
గాలి ముద్దుకృష్ణమ నాయుడు (ఫైల్ ఫోటో)
సాక్షి, అమరావతి: దివంగత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు సతీమణి గాలి సరస్వతమ్మకు చిత్తూరు జిల్లా ఎమ్మెల్సీ టిక్కెట్ ఖరారైంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబును శనివారం ఉదయం గాలి సరస్వతమ్మ, ఇతర కుటుంబసభ్యులు కలిశారు. కాగా గాలి మృతితో ఖాళీ అయిన చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఆయన తనయులిద్దరూ పోటీ పడ్డారు. దీంతో మధ్యే మార్గంగా గాలి సతీమణికి ఎమ్మెల్సీ టిక్కెట్ ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు.
కాగా, చిత్తూరు ఎమ్మెల్సీ ఉపఎన్నిక మే 21 న జరుగనుంది. ఇందుకోసం రెండు రోజుల క్రితమే షెడ్యూల్ విడుదలైంది. గాలి ముద్దుకృష్ణమనాయుడు అకాల మరణంతో ఖాళీ అయిన ఆ స్థానంతో పాటు మహారాష్ట్రలో ఆరు స్థానాలకు అదే రోజున ఎన్నికలు జరుగుతాయి.