bypolls
-
సీఎం రేవంత్‌రెడ్డిపై సుప్రీం కోర్టు ఘాటు వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, సాక్షి: పార్టీ మారినా ఉప ఎన్నికలు రావంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సీఎం కొంతమేర సంయమనం పాటించాలని.. ఇలాంటి వ్యాఖ్యలు కోర్టు ధిక్కారంగా పరిగణించాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్లపై గురువారం విచారణ జరిగింది. అసెంబ్లీ కార్యదర్శి తరఫున అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ఈ సందర్భంలో.. సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ తరఫు న్యాయవాది ఆర్యమా సుందరం మరోసారి బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. ఉప ఎన్నికలు రావని అసెంబ్లీలో సీఎం ప్రకటించారు. స్పీకర్ తరఫునే ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని ఆయన చెప్పారు. స్పీకర్ తరఫున సీఎం ఎలా కామెంట్ చేస్తారు?. సీఎం ఉప ఎన్నికలు రావని అసెంబ్లీలో చెప్పాక.. పిటిషన్లపై విచారణ జరుగుతుందని మేమెలా నమ్మాలి అని లాయర్ ఆర్యమ వాదించారు.దీంతో అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మరోసారి సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘సీఎం కొంత మేర సంయమనం పాటించాలి. గతంలో కూడా ఇలాగే వ్యవహరించారు. ఇలాంటివాటిని కోర్టు ధిక్కారంగా పరిగణించాల్సి వస్తుంది. మేము సంయమనం పాటిస్తున్నాం. మిగిలిన రెండు వ్యవస్థలు కూడా అదే గౌరవంతో ఉండాలి. అసెంబ్లీలో జరిగిన పూర్తి చర్చను మేము పరిశీలిస్తాం.. .. గత అనుభవం ఉన్న వ్యక్తిగా, ముఖ్యమంత్రి కనీసం కొంత నియంత్రణ పాటించాలి కదా?. ఆ సమయంలో మేము చర్యలు తీసుకోకుండా, సరియైన తీర్పును (contempt) ఇవ్వకుండా తప్పు చేశామా?. మేము రాజకీయ నేతలు ఏం చెబుతున్నారనే దానితో పట్టించుకోము. కానీ ఇదే పరిస్థితిని ఇంతకుముందు ఎదుర్కొన్న వ్యక్తి ఉన్నప్పుడు ఎలా ఉండాలి?..’’ అని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి జస్టిస్ బీఆర్ గవాయి మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ టైంలో న్యాయవాది సింఘ్వీ కలుగజేసుకుని ప్రతిపక్షం నుంచి అంతకుమించిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఇప్పుడు అవన్నీ అప్రస్తుతమని ధర్మాసనం వాటిని పక్కన పెట్టింది. రేవంత్ ఏమన్నారంటే..మార్చి 26వ తేదీన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం రేవంత్ ప్రసంగిస్తూ.. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదని, పార్టీ మారిన ఎమ్మెల్యేలెవరూ ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ‘‘వచ్చే వారమే రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయంటూ బీఆర్ఎస్ నేతలు ఊదరగొడుతున్నారు. కానీ.. ఎట్టి పరిస్థితుల్లోనూ రావు. గత బీఆర్ఎస్ హయాంలో ఉన్న రాజ్యాంగమే ఇప్పుడు కూడా ఉంది. స్పీకర్ వ్యవస్థ, చట్టం అవే ఉన్నాయి. ఏవీ మారలేదు. అలాంటప్పుడు అప్పుడు పార్టీలు మారిన నేతల విషయంలో రాని ఉప ఎన్నికలు ఇప్పుడెలా వస్తాయని వ్యాఖ్యానించారు. -
దేశంలో పలు స్థానాల్లో ఉపఎన్నిక తేదీ మార్పు
ఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. కేరళ, పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొత్తం 14 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నిక తేదీ మార్పు చేస్తూ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 13న ఎన్నికల పోలింగ్ జరగాల్సి ఉండగా.. ఆ తేదీని నవంబర్ 20కి మారుస్తూ ఈసీ తాజాగా నిర్ణయం తీసుకుంది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది.By-polls in Assembly Constituencies in Kerala, Punjab and Uttar Pradesh rescheduled from November 13 to November 20 due to various festivities pic.twitter.com/P2eaNMDhzb— ANI (@ANI) November 4, 2024శ్రీ గురునానక్ దేవ్ ప్రకాష్ పర్వ్ (నవంబర్ 15), కల్పతి రాస్తోల్సవం (నవంబర్ 13-15), కార్తీక పూర్ణిమ (నవంబర్ 15), ప్రకాష్ పర్వ్ వంటి పండుగలను నేపథ్యంలో రాజకీయ పార్టీలు విజ్ఞప్తి మేరకు ఎన్నికల సంఘంగా ఉప ఎన్నికల తేదీని మార్చినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో తొమ్మిది, పంజాబ్‌లో నాలుగు, కేరళలో ఒకటి అసెంబ్లీ స్థానాలుకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు 15 రాష్ట్రాల్లోని మొత్తం 48 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఉపఎన్నిక జరగనుంది. మరోవైపు.. కేరళలోని వయనాడ్ పార్లమెంట్ ఉప ఎన్నిక పోలింగ్‌లో తేదీలో ఎటువంటి మార్పు లేదని ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. -
తొలిసారి పోటీ చేస్తున్నా, భారీ మెజారిటీతో గెలిపించండి: ప్రియాంక
తిరువనంతపురం: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా నేడు(బుధవారం) వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికకు కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్‌కు ముందు కల్పేట కొత్త బస్టాండ్ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ భారీ రోడ్‌షో నిర్వహించారు. ప్రియాంక ర్యాలీకి యూడీఎఫ్ నేతలు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు.అనంతరం బహిరంగ సభలో ప్రియాంక మాట్లాడారు. గత 35 ఏళ్లుగా వివిధ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించానని, మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, తన కోసం తాను ప్రచారం చేసుకుంటున్నానని తెలిపారు. ప్రజలందరి మద్దతు తనకు ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచమంతా తన సోదరుడికి వ్యతిరేకంగా ఉన్న సమయంలో వాయనాడ్ ప్రజలు అండగా నిలిచారని అన్నారు. మీరు ఇచ్చిన మద్దతుతోనే ఆయన దేశంలో 8 వేల కిలోమీటర్ల యాత్ర చేయగలిగారని ఆమె పొగిడారు.‘నా సోదరుడికి మద్దతుగా నిలిచిన మీ అందరికీ మా కుటుంబం రుణపడి ఉంటుందని చెప్పారు. ఆయన ఇప్పుడు మిమ్మల్ని విడిచి వెళ్లాల్సి వచ్చిందని, కానీ నేను ఆయనకు, మీకు మధ్య బంధాన్ని బలోపేతం చేస్తాను. వయనాడ్ నియోజకవర్గం సమస్యల గురించి నా సోదరుడు చెప్పాడు. ఇప్పుడు నేను ప్రత్యక్షంగా మీ సమస్యలు తెలుసుకుంటాను. ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాను. వాయనాడ్‌లో భారీ మెజారిటీతో గెలిపించండి ’ ఆమె హామీ ఇచ్చారు.కాంగ్రెస్ ఎంపీ రాహుల్ మాట్లాడుతూ.. దేశంలో ఇద్దరు ఎంపీలు ఉన్న ఏకైక లోక్‌సభ నియోజకవర్గం వాయనాడ్ అని అన్నారు. దేశంలో ఏ లోక్‌సభ స్థానానికైనా ఒకరే ఎంపీ ఉంటారని, కానీ వాయనాడ్‌కు మాత్రం ఇద్దరు ఎంపీలు ఉంటారని చెప్పారు. ప్రియాంకాగాంధీ అధికారిక ఎంపీగా ఉంటే, తాను అనధికారిక ఎంపీగా కొనసాగుతానని అన్నారు. ఇద్దరం కలిసి వాయనాడ్ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.ప్రియాంక నామినేషన్ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ మాజీ చీఫ్‌లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ హాజరు కానున్నారు. వయనాడ్ జిల్లా కలెక్టర్ ఎదుట ప్రియాంక నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇదిలా ఉండగా తొలిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ. వయనాడ్‌లో ఆమె ముక్కోణపు పోటీ ఎదుర్కొంటున్నారు. దశాబ్దకాలంగా ప్రజాప్రతినిధిగా ఉన్న బీజేప అభ్యర్థి నవ్యా హరిదాస్ ప్రియాంకకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఎల్డీఎఫ్ తరఫున సీపీఐ నేత, మాజీ ఎమ్మెల్యే సత్యన్ మొకెరీ పోటీ చేస్తున్నారు. కాగా ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ, వయనాడ్‌ల నుంచి పోటీ చేసి గెలిచిన రాహుల్ గాంధీ.. వయనాడ్ స్థానాన్ని వదులుకున్నారు. దీంతో ఉపఎన్నిక అనివార్యమైంది. నవంబర్ 13న ఇక్కడ ఉప ఎన్నిక జరగనుంది.#WATCH | Kerala: Congress leader and Lok Sabha LoP Rahul Gandhi arrives in Wayanad for the nomination filing of party's national general secretary and his sister, Priyanka Gandhi Vadra for Wayanad Lok Sabha by-elections. Visuals from Sultan Bathery. pic.twitter.com/EgCeMpGolL— ANI (@ANI) October 23, 2024 -
రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేసిన కేంద్ర మంత్రి
భోపాల్: కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ రాజ్యసభ అభ్యర్థిగా బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థిగా జార్జ్ కురియన్ను భోపాల్‌లో నామినేషన్ వేశారు. జ్యోతిరాదిత్య సింధియా లోక్‌సభకు ఎన్నికవ్వడంతో.. ఖాళీ అయిన మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ స్థానానికి కురియన్ను తమ అభ్యర్థిగా బీజేపీ మంగళవారం సాయంత్రం ప్రకటించింది.ప్రస్తుతం జార్జ్ కురియన్ మోదీ 3.0 కేబినెట్లో ఫిషరీస్, పశుసంవర్ధక పాడి పరిశ్రమ, మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. బుధవారం ఉదయం భోపాల్ చేరుకున్న కురియన్‌కు అక్కడ రాష్ట్ర బీజేపీ చీఫ్ వీడీ శర్మ ఆయనకు స్వాగతం పలికారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి మోహన్‌యాదవ్‌ను ఆయన నివాసంలో కలిశారు. అనంతరం రాష్ట్ర అసెంబ్లీ కాంప్లెక్స్‌లో సీఎం యాదవ్, ఉప ముఖ్యమంత్రులు రాజేంద్ర శుక్లా, జగదీష్ దేవదా, రాష్ట్ర బీజేపీ చీఫ్ శర్మ సమక్షంలో ఆయన నామినేషన్ దాఖలు చేశారని పార్టీ అధికార ప్రతినిధి ఆశిష్ అగర్వాల్ తెలిపారు.ఇక పలు రాష్ట్రాల్లో రాజ్యసభ ఉప ఎన్నికలకు బీజేపీ తన అభ్యర్థులను ఖరారు చేసింది. సెప్టెంబర్ 3వ తేదీన జరగనున్న ఈ ఎన్నికలకు కేంద్రమంత్రులు రణ్‌వీత్‌సింగ్ బిట్టూ (రాజస్థాన్ నుంచి), జార్జి కురియన్ (మధ్యప్రదేశ్ నుంచి)ను అభ్యర్థులగా బరిలో దించింది. బిజూ జనతాదళ్ మాజీ నేత మమత మొహంతను ఒడిశా నుంచి తమ అభ్యర్థిగా ప్రకటించిన కమలం పార్టీ.. బార్ కౌన్సిల్ ఛైర్మన్, సీనియర్ అడ్వకేట్ మనన్ కుమార్ మిశ్రాను బిహార్ నుంచి పోటీకి దించింది. సార్వత్రిక ఎన్నికల్లో బరిలో దిగిన నేపథ్యంలో పలువురు సభ్యులు రాజీనామాలు చేయడం, అలాగే, తెలంగాణలో బీఆర్ఎస్ ఎంపీ కేశవరావు, ఒడిశాలో బిజేడీ ఎంపీ మమతా మొహంత తమ పదవులకు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. -
తిరుగులేని తృణమూల్.. బైపోల్స్‌లో ముందంజ
కోల్‌కతా: వెస్ట్‌బెంగాల్‌లో సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)కి తిరుగులేదని మరోసారి తేలింది. రాష్ట్రంలో నాలుగు అసెంబ్లీ సీట్లకు తాజాగా ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల ఫలితాల్లో టీఎంసీ స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శిస్తూ దూసుకుపోతోంది. మనిక్టల, బాగ్డా, రానాఘాట్ దక్షిణ్, రాయిగంజ్ అసెంబ్లీ సీట్లకు జులై 10న ఉప ఎన్నిక జరిగింది. వీటి ఫలితాలు శనివారం(జులై 13) ఉదయం నుంచి వెలువడుతున్నాయి.ఉప ఎన్నికల పోలింగ్‌లో అధికార టీఎంసీ అక్రమాలకు పాల్పడిందని బీజేపీ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలకు టీఎంసీ కొట్టిపారేసింది. కాగా, ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ టీఎంసీ అత్యధిక ఎంపీ సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. -
ఉప ఎన్నికల ఫలితాలు: బీజేపీపై ఇండియా కూటమి పైచేయి
Updates.. ► దేశంలో ఆరు రాష్ట్రాల్లోని ఏడు స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ మూడు సీట్లలో విజయం సాధించింది. అటు ప్రతిపక్ష పార్టీలు ఉన్న ఇండియా కూటమి నాలుగు స్థానాలను కైవసం చేసుకుంది. జార్ఖండ్‌లో జేఎమ్ఎమ్ అభ్యర్థి బేబి దేవి విజయం సాధించారు. కాంగ్రెస్ కేరళలో ఒక సీటు, బెంగాల్లో టీఎంసీ ఒక సీటు, యూపీలో ఎస్పీ ఒక సీటును సాధించింది. ► ఉత్తరప్రదేశ్‌లోని ఘోసి స్థానంలో జరిగిన ఉపఎన్నికలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి సుధాకర్ సింగ్ విజయం సాధించారు. ► జార్ఖండ్‌లో డుమ్రి నుంచి జార్ఖండ్ ముక్తి మోర్చ అభ్యర్థి బేబి దేవి విజయం సాధించారు. ► పశ్చిమ బెంగాల్, ధూప్‌గురి ఉప ఎన్నికలో టీఎంసీ అభ్యర్థి నిర్మల్ చంద్ర రాయ్ విజయం సాధించారు. TMC candidate Nirmal Chandra Roy wins Dhupguri (West Bengal) bye-election. The counting of votes for Ghosi in Uttar Pradesh and Dumri in Jharkhand is underway. pic.twitter.com/iLRg4KSNMm — ANI (@ANI) September 8, 2023 ► ఉత్తరాఖండ్‌లోని భాగేశ్వర్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పార్వతీ దాస్ విజయం సాధించారు. BJP's Parwati Dass wins Bageshwar (Uttarakhand) bye-election. The counting of votes for Ghosi in Uttar Pradesh, Dhupguri in West Bengal, and Dumri in Jharkhand is underway. pic.twitter.com/maXhiYJ5Ix — ANI (@ANI) September 8, 2023 ► కేరళలోని పుతుపల్లి ఉప ఎన్నికల్లో మాజీ సీఎం ఉమెన్ చాందీ కుమారుడు, కాంగ్రెస్ అభ్యర్థి చాందీ ఓమెన్ విజయం సాధించారు. Kerala bypoll: Congress calls it a "Siren of 2024 elections" as Chandy Oommen wins his father's Puthuppally seat Read @ANI Story | https://t.co/ylbp7e3ReY#Kerala #ChandyOommen #PuthupallyBypoll #Congress pic.twitter.com/awWh5lmDLL — ANI Digital (@ani_digital) September 8, 2023 ►బెంగాల్లో బీజేపీ లీడింగ్‌లో కొనసాగుతోంది. యూపీలో సమాజ్‌వాదీ పార్టీ, కేరళలో కాంగ్రెస్, జార్ఖండ్‌లో ఏజేఎస్‌యూ, ఉత్తరాఖండ్‌లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. ► త్రిపురలో రెండు స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. మూడు సిట్టింగ్ స్థానాల్లో బీజేపీ రెండు చోట్ల విజయం సాధించింది. ► పలు స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. Bypoll Election Trends 2023 Ghosi , uk, west bangal, Tripura, Jharkhand , kerla#GhosiByElection #ghosi #bypolls #Election2023 pic.twitter.com/PfXXBzKOHu — Anurag Saxena (@AnuragSaxena78) September 8, 2023 ► బెంగాల్‌లోని ధూమ్గిరి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. అధికార టీఎంసీ అభ్యర్థి రెండో స్థానంలో ఉన్నారు. DHUPGURI ( SC) ASSEMBLY BYPOLL UPDATE:- AFTER ROUND 2 , BJP is leading by 1564 votes. BJP- 18165 TMC- 17147 CPIM+CONG- 2079 #Dhupguribypoll — राजस्थानी चाचा (@Rajasthani200) September 8, 2023 ► ఉత్తరప్రదేశ్‌లో ఘోసీ ఉప ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి లీడింగ్‌లో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి వెనుకంజలో కొనసాగుతున్నారు. Breaking from Uttar Pradesh bypoll: BJP gets a big shock! SP 17286 BJP 10219 Samajwadi leads by 7000+ votes.#GhosiByPoll — ⓂⒶⓃⒾ ⒶⓎⓎⒶⓁ (@iManiAyyal) September 8, 2023 ► కేరళలోని పుతుపల్లి ఉప ఎన్నకల్లో కాంగ్రెస్ అభ్యర్థి, ఉమెన్ ఛాందీ కుమారుడు చాందీ ఓమెన్ ముందంజలో కొనసాగుతున్నారు. Puthuppally Assembly Bypoll: Kerala ▪️Chandy Oomen(INC): 35767 votes ▪️Jaick C Thomas(CPIM): 18,903 votes ▪️G Lijinlal(BJP): 3667 votes#Puthuppally #PuthuppallyBypoll https://t.co/DJSMrk08yc — राजस्थानी चाचा (@Rajasthani200) September 8, 2023 ► ఆరు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. #WATCH | Jalpaiguri, West Bengal: Security tightened as the counting for the Dhupguri Assembly by-polls to begin shortly. (Visuals from Netaji Subhas Open University) pic.twitter.com/g9GPdtxPOK — ANI (@ANI) September 8, 2023 ఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ను ఓడించేందుకు ప్రతిపక్ష కూటమి(ఇండియా) ఏర్పాటైన విషయం తెలిసిందే. కాగా, ఇండియా కూటమి టెస్టింగ్ టైమ్ ఆసన్నమైంది. పలు రాష్ట్రాల్లో ఈనెల 5న జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఈ క్రమంలో ఆరు రాష్ట్రాల్లో ఏడు స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఏడాది చివర్లో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, 2024లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు వ్యతిరేకంగా ప్రతిపక్షాల బలాన్ని పరీక్షించనున్న నేపథ్యంలో ఈ ఉపఎన్నికల ఫలితాలకు ప్రాధాన్యత సంతరించుకుంది. The counting of votes for the seven assembly seats across six states including Bageshwar in Uttarakhand, Ghosi in Uttar Pradesh, Puthuppally in Kerala, Dhupguri in West Bengal, Dumri in Jharkhand, and Boxanagar and Dhanpur in Tripura, begins. — ANI (@ANI) September 8, 2023 ► ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్, ఉత్తరప్రదేశ్‌లోని ఘోసి, కేరళలోని పుతుపల్లి, పశ్చిమ బెంగాల్‌లోని ధూప్‌గురి, జార్ఖండ్‌లోని డుమ్రీ, త్రిపురలోని బోక్సానగర్, ధన్‌పూర్‌లో ఏడు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ► కాగా, ఘోసీ, డుమ్రీలలో, ప్రత్యర్థి పార్టీలు కొత్తగా ఏర్పడిన కూటమి ఇండియాలో భాగంగా ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాయి. ► ఏడు స్థానాల్లో మూడు (ధన్పూర్, బాగేశ్వర్ మరియు ధూప్‌గురి) బీజేపీకి, ఎస్పీ (ఘోసి), సీపీఐ (ఎం) (బోక్సానగర్), జేఎంఎం (డుమ్రీ), కాంగ్రెస్ (పుతుపల్లి) చేతిలో ఒక్కొక్కటి ఉన్నాయి. బీజేపీలో తిరిగి చేరిన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎమ్మెల్యే, ఓబీసీ నేత దారా సింగ్ చౌహాన్ రాజీనామా చేయడంతో ఉత్తరప్రదేశ్‌లోని ఘోసీ స్థానం ఖాళీ అయింది. #WATCH | Jharkhand: Counting for the Dumri Assembly by-polls underway. pic.twitter.com/n6zZuaS4jg — ANI (@ANI) September 8, 2023 ► ఉత్తరాఖండ్‌లో ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎమ్మెల్యే, క్యాబినెట్ మంత్రి చందన్ రామ్ దాస్ మరణంతో బాగేశ్వర్ స్థానం ఖాళీ అయింది. 2007 నుంచి ఇప్పటి వరకు ఆయన నాలుగుసార్లు ఈ సీటును గెలుచుకున్నారు. ► జార్ఖండ్‌లో, డుమ్రీ అసెంబ్లీ ఉప ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని గిరిదిహ్ జిల్లాలోని పచంభ, కృషి బజార్ సమితిలో ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారి తెలిపారు. మొత్తం 24 రౌండ్ల కౌంటింగ్ జరుగుతుందని, 70 మంది అధికారులను ఈ కసరత్తు కోసం నియమించామని గిరిడిహ్ డిప్యూటీ కమిషనర్ కమ్ ఎలక్షన్ ఆఫీసర్ నమన్ ప్రీష్ లక్రా తెలిపారు. ► త్రిపురలో కౌంటింగ్‌ను పారదర్శకంగా నిర్వహించేందుకు ఈసీ అవసరమైన చర్యలు చేపట్టిందని సీనియర్ పోల్ అధికారి ఒకరు తెలిపారు. సోనామురా బాలికల హెచ్ఎస్ స్కూల్లో బోక్సానగర్, ధన్పూర్ రెండు స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశామని సెపాహిజాలా జిల్లా మేజిస్ట్రేట్ విశాల్ కుమార్ తెలిపారు. ► అక్కడి నుంచి సీపీఐ(ఎం) అభ్యర్థి మిజాన్ హుస్సేన్‌పై బీజేపీ తఫజ్జల్ హుస్సేన్‌ను రంగంలోకి దించింది. ఓటింగ్ సందర్భంగా రెండు నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరిగిందని ఆరోపిస్తూ సీపీఐ(ఎం) కౌంటింగ్‌ను బహిష్కరిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ► పశ్చిమ బెంగాల్‌లోని ధుప్‌గురిలో, జల్పైగురిలోని నార్త్ బెంగాల్ యూనివర్శిటీ రెండవ క్యాంపస్‌లోని స్ట్రాంగ్ రూమ్‌లో కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, రాష్ట్ర పోలీసులు కాపలాగా ఉన్నారని ఒక అధికారి తెలిపారు. 2.6 లక్షల మంది అర్హులైన ఓటర్లలో 76 శాతం మంది ఉప ఎన్నికలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. #WATCH | Jalpaiguri, West Bengal: Security tightened as the counting for the Dhupguri Assembly by-polls to begin shortly. (Visuals from Netaji Subhas Open University) pic.twitter.com/g9GPdtxPOK — ANI (@ANI) September 8, 2023 ► కాంగ్రెస్-లెఫ్ట్ కూటమి అభ్యర్థిగా సీపీఐ(ఎం) ఈశ్వర్ చంద్రరాయ్ పోటీ చేస్తుండగా, అధికార టీఎంసీ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న నిర్మల్ చంద్ర రాయ్‌ను రంగంలోకి దింపింది. కొన్నేళ్ల క్రితం కశ్మీర్లో ఉగ్రవాదులతో పోరాడి మరణించిన సీఆర్పీఎఫ్ జవాన్ భార్య తపసీ రాయ్‌ను బీజేపీ నామినేట్ చేసింది. ► కేరళ పుతుపల్లిలో కాంగ్రెస్ అగ్రనేత ఊమెన్ చాందీ మరణంతో ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేసేందుకు యూడీఎఫ్, ఎల్డీఎఫ్ మధ్య తీవ్ర పోటీ చోటుచేసుకుంది. ఓట్ల లెక్కింపు బసేలియస్ కళాశాలలోని ప్రత్యేక కౌంటింగ్ స్టేషన్లో ఉదయం 8.00 గంటలకు ప్రారంభమవుతుంది. ముందుగా పోస్టల్, సర్వీస్ బ్యాలెట్లను లెక్కించనున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. -
గ్యాస్ సిలిండర్ ధర రూ.3000 అవుతుంది..!
కోల్‌కతా: జల్పైగురి జిల్లాలోని ధుప్గురి ఉపఎన్నికల ప్రచార కార్యక్రమంలో తృణమూల్ కాంగ్రెస్ నేత అభిషేక్ బెనర్జీ బీజేపీ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే ఈసారి గ్యాస్ ధర రూ.3000 అవుతుందని అన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్‌పై రూ.200 తగ్గించడంపై స్పందిస్తూ డైమండ్ హార్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీ బీజేపీ పార్టీపైనా ప్రధాని నరేంద్ర మోదీపైనా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రధాని గ్యాస్ సిలిండర్ ధరను తగ్గిస్తూ ఇది రక్షాబంధన్ కానుక అంటారు.. ఏ.. రక్షాబంధన్ ఐదేళ్లకు ఒక్కసారే వచ్చిందా ఏంటి? ఎన్నికలు దగ్గర పడుతున్నందున ప్రధాని కొత్త డ్రామాకు తెర తీశారన్నారు. 2024 ఎన్నికల్లో ఒకవేళ బీజేపీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే మాత్రం గ్యాస్ ధర రూ.3000కు చేరుతుందని అన్నారు. అదే కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే మాత్రం ఒక సిలిండర్ ధర కేవలం రూ.500కే అందిస్తామని అన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని అన్నారు.. మీకెవరికైనా ఆ డబ్బులు వచ్చాయా అని ప్రశ్నించారు. కేంద్రం ఆ డబ్బులు ఇవ్వకపోగా ఉపాధి హామీ నిధులను నిలిపివేసిందని అన్నారు. వందరోజుల పని దినాలు పథకం కింద పని చేసిన వారికి కూడా డబ్బులు ఎగ్గొట్టారని ఆరోపణలు చేశారు. పైగా వారంతా ఇక్కడికొచ్చి బాంగ్లాదేశ్ నినాదమైన 'జోయ్ బెంగాల్' ని ఇక్కడ బెంగాల్లో నినదించి ఈ ప్రాంతాన్ని అవమానిస్తారు. సెప్టెంబర్ 5న జరగబోయే ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని ఘోరంగా ఓడించాలని ఈ ఓటమికి ఆ అభ్యర్థి ఇంట్లో నుంచి బయటకు రావడానికి కూడా సిగ్గుపడాలని ప్రజలను అభ్యర్ధించారు. ఈ దెబ్బతో బీజేపీ పార్టీకి ప్రజల బలం ఏమిటో తెలిసి రావాలని అన్నారు. ఈ సందర్బంగా అభిషేక్ ఈ ఉపఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే సీఎంతో మాట్లాడి ధుప్గురికి మూడు నెలలో సబ్ డివిజన్ హోదా కల్పిస్తామని అన్నారు. అభిషేక్ బెనర్జీ వ్యాఖ్యలపై స్పందించిన ప్రతిపక్ష నేత సువెందు అధికారి.. ముందు ఆశా వర్కర్ల జీతాలు, గ్రూపు-డి ఉద్యోగుల జీతాలు ఎందుకంత తక్కువగా ఉన్నాయని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రంతో సమానంగా డీఏ చెల్లించే విషయమై ఎంతకాలం ఎదురుచూడాలని ప్రశ్నించారు. మరో బీజేపీ నేత సమీక్ భట్టాచార్య మాట్లాడుతూ.. అభిషేక్ బెనర్జీకి రాజ్యాంగం పట్ల కొంచెం కూడా గౌరవం లేదని ఉంటే ఎన్నికల సమయంలో ఆచరణసాధ్యం కానీ హామీలు ఇచ్చేవారు కాదని విమర్శించారు. ভোট মরশুমে মানুষের মন জয় করতেই রান্নার গ্যাসের দাম ২০০ টাকা কমিয়েছে কেন্দ্রের জনবিরোধী বিজেপি সরকার। আগামী দিনে কেন্দ্রের সরকার বদলে গেলে গ্যাসের দাম কমে ৫০০ টাকা হয়ে যাবে।#TrinamooleNaboJowar #WestBengal #Jalpaiguri pic.twitter.com/eATYbLdtv8 — Trinamoole Nabo Jowar (@TMCNaboJowar) September 2, 2023 ఇది కూడా చదవండి: ఇకపై బహుభార్యత్వం నిషేధం.. డిసెంబర్లో బిల్లు -
మునుగోడు: ఐపీఎల్ తరహాలో జోరుగా బెట్టింగ్?!
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికపై జోరుగా బెట్టింగ్ నడుస్తోంది. ఇందుకోసం బెట్టింగ్ మాఫియా రంగంలోకి దిగింది. ఒకటికి రెండింతలంటూ కోట్ల రూపాయల్లో బెట్టింగ్ నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ హోటల్స్‌లో తిష్ట వేసిన బుకీలు.. ఈమేరకు ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని మరీ అడ్వాన్స్ లు పుచ్చుకుంటున్నారని సమాచారం. డిపాజిట్ సాధించేదెవరు? కోల్పోయేదెవరు అంటూ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. అంతేకాదు.. పోలింగ్ సరళిపై ఐపీఎల్ తరహాలో మునుగోడు ఉప ఎన్నిక బెట్టింగ్‌ను.. బుకీలు రౌండ్ రౌండ్‌కు బెట్టింగ్ నిర్వహణకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. గూగుల్‌పే, ఫోన్‌పే ద్వారా ఆన్లైన్లో పేమెంట్ వ్యవహారం నడుస్తోంది. -
Munugode Bypoll: ఇదీ అమిత్‌షా పర్యటన షెడ్యూల్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో ఈ నెల 21న బహిరంగసభ నిర్వహణకు బీజేపీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. సభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పాల్గొననున్నారు. ఈ మేరకు గురువారం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యాలయం అమిత్ షా పర్యటన షెడ్యూల్ జారీ చేసింది. అమిత్ షా ఆదివారం మధ్యాహ్నం 1:20 గంటలకు బీఎస్ఎఫ్కు చెందిన ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3:40 గంటలకు హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి సాయంత్రం 4 గంటలకు బీఎస్ఎఫ్ ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి 4:15 గంటలకు మునుగోడుకు వచ్చి, 4:25 గంటలకు సభాస్థలికి చేరుకుంటారు. సాయంత్రం 4:40 నుంచి 6 గంటల వరకు సభలో పాల్గొంటారు. 6:25 గంటలకు రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుని 6:30 గంటలకు బీఎస్ఎఫ్ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళతారు. (క్లిక్: మీకు నచ్చితే నీతి.. లేకుంటే అవినీతా?) -
కోమటిరెడ్డి రాజీనామా ఆమోదం.. మనుగోడు ఉప ఎన్నికకు రంగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సోమవారం అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా లేఖను స్పీకర్ ఆమోదించారు. రాజీనామా సమర్పించిన కొన్ని నిమిషాలకే స్పీకర్ ఆమోదం తెలిపారు. దీంతో మునుగోడు ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. నేడు ఈసీకి స్పీకర్ కార్యాలయం సమాచారం ఇవ్వనుంది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు మునుగోడు ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది. కాగా ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన రాజగోపాల్‌రెడ్డి.. తన ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 21న అమిత్ షా సమక్షంలో అధికారంగా బీజేపీలో చేరనున్నారు. అదే రోజు కోమటిరెడ్డిని మునుగోడు అభ్యర్థిగా బీజేపీ ప్రకటించనుంది. సంబంధిత వార్త: స్పీకర్‌కు రాజీనామా సమర్పణ.. కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు -
ఉప ఎన్నికల పోలింగ్: ఓటు వేసేందుకు బారులు తీరిన ఓటర్లు..
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 3 లోక్‌సభ, 7 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో భాగంగా గురువారం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ► అసెంబ్లీ ఉప ఎన్నికలు.. 11 గంటల వరకు పోలింగ్ శాతం.. - ఆత్మకూరు(ఏపీ)-- 24.92 శాతం - అగర్తలా(త్రిపుర)-- 34.26 శాతం - టౌన్ బార్డోవాలి(త్రిపుర)-- 35.43 శాతం - సుర్మా(త్రిపుర)-- 33.50 శాతం - జుబరాజ్‌నగర్(త్రిపుర)-- 29.14 శాతం - మందార్(జార్ఖండ్)-- 29.13 శాతం - రాజింద్ర నగర్(ఢిల్లీ)-- 14.85 శాతం #AssemblyByPolls | Till 11 am, 24.92% voter turnout recorded in Atmakur (Andhra Pradesh) 34.26% in Agartala (Tripura) 35.43% in Town Bardowali (Tripura) 33.50% in Surma (Tripura) 29.14% in Jubarajnagar (Tripura) 29.13% in Mandar (Jharkhand) 14.85% in Rajinder Nagar (Delhi) pic.twitter.com/m5y8A43NHb — ANI (@ANI) June 23, 2022 ► దేశవ్యాప్తంగా 3 లోక్‌సభ, 7 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం.. అసెంబ్లీ స్థానాలు.. - ఆత్మకూరు(ఏపీ)-- 11.56 శాతం - అగర్తలా(త్రిపుర)-- 15.29 శాతం - టౌన్ బార్డోవాలి(త్రిపుర)-- 16.25 శాతం - సుర్మా(త్రిపుర)-- 13 శాతం - జుబరాజ్‌నగర్(త్రిపుర)-- 14 శాతం - మందార్(జార్ఖండ్)-- 13.49 శాతం - రాజింద్ర నగర్(ఢిల్లీ)-- 5.20 శాతం లోక్‌సభ స్థానాలు.. - సంగ్రూర్(పంజాబ్)-- 4.07 శాతం - రాంపూర్(యూపీ)-- 7.86 శాతం - ఆజాంఘర్(యూపీ)-- 9.21 శాతం. Andhra Pradesh | Voting for Atmakur assembly by-polls underway. The seat fell vacant due to the demise of sitting legislator and then industries minister Mekapati Goutham Reddy in February. pic.twitter.com/VjNKRsurzx — ANI (@ANI) June 23, 2022 ► ఢిల్లీలోని రాజీంద్రనగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. Delhi | AAP Rajya Sabha MP Raghav Chadha casts his vote for Rajinder Nagar assembly by-poll. The seat fell vacant after Chadha was elected as an MP. He says, "People will vote to get corruption-free governance and everyone's right to lead a life of dignity." pic.twitter.com/qDsCPgLzbR — ANI (@ANI) June 23, 2022 ► త్రిపురలోని బోర్డోవాలీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా సీఎం మాణిక్ సాహా ఓటు హక్కు వినియోగించుకున్నారు. #TripuraByPolls | CM Manik Saha casts his vote at a polling station in Town Bordowali assembly constituency. By-poll is being held on Agartala, Town Bardowali, Surma and Jubarajnagar assembly seats today. pic.twitter.com/xEvlmQZAKI — ANI (@ANI) June 23, 2022 ► ఈశాన్య రాష్ట్రం త్రిపురలో నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. People cast their vote for #TripuraByPoll. Visuals from National Forensic Sciences University in Agartala. Polling is being held on Agartala, Town Bardowali, Surma and Jubarajnagar assembly seats today. pic.twitter.com/Vgrzsf8Nje — ANI (@ANI) June 23, 2022 ► పంజాబ్‌లో సాంగ్రూర్ లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కేవల్ సింగ్ థిల్లాన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. Punjab | BJP candidate for Sangrur Lok Sabha seat Kewal Singh Dhillon casts his vote as polling is underway in the constituency. The seat fell vacant after AAP's Bhagwant Mann became Punjab CM Voting for bypolls to 3 LS seats & 7 assembly seats is being held today pic.twitter.com/uyenXQbKGi — ANI (@ANI) June 23, 2022 ► ఢిల్లీలోని రాజింద్రానగర్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఆప్ నేత రాఘవ్ చద్దా రాజ్యసభకు వెళ్లడంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా రాజేశ్ భాటీయా, ఆప్ నుంచి దుర్గేష్ పాథక్, కాంగ్రెస్ నుంచి ప్రేమ్‌లత బరిలో ఉన్నారు. Polling underway for bypoll on Delhi’s Rajinder Nagar seat, vacated after AAP’s Raghav Chadha was elected to RS. AAP has fielded Durgesh Pathak against BJP former councillor Rajesh Bhatia and Congress’s Prem Lata. Voting for bypolls to 3 LS seats & 7 assembly seats is underway pic.twitter.com/ISZ0o1DzjQ — ANI (@ANI) June 23, 2022 ► జార్ఖండ్‌లోని మందార్ అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు వేసేందుకు బారులు తీరిన ఓటర్లు. Polling underway for byelection in Jharkhand's Mandar Assembly Constituency. Voting for bypolls to 3 Lok Sabha seats and 7 assembly seats is being held today pic.twitter.com/Gv257RRzXA — ANI (@ANI) June 23, 2022 ► దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. లోక్‌సభ స్థానాలు.. - ఉత్తర ప్రదేశ్‌లో 2 లోక్‌సభ స్థానాలు.. ఆజామ్ఘర్, రాంపూర్, - పంజాబ్‌లో లోక్‌సభ స్థానం సంగ్రూర్. అసెంబ్లీ స్థానాలు.. - త్రిపురలో 4 అసెంబ్లీ స్థానాలు.. అగర్తలా, టౌన్ బార్డౌవాలీ, సుర్మా, జబ్రాజ్‌నగర్, - ఢిల్లీలో అసెంబ్లీ స్థానం రాజీంద్ర నగర్, - జార్ఖండ్‌లో మందార్, - ఏపీలో ఆత్మకూర్. -
మూడు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు.. షెడ్యూల్ ఇదే
న్యూఢిల్లీ: ఒడిశా, కేరళ, ఉత్తరాఖండ్‌లలో ఒక్కో అసెంబ్లీ స్థానానికి మే 31న ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. జూన్ 3న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈసీ ప్రకటనతో సంబంధిత నియోజకవర్గాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఉప ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ బుధవారం విడుదల చేయనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఒడిశాలోని బ్రజ్‌రాజ్‌నగర్, కేరళలోని త్రిక్కక్కర, ఉత్తరాఖండ్‌లోని చంపావత్ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. సీఎం కోసం రాజీనామా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి.. చంపావత్ నియోజకవర్గంలో పోటీ చేయనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలోని ఖతిమా స్థానం నుంచి పుష్కర్ సింగ్ ఓడిపోయారు. ముఖ్యమంత్రి పదవిని నిలబెట్టుకోవాలంటే ఆయన అసెంబ్లీకి ఎన్నిక కావాలి. ఈ నేపథ్యంలో చంపావత్ బీజేపీ ఎమ్మెల్యే కైలాష్ గెహ్టోడి గత నెలలో రాజీనామా చేశారు. (క్లిక్: కొత్త ట్విస్ట్.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి పీకే!) -
AP: 4 జెడ్పీటీసీలు ఏకగ్రీవమే
సాక్షి, అమరావతి: ఏకగ్రీవంగా గెలిచిన విజేతలు ప్రమాణ స్వీకారానికి ముందే చనిపోవడంతో మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్న మూడు జెడ్పీటీసీ స్థానాలు ఈసారి కూడా ఏకగ్రీవాలే అయ్యాయి. మూడింటికి మూడు చోట్లా మరోసారి వైఎస్సార్సీపీ అభ్యర్ధులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైఎస్సార్ జిల్లా లింగాల, గుంటూరు జిల్లా కారంపూడి, కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల జెడ్పీటీసీ స్థానాల్లో గతంలో ఏకగ్రీవంగా గెలిచిన వారు మరణించడంతో ఈ నెల 16న ఉప ఎన్నిక నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. మంగళవారంతో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియగా అన్ని చోట్లా అధికార పార్టీ అభ్యర్ధులే బరిలో నిలవడంతో ఆయా స్థానాలు ఏకగ్రీవమైనట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. కలకడ.. వైఎస్సార్సీపీదే ఇక వీటికి తోడు మొన్నటి ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియకు, పోలింగ్‌కు మధ్య పోటీలో ఉన్న వివిధ పార్టీల అభ్యర్థులు మరణించడంతో వాయిదా పడ్డ 11 జెడ్పీటీసీ స్థానాలకు కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహిస్తోంది. వీటిల్లో ఒక జెడ్పీటీసీ స్థానాన్ని అధికార వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. చనిపోయిన అభ్యర్ధికి సంబంధించిన రాజకీయ పార్టీ నుంచి అదనంగా నామినేషన్ దాఖలుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అవకాశం ఇచ్చింది. చిత్తూరు జిల్లా కలకడ జెడ్పీటీసీ స్థానంలో మరణించిన టీడీపీ అభ్యర్థికి బదులుగా ఆ పార్టీ నుంచి ఎవరూ పోటీలో నిలవలేదు. అక్కడ వైఎస్సార్సీపీ అభ్యర్ధి ఒక్కరే పోటీలో ఉండడంతో ఆ జెడ్పీటీసీ స్థానం ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. మిగిలిన 10 జెడ్పీటీసీ స్థానాల్లో మొత్తం 40 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. సర్పంచి, వార్డు పదవులకు 14న పోలింగ్ రాష్ట్రవ్యాప్తంగా 500 గ్రామ పంచాయతీల పరిధిలో 69 సర్పంచి, 533 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరగనుండగా మంగళవారం సాయంత్రానికి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. 30 సర్పంచి స్థానాల్లో ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసింది. మరో 4 చోట్ల ఒక్కరు కూడా నామినేషన్లు దాఖలు చేయలేదు. మిగిలిన 35 చోట్ల 109 మంది పోటీలో ఉండగా అక్కడ ఈ నెల 14వ తేదీ పోలింగ్ జరగనుంది. 533 వార్డు సభ్యుల పదవుల్లో 380 చోట్ల ఎన్నిక ఏకగ్రీవమైంది. మరో 85 చోట్ల ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. మిగిలిన 68 వార్డుల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా 192 మంది పోటీలో ఉన్నారు. 50 ఎంపీటీసీలు ఏకగ్రీవం.. ఎన్నికలు ఆగిపోవడం, గెలిచిన వారు మృతి చెందడం లాంటి కారణాలతో 176 ఎంపీటీసీ స్థానాల్లో తాజాగా ఎన్నికలు నిర్వహిస్తుండగా నామినేషన్లు ఉపసంహరణ ప్రక్రియ ముగిసే సమయానికి 50 చోట్ల ఏకగ్రీవాలయ్యాయి. ఇందులో 46 చోట్ల అధికార వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా గెలుచుకోగా మూడు చోట్ల టీడీపీ, ఒక చోట ఇండిపెండెంట్ అభ్యర్ధి ఏకగ్రీవంగా గెలుపొందారు. మరో మూడు ఎంపీటీసీ స్థానాల్లో ఒక్కరు కూడా నామినేషన్ దాఖలు చేయలేదు. మిగిలిన 123 చోట్ల ఎన్నికలు జరగనుండగా 328 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగేచోట ఈ నెల 16వ తేదీన పోలింగ్ జరగనుంది. -
ప్రశాంతంగా ముగిసిన బెంగాల్ ఒడిశా ఉపఎన్నికలు
-
బెంగాల్ లో మూడు స్థానాలకు ఉపఎన్నిక పోలింగ్
-
మమతకు పోటీగా బీజేపీ నుంచి న్యాయవాది ప్రియాంక టిబ్రివాల్
-
భవానీపూర్ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది
అప్డేట్స్ ► భవానీపూర్ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 6.30గంటల వరకు 60 శాతంపైగా పోలింగ్ శాతం నమోదైంది. ►ఉదయం 11 గంటల వరకు భవానీపూర్ నియోజకవర్గంలో 21.73 శాతం ఓటింగ్ నమోదు. ► ఉదయం 11 గంటల వరకుజాంగీపూర్ నియోజకవర్గంలో 40.23 శాతం ఓటింగ్ నమోదు. ► ఉదయం 11 గంటల వరకు సంషేర్‌గంజ్ నియోజకవర్గంలో 36.11 శాతం ఓటింగ్ నమోదు. ఉదయం 9 గంటలు ► ఉదయం 9 గంటల వరకు భవానీపూర్ నియోజకవర్గంలో 7.57 శాతం ఓటింగ్ నమోదు. ► ఉదయం 9 గంటల వరకుజాంగీపూర్ నియోజకవర్గంలో 17.51 శాతం ఓటింగ్ నమోదు. ► ఉదయం 9 గంటల వరకు సంషేర్‌గంజ్ నియోజకవర్గంలో 16.32 శాతం ఓటింగ్ నమోదు. ► భవనీపూర్‌లో ఓటర్లకు శానిటైజర్లు, గ్లోవ్స్ పంపిణీ చేస్తున్న ఈసీ ► భబానీపూర్‌లోని మిత్రా ఇన్స్టిట్యూషన్ పోలింగ్ బూత్‌లో ఓటు హక్కను వినియోగించుకున్న 90 ఏళ్ల మనోభాషిణి చక్రవర్తి. #WestBengalBypolls | 90-year-old Manobashini Chakrabarty casts her vote at Mitra Institution polling booth in Bhabanipur pic.twitter.com/mMiAbWOoPx — ANI (@ANI) September 30, 2021 కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బరిలో ఉన్న దక్షిణ కోల్‌కతాలోని భవానీపుర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలిగ్ గురువారం ఉదయం ప్రారంభమైంది. భవానీపూర్‌తోపాటు జాంగీపూర్, సంషేర్‌గంజ్ అసెంబ్లీ స్థానాలకు నేడు ఉప ఎన్నిక జరుగుతోంది. ఉప ఎన్నిక నేపథ్యంలో అధికారులు భద్రతను కట్టదిట్టం చేశారు. 15 కంపెనీల కేంద్ర బలగాలను ఈసీ మోహరించింది. పోలింగ్ బూత్‌ల నుంచి 200 మీటర్ల వరకు సెక్షన్ 144 నిషేధాజ్ఞలను అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. చదవండి: బీజేపీ చేతిలో మమత కీలుబొమ్మ! ఇక భవానీపూర్ నియోజకవర్గంలో తృణమూల్ కాంగ్రెస్ తరఫున మమతా బెనర్జీ బరిలో ఉంటే, బీజేపీ ప్రియాంక టైబ్రెవాల్‌ను బరిలో దింపింది. ఇక సీపీఐ(ఎం) తరపున స్రిజిబ్ బిశ్వాస్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ ఈ ఎన్నికలకు దూరంగా ఉంది. నియోజకవర్గంలోని 97 పోలింగ్ కేంద్రాల్లోని 287 బూత్‌ల లోపల సెంట్రల్ పారా మిలటరీకి చెందిన ముగ్గురేసి జవాన్లను మోహరించారు. పోలింగ్ బూత్ వెలుపల భద్రత కోసం కోల్‌కతాకు చెందిన పోలీసు అధికారులు పహారా కాస్తారు. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల పరిధిలో అయిదుగురికి మించి గుమిగూడడాన్ని నిషేధించారు. ఉప ఎన్నిక ఫలితాలు అక్టోబరు 3న వెల్లడికానున్నాయి. కాగా భవానీపూర్‌లో మమతకి మంచి పట్టు ఉంది. 2011, 2016 ఎన్నికల్లో భవానీపూర్ నియోజకవర్గం నుంచే మమతా బెనర్జీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్‌లోని నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మమతా ..బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయినా మమతా సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆమె ఆరు నెలల్లోగా శాసనసభ లేదా శాసనమండలికి ఎన్నిక కావాల్సి ఉంది. అయితే బెంగాల్ లో శాసనమండలి లేదు. ఈ నేపథ్యంలో భవానీపూర్ నియోజకవర్గంలో గెలిచిన వ్యవసాయ మంత్రి శోబన్‌దేవ్ ఛటోపాధ్యాయ రాజీనామా చేశారు. ఆ స్థానానికి జరుగుతున్న ఉపఎన్నికలో దీదీ పోటీ చేస్తున్నారు. 2011, 2016 ఎన్నికల్లో కూడా మమత.. భవానీపూర్ నుంచే గెలిచి సీఎంగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఉపఎన్నికలో కూడా గెలిచి.. సీఎంగా కొనసాగాలనుకుంటున్నారు. -
దీదీ వర్సెస్ ప్రియాంక సమరానికి సై
-
బెంగాల్ లో ఉపఎన్ని కల వేడి..
-
ఆపరేషన్ హుజూరాబాద్, బీజేపీ యాక్షన్ ప్లాన్
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయాలని బీజేపీ భావిస్తోంది. టీఆర్ఎస్కు ధీటుగా తాము కూడా దూసుకుపోవాలనే ఆలోచనతో బీజేపీ నేతలున్నారు. అధికార పార్టీ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోన్న సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ ఈనెల 16న హుజురాబాద్‌లో బహిరంగసభలో పాల్గొననున్నారు. ఆర్థికమంత్రి హరీశ్‌రావు ఇప్పటికే ఆ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ కేడర్‌ను సమాయత్తపరుస్తున్నారు. జిల్లా మంత్రులు కూడా అక్కడే మకాం వేశారు. ఇలా గులాబీ దళం ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కిస్తుండటం, ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడవచ్చుననే ఊహాగానాల నేపథ్యంలో.. పకడ్బందీ కార్యాచరణను రూపొందించేందుకు బీజేపీ నేతలు సిద్ధమౌతున్నారు. ఈ నెల 24న చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయం నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర మొదలుపెట్టనున్న విషయం తెలిసిందే. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికల తేదీని ఎప్పుడు ప్రకటించినా ఆ వెంటనే పాదయాత్ర ఆ నియోజకవర్గానికి చేరుకునేలా రూట్‌మ్యాప్‌ను రూపొందిస్తున్నారు. ఈలోపు వివిధ రూపాల్లో కార్యక్రమాలతో కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలని కూడా భావిస్తున్నారు. ఉప ఎన్నికల తేదీ ప్రకటనకు ముందే ప్రచార ప్రణాళికను రూపొందించుకుని దానికనుగుణంగా ముందుకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు. ‘స్థానిక’పట్టు సడలకుండా.. టీఆర్ఎస్ టికెట్‌పై హుజురాబాద్ నుంచి వరసగా ఆరు పర్యాయాలు గెలుపొందిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరడంతో.. నిన్నమొన్నటి వరకు ఆయనతో కలిసి పనిచేసిన టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఏ మేరకు సహకరిస్తారనే ప్రశ్న ఉత్పన్నమౌతోంది. రాజకీయ అవసరాలు, ఇతర ప్రయోజనాల కోసం స్థానిక నాయకులు, కార్యకర్తలు అధికార పార్టీ వైపే నిలిచే అవకాశా లు మెండుగా ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని కార్యాచరణ రూపొందించాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. సుదీర్ఘకాలం పాటు ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించినం ఈటల కూడా తనవైన సొంత వ్యూహాలతో ముందుకు వెళుతున్నారు. మొన్నటివరకు తనతో ఉన్నవారు చేజారి పోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బీజేపీ కేడర్‌తో మమేకమై టీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇదే జిల్లాకు చెందినవారు కావడంతో ఆయనకు ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. దీంతో స్థానిక పరిస్థితులపై అవగాహనతో రాజకీయ సమీకరణాలకనుగుణంగా ఎత్తుగడలతో ప్రత్యర్థి పార్టీలతో తలపడాలని భావిస్తున్నారు. -
హుజురాబాద్: వేడెక్కిన రాజకీయం.. సై అంటే సై
సాక్షి, కరీంనగర్: హుజురాబాద్‌లో రాజకీయం వేడెక్కింది. ఉప ఎన్నిక అభ్యర్థి ఖరారైన నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ దూకుడు పెంచింది. గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. జిల్లాకు చెందిన మంత్రి గంగుల కమలాకర్‌తో పాటు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మేనల్లుడు, ఆర్థిక శాఖా మంత్రి హరీశ్‌రావు వరుస పర్యటనలతో ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. మాజీ మంత్రి, హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై విమర్శల వర్షం గుప్పిస్తూ గెల్లును గెలిపిస్తే కలిగే ప్రయోజనాల గురించి వివరిస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో హరీశ్‌రావు- ఈటల రాజేందర్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రైటిస్టుగా ఎందుకు మారినట్లు? ఇల్లందకుంటలో బుధవారం ఏర్పాటు చేసిన ‘ప్రజా ఆశీర్వాద సభ’లో హరీశ్‌రావు మాట్లాడుతూ.. ‘‘అన్నివర్గాల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్న టీఆర్ఎస్ అభ్యర్థి కావాలా? నిత్యం ధరల పెంపుతో, ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ వైపు నడిపిస్తున్న బీజేపీ అభ్యర్థి కావాలో..? ప్రజలు ఆలోచించాలి’’ అంటూ ఈటల రాజేందర్‌తో పాటు బీజేపీపైనా తీవ్ర విమర్శలు చేశారు. అదే విధంగా.. ఈటల గులాబీ జెండా నీడన ఎదిగి, సీఎం కేసీఆర్ గుండెలపై తన్ని వెళ్లిపోయాడని మండిపడ్డారు. రైతుబంధు, దళితబంధు వంటి పథకాలను వ్యతిరేకిస్తున్న రాజేందర్‌కు ఎందుకు ఓటేయాలన్నారు. తొలి నుంచీ తాను లెఫ్టిస్టు అని ప్రకటించుకున్న రాజేందర్.. ఇప్పుడు ఎందుకు అకస్మాత్తుగా రైటిస్టుగా మారాడంటూ హరీశ్ ప్రశ్నల వర్షం కురిపించారు. మామ దగ్గర మార్కుల కోసమే: ఈటల ఇక ఇందుకు స్పందించిన ఈటల రాజేందర్ గురువారం హరీశ్‌రావుకు కౌంటర్ ఇచ్చారు. ‘‘మీ మామ దగ్గర మార్కుల కోసం నాపై అసత్య ప్రచారం చేయకు. హరీష్‌రావు విమర్శలపై బహిరంగ చర్చకు నేను సిద్ధం. నా ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి. పార్టీలో చేరినప్పుడు, ఇప్పుడు ఉన్న ఆస్తులు లెక్క తేలుద్దాం. మీ ఆస్తులపై విచారణకు సిద్ధమా?’’ అని సవాల్ విసిరారు. ‘‘నేను అభివృద్ధి చేయలేదంటున్నారు. మీరు తిరుగుతున్న రోడ్లు నేను వేయించినవే’’ అంటూ తనదైన శైలిలో చురకలు అంటించారు. ఆత్మగౌరవం ఇప్పుడు గుర్తుకు వచ్చిందా: హరీష్‌రావు హరీశ్‌రావు సైతం ఈటలకు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ‘‘ఈటలకు ఆత్మగౌరవం ఇప్పుడు గుర్తుకు వచ్చిందా. హుజురాబాద్‌కు సీఎం కేసీఆర్ 4 వేల ఇళ్లు కేటాయించారు. మరి ఈటల వాటిని ఎందుకు పూర్తి చేయలేదు. హుజురాబాద్ అభివృద్ధి బాధ్యత నేను తీసుకుంటా. బీజేపీకి, ఈటలకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారు’’ అని పేర్కొన్నారు. ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. హరీశ్‌రావు- ఈటల రాజేందర్ మాటల తూటాలు, పరస్పర విమర్శలు, సవాళ్లు హాట్ టాపిక్‌గా మారాయి. కాగా ఈటల రాజీనామాతో హుజురాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. చదవండి: ఈటలను 6సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. కేసీఆర్‌ను ‘రా’ అంటుండు -
సాగర్ ఉప ఎన్నిక: పోలింగ్‌కు సర్వం సిద్ధం!
సాక్షి, నల్గొండ : దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో జరుగుతున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధికార టీఆరెస్, కాంగ్రెస్,బీజేపీలు తమ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం నిర్వహించాయి. ఇక ఇన్నాళ్లూ చేసిన ప్రచారానికి ఓటర్లు తమ మద్దతును, అభిప్రాయాలను ఓటు రూపంలో రేపు పోలింగ్‌లో ఇవ్వనున్నారు. అయితే పోలింగ్ సమయం ఎక్కువగా ఉండడంతో ఆయా పార్టీల అభ్యర్థులు ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో నమోదైన సుమారు 80 శాతంకి పైగా ఈసారి పోలింగ్ శాతం నమోదు చేపించేలా ఆయా పార్టీలు వ్యవహరిస్తున్నాయి. ఈ ఉప ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2లక్షల 20 వేల 300 మంది ఓటర్లు ఉన్న సాగర్ నియోజకవర్గంలో మొత్తం 346 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోన్న నేపథ్యంలో ఓటు వేసేందుకు మాస్క్ తప్పనిసరి నిబంధన చేశారు. కరోనా నేపథ్యంలో రేపు 17న ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లకు సమయాన్ని కేటాయించారు. పోలింగ్‌కు సంబంధించి మొత్తం 5వేల మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. సాగర్ నియోజకవర్గంలో 2లక్షల 20 వేల300 మంది ఓటర్లు ఉండగా లక్ష 9వేల 228 మంది పురుషులు, లక్షా11 వేల72 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకొనున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించి 8151మంది నమోదు చేసుకోగా 1153 మంది తమ ఓటు హక్కును ఇప్పటికే వినియోగించుకున్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో 346 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా అందులో 108 కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 15 మంది పోలీస్ సిబ్బందికి తగ్గకుండా బందోబస్తు నిర్వహించనున్నారు. మొత్తం 346 పోలింగ్ కేంద్రాల వద్ద 4వేల మంది పోలీస్ సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. అందులో 1000 మంది సాయుధ దళాల పోలీసులున్నారు. 41 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఒక్కో పోలింగ్ బూత్ లో 1000మంది ఓటర్లు ఓటు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు. కరోనా నిబంధనలు పాటిస్తూ మాస్క్ ధరించి.. భౌతిక దూరం పాటించేలా సర్కిల్స్ ఏర్పాటు చేశారు. రాత్రి7గంటల వరకు ఓటు వేసేందుకు సమయం ఉండగా చివరి గంట కరోనా పాజిటివ్ వచ్చిన వారికి కేటాయించారు. 7లోపు లైన్ లో ఉన్న వారికి ఓటు వేసేంత వరకు అవకాశం ఉంటుంది. గత ఎన్నికల్లో కంటే మూడు రెట్లు ఎక్కువగా ఇప్పటికే రూ. 90లక్షలకు పైగా డబ్బు, మద్యం స్వాధీనం చేసుకున్నారు..పోలింగ్ అనంతరం నల్గొండ అర్జాలబావి స్ట్రాంగ్ రూంలో సామగ్రి భద్రపరచనున్నారు. సాగర్ ఎన్నికల బరిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు జానారెడ్డి హిల్ కాలనీలో, టీఆరెస్ అభ్యర్థి నోముల భగత్ ఇబ్రహీంపేట, బీజేపీ అభ్యర్థి త్రిపురారం మండలంలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. -
సాగర్ ఉప ఎన్నికపై ప్రత్యేక నిఘా
సాక్షి, నల్గొండ: సాగర్ ఉప ఎన్నికపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు ఎస్పీ రంగనాథ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సాగర్ నియోజకవర్గానికి వెళ్లే అన్ని రూట్లలో చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఉప ఎన్నికకు సంబంధించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. అంతర్రాష్ట్ర సరిహద్దు మాచర్ల వద్ద అదనపు భద్రత పెంచామని ఎన్నికల అధికారుల సూచన మేరకు అవసరమైన చర్యలను తీసుకుంటున్నట్లు తెలిపారు. కరోనా రెండోదశ వ్యాప్తి నివారణకు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, ప్రచారంలో నిబంధనలు పాటించాలని సూచించారు. మాస్కులు లేకుండా ప్రచారంలో పాల్గొన్నా.. అనుమతి లేకుండా సభలు, సమావేశాలు నిర్వహించినా కఠిన చర్యలను తీసుకుంటామని హెచ్చరించారు. ( చదవండి: ఎన్నికల సిత్రాలు చూడరో: నిన్న ఏడుపులు.. నేడు చిందులు ) -
విపక్షాలు చిత్తు.. బీజేపీ క్లీన్‌స్వీప్
సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా జరగుతున్న పలు ఉప ఎన్నికల్లో కేంద్రంలోని అధికార బీజేపీ హవా సాగుతోంది. విపక్షాలను చిత్తు చేస్తూ విజయం దిశగా పయనిస్తోంది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్లో బీజేపీ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఉప ఎన్నికలు జరగుతున్న మొత్తం 8 స్థానాల్లోనూ బీజేపీ ఆధిక్యంలో ఉండి.. విజయం దిశగా దూసుకెళుతోంది. రాజ్యసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌కు చెందిన ఎనిమిది మంది శాసనసభ్యులు బీజేపీలోకి ఫిరాయించడంతో ఈ ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి. అయితే సిట్టింగ్ స్థానాలను తిరిగి నిలబెట్టుకోవాలనుకున్న కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ ఓటమి దిశగా పయనిస్తోంది. దీంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏర్పడ్డ లోటును బీజేపీ పూడ్చుకుంది. ఇక కర్ణాటకలోనూ అధికార బీజేపీ అనుహ్య ఫలితాలను సాధించింది. ఉప ఎన్నికలు జరుగుతున్న ఆర్ఆర్ నగర్, శిర అసెంబ్లీ స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. ఈ రెండు స్థానాలనూ బీజేపీ తన ఖాతాలో వేసుకోనుంది. దీంతో అసెంబ్లీ బీజేపీ బలం మరింత పెరుగనుంది. (సీఎం పీఠం నితీష్‌కు దక్కుతుందా?) దేశ వ్యాప్తంగా ఆసక్తిరేకెత్తించిన మధ్య ప్రదేశ్ ఉప ఎన్నికల్లోనూ బీజేపీ దూసుకుపోతోంది. మొత్తం 28 స్థానాల్లో బీజేపీ 21, కాంగ్రెస్ 6, బీఎస్పీ 1 ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. దీంతో ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ ప్రభుత్వం గండం నుంచి గట్టెక్కినట్లైంది. ఇక కాంగ్రెస్ తిరుగుబాటు నేత జోతిరాధిత్య సింధియా తన పట్టును నిలుపుకున్నారు. తన వెంట వచ్చిన ఎమ్మెల్యేలంతా గెలుపు దిశగా పయనిస్తున్నారు. బిహార్‌లోని అధికార ఎన్డీయే కూటమి మెజార్టీ దిశగా దూసుకుపోతోంది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం.. జేడీయూ-బీజేపీ నేతృత్వంలోనే కూటమి 130 స్థానాల్లో ముందంజలో ఉంది. దీంతో మరోసారి ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లాంఛనమైంది. ఉప ఎన్నికల ఫలితాలు.. యూపీ (7): బీజేపీ 6, ఎస్పీ 1 ఒడిశా (2): బీజేడీ ఆధిక్యం హర్యానా (1): కాంగ్రెస్ ఆధిక్యం జార్ఖండ్ (2): బీజేపీ 1, కాంగ్రెస్ 1 మణిపూర్ (5): బీజేపీ 4, ఇతరులు 1 ఛత్తీస్‌గఢ్ (1): కాంగ్రెస్ ఆధిక్యం నాగాలాండ్ (2): రెండు స్థానాల్లోనూ ఇతరుల ఆధిక్యం -
మీ కష్టసుఖాల్లో నేనెప్పటికీ ఉంటా: హరీష్ రావు
సాక్షి, సిద్ధిపేట: దుబ్బాక ఉపఎన్నిక సందర్భంగా హసన్మీరాపూర్లో మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను. కష్టం, సుఖం, ఆపదలో ఎప్పటికి ఉంటాను. మీ కోసం నా తలుపులు ఎప్పటికి తెరచి ఉంటాయి. ఈ ఎన్నికలు సోలిపేట లింగన్న మరణంతో వచ్చాయి. నా తోబుట్టువు సుజాత అక్కని గెలిపిద్దాం. పట్టుబట్టి రమ్మని పిలిస్తే కలసి దండం పెట్టి పోదామని వచ్చాను. ఈ గ్రామంలో సీఎం కేసీఆర్ 15 రోజులు ఇక్కడే ఉండి రోడ్డు వేయించి బస్సు తెప్పించారు. మీరు కోరిన విధంగా సీఎం కేసీఆర్ అభివృద్ధి చేశారు. ఇప్పుడు నేను హసన్మీర్, అప్పనపల్లికి రోడ్డు వేయిస్తాను. ఎస్సీ, బీసీ కాలనీలలో సీసీ రోడ్లు, మోరీలు, ఖాళీ స్థలంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మాణం కోసం నిధులు ఇస్తాను. ఇంటి అడుగు జాగాలో డబుల్ బెడ్ రూమ్ నిర్మాణం కోసం అసెంబ్లీలో ఆమోదం కూడా వచ్చింది. మీ గ్రామానికి 50 డబుల్ బెడ్ రూమ్స్ మంజూరు చేస్తాను. కరోనాతో కొంత ఇబ్బంది అయింది. ఆదాయం తగ్గింది. ఇలాంటి కష్టసమయంలో కూడా ఉచితంగా రేషన్, పప్పులు, సరుకులు పంపిణీ చేశాం. గ్రామంలో 182 మందికి పెన్షన్లు ఇస్తున్నాం. పేదింటి ఆడపడచు పెళ్లికి లక్ష పదహారు రూపాయలు ఇస్తున్నాం. బీడీ పెన్షన్లు ఇస్తున్నాం. రైతులకు పెట్టు బడి ఇస్తున్నాం. ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. ఇందులో బీజేపీ, కాంగ్రెస్‌వి ఒక్క పైసా కూడా లేదు. గ్రామంలో ముదిరాజ్, యాదవ సంఘాల భవనాలు నిర్మిస్తాం, గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని మంత్రి హరీష్ రావు తెలిపారు. (‘సుజాతక్క తోటి ఏం పని అయితదని అనుకోవద్దు’) -
కాంగ్రెస్‌కు మరో ఝలక్, ఎమ్మెల్యే రాజీనామా
భోపాల్: ఉప ఎన్నికల వేళ మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి మరో ఝలక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాహుల్ సింగ్ లోధి ఆదివారం పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అనంతరం ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా రాహుల్‌కు కాషాయ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. దామో నియోజకవర్గానికి రాహుల్ సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన తన రాజీనామా లేఖను స్పీకర్ రామేశ్వర్ శర్మకు అందచేశారు. ఎమ్మెల్యే రాజీనామాను ఆమోదిస్తున్నట్లు స్పీకర్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా రాహుల్ సింగ్ మాట్లాడుతూ.. ‘ కాంగ్రెస్‌తో కలిసి నేను సుమారు 14 నెలలు పనిచేశాను. అయితే అభివృద్ధి కోసం పని చేయలేకపోయాను. నా నియోజకవర్గంలో అన్ని ప్రజా సంక్షేమ పథకాలు నిలిచిపోయాయి. బీజేపీలోకి నేను ఇష్టపూర్వకంగానే చేరాను’ అని తెలిపారు. (అత్యంత సంక్లిష్ట దశలో ప్రజాస్వామ్యం) ముఖ్యమంత్రి చౌహాన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై ఆ పార్టీ నేతలకు ఆశలు సన్నగిల్లాయన్నారు. అభివృధి కోసం పని చేయాలనుకునేవాళ్లు ఆ పార్టీని వీడుతున్నారన్నారు. రాహుల్ బీజేపీలో చేరిక నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. కాగా రాహుల్ కాంగ్రెస్‌ను వీడటంతో అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 87కి పడిపోయింది. అలాగే ఈ ఏడాది జూలైలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నారాయణ్ పటేల్, ప్రద్యం సింగ్ లోధి, సుమిత్రా దేవి కూడా పదవులకు రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్‌లో 28 స్థానాలకు నవంబర్ 3న ఉప ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 10న ఫలితాలు వెలువడతాయి. -
‘ఆ పార్టీతో నగరానికి ముప్పు’
సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటక అసెంబ్లీ ఉప ఎన్నికల నేపథ్యంలో గతంలో భాగస్వామ్య పక్షాలుగా వ్యవహరించిన జేడీఎస్, కాంగ్రెస్‌లు కత్తులు దూస్తున్నాయి. బెంగళూర్‌లోని రాజరాజేశ్వరినగర్ అసెంబ్లీ స్ధానానికి ఇరు పార్టీలు అభ్యర్దులను బరిలో దింపి పరస్పర ఆరోపణలకు దిగాయి. ఇటీవలి బెంగళూరు అల్లర్లను ప్రస్తావిస్తూ జేడీఎస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీతో బెంగళూర్‌లో భద్రత కరవవుతుందని వ్యాఖ్యానించారు. బెంగళూర్ అల్లర్లపై బీజేపీ సైతం కాంగ్రెస్ లక్ష్యంగా విమర్శలతో విరుచుకుపడుతున్న క్రమంలో కుమారస్వామి సైతం కాంగ్రెస్ లక్ష్యంగా విమర్శల దాడి పెంచారు. పార్టీ అభ్యర్థి వి కృష్ణమూర్తి నామినేషన్ వేసిన అనంతరం కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ బెంగళూరు అల్లర్ల వెనుక ఏం జరిగిందో ఇప్పుడు వెల్లడవుతోందని అన్నారు. రాష్ట్ర పౌరులను కాంగ్రెస్ నేతలు కాపాడలేరని, బెంగళూర్ దాడులకు వారే కుట్రదారులని కుమారస్వామి కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ చేతిలో బెంళూర్ నగర ప్రజలు సురక్షితంగా ఉండలేరని ఈ ఎన్నికల్లో ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారని అన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సైతం ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కుసుమను పార్టీ అభ్యర్ధిగా బరిలో దింపి ప్రచారాన్ని ముమ్మరం చేసింది. చదవండి : శివకుమార్‌పై సీబీఐ కేసు బెంగళూర్ అల్లర్లు పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య ఆరోపించారు.ఇక ప్రత్యర్ధులైన జేడీఎస్, కాంగ్రెస్‌లు 2018లో కర్ణాటకలో బీజేపీని అధికారంలోకి రాకుండా నిరోధించేందుకు విభేదాలను పక్కనపెట్టి జట్టుకట్టాయి. ఆపై పలువురు ఎమ్మెల్యేలు సంకీర్ణ సర్కార్‌ను వీడటంతో యడ్యూరప్స సారథ్యంలో బీజేపీ సర్కార్ కొలువుతీరింది. తమ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురిచేసి ప్రభుత్వాన్ని కూల్చివేసిందని అప్పట్లో జేడీఎస్, కాంగ్రెస్‌లు కాషాయ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. -
బీజేపీకి ఒక్క సీటు కూడా రాదు..
భోపాల్: మధ్యప్రదేశ్‌లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ అన్నారు. ఉప ఎన్నికలు ముగిసిన తర్వాత అధికార పీఠాన్ని మళ్లీ దక్కించుకుంటామని ఆయన దీమా వ్యక్తం చేశారు. ఖాళీ అయిన 24 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. (కొడుక్కి బుద్ధి చెప్పిన మాజీ మంత్రి) సీనియర్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ నుంచి వైదొలిగి బీజేపీలో చేరడంతో 22 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి అసెంబ్లీకి రాజీనామా చేయడంతో మార్చి 20న కమల్‌నాథ్ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మరణించడంతో మరో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘం తేదీలు ప్రకటించాల్సివుంది. (స్పెషల్ ట్రైన్ ఎక్కాలంటే.. ఇవి పాటించాలి) తనపై తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలకు ఉప ఎన్నికల్లో ఓటర్లు తగిన గుణపాఠం చెబుతారని కమల్‌నాథ్ అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తమ పార్టీ కోల్పోయిన 22 అసెంబ్లీ స్థానాలను తిరిగి దక్కించుకుంటామన్నారు. బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కకూడదని కోరుకుంటున్నట్టు చెప్పారు. తనపై జరిగిన తిరుగుబాబు గురించి చెబుతూ.. ‘నేను చాలా బాధ పడ్డాను. బీజేపీ ప్రలోభాలకు మా ఎమ్మెల్యేలు లొంగిపోతారని ఊహించలేకపోయాను. నాకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. కానీ ప్రలోభాలు పెట్టడం తనకు తెలియద’ని కమల్‌నాథ్ అన్నారు. -
ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా బెంగాల్ తీర్పు
న్యూఢిల్లీ : అస్సాం తరహాలోనే దేశవ్యాప్తంగా జాతీయ పౌరసత్వ నమోదు (ఎన్ఆర్సీ) కార్యక్రమాన్ని నర్విహిస్తామని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పార్లమెంట్ ముఖంగా ప్రకటించడం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరిగిన మూడు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలపై ఎంతో ప్రభావాన్ని చూపింది. పర్యవసానంగానే ఖరగ్‌పూర్, కరింపూర్, కలియాగంజ్ నియోజక వర్గాల్లో పాలకపక్ష తృణమూల్ కాంగ్రెస్ చేతుల్లో బీజేపీ అభ్యర్థులు ఓడిపోయారు. లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం భారీగా పడిపోయింది. కలియాగంజ్, కరీంపూర్ అసెంబ్లీ స్థానాలను బంగ్లా సరిహద్దుల్లో ఉన్నాయి. వారిలో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లింలతోపాటు హిందువులు కూడా గణనీయంగా ఉన్నారు. బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వారిని, ముఖ్యంగా ముస్లింలను వెనక్కి పంపించడం కోసమే అస్సాంలో ‘నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ (ఎన్ఆర్సీ)’ నిర్వహించిన విషయం తెల్సిందే. వలసవచ్చిన వారిని పక్కన పెడితే స్థానిక భారతీయులు కూడా తమ పౌరసత్వాన్ని నిరూపించుకోలేక పోవడం వల్ల అస్సాంలో ఎన్ఆర్సీ వివాదాస్పదమైంది. దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ కార్యక్రమాన్ని చేపడతామంటూ అమిత్ షా ప్రకటించిన వెంటనే తమ రాష్ట్రంలో మాత్రం అందుకు అనుమతించే ప్రసక్తే లేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెచ్చరించారు. ఎన్ఆర్సీ కారణంగానే తాను ఓడిపోయినట్లు కలియాగంజ్ నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి కమల్ చంద్ర సర్కార్ తెలిపారు. అస్సాంలో నిర్వహించిన ఎన్ఆర్సీ వేరు, దేశవ్యాప్తంగా నిర్వహించే ఎన్ఆర్సీ వేరని చెప్పడంలో, ఎన్ఆర్సీ కేంద్ర ప్రభుత్వ కార్యక్రమమని, బీజేపీకి సంబంధం లేదని వివరించడంలో విఫలం అవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. మూడు చోట్ల తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులను అఖండ మెజారిటీతో ఓటర్లు గెలిపించడం అంటే ఎన్ఆర్సీని వారు నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నట్లే లెక్క! -
కన్నీటి పర్యంతమైన మాజీ సీఎం...
బెంగళూరు : కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి మరోసారి కన్నీటి పర్యంతం అయ్యారు. మండ్యా జిల్లాలో ఉప ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన ఉద్వేగానికి లోనయ్యారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని 15 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ 5వ తేదీన ఉప ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. మండ్యా జిల్లాలోని కృష్ణరాజపేటె అసెంబ్లీ నియోజకవర్గంలో జేడీఎస్ అభ్యర్థి బీఎల్ దేవరాజ్ తరఫున కుమారస్వామి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నా కుమారుడిని ఎన్నికల బరిలో నిలపాలని అనుకోలేదు. మండ్యా ప్రజలే అతన్ని ఎన్నికల్లో నిలపమని కోరారు.. కానీ వారే అతనికి మద్దతు ఇవ్వలేదు.. ఇది నన్ను చాలా బాధించింది. నా కొడుకు ఎందుకు ఓడిపోయాడో అర్థం కావడంలేద’ని అన్నారు. ఈ క్రమంలోనే ఆయన ఉద్వేగానికి లోనయ్యారు. కన్నీటిని ఆపుకోలేకపోయారు. అలాగే తనకు రాజకీయాలు అవసరం లేదని.. ప్రజల ప్రేమని మాత్రమే కోరుకుంటున్నట్టు తెలిపారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలంటే ఈ ఉప ఎన్నికల్లో కనీసం 8 స్థానాలు గెల్చుకోవాలి. డిసెంబర్ 9వ తేదీన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కాగా, సార్వత్రిక ఎన్నికల్లో మండ్యా లోక్‌సభస్థానం నుంచి పోటీచేసిన కుమారస్వామి తనయుడు నిఖిల్.. సినీ నటి సుమలత చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. గతంలో కూడా పలుమార్లు కుమారస్వామి ప్రజలతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతం అయిన సంగతి తెలిసిందే. -
ఉపఎన్నికల అభ్యర్థులను ప్రకటించిన ఏఐసీసీ
సాక్షి, న్యూఢిల్లీ: కేరళ రాష్ట్రంలో అక్టోబర్ 21న ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా అధికార కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. వట్టియూర్కావు, కొన్ని, ఆల్‌రూర్, ఎర్నాకుళం, మంజేశ్వరమ్ స్థానాలలో ఉపఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ నాలుగు స్థానాలలో తమ అభ్యర్థులను ప్రకటించగా మిత్రపక్షం యూనియన్ ముస్లిం లీగ్ ఓ స్థానంలో పోటీ చేయనుంది. టీజీ వినోద్, (ఎర్నాకుళం), ఏడీవీ శానిమోల్ ఉస్మాన్, (ఆరూర్), పి.మోహన్ రాజ్న్,(కొన్ని) (వట్టియూర్కావు) నుంచి కె.మోహన్ కుమార్ బరిలో ఉన్నారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ శుక్రవారం పార్టీ అభ్యర్థుల జాబితాను ధ్రువీకరిస్తూ ప్రకటన విడుదల చేశారు. గత వారం కేరళలోని పాలా అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ మిత్రపక్షమైన యూనైటెడ్ డెమోక్రెటిక్ ఫ్రంట్ సాంప్రదాయక ఓటు బ్యాంకును కోల్పోవడం యూడీఎఫ్‌ను కలవరపరుస్తోంది. ఈ ప్రభావం త్వరలో జరిగే ఉపఎన్నికలపై పడుతుందేమోనని ఆ పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, కాంగ్రెస్‌లోని ముఖ్య నేతల మధ్య అంతర్గత విభేదాలు ఏ మేరకు విజయావకాశాలను దెబ్బతీస్తాయోనని పార్టీ నాయకులు మదనపడుతున్నారు. -
ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌తో మళ్లీ పొత్తు?
బెంగళూరు: సంకీర్ణ సర్కార్ పతనానికి మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కారణమని బహిరంగంగా ధ్వజమెత్తిన జేడీఎస్ అధినేత హెచ్.డీ.దేవేగౌడ 17 శాసనసభ నియోజకవర్గాల ఉప ఎన్నికలు సమీపిస్తుండగా కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపేందుకు సిద్ధం కావాలని సంకేతం ఇచ్చారు. ఉప ఎన్నికల తేదీ నిర్ధారించలేదు. అంతలోగా కాంగ్రెస్, జేడీఎస్ మైత్రిపై కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ ఆమోదానికి రావాలని విన్నవించారు. 17 నియోజకవర్గాల్లో 3 నియోజకవర్గాలు జేడీఎస్ ఎమ్మెల్యేలు ఉండగా, ఈ మూడు నియోజకవర్గాలు జేడీఎస్ నుంచి తప్పిపోయే ఆందోళన దేవేగౌడను పీడిస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి జేడీఎస్‌తో పొత్తు పెట్టుకోవాలనే ప్రతిపాదన ముందుంచటం రాజకీయ రంగంలో కుతూహలానికి కారణమైంది. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రానున్న ఎన్నికల్లో జేడీఎస్ పార్టీ శక్తి ఏమిటనేది చూపిస్తానని, పార్టీ గురించి నోటికి వచ్చినట్లు ఎవరుపడితేవారు మాట్లాడుతున్నట్లు తెలిసింది. ఈ విషయాలన్నీ తెలిసినా కూడా మౌనంగా ఉన్నానని, ఇకపై సహించుకోవటానికి సాధ్యం లేదని, ఇకపై ఇటువంటి మాటలకు అవకాశం ఇవ్వమని తేల్చి చెప్పారు. తాను మాజీ ప్రధాని బెంగళూరులో మాజీ మంత్రి డీ.కే.శివకుమార్ అరెస్టును ఖండిస్తూ జరిగిన ధర్నాలో పాల్గొనాలని తనకు ఆహ్వానం వచ్చిందని, అయితే తాను మాజీ ప్రధాని కావటంతో సభలో పాల్గొనలేదని దేవేగౌడ తెలియజేశారు. అయితే పార్టీకి చెందిన ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పాల్గొన్నారన్నారు. -
4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్
సాక్షి, న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఉపఎన్నికలకు నోటిఫికేషన్ ఆదివారం విడుదలైంది. ఛత్తీస్‌గఢ్, కేరళ, త్రిపుర, ఉత్తర్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఉప ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్ 23న నాలుగురాష్ట్రాల్లో ఉపఎన్నికలు నిర్వహించనున్నారు. దంతెవాడ (ఛత్తీస్‌గఢ్), పాల (కేరళ), బాదర్‌ఘాట్ (త్రిపుర), హమీర్పూర్ (ఉత్తరప్రదేశ్) అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయి. అయితే తెలంగాణలోని హుజూర్నగర్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడలేదు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి రాజీనామాతో హుజూర్నగర్ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. -
గుజరాత్ ఉపఎన్నికలపై మీ వైఖరేంటి?
న్యూఢిల్లీ: గుజరాత్లో ఖాళీ అయిన రెండు రాజ్యసభ స్థానాలకోసం వేర్వేరుగా ఉప ఎన్నికలు నిర్వహించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గుజరాత్ కాంగ్రెస్ వేసిన పిల్‌పై సుప్రీంకోర్టు స్పందించింది. ఈ విషయంలో జూన్ 24లోగా స్పందన తెలపాలని బుధవారం ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. జూన్ 25న దీనిపై వాదనలు వింటామని ధర్మాసనం తెలియజేసింది. గుజరాత్ కాంగ్రెస్ తరఫున వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాది వివేక్ తంఖా మాట్లాడుతూ, ఈ విషయంలో గతంలో ఢిల్లీ హైకోర్టు తీర్పు తమకు అనుకూలంగా ఉందని వాదించారు. దీనిపై ఎన్నికల సంఘం వివరణ ఇస్తూ, ఎన్నికల షెడ్యూల్ ఒకటే ఉన్నప్పటికీ ప్రత్యేక స్థితిలో ఏర్పడిన ఖాళీలను వేర్వేరుగానే పరిగణించాల్సి ఉంటుందని తెలిపింది. -
తమిళనాడులో కీలకంగా మారిన ఉపఎన్నికలు
-
ఏపీ లోక్‌సభ స్ధానాల ఉప ఎన్నికలపై ఈసీ వివరణ
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ ఎంపీల రాజీనామా నేపథ్యంలో ఆయా లోక్‌సభ స్ధానాలకు ఉప ఎన్నికలు నిర్వహించకపోవడంపై వచ్చిన మీడియా కథనాలపై కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) వివరణ ఇచ్చింది. కర్నాటకలోని బళ్లారి, షిమోగ, మాండ్య లోక్‌సభ స్ధానాలు మే 18, మే 21 తేదీల నాటికే ఖాళీ అయ్యాయని, ఆంధ్రప్రదేశ్‌లోని 5 లోక్‌సభ స్ధానాలు జూన్ 20న ఖాళీ అయ్యాయని తెలిపింది. ప్రజా ప్రాతినిథ్య చట్టంలోని సెక్షన్ 151ఏ ప్రకారం పదవీ కాలపరిమితి ఏడాది కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఆరు నెలల్లోగా ఉప ఎన్నికలు నిర్వహించాలని, 16వ లోక్‌సభ కాలపరిమితి 2019 జూన్ 3వరకూ మాత్రమే ఉందని ఈసీ వెల్లడించింది. కర్నాటకలో ఏర్పడిన ఖాళీలు అంతకంటే ముందే ఏర్పడినందున అక్కడ ఉప ఎన్నికల నిర్వహణ అనివార్యమైందని ఈసీ వివరణ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ స్ధానాల ఖాళీ జూన్ 20న నెలకొన్నందున సభ్యుల పదవీకాలం ఏడాదిలోపు ఉండనుండటంతో ఏపీలో ఉప ఎన్నికల నిర్వహణ అవసరం లేకపోయిందని పేర్కొంది. కాగా, ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీకి చెందిన ఐదుగురు లోక్‌సభ ఎంపీలు తమ పదవులకు సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందుగానే రాజీనామా చేసినా లోక్‌సభ స్పీకర్ వాటిని ఆమోదించడంలో జాప్యం జరిగిన సంగతి తెలిసిందే. -
కేశవ్‌ను సీఎం చేయకపోవడం వల్లే..
లక్నో : వెనుకబడిన తరగతుల(ఓబీసీ)ను భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నిర్లక్ష్యం చేయడం వల్లే ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం చవి చూశామని ఉత్తరప్రదేశ్ మంత్రి ఓం ప్రకాశ్ రాజ్‌భర్ పేర్కొన్నారు. కేశవ్ ప్రసాద్ మౌర్యను సీఎం చేయకపోవడం వల్లే ఓబీసీలు బీజేపీని ఓడించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు మౌర్యను ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూపుతూ బీజేపీ ప్రజల్లోకి వెళ్లిందని, కానీ ఫలితాల అనంతరం యోగి ఆదిత్యనాథ్‌ను ముఖ్యమంత్రిగా చేసిందని అన్నారు. దాని ప్రభావమే ఉప ఎన్నికల ఫలితాల్లో కనిపించిందని చెప్పారు. సీఎం యోగి ఆదిత్యనాథే ఉప ఎన్నికల్లో ఓటమికి కారణమని అంటారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ప్రభుత్వం అందుకు కారణమని రాజ్‌భర్ వ్యాఖ్యానించారు. ఓటమికి గల కారణాలపై బీజేపీ ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలనేది పార్టీ ఇష్టమని అన్నారు. కాగా, కైరానా లోక్‌సభ, నూర్పూర్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. రెండు చోట్లా బీజేపీ ఓటమిని చవిచూసింది. ఆర్ఎల్డీకి చెందిన తబస్సుమ్ హసన్, ఎస్పీకి చెందిన నయీముల్ హసన్‌లు కైరానా, నూర్పూర్లలో గెలుపొందారు. -
అందరి దృష్టి ‘కైరానా’ ఫలితంపైనే
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని కైరానా లోక్‌సభ నియోజకవర్గానికి సోమవారం నాడు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఇటు పాలకపక్ష బీజేపీకి, ప్రతిపక్ష పార్టీలకు అత్యంత ప్రతిష్టాకరమైనవి. ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలిచ్చిన అనుభవంతో ప్రతిపక్ష పార్టీలన్నీ కలసికట్టుగా కైరానా సీటుకు ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టగా బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తోంది. 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికలకు ఈ ఉప ఎన్నిక ఫలితం ఓ సంకేతం లాంటిది. ఎందుకంటే యూపీ నుంచి 80 లోక్‌సభ స్థానాలున్న విషయం తెల్సిందే. 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హవా కారణంగా 80 సీట్లకుగాను బీజేపీకి 71 సీట్లు, దాని మిత్రపక్షమైన అప్నాదళ్‌కు రెండు సీట్లు వచ్చాయి. నాటి ఎన్నికల్లో బీజేపీ తనకంటూ ప్రత్యేక ఓటర్ల పునాదిని ఏర్పాటు చేసుకోవడంతోపాటు మాయావతి దళిత ఓటర్లను కూడా కొల్లగొట్టింది. నాడు కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ మధ్య ఓబీసీ, దళితులు, ముస్లింలు ఓటర్లు చీలిపోవడంతో బీజేపీ బాగా లాభపడింది. ఆనాటి గుణపాఠంతో రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా ఏకమయ్యాయి. ఫలితంగా యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి ఖాళీ చేసిన గోరఖ్‌పూర్, డిప్యూటి ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ఖాళీ చేసిన ఫూల్పూర్ లోక్‌సభ నియోజక వర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినప్పటికీ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. ముందస్తు ఎన్నికల ఒప్పందం లేకపోయినప్పటికీ జేడీఎస్‌తో కలసి కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఒకే వేదికపై బీజేపీకి వ్యతిరేకంగా పలు ప్రాంతీయ, జాతీయ పార్టీల నాయకులు చేతులు కలపడం వారి భవిష్యత్ ఐక్యతను సూచిస్తోంది. ఈ నేపథ్యంలో జరుగుతున్న కైరానా లోక్‌సభ ఉప ఎన్నిక ప్రతిష్టాకరంగా మారడంతో బీజేపీ తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితోపాటు పలువురు రాష్ట్ర మంత్రులు ఎన్నికల ప్రచారం చేశారు. బీజేపీ సిట్టింగ్ సభ్యుడు ఎంపీ హుకుమ్ సింగ్ మరణంతో కైరానా లోక్‌సభకు ఉప ఎన్నిక అనివార్యమైంది. 2014లో జరిగిన ఎన్నికల్లో ఆయన తన సమీప ఎస్పీ అభ్యర్థి నహీద్ హాసన్‌పై 2.3 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో పది లక్షల మంది హిందువులుండగా, 5.46 లక్షల మంది ముస్లింలు ఉన్నారు. ఇక్కడి నుంచి సమాజ్‌వాది సభ్యురాలు తబాసన్ హాసన్ ఆర్ఎల్డీ టిక్కెట్‌పై పోటీ చేయగా, బీజేపీ పార్టీ తరఫున హుకుమ్ సింగ్ కూతురు మగాంక సింగ్ పోటీ చేశారు. -
వేసవిలో ఎన్నికలు పెట్టకూడదా?
విదర్భ, మహారాష్ట్ర : మహారాష్ట్రలోని భందారా-గోండియా లోక్‌సభ స్థానానికి సోమవారం జరుగుతున్న పోలింగ్‌లో నాలుగో వంతు ఈవీఎమ్లలో సాంకేతిక లోపాలు తలెత్తినట్లు సమాచారం. దీని గురించి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) నాయకుడు ప్రఫుల్ పటేల్ ‘ఈవీఎంలు ఎందుకు పనిచేయటం లేదని నేను సిబ్బందిని అడిగాను. దానికి వారు చెప్పిన సమాధానం విని నేను షాక్ అయ్యాను. వేడి అధికంగా ఉండటం వల్ల ఈవీఎంలు పనిచేయడం లేదని సిబ్బంది సమాధానమిచ్చారన్నారు. ‘ఏప్రిల్ నెలల కూడా 45 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. అందుకని మీరు వేసవికాలంలో ఎన్నికలు నిర్వహించకూడదంటారా’ అని ప్రశ్నించాడు ప్రఫుల్ పటేల్. గుజరాత్‌లోని సూరత్‌లో వినియోగించిన ఈవీఎంలనే ఇక్కడ వినియోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ నియోజకవర్గంలో 25 శాతం ఈవీఎంలు పనిచేయడంలేదని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం ఓటరు తన ఓటును ఏ పార్టీకి వేసాడో తెలుసుకునేందుకు ఈవీఎంలలో రూపొందించిన వీవీపీఏటీ (ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ మెషన్) వల్లనే ఈవీఎంలు పనిచేయకుండా మొరాయిస్తున్నట్లు తెలిపారు. కాగా వీటిని సరిచేసేందుకు ఎన్నికల సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. విదర్భలోని భందారా-గోండియా నియోజకవర్గంలో 2 వేలకుపైగా పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. వీటిలో 71 నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఉండగా, మరో 113 సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నాయి. -
‘ఆ స్థానానికి ఆయనే కరెక్టు’
కోల్‌కత: మరో ఎన్నికల సమరానికి అంతా సిద్ధమైంది. రేపు (సోమవారం) అయిదు అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని మహెష్తల, జార్ఖండ్‌లోని గోమియా, సిల్లీ, బిహార్‌లోని జోకిహత్, మేఘాలయలోని అంపతి అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. కాగా, నాగాలాండ్ అసెంబ్లీకి ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించి ఎన్డీపీపీ, బీజేపీలు భాగస్వాములుగా గల పీడీఏ కూటమి అధికారం చేపట్టింది. ముఖ్యమంత్రిగా నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ అధ్యక్షుడు నెఫ్యూ రియోని ఎన్నికున్నారు. ఆయన తన ఎంపీ స్థానానికి రాజీనామా చేయడంతో.. నాగాలాండ్‌లో ఉన్న ఏకైక లోక్‌సభ స్థానం ఖాళీ అయింది. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. కాగా, నాగాలాండ్ లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. నాగా పీపుల్స్ ఫ్రంట్ అభ్యర్థికి, అధికార పీపుల్స్ డెమొక్రటిక్ అలయెన్స్ అభ్యర్థికి మధ్య ప్రధాన పోరు జరుగుతోంది. తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ఇప్పటికే ఆయా పార్టీలు తీవ్రంగా శ్రమించాయి. ఎన్డీపీపీ, బీజేపీలు భాగస్వాములైన పీపుల్స్ డెమొక్రటిక్ అలయెన్స్ తమ అభ్యర్థిగా మాజీ మంత్రి టొకిహో యెప్తోమీని నిలబెట్టింది. నాగా పీపుల్స్ ఫ్రంట్ అభ్యర్థి కె. అపోక్ కుమార్‌కు కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. ‘మతోన్మాద శక్తుల ఆగడాలతో నాగాలాండ్‌లో అనిశ్చిత పరిస్థితులు తలెత్తాయి. అపోక్ కుమార్ తిరిగి రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనేలా పనిచేస్తారని ఆశిస్తున్నాం. ఆయనే తగిన నాయకుడుగా భావిస్తున్నాం. అందుకనే మద్దతునిస్తున్నామ’ని నాగాలాండ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ కె. థెరీ అన్నారు. థెరీ వ్యాఖ్యలపై నాగాలాండ్ బీజేపీ అధికార ప్రతినిధి కె. జేమ్స్ విజో స్పందించారు. ఓటమి భయంతో కాంగ్రెస్ అనుచిత వ్యాఖ్యలు చేస్తోందని విమర్శించారు. -
ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని నాలుగు లోక్‌సభ స్థానాలు, పది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది. కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. మహారాష్ట్రలో బాంద్రా- గోండ్యా, పాల్గర్ లోక్‌సభ స్థానాలకు, ఉత్తరప్రదేశ్‌లోని ఖైరానా, నాగాలాండ్ లోక్‌సభ స్థానాలకు ఈ ఉప ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు బిహార్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలోని 10 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు షెడ్యూలు జారీ చేశారు. లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు మే నెల 28న పోలింగ్ నిర్వహించనుండగా, మే 31న ఓట్ల లెక్కింపు జరగనుంది. -
ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
సాక్షి, అమరావతి: ఎమ్మెల్సీ ఉప ఎన్నికల షెడ్యూల్ శనివారం విడుదలైంది. మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ, టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు (70) మరణంతో ఉప ఎన్నికను నిర్వహించనున్నారు. ఈ నెల 24న ఎన్నికల నోటిషికేషన్‌ను ఎన్నికల కమిషన్ విడుదల చేయనుంది. మే 21న పోలింగ్ నిర్వహిస్తారు. మే 24న ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితాన్ని వెల్లడించనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో టీడీపీ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు హైదరాబాద్ గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన విషయం తెలిసిందే. స్వస్థలం చిత్తూరు జిల్లా వెంకట్రామపురంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఆయన మృతితో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. -
ఉపఎన్నికలు: డైలమాలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు
-
ఉత్తరాది ఉపఎన్నికల్లో బీజేపీకి ఎదురుగాలి
-
ఉప ఎన్నిక.. ఉద్రిక్తం
మరిపెడ(డోర్నకల్): చిన్నగూడూరు మండలం గుండంరాజుపల్లి సర్పంచ్ ఉప ఎన్నిక సోమవారం ఉద్రిక్తత మధ్య జరిగింది. గుండంరాజుపల్లిలోని జెడ్పీ హైస్కూల్లో ఉదయం పోలింగ్ ప్రారంభం కాగా సీపీఎంకు చెందిన వార్డు సభ్యురాలు కుర్ర సువర్ణ ఎన్నికల బాధ్యతలు నిర్వర్తిస్తుండటాన్ని టీఆర్ఎస్ కార్యకర్తలు చూశారు. దీంతో ఆగ్రహించి పోలింగ్‌స్టేషన్–2లోకి దూసుకువెళ్లి ఈవీఎంకు ఉన్న బ్యాలెట్ యూనిట్‌ను కింద పడేసి ధ్వంసం చేశారు. వేసిన ఓట్లు నిల్వ ఉండే కంట్రోల్ యూనిట్‌ను విధుల్లో ఉన్న ఎన్నికల సిబ్బంది చాటుగా దాచారు. టీఆర్ఎస్ నాయకులు సుమారు అరగంటపాటు ఆందోళనకు దిగారు. దీంతో అధికారులు వార్డు సభ్యురాలిని ఎన్నికల విధుల నుంచి తొలగించి మరొకరికి అప్పగించగా పోలింగ్ సజావుగా సాగింది. గుండంరాజుపల్లి సర్పంచ్‌గా లలిత గెలుపు.. గుండంరాజుపల్లి సర్పంచ్ స్థానానికి మొత్తం 968 ఓట్లకు 824 పోలయ్యాయి. టీఆర్ఎస్ అభ్యర్థి మేడ లలితకు 464 ఓట్లు, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సీపీఎం అభ్యర్థి మనుపాటి ఉపేంద్రకు 358ఓట్లు వచ్చాయి. దీంతో 106ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి లలిత గెలుపొందారు. సర్పంచ్‌కు పోలింగ్‌స్టేషన్ –1లో 2, పోలింగ్‌స్టేషన్–2లో 2 నోటాకు వేశారు. రిగ్గింగ్‌కు పాల్పడ్డారు.. టీఆర్ఎస్ నాయకులు రిగ్గింగ్‌కు పాల్పడ్డారని కాంగ్రెస్ పార్టీ డోర్నకల్ నియోజకవర్గ ఇన్చార్జ్ జాటోతు రాంచంద్రునాయక్ ఆరోపించారు. పోలింగ్ స్టేషన్ వద్ద ఆయన మాట్లాడుతూ తమ అభ్యర్థి గెలిచే నమ్మకం లేకనే అధికార పార్టీ నాయకులు దౌర్జన్యంగా పోలింగ్‌కేంద్రంలోకి దూసుకువెళ్లి ఈవీఎం బ్యాలెట్ యూనిట్‌ను ధ్వంసం చేశారని ఆరోపించారు. రిగ్గింగ్‌కు పాల్పడిన వారితోపాటు ఈవీఎంలను ధ్వంసం చేసిన నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉప సర్పంచ్‌పై దాడి.. గుండంరాజుపల్లి సర్పంచ్‌గా టీఆర్ఎస్ అభ్యర్థి లలిత గెలుపొందిన తర్వాత కాంగ్రెస్, సీపీఎం నాయకులు ఆగ్రహంతో ఉన్నారు. పోలింగ్ స్టేషన్ వద్ద నుంచి డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ తనయుడు రవిచంద్రకు చెందిన మిల్ట్రీ జీపు వస్తుండగా చూసి ముందుఅద్దాలు పూర్తిగా ధ్వంసం చేశారు. కానీ అందులో డ్రైవర్, టీఆర్ఎస్ కార్యకర్త ఉండగా, వారికి ఎలాంటి గాయాలు కాలేదు. ఇంతలో పోలింగ్ కేంద్రానికి టీఆర్ఎస్ పార్టీకి చెందిన గ్రామ ఉపసర్పంచ్ గునిగంటి వెంకన్న స్నేహితుడు గునిగంటి కృష్ణతో కలిసి ద్విచక్రవాహనంపై వస్తున్నారు. దీంతో కాంగ్రెస్, సీపీఎం కార్యకర్తలు వారిపై దాడికి పాల్పడ్డారు. వెంకన్న తలకు గాయం కాగా, కృష్ణకు స్వల్ప గాయాలయ్యాయి. వారు మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతున్నారు. దీంతో గ్రామంలో రెండురోజులపాటు 144 సెక్షన్ విధించినట్లు తొర్రూర్ డీఎస్పీ రాజారత్నం తెలిపారు. గెలిచిన వారు ఎలాంటి ర్యాలీలు తీయొద్దని సూచించారు. పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు. రెడ్యానాయక్ పరామర్శ.. మహబూబాబాద్ రూరల్: కాంగ్రెస్, సీపీఎం కార్యకర్తల దాడిలో గాయపడిన చిన్నగూడూరు మండలం గుండంరాజుపల్లి ఉపసర్పంచ్ గునిగంటి వెంకన్న, టీఆర్ఎస్ నాయకులు గునిగంటి కృష్ణ మానుకోట ఏరియా ఆస్పత్రిలో చికిత్సపొందుతుండగా డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ పరామర్శించారు. ఓటమిని జీర్ణించుకోలేకనే కాంగ్రెస్ డోర్నకల్ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ రాంచంద్రునాయక్ ఆధ్వర్యం లో దాడికి పాల్పడ్డారని ఎమ్మెల్యే ఆరోపించారు. తన కుమారుడి వాహనాన్ని కూడా ధ్వంసం చేశారని తెలిపారు. ఎమ్మెల్యేతో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపుడి నవీన్‌రావు, మరిపెడ మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు రామసహాయం సత్యనారాయణరెడ్డి, ఎంపీపీ తాళ్లపల్లి రాణిశ్రీనివాస్, డోర్నకల్ మాజీ ఎంపీపీ వాంకుడోత్ వీరన్న, టీఆర్ఎస్ గుండంరాజుపల్లి గ్రామ అధ్యక్షుడు జక్కుల ఐలయ్య ఉన్నారు. చిన్నగూడూరు 8వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు చిన్నగూడూరులోని ఎనిమిదో వార్డుకు టీఆర్ఎస్ పార్టీ తరఫున కొమ్ము ఎల్లమ్మ, కాంగ్రెస్ పార్టీ తరఫున బొల్లు సంతోష బరిలో ఉన్నారు. మొత్తం 210 ఓట్లకు 193 ఓట్లు పోలయ్యాయి. ఎల్లమ్మకు 101 ఓట్లు, సంతోషకు 88 ఓట్లు వచ్చాయి. దీంతో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎల్లమ్మ 13 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నోటాకు నాలుగు ఓట్లు వేశారు. గుర్తూరు టీఆర్ఎస్దే.. తొర్రూరు రూరల్: మండలంలోని గుర్తూరు గ్రామంలో సోమవారం ఉప ఎన్నికలు నిర్వహించారు. గుర్తూరు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. సర్పంచ్‌గా టీఆర్ఎస్ అభ్యర్థి దేవరకొండ శ్రీనివాస్ కాంగ్రెస్ అభ్యర్థి మోత్కూరి రవీంద్రాచారిపై 326 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పదో వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి వెల్తూరి యాకయ్య సమీప అభ్యర్థి ఈదునూరి ఎల్లమ్మపై వంద ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. సర్పంచ్ స్థానానికి 90శాతం పోలింగ్ నమోదు కాగా, పదో వార్డుకు 84 శాతం ఓట్లు పోలయ్యాయి. సర్పంచ్ ఎన్నికలో మొత్తం 2,120ఓట్లకు 1,788 ఓట్లు పోలయ్యాయి. టీఆర్ఎస్ అభ్యర్థి దేవరకొండ శ్రీనివాస్‌కు 1,043, కాంగ్రెస్ అభ్యర్థి మోత్కూరి రవీంద్రాచారికి 717ఓట్లు వచ్చాయి. నోటాకు 28 ఓట్లు పడ్డాయి. పదో వార్డులో 212 ఓట్లకుగాను టీఆర్ఎస్ అభ్యర్థి వెల్తూరి యాకయ్యకు 141 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి ఈదునూరి ఎల్లమ్మకు 41 ఓట్లు పోలయ్యాయి. నోటాకు 4 ఓట్లు పడ్డాయి. గెలిచిçన అభ్యర్థులకు ఎన్నికల అధికారులు యుగేందర్, ఎంపీడీఓ గుండె బాబులు ధ్రువీ కరణ పత్రాలను అందజేశారు. గ్రామ పురవీధుల్లో టీఆర్ఎస్ శ్రేణులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. తీగలవేణి పదో వార్డు కాంగ్రెస్ కైవసం గూడూరు: మండలంలోని తీగలవేణి గ్రామ పంచాయతీ పదోవార్డు ఉప ఎన్నిక సోమవారం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూక్య బాల గెలుపొందారు. ఈ వార్డు సభ్యుడు గతంలో గ్రామంలో ఖాళీ అయిన ఎంపీటీసీ స్థానానికి పోటీ చేసి గెలిచారు. దీంతో ఉప ఎన్నిక జరిగింది. మొత్తం 200 ఓట్లకు 196 పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి భూక్య బాలకు 106, టీఆర్ఎస్ అభ్యర్థి ఈర్యానాయక్‌కు 72 ఓట్లు వచ్చాయి. ఈర్యానాయక్‌పై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూక్య బాల 34 ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారి సోయం ప్రసాదరావు ప్రకటించారు. బీజేపీ అభ్యర్థికి ఆరు, నోటాకు 8 ఓట్లు వచ్చాయి. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు. కేసీఆర్మాయమాటలతో విసిగిన ప్రజలు కాంగ్రెస్ పాలన కోరుకుంటున్నారని ఎంపీపీ ఎంపీపీ చెల్పూరు వెంకన్న అన్నారు. రానున్న ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారనే నమ్మకం కలిగిందని చెప్పారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కత్తి స్వామి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నూనావత్ రమేష్, వేం శ్రీనివాస్‌రెడ్డి, ఎండి.యాకూపాషా, దేవానాయక్, చిట్టె వెంకన్న పాల్గొన్నారు. -
ఉప ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వొద్దు..
సాక్షి, న్యూఢిల్లీ: అనర్హతకు గురైన ఆప్ ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వొద్దని ఢిల్లీ హైకోర్టు బుధవారం ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ఇక ఇక ఆప్ ఎమ్మెల్యేల అనర్హత కేసును హైకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. కాగా పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమితులైన 20 మంది ఢిల్లీ ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దవడంతో ఈ సీట్లకు ఆరు నెలల్లో ఉప ఎన్నికలు తప్పని పరిస్థితి ఏర్పడిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దుకు ఎన్నికల సంఘం(ఈసీ) సిఫార్సును రాష్ట్రపతి ఆదివారం ఆమోదించగా, ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆప్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాలు ఆప్ ఎమ్మెల్యేలకు ఊరట కలిగించాయనే చెప్పవచ్చు. ఇక మొత్తం 70 మంది సభ్యుల అసెంబ్లీలో ఆప్ బలం 66 నుంచి 44కు పడిపోయినా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని సర్కారుకు ఢోకా లేదు. -
ఓటర్లకు ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషిన్లు!
► ఆర్కేనగర్లో అభ్యర్థుల లీలలు ► నగదు ముట్టిందా అనేందుకు కోడ్ భాష.. స్వామికి దండం పెట్టుకున్నారా! ► అమ్మ భౌతికకాయం బొమ్మతో ప్రచారం ► పన్నీర్‌కు వాసన్ మద్దతు సాక్షి ప్రతినిధి, చెన్నై: సవాలక్ష నిబంధనల అతిక్రమణకు అనంతకోటి ఉపాయాలు ఉన్నాయని ఆర్కేనగర్ ఎన్నికలు రుజువు చేస్తున్నాయి. నగదు పంపిణీని అడ్డుకునేందుకు అధికారులు అవస్థలు పడుతుండగా కోడ్ భాషతో అభ్యర్థులు తమ పనికానిచ్చేస్తున్నారు. ఆర్కేనగర్లో సుమారు రెండు లక్షల ఓటర్లుండగా, ఒక్కో ఓటుకు రూ.4వేలు నుంచి రూ.10వేల వరకు చెల్లిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నగదు ప్రవాహాన్ని అడ్డుకునేందుకు 35 మంది పరిశీలకులు, 10 ప్లయింగ్ స్క్వాడ్ల ను, ఆదాయ పన్ను శాఖ అధికారులను ఎన్నికల కమిషన్ నియమించింది. వీరుగాక పెద్ద సంఖ్యలో పోలీసులు, పారా మిలటరీ దళాలు తిరుగుతున్నాయి. అయినా బుధవారం ఒక్కరోజునే లక్ష మంది ఓటర్లకు నగదు పంపిణీ సాగినట్లు తెలుస్తోంది. అయితే నోటు తీసుకున్నా తమకే ఓటు వేస్తారని గ్యారంటీ ఎముందని అభ్యర్థులకు అనుమానం పట్టుకుంది. ఆధ్యాత్మిక భావాలు అధికంగా ఉండే తమిళ ప్రజలు సెంటిమెంట్‌కు కట్టుబడి ఉంటారు. అందుకే నగదును అందజేసే ముందు భగవంతుని బొమ్మలపై ప్రమాణం చేయించుకుంటున్నారు. వారి వారి మతాలను అనుసరించి ఓటు కోసం ఒట్టు వేయించుకుంటున్నారు. నగదు పంపిణీ సక్రమంగా జరిగిందా లేక కార్యకర్తలు నొక్కేసారా అనే అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు మరో బృందం పర్యటిస్తోంది. వీరు ఓటర్ల వద్దకు, టీ దుకాణాల వద్ద గుంపులుగా ఉండేవారి వద్దకు వెళ్లి ‘స్వామికి దండం పెట్టుకున్నారా’ అని ప్రశ్నించగా పెట్టుకున్నాం అని బదులిస్తే నగదు ముట్టినట్లు. డబ్బులు అందనివారు ‘ ఎక్కడయ్యా స్వామి...ఎలా దండం పెట్టుకునేది’అని సమాధానం చెబుతున్నారు. ఇదిలా ఉండగా, కొందరు ఓటర్లకు వాషింగ్ మెషీన్, ఫ్రిజ్ తదితర వస్తువుల కూపన్లు పంచుతున్నారు. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఇదే మాటలు వినపడడంతో అధికారులు కోడ్ భాషను కనుగొన్నారు. శీర్కాళి నియోజకవర్గ అన్నాడీఎంకే ఎమ్మె ల్యే భారతి తన అనుచరులతో వస్తుండగా అధికారులు ఆయన కారును ఆపి తనిఖీలు చేశారు. అయితే ఏమీ దొరకలేదు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో ధన ప్రవాహం ఎన్నికల కమిషన్‌ను ఊపిరి తీసుకోనివ్వడం లేదు. ఇప్పటికే అధికారుల బృందాలతో ఆర్కేనగర్ నిండిపోగా, తాజాగా మరో ఉన్నతాధికారి ఢిల్లీ నుంచి చెన్నైకి చేరుకున్నారు. అమ్మ భౌతికకాయం బొమ్మ, శవపేటిక ప్రచారం ఇదిలా ఉండగా, అమ్మ మరణానికి శశికళ, ఆమె కుటుంబీకులే కారణమని ప్రజలు అనుమానిస్తుండగా, దీన్ని అవకాశంగా తీసుకున్న పన్నీర్‌సెల్వం వర్గం ఆర్కేనగర్లో చిత్రమైన ప్రచారం చేసింది. ఒక జీపుపై అమ్మ భౌతికకాయాన్ని పోలిన బొమ్మను శవపేటిలో ఉంచి ప్రచారం నిర్వహించడం కలకలం రేపింది. ఈనెల 12వ తేదీన ఆర్కేనగర్లో పోలింగ్ జరగనుండడంతో అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచార వేగం పెంచారు. అయితే అన్నాడీఎంకేలోని రెండు చీలిక వర్గాల అభ్యర్థులు దినకరన్, మధుసూదనన్ ఒకరి కొకరు గట్టిపోటీ ఇస్తున్నారు. అయితే విచ్చలవిడిగా నగదును వెదజల్లుతూ ఓటర్లను ప్రలోభపెట్టడంలో దినకరన్ ముందున్నరానే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలకు తగ్గట్లుగా నగదు బట్వాడా చేస్తూ అన్నాడీఎంకే, డీఎంకే కార్యకర్తలు పట్టుపడుతున్నారు. భారీ మొత్తం నగదు స్వాధీనమైంది. ఈ పరిస్థితిలో ఢిల్లీలోని ప్రధాన ఎన్నికల కమిషన్ కార్యాలయం ఆదాయపన్ను శాఖకు చెందిన ఐఆర్ఎస్ అధికారి విక్రమ్ భాద్రాను ప్రత్యేక అధి కారిని నియమించగా ఆయన గురువారం ఉదయం చెన్నైకి చేరుకున్నారు. ఈ అధికారి అభ్యర్థులపైనే గాక ఆర్కేనగర్లో పనిచేసే అధికారులపై కూడా నిఘాపెట్టే అధికారాలను ఈసీ కల్పించింది. ఆర్కేనగర్లో ఎన్నికల విధులు నిర్వహించే అన్నిశాఖల అధికారులు విక్రమ్ బాద్రా కనుసన్నల్లో నడుచుకోవాల్సి ఉంది. ప్రజలు, పార్టీ నుంచి వచ్చే ఫిర్యాదులను సైతం స్వీకరించి నేరుగా ఢిల్లీకి పంపి వాటిపై ఆయనే నిర్ణయం తీసుకుంటారు. ఇదిలా ఉండగా, ఎన్నికల అధికారులతో కూడిన ఫ్ల్లయింగ్ స్క్వాడ్ బృందాల్లో రాజకీయ పార్టీల ప్రతి నిధులను కూడా చేర్చాలని ఆలోచిస్తున్నట్లు ప్రధాన ఎన్నికల అధికారి రాజేష్ లఖానీ చెప్పారు. నగదు బట్వాడాపై మారుమూల సందుల్లో సైతం నిఘా పెంచేందుకు ద్విచక్రవాహనాల పోలీసు దళాలు గురువారం రం గంలోకి దించినట్లు చెన్నై పోలీసు కమిషనర్ కార్తికేయన్ తెలిపారు. కాశిమేడు ప్రాంతంలో ఓటర్లకు నగదు పంచుతున్న డీఎంకే కార్యకర్త కరుణానిధిని అరెస్ట్ చేశారు. దినకరన్ ఓటమికి ఏడపాడి కుట్ర: స్టాలిన్ ఆర్కేనగర్ ఎన్నికల్లో దినకరన్ గెలిచినట్లయితే తన సీఎం సీటుకు ముప్పు తప్పదని సీఎం ఎడపాడి పళనిస్వామి భయపడుతున్నారని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షులు స్టాలిన్ అన్నారు. ఆర్కేనగర్ పార్టీ నేతలతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సీఎం సీటును కాపాడుకునేందుకు దినకరన్ ఓటమికి ఎడపాడి పాటుపడుతున్నారని వ్యాఖ్యానించారు. తమిళ మానిల కాంగ్రెస్ అధ్యక్షుడు జీకేవాసన్ గురువారం పన్నీర్‌సెల్వం అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. -
తమిళనాట ఉప ఎన్నిక
నాలుగు అసెంబ్లీ స్థానాలకు వచ్చే వారం నోటిఫికేషన్ సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు, పుదుచ్చేరిలో నాలుగు స్థానాలకు ఉప ఎన్నికల నిర్వహణకు వచ్చేవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా 232 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. కరూరు జిల్లా అరవకురిచ్చి, తంజావూరు నియోజకవర్గాల్లో విచ్చలవిడిగా నగదు బట్వాడా సాగిందని డీఎంకే వేసిన పిటిషన్‌తో ఎన్నికలు వాయిదాపడ్డాయి. మధురై జిల్లా తిరుప్పరగున్రం ఎమ్మెల్యే అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో మొత్తం మూడు నియోజకవర్గాల్లో ఆరునెలల్లోగా ఉప ఎన్నికలు జరపాల్సి ఉండగా ప్రస్తుతం ఐదో నెల సాగుతోంది. పుదుచ్చేరిలోని నెల్లితోప్పునకు ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. మొత్తం నాలుగు అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికల కోసం వారం రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనున్నట్లు ఎలక్షన్ కమిషన్ కార్యాలయం మసమాచారం. -
'టీఆర్ఎస్ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా'
సత్తుపల్లి (ఖమ్మం జిల్లా):‘కేసీఆర్‌పై ఇక యుద్ధం మొదలైంది.. ఆరు నెలలు ఓపిక పట్టండి టీఆర్ఎస్ను తుక్కుతుక్కుగా ఓడిస్తాం.. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిస్తే నాలుగేళ్లు ఏమీ మాట్లాడం.. రాజకీయ సన్యాసం తీసుకుంటాం’ అని టీడీపీ శాసనసభా పక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌రావు సవాల్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం రాత్రి టీడీపీ ఎమ్మెల్యేల బృందం సండ్ర వెంకటవీరయ్యకు సంఘీభావం ప్రకటించింది. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ మా పార్టీ ఎమ్మెల్యేలను డబ్బులు పెట్టి కొన్నప్పుడు కేసుకాదు.. మంచిరెడ్డి కిషన్‌రెడ్డి స్వయానా డబ్బుల కోసమే పార్టీ మారుతున్నానని చెప్పారు అయినా కేసు కాలేదన్నారు. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టే ఇటీవల జరిగిన ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు బుద్ధి చెప్పారన్నారు. తలసాని శ్రీనివాసయాదవ్‌కు సనత్‌నగర్‌లో మూడో స్థానం దక్కుతుందని.. 25వేల ఓట్ల మెజార్టీతో టీడీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సండ్ర వెంకటవీరయ్య, రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందునే ఏ తప్పు చేయకపోయినా కేసులో అక్రమంగా ఇరికించారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కొన్ని పొరబాట్లు జరగటం వల్లే సీట్లు తగ్గాయని... కనీసం 30 నుంచి 32 స్థానాలు రావాల్సి ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ప్రధాన ప్రత్యర్థి కాబట్టి తమ పార్టీని దెబ్బతీసేందుకే సీఎం కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ మారాలని నాతోపాటు ప్రకాష్‌గౌడ్, సండ్ర వెంకటవీరయ్య వెంటపడ్డారని లొంగక పోయేసరికి అక్రమ కేసులు బనాయిస్తున్నాయని ఆరోపించారు. సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ రాజకీయంగా నా మనోధైర్యాన్ని దెబ్బతీయలేరన్నారు. విశాఖపట్నంలో మా పిల్లలు చదువుతుంటే ఫార్మా ఇండ్రస్ట్రీ పెట్టానని ఆరోపణలు చేస్తున్నారని.. ఎన్నికల అఫిడవిట్లో ఏవైతే దాఖలు చేశానో.. దానికంటే ఒక్కటి ఎక్కువ ఉన్నా.. రాసిస్తానన్నారు. బినామీల పేరుమీద అక్రమ ఆస్తులు సంపాదించాల్సిన కర్మ పట్ట లేదన్నారు. చిల్లర ఆరోపణలు మానుకోవాలని... విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో ఉన్నానన్నారు. పోలీసులు, అధికారులను ప్రయోగించి పార్టీ మార్పిడులను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, ప్రకాష్‌గౌడ్, మాగంటి గోపినాథ్, టీడీపీ జిల్లా అధ్యక్షులు తాళ్లూరి బ్రహ్మయ్య, మెచ్చా నాగేశ్వరరావు, వాసిరెడ్డి రామనాధం తదితరులు పాల్గొన్నారు. -
భలే... డిపాజిట్ దక్కింది
రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీపై ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇంకా కోపం చల్లారలేదు. ఆ విషయం నందిగామ ఉప ఎన్నిక ద్వారా మరోసారి రుజువైంది. ఆ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బోడపాటి బాబురావు... టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్య చేతిలో ఓడిపోయారు. కాకుంటే చావు తప్పి కన్నులోట్ట బోయినట్లు కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ మాత్రం దక్కిందని ఆ పార్టీ నేతలు మురిసిపోతున్నారు ... రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీపై ఆంధ్రప్రదేశ్ ప్రజలలో గూడు కట్టుకున్న ఆగ్రహాన్ని ఇటీవల జరిగిన పార్లమెంట్, శాసనసభకు జరిగిన ఎన్నికలలో ఆ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కకూడదంటూ తమ తీర్పు ద్వారా వెల్లడించారు. అయితే నందిగామ శాసనసభ స్థానం నుంచి ఎన్నికైన టీడీపీ అభ్యర్థి తంగిరాల ప్రభాకరరావు ఆకస్మికంగా మరణించారు. దాంతో టీడీపీ ప్రభుత్వం ఉప ఎన్నికను నివారించేందుకు... తంగిరాల ప్రభాకరరావు కుమార్తె తంగిరాల సౌమ్యను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అందులోభాగంగా ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోపాటు వామపక్షాల మద్దతును కూడా కూడగట్టింది. అందుకు ఆ పార్టీలు కూడా సానుకూలంగా స్పందించాయి. సౌమ్య ఎన్నిక ఏకగీవ్రం అవుతుందని అనుకున్నరంతా. ఆ దశలో గత ఎన్నికల్లో అడ్రస్ గల్లంతైన కాంగ్రెస్ పార్టీ ఆ ఉప ఎన్నిక ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకుందామనుకున్నట్లుంది. అంతే తమ పార్టీ అభ్యర్థిని ఉప ఎన్నికల బరిలో నిలుపుతున్నట్లు వెల్లడించింది. అనుకున్నదే తడువుగా బోడపాటి బాబురావు తమ అభ్యర్థి అని ప్రకటించింది. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దాంతో ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఖాళీ అయిన పార్లమెంట్, వివిధ రాష్ట్రాల శాసనసభకు నిర్వహించిన ఉప ఎన్నికలతోపాటు నందిగామ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన హేమాహేమీలంతా ప్రచారం కూడా చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బోడపాటి బాబురావుపై టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్య 74,827 ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. ఈ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైందని బాధ నుంచి డిపాజిట్ దక్కించుకున్నామని కొద్దిలో కొద్దిగా ఆత్మసంతృప్తి దక్కింది... సదరు నాయకులకు. దీంతో 100 రోజుల కిత్రం జరిగిన ఎన్నికల నాటికంటే కొద్దిగా పురోగతి సాధించామని కాంగ్రెస్ నాయకులు తెగ సంతోషంతో ఉన్నారు. -
అసోంలో ఏఐయూడీఎఫ్ ముందంజ
గౌహతి : అసోం రాష్ట్రంలో ఇటీవల జరిగిన మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల లెక్కింపు ప్రక్రియ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. అయితే రెండు స్థానాలలో ఏఐయూడీఎఫ్ అభ్యర్థులు ముందంజలో ఉండగా మరో స్థానంలో బీజేపీ అభ్యర్థి దూసుకుపోతున్నారు. రాష్ట్రంలోని మూడు శాసనసభ నియోజకవర్గాలైన సిల్చెర్, జమునాముఖ్, లక్ష్మీపూర్‌లో ఉప ఎన్నికలు జరిగాయి. ఆ మూడు నియోజకవర్గాలలో మొత్తం 25 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. మరికాసేపట్లో ఎవరి భవితవ్యం ఏమిటనేది తేలనుంది. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలలోని మూడు పార్లమెంట్ స్థానాలకు, 33 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు ఈ నెల 13న నిర్వహించారు. అందులోభాగంగా మంగళవారం ఎన్నికల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది. -
మోడీ పాపులారిటీకి తొలి అగ్నిపరీక్ష
-
ఉత్తరాఖండ్ ఎన్నికల్లో 50 శాతం పోలింగ్
డెహ్రాడున్: ఉత్తరాఖండ్ లో ఆదివారం జరిగిన ఉప ఎన్నికల్లో 50 శాతం పోలింగ్ నమోదైంది. మూడు అసెంబ్లీ స్థానాలకు గాను ఇక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో సగం మంది ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ధార్చులా, దోయ్ వాలా, సోమేశ్వర్ అసెంబ్లీ స్థానాల్లో మూడు లక్షల మంది ఓటర్లు పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో ఓటర్లు శాంతియుతంగా ఓటు వినియోగించుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి రాధా రాతూరి తెలిపారు. పోలింగ్ ఏర్పాట్లు ఇక్కడ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన హరీష్ రావత్ కు ఈ ఎన్నికలు అత్యంత ప్రాధాన్యమైనవి. ముఖ్యమంత్రిగా రావత్ తన బలాన్ని నిరూపించుకునే గడువు జూలై 31 తో ముగుస్తున్నసంగతి తెలిసిందే. విజయ్ బహుగుణ నుంచి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన ఆయన ఫిబ్రవరి 1వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. ధార్చులా అసెంబ్లీ నుంచి బరిలోకి దిగిన రావత్ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది వరదలతో పెను విధ్వంసానికి గురైన ఉత్తరాఖండ్‌లో విజయ్ బహుగుణ సరైన రీతిలో సహాయ, పునరావాస చర్యలు చేపట్టడంలో విఫలమవడంతో ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ తన ప్రతిష్టను కాపాడుకునేందుకు విజయ్ బహుగుణను తొలగించి అప్పటి కేంద్ర జల వనరుల శాఖ మంత్రి 65 యేళ్ళ హరీష్ రావత్ ను ముఖ్యమంత్రిగా నియమించింది. అప్పట్లో కాంగ్రెస్ అధినాయకత్వం చేసిన విజ్ఞప్తి మేరకు విజయ్ బహుగుణ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెల్సిందే. -
3న ఏపీ రాజ్యసభ ఉప ఎన్నికలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మృతితో ఖాలీ ఏర్పడ్డ రాజ్యసభ స్థానం ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 16న నోటిఫకేషన్ జారీ చేయనున్నారు. జూలై 3న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత బలాబలాలను బట్టి అధికార తెలుగుదేశం పార్టీకి రాజ్యసభ సీటు దక్కనుంది. కాగా మిత్రపక్షం బీజేపీకి రాజ్యసభ సీటు ఇచ్చే అవకాశముందని భావిస్తున్నారు. పార్లమెంట్లో ఏ సభలోనూ సభ్యులు కాని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను బీజేపీ ఎంపిక చేయవచ్చని సమాచారం.