Gali Muddu Krishnama Naidu
-
ముద్దుకృష్ణమ సతీమణికి చిత్తూరు ఎమ్మెల్సీ
సాక్షి, అమరావతి: దివంగత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు సతీమణి గాలి సరస్వతమ్మకు చిత్తూరు జిల్లా ఎమ్మెల్సీ టిక్కెట్ ఖరారైంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబును శనివారం ఉదయం గాలి సరస్వతమ్మ, ఇతర కుటుంబసభ్యులు కలిశారు. కాగా గాలి మృతితో ఖాళీ అయిన చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఆయన తనయులిద్దరూ పోటీ పడ్డారు. దీంతో మధ్యే మార్గంగా గాలి సతీమణికి ఎమ్మెల్సీ టిక్కెట్ ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. కాగా, చిత్తూరు ఎమ్మెల్సీ ఉపఎన్నిక మే 21 న జరుగనుంది. ఇందుకోసం రెండు రోజుల క్రితమే షెడ్యూల్ విడుదలైంది. గాలి ముద్దుకృష్ణమనాయుడు అకాల మరణంతో ఖాళీ అయిన ఆ స్థానంతో పాటు మహారాష్ట్రలో ఆరు స్థానాలకు అదే రోజున ఎన్నికలు జరుగుతాయి. -
ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
సాక్షి, అమరావతి: ఎమ్మెల్సీ ఉప ఎన్నికల షెడ్యూల్ శనివారం విడుదలైంది. మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ, టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు (70) మరణంతో ఉప ఎన్నికను నిర్వహించనున్నారు. ఈ నెల 24న ఎన్నికల నోటిషికేషన్‌ను ఎన్నికల కమిషన్ విడుదల చేయనుంది. మే 21న పోలింగ్ నిర్వహిస్తారు. మే 24న ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితాన్ని వెల్లడించనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో టీడీపీ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు హైదరాబాద్ గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన విషయం తెలిసిందే. స్వస్థలం చిత్తూరు జిల్లా వెంకట్రామపురంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఆయన మృతితో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. -
అధికార లాంఛనాలతో ముద్దుకృష్ణమ అంత్యక్రియలు
సాక్షి, చిత్తూరు: అనారోగ్యంతో కన్నుమూసిన మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గాలి ముద్దుకృష్ణమనాయుడి భౌతిక కాయాన్ని ఆయన స్వస్థలం చిత్తూరు జిల్లా వెంకట్రామపురానికి తరలించారు. భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. ముద్దుకృష్ణమ నాయుడ్ని కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు, టీడీపీ శ్రేణులు తరలివస్తున్నారు. గురువారం మధ్యాహ్నం వెంకట్రామపురంలో ముద్దుకృష్ణమ అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. -
ముద్దన్న ఇక లేరంటే బాధగా ఉంది...
సాక్షి, హైదరాబాద్ : మాజీమంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు మృతి పార్టీకి తీరని లోటు అని తెలంగాణ టీడీపీ నేత ఎల్ రమణ అన్నారు. గాలి ముద్దుకృష్ణమనాయుడి భౌతికకాయానికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ...‘ చాలా దురదృష్టకరమైన రోజు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసిన వ్యక్తి. వాస్తవానికి అనుగుణంగా, నిర్మొహమాటంగా మాట్లాడే వ్యక్తి. చిత్తూరు జిల్లా, నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని సేవ చేశారు. తెలంగాణ ప్రాంతంలో మాలాంటి వారిని ప్రోత్సాహం ఇచ్చేవారు.’ అని అన్నారు. ముద్దన్న లేడంటే బాధగా ఉంది... రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ముద్దన్న అంటూ ప్రేమగా పిలిచే వ్యక్తి ఇక లేరంటే ఎంతో బాధగా ఉంది. ఎన్టీఆర్‌కు అత్యంత ఆత్మీయుడిగా, రాజకీయాల్లో ఎందరికో ప్రోత్సహం, స్పూర్తిని ఇచ్చిన వ్యక్తి. ఆయన మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. భగవంతుడు ఆ కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలని అన్నారు. చివరి వరకూ పేరు నిలుపుకున్నారు.. గాలి ముద్దుకృష్ణమనాయుడు మంచి రాజకీయాలకు నిదర్శనమని, ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చి చివరి వరకూ పేరు నిలపుకున్నారని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఎన్టీఆర్ నాటిన రాజకీయ మొక్క... ఎన్టీఆర్ నాటిన రాజకీయ మొక్క అంచలంచెలుగా ఎదిగి ఎందరికో రాజకీయంగా స్పూర్తినిచ్చారని తెలంగాణ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన మరణం తెలుగు రాజకీయాల్లో తీరిని లోటు అని పేర్కొన్నారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి గాలి ముద్దుకృష్ణమనాయుడు మృతికి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా సంతాపం తెలిపారు. చిత్తూరు జిల్లాలోనే సీనియర్ నాయకుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన హఠాత్తుగా మరణించడం దురదృష్టకరమన్నారు. ‘ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా పనిచేసిన సుదీర్ఘ అనుభవం కలిగిన ముద్దు కృష్ణమనాయుడు మరణించడం చిత్తూరు జిల్లాకు తీరని లోటు. ఒక సాధారణ ఉపాధ్యాయుడిగా పనిచేసిన ముద్దుకృష్ణమనాయుడు విద్యాశాఖ మంత్రిగా పనిచేయడం ఆయన జీవితంలోని అరుదైన సందర్భం. తెలుగుదేశం పార్టీలో నేను ఆయన కలిసి పనిచేసిన సందర్భాలు ఈ సందర్భంగా నాకు గుర్తొస్తున్నాయి. ఆరుసార్లు పుత్తూరు, నగరి ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన నిరాండబరుడుగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి ముద్దుకృష్ణమనాయుడు అకాల మరణానికి చింతిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా.’ అని రోజా తెలిపారు. ‘ఆయన మరణం నా మనసును కలిచివేసింది’ గాలి ముద్దుకృష్ణమనాయుడు మరణం తన మనసును కలిచివేసిందని సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ కుటుంబానికి, నియోజకవర్గ ప్రజలకు ఆ శిరిడి సాయినాధుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు మోహన్ బాబు పేర్కొన్నారు. ‘తిరుపతిలో చదువుకునే రోజుల్లో నేనూ, గాలి ముద్దుకృష్ణమనాయుడు ఒకే రూమ్‌లో ఉండేవాళ్ళం. ఆయన సోదరుడు నా క్లాస్ మేట్. నాకు అత్యంత సన్నిహితుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు. ఎన్నికల సమయంలో ఆయన తరపున ఎన్నోసార్లు ప్రచారానికి కూడా వెళ్ళాను. అలాంటి మిత్రుడి హఠాన్మరణం నా మనసును కలచి వేసింది.’ అని అన్నారు. రాజకీయాల్లో మచ్చలేని వ్యక్తి : లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చిన గాలి ముద్దుకృష్ణమనాయుడు మచ్చలేని వ్యక్తిగా కొనసాగరని నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలవడంతో ఆయన కృషి ఎనలేనిదన్నారు. గాలి ముద్దుకృష్ణమనాయుడి కుటుంబానికి దేవుడు మనోధైర్యం ఇవ్వాలని ఆకాంక్షించారు. -
‘అకాల మరణం జీర్ణించుకోలేకపోతున్నాం’
సాక్షి, హైదరాబాద్ : మాజీమంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు మృతిపట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు. బుధవారం ఉదయం పలువురు ప్రముఖులు కేర్ ఆస్పత్రిలోని ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించి, కుటుంబసభ్యులను పరామర్శించారు. నివాళులు అర్పించిన వారిలో ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, ఎల్ రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి, డీకే సమరసింహారెడ్డి, జానారెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, మండవ వెంకటేశ్వరరావు, నందమూరి హరికృష్ణ, లక్ష్మీపార్వతి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ.. ‘ గాలి ముద్దుకృష్ణమనాయుడి అకాల మరణం జీర్ణించుకోలేకపోతున్నాం. ఎన్టీఆర్ పిలుపు మేరకు ప్రభుత్వ ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి. మంచైనా, చెడైనా అందరికీ అండగా ఉండే వ్యక్తి. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా ఏ పదవిలో ఉన్నా అంకితభావంతో పనిచేశారు. అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా ఎన్టీఆర్‌తో పని చేసినా, చంద్రబాబుతో పని చేసినా మంచి పేరు ఉంది. ఆయన మృతి పార్టీకి తీరని లోటు. ఆ కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నా’ అని అన్నారు. సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్ర్భాంతి గాలి కృష్ణమనాయుడు హఠాన్మరణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. అలాగే మంత్రులు గంటా శ్రీనివాసరావు, యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, వైఎస్ఆర్ సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రస్థానంలో గాలి ముద్దుకృష్ణమనాయుడు ముఖ్య భూమిక పోషించారని, క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ పార్టీకి, ప్రజలకు చేసిన సేవలు మరవలేనివని ముఖ్యమంత్రి అన్నారు. ఆయన కుటుంబసభ్యులుకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే గాలి ముద్దుకృష్ణమనాయుడి మృతిపట్ల గవర్నర్ నరసింహన్ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా చిత్తూరు జిల్లా అభివృద్ధికి పాటుపడిన వ్యక్తి ముద్దు కృష్ణమనాయుడని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. పార్టీకి, రాష్ట్ర ప్రజలకు ఆయన ఎనలేని సేవలు అందించారని తెలిపారు. గాలి ముద్దుకృష్ణమనాయుడి మరణం తెలుగుదేశం పార్టీకి, చిత్తూరు జిల్లాకు తీరనిలోటుగా అభివర్ణించారు. వైఎస్ జగన్ సంతాపం గాలి ముద్దుకృష్ణమనాయుడు మృతిపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ముద్దుకృష్ణమనాయుడు తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో నిరాడంబరుడిగా పేరు తెచ్చుకున్నారని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఆ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని జగన్ పేర్కొన్నారు. -
టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు కన్నుమూత
-
గాలి ముద్దుకృష్ణమనాయుడు కన్నుమూత
సాక్షి, హైదరాబాద్ : మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు (70) ఇకలేరు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం అర్ధరాత్రి తర్వాత తుదిశ్వాస విడిచారు. మూడు నెలల కిందటే గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్న ముద్దుకృష్ణమ.. డెంగ్యూతో బాధపడుతూ రెండు రోజులముందు ఆస్పత్రిలో చేరారు. వైద్యుల ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో చివరికి ఆయన తనువుచాలించారు. మృద్దుకృష్ణమ మరణంతో ఆయన కుటుంబంలో తీవ్రవిషాదం నెలకొంది. మల్టీఆర్గాన్ ఫెయిల్యూర్ వల్లే : జ్వరంతో బాధపడిన ముద్దుకృష్ణమను కుటుంబీకులు తిరుపతి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. ‘‘డెంగ్యూ జ్వరం, బీపీ కంట్రోల్ లేని స్థితిలో ఆదివారం ఆయన ఆస్పత్రిలో చేరారు. రెండురోజుల్లోనే మల్టీఆర్గాన్ ఫెయిల్యూర్ వల్ల పరిస్థితి చేయిదాటిపోయింది’’ అని కేర్ వైద్యుడు డాక్టర్ కళాధర్ తెలిపారు. స్వగ్రామంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు : ముద్దుకృష్ణమ నాయుడి అంత్యక్రియలను ఆయన స్వగ్రామం చిత్తూరు జిల్లాలోని వెంకట్రామాపురంలో నిర్వహించనున్నట్లు కుటుంబీకులు చెప్పారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు ముద్దుకృష్ణమ కుమారుడు జగదీశ్, అల్లుడు వంశీలు తెలిపారు. ఉపాధ్యాయుడి నుంచి మంత్రిగా.. : గాలి ముద్దుకృష్ణమనాయుడు 1947, జూన్9న జన్మించారు. స్వస్థలం చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలంలోని వెంకట్రామాపురం. విద్యాభ్యాసం తర్వాత అధ్యాపక వృత్తిలోకి ప్రవేశించిన ఆయన.. 1983లో ఎన్టీఆర్ పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఆరు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ప్రస్తుతం శాసనమండలిలో సభ్యుడిగా ఉన్నారు. గాలి మృతిపట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. -
అధికార పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌కు, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు మధ్య మాటల యుద్దం జరిగింది. చిత్తూరు జిల్లాలో డెంగీ, అంటువ్యాధులతో అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నా... జిల్లా వైద్య శాఖ సరిగా స్పందించడం లేదని గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆరోపించారు. సరైన వైద్యం అందకపోవడంతో జిల్లా ప్రజలు... చెన్నై, బెంగళూరుకు వెళుతున్నారని అన్నారు. తొమ్మిదేళ్లుగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారిణిని మార్చలేదని అన్నారు. రెండు, మూడేళ్లకే ప్రభుత్వ ఉపాధ్యాయులను బదిలీలు చేస్తున్నారని, అలాంటిది ఆ అధికారిణిని తొమ్మిదేళ్లుగా అక్కడే ఎలా విధుల్లో ఉంటారని అన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లో రక్త పరీక్షల నిర్వహణలో అవినీతిపై మంత్రి కామినేనిని...ముద్దుకృష్ణమనాయుడు నిలదీశారు. టెండర్లను తక్కువ కోట్ చేసినవారిని వదిలేసి, ఎక్కువ కోట్ చేసినవారికి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. దీనిపై సభా సంఘం వేయాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే సభలో సభ్యులు అడగిన ప్రశ్నకు, మీరు అడుగుతున్న ప్రశ్నకు సంబంధం ఏంటని గాలి ముద్దుకృష్ణమనాయుడిపై మంత్రి కామినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్యశాఖపై నిన్న (మంగళవారం) సభలో రెండు గంటలు చర్చించినప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. అంతేకాకుండా మెడల్ టెండర్లు విషయంలో అంతా సవ్యంగా, పారదర్శకంగానే చేశామని అన్నారు. అయితే సభ్యులు అడిగిన ప్రశ్నలకు తాను తప్పకుండా సమాధానం చెబుతానని అన్నారు. -
అభివృద్ధికి ఎమ్మెల్సీ మోకాలడ్డు
వడమాలపేట: నియోజకవర్గంలో ఏ అభివృద్ధి పనిచేయాలన్నా ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు అడ్డు తగులుతున్నారని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోపించారు. మంగళవారం వడమాలపేటలో జరిగిన వైఎస్సార్సీపీ నగరి నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 35 ఏళ్లు ఎమ్మెల్యేగా పని చేసిన ఆయన చేసిన అభివృద్ధి ఏమిటని ప్రశ్నించారు. గ్రామాల్లో రోడ్లు, మురుగు కాలువలు, పక్కాఇళ్లు లేక ప్రజ లు అవస్థలు పడుతున్నారని తెలిపారు. నగరిలో డైయింగ్ యూనిట్ల వల్ల నీరు కలుషితమవుతోందని, ఆ నీరువల్ల పలు చెరువుల నీరు కలుషితం కాకుండా ఈటీపీ ప్లాంటు ప్రారంభించడానికి కలెక్టర్‌తో మాట్లాడి కృషి చేస్తుంటే అడ్డుపడుతున్నది ఆయన కాదా? అంటూ ప్రశ్నించారు. తాను ఏఅభివృద్ధి తలపెట్టినా తనకు ఎక్కడ మంచి పేరు వస్తుం దోనని అధికారులను బెదిరించి అడ్డుపడుతున్నారని ఆరో పించారు. గాలేరు– నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు పనులు దున్నపోతుపై వాన పడినట్లుగా జరుగుతున్నాయని, ఈ ప్రాజెక్టు కోసం నగరి నుంచి పాదయాత్ర చేస్తానని చెప్పారు. చక్కెర ఫ్యాక్టరీలు మూసివేసి రైతులకు చంద్రబాబు తీరని ద్రోహం చేశారని, బకాయిలు కూడా ఇవ్వకుండా వారిని ఇబ్బంది పెడుతున్నారని విమర్శించా రు. రైతులకు చెరుకు బకాయిలు చెల్లించేదాకా పోరాడతా నని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేయడమే చంద్రబాబు లక్ష్యమని, అందుకే ప్రయివేటు పాఠశాలల విద్యార్థులకే ప్రతిభా అవార్డులు ఇస్తున్నారని విమర్శించారు. ఏ గ్రామానికి వెళ్లినా పిల్లలు చదువుకుని ఖాళీ గా ఉన్నారని చెబుతున్నారని, అందుకోసమే పలు కంపెనీ లతో మాట్లాడి 17న పుత్తూరులో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నామని తెలిపారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకులు చక్రపాణిరెడ్డి, కేజే కుమార్, ఏలుమలై (అమ్ములు), శ్యామ్‌లాల్, జిల్లా నాయకులు భాస్కర్‌రెడ్డి, దిలీప్‌రెడ్డి, సుబ్రమణ్యంరెడ్డి, బాబురెడ్డి, వడమాలపేట ఎంపీపీ మురళీధర్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు సురేష్‌రాజు, మేరీ పాల్గొన్నారు. -
అక్రమాలు నిరూపిస్తే రాజీనామా చేస్తారా ?
వడమాలపేట : జిల్లాలో నగరి నియోజకవర్గం అభివృద్ధిలో నంబర్ వన్ అని ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, అభివృద్ధి పనుల్లో కాదు అక్రమాల్లో నంబర్ వన్ అని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. శనివారం ఆమె వడమాలపేటలో విలేకరులతో మాట్లాడారు. నగరి నియోజకవర్గంలో సీఎం సహాయనిధి నుంచి ఏడు వందల మందికి ఆర్థికసాయం ఇప్పించినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని, అందులో సగం మంది కూడా అర్హులు లేరని విమర్శించారు. దీనిపై తన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని, నిరూపిస్తే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారా? అంటూ సవాలు విసిరారు. నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ప్రతి పంచాయతీకి వెళదామని, 35 ఏళ్లుగా ఆయన చేసిన అభివృద్ధి ఏమిటో... మూడేళ్లలో తాను చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలే చెబుతా రని తెలిపారు. తాము ప్రతిపాదనలు పంపితే మం జూరైన రోడ్లను అధికారులను బెదిరించి రద్దు చేయిస్తున్నారని, ఇదేనా అభివృద్ధి అని ప్రశ్నించారు. మూడేళ్లుగా ఒక్కఇల్లు కూడా మంజూరు చేయలేదన్నారు. చంద్రబాబునాయుడు తనకు రాజకీయ భిక్షపెట్టారని ఎమ్మెల్సీ చెబుతున్నారని, అంతకు పదింతలు పార్టీ కోసం తాను కష్టపడ్డానని తెలిపారు. ఆయనకు రాజకీయ భిక్షపెట్టిన రామారావుకు చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తుంటే కాపాడారా? అని ప్రశ్నిం చారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి చంద్రబాబును బూతులు తిట్టారని, అక్కడ మంత్రి పదవి ఇవ్వలేదని తిరిగి చంద్రబాబు పంచన చేరి ఆయన దేవుడంటున్నారని విమర్శించారు. అలాంటి వ్యక్తికి తనను విమర్శించే అర్హత లేదన్నారు. -
బ్లాక్ మెయిల్ చేస్తున్న ముద్దుకృష్ణనాయుడు
-
ప్రత్యేక హోదా బాబు అడగనే లేదు: గాలి
సాక్షి, చెన్నై: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని తమ నేత, సీఎం చంద్రబాబు కేంద్రాన్ని ఎన్నడూ అడగనే లేదని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ్మనాయుడు చెన్నైలో వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా అన్నది బీజేపీకి సంబంధించిన విషయమని, ఆ నినాదం లేవనెత్తింది కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడేనని చెప్పారు. హోదాతో ఎలాంటి లాభం లేనప్పుడు ప్రజాభీష్టం మేరకు ఇచ్చేయొచ్చుగా అని ప్రశ్నించారు. పుత్తూరు, నగరి పరిధిలోని రైల్వే స్టేషన్లలో ఉన్న సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ చెన్నై దక్షిణ రైల్వే డివిజన ల్ మేనేజర్ అనుపమ్శర్మను కలిసి సోమవారం ముద్దుకృష్ణమ వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కొత్త రాజధాని నిర్మాణానికి ఐదు లక్షల కోట్ల నిధి కావాలని కేంద్రాన్ని చంద్రబాబు అప్పట్లో కోరినట్టు తెలిపారు. అయితే ఎప్పుడూ ప్రత్యేక హోదా కావాలని ఆయన అడగలేదని స్పష్టం చేశారు. -
హోదాపై చంద్రబాబు అసలు గుట్టు రట్టు
-
హోదాపై చంద్రబాబు అసలు గుట్టు రట్టు
హైదరాబాద్: ప్రత్యేక హోదాకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గుట్టును టీడీపీ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు రట్టు చేశారు. చెన్నైలో మీడియాతో తెర వెనుక మొత్తం రహస్యాన్ని ఆయన వెల్లడించారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని సీఎం చంద్రబాబు ఏనాడు అడగలేదని ఆయన చెప్పారు. విభజన నాడు ఐదు లక్షల కోట్లు ఇవ్వాలని మాత్రమే చంద్రబాబు డిమాండ్ చేసినట్లు తెలిపారు. నేడు 2.25లక్షల కోట్లు ఇచ్చామని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అంటున్నారని, మరి అన్ని కోట్లు ఇస్తే చంద్రబాబు ఏం చేసినట్లు అనే అనుమానం జనాలకు కలుగుతుందని చెప్పారు. అసలు ప్రత్యేక హోదా అనేది కేవలం బీజేపీకి సంబంధించిన విషం మాత్రమేనని, విభజన సమయంలో వెంకయ్యనాయుడు హోదా ప్రస్తావన తీసుకురాకుంటే ఎవరికీ ఆ విషయం తెలిసేది కాదని, ఎవరూ అడిగేవారు కాదని అన్నారు. నాటి ప్రధాని ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామంటే వెంకయ్య, జైట్లీ మాత్రం పదేళ్లు అడిగారని గుర్తు చేశారు. చంద్రబాబు మాత్రం హోదా గురించి ప్రస్తావించకుండా ఇచ్చినవరకు తీసుకుపోదాం.. పోరాడడమెందుకని అన్నారని అసలు విషయం చెప్పారు. ఏపీ ప్రజలు దిక్కు లేకుండా, చెట్టుకింద ఉన్నారని, ఆదుకునే వాళ్లను ఎందుకు వద్దనాలి అని గాలి అన్నారు. ప్రత్యేక హోదా ఇస్తే లాభం లేదని కేంద్రం అంటోందని, లాభం లేనప్పుడు ఇస్తే ఏ నష్టం వస్తుందని గాలి ప్రశ్నించారు. 14వ ఆర్థిక సంఘం కూడా ప్రత్యేక హోదా ఇవ్వొద్దని చెప్పలేదని గాలి స్పష్టం చేశారు. -
'పొమ్మనకుండా పొగ పెడుతున్నారు'
తిరుపతి : కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు ఎం.వెంకయ్యనాయుడుపై టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు నిప్పులు చెరిగారు. శనివారం తిరుపతిలో గాలి ముద్దుకృష్ణమనాయుడు మాట్లాడుతూ.. పొమ్మనకుండా పొగ పెడుతున్నారంటూ బీజేపీ నేతలపై గాలి మండిపడ్డారు. ఎన్డీయే నుంచి వెళ్లిపొమ్మంటే పోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక నిధులు ఏమీ ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. రాజధాని నిర్మాణం కోసం మాత్రం రూ. 350 కోట్లు ఇచ్చారన్నారు. ఇలా అయితే రాజధాని నిర్మాణం ఎన్నో సంవత్సరాలు పడుతోందని గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కొట్టుకున్నారు... తిట్టుకున్నారు
పుత్తూరు టీడీపీలో వర్గపోరు బహిర్గతం ఇద్దరూ ముద్దుకృష్ణమ అనుచరులే పోలీస్‌స్టేషన్‌కు చేరిన పంచాయితీ పుత్తూరు : పుత్తూరు మండల టీడీపీలో కొంతకాలంగా అంతర్గతంగా కొనసాగుతున్న వర్గ పోరు బహిర్గతమైంది. ఆ పార్టీ మండల బాధ్యుడు, మం డల పరిషత్ కో-ఆప్షన్ సభ్యురాలి భర్త బాహాబాహీకి దిగారు. ఈ సంఘటనకు తహశీల్దార్ కార్యాలయ ఆవరణ వేదికైంది. స్ధానికుల కథనం మేరకు సోమవారం సాయంత్రం వర్షం కురుస్తున్నప్పుడు ఆ ఇద్దరూ కలబడి కిందపడి కొట్టుకున్నారు. బూతు లు మాట్లాకున్నారు. ఒకరి గురించి ఒకరు లోపాల ను ఎత్తి చూపారు. బహిరంగంగానే బిగ్గరగా కేక లు వేసుకుంటూ అంతు చూస్తామంటూ సవాళ్లు విసిరారు. స్థానికులు కలుగుజేసుకుని వారికి సర్దిచెప్పా రు. ఈ ఇద్దరూ ఎమ్మెల్సీ ముద్దుకృష్ణమ నాయుడు అనుచరులే. వారిలో ఒకరు ఎంపీపీ వర్గం, మరొకరు మండల ఉపాధ్యక్షుని వర్గానికి చెందినవారు. పార్టీ మండల బాధ్యుడు తహశీల్దార్ కార్యాలయంలోని కంప్యూటర్ విభాగంలోకి రాత్రి సమయాల్లో వెళ్లి ఆపరేటర్ ద్వారా వెబ్‌ల్యాండ్‌లో భూముల వివరాలు సేకరించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై మండల పరిషత్ కో-ఆప్షన్ సభ్యురాలి భర్త సోమవారం సాయంత్రం తహశీల్దార్‌ను సంప్రదిం చి ప్రశ్నించారు. ఆ సమాచారం తెలుసుకున్న పార్టీ మండల బాధ్యుడు ఆగ్రహంతో తహశీల్దార్ కార్యాలయ ఆవరణానికి చేరుకున్నారు. అక్కడే ఉన్న అతనిపై తీవ్ర పదజాలంతో దాడికి దిగారు. పరస్పరం కొట్టుకున్నారు. దీనిపై మంగళవారం పోలీస్ష్టేషన్లో పంచాయితీ పెట్టారు. అందరూ చూస్తుండగానే బాహాబాహీకి తలపడిన వారిపై కేసులు నమోదు కాలేదు. పై పెచ్చు విచారణ పేరు తో పంచాయితీ నిర్వహించిన అంశం చర్చనీయాం శంగా మారింది. ఎలాంటి ఫిర్యాదులు అందలేదు.. టీడీపీ నేతలిద్దరూ కొట్టుకున్నారనే విషయంపై తమకు ఎలాంటి లిఖితపూర్వక ఫిర్యాదులు అందలేదని ఎస్ఐ హనుమంతప్ప తెలిపారు. పంచాయితీ చేస్తున్నారనే విషయంపై అడిగితే అలాంటిదేమీ లేదని ఆయన తెలిపారు. -
'ప్రత్యేక హోదా చంద్రబాబు అడగలేదు'
చిత్తూరు : ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు ఆమోదం పొందే సమయంలో ప్రత్యేక హోదా కావాలని అడిగింది వెంకయ్య నాయుడు, అరుణ్‌జైట్లీనేనని ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. గురువారం చిత్తూరు జిల్లా పుత్తూరు పంచాయితీరాజ్ అతిథి గృహంలో గాలి ముద్దుకృష్ణమ నాయుడు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ గానీ, చంద్రబాబు నాయుడు గానీ విభజన బిల్లు ఆమోదం పొందే సమయంలో ప్రత్యేక హోదాను కోరలేదని ఆయన స్పష్టం చేశారు. హోదా ఇస్తామన్నది కాంగ్రెస్ అయితే, అడిగింది బీజేపీయేనని ఆయన గుర్తు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా వద్దని చంద్రబాబు ఏరోజూ చెప్పలేదన్నారు. ప్రత్యేక హోదా సెంటిమెంట్‌గా మారిందని, హామీని అమలు చేయకుండా బీజేపీ కాకమ్మ కబుర్లు చెబుతూ కాలం వెళ్లదీస్తోందని గాలి ముద్దుకృష్ణమ్మ నాయుడు మండిపడ్డారు. రాష్ట్రానికి రూ. లక్షా నలభై వేల కోట్లు సాయమందించామంటున్న బీజేపీ పెద్దలు ఏ పద్దుకింద... ఏ శాఖకు ఎంత నిధులిచ్చారో స్పష్టం చేయాలని గాలి ముద్దుకృష్ణమనాయుడు డిమాండ్ చేశారు. ఆర్థిక లోటు భర్తీకి రూ. 14 వేల కోట్లని తేల్చితే కేంద్రం మాత్రం ఇచ్చింది రూ. 2500 కోట్లేనని గాలి ముద్దుకృష్ణమ విమర్శించారు. -
'మేం సైలెంట్‌గా ఉన్నామని అనుకోవద్దు'
తిరుపతి: బీజేపీపై టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు గురువారం తిరుపతిలో నిప్పులు చెరిగారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఏపీని బీజేపీ వేధిస్తోందని ఆయన ఆరోపించారు. కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీ ప్రత్యేక హోదాను అడ్డుకుంటున్నారని వారిపై గాలి ముద్దు కృష్ణమ నాయుడు మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీ ఇప్పుడు ఏమైందని బీజేపీని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఇవ్వకుంటే ఉద్యమాలు జరుగుతాయని హెచ్చరించారు. మిత్రపక్షమే కదా అని టీడీపీ సైలెంట్‌గా ఉందని అనుకోవద్దని బీజేపీ నాయకులను గాలి హెచ్చరించారు. హోదా ఇవ్వని పక్షంలో వెంకయ్య, జైట్లీ పదవుల నుంచి దిగిపోవాలని గాలి డిమాండ్ చేశారు. అయితే.. బీజేపీ మంత్రుల గురించి మాట్లాడిన ముద్దు కృష్ణమ.. సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మంత్రుల గురించి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం కొసమెరుపు. -
'ఆ ఘటనతో మాకెలాంటి సంబంధం లేదు'
కాకినాడ : కాపు గర్జన నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణంలో చోటు చేసుకున్న ఘటనలకు... తమకు ఎలాంటి సంబంధం లేదని మాజీ ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. బుధవారం కాకినాడలో వారిద్దరు విలేకర్లతో మాట్లాడుతూ.... టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. తుని ఘటనలో తమ ప్రమేయం లేదని కాణిపాకం ఆలయంలో ప్రమాణం చేస్తామని తెలిపారు. మీరు సిద్ధమా అంటూ గాలి ముద్దుకృష్ణమనాయుడికి ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కురసాల కన్నబాబు సవాల్ విసిరారు. -
'లంచం తీసుకున్న వాడే నేరస్తుడు'
-
'కేసీఆర్ మొదటి దోషి'
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణ సీఎం కేసీఆర్ మొదటి దోషి అని, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ రెండో దోషి అని టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఆరోపించారు. టెలిగ్రాఫిక్ చట్టం ప్రకారం వీరిద్దరిపై చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీ సచివాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ పై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పదేళ్ల వరకు పెత్తనం లేదని సెక్షన్ 8 చెబుతోందన్నారు. గవర్నర్ కే అధికారాలుంటాయని చెప్పారు. ఏదైనా చర్య తీసుకోవాలంటే గవర్నర్ అనుమతి తీసుకోవాలన్నారు. హైదరాబాద్ లో తమ పోలీస్ స్టేషన్ పెట్టుకోవాల్సిన అవసరముందని పేర్కొన్నారు. -
'జగన్, కేసీఆర్ కలిసినట్టు మా వద్ద ఆధారాల్లేవు'
చిత్తూరు: రేవంత్ రెడ్డి వ్యవహారంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కలిసి మాట్లాడుకున్నట్టు తాము చెప్పలేదని.. వాటికి సంబంధించి తమ వద్ద ఆధారాలు కూడా లేవని టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. కొన్ని టీవీలు, వార్తా పత్రికల్లో కథనాలు వచ్చాయని అందుకే తాము మాట్లాడామని సమర్థించుకున్నారు. అంతే తప్ప.. జగన్, కేసీఆర్ కలిసినట్టు ఎలాంటి ఆధారాలు లేవని గాలి అన్నారు. ఓటుకు కోట్లు వ్యవహారంలో 140 మంది ఫోన్లను ట్యాపింగ్ చేశారని.. దీనిపై ఓ నివేదికను కేంద్రానికి పంపించామని తెలిపారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నగరంలోని 150 సంస్థలపై రెండు రాష్ట్రాలకూ హక్కు ఉందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్‌కు హక్కు లేదని తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ చెప్పడం దారుణం అని గాలి ముద్దు కృష్ణమ నాయుడు అన్నారు. -
'హైదరాబాద్ చంద్రబాబు అబ్బ సొత్తే'
-
'హైదరాబాద్ చంద్రబాబు అబ్బ సొత్తే'
హైదరాబాద్ సిటీ: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని నగరం హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అబ్బ సొత్తేనని టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ భవన్లో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్‌లో ఏ అభివృద్ధి జరిగినా అది టీడీపీ హయాంలోనే జరిగిందని అన్నారు. టీఆర్ఎస్ కానీ, ఇతర పార్టీలు కానీ హైదరాబాద్‌కు చేసిందేమీ లేదని ఆయన ఈ సందర్భంగా మండిపడ్డారు. హైదరాబాద్ పై తెలంగాణ నేతలకు ఎంత అధికారం ఉందో, అంతకన్నా ఎక్కువ అధికారం తమకూ ఉందని గాలి ముద్దు కృష్ణమ నాయుడు అన్నారు. -
‘ముద్దుకృష్ణమ’ ఏకగ్రీవం!
గాలి ఒక్కరే నామినేషన్ ముగిసిన ఎమ్మెల్సీ నామినేషన్ల గడువు 19న లాంఛనంగా ప్రకటించనున్న ఎన్నికల అధికారి తిరుపతి: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లు దాఖలు చేసేందుకు మంగళవారం మధ్యాహ్నంతో గడువు ముగిసింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీడీపీ అభ్యర్థి గాలి ముద్దుకృష్ణమనాయుడు ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆయన ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఈనెల 19 తేదీన ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు లాంఛనంగా ఎన్నికల అధికారి, జాయింట్ కలెక్టర్ నారాయణ భరత్ గుప్త ప్రకటించనున్నారు. 12వ తేదీన జిల్లా మంత్రితో పాటు ఎమ్మెల్యేలు, ముఖ్య ప్రజాప్రతినిధులతో కలసి గాలి ముద్దుకృష్ణమనాయుడు తొలుత మూడు సెట్ల నామినేషన్ ఫారాలను సమర్పించారు. మళ్లీ 15వతేదీ సోమవారం ఒక సెట్ నామినేషన్‌ను దాఖలు చేశారు. ఈయన ఒక్కరే మొత్తం నాలుగు సెట్ల నామినేషన్లను ఎన్నికల అధికారికి సమర్పించారు. ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఈ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ పోటీకి అభ్యర్థిని నిలుపలేదు. దీంతో గాలి ముద్దుకృష్ణమనాయుడుకు మార్గం సుగమమైంది. బి.కొత్తకోటకు చెందిన ఓ టీడీపీ నేత పార్టీపై అసంతృప్తితో నామినేషన్ వేసేందుకు వస్తే గాలి అనుచరులు మేనేజ్ చేసినట్టు సమాచారం. సదుం మండలానికి చెందిన ఓ ఎంపీటీసీ సభ్యుడు కూడా స్థానిక నియోజకవర్గ ఇన్చార్జిపై కోపంతో ఈ ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు వచ్చారు. కలెక్టరేట్ ప్రాంతంలోని కాపుకాసిన తెలుగుదేశం నేతలు అతన్ని నామినేషన్ వేయకుండా బుజ్జగించినట్టు తెలుస్తోంది. మదనపల్లి నియోజకవర్గం నిమ్మనపల్లికి చెందిన ఓ నేత కూడా నామినేషన్ వేసేందుకు ప్రయత్నించడంతో టీడీపీ నేతలు సర్ది చెప్పి మేనేజ్ చేసినట్టు తెలుస్తోంది. మొత్తం మీద ఎన్నిక ఏకగ్రీవం చేసేందుకు జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ గౌనివాని శ్రీనివాసులు, జిల్లా ప్రధాన కార్యదర్శి నాని, తిరుపతి టౌన్ బ్యాంకు అధ్యక్షుడు పులుగోరు మురళి, గాలి ముద్దుకృష్ణమనాయుడు అన్న కుమారుడు చినబాబు చిత్తూరు కలెక్టరేట్లోనే ఉండి ఎవరూ నామినేషన్‌ను వేయకుండా తెరవెనుక ప్రయత్నాలు చేశారు. -
ఇది రాజకీయ వ్యభిచారమే : గాలి
పుత్తూరు (చిత్తూరు): తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా ఎన్నికైన తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు మంత్రి పదవి ఇచ్చి రాజకీయ వ్యభిచారం చేస్తున్నది కేసీఆర్ అని మాజీ ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఆరోపించారు. సోమవారం చిత్తూరు జిల్లా పుత్తూరులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కేసీఆర్‌కు ప్రజలు అధికారాన్ని అప్పగిస్తే, సిగ్గు ఎగ్గు లేకుండా ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలుచేసి, నీతి నిజాయితీ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కేసీఆర్ చేసిన అప్రజాస్వామ్యక పనులకు అండమాన్ జైలే గతి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్య క్రమంలో రైతు, డ్వాక్రా రుణమాఫీ అమలు చేస్తుంటే పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఓర్వలేక ప్రభుత్వాన్ని విమర్శించడం శోచ నీయమన్నారు. సూట్‌కేసులు, బ్రీఫ్కేసుల సంస్కృతి కాంగ్రెస్ పార్టీదేనన్నారు. -
ప్రత్యేక హోదాపై మాట్లాడే అర్హత కాంగ్రెస్‌కు లేదు
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు రాజమండ్రి సిటీ : రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీయే కారణమని, ప్రత్యేక హోదా గూర్చి మాట్లాడే అర్హత ఆ పార్టీ నాయకులకు లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు అన్నారు. ఉండవల్లి అరుణ్‌కుమార్, జీవీ హర్షకుమార్లు పదవుల కోసం పాకులాడి చివరకు రాష్ట్రాన్ని నాశనం చేసిన తరువాత బయటకు వచ్చేశారని విమర్శించారు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన టీడీపీ నగర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల ఓట్లు పొందిన కాంగ్రెస్ కోటి సంతకాల కార్యక్రమం కోసం బయలుదేరడ ం హాస్యాస్పదంగా ఉందన్నారు. విభజన బిల్లు సమయంలో సరైన విలువలు పాటించకుండా, ప్రత్యేక హోదాను బిల్లులో నమోదు చేయకుండా మాటవరసకు మాత్రమే ప్రకటించి తెల ంగాణ ప్రకటించేశారన్నారు. విభజన సమయంలో టీడీపీ సమన్యాయం కోసం పోరాడిందన్నారు. రాజధాని నిర్మాణం, నీరు, విద్య, వైద్యం, విద్యుత్ వంటి అంశాల అభివృద్ధి రూ.5 లక్షల కోట్లు ఖర్చవుతుందని చంద్రబాబు మొదటి నుంచీ చెబుతున్నారన్నారు. ఆయన వెంట మేయర్ పంతం ర జనీ శేషసాయి, డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు ఉన్నారు. -
రాజీవ్ పేరును ఎలా కొనసాగించమంటున్నారు?
హైదరాబాద్: రాజీవ్ గాంధీ అవినీతిపరుడని గతంలో కేసీఆర్ విమర్శించారని టీడీపీ నాయకుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు గుర్తుచేశారు. ఇప్పుడు శంషాబాద్ విమానాశ్రయానికి రాజీవ్ గాంధీ పేరును ఎలా కొనసాగించమంటున్నారని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ కు రాజకీయభిక్ష పెట్టిన ఎన్టీఆర్ ను అవమానపరిచేలా తెలంగాణ శాసనసభలో తీర్మానం చేయడం తగదని ఆయన హితవు పలికారు. శంషాబాద్ విమానాశ్రయంలో దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తెలంగాణ రాష్ట్ర శాసనసభ శుక్రవారం తీర్మానించిన నేపథ్యంలో ముద్దుకృష్ణమ నాయుడు స్పందించారు. -
బొజ్జల వర్సెస్ గాలి
ఎత్తుకు పైఎత్తులు డీఆర్వోగా విజయ్‌చందర్ పేరు ఖరారు చివరి నిమిషంలో చక్రం తిప్పిన బొజ్జల ఈ వ్యవహారంలో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు తిరుపతి తుడా: అధికార పార్టీ ముఖ్యనేతల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. జిల్లా డీఆర్వో పోస్టు వ్యవహారం ఇందుకు వేదికైంది. తమకు నచ్చిన.. మెచ్చిన అధికారిని ఆ పోస్టులోకి తీసుకొచ్చేందుకు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. ముందుగా డీఆర్వో పోస్టులోకి జిల్లాకు చెందిన విజయ్‌చందర్‌ను తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నంలో మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు సఫలమయ్యారు. తాను మంత్రిగా ఉండగా జిల్లా ఉన్నతాధికారి నియామకం తాను చెప్పిన వారికే దక్కాలని మరో అధికారి ఎం.వెంకటేశ్వరరావు పేరును బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తెరపైకి తీసుకొచ్చారు. డీఆర్వోగా విజయ్‌చందర్ పేరు ఖరారు జిల్లాకు చెందిన విజయ్‌చందర్‌ను డీఆర్వోగా దాదాపు పేరు ఖరారైందని మంగళవారం జోరుగా ప్రచారం సాగింది. స్థానికుడైన విజయ్‌చందర్‌ను జిల్లా పోస్టులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక జీవోను తీసుకొచ్చి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలిసింది. సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనకు వెళుతూ డీఆర్వోగా విజయ్‌చందర్ పేరును ఖరారు చేసి వెళ్లారు. మరుసటి రోజు బుధవారం కల్లా ఆ జీవోను పక్కన పెట్టించిన మంత్రి మరో జీవో సిద్ధం చేయించినట్టు సమాచారం. సీఎం లేని సమయంలో ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తి అండతో గోపాలకృష్ణారెడ్డి ఈ పోస్టు కోసం చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి తిరిగి వచ్చేవరకు డీఆర్వో నియామక జీవోను(పాత) పక్కన పెట్టాలని తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చినట్టు తెలిసింది. తాను చెప్పిన ఎం.వెంకటేశ్వరరావు (తిరుపతి పూర్వ ఆర్డీవో) పేరుతో తయారు చేసిన జీవోను విడుదల చేయించేందుకు మంత్రి తీవ్రంగా ప్రయత్నిం చేయనున్నట్టు సమాచారం. ఈ వ్యవహారం ముద్దుకృష్ణమకు తెలియడంతో మంత్రిపై కారాలు మిరియాలు నూరుతున్నారు. దీంతో వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. ముఖ్యమంత్రి సింగపూర్ నుంచి తిరిగి వచ్చాక ఎవరి మాట చెల్లుతుందో తేలనుంది. అధికారుల బదిలీల్లోనూ.. జిల్లాకు చెందిన అధికారుల బదిలీల్లోనూ మంత్రి గోపాలకృష్ణారెడ్డి, మాజీ మంత్రి ముద్దుకృష్ణమనాయుడు ఎవరికి వారు పోటీ పడుతు పడుతున్నారని ఆ పార్టీ నాయకులే బాహాటంగా విమర్శిస్తున్నారు. ముఖ్యంగా రెవెన్యూ అధికారుల బదిలీల్లో తమకు అనుకూలమైన వారిని వారు కోరుకన్న స్థానాలకు బదిలీ చేయాలని ఇద్దరూ ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నారని తెలిసింది. -
ఎమ్మెల్సీ నువ్వా...నేనా !
సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన వారు, సీటు ఆశించి భంగపడిన వారు మళ్లీ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తుండడంతో చిత్తూరులో ఖాళీగా ఉన్న ఒక స్థానం కోసం మాజీ మంత్రులు గాలి ముద్దుకృష్ణమనాయుడు, గల్లా అరుణకుమారి, అశోక్‌రాజు రాజధాని బాట పట్టారు. సాక్షి, చిత్తూరు:ఈ ఏడాది రాష్ట్రంలో ఒకేసారి పుర, స్థానిక, సార్వత్రిక ఎన్నికలు నిర్వహించారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి పదవుల భర్తీ పూర్తయింది. టీడీపీ అధికారంలోకి రావడంతో నామినేటెడ్ పోస్టుల భర్తీపై తమ్ముళ్లు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. మార్కెట్, దేవాదాయ శాఖల పాలక మండళ్లను రద్దు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉండడంతో వాటిపై ఆశలు వదులుకున్నారు. దీంతో మరో ఐదే ళ్లు ఏ స్థాయి నాయకుడు ఏ పదవి కోసం చూసే పనిలేకుండా పోయింది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎమ్మెల్యే కోటాలో కోలగట్ల వీరభద్రస్వామి రాజీనామాతో ఒక స్థానం ఖాళీ అయింది. అలాగే కడపకు చెందిన ఎమ్మెల్సీ షేక్‌హుస్సేన్ రాజీనామాతోమరో స్థానం ఖాళీ అయింది. గవర్నర్ కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఉండడం, ప్రస్తుతం ఏడుగురు కొనసాగుతుండడంతో ‘గవర్నర్‌కోటా’పై ఇన్నాళ్లు గందరగోళం నెలకొంది. షేక్ హుస్సేన్ రాజీనామాతో గవర్నర్ కోటా లెక్క సరిపోయింది. ఎమ్మెల్యే కోటాలోని స్థానంలో మంత్రి నారాయణ ఎన్నిక కావడం లాంఛనమే! ఈ ఎన్నికకు ఈ నెల 4న ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఇక స్థానిక సంస్థల ఖాళీల నిర్వహణపై దృష్టి స్థానిక సంస్థల కోటాలో చిత్తూరు, ప్రకాశం, అనంతపురం, తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాల్లో ఒక్కో స్థానం, గుంటూరు జిల్లాలో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటికి ఈ పాటికే ఎన్నికల నిర్వహణ పూర్తి కావల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ బిల్లులో జరిగిన పొరపాటు వల్ల ఆలస్యమైంది. ఏపీలో స్థానిక సంస్థల కోటాలో మండలి స్థానాలు 20 ఉంటే బిల్లులో 17 అని చూపించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పేర్కొన్నప్పుడు 20 అని పేర్కొన్నారు. ఈ తప్పిదంతో ఎన్నికల నిర్వహణ కాస్త ఆలస్యమైంది. దీనికితోడు ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం ఎమ్మెల్సీ స్థానాలను 50 ఉన్నట్లు చూపించారు. విభజన నేపథ్యంలో జనాభా ప్రాతిపదికన మరో 8 స్థానాలు పెంచుకునేందుకు రాష్ట్రానికి అవకాశం ఉంది. ఈ విషయమై వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి ముఖ్యమంత్రితో పాటు ఎన్నికల కమిషన్, గవర్నర్‌కు ఓ లేఖ రాశారు. మరో 8 మండలి స్థానాలను పెంచుకునే అవకాశం రాష్ట్రానికి ఉందని, ఆ ప్రక్రియను వెంటనే పూర్తి చేసి ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఎమ్మెల్యే కోటా ఎన్నిక పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల కోటా నోటిఫికేషన్ విడుదల చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇదే జరిగితే చిత్తూరులో ఉన్న ఒక స్థానం కోసం టీడీపీలో మాజీ మంత్రులు గాలి ముద్దుకృష్ణమనాయుడు, గల్లా అరుణకుమారితో పాటు నగరికి చెందిన మరో నేత అశోక్‌రాజు పోటీ పడుతున్నారు. వీరిలో ఎమ్మెల్సీ పదవిపై గాలి బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఒకానొక దశలో టీటీడీ చైర్మన్ రేసులో నిలిచిన గాలి ముద్దుకృష్ణమ ముఖ్యమంత్రి చంద్రబాబు ‘అభయహస్తం’తో తప్పుకున్నారు. ఎమ్మెల్సీ సీటు ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకుంటానని భరోసా ఇచ్చినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. జిల్లాలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మాత్రమే మంత్రిగా కొనసాగుతున్నారు. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో అత్యధికంగా 8 స్థానాలను వైఎస్సార్సీపీ దక్కించుకుంది. తన సొంత జిల్లాలోనే వైఎస్సార్సీపీ అభ్యర్థులు ప్రభావం చూపడంతో పార్టీ బలోపేతంపై బాబు దృష్టి సారించారు. సీఎంగా తాను ఉన్నప్పటికీ రాజధానికి మాత్రమే పరిమితమయ్యే పరిస్థితి ఉందని, ఈ క్రమంలో బొజ్జలతో పాటు మరో మంత్రి జిల్లాకు ఉండాలని బాబు భావించినట్లు తెలిసింది. ఈ క్రమంలో గాలిని తన మంత్రివర్గంలోకి తీసుకోవాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఎన్నికల్లో పార్టీ కోసం భారీగా డబ్బు ఖర్చుపెట్టానని, తనకు ఎమ్మెల్సీ ఇచ్చి మహిళా కోటాలో మంత్రివర్గంలో స్థానం కల్పించాలని గల్లా అరుణకుమారి కూడా బాబు వద్ద గట్టిగానే వాణి వినిపించేందుకు సిద్ధమయ్యూరు. ఇదే క్రమంలో మర్రిచెట్టు నీడలో పెరిగినట్లుగా గాలి నియోజకవర్గంలో ఉన్నందున ప్రతీసారి తనకు టికెట్టు దూరమవుతోందని, తనకు ఎమ్మెల్సీ సీటు ఇస్తేచాలని, అంతకు మించి వేరే పదవులు వద్దని అశోక్‌రాజు కూడా చంద్రబాబుతో చెప్పేందుకు సన్నద్ధమయ్యారు. చంద్రగిరి, నగరిలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుపొందడం, రెండూ చిత్తూరు పార్లమెంట్ పరిధిలోనివే కావడం, ఎమ్మెల్సీ సీటు ఆశిస్తున్న ముగ్గురూ ఇదే పార్లమెంట్ పరిధిలోనే వారు కావడంతో ఎవరికి సీటు ఇస్తారోనని టీడీపీలో జోరుగా చర్చ సాగుతోంది. మరి బాబు ఎవరి వైపు మొగ్గు చూపుతారో వేచి చూడాలి. -
టీడీపీలో ‘రేషన్’ గోల !
కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అంటే ఇదే! ‘అధికారంలోకి వచ్చాం.. అనుచరగణాన్ని అందలమెక్కిద్దాం’ అని టీడీపీ పాతనేతలు ఆలోచిస్తుంటే.. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చినంత మాత్రాన తమ వర్గానికి అన్యాయం జరిగితే సహించేది లేదని గల్లా వర్గం గట్టిగా వాదిస్తోంది. దీంతో చంద్రగిరి, తిరుపతిలో ‘రేషన్ డీలర్ల’ తొలగింపు.. కొత్త వారి నియామకం టీడీపీలో చిచ్చు రేపుతోంది. తమ్ముళ్ల తగువులాటతో ఎటు అడుగు వేయాలో తెలీక జిల్లా యంత్రాంగం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. చివరకు ఈ పంచాయతీ చంద్రబాబు దృష్టికి వెళ్లిందంటే టీడీపీలో ఇంటిపోరు ఏ స్థాయిలో ఉందో ఇట్టే తెలుస్తుంది. సాక్షి, చిత్తూరు : అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే తెలుగుదేశం పార్టీలో ఇంటిపోరు మొదలైంది. కొన్నేళుగ్లా పార్టీకోసం పనిచేసినవారికి... అధికారం కోసం కాంగ్రెస్ నుంచి టీడీపీకి అరువొచ్చిన వారికి మధ్య వైరం తారస్థాయికి చేరింది. చంద్రగిరి నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న రేషన్ డీలర్లను తొలగించి వారి స్థానంలో తాము సూచించిన వారిని నియమించాలని వలపల దశరథనాయుడు, మాజీమంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు, ఇందు శేఖర్లు పాత జిల్లా కలెక్టర్ రాంగోపాల్‌తో పాటు జాయింట్ కలెక్టర్ శ్రీధర్ దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిసింది. అయితే పాతవారంతా తాను నియమించినవారని, వారంతా తన అనుచరవర్గమని, వారి జోలికి వస్తే ఊరుకునేది లేదని మాజీమంత్రి గల్లా అరుణకుమారి కూడా తనదైన శైలిలో జిల్లా యంత్రాంగానికి హుకుం జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే అధికారులు మాత్రం ఇద్దరి సిఫార్సులను పక్కకునెట్టారు. సీఎం చంద్రబాబుతో విషయం చర్చించి ఆయన చెప్పినట్లు నడుచుకునేందుకు అధికారులు నిర్ణయించుకున్నారు. దీంతో రెండువర్గాలు తమ పంచాయితీని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. మొదటినుంచి టీడీపీలోకి గల్లా అరుణకుమారి రాకను వ్యతిరేకిస్తున్న మాజీమంత్రి గాలిముద్దుకృష్ణమనాయుడు, ఇందుశేఖర్, దశరథనాయుడు ఓవైపు ఉంటే గల్లా అరుణకుమారి ఒక్కరే ఓ వైపు ఉన్నారు. తిరుపతిలో సైతం చదలవాడ కృష్ణమూర్తి, ఎమ్మెల్యే వెంకటరమణ మధ్య కూడా రేషన్‌డీలర్ల వివాదం ముదరుతోంది. ఎవరి వాదన వారిది పదేళ్లుగా కాంగ్రెస్‌పార్టీ అధికారంలో ఉంది. ఈ కాలంలో మంత్రిగా చెలామణి అయిన గల్లా అరుణకుమారి చంద్రగిరి నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తలను తీవ్రంగా ఇబ్బందిపెట్టారని దశరథనాయుడు వర్గం ఆరోపిస్తోంది. తప్పుడు కేసులు, ఆర్థికంగా అణిచివేయడం లాంటి చర్యలతో టీడీపీ శ్రేణులను గడగడలాడించారని వారు చెబుతున్నారు. ఈ క్రమంలో కార్యకర్తలకు అండగా నిలిచి, పార్టీ ఉన్నతి కోసం శ్రమించామని, గల్లాకు వ్యతిరేకంగా పోరాటం చేశామంటున్నారు. పంచాయతీ, సింగిల్‌విండో ఎన్నికల్లో పార్టీ విజయానికి విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుచేసి తాము అప్పులపాలయ్యారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో తనను కాదని కాంగ్రెస్ నుంచి గల్లా అరుణకుమారిని అరువు తెచ్చుకుని టిక్కెట్టు ఇవ్వడంపై చంద్రబాబుపై దశరథ గుర్రుగా ఉన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు మేలు చేయాలనే ఉద్దేశ్యంతో పాతడీలర్లను తొలగించి, కొత్తవారిని నియమించాలని దశరథ, ఇందుశేఖర్ ఓ జాబితా జేసీకి ఇచ్చినట్లు తెలిసింది. వీరికి మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు కూడా మద్దతు పలుకుతున్నారు. కొన్నేళ్ల నుంచి కార్యకర్తలు తనను నమ్ముకుని ఉన్నారని, అలాంటి వారిని తొలగించేందుకు వీళ్లేదని గల్లా కూడా గట్టిగా వాదిస్తున్నారు. పైగా ఎంపీపీ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసిన బడి సుధాయాదవ్ను గాలి, దశరథ, శేఖర్ ఓడించారని, వారి మద్దతుతోనే రెబల్ అభ్యర్థి మునికృష్ణయ్య గెలిచారని గల్లా వర్గం అంటోంది. ఇలా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారి సిఫార్సులను పట్టించుకోవాల్సిన పనిలేదని ఇప్పటికే ఫోన్లో చంద్రబాబుకు చెప్పినట్లు తెలిసింది. తిరుపతిలోనూ ఇదే రగడ తిరుపతి తెలుగుదేశం పార్టీలో కూడా ఇదే రచ్చ నడుస్తోంది. పాత డీలర్లను తొలగించేందుకు మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి చేస్తున్న ప్రయత్నాలకు ఎమ్మెల్యే వెంకటరమణ అడ్డుపడుతున్నారని తెలిసింది. ఆయన కూడా గల్లా వాదననే విన్పిస్తున్నారు. తనకు అండగా ఉన్న నేతలు, కార్యకర్తలే డీలర్లుగా కొనసాగుతున్నారని, అలాంటి వారిని తొలగించేందుకు వీల్లేదని అంటున్నారు. దీంతో టీడీపీ అధికారంలోకి రాకముందు గల్లా, వెంకటరమణ పెత్తనమే కొనసాగిందని, వారి మద్దతుదారులే డీలర్లుగా ఉన్నారని, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వారే ఉంటే తమ సంగతేంటని పాత టీడీపీ కార్యకర్తలు వారి నాయకుల వద్ద వాదిస్తున్నారు. మరి చంద్రబాబు ఏవైపు మొగ్గుతారో.. ఏ నేతకు అండగా నిలుస్తారో వేచి చూడాలి. -
'ముద్దుకృష్ణమా... మీరే మా గవర్నర్'
హైదరాబాద్ : టీడీఎల్పీ ఉపనేత గాలి ముద్దుకృష్ణమనాయుడు నిన్న శాసనసభ నిరవధికంగా వాయిదా పడిన తర్వాత అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడుతుండగా...అదే సమయంలో ఇన్నర్ లాబీల్లో నుంచి వచ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు... ఆయన్ను చూసి 'సార్ ...రాష్ట్రం విడిపోతుందని ఏమీ బాధపడకండి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే మిమ్మల్ని గవర్నర్‌గా నియమించుకుంటాం. హిజ్ ఎక్స్‌లెన్సీ అని గౌరవంగా పిలుచుకుంటాం' అని పేర్కొన్నారు. దీంతో అక్కడే ఉన్న విలేకర్లు స్పందిస్తూ ...'మరి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సంగతి ఏమిటి' అని ప్రశ్నించారు. అయితే ఇద్దరికి చెరో రెండున్నర సంవత్సరాలు అవకాశం కల్పిస్తామని హరీశ్ బదులిచ్చారు. అప్పుడే అక్కడకు వచ్చిన రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ...'మీమ మామ (కేసీఆర్)కు సన్నిహితులైన వారికేనా గవర్నర్ గిరీ ఇప్పించేది మిగిలిన వారి సంగతి ఏమిటి' అని అనడంతో హరీశ్ అక్కడ నుంచి నవ్వుతూ నిష్క్రమించారు. -
ముద్దుకృష్ణమా.. మీరే మా గవర్నర్: హరీశ్
సాక్షి, హైదరాబాద్: టీడీఎల్పీ ఉపనేత గాలి ముద్దుకృష్ణమనాయుడు గురువారం శాసనసభ నిరవధికంగా వాయిదా పడిన తర్వాత అసెంబ్లీ లాబీల్లో మీడియాతో మాట్లాడుతున్నారు. అదే సమయంలో ఇన్నర్ లాబీల్లో నుంచివచ్చిన హరీశ్‌రావు.. ఆయన్ను చూసి, ‘‘సార్.. రాష్ట్రం విడిపోతుందని ఏమీ బాధపడకండి. తెలంగాణ రాష్ర్టం వచ్చిన వెంటనే మిమ్మల్ని గవర్నర్‌గా నియమించుకుంటాం. హిజ్ ఎక్స్‌లెన్సీ అని గౌరవంగా పిలుచుకుంటాం’’ అని పేర్కొన్నారు. దీంతో అక్కడే ఉన్న విలేకరులు స్పందిస్తూ.. ‘‘మరి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సంగతి ఏమిటి’’ అని ప్రశ్నించారు. అయితే ఇద్దరికీ చెరో రెండున్నర సంవత్సరాలు అవకాశ ం కల్పిస్తామని హరీశ్ బదులిచ్చారు. అప్పుడే అక్కడకు వచ్చిన రావుల చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ.. ‘‘మీ మామ(కేసీఆర్)కు సన్నిహితులైన వారికేనా గవర్నర్ గిరీ ఇప్పించేది? మిగిలిన వారి సంగతి ఏమిటి’’ అని అనడంతో హరీష్ అక్కడి నుంచి నవ్వుతూ నిష్ర్కమించారు. -
నగరి మున్సిపాలిటీ రద్దు సంగతేంటి?
హామీలు మరచిన ముద్దుకృష్ణమనాయుడు ఓటమి భయంతోనే తప్పుడు ప్రచారం జగన్‌ను విమర్శించే స్థాయి ఆయనకెక్కడిది? ఎమ్మెల్యే ‘గాలి’ తీరుపైఆర్.కె.రోజా ధ్వజం పుత్తూరు, న్యూస్‌లైన్: ఓట్లు, సీటు కోసం ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమనాయుడు ఎంతటి స్థాయికైనా దిగజారుతారనేందుకు నగరి మున్సిపాలిటీని రద్దు చేయిస్తానని ఇచ్చిన హామీనే నిదర్శనమని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యురాలు, నగరి నియోజకవర్గ సమన్వయక కర్త ఆర్.కె.రోజా ధ్వజమెత్తారు. మంగళవారం ఆమె ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. తనది 35 సంవత్సరాల పొలిటికల్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న ముద్దుకృష్ణమ నాయుడు పుత్తూరు, నగరి మేజర్ పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చుకున్నారని గుర్తు చేశారు. టీడీపీలో నగరి నియోజకవర్గం టికెట్టు పొంది, ఓట్ల కోసం నగరి మున్సిపాలిటీని రద్దు చేయిస్తానని, నేతన్నలు పెరిగిన విద్యుత్ చార్జీలను చెల్లించవద్దని, వాటిని రద్దు చేయిస్తానని ప్రలోభపెట్టారన్నారు. ఆయన స్వల్ప ఓట్లతో గట్టెక్కితే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చేతుల్లోకి వెళ్లిందన్నారు. ఈ సాకు చూపించి ఐదేళ్ల కాలాన్ని గడిపేస్తున్నారన్నారు. రానున్న ఎన్నికలకు కొత్త కథను రూపొందించి మహానేత వైఎస్ఆర్పై, ఆయన తనయుడు జగన్‌పై విమర్శనాస్త్రాలను చేయడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. ఆయన కాంగ్రెస్ పాలనలో ఎమ్మెల్యేగా వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఎన్నో అభివృద్ధి పనులు మంజూరు చేయించుకుని అపరభగీరథుడు అంటూ పొగడ్తలు కురిపించారన్నారు. నేడు మహానేతపై చేస్తున్న బురదజల్లే రాజకీయాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. పుత్తూరులో ఓవర్‌బ్రిడ్జ్, సమ్మర్‌స్టోరేజీ, అండర్‌బ్రిడ్జ్ నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులను మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో మంజూరు చేయించుకుని తన అనుచరులకు కాంట్రాక్ట్‌లు అప్పగించుకోలేదా ? అని ప్రశ్నించారు. నగరి నియోజకవర్గంలో జననేత జగన్ నాలుగు రోజుల పర్యటనకు అపూర్వ స్పందన లభించిందన్నారు. దీన్ని ఓర్వలేని ముద్దుకృష్ణమ నాయుడు ఓటమి భయంతో తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. టీడీపీ కోటల్లో సైతం జగన్‌కు జనం అపూర్వ స్వాగతం పలికారన్నారు. దీంతో ముద్దుకృష్ణమ నాయుడుకు మతిభ్రమించి స్థాయి మరచి మరింత దిగజారిపోయి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. -
కుట్ర రాజకీయాలు మానుకోండి
నగరి, న్యూస్‌లైన్: కుట్ర రాజకీయాలు మానుకోవాలని ఎమ్మెల్యే ముద్దుకృష్ణమ నాయుడికి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్య నిర్వాహక మండలి సభ్యురాలు రోజా హితవు పలికారు. నగరిలో ఏర్పాటు చేసిన మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద ఆమె ఆదివారం నివాళులర్పించారు. రోజా మాట్లాడుతూ మహానేతపై ఉన్న అభిమానంతో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు స్థానిక బస్టాండు ప్రాంగణంలో వైఎస్ఆర్ విగ్రహం ఏర్పాటు చేశారన్నారు. ఎవరికీ పోటీగా విగ్రహ స్థాపన చేయలేదన్నా రు. గ్రామాల్లో తాగునీటి సమస్య ఉంటే తాము బోరు వేసి నీటి సౌకర్యం కల్పిస్తే పోటీగా కొన్ని పార్టీలకు చెందినవారు బోరు వేశారన్నారు. ప్రస్తుతం తాము విగ్రహాన్ని ప్రతిష్టిస్తే పోటీగా వారు విగ్రహాన్ని ప్రతిష్టిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే ముద్దుకృష్ణమ నాయుడు తన 35 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎప్పుడైనా ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేశారా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్తో కలిసి తిరుగు తూ చంద్రబాబు నాయుడును, టీడీపీని ఆయన విమర్శించలేదా అన్నారు. నేడు వైఎస్ఆర్ విగ్రహం పెట్టిన తర్వాత ఎన్టీఆర్ విగ్రహం పెట్టించాలని ఆయనకు ఆలోచన రావడం విడ్డూరంగా ఉందన్నారు. ఇలాంటి కుట్ర రాజకీయాలను మానుకోవాలని ఆమె హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ కేజేకుమార్, పార్టీ రూరల్ మండల కన్వీనర్ భాస్కర్‌రెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు కేజేసురేష్, మైనారిటీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రహమాన్, స్థానిక నాయకులు బీఆర్వీ అయ్యప్పన్, రామ్మూర్తి, తిరుమలరెడ్డి, శరత్‌బాబు, జవహర్ రెడ్డి, బిలాల్, చంద్ర, సుబ్రమణ్యం, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. కొలిక్కి వచ్చిన విగ్రహాల వివాదం నగరి పట్టణంలో విగ్రహాల ఏర్పాటు వివాదం ఆదివారం సాయంత్రం కొలిక్కి వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ నాయకులతో స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ శేఖర్, ట్రైనింగ్ డీఎస్పీ చంద్ర, సీఐ జగన్మోహన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సాంబశివరావు, ఎంపీడీవో సీతమ్మ చర్చించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా విగ్రహాలను బస్టాండ్ ప్రాంగణంలో రోడ్డు పక్కన ఏర్పాటు చేసుకోవడానికి నాయకులు అంగీకరించారు. ఈ మేరకు అనువైన స్థలాలను ఇరు పార్టీల వారికి బస్టాండు ప్రాంగణంలో కేటాయించారు. -
అది ‘గాలి’ మాటేనా !
నగరి ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమనాయుడు బీరాలు పోతుంటారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఆయన మరచిపోతుంటారు. శాసనసభ్యుడి తీరు కారణంగా పుత్తూరులో 80 కుటుంబాలు జీవనోపాధి కరువై రోడ్డున పడి అవస్థలు పడుతున్నాయి. పుత్తూరు, న్యూస్‌లైన్ : ఇక్కడ థర్టిఫైవ్ ఇయర్స పొలిటికల్ ఇండస్ట్రీ..అభివృద్ధి అంతా నా హయాంలో జరిగిందే అంటూ నగరి ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమనాయుడు బీరాలు పోతుంటారు. అయితే ప్రజలకు ఇచ్చిన హామీలను ఆయన మరచిపోతుంటారు. ఆయన తీరు కారణంగా 80 కుటుంబాలు రోడ్డున పడి అవస్థలు పడుతున్నాయి. పుత్తూరులోని కార్వేటినగరం రోడ్డు కూడలి వద్ద సుమారు ఎకరా విస్తీర్ణం కలిగిన కోనేటి స్థలం (రెవెన్యూశాఖ లెక్కల్లో కొలను) ఉంది. కోనేటి గట్టున 40 ఏళ్లుగా 80 కుటుంబాలు చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నాయి. శ్రీ కామాక్షి అంబికా సమేత సదాశివేశ్వర దేవస్థానానికి ధూప దీప నైవేద్యాలకు పన్ను చెల్లిస్తున్నాయి. ఈ క్రమంలో పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టడానికి మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రజాప్రతినిధి అనుచరుల్లో ఒకరైన కాంట్రాక్టర్ కన్ను కోనేటి స్థలంపై పడింది. నివాస గృహాలను తొలగించేసి, కోనేరును పూడ్చి వేసి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలనే పథకం రూపొందిం చారు. ఇక్కడి 80 కుటుంబాల వారికి కాంప్లెక్స్ గదుల కేటాయింపులో ప్రాధాన్యం ఇస్తామనే ప్రతిపాదన తీసుకొచ్చారు. అప్పట్లో అధికార పార్టీలో ఉన్న ముద్దుకృష్ణమ నాయుడు నేరుగా కోనేటి గట్టు నివాసితులతో సంప్రదింపులు జరిపినట్లు పలువురు పేర్కొంటున్నారు. బ్యాంకులతో మాట్లాడి రుణం తీసుకుని ఏడాదిలోపు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి ఇస్తామనే ముద్దుకృష్ణమనాయుడి హామీతో 2007 జూలై 31న కోనేటి గ ట్టున ఉన్న నివాసాలను తొలగించారు. ఆగమేఘాలపై కోనేరును మట్టితో పూడ్చేశారు. ఇంతవరకు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించింది లేదు. మరోవైపు 80 కుటుంబాలు జీవనోపాధి కరువై రోడ్డున పడ్డాయి. మెజారిటీ తగ్గిందనే అక్కసుతోనే.. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మారిన ముద్దుకృష్ణమనాయుడికి పుత్తూరు పట్టణ పరిధిలో మెజారిటీ శాతం తగ్గిందనే అక్కసుతోనే పట్టణాభివృద్ధికి కృషి చేయడం లేదనే వాదన వినిపిస్తోంది. అయినవారికి ఆకుల్లో కానివారికి కంచాల్లో అన్న చందంగా వ్యవహరిస్తున్నారంటూ పార్టీకి చెందిన కొందరు సీనియర్లు పెదవి విరుస్తున్నారు. సంపాదన వనరుగా కోనేటి స్థలం సదాశివేశ్వర స్వామి ఆలయ నిర్వహణలో ఉన్న కోనేటి స్థలంపై కొందరి కన్ను పడింది. ఆలయానికి ఆదాయం పేరిట పాలకవర్గం తీసుకున్న నిర్ణయాలు సంపాదన వనరులుగా మారాయి. ప్రతి ఏటా వేలం పాటలో కాంట్రాక్టు పొందుతున్న వారు పవిత్ర ఆలయ స్థలాన్ని అపవిత్రం చేస్తూ నిషేధిత వ్యాపార నిర్వాహకులకు అద్దెకు ఇస్తున్నారు. -
ఆరోపణలు రుజువు చేస్తారా?
గాలి ముద్దుకృష్ణమ ఇంటి ఎదుట వైఎస్సార్సీపీ ఆందోళన చెవిరెడ్డిపై దాడికి యత్నించిన టీడీపీ నాయకులు సాక్షి, తిరుపతి : తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలని డిమాండ్ చేస్తూ చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమ నాయుడి ఇంటి ఎదుట గురువారం వైఎస్సార్సీపీ చంద్రగిరి సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తన వర్గీయులతో ధర్నాకు యత్నించగా టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. చెవిరెడ్డిపై టీడీపీ నాయకులు దాడికి యత్నించడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ముద్దుకృష్ణమ నాయుడు బుధవారం తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ టీటీడీ పేరుతో చెవిరెడ్డి విరాళాలు సేకరించారని, తుమ్మలగుంటలో ఆలయం నిర్మించారని ఆరోపణలు చేశారు. దీంతో తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలంటూ గురువారం చెవిరెడ్డి తన వర్గీయులతో తిరుచానూరు రోడ్డులో ఉన్న ముద్దుకృష్ణమ ఇంటి ఎదుట ధర్నా చేసేందుకు వెళ్లారు. అయితే, అప్పటికే పెద్ద ఎత్తున అక్కడ గుమికూడిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు చెవిరెడ్డి వర్గీయులను అడ్డుకుని దాడికి యత్నించారు. టీడీపీ నాయకులను పక్కకు నెట్టివేసిన పోలీసులు చెవిరెడ్డితో సహా వైఎస్సార్సీపీ నాయకులను అరెస్టు చేసి బలవంతంగా జీపు ఎక్కించారు. దేనికైనా సిద్ధం : చెవిరెడ్డి తాను అవినీతికి పాల్పడినట్లు ముద్దుకృష్ణమనాయుడు రుజువు చేస్తే, దేనికైనా సిద్ధమేనని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ తుమ్మలగుంట చెరువులో ఒక్క సెంటు ఆక్రమించానని తేలినా, అక్కడ ఆలయానికి ఒక్క రూపాయి విరాళం ఇచ్చినట్లు నిరూపించినా, ఎలాంటి శిక్ష విధించినా సిద్ధంగా ఉంటానన్నారు. ఆధారాలతో నిరూపించకపోతే, ఆయనపై పరువు నష్టం దావా వేస్తానన్నారు. ఉపాధ్యాయుడుగా జీవితాన్ని ప్రారంభించిన గాలికి బెంగళూరులో 25 ఎకరాల ఫామ్ హౌస్, హైదరాబాద్‌లో మూడు బంగళాలు ఎక్కడ నుంచి వచ్చాయో చెప్పాలని సవాల్ విసిరారు. -
ముద్దుకృష్ణమ నివాసం వద్ద ఉద్రిక్తత
తిరుపతి: టీడీపీ ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఇంటి ముందు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ధర్నా చేశారు. ముద్దుకృష్ణమ నాయుడు తనపై తప్పుడు ఆరోపణలు చేశారని ఆరోపిస్తూ ఆయన ఆందోళనకు దిగారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని, లేకుంటే క్షమాపణ చెప్పాలని చెవిరెడ్డి డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పే వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు. ముద్దుకృష్ణమ నాయుడు తీరుగా వ్యతిరేకంగా చెవిరెడ్డి మద్దతుదారులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో ముద్దుకృష్ణమ నాయుడు నివాసం ఎదుట పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. -
'టీ బిల్లు కోసం ఎమ్మెల్యేలను దిగ్విజయ్ కొంటున్నారు'
తెలంగాణ బిల్లును అసెంబ్లీలో నెగ్గించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్ ఎమ్మెల్యేలకు కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఆరోపించారు. అందుకోసమే ఆయన నిన్న హైదరాబాద్ వచ్చారంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం ముద్దుకృష్ణమ నాయుడు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ... దిగ్విజయ్ సింగ్ సొంత రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ గాలికి కొట్టుకుపోయిందని ఎద్దేవా చేశారు. సొంత రాష్ట్రంలో కాంగ్రెస్‌ను గెలిపించుకోలేని వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌ను ఎలా విభజిస్తారంటూ దిగ్విజయ్‌పై నిప్పులు కక్కారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టేందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చిందని గాలి మండిపడ్డారు. -
పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశం
హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పార్టీ ముఖ్య నేతలతో మంగళవారం సమావేశం అయ్యారు. ఈ భేటీలో జీవోఎం నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశానికి వెళ్లరాదని పార్టీ నిర్ణయించింది. ఈ సందర్భంగా పార్టీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు మాట్లాడుతూ అఖిలపక్ష సమావేశానికి వెళ్లరాదని టీడీపీ నిర్ణయం తీసుకుందన్నారు. రెండు ప్రాంతాలకు చెందిన ప్రతినిధులను పిలిచి మాట్లాడాలన్నదే తమ డిమాండ్ అన్నారు. దీనిపై లేఖ ఎవరికి రాయాలనే అంశంపై సాయంత్రం మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకోనున్నట్లు ముద్దుకృష్ణమ నాయుడు తెలిపారు. జీవోఎం రాష్ట్రం అంతా తిరిగి అభిప్రాయాలు సేకరించాలని ఆయన డిమాండ్ చేశారు. -
సమైక్య ఉద్యమాన్ని కొనసాగించాలి: గాలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను నిరసిస్తూ చేపట్టిన సమైక్య ఉద్యమాన్ని కొనసాగించాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు సీమాంధ్ర ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం విజయనగరం వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్ని గుండంగా మార్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని ఆయన పేర్కొన్నారు. యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు రాష్ట్ర విభజనకు ముఖ్య కారకులని గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆరోపించారు. -
సోనియాను వెన్నుపోటు పొడిచి పార్టీ పెట్టారు: గాలి ముద్దుకృష్ణమ నాయుడు
సాక్షి, హైదరాబాద్: సోనియాగాంధీని వెన్నుపోటు పొడిచి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబసభ్యులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారని తెలుగుదేశం శాసనసభాపక్ష ఉప నాయకుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఆరోపించారు. రాజశేఖరరెడ్డిని సోనియాగాంధీ రెండుసార్లు ముఖ్యమంత్రిని చేశారన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడిని వెన్నుపోటుదారుడని విమర్శించే అర్హత వారికి లేదన్నారు. గురువారం ఎన్టీఆర్ భవన్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలోని తాజా పరిణామాల నేపథ్యంలో రాష్ట్రపతి పాలన విధించటం మంచిదన్నారు. ఈ విలేకరుల సమావేశానికి సాక్షి ప్రతినిధిని అనుమతించలేదు. వివిధ మార్గాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్త ఇస్తున్నాం. ఒకవేళ సాక్షిని అనుమతించి ఉంటే గాలిని ఈ ప్రశ్నలు అడిగేది. ఇచ్చిన మాటకు కట్టుబడి పార్టీని, పదవినీ వదులుకుని కొత్త పార్టీ పెట్టుకోవడాన్ని వెన్నుపోటు అని చెబుతున్నారే? టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి బలవంతంగా గద్దె దింపి మీ నాయకుడు చంద్రబాబు అధికారం చేజిక్కించుకున్న విధానం వెన్నుపోటు కాదా? 2009 సాధారణ ఎన్నికలకు ముందు టీడీపీలో చేరేవరకూ ఎన్టీఆర్ టీడీపీలో, ఆ తరువాత కాంగ్రెస్‌లో కొనసాగిన మీరు చంద్రబాబును వెన్నుపోటుదారుడని లెక్కలేనన్ని సార్లు విమర్శించారు కదా? మీరు టీడీపీలో చేరడంతోనే చంద్రబాబు వెన్నుపోటుదారుడు కాకుండా పోయారా? -
మావి ఉత్తుత్తి రాజీనామాలు కాదు: గాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ శాసనసభ్యత్వాలకు తాము చేసిన రాజీనామాలు ఉత్తుత్తివి కాదని టీడీపీ శాసనసభాపక్ష ఉప నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు అన్నారు. స్పీకర్ ఫార్మాట్లోనే లేఖలు ఇచ్చామని చెప్పారు. బుధవారం టీ డీఎల్‌పీలో గాలి విలేకరులతో మాట్లాడారు. తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తూ స్పీకర్‌కు రాసిన లేఖను ప్రదర్శించారు. తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ స్పీక ర్ ఫార్మాట్లోనే రాజీనామాలు చేశారన్నారు. తెలంగాణ ప్రాంత టీడీపీ నేతలు కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్టు వస్తున్న వార్తలపై పార్టీ అధ్యక్షుడు స్పందిస్తారన్నారు. ఈ విలేకరుల సమావేశానికి సాక్షి ప్రతినిధిని అనుమతించలేదు. వివిధ రూపాల్లో సేకరించిన సమాచారం మేరకు ఈ వార్త ఇస్తున్నాం. ఒకవేళ అనుమతించి ఉంటే గాలికి ఈ క్రింది ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టేది. 1. మీరు, మీ పార్టీ ఎంపీలు నిబంధనల మేరకే రాజీనామాలు సమర్పిస్తే ఒక్క హరికృష్ణ రాజీనామా మా త్రమే ఎందుకు ఆమోదం పొందింది. మిగతా ఎంపీల రాజీనామాలు ఎందుకు ఆమోదం పొందలేదు? అంటే ఒక్క హరికృష్ణ మాత్రమే నిబంధనల మేరకు రాజీనామా చేసినట్టు కదా? 2. మీ పార్టీ ఎంపీలు రాజీనామాలు ఆమోదం పొందని విధంగా షరతులతో కూడిన లేఖలు ఇచ్చారని హరికృష్ణ చెప్పిన విషయంపై మీరేమంటారు? 3. మీలో కొందరు రాజీనామా చేశామని చెబుతున్నారు. మరి మీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రాజీనామా చేయరా? చేయమని మీ పార్టీ నేతలెవరూ కోరడం లేదా? -
వైఎస్సార్సీపీది మొసలి కన్నీరు
సాక్షి, హైదరాబాద్: కుప్పం నుంచి శ్రీకాకుళం వరకూ సముద్రపు నీళ్లు తప్ప మంచినీళ్లు లేవంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మొసలి కన్నీరు కారిస్తే ప్రజలు నమ్మరని టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి దుష్పరిపాలనే అందుకు కారణమని సోమవారం ఆయన ఆరోపించారు. కృష్ణా ఆయకట్టు, పోలవరం నీళ్లు. జలయజ్ఞం గురించి వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడటాన్ని రైతులు ఏవగించుకుంటున్నారన్నారు. ఈ మేరకు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మకు రాసిన ఐదు పేజీల బహిరంగ లేఖను ఆయన విడుదల చేశారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓదార్పు యాత్ర, ఆయన మాతృమూర్తి, సోదరి షర్మిల యాత్ర అన్నీ అధికారం కోసమేనని, సమైక్యాంధ్ర శంఖారావం కూడా అందుకోసమేనని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర విభజన వల్ల పలు సమస్యలొస్తాయంటూ తొలుత స్పందించింది చంద్రబాబేనాన్నరు. 2014 ఎన్నికలయ్యాక కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతిస్తామని జగన్, విజయమ్మ ఎన్నోసార్లు చెప్పారని, 2011 నవంబరు 11న హిందుస్తాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా జగన్ ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పారని అన్నారు. ఈ ప్రశ్నలకు బదులేదీ? గాలి విలేకరుల సమాశానికి ‘సాక్షి’ ప్రతినిధిని అనుమతించలేదు. అనుమతించి ఉంటే ఆయనకు ‘సాక్షి’ ఈ కింది ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టేది... రాష్ట్రం విడిపోతే మహారాష్ట్ర, కర్నాటక నుంచి కృష్ణా జలాల రాక గగనమవుతుందన్న వైఎస్సార్సీపీ వాదనను మీరు ఆక్షేపిస్తున్నారు. అంటే రాష్ట్రం విడిపోయినా సీమాంధ్రలో నీటికి ఎలాంటి ఇబ్బందీ ఉండదని మీ అభిప్రాయమా? బాబు సీఎంగా ఉండగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని పట్టించుకోకపోవటాన్ని విస్మరించారా? ఆల్మట్టి ప్రాజెక్టును కర్ణాటక పూర్తి చేసింది బాబు హయాంలోనే కదా! దాని నిర్మాణం పూర్తవుతుందని, తత్ఫలితంగా రాష్ట్రంలో కృష్ణా పరివాహక ప్రాంతం ఎడారవుతుందని అప్పుడే హెచ్చ రించినా బాబు పట్టించుకోకపోవడం నిజం కాదా? తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా సీడబ్ల్యూసీ, యూపీఏ సమన్వయ కమిటీ నిర్ణయం తీసుకున్నాక మొదట స్పందించింది చంద్రబాబేనని మీరు చెబుతున్నారు కదా. కానీ సీమాంధ్రలో కొత్త రాజధాని ఏర్పాటుకు నాలుగైదు లక్షల కోట్లు ఖర్చవుతాయని, వాటిని కే ంద్రమే భరించాలని మొదట బాబు డిమాండ్ చేయడం నిజం కాదా? 2014 ఎన్నికల తరవాత కేంద్రంలో ఎవరికి మద్దతివ్వాలన్నది అప్పటి అవసరాలను బట్టి, రాష్ట్ర ప్రయోజనాల కోణంలో ఉంటుందని విజయమ్మ, జగన్ చెప్పారు. అయితే కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలతో బాబు నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారని అదే హిందుస్థాన్ టైమ్స్ ప్రచురించింది. పైగా రాష్ట్రాన్ని విభజిస్తున్న విషయాన్ని కాంగ్రెస్ నేతలు మీకు ముందుగానే చెప్పినట్టు కూడా అందులో స్పష్టం చేసింది. దీనిపై మీరేమంటారు? వైఎస్సార్సీపీ ‘సమైక్య శంఖారావం’ను నాటకమంటున్న మీరు, చంద్రబాబు ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉండాలని ఎందుకు చెప్పడం లేదు? అలా చెప్పనప్పుడు సీమాంధ్రలో బాబు చేస్తున్న బస్సు యాత్ర దేనికోసం? -
మా వాళ్లు గడగడలాడించారు: గాలి
సాక్షి, హైద రాబాద్: వైఎస్సార్ సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాలతో రాజీ డ్రామాలు ఆడుతున్నారని టీడీపీ శాసనసభాపక్ష ఉప నాయకుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు విమర్శించారు. ఎన్టీఆర్ భవన్లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విభజన విషయంలో వారు రోజుకో మాట మాట్లాడుతున్నారన్నారు. సీమాంధ్ర ప్రజల భావోద్వేగాలను నినాదాలతో, ఒళ్లు వాతలు తేలేలా కొట్టుకోవటం ద్వారా సీఎం రమేష్, ఎన్. శివప్రసాద్ పార్లమెంట్‌కు తెలిపి గడగడ లాడించారని చెప్పారు. చంచల్‌గూడ జైల్లో వైఎస్ జగన్ చేస్తున్నది దొంగ దీక్షని, దానికి సోనియా గాంధీ మద్దతు ఉందని ఆరోపించారు. టీడీపీకి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నందుకే సాక్షి మీడియాను బహిష్కరించామన్నారు. ఈ ప్రశ్నలకు బదులేది? విలేకరుల సమావేశాలకు సాక్షి ప్రతినిధిని ఆహ్వానించలేదు. దీంతో వివిధ రూపాల్లో సేకరించిన మేరకు ఈ వార్తను ఇస్తున్నాం. సాక్షిని అనుమతించి ఉంటే ఈ క్రింది ప్రశ్నలు అడిగి సమాధానాలు కోరేది. 1. మీ పార్టీ ఎంపీ హరికృష్ణ రాజీనామా మాత్రమే ఆమోదం పొందింది. రాజీనామాలు చేశామని గొప్పగా చెప్పుకున్న మీ పార్టీ మిగతా ఎంపీల రాజీనామాలు ఎందుకు ఆమోదం పొందలేదు? వారు రాజీనామా చేయకుండానే చేసినట్టు ప్రచారం చేసుకుంటున్నారా? 2. దాదాపు 4 వారాలుగా సీమాంధ్ర ప్రజలు రోడ్లపైకొచ్చి ఆందోళనలు చేస్తున్నా చంద్రబాబు ఇంటికే పరిమితమై తనకేమీ సంబంధం లేనట్టు మౌనవ్రతం పాటిస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు. ఇప్పటికైనా లేఖ వెనక్కి తీసుకుంటామని బాబుతో చెప్పించే అవకాశాలున్నాయా? -
జగన్ దీక్ష వెనుక రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్మోహన్రెడ్డి జైల్లో ఎందుకు నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారో చెప్పాలని టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు డిమాండ్ చేశారు. జైలులో దీక్ష చేసేందుకు చట్టాలు అనుమతిస్తాయా? ఈ విషయంలో కేంద్ర హోంశాఖ వివరణ ఇవ్వాలన్నారు. ఆదివారం ఆయన ఎన్టీఆర్ భవన్లో విలేకరులతో మాట్లాడారు. సీమాంధ్ర మంత్రులంతా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జగన్ దీక్షను ప్రభుత్వమే స్పాన్సర్ చేస్తుందనే అనుమానం కలుగుతోందన్నారు. చంచల్‌గూడ జైలు వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంగా మారిందని, అక్కడి నుంచే వ్యాపార లావాదేవీలన్నీ జరుగుతున్నాయని ఆరోపించారు. దీక్ష చేసి నీరసించిన తర్వాత లేదా అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి తరలిస్తే అప్పుడు పరామర్శల పర్వం నడుస్తుందని, అందుకే వెంటనే జగన్‌ను తీహార్ జైలుకు తరలించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రశ్నలకు బదులేది: ముద్దుకృష్ణమ నాయుడు విలేకరుల సమావేశానికి ‘సాక్షి’ ప్రతినిధిని అనుమతించలేదు. వి విధ రూపాల్లో సమాచారం సేకరించి ఈ వార్తను ఇస్తున్నాం. ఒకవేళ అనుమతిస్తే ఈ ప్రశ్నలకు సమాధానం రాబట్టాలని సాక్షి భావించింది. ఇరు ప్రాంతాల ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా కాంగ్రెస్ ఏకపక్షంగా నిరంకుశ వైఖరితో విభజన నిర్ణయం తీసుకున్నందుకు నిరసనగా జగన్ జైలులో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నట్టు స్పష్టంగా ప్రకటించినప్పటికీ జైలులో ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు కదా.. ప్రజల పక్షాన చంద్రబాబు నిలబడనంత మాత్రాన మరెవరూ అండగా ఉండకూడదన్నది మీ ఉద్దేశమా? సీమాంధ్ర మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారే... మరి చంద్రబాబు, మీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాత్రం పదవులను పట్టుకుని వేలాడుతారా... అన్న ప్రశ్న ఉదయిస్తుంది కదా దానికేమని సమాధానమిస్తారు? -
గాలి ముద్దుకృష్ణమ్మనాయుడితో సిల్లీబ్రాండ్