర్‌పోర్టులో దట్టమైన పొగమంచు కారణంగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. బెంగళూరు, హైదరాబాద్ నుంచి రావాల్సిన స్పైస్ జెట్ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. -
కౌలు రైతు ఆత్మహత్య
నందిగామ: ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధరలేక, చేసిన అప్పు తీర్చే మార్గం కనిపించక, ఓ కౌలు రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణా జిల్లా నందిగామకు చెందిన వెంకటరామయ్య(40) అనే రైతు మూడున్నర ఎకరాలు కౌలుకు తీసుకుని మిరప పంట సాగుచేశాడు. మిరప పంటకు గిట్టుబాటు ధర లేక, చేసిన అప్పు తీర్చే మార్గం తెలియక మనోవేదనకు గురై పురుగుల మందు తాగి మంగళవారం ఉదయం బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రైతులు పిట్టల్లా రాలుతున్న ప్రభుత్వానికి కనువిప్పు కలగడం లేదని స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
చావు కథ..శ్మశాన వ్యథ!
► కట్టెకాలాలంటే.. అష్టకష్టాలే.. ► దశాబ్దాలుగా వేధిస్తున్న వైనం ► శ్మశానవాటిక స్థలం లేక గోళ్లమూడి వాసుల అవస్థలు ► అన్ని వర్గాలదీ ఇదే పరిస్థితి ► ఏటికి వరదొస్తే శవాన్ని పడవలో తరలించాల్సిందే.. మరణం.. బంధాలను వీడి.. బాధను మిగిల్చే క్షణం. పుట్టినవాడు గిట్టకమానడు.. మరణించిన వేళ కన్నీటిధారతో అశ్రునివాళి అర్పిస్తాం. ఇది బతుకున్న అందరూ సాగించే క్రతువే. ఓ గ్రామంలో మాత్రం వర్షాకాలంలో ఎవరైనా మరణిస్తే.. గిట్టిన వారిని తలచుకుని పడే బాధకంటే.. దహనసంస్కారాల కోసం పడే వేదనే ఎక్కువగా ఉంటోంది. శ్మశానవాటిక లేక దశాబ్దాలుగా ఆ ఊరి జనం పడుతున్న ఆవేదన వర్ణనాతీతం. ఎప్పటికి ఈ బాధ తీరేనో.. వేదన వీడేనో వేచిచూడాలి. నందిగామ : ఆ గ్రామం అన్ని విధాలుగా అభివృద్ధి చెందినా కట్టె కాలేందుకు అడుగు భూమి లేని దుస్థితి. మృతదేహాన్ని కాల్చాలన్నా, పూడ్చాలన్నా.. సంబంధిత కుటుంబ సభ్యులు, బంధువులు ఎదుర్కొనే కష్టాలు అన్నీ..ఇన్నీ కావు. శవాన్ని భుజాన వేసుకొని దారి కూడా సక్రమంగా లేని మార్గంలో నరక యాతన పడాల్సిన దుస్థితి. ఈ దుస్థితి ఏ ఒక్క వర్గానికో పరిమితం కాలేదు. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు.. ఇలా అందరికీ బాధలు తప్పడం లేదు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఈ సమస్య గ్రామస్తులను వెంటాడుతూనే ఉంది. నందిగామ మండల పరిధిలోని గోళ్లమూడి గ్రామస్తుల దీనావస్థ ఇది. ఏరే శ్మశానవాటిక గ్రామంలో హిందువులకు శ్మశానవాటిక కోసం ఎటువంటి స్థలం లేదు. గ్రామంలో మహాప్రస్థానం లేకపోవడంతో కట్టెకాలాలంటే సమీపంలోని వైరా ఏరుకు వెళ్లాల్సిందే. ఏటి ఒడ్డునే దహన సంస్కారాలు నిర్వహిస్తుంటారు. అయితే వర్షాకాలం వచ్చిందంటే వారి కష్టాలు పగోడికి కూడా రాకూడదనిపిస్తుంది. ఏటికి నీరొస్తే ఏకంగా పడవలో వెళ్లి దహన సంస్కారాలు నిర్వహించాలి. కాడితో శవాన్ని మోసుకొచ్చి పడవలో ఇసుక దిబ్బను అన్వేషిస్తూ వెళ్లి ఎక్కడ ఒడ్డు కనిపిస్తే అక్కడ దహన సంస్కారాలు నిర్వహించి తిరిగి గ్రామానికి చేరుకోవాల్సిందే. ముస్లింలు మరో ఊరు వెళ్లాల్సిందే.. హిందువుల పరిస్థితి ఇలా ఉంటే, ముస్లిం సోదరుల దుస్థితి మరింత దయనీయం. వీరి మతాచారం ప్రకారం శవాన్ని పూడ్చి పెట్టాల్సిఉంటుంది. ఇందుకోసం గ్రామంలో ఎటువంటి స్థలం లేకపోవడంతో ఏకంగా మూడున్నర కిలోమీటర్లు ప్రయాణించి రుద్రవరం గ్రామానికి చేరుకొని అక్కడ ఖననం చేయాల్సి వస్తోంది. ప్రభుత్వ పెద్దలు స్పందించి శ్మశానవాటిక కోసం స్థలం కేటాయించాలని కోరుతున్నారు. స్థలం ఉన్నా తొలగని కష్టాలు గ్రామంలో వైరా ఏటి ఒడ్డున ఉన్న స్థలాన్ని క్రైస్తవులు శ్మశానవాటికగా వినియోగించుకుంటున్నారు. అయితే, ఈ స్థలంలో అధిక శాతం కోతకు గురైంది. ఇక అక్కడకు వెళ్లేందుకు సరైన దారి కూడా లేకపోవడంతో వారికి సైతం కష్టాలు తప్పడం లేదు. ప్రభుత్వం స్థలం కొనుగోలు చేసి ఇవ్వాలి గ్రామంలో శ్మశానవాటిక స్థలం లేకపోవడం వల్ల అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులుపడుతున్నారు. దీనిపై అధికారులు వెంటనే స్పందించి కనీసం రెండు ఎకరాల స్థలం కేటా యిస్తే, అందరికీ మేలు జరుగుతుంది. వర్షాకాలం లో మా కష్టాలు వర్ణనాతీతం – గాదెల వెంకటేశ్వరరావు(బాబు), గోళ్లమూడి ఎవరైనా చనిపోతే మా పరిస్థితి దారుణం వర్షాకాలం వచ్చిందంటే మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించడం ఓ ప్రహసనంగా మారుతోంది. వైరా ఏటికి వరద వస్తే మరింత దయనీయంగా ఉంటోంది. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి శవాన్ని దహనం చేయాల్సివస్తోంది. –సూర్యదేవర సూర్యనారాయణ, గోళ్లమూడి ఉన్న స్థలాన్ని అందరూ ఉపయోగించుకోవచ్చు గ్రామంలోని అన్ని వర్గాల వారు వినియోగించుకునేందుకు సర్వే నంబరు 162లో 1.53 ఎకరాల స్థలం ఉంది. ఇందులో కొంత కోతకు గురైనా, ఇంకా 73 సెంట్ల స్థలం ఉంది. దారి కోసం రైతుల వద్ద నుంచి దాదాపు 60 సెంట్ల స్థలం సేకరించాం. దీని అభివృద్ధికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపాం. అన్ని వర్గాల వారు ఈ స్థలాన్ని వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటాం. – శ్రీరామకృష్ణ, తహసీల్దార్ -
నందిగామ ప్రభుత్వాసుపత్రిలో తీవ్ర ఉద్రిక్తత
-
బాధితులను పరామర్శించిన డీజీపీ
-
ఎలక్ట్రానిక్స్ గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం
నందిగామ: కృష్ణాజిల్లా నందిగామలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్థానికంగా ఉండే ఓ ఎలక్ట్రానిక్స్ గోడౌన్లో అగ్నిప్రమాదం జరిగి ఉవ్వెత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. భాస్కర్ వాచ్ అండ్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్ కోసం నాలుగంతస్తుల భవనాన్ని గోడౌన్‌గా ఉపయోగిస్తున్నారు. ఇందులో టీవీలు, కూలర్లు, ఏసీలు పెద్ద మొత్తంలో స్టాక్ ఉన్నాయి. శుక్రవారం మధ్యాహ్నం షార్టు సర్క్యూట్‌తో గోడౌన్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఫైరింజన్ వచ్చి మంటలు అదుపు చేసినా లాభం లేకపోవడంతో మరో ఫైరింజన్ కు సమాచారం ఇచ్చారు. అయినా మంటలు అదుపులోకి రాలేదు. మంటల్లో చిక్కుకున్న ఓ బాలికను బయటకు క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. 50 కూలర్లు, 100 వరకు ఎల్ఈడీ టీవీలు బూడిదయ్యాయి. గోడౌన్లో సుమారు రూ. కోటి విలువైన సరకు ఉన్నట్టు తెలుస్తోంది. భారీగా నష్టం సంభవించినట్లు సమాచారం. -
నందిగామలో రైతు అదృశ్యం కలకలం
నందిగామ: కృష్ణా జిల్లా నందిగామ మండలం రామిరెడ్డిపల్లిలో పొలానికి వెళ్లిన రైతు కనిపించకుండా పోవటంతో కలకలం రేపింది. గ్రామానికి చెందిన తుమ్మల ప్రసాద్(38) రెండెకరాల పొలం కౌలుకు తీసుకుని పంటలు సాగు చేశాడు. వ్యవసాయానికి రోజూ తెల్లవారుజామున త్రీఫేజ్ కరెంట్ వస్తుంది. దీంతో మంగళవారం వేకువజామున ప్రసాద్ తన బైక్‌పై పొలానికి బయలుదేరాడు. పొలానికి కొద్ది దూరంలో గుర్తు తెలియని వ్యక్తులు అతడిని అటకాయించి ఎత్తుకుపోయారు. ఆ ప్రదేశంలో అతని చెప్పులు, దుప్పటి, కండువా పడి ఉన్నాయి. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు అతని జాడ కోసం గాలించినా ఫలితం లేకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, అక్కడికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖమ్మం జిల్లా మధిర మండలం దెందుకూరు వద్ద రైలు పట్టాలపై గుర్తు తెలియని మృతదేహం పడి ఉన్న విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి పరిశీలించారు. అయితే, మృతదేహం ఛిద్రమై గుర్తుపట్టే వీలు లేకుండా ఉంది. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, ప్రసాద్‌ను ఎవరు తీసుకెళ్లారు అనేది తేలాల్చి ఉంది. -
నందిగామలో ఉద్రిక్తత
నందిగామ(కృష్ణాజిల్లా): కృష్ణాజిల్లా నందిగామలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నందిగామలో వెలసిన అక్రమ నిర్మాణాలను తొలగిస్తుండగా.. కూల్చివేతలు ఆపాలంటూ ఓ బిల్డర్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అక్రమంగా కట్టిన అపార్ట్‌మెంట్‌ను తొలగించడానికి వచ్చిన సీఆర్డీఏ అధికారులను బిల్డర్ రావూరి రవి అడ్డుకున్నాడు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో కూల్చివేతలు ఆపాలని డిమాండ్ చేస్తూ.. బిల్డర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అడ్డుకోబోయిన సీఆర్డీఏ అధికారులపై కూడా పురుగుల మందు పడటంతో.. రవితో పాటు వారిని ఆస్పత్రికి తరలించారు. -
వాలీబాల్ విజేత ఎస్డీఎం సిద్ధార్థ జట్టు
నందిగామ రూరల్ : కృష్ణా విశ్వ విద్యాలయం అంతర కళాశాలల మహిâýæల వాలీబాల్ పోటీల విజేతగా విజయవాడకు చెందిన ఎస్డీఎం సిద్ధార్థ కళాశాల జట్టు నిలిచింది. స్థానిక కాకాని వెంకటరత్నం కళాశాలలో నిర్వహించిన పోటీలు బుధవారం ముగిశాయి. ఆంధ్ర లయోల కళాశాల ద్వితీయ స్థానం, కేబీఎ¯ŒS కళాశాల తృతీయ స్థానం, వికాస్ వ్యాయామ విద్య కళాశాల నాల్గవ స్థానం సాధించాయి. విజేతలకు కేవీఆర్ కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు గరిమిడి వీరభద్రరావు, యూనివర్సిటీ స్పోర్‌్ట్స బోర్డ్ డైరెక్టర్ నల్లూరి శ్రీనివాసరావు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మాగం వెంకటేశ్వర్లు, ఆర్గనైజింగ్ కార్యదర్శి వాసిరెడ్డి నాగేశ్వరరావు, ఎంపిక కమిటీ సభ్యులు వై.ఉదయభాస్కర్, రామకృష్ణ, గేమ్స్ కమిటీ సభ్యులు స్వామి, సత్యప్రతిమ, రమేష్, ఏలూరు పిచ్చేశ్వరరావు, కొండలరావు తదితరులు పాల్గొన్నారు. -
నడిరోడ్డుపై రిటైర్డు ఎస్సై దారుణహత్య
నందిగామ: కృష్ణా జిల్లా నందిగామలో విషాదం చోటు చేసుకుంది. ఆస్తి తగాదా నేపథ్యంలో ఓ రిటైర్డు పోలీసు అధికారి హత్యకు గురయ్యాడు. ఎస్ఐగా పనిచేసి పదవీ విరమణ చేసిన గుంజి వెంకటేశ్వర్లు కుటుంబంతో హైదరాబాద్‌లో ఉంటున్నారు. తన స్వగ్రామం నందిగామకు అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటారు. ఇతనికి ఆస్తి విషయంలో పినతండ్రి కొడుకులతో తగాదాలున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో నందిగామలో రోడ్డుపై మాట్లాడుతుండగా కోపంతో పినతండ్రి కొడుకులు గుంజి శ్రీను, అతని ఇద్దరు తమ్ముళ్లు కత్తులతో పొడిచారు. సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా వెంకటేశ్వర్లు మార్గంమధ్యలో మృతి చెందాడు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈయన నెల క్రితమే నందిగామకు వచ్చారని స్థానికులు చెబుతున్నారు. -
లారీని ఢీకొట్టిన అంబులెన్స్: ముగ్గురి మృతి
నందిగామ: శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం పెద్దతామరాపల్లి వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. వేగంగా వెళుతున్న అంబులెన్స్ సోమవారం ఉదయం రోడ్డు ప్రక్కన ఆగిఉన్న లారీని ఢీకొట్టడంతో అంబులెన్స్ డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఒడిశా రాష్ర్టం బరంపురం నుంచి విశాఖపట్టణం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. దీనికి సంబధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రోడ్డు ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి మృతి
నందిగామ: వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో బైక్‌పై ఉన్న దంపతుల చేతిలో నుంచి మూడేళ్ల పాప కిందపడింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు చిన్నారి పై నుంచి వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషాద సంఘటన కృష్ణాజిల్లా నందిగామ మండలం అనాసాగరం వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం చోటుచేసుకుంది. నందిగామ నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న బైక్‌ను వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో వారి చేతిలో ఉన్న పాప రోడ్డుపై పడిపోయింది. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఇది గమనించకపోవడంతో.. చిన్నారి పై నుంచి బస్సు వెళ్లింది దీంతో చిన్నారి మృతిచెందింది. -
ఆలయంలో చోరీ
నందిగామ(కృష్ణాజిల్లా): ఆంజనేయస్వామి ఆలయంలో చోరీ జరిగిన సంఘటన కృష్ణాజిల్లా నందిగామ మండలం గొళ్లముడిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామంలోని రామాలయం, ఆంజనేయస్వామి ఆలయాల్లో శనివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు ప్రవేశించి రెండు హుండీలతో పాటు స్వామివారి బంగారు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఆదివారం ఇది గుర్తించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. -
భయంతో బస్సులో నుంచి దూకేశారు..
-
భయంతో బస్సులో నుంచి దూకేశారు..
నందిగామ: ఓ ప్రైవేట్ బస్సులో ఒక్కసారిగా పొగలు కమ్ముకోవడంతో.. భయాందోళనలకు గురైన ప్రయాణికులు బస్సు అద్దాలు పగలగొట్టుకొని బయటకు దూకేశారు. ఈ సంఘటన కృష్ణాజిల్లా నందిగామ బైపాస్ రోడ్డుపై శనివారం ఉదయం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న రాజధాని ట్రావెల్స్ బస్సు నందిగామ వద్దకు చేరుకోగానే ఏసీలో నుంచి గాలికి బదులు పొగలు వచ్చాయి. దీంతో బస్సు మొత్తం పొగతో నిండిపోయింది. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు బస్సు అద్దాలు పగ లగొట్టుకొని బయటకు దూకారు. ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఎవరికి ఎలాంటి నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బస్సులో మంటలు..తప్పిన ప్రమాదం
నందిగామ: కృష్ణా జిల్లాలో ఆర్టీసీ బస్సుకు త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు నందిగామ పోలీస్‌స్టేషన్ సమీపంలోకి చేరుకోగానే ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును రోడ్డు పక్కన నిలిపేశాడు. బస్సులోని 20 మంది ప్రయాణికులను కిందికి దించేశాడు. ప్రయాణికులందరూ కలసి మంటలను ఆర్పేశారు. దీంతో పెనుప్రమాదం తప్పినట్లైంది. బస్సు తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరింది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. -
అక్రమ లే అవుట్లపై సీఆర్డీఏ కొరడా
నందిగామ రూరల్ : అనుమతి లేకుండా నందిగామ ప్రాంతంలో ఏర్పాటుచేసిన లే అవుట్లపై సీఆర్డీఏ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. రెండు రోజుల క్రితం అనుమతులు లేకుండా నగర పంచాయతీ పరిధిలో ఏర్పాటుచేసిన లే అవుట్లను పరిశీలించిన అధికారులు ముందుగా హెచ్చరించినట్లుగానే తొలగింపు ప్రక్రియను ప్రారంభించారు. ఈ మేరకు లే అవుట్ల యజమానులకు ఆదివారం రాత్రి నోటీసులు పంపిన అధికారులు సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. సీఆర్డీఏ జాయింట్ డైరెక్టర్ చక్రపాటి నేతృత్వంలో డెప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారులు వరప్రసాద్, నాగసుందరి, లక్ష్మణరావు, బాలాజీ నేతృత్వంలో నాలుగు బృందాలుగా ఏర్పడి లే అవుట్ల తొలగింపు కార్యక్రమం చేపట్టారు. జేసీబీ, 30మంది సిబ్బంది, ట్రాక్టర్ల సాయంతో లే అవుట్లను తొలగిస్తున్నారు. ఒక్కరోజే నందిగామ నగర పంచాయతీ పరిధిలో 35 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఆరు వెంచర్లను తొలగించినట్లు టౌన్ ప్లానింగ్ అధికారి రంగప్రసాద్ తెలిపారు. అనుమతులు లేని లే అవుట్లను పూర్తిగా తొలగించే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. అధికార పార్టీ నుంచి ఒత్తిళ్లు ! అధికార పార్టీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ లే అవుట్లను తొలగించకుండా అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు సాగిస్తున్నారు. అధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. అధికారులు మాత్రం ఎటువంటి లాబీయింగ్‌లు, ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని, తమ పని తాము చేసుకుపోతామని తెలిపారు.