
తమిళనాట ఉప ఎన్నిక
నాలుగు అసెంబ్లీ స్థానాలకు వచ్చే వారం నోటిఫికేషన్
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు, పుదుచ్చేరిలో నాలుగు స్థానాలకు ఉప ఎన్నికల నిర్వహణకు వచ్చేవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా 232 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. కరూరు జిల్లా అరవకురిచ్చి, తంజావూరు నియోజకవర్గాల్లో విచ్చలవిడిగా నగదు బట్వాడా సాగిందని డీఎంకే వేసిన పిటిషన్‌తో ఎన్నికలు వాయిదాపడ్డాయి.
మధురై జిల్లా తిరుప్పరగున్రం ఎమ్మెల్యే అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో మొత్తం మూడు నియోజకవర్గాల్లో ఆరునెలల్లోగా ఉప ఎన్నికలు జరపాల్సి ఉండగా ప్రస్తుతం ఐదో నెల సాగుతోంది. పుదుచ్చేరిలోని నెల్లితోప్పునకు ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. మొత్తం నాలుగు అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికల కోసం వారం రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనున్నట్లు ఎలక్షన్ కమిషన్ కార్యాలయం మసమాచారం.