
నందిగామలో పోలీసులు తనిఖీలు : 40 మంది అరెస్ట్
కృష్ణాజిల్లా నందిగామలోని బీవీఆర్ కాలనీలో నివాసాలలో పోలీసులు శనివారం అర్థరాత్రి నుంచి ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు.
విజయవాడ: కృష్ణాజిల్లా నందిగామలోని డీవీఆర్ కాలనీలో నివాసాలలో పోలీసులు శనివారం అర్థరాత్రి నుంచి ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 13 మంది రౌడీషీటర్లు, 15 మంది దొంగలతోపాటు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి పోలీసు స్టేషన్కు తరలించారు. అలాగే 15 బైకులను స్వాధీనం చేసుకున్నారు.
ఇటీవల నందిగామ పరిసర ప్రాంతాలలో దోపిడి దొంగల బీభత్సం అధికమైంది. దాంతో ప్రజలు హాడలిపోతున్నారు. ఈ నేపథ్యంలో నందిగామలో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో గత అర్థరాత్రి బీవీఆర్ కాలనీలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలకు స్థానిక డీఎస్పీ రాధేశ్ మురళి నేతృత్వం వహించారు.
కృష్ణాజిల్లాలో నేర తీవ్రత సంఖ్య రోజురోజూకు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకే జిల్లాలోని పలు ప్రాంతాలలో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఇటీవలే గుడివాడలో కూడా పోలీసులు తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే.