లారీని ఢీకొట్టిన అంబులెన్స్: ముగ్గురి మృతి
Published Mon, Nov 14 2016 1:10 PM | Last Updated on Sat, Aug 18 2018 2:18 PM
నందిగామ: శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం పెద్దతామరాపల్లి వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. వేగంగా వెళుతున్న అంబులెన్స్ సోమవారం ఉదయం రోడ్డు ప్రక్కన ఆగిఉన్న లారీని ఢీకొట్టడంతో అంబులెన్స్ డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఒడిశా రాష్ర్టం బరంపురం నుంచి విశాఖపట్టణం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. దీనికి సంబధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement