అప్‌డేట్స్
► భవానీపూర్ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 6.30గంటల వరకు 60 శాతంపైగా పోలింగ్ శాతం నమోదైంది.
►ఉదయం 11 గంటల వరకు భవానీపూర్ నియోజకవర్గంలో 21.73 శాతం ఓటింగ్ నమోదు.
► ఉదయం 11 గంటల వరకుజాంగీపూర్ నియోజకవర్గంలో 40.23 శాతం ఓటింగ్ నమోదు.
► ఉదయం 11 గంటల వరకు సంషేర్‌గంజ్ నియోజకవర్గంలో 36.11 శాతం ఓటింగ్ నమోదు.
ఉదయం 9 గంటలు
► ఉదయం 9 గంటల వరకు భవానీపూర్ నియోజకవర్గంలో 7.57 శాతం ఓటింగ్ నమోదు.
► ఉదయం 9 గంటల వరకుజాంగీపూర్ నియోజకవర్గంలో 17.51 శాతం ఓటింగ్ నమోదు.
► ఉదయం 9 గంటల వరకు సంషేర్‌గంజ్ నియోజకవర్గంలో 16.32 శాతం ఓటింగ్ నమోదు.
► భవనీపూర్‌లో ఓటర్లకు శానిటైజర్లు, గ్లోవ్స్ పంపిణీ చేస్తున్న ఈసీ
► భబానీపూర్‌లోని మిత్రా ఇన్‌స్టిట్యూషన్ పోలింగ్ బూత్‌లో ఓటు హక్కను వినియోగించుకున్న 90 ఏళ్ల మనోభాషిణి చక్రవర్తి.
#WestBengalBypolls | 90-year-old Manobashini Chakrabarty casts her vote at Mitra Institution polling booth in Bhabanipur pic.twitter.com/mMiAbWOoPx
— ANI (@ANI) September 30, 2021
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బరిలో ఉన్న దక్షిణ కోల్‌కతాలోని భవానీపుర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలిగ్ గురువారం ఉదయం ప్రారంభమైంది. భవానీపూర్‌తోపాటు జాంగీపూర్, సంషేర్‌గంజ్ అసెంబ్లీ స్థానాలకు నేడు ఉప ఎన్నిక జరుగుతోంది. ఉప ఎన్నిక నేపథ్యంలో అధికారులు భద్రతను కట్టదిట్టం చేశారు. 15 కంపెనీల కేంద్ర బలగాలను ఈసీ మోహరించింది. పోలింగ్ బూత్‌ల నుంచి 200 మీటర్ల వరకు సెక్షన్ 144 నిషేధాజ్ఞలను అమలు చేస్తున్నట్టు ప్రకటించింది.
చదవండి: బీజేపీ చేతిలో మమత కీలుబొమ్మ!
ఇక భవానీపూర్ నియోజకవర్గంలో తృణమూల్ కాంగ్రెస్ తరఫున మమతా బెనర్జీ బరిలో ఉంటే, బీజేపీ ప్రియాంక టైబ్రెవాల్‌ను బరిలో దింపింది. ఇక సీపీఐ(ఎం) తరపున స్రిజిబ్ బిశ్వాస్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ ఈ ఎన్నికలకు దూరంగా ఉంది. నియోజకవర్గంలోని 97 పోలింగ్ కేంద్రాల్లోని 287 బూత్‌ల లోపల సెంట్రల్ పారా మిలటరీకి చెందిన ముగ్గురేసి జవాన్లను మోహరించారు. పోలింగ్ బూత్ వెలుపల భద్రత కోసం కోల్‌కతాకు చెందిన పోలీసు అధికారులు పహారా కాస్తారు. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల పరిధిలో అయిదుగురికి మించి గుమిగూడడాన్ని నిషేధించారు. ఉప ఎన్నిక ఫలితాలు అక్టోబరు 3న వెల్లడికానున్నాయి.
కాగా భవానీపూర్‌లో మమతకి మంచి పట్టు ఉంది. 2011, 2016 ఎన్నికల్లో భవానీపూర్ నియోజకవర్గం నుంచే మమతా బెనర్జీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్‌లోని నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మమతా ..బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయినా మమతా సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆమె ఆరు నెలల్లోగా శాసనసభ లేదా శాసనమండలికి ఎన్నిక కావాల్సి ఉంది.
అయితే బెంగాల్ లో శాసనమండలి లేదు. ఈ నేపథ్యంలో భవానీపూర్ నియోజకవర్గంలో గెలిచిన వ్యవసాయ మంత్రి శోబన్‌దేవ్ ఛటోపాధ్యాయ రాజీనామా చేశారు. ఆ స్థానానికి జరుగుతున్న ఉపఎన్నికలో దీదీ పోటీ చేస్తున్నారు. 2011, 2016 ఎన్నికల్లో కూడా మమత.. భవానీపూర్ నుంచే గెలిచి సీఎంగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఉపఎన్నికలో కూడా గెలిచి.. సీఎంగా కొనసాగాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment