
పశ్చిమ బెంగాల్: భవానీపూర్ ఉపఎన్నికలలో తృణముల్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఆమె భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ప్రియాంక టిబ్రివాల్‌పై 58,389 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ.. తనను భారీ మెజార్టీతో గెలిపించిన భవానీపూర్ ఓటర్లకు తన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
నందిగ్రామ్‌లో ఓడించడానికి బీజేపీ పెద్ద కుట్ర చేసిందని అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో.. బీజీపీ ప్రభుత్వం తరచు వివాదాలను సృష్టించిందని అన్నారు. తమ ప్రభుత్వంపై బీజేపీ అసత్య ఆరోపణలు చేసిందని మమత మండిపడ్డారు. భవానీపూర్‌లో.. తాను బరిలో దిగకుండా బీజీపీ అనేక కుయుక్తులు పన్నిందని ఆరోపించారు.
ప్రజలు నాపై నమ్మకం ఉంచి భారీమెజార్టీతో గెలిపించారని అన్నారు. కేవలం ఆరు నెలల్లోనే ఎన్నికలను నిర్వహించినందుకు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. భవానీపూర్ విజయంతో తన బాధ్యత మరింత పెరిగిందని సీఎం మమత అన్నారు.