నాన్నగారికి ప్రజలిచ్చిన నివాళి
తనకు దక్కిన ఈ విజయాన్ని తన తండ్రి తంగిరాల ప్రభాకరరావుకు ప్రజలు ఇచ్చిన నివాళిగా భావిస్తానని నందిగామ ఎమ్మెల్యేగా ఉప ఎన్నికల్లో గెలిచిన టీడీపీ అభ్యర్థిని తంగిరాల సౌమ్య చెప్పారు. విజయం సాధించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ''ఈ విజయం నాన్నగారికి ప్రజలు ఇచ్చిన నివాళిగానే భావిస్తాను. విజయవాడను రాజధానిగా చేసినందుకు ప్రజలిచ్చిన కానుక. మొదటినుంచి ఎన్నికల ప్రచారంలో ఎంతో సహకరించిన రాష్ట్ర మంత్రులు ఉమా, కిశోర్ బాబులకు, కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. నాన్నగారి అభిమానులు, నందిగామ ప్రజలు, అంతా కృషిచేశారు. ప్రజలు నన్ను నమ్మి ఓటేశారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయను. నాన్నగారి అడుగుజాడల్లో నడుస్తాను. అందరి సహకారంతో నందిగామను అభివృద్ధి పథంలో నడిపిస్తాను. ప్రతి ఒక్కరికీ పాదాభివందనాలు.
విజయం ఊహించాను గానీ ఇంత భారీవిజయం ఊహించలేదు. గత పదేళ్లుగా నందిగామ ప్రతిపక్ష పాలనలో ఉంది. ఇప్పుడు అధికారంలో ఉన్నాము, రాజధాని దగ్గర్లో ఉంది కాబట్టి కలిసొస్తాయి. అభివృద్ధి జరుగుతుంది. శాయశక్తులా కృషి చేస్తాను. జిల్లాలో ప్రతి ఒక్క నాయకుడి సహకారంతోనే ఇంత భారీ మెజారిటీ సాధ్యమైంది'' అని ఆమె చెప్పారు.