
సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా నందిగామ కాంసన్ హైజెన్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఈ అగ్ని ప్రమాదం కారణంగా భారీ ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. అగ్ని ప్రమాదం కారణంగా మంటలు ఎగిసిపడుతున్నాయి.

వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా నందిగామ సమీపంలోని కాంసన్ హైజెన్ పరిశ్రమలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు పోలీసు ధికారులు చెబుతున్నారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిప్రమాక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. పక్కనే ఉన్న ఇతర పరిశ్రమలకు మంటలు వ్యాపించకుండా ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదం కారణంగా మంటలు ఎగిసిపడుతున్నాయి.


Comments
Please login to add a commentAdd a comment