
సాక్షి, అమరావతి: ఎమ్మెల్సీ ఉప ఎన్నికల షెడ్యూల్ శనివారం విడుదలైంది. మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ, టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు (70) మరణంతో ఉప ఎన్నికను నిర్వహించనున్నారు. ఈ నెల 24న ఎన్నికల నోటిషికేషన్‌ను ఎన్నికల కమిషన్ విడుదల చేయనుంది. మే 21న పోలింగ్ నిర్వహిస్తారు. మే 24న ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితాన్ని వెల్లడించనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో టీడీపీ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు హైదరాబాద్ గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన విషయం తెలిసిందే. స్వస్థలం చిత్తూరు జిల్లా వెంకట్రామపురంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఆయన మృతితో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment