‘ఫెంగల్‌’ తడాఖా.. వరదల్లో కొట్టుకుపోతున్న బస్సులు, కార్లు.. | Cyclone Fengal Effect Buses Swept Away In Flood Waters At Tamil Nadu | Sakshi
Sakshi News home page

‘ఫెంగల్‌’ తడాఖా.. వరదల్లో కొట్టుకుపోతున్న బస్సులు, కార్లు..

Published Mon, Dec 2 2024 4:19 PM | Last Updated on Mon, Dec 2 2024 4:48 PM

Cyclone Fengal Effect Buses Swept Away In Flood Waters At Tamil Nadu

చెన్నై: ఫెంగల్‌ తుపాన్‌ కారణంగా తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో వాగులు, చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద చేరుకుంది. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. భారీ వరదకు రోడ్డుపై నిలిపిన వాహనాలు కొట్టుకుపోతున్నాయి. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో బస్సులు, కార్లు వరదల్లో కొట్టుకుపోయిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల ప్రకారం.. ఫెంగల్‌ తుపాను ప్రభావంతో తమిళనాడు అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారీ వరదకు రోడ్డుపై నిలిపిన వాహనాలు కొట్టుకుపోతున్నాయి. పుదుచ్చేరి, విల్లుపురం, తిరువన్నామలై, ధర్మపురి జిల్లాలపై ఈ తుఫాన్ ప్రభావం అధికంగా ఉంది. రోడ్లపై నీరు ప్రవహిస్తుండటంతో చాలా ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ఇక, కృష్ణగిరి జిల్లాలో వరద ధాటికి బస్సులు, కార్లు వరదల్లో కొట్టుకుపోయాయి. వరదల్లో ఇళ్లు సైతం నీటి మునిగాయి. వరద నీటిలో పాములు కనిపించడం ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. 

ఇదిలా ఉండగా.. తుపాన్‌ కారణంగా భారీ వర్షాల నేపథ్యంలో తమిళనాడు, పుదుచ్చేరిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించారు అధికారులు. ఇక, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇండియన్‌ ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.

మరోవైపు.. తుపాన్‌ ప్రభావం తాజాగా కర్ణాటక మీద కూడా చూపిస్తోంది. కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో బెంగళూరు, హసన్‌, మాండ్యా, రామనగర జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ విధించింది. అలాగే, ఉడిపి, చిక్మంగ్లూర్‌, చిక్‌బల్లాపూర్‌ జిల్లాలకు ఆరెంట్‌ అలర్ట్‌ విధించారు వాతావరణ శాఖ అధికారులు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement