హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మృతితో ఖాలీ ఏర్పడ్డ రాజ్యసభ స్థానం ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 16న నోటిఫకేషన్ జారీ చేయనున్నారు. జూలై 3న ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత బలాబలాలను బట్టి అధికార తెలుగుదేశం పార్టీకి రాజ్యసభ సీటు దక్కనుంది. కాగా మిత్రపక్షం బీజేపీకి రాజ్యసభ సీటు ఇచ్చే అవకాశముందని భావిస్తున్నారు. పార్లమెంట్లో ఏ సభలోనూ సభ్యులు కాని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను బీజేపీ ఎంపిక చేయవచ్చని సమాచారం.
3న ఏపీ రాజ్యసభ ఉప ఎన్నికలు
Published Fri, Jun 13 2014 6:46 PM | Last Updated on Sat, Sep 2 2017 8:45 AM
Advertisement
Advertisement