ఫెంగల్‌ టెన్షన్‌.. చెన్నై ఎయిర్‌పోర్టులోకి వరద నీరు | Cyclone Fengal Effect Chennai Airport Closed | Sakshi
Sakshi News home page

భయపెడుతున్న ఫెంగల్‌.. చెన్నై విమానాలు దారి మళ్లింపు..

Published Sat, Nov 30 2024 3:20 PM | Last Updated on Sat, Nov 30 2024 7:39 PM

Cyclone Fengal Effect Chennai Airport Closed

Cyclone Fengal Updates..


👉 తీరం దాటుతున్న ‘ఫెంగల్‌’ తుపాను

  • పుదుచ్చేరి సమీపంలో ‘ఫెంగల్‌’ తుపాను తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలిపిన ఐఎండీ
  • ఈ ప్రక్రియకు దాదాపు నాలుగు గంటలు పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా
  • ఫెంగల్‌ తుపాను ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు
  • దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, కొన్నిచోట్ల తీవ్ర భారీ వర్షాలు కురిసే అవకాశం

👉మహాబలిపురం వద్ద ఫెంగల్‌ తుపాన్‌ తీరాన్ని తాకింది. 

👉తుపాను ఎఫెక్ట్‌.. విమానాలు రద్దు..

  • వాతావరణం సరిగా లేని కారణంగా విశాఖ నుంచి వెళ్లే పలు విమానాలు రద్దు  
  • చెన్నై-విశాఖ-చెన్నై, తిరుపతి-విశాఖ-తిరుపతి విమానాలు రద్దు
  • హైదరాబాద్‌ నుంచి చెన్నైకి వెళ్లాల్సిన మూడు విమానాలు రద్దు
  • హైదరాబాద్‌ నుంచి తిరుపతికి వెళ్లాల్సిన ఏడు విమానాలు రద్దు
  • విమానాల రద్దుతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 
  • రేపు ఉదయం 4 గంటల వరకు చెన్నై విమానాశ్రయం మూసివేత. 

👉ఫెంగల్‌ తుపాను ప్రభావం తమిళనాడు, చెన్నై, పుదుచ్చేరి, ఏపీపై చూపిస్తోంది. తుపాన్‌ ప్రభావంతో ఇప్పటికే చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

 

 👉మరోవైపు.. లోతట్టు పప్రాంతాలు జలమయమయ్యాయి. తాజాగా చెన్నై విమానాశ్రయంలోకి వరద నీరు వచ్చి చేరుకుంది. 

 

👉రన్‌వే పైకి వరద నీరు చేరుకోవడంతో పలు విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు. అలాగే, కొన్ని సర్వీసులను దారి మళ్లించారు. 

చెన్నై ఎయిర్ పోర్ట్ రన్ వే పైకి చేరిన వరద నీరు

 

 

👉నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఫెంగల్‌ తుపాను భయపెడుతోంది. గంటకు 12 కిమీ వేగంతో తుపాను ప్రస్తుతం పుదుచ్చేరికి 150 కి.మీ దూరంలో , చెన్నైకి 140 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. శనివారం సాయంత్రానికి తుపానుగా తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. తుపాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.

👉తుపాన్‌ నేపథ్యంలో​ తమిళనాడు, పుదుచ్చేరిలో గంటకు 70-80 కి.మీ వేగంలో గాలులు వీస్తున్నాయి. పలుచోట్ల ఇప్పటికే భారీ వర్షం కురుస్తోంది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.  మరోవైపు.. చెన్నై విమానాశ్రయాన్ని అధికారులు మూసివేశారు. చెన్నైకు రావాల్సిన విమానాలను దారి మళ్లించారు. బలమైన గాలులు, భారీ వర్షాల కారణంగా రైళ్ల రాకపోకలు సైతం ఆలస్యమవుతున్నాయి. పలు రైలు సర్వీసులను రద్దు చేసే అవకాశం ఉంది. 

👉తమిళనాడులోని చెన్నై, తిరువళ్లూరు, చెంగల్పట్టు, కాంచీపురం, విలుపురం, కల్లకురుచ్చి, కుద్దలూరు, పుద్చుచ్చేరికి వాతావరణ శాఖ రెడ్‌ అల్టర్‌ విధించింది. ఈ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. పలు జిల్లాలో స్కూల్స్‌, కాలేజీలకు సెలవు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నాయి.

👉ఫెంగల్‌ ప్రభావం ఏపీపై కూడా కొనసాగనుంది. తుపాను ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని అధికారులు తెలిపారు. వాయుగుండం కారణంగా నెల్లూరు, చిత్తూరు , కడప జిల్లాల్లో ఫ్లాష్‌ఫ్లడ్‌కు అకాశముందని హెచ్చరికలు రావడంతో ఏపీ సర్కార్‌ అప్రమత్తమయ్యింది. పెంగల్ తుపాన్‌ ప్రభావంతో తిరుమలలో నిన్న రాత్రి నుంచి భారీ ఈదురుగాలులతో వర్షం పడుతుంది. నెల్లూరు జిల్లాలో కావలి, అల్లూరు, దరదర్తి, బోగోలు మండల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement