సౌమ్య ప్రమాణస్వీకారం | Soumya Oath | Sakshi
Sakshi News home page

సౌమ్య ప్రమాణస్వీకారం

Published Thu, Sep 18 2014 2:19 AM | Last Updated on Tue, Aug 14 2018 2:50 PM

సౌమ్య ప్రమాణస్వీకారం - Sakshi

సౌమ్య ప్రమాణస్వీకారం

నందిగామ : నందిగామ ఉప ఎన్నికలో గెలుపొందిన తంగిరాల సౌమ్య ఎమ్మెల్యేగా బుధవారం హైదరాబాద్‌లో ప్రమాణస్వీకారం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు ఆకస్మిక మరణంతో ఈ నెల 13న ఉప ఎన్నిక, 16న కౌంటింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో గెలుపొందిన సౌమ్యకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రజనీకాంతరావు ధ్రువీకరణ పత్రం అందించారు. శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆమెతో ప్రమాణస్వీకారం చేయించారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, సౌమ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం సౌమ్య లేక్ వ్యూ గెస్ట్‌హౌస్‌లో సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement