Bhabanipur
-
అక్టోబరు 7న ఎమ్మెల్యేగా మమతా బెనర్జీ ప్రమాణం
కోల్‌కతా: భవానీపూర్ నియోజకవర్గ ఉప ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిచిన మమతా బెనర్జీ అక్టోబరు 7 న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి సీఎం మమతా మంగళవారం గవర్నర్ జగదీప్ ధన్కర్కు లేఖ రాశారు. అక్టోబరు 3న విడుదలైన భవానీపూర్, జంగీపూర్, షంషేగంజ్ ఉప ఎన్నికలలో టీఎంసీ క్లీన్ స్వీప్ చేసింది. ఎన్నికల కమిషన్ ప్రకారం మమతా.. 85,263 ఓట్లను సాధించింది. ప్రియాంక టిబ్రేవాల్‌కు 26,428 ఓట్లు సాధించింది. ఉత్తర ప్రదేశ్ లఖీంపూర్‌ఖేరీ ఘటనను టీఎంసీ ఖండించింది. విపక్షనేతలు.. రైతులను పరామర్శించకుండా అడ్డుకోవడంపై ఛటర్జీ మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగిన మమత, టీఎంసీని వీడి బీజేపీలో చేరిన సువేందు అధికారి చేతిలో స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘన విజయం సాధించడంతో మమతా బెనర్జీ మూడోసారి సీఎం పదవి చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా, మమత సీఎంగా కొనసాగాలంటే భవానీపూర్ ఉప ఎన్నికలో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చదవండి: Bhabanipur Bypoll: భవానీపూర్ ఉపఎన్నికలో మమతాబెనర్జీ విజయం -
భవానీపూర్ ఓటర్లకు ప్రత్యేక ధన్యవాదాలు : మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్: భవానీపూర్ ఉపఎన్నికలలో తృణముల్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఆమె భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ప్రియాంక టిబ్రివాల్‌పై 58,389 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ.. తనను భారీ మెజార్టీతో గెలిపించిన భవానీపూర్ ఓటర్లకు తన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నందిగ్రామ్‌లో ఓడించడానికి బీజేపీ పెద్ద కుట్ర చేసిందని అన్నారు. పశ్చిమ బెంగాల్లో.. బీజీపీ ప్రభుత్వం తరచు వివాదాలను సృష్టించిందని అన్నారు. తమ ప్రభుత్వంపై బీజేపీ అసత్య ఆరోపణలు చేసిందని మమత మండిపడ్డారు. భవానీపూర్‌లో.. తాను బరిలో దిగకుండా బీజీపీ అనేక కుయుక్తులు పన్నిందని ఆరోపించారు. ప్రజలు నాపై నమ్మకం ఉంచి భారీమెజార్టీతో గెలిపించారని అన్నారు. కేవలం ఆరు నెలల్లోనే ఎన్నికలను నిర్వహించినందుకు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. భవానీపూర్ విజయంతో తన బాధ్యత మరింత పెరిగిందని సీఎం మమత అన్నారు. చదవండి: Mamata Banerjee: భారీ మెజార్టీతో మమతా బెనర్జీ విజయం -
భవానీపూర్ ఉపఎన్నికలో మమతాబెనర్జీ విజయం
కోల్‌కతా: భవానీపూర్ ఉపఎన్నికలో మమతా బెనర్జీ గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రీవాల్‌పై 58,389 ఓట్ల మెజార్టీతో దీదీ ఘనవిజయం సాధించారు. కొన్ని నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె సొంత స్థానమైన భవానీపూర్‌ను వదిలేసి, నందిగ్రామ్ స్థానం నుంచి పోటీ చేసి, బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారు. ఆరు నెలల్లోగా ఏదో ఒక స్థానం నుంచి ఎమ్మెల్యేగా నెగ్గాల్సి ఉండగా, భవానీపూర్ టీఎంసీ ఎమ్మెల్యే శోభన్‌దేవ్ ఛటోపాధ్యాయ ఆమె కోసం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. -
Bhabanipur Bypoll:భారీ మెజార్టీతో మమతా బెనర్జీ విజయం
భవానీపూర్ ఉపఎన్నికలో మమతా బెనర్జీ భారీ మెజార్టీతో గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రీవాల్‌పై 58,389 ఓట్ల మెజార్టీతో దీదీ ఘనవిజయం సాధించారు. తొలి రౌండ్ నుంచి 21వ రౌండ్ వరకూ మమత స్పష్టమైన ఆధిక్యం కనబరిచారు. భవానీపూర్ ఉప ఎన్నికల్లో మమతాకు 84,709 ఓట్లు రాగా, ప్రియాంక టిబ్రీవాల్కు 26,320 ఓట్లు వచ్చాయి. కొన్ని నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె సొంత స్థానమైన భవానీపూర్‌ను వదిలేసి, నందిగ్రామ్ స్థానం నుంచి పోటీ చేసి, బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారు. ఆరు నెలల్లోగా ఏదో ఒక స్థానం నుంచి ఎమ్మెల్యేగా నెగ్గాల్సి ఉండగా, భవానీపూర్ టీఎంసీ ఎమ్మెల్యే శోభన్‌దేవ్ ఛటోపాధ్యాయ ఆమె కోసం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ►19 రౌండ్లు ముగిసేసరికి మమత 50వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ►11 రౌండ్లు పూర్తయ్యేసరికి మమత 34వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ►11వ రౌండ్ ముగిసే సమయానికి మమతకు 45,874 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్‌కు 11,892 ఓట్లు వచ్చాయి. ►బెంగాల్లో ఉపఎన్నిక జరుగుతున్న మరో రెండు చోట్ల జంగీపుర్, సంషేర్‌గంజ్ స్థానాల్లోనూ టీఎంసీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ►ఏడు రౌండ్లు పూర్తయ్యేసరికి మమత 25వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ► నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి మమత 14,435 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ► మూడు రౌండ్లు పూర్తయ్యే సరికి బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రీవాల్‌పై మమత 6,146 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ►భవానీపూర్ అసెంబ్లీ నియోజకరవర్గ ఉపఎన్నికలో మమతా బెనర్జీ 2,799 ఓట్ల అధిక్యంలో కొనసాగుతున్నారు. కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. సెప్టెంబర్ 30న జరిగిన ఉప ఎన్నికల్లో 57 శాతం పోలింగ్ నమోదయ్యిందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా, మధ్యాహ్నం కల్లా ఫలితాలపై స్సష్టత వచ్చే అవకాశం ఉంది. ఉపఎన్నికలో మమతపై బీజేపీ అభ్యర్థిగా న్యాయవాది ప్రియాంక పోటీలో ఉన్నారు. భవానీపూర్ నియోజకవర్గం అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి(టీఎంసీ) కంచుకోటగా ఉంది. కొన్ని నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె సొంత స్థానమైన భవానీపూర్‌ను వదిలేసి, నందిగ్రామ్ స్థానం నుంచి పోటీ చేసి, బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారు. ఆరు నెలల్లోగా ఏదో ఒక స్థానం నుంచి ఎమ్మెల్యేగా నెగ్గాల్సి ఉండగా, భవానీపూర్ టీఎంసీ ఎమ్మెల్యే శోభన్‌దేవ్ ఛటోపాధ్యాయ ఆమె కోసం రాజీనామా చేశారు. -
భవానీపూర్ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది
అప్డేట్స్ ► భవానీపూర్ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 6.30గంటల వరకు 60 శాతంపైగా పోలింగ్ శాతం నమోదైంది. ►ఉదయం 11 గంటల వరకు భవానీపూర్ నియోజకవర్గంలో 21.73 శాతం ఓటింగ్ నమోదు. ► ఉదయం 11 గంటల వరకుజాంగీపూర్ నియోజకవర్గంలో 40.23 శాతం ఓటింగ్ నమోదు. ► ఉదయం 11 గంటల వరకు సంషేర్‌గంజ్ నియోజకవర్గంలో 36.11 శాతం ఓటింగ్ నమోదు. ఉదయం 9 గంటలు ► ఉదయం 9 గంటల వరకు భవానీపూర్ నియోజకవర్గంలో 7.57 శాతం ఓటింగ్ నమోదు. ► ఉదయం 9 గంటల వరకుజాంగీపూర్ నియోజకవర్గంలో 17.51 శాతం ఓటింగ్ నమోదు. ► ఉదయం 9 గంటల వరకు సంషేర్‌గంజ్ నియోజకవర్గంలో 16.32 శాతం ఓటింగ్ నమోదు. ► భవనీపూర్‌లో ఓటర్లకు శానిటైజర్లు, గ్లోవ్స్ పంపిణీ చేస్తున్న ఈసీ ► భబానీపూర్‌లోని మిత్రా ఇన్స్టిట్యూషన్ పోలింగ్ బూత్‌లో ఓటు హక్కను వినియోగించుకున్న 90 ఏళ్ల మనోభాషిణి చక్రవర్తి. #WestBengalBypolls | 90-year-old Manobashini Chakrabarty casts her vote at Mitra Institution polling booth in Bhabanipur pic.twitter.com/mMiAbWOoPx — ANI (@ANI) September 30, 2021 కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బరిలో ఉన్న దక్షిణ కోల్‌కతాలోని భవానీపుర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలిగ్ గురువారం ఉదయం ప్రారంభమైంది. భవానీపూర్‌తోపాటు జాంగీపూర్, సంషేర్‌గంజ్ అసెంబ్లీ స్థానాలకు నేడు ఉప ఎన్నిక జరుగుతోంది. ఉప ఎన్నిక నేపథ్యంలో అధికారులు భద్రతను కట్టదిట్టం చేశారు. 15 కంపెనీల కేంద్ర బలగాలను ఈసీ మోహరించింది. పోలింగ్ బూత్‌ల నుంచి 200 మీటర్ల వరకు సెక్షన్ 144 నిషేధాజ్ఞలను అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. చదవండి: బీజేపీ చేతిలో మమత కీలుబొమ్మ! ఇక భవానీపూర్ నియోజకవర్గంలో తృణమూల్ కాంగ్రెస్ తరఫున మమతా బెనర్జీ బరిలో ఉంటే, బీజేపీ ప్రియాంక టైబ్రెవాల్‌ను బరిలో దింపింది. ఇక సీపీఐ(ఎం) తరపున స్రిజిబ్ బిశ్వాస్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ ఈ ఎన్నికలకు దూరంగా ఉంది. నియోజకవర్గంలోని 97 పోలింగ్ కేంద్రాల్లోని 287 బూత్‌ల లోపల సెంట్రల్ పారా మిలటరీకి చెందిన ముగ్గురేసి జవాన్లను మోహరించారు. పోలింగ్ బూత్ వెలుపల భద్రత కోసం కోల్‌కతాకు చెందిన పోలీసు అధికారులు పహారా కాస్తారు. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల పరిధిలో అయిదుగురికి మించి గుమిగూడడాన్ని నిషేధించారు. ఉప ఎన్నిక ఫలితాలు అక్టోబరు 3న వెల్లడికానున్నాయి. కాగా భవానీపూర్‌లో మమతకి మంచి పట్టు ఉంది. 2011, 2016 ఎన్నికల్లో భవానీపూర్ నియోజకవర్గం నుంచే మమతా బెనర్జీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్‌లోని నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మమతా ..బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయినా మమతా సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆమె ఆరు నెలల్లోగా శాసనసభ లేదా శాసనమండలికి ఎన్నిక కావాల్సి ఉంది. అయితే బెంగాల్ లో శాసనమండలి లేదు. ఈ నేపథ్యంలో భవానీపూర్ నియోజకవర్గంలో గెలిచిన వ్యవసాయ మంత్రి శోబన్‌దేవ్ ఛటోపాధ్యాయ రాజీనామా చేశారు. ఆ స్థానానికి జరుగుతున్న ఉపఎన్నికలో దీదీ పోటీ చేస్తున్నారు. 2011, 2016 ఎన్నికల్లో కూడా మమత.. భవానీపూర్ నుంచే గెలిచి సీఎంగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఉపఎన్నికలో కూడా గెలిచి.. సీఎంగా కొనసాగాలనుకుంటున్నారు. -
కోల్‌కతా ఓటరుగా ప్రశాంత్ కిషోర్.. పక్కా ప్లాన్‌తోనేనా?!
కోల్‌కతా: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పశ్చిమబెంగాల్ భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఓటరుగా ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. గత ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అధికారాన్ని నిలబెట్టుకోవడంలో ప్రశాంత్ కిషోర్ కీలక పాత్రపోషించారు. ఆయన ఇదివరకు బీహార్‌లోని ససారాం జిల్లాలోని తన స్వగ్రామంలో ఓటరుగా ఉన్నారు. ఈ నెల 30న జరగనున్న భవానీపూర్ ఉపఎన్నికలో ప్రశాంత్‌కిషోర్ తన ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాలు ఉన్నాయి. IUI0656683 ఎపిక్ నెంబర్‌తో ఉన్న నివాసం ఆయన శాశ్వత నివాసంగా చూపబడింది. నియోజకవర్గ పరిధిలోని రాణిశంకరి లేన్‌లోని బూత్ నెం-2222లో పోలింగ్ స్టేషన్ ఉంది. భవానీపూర్ అసెంబ్లీ ఎన్నిక సమయంలో ప్రశాంత్ కిషోర్ కోల్‌కతాలో ఉండకుండా బయటకు తీసుకురావడానికి బీజేపీ ఎన్నికల కమిషన్ని బలవంతం చేయొచ్చు అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పథకం ప్రకారం ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. భవానీపూర్‌లో ఓటరుగా నమోదు చేసుకోవడంతో బీజేపీ ఆయనపై విమర్శలు గుప్పిస్తోంది. టీఎంసీ అడ్వయిజర్‌గా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఓటరుగా నమోదు చేసుకోవడంపై బీజేపీ మీడియాసెల్ ఇన్చార్జ్ సప్తర్షి చౌదరి ఫైర్ అయ్యారు. 'చివరికి బహిరాగాటో (బయటివ్యక్తి) భవానీపూర్ ఓటర్ అయ్యారు. కాబట్టి, బెంగాల్ కుమార్తె ఇప్పుడు బహిరాగాటో (బయటి) ఓటర్‌కు అనుకూలంగా ఉంటుందో లేదో తెలియదు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చదవండి: (యూపీ బరిలో ఒవైసీ అలజడి) కిషోర్‌ను భవానీపూర్ ఓటర్ జాబితాలో చేరడంతో ఆయన కాంగ్రెస్‌లో చేరతారనే ఊహాగానాలకు తాత్కాలికంగా తెరపడింది. కొద్ది రోజుల క్రితం సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో సహా పలువురు కాంగ్రెస్ అగ్ర నాయకులను కలుసుకున్నారు. దీంతో అతను కాంగ్రెస్‌లో చేరవచ్చు అనే ఊహాగానాలకు ఆజ్యం పోశారు. అయితే ఆయన పార్టీలో చేరే నిర్ణయం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీదేనని పార్టీ వర్గాలు సూచించాయి. ప్రశాంత్ కిషోర్ మొదట్లో 2014 లోక్ సభ ఎన్నికలకు ముందు బీజేపీతో కలిసి పనిచేశారు. ఆ తర్వాత జేడీ(యు)లో చేరారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే, ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడంటూ పార్టీ నుంచి బహిష్కరించారు. తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీ వేదికను ఉపయోగించారని ఆరోపణలు వచ్చాయి. ఉత్తరప్రదేశ్‌లో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌తో కలిసి పనిచేశారు. అతను పంజాబ్‌లో పార్టీ విజయానికి తోడ్పాటునందించాడు. మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సలహాదారుగా ఉంటూ, అతను ఇటీవల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. చదవండి: (కాంగ్రెస్‌లోకి కన్హయ్య, జిగ్నేష్.. ముహుర్తం ఖరారు)