Chennai rains
-
మంత్రిపై బురదజల్లిన వరద బాధితులు..
చెన్నై: ఫెంగల్ తుపాను తమిళనాడులో బీభత్సం సృష్టించింది. తుపాన్ కారణంగా ఇప్పటికే పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. భారీగా ఆస్తి నష్టం జరిగింది. వరద నీటికి ధాటికి పలు ప్రాంతాల్లో వాహనాలు కొట్టుకుపోయిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.మరోవైపు.. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోని వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక, భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలను పరామర్శించేందుకు వెళ్లిన మంత్రికి చేదు అనుభవం ఎదురైంది. ఆగ్రహంతో ఉన్న ప్రజలు.. సదరు మంత్రిపైనే బురద చల్లారు. దీంతో, ఈ ఘటన తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.తమిళనాడు అటవీ శాఖ మంత్రి కె. పొన్ముడి సోమవారం విల్లుపురం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కొన్నారు. తుపాన్ సమయంలో తమకు సహాయక చర్యలు అందలేదని ఎవరూ పట్టించుకోలేదని మండిపడ్డారు. ఇదే సమయంలో మంత్రి, ఆయన కుమారుడి సికామణిపై స్థానికులు బురదజల్లారు. దీంతో.. మంత్రి, సిబ్బంది చేసేదేమీలేక అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.This is the current state of affairs in Tamil Nadu. The CM and the Deputy Chief Minister were busy taking photos in the streets of Chennai while the city received very little rain and did not bother to keep track of the happenings beyond Chennai. The DIPR behaves like the media… pic.twitter.com/DvZN3UT1f0— K.Annamalai (@annamalai_k) December 3, 2024 ఇక, ఈ ఘటనపై తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై స్పందించారు. వీడియోను ట్విట్టర్లో షేర్ చేస్తూ.. తమిళనాడులో ప్రస్తుత పరిస్థితి ఇది. చెన్నై వీధుల్లో సీఎం, ఉపముఖ్యమంత్రి ఫొటోలు దిగుతూ బిజీగా ఉన్నారు. చెన్నైకి బయట ఘటనలను ట్రాక్ చేయడానికి డీఐపీఆర్.. డీఎంకే మీడియా విభాగంలా ప్రవర్తిస్తుంది. వాస్తవాల నుండి ప్రజలను మళ్లించడానికి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అవినీతితో కూరుకుపోయిన డీఎంకే ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. ప్రజల నిరసన తారాస్థాయికి చేరుకుంది. అందుకే ఇలాంటి దాడులు చేస్తున్నారు. ఇది కేవలం శాంపిల్ మాత్రమే అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
తమిళనాడులో విషాదం.. ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి!
చెన్నై: ఫెంగల్ తుపాన్ కారణంగా తమిళనాడులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కొండచరియలు విరిగి పడిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతిచెందారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.వివరాల ప్రకారం.. ఫెంగల్ తుపాన్ ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా పలు చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. కాగా, సోమవారం మధ్యాహ్నం తిరువణ్ణామలైలో దేవాలయం వద్ద ఉన్న నివాసంపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తులు మరణించారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రెస్య్కూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.TODAY, LANDSLIDE HITS #Tiruvannamalai, Tamil Nadu, India 🇮🇳 (Dec 02, 2024)Rescue operations are ongoing to locate 7 missing people trapped in a landslide, with thick rocks and debris hindering efforts.#TNRains | #cyclon pic.twitter.com/XehTWMa5df— Weather monitor (@Weathermonitors) December 2, 2024ఇదిలా ఉండగా.. వర్షాల కారణంగా ఇప్పటికే తమిళనాడులో కొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. ఆదివారం సాయంత్రం కొండచరియలు విరిగిపడటంతో అందులో కొందరు చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు.. తుపాన్ కారణంగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. పలు చోట్ల వరదల ధాటికి బస్సులు, కార్లు కొట్టుకుపోతున్నాయి. ఇప్పటికీ పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. 🌊🇮🇳MASSIVE FlOODS HITS KASARAGOD.(DECEMBER 02, 2024)Siriyā Highway inundated in Kasargod, as Cyclone Fengal brings heavy rains to Northern Kerala, India.#Keralarains | #CycloneFengal pic.twitter.com/FneXAdKvGq— Weather monitor (@Weathermonitors) December 2, 2024Current situation: Arasur Main Road, Chennai-Trichy National Highway, flooded. Traffic halted due to severe waterlogging.India 🇮🇳 #CycloneFengal #ChennaiRains pic.twitter.com/ReArSN5ZYh— Weather monitor (@Weathermonitors) December 2, 2024 -
Chennai: భారీ వర్షం, బలమైన గాలులు.. విమానం ల్యాండింగ్ వేళ తప్పిన ప్రమాదం!
చెన్నై: ఫెంగల్ తుపాను కారణంగా తమిళనాడు, ఏపీ, పుదుచ్చేరిలో భారీ వర్షాల కురుస్తున్నాయి. భారీ వర్షం, బలమైన గాలులతో తమిళనాడులో భయానక వాతావరణం నెలకొంది. చెన్నైలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు.ఇక, తమిళనాడులో భారీ వర్షాల కారణంగా చెన్నై ఎయిర్‌పోర్టును శనివారం నుంచి ఆదివారం తెల్లవారుజాము నాలుగు గంటల వరకు మూసివేశారు. అయితే శనివారం చెన్నైలో విమానం మూసివేతకు ముందు ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. వాతావరణం అనుకూలించని సమయంలో ముంబై-చెన్నై 6E 683 సర్వీస్ విమానాన్ని ల్యాండ్ చేసే ప్రయత్నం చేయగా తృటిలో ప్రమాదం తప్పింది.అయితే, ఇండిగో ఎయిర్ లైన్స్ చెందిన విమానం శనివారం చెన్నై ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించింది. ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ సమయంలో బలమైన గాలులు విస్తుండటంతో రన్‌వేపై విమానం అదుపు తప్పింది. రన్‌వేను నెమ్మదిగా ఢీకొట్టి బ్యాలెన్స్ తప్పింది. వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని టేకాఫ్ చేశాడు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం, విమానం.. ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయినట్టు సమాచారం. ఇక, దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.Indigo on the Viral video from Chennai Airport: Due to adverse weather conditions, including rain and strong, gusty winds, the cockpit crew of flight 6E 683, operating between Mumbai and Chennai, executed a go-around on November 30, 2024. In accordance with established safety… pic.twitter.com/hqzfR8N3UF— Pinky Rajpurohit 🇮🇳 (@Madrassan_Pinky) December 1, 2024 -
ఫెంగల్ టెన్షన్.. చెన్నై ఎయిర్‌పోర్టులోకి వరద నీరు
Cyclone Fengal Updates..👉 తీరం దాటుతున్న ‘ఫెంగల్’ తుపానుపుదుచ్చేరి సమీపంలో ‘ఫెంగల్’ తుపాను తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలిపిన ఐఎండీఈ ప్రక్రియకు దాదాపు నాలుగు గంటలు పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాఫెంగల్ తుపాను ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలుదక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, కొన్నిచోట్ల తీవ్ర భారీ వర్షాలు కురిసే అవకాశం👉మహాబలిపురం వద్ద ఫెంగల్ తుపాన్ తీరాన్ని తాకింది. 👉తుపాను ఎఫెక్ట్.. విమానాలు రద్దు..వాతావరణం సరిగా లేని కారణంగా విశాఖ నుంచి వెళ్లే పలు విమానాలు రద్దు చెన్నై-విశాఖ-చెన్నై, తిరుపతి-విశాఖ-తిరుపతి విమానాలు రద్దుహైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్లాల్సిన మూడు విమానాలు రద్దుహైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లాల్సిన ఏడు విమానాలు రద్దువిమానాల రద్దుతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రేపు ఉదయం 4 గంటల వరకు చెన్నై విమానాశ్రయం మూసివేత. 👉ఫెంగల్ తుపాను ప్రభావం తమిళనాడు, చెన్నై, పుదుచ్చేరి, ఏపీపై చూపిస్తోంది. తుపాన్ ప్రభావంతో ఇప్పటికే చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. #ChennaiAirport During #FengalCyclone#CycloneAlert#Chennaipic.twitter.com/EPLZlM5CYt— Musharraf Mughal. (@marcanthony99) November 30, 2024 👉మరోవైపు.. లోతట్టు పప్రాంతాలు జలమయమయ్యాయి. తాజాగా చెన్నై విమానాశ్రయంలోకి వరద నీరు వచ్చి చేరుకుంది. 📍 சென்ட்ரல் ரயில் நிலையம் எதிரில். ✍️ ஆபத்தான முறையில் கீழே விழ இருந்த அறிவிப்புப் பலகை உடனடியாக அகற்றப்பட்டது. #ChennaiRains #chennaipolice #cyclone #Fengal pic.twitter.com/b3et05ClSi— Greater Chennai Traffic Police (@ChennaiTraffic) November 30, 2024 👉రన్‌వే పైకి వరద నీరు చేరుకోవడంతో పలు విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు. అలాగే, కొన్ని సర్వీసులను దారి మళ్లించారు. 👉నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఫెంగల్ తుపాను భయపెడుతోంది. గంటకు 12 కిమీ వేగంతో తుపాను ప్రస్తుతం పుదుచ్చేరికి 150 కి.మీ దూరంలో , చెన్నైకి 140 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. శనివారం సాయంత్రానికి తుపానుగా తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. తుపాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.👉తుపాన్ నేపథ్యంలో తమిళనాడు, పుదుచ్చేరిలో గంటకు 70-80 కి.మీ వేగంలో గాలులు వీస్తున్నాయి. పలుచోట్ల ఇప్పటికే భారీ వర్షం కురుస్తోంది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు.. చెన్నై విమానాశ్రయాన్ని అధికారులు మూసివేశారు. చెన్నైకు రావాల్సిన విమానాలను దారి మళ్లించారు. బలమైన గాలులు, భారీ వర్షాల కారణంగా రైళ్ల రాకపోకలు సైతం ఆలస్యమవుతున్నాయి. పలు రైలు సర్వీసులను రద్దు చేసే అవకాశం ఉంది. Cyclone Fengal 🌀 effect on CHENNAI cityParts of the city have reported inundations due to spells of intense rainfall activityStay safe & indoors for the next crucial 36 hours#ChennaiRains #ChennaiRains2024 #ChennaiRain https://t.co/voiAq7RIiP pic.twitter.com/2GX6SbHD4K— Karnataka Weather (@Bnglrweatherman) November 30, 2024👉తమిళనాడులోని చెన్నై, తిరువళ్లూరు, చెంగల్పట్టు, కాంచీపురం, విలుపురం, కల్లకురుచ్చి, కుద్దలూరు, పుద్చుచ్చేరికి వాతావరణ శాఖ రెడ్ అల్టర్ విధించింది. ఈ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. పలు జిల్లాలో స్కూల్స్, కాలేజీలకు సెలవు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నాయి.சிக்கி தவிக்கும் தலைநகரம். #Fengal #FengalCyclone #Chennai #ChennaRains #DMKFails pic.twitter.com/OHBlmMmy8D— D.Jackson Jayaraj (@VirugaiJackson) November 30, 2024👉ఫెంగల్ ప్రభావం ఏపీపై కూడా కొనసాగనుంది. తుపాను ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని అధికారులు తెలిపారు. వాయుగుండం కారణంగా నెల్లూరు, చిత్తూరు , కడప జిల్లాల్లో ఫ్లాష్‌ఫ్లడ్‌కు అకాశముందని హెచ్చరికలు రావడంతో ఏపీ సర్కార్ అప్రమత్తమయ్యింది. పెంగల్ తుపాన్ ప్రభావంతో తిరుమలలో నిన్న రాత్రి నుంచి భారీ ఈదురుగాలులతో వర్షం పడుతుంది. నెల్లూరు జిల్లాలో కావలి, అల్లూరు, దరదర్తి, బోగోలు మండల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ஆட்டோ உள்ளே தண்ணீர்போகும் அளவுக்கு சூளைமேடு பகுதி #ChennaiRains @thatsTamil #Chennaiflood pic.twitter.com/6AohpLlbhb— Veerakumar (@Veeru_Journo) November 30, 2024 -
తమిళనాడు, కర్ణాటకలో జడివానకు ప్రజలు అతలాకుతలం (ఫొటోలు)
-
Chennai: చెన్నైలో భారీ వర్షం.. స్కూల్స్ బంద్!
చెన్నై: తమిళనాడులో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలో ఆదివారం నుంచి భారీ వర్షం కురుస్తూనే ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో నాలుగు జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ విధించింది. భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో స్కూల్స్, కాలేజీలకు సెలవు ప్రకటించారు. ఈరోజు(సోమవారం) తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. చెన్నైలోని అడయార్, అన్నాసాలై, వేప్పేరి, గిండి, కోయంబేడులో ఎడతెరిపిలేని వర్షం పడుతోంది. నాగపట్నం, కరైకల్, పుదుచ్చేరిలో భారీ వర్షం కురిసినట్టు వాతావరణ శాఖ పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. #chennairains heavy rain , heavy traffic, Monday morning, school Vera pic.twitter.com/FnVJ1nBd0C — Durai (@Durai1110) January 8, 2024 Tamil Nadu - Rainfall recorded during 07 January 2024/0830 IST - 08 January 2024/0530 IST @ndmaindia @moesgoi @DDNewslive @airnewsalerts pic.twitter.com/gHMn45MkuJ — India Meteorological Department (@Indiametdept) January 8, 2024 #Chennai #TamilNadu #ChennaiRains ECR ride now. Heavy rain , literally invisible roads. Drive safe guys. pic.twitter.com/SbzxT5j8hP — Rajeswari aravind (@rashmirajii) January 8, 2024 OMR opp to the marina mall is flooded. Drive carefully. #ChennaiRains #Chennai pic.twitter.com/JovIt5odcS — 🇮🇳 Vidyasagar Jagadeesan🇮🇳 (@jvidyasagar) January 7, 2024 Heavy rains in Chennai #ChennaiRainspic.twitter.com/3a1O1qsZhX — Media Myths (@Media_Myths) January 8, 2024 -
Chennai Cyclone Michaung Photos: చెన్నైలో జలప్రళయం (ఫొటోలు)
-
మిచౌంగ్ తుపాను : చెన్నైలో వర్ష బీభత్సం (ఫొటోలు)
-
మిచౌంగ్ తుపాన్ : కుండపోత వర్షాలతో తమిళనాడు అతలాకుతలం (ఫొటోలు)
-
కుండపోత వర్షాలు.. స్కూళ్లు బంద్
చెన్నై: తమిళనాడులోని చెన్నైతో సహా పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతున్నాయి. వరదనీటితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎక్కడ చూసిన వర్షపు నీరే దర్శనమిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా చెన్నైలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. భారీ వర్షాల నేపథ్యంలో చెన్నై, చెంగల్పట్టు, రాణిపేట్, కంచిపురం జిల్లాలలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు బుధవారం విద్యాశాఖ అధికారులు సెలవులు ప్రకటించారు. అదే విధంగా తిరువళ్లూర్‌లోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. చెన్నైతోపాటు పలు జిల్లాల్లో బుధవారం రాత్రి కూడా భారీ వర్షం నమోదైంది. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూర్‌లోని అనేక వీధులు దాదాపు మోకాళ్ల లోతు నీటితో నిండిపోయాయి. వర్షానికి సంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. డిసెంబర్ 2, 3 తేదీల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌లలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ మేరకు ఆ తమిళనాడులోని 25 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వాతావరణశాఖ జారీ చేసిన తుఫాను హెచ్చరికల నేపథ్యంతో అరక్కోణం పట్టణంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. Be alert and prepared! 🌧️ Tamil Nadu, Puducherry, and Karaikal are likely to get isolated heavy to very heavy rainfall (115.6 to 204.4 mm) between 2nd & 3rd December. Get ready and stay safe! pic.twitter.com/akUAcBKnsb — India Meteorological Department (@Indiametdept) November 29, 2023 వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో అనేక ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉందని, అత్యవసర సర్వీసుల సిబ్బంది హై అలర్ట్‌గా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని తప్పనిసరి అయితే తప్ప బయటకు రావొద్దని చెప్పారు. -
చెన్నైకి భారీ వర్షాల దెబ్బ(ఫొటోలు)
-
చెన్నైలో భారీ వర్షాలు.. హైదారాబాద్, కర్నూల్ సహా 8 విమానాలు రద్దు
చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడు రాజధాని చెన్నై సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెన్నై వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ క్రమంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవటంతో మదురై, హైదరాబాద్, కర్నూలు సహా వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన 8 విమానాలు రద్దయ్యాయి. మరోవైపు.. చెన్నై డొమెస్టిక్ టెర్మినల్ నుంచి వెళ్లాల్సిన పలు సర్వీసులు నిలిపివేశారు. చెన్నై నుంచి ఫ్రాంక్ఫర్ట్, శ్రీలంక, పారిస్, దోహా, షార్జా, దుబాయ్, అండమాన్లకు వెళ్లే విమానాలు కూడా ఒక గంట ఆలస్యంగా నడిచాయి. వర్షం కారణంగా విమాన సర్వీసులను రీషెడ్యూల్ చేయడంతో ఎలాంటి ప్రభావం లేదని అధికారులు తెలిపారు. ప్రయాణికులకు ఆలస్యంగా సమాచారం అందించామని వెల్లడించారు. ఇదీ చదవండి: తమిళనాడులో కుండపోత.. నిండుకుండలా చెన్నై.. సెలవు ప్రకటన.. హెచ్చరికలు -
పెళ్లి కోసం వధూవరుల సాహసం.. వరద నీటిలోనే..!
చెన్నై: తమిళనాడులో శుక్రవారం కురిసిన భారీ వర్షాల కారణంగా చెన్నై మహానగరం నీట మునిగింది. ఎటు చూసినా వరద నీరే కనిపించింది. దీంతో పలు వివాహాలు సైతం రద్దయ్యాయి. పులియంతోపులలోని ఆంజనేయుడి ఆలయంలో శుక్రవారం జరగాల్సిన ఐదు పెళ్లిళ్లు ఆలస్యమయ్యాయి. ఆంజనేయుడి సన్నిధి మొత్తం నీటితో నిండిపోయింది, పరిసరాల్లో సైతం ఎటు చూసిన వరద నీరే కనిపిస్తోంది. దీంతో ఆ వరద నీటిలోనే ఐదు జంటలు వివాహం చేసుకున్నాయి. కొన్ని నెలల క్రితమే ఖరారు చేసిన ముహూర్తం కావడంతో వరదతో ఇబ్బందులు ఉన్నప్పటికీ వివాహ తంతును పూర్తి చేశారు. పై నుంచి చినుకులు రాలుతుండగా.. వరద నీటిలో గొడుగు పట్టుకుని నూతన వధూవరులు ఆలయానికి వస్తున్న వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. వర్షంలోనూ ఎంతో సంతోషంగా ఆలయానికి చేరుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టాయి కొత్త జంటలు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వరదనీరు చేరకుండా తగు చర్యలు తీసుకోవాలని నూతన వధూవరులు కోరారు. చెన్నై సహా చుట్టు పక్కల జిల్లాల్లో శుక్రవారం మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి. పలు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు. చెన్నై, చెంగల్పెట్, కాంచీపురం, తిరువల్లూర్, విల్లుపురమ్ జిల్లాల్లో పాక్షికంగా మూతపడ్డాయి. #WATCH | Tamil Nadu: 5 weddings that were scheduled at Anjineyar temple in Pulianthope were delayed due to rainfall today. Couples lined up for wedding ceremonies were drenched as they walked through the water logged inside the temple. These weddings were scheduled months ago. pic.twitter.com/OA96wQEiz2 — ANI (@ANI) November 11, 2022 ఇదీ చదవండి: తమిళనాడులో కుండపోత.. నిండుకుండలా చెన్నై.. సెలవు ప్రకటన.. హెచ్చరికలు -
తమిళనాడులో కుండపోత వర్షం.. హెచ్చరికలు జారీ
సాక్షి, చెన్నై: కుండపోత వర్షాలతో తమిళనాడు ఆగం అవుతోంది. రాజధాని చెన్నైలో కొన్నిప్రాంతాల్లో, కంచీపురం, చెంగళ్పేట, తిరువల్లూరు, మయిలడుతురై, విల్లుపురం జిల్లాల్లో శుక్రవారం సాయంత్రం మొదలై.. ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చెన్నైలోని కొన్ని రోడ్లు.. చెరువుల్ని తలపిస్తున్నాయి. మరోవైపు పలు జిల్లాల్లో శనివారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. చెన్నైలో గత 24 గంటల్లో.. సగటున 64.5 మిల్లీమీటర్ల వర్ష పాతం నమోదు అయ్యింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తణ ద్రోణి ప్రభావం వల్ల.. మరో మూడు, నాలుగు రోజులపాటు వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో.. అధికారులు అప్రమత్తం అయ్యారు. అవసరమైతేనే బయటకు రావాలని హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే సహాయక శిబిరాల ఏర్పాటుతో పాటు రంగంలోకి దిగిన సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. #ChennaiCorporation #priyarajan #chennaimayor #VelacheryRain #chennairains Please help to clear rain water from my street - location Radhakrishnan street , Indra Gandhi Nagar Velachery (backside of Phoenix mall). Seems drainage is also blocked & water stagnated pic.twitter.com/NckIlJXE5v — Sai shankar (@Sai5590Sai) November 12, 2022 తమిళనాడుతో పాటు పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాలకు భారీ నుంచి అతిభారీ వర్షాల హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. మొత్తం 19 జిల్లాలకు అతిభారీ వర్షాల సూచన నెలకొంది. ఇదిలా ఉంటే.. చెన్నైలో పలు ప్రాంతాలు జలమయం అయినట్లు తెలుస్తోంది. వరద ముంపు ప్రాంతాల్లో సీఎం స్టాలిన్ పర్యటించనున్నట్లు సమాచారం. ఇంకోవైపు సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో.. తీర ప్రాంతాల్లోనూ ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇదీ చదవండి: రాజీవ్ హంతకుల విడుదల.. సుప్రీం సంచలన ఆదేశాలు -
Heavy Rains: భారీ వర్షాలకు అతలాకుతలం.. స్కూల్స్ బంద్
సాక్షి, చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తణ ద్రోణి ప్రభావం వల్ల.. తమిళనాడు భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. గురువారం కురిసిన వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, మరో నాలుగు రోజులపాటు వర్ష ప్రభావం ఉండడంతో అధికార యంత్రాగం అప్రమత్తం అయ్యింది. తమిళనాడుతో పాటు పుదుచ్చేరి పరిధిలో 14 జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఇక అర్ధరాత్రి భారీ వర్షంతో చెన్నై జలమయం అయ్యింది. రాజధాని చెన్నైలోని పలు కాలనీలు జలమయంకాగా, చాలా చోట్ల డ్రైనేజీ వ్యవస్థ ఘోరంగా దెబ్బతింది. రోడ్లపైకి నీరు వచ్చి చేరింది. ఉత్తర చెన్నైలోని పులియాంతోప్‌లో మోకాళ్ల లోతులో నీళ్లు చేరి.. పలు వాహనాలు నాశనం అయ్యాయి. స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక చెన్నైతో పాటు వెల్లూరు, తిరువళ్లూరు, కళ్లకురిచి, సేలం, రాణిపేట, తిరువణ్ణమలై జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. #ChennaiRains வடக்கு உஸ்மான் சாலை pic.twitter.com/bS8DUL6Sgz — GAVASKAR (@gavastk) November 11, 2022 శుక్రవారం ఈ జిల్లాలో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతవారణ కేంద్రం హెచ్చరించింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మొత్తం ఐదువేలకు పైగా సహాయక శిబిరాలు ఏర్పాటు చేయగా.. అందులో 169 శిబిరాలు చెన్నైలోనే ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు 2 వేల మందికి పైగా సిబ్బందిని మోహరించారు అధికారులు. #ChennaiRains pic.twitter.com/9mIQs9SVJ7 — vikash baranwal (@vikashbaranwa15) November 11, 2022 ఉన్నట్లుండి మారిన వాతావరణం గురువారం ఉదయాన్నే భానుడు కాసేపు కనిపించినా.. ఆ తర్వాత వాతావరణం పూర్తిగా మారింది. నగరం అంతా మేఘావృతమైంది. సాయంత్రం అక్కడక్కడ భారీ వర్షం పడింది. ఇవాళ శుక్రవారం మధ్యాహ్నం తర్వాత చెన్నైలో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. డెల్టా రీజియన్‌లోని చెన్నై, చెంగల్పట్టు, విల్లుపురం, కళ్లకురిచి, ఇతర జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురియవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాయుగుండం తీరాన్ని సమీపించే క్రమంలో శనివారం చెన్నైలో వరుణుడు బీభత్సం సృష్టించే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ ప్రభావంతో సముద్ర తీర జిల్లాలలో 4 రోజులు వర్షాలు కురవనున్నాయి. Heavy Rains in Chennai today !!! #rain #weather#ChennaiRains #TamilNadu #tamilnadurain pic.twitter.com/2ycPmvRlsr — SHIBA (@shibasahu2012) November 11, 2022 11 Nov. 10 am. Nehru Nagar, Korukkupet. A canal-side road is also a canal. Forgotten places. #ChennaiRains #NorthChennai #SocialJustice pic.twitter.com/jiOrvYofTt — NityanandJayaraman (@NityJayaraman) November 11, 2022 ఎలాంటి విపత్తులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండే విధంగా ఆయా జిల్లాల యంత్రాంగాలు ముందు జాగ్రత్తలను విస్తృతం చేశారు. ఇక సముద్రంలో సుడిగాలుల ప్రభావం అధికంగా ఉంటుందని, వేటకు దూరంగా ఉండాలని జాలర్లకు హెచ్చరికలు జారీ అయ్యాయి. వాయుగుండం హెచ్చరికలతో రాష్ట్రంలోని పలు సముద్ర తీర జిల్లాలలోని జాలర్లు తమ పడవలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పలవేర్కాడు తీరంలో ఒకటో నెంబరు తుపాన్ ప్రమాద హెచ్చరిక సూచికను ఎగుర వేశారు. ఇదీ చదవండి: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు -
జలదిగ్బంధంలో చెన్నై
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో తమిళనాడు తల్లిడిల్లిపోతోంది. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాలు నీటి ముంపునకు గురయ్యాయి. భారీ వర్షాలు మరో మూడు రోజులు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం ప్రకటించడంతో చెన్నై నగరంతోపాటు శివారు ప్రాంతాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటివరకు వర్షాలకు బలైన వారి సంఖ్య 11కు చేరింది. బంగాళాఖాతంలో తమిళనాడుకు సమీపంలోని మన్నార్‌వలైకుడా ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం వల్ల మూడురోజులుగా చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, నాగపట్నం, కడలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. రాబోయే మూడు రోజుల్లో ఈ నాలుగు జిల్లాలతోపాటు విల్లుపురం, తిరువారూరు, తంజావూరు, పుదుక్కోట్టై, కన్యాకుమారి, తూత్తుకూడి, రామనాథపురం జిల్లాల్లోనూ, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. నీటమునిగిన చెన్నై భారీ వర్షాలతో చెన్నై జలదిగ్బంధమైంది. వరద నీటితో అనేక ప్రాంతాలకు సంబంధాలు తెగిపోయాయి. అపార్ట్మెంట్లలో గ్రౌండ్ ఫ్లోర్లలోని నివాసాల్లోకి మోకాలి లోతులో నీరు చేరింది. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపేయడంతో ప్రజలు మరింత ఇబ్బంది పడ్డారు. 2015 డిసెంబర్లో చెన్నై మునకకు కారణమైన చెంబరబాక్కం చెరువు సహా ఇతర జలాశయాల్లోనూ, చెన్నైలో ప్రవహించే అడయార్ నదిలోనూ నీటి మట్టం భారీగా పెరిగింది. దీంతో ప్రజలు 2015 డిసెంబర్ నాటి భయంకరమైన రోజులను తలుచుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కొందరు ప్రజలు ఇళ్లల్లో చిక్కుకునిపోగా మరికొందరు ఇళ్లకు తాళాలు వేసి బంధువుల ఇళ్లకు వెళ్లి తలదాచుకుంటున్నారు. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా మంగళ, బుధవారాల్లో మొత్తం 11 మంది మృతిచెందారు. ఆర్ఆర్ నగర్లో విద్యుత్ బాక్స్ నుంచి వైరు తెగి వరద నీటిలో పడడంతో యువశ్రీ (9), భావన (7) అనే ఇద్దరు చిన్నారులు మరణించారు. భారీ వర్షాల కారణంగా బుధవారం కూడా విద్యా సంస్థలకు సెలవు ఇచ్చారు. -
బాలయ్య 'డిక్టేటర్' ఆలస్యం అవుతుందా..?
తమిళనాట సామాన్య ప్రజానీకంతో పాటు సినీ రంగాన్ని కూడా వరదలు ఇబ్బందులకు గురిచేశాయి. ముఖ్యంగా సినీరంగానికి సంబంధించిన ఎడిటింగ్, మిక్సింగ్, రీ రికార్డింగ్ స్టూడియోలు వరద నీటిలో మునిగిపోయాయి. దీంతో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉన్న సినిమాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఇబ్బందులు తెలుగు ఇండస్ట్రీకి కూడా తప్పటం లేదు. తెలుగు సినిమాలకు పనిచేసే చాలా మంది సాంకేతిక నిపుణులకు చెన్నైలో స్టూడియోలు ఉన్నాయి. ఇప్పుడు అదే సమస్యగా మారింది. నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ డిక్టేటర్. బాలయ్య 99వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న తమన్ స్టూడియో చెన్నై వరదల్లో పూర్తిగా దెబ్బతింది. దీంతో డిక్టేటర్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆగిపోయాయన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఇంజనీర్లు తమన్ స్టూడియోను బాగుచేసే పనిలో ఉన్నా ఆ పనులు పూర్తి కావటానికి ఎంత సమయం పడుతుంది అన్న విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. తమన్ స్టూడియో అందుబాటులోకి రాని పక్షంలో మణిశర్మ లేదా చిన్నాతో రీ రికార్డింగ్, డిటియస్ వర్క్స్ పూర్తి చేయించాలని భావిస్తున్నాడు దర్శకుడు శ్రీవాస్. వీటిలో ఏ నిర్ణయం తీసుకోవాలన్న మరికొంత సమయం పడుతుంది కాబట్టి అనుకున్నట్టుగా డిక్టేటర్ సంక్రాంతి రిలీజ్ చేయటం వీలౌతుందా..లేదా..? అనే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. -
పుట్టినరోజు వేడుకలొద్దు
తన పుట్టినరోజు వేడుకలు నిర్వహించొద్దని నటుడు రజనీకాంత్ తన అభిమానులకు విజ్ఞప్తి చేశారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ శనివారంతో 63వ ఏటకు వీడుకోలు చెప్పి 64వ సంవత్సరానికి స్వాగతం పలకనున్నారు. డిసెంబర్ 12 ఆయన పుట్టినరోజు. ప్రతి ఏడాది ఆ రోజున రజనీకాంత్ పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉంటున్నా ఆయన అభిమానులు మాత్రం పూజలు, కటౌట్లకు పాలాభిషేకాలు, అన్నదానాలు, వైద్యశిబిరాలు, రక్తదానాలు అంటూ హంగామా కార్యక్రమాల్లో నిమగ్నమవడం ఆనవాయితీగా వస్తోంది. అదే విధంగా ఈ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించడానికి రజనీకాంత్ అభిమానగణం తగిన సరంజామాతో సన్నద్ధం అవుతున్నారు. అయితే అలాంటి కార్యక్రమాలకు మన సూపర్‌స్టార్ బ్రేక్ వేశారు. కారణం అందరికీ తెలిసిందే. ఇటీవల వరదలు తమిళ ప్రజల జీవనాన్ని చిన్నాభిన్నం చేశాయి. వరదలతో తమిళనాడే జలమయమైంది. అన్నమో రామచంద్రా అంటూ ప్రజలు ఆపన్నహస్తం కోసం దీనంగా ఎదురు చూస్తున్నారు. వర్షాలు తగ్గినా జనం ఆకలి దప్పులతోనే గడుపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం తన అభిమానులకు అలాంటి వేడుకలు నిర్వహించొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నిజానికి ఈ పుట్టిన రోజున తన నూతన చిత్రం ఎందిరన్-2 చిత్ర పూజా కార్యక్రమాలను నిర్వహించాలని చిత్ర యూనిట్ నిర్ణయించారు. ఆ కార్యక్రమాన్ని కూడా ప్రస్తుతానికి వాయిదా వేసినట్లు తెలిసింది. ప్రస్తుతం రజనీకాంత్ కబాలి చిత్రంలో నటిస్తున్నారు. -
ఆలయాలను శుభ్రం చేస్తున్న ముస్లిం యువకులు
చెన్నై: ఆపద సమయంలో అందరూ ఒక్కటే. కులమతాలు రాజకీయ నాయకులకే తప్ప ప్రజలకు గుర్తురావనడానికి చెన్నై నగరాన్ని చుట్టుముట్టిన వరదల సందర్భంగా చోటు చేసుకున్న సంఘటనలే ప్రత్యక్ష ఉదాహరణ. వర్షం కాస్త తెరిపిచ్చి వరద మట్టాలు తగ్గుముఖం పట్టడంతో ముస్లిం యువకులు నగరంలోని మసీదులతో పాటు హిందూ దేవాలయాలను పరిశుభ్రం చేశారు. ఇంకా చేస్తున్నారు. మొన్న ఓ ముస్లిం యువకుడు నీటిలో చిక్కుకున్న హిందూ కుటుంబానికి చెందిన ఓ నిండు చూలాలును సకాలంలో ఆస్పత్రికి చేర్చడం, అక్కడ ఆమె బిడ్డను సుఖంగా ప్రసవించడం, అందుకు కృతజ్ఞతాపూర్వకంగా ఆ బిడ్డను యూనస్ అని ఆ ముస్లిం యువకుడి పేరును పెట్టుకోవడం తెల్సిందే. ఆపత్కాలంలో సోషల్ మీడియా కూడా అద్భుత పాత్రను నిర్వహించింది. బాధితుల సమాచారం ప్రభుత్వాధికారులకు చేరవేయడం, సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది అన్నార్తులకు ఆశ్రయం కల్పించడం, ఆపదులను ఆదుకోవడానికి స్వయంగా రంగంలోకి దిగడం తెల్సిందే. అలాగే మసీదులు, ఆలయాలు, చర్చిలు మతాలతో సంబంధం లేకుండా బాధితులందరికి ఆశ్రయం కల్పిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ముస్లిం యువకులు దేవాలయాలను శుభ్రం చేయడంపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రసార భారతి మంగళవారం చేసిన ‘ట్వీట్’ను సోషల్ మీడియా తీవ్రంగా విమర్శించింది. ‘గ్రేట్ ఎగ్జాంపుల్ ఆఫ్ హ్యుమానిటీ’ అని ట్వీట్ చేయాల్సిందిపోయి ‘రేర్ ఎగ్జాంపుల్ ఆఫ్ హ్యుమానిటీ’ అని ట్వీట్ చేయడంపై ట్విట్టర్లో విమర్శలు వచ్చాయి. ఇది అరుదైన విషయం కాదని, వైపరీత్యాలు సంభవించినప్పుడల్లా భారతీయులంతా ఒకరికొకరు అండగా నిలుస్తారని, ప్రజలను కులమతాల పేరిట విడదీసేది రాజకీయ నాయకులేనని పలువురు ట్వీట్లు చేశారు. ఇంతకన్నా మంచి ప్రేజ్ దొరకలేదా అంటూ కొందరు, ఇదేమి పైత్యమని మరికొందరు ప్రశ్నించారు. -
వందేళ్లలో ఇదే అతి భారీ వర్షం
వాషింగ్టన్: తమిళనాడు రాజధాని చెన్నైను ముంచెత్తిన భారీ వర్షాలను.. చెన్నైవాసులు గతంలో ఎప్పుడూ చూసిఉండకపోవచ్చు. గత వందేళ్లలో చెన్నైలో ఎప్పుడూ ఇంతటి భారీ వర్షాలు కురవలేదు. 1901 తర్వాత ఈ నెల 1-2 తేదీల మధ్య 24 గంటల్లో చెన్నైలో అతిభారీ వర్షం పడినట్టు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) తెలియజేసింది. అంటే గత 114 ఏళ్లలో చెన్నైలో ఇదే అతి భారీ వర్షం. ఈ నెల 1-2 తేదీల మధ్య ఆగ్నేయ భారత్‌లో కురిసిన వర్షపాతంపై మంగళవారం నాసా యానిమేషన్ మ్యాప్‌ను విడుదల చేసింది. ఉపగ్రహం సాయంతో చెన్నైలో వర్షపాతాన్ని అంచనా వేసింది. ఇటీవలి భారీ వర్షాలకు చెన్నైలో ఓ ప్రాంతంలో 50 సెంటీ మీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్టు నాసా వెల్లడించింది. రుతుపవనాల వల్ల ఈ సీజన్లో డిసెంబర్‌కు ముందే తమిళనాడులో సాధారణ శాతం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాల ప్రభావం వల్ల భారత్ తూర్పు కోస్తా ప్రాంతంలో ప్రతి ఏటా 50 నుంచి 60 శాతం వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది. చెన్నైలో ఇటీవల భారీ వర్షాలు, వరదల వల్ల దాదాపు 250 మంది మరణించిన సంగతి తెలిసిందే. రోడ్లు, రైల్వే ట్రాక్‌లు, అంతర్జాతీయ విమానాశ్రయం జలమయం కావడంతో బస్సులు, రైళ్లు, విమానాల రాకపోకలు ఆగిపోయాయి. ఆహారం, తాగునీరు, నిత్యావసర వస్తువులు దొరకక చెన్నై వాసులు అలమటించారు. మొబైల్, ఇంటర్నెట్ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. వర్షాలు తగ్గాక సహాయక చర్యలను వేగవంతం చేయడంతో చెన్నై వాసులు కోలుకుంటున్నారు. -
చెన్నైని కరుణించని వరుణుడు
చెన్నై : వరద బీభత్సం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న చెన్నైని వరుణుడు వదిలిపెట్టేలా కనిపించడం లేదు. బుధవారం తెల్లవారుజాము నుంచి చెన్నైలో మళ్లీ వర్షాలు పడుతున్నాయి. చాలా రోజుల తర్వాత సూర్యుడు కనిపించాడని సంబరపడిన ప్రజలకు ఆ సంతోషం కొన్ని గంటలు కూడా మిగలలేదు. ఆకాశం మళ్లీ మబ్బులు పట్టి వర్షాలు కురుస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో తేలికపాటి స్థాయి నుంచి ఓ మోస్తరు వరకు వర్షం పడింది. మరోవైపు దక్షిణ తమిళనాడులోని తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో ఎనిమిది జిల్లాల్లో కాలేజీలు, స్కూళ్లకు సెలవు ప్రకటించారు. కాగా దక్షిణ మధ్య రైల్వే కూడా చెన్నై నుంచి దూరప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లను రద్దు చేసింది. నవజీవన్ ఎక్స్‌ప్రెస్ సహా ఏడు రైళ్లను రద్దు చేసింది. కాగా చెన్నైలో భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. -
ఆ హిందూ దంపతుల కూతురి పేరు.. 'యూనుస్'
ఒకవైపు రాజకీయ నాయకులు, కొందరు సెక్యులరిస్టులు అసహనం అంటూ గగ్గోలు పెడుతుంటే.. సామాన్యులు మాత్రం అదేమీ తమకు అక్కర్లేదని, తాము పరమత సహనంతోనే ఉన్నామని చాటి చెబుతున్నారు. చెన్నైలో భారీ వర్షాలు, వరదలు వచ్చి జనం అల్లాడుతుంటే తన రెండు ఫ్లాట్లలో వచ్చి ఎవరైనా ఉండొచ్చని మహ్మద్ యూనుస్ అనే యువకుడు ఇంతకుముందు చెప్పాడు... గుర్తుంది కదూ. అలా అతడి అపార్టుమెంటులో తలదాచుకున్న వారిలో చిత్ర, మోహన్ అనే హిందూ దంపతులు కూడా ఉన్నారు. వీళ్లు నివాసం ఉంటున్న ఉరప్పక్కం అనే ప్రాంతానికి వెళ్లి.. రక్షించేందుకు పడవల వాళ్లు కూడా ఏమాత్రం ఆసక్తి చూపించలేదు. కానీ యూనుస్ ఎలాగోలా వాళ్లను బతిమాలి.. అక్కడకు వెళ్లి జనాన్ని రక్షించి తన అపార్టుమెంటుకు తీసుకొచ్చాడు. అప్పటికి చిత్ర నిండు గర్భిణి. అక్కడ కరెంటు లేదు, చాలామంది జనం చెట్లమీద వేలాడుతున్నారు. ఎలాగోలా పడవ తెచ్చి, ఆ గర్భిణిని, మరికొందరిని పడవ ఎక్కించాడు. నీళ్లలో పడవ వెళ్తూ.. కూలిపోయిన చెట్టును ఢీకొని తిరగబడినంత పనైంది. దాంతో ఆమె భయంతో విలవిల్లాడిపోయింది. తర్వాత చిత్రను ఓ ఆస్పత్రిలో చేర్చగా.. శనివారం నాడు పండంటి ఆడబిడ్డను కంది. తనతో పాటు తన బిడ్డ ప్రాణాలు కూడా కాపాడినది యూనుస్ కాబట్టి.. అతడి పేరే తమ బిడ్డకు పెట్టుకున్నారా హిందూ దంపతులు. ఈ విషయం గురించి యూనుస్‌కు వాట్సప్ ద్వారా ఓ సందేశం కూడా పంపారు. మీరు ఫ్రీగా ఉంటే ఒకసారి వచ్చి కలుస్తామని తెలిపారు. ఇకనుంచి తన జీతంలో సగం మొత్తాన్ని పేదలకు ఇస్తానని కూడా చెప్పారు. -
ఆ వాట్సప్ మెసేజి తప్పు.. నమ్మొద్దు
ఇటీవలే భారీ వర్షాలతో అల్లకల్లోలంగా మారిన చెన్నై నగరంలో రాబోయే మూడు నాలుగు రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు వస్తాయంటూ నాసా హెచ్చరించిందని వాట్సప్‌లో ఇటీవల ఓ సందేశం విపరీతంగా సర్క్యులేట్ అవుతోంది. హరికేన్ కారణంగా అత్యంత భారీ వర్షపాతం తప్పదని, అది కూడా భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ లేనంత ఎక్కువగా.. ఏకంగా 250 సెంటీమీటర్ల వర్షం పడుతుందని ఆ మెసేజిలో ఉంది. కానీ.. అదంతా తప్పు. దాన్ని ఎవరూ నమ్మొద్దన్నది తాజా కబురు. వాట్సప్‌లో ఎవరో ఒకరు మొదలుపెట్టిన ఈ మెసేజ్ దావానలంలా వ్యాపించి, చాలా గ్రూపులలో షేర్ అయ్యింది. దాంతో గత ఆదివారం వరకు సెలవులో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మళ్లీ సోమ, మంగళవారాల్లో కూడా సెలవులు పెట్టి ఆఫీసులకు వెళ్లకుండా ఊరుకున్నారు. చెన్నైలో ఉన్న తమ మిత్రులను పరిస్థితి ఎలా ఉంది, రావచ్చా అంటూ అడగడం కూడా కనిపిస్తోంది. తీరాచూస్తే ఇప్పుడు చెన్నై నగరంలో అసలు వర్షం అన్నదే పడటం లేదు. -
సెక్స్‌వర్కర్ల విరాళం.. లక్ష!
కడుపు నింపుకోడానికి పడుపు వృత్తి చేస్తున్నా.. తమకూ మనసుందని, అది కూడా స్పందిస్తుందని నిరూపించారు మహారాష్ట్రలోని సెక్స్‌వర్కర్లు. చెన్నై వరద బాధితులను ఆదుకోడానికి తమవంతు సాయంగా.. లక్ష రూపాయలు పంపారు. తాము రోజుకు ఒకపూటే తింటున్నా.. రూపాయి రూపాయి కూడబెట్టి మరీ ఈ సొమ్మును పంపారు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో స్నేహాలయ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన ఈ కార్యక్రమంలో లక్ష రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ అనిల్ కవాడేకు వాళ్లు అందించారు. చెన్నై వరద పరిస్థితి గురించి తెలిసినప్పటి నుంచి వీళ్లకు కంటిమీద కునుకు లేదని.. దాంతో ఎలాగోలా వాళ్లకు సాయం చేయాలని నిర్ణయించుకుని తమవంతుగా ఈ సొమ్ము సమకూర్చారని స్నేహాలయ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు గిరీష్ కులకర్ణి చెప్పారు. జిల్లాలో మొత్తం సుమారు 3 వేల మంది వరకు సెక్స్ వర్కర్లు ఉండగా, వాళ్లలో 2వేల మంది ఈ విరాళాలు ఇచ్చారు. -
ఆరు రోజులుగా... ఇంటికి దూరమైన హీరో
చెన్నై వరదల్లో తను తీవ్రంగా నష్టపోయినా.. సామాన్యులకు సాయం చేయడానికి ముందుకు వచ్చిన రియల్ హీరో సిద్దార్థ్, తొలిసారిగా వరదలపై మీడియాతో మాట్లాడాడు. ఇంతటి విషాదాన్ని మిగిల్చిన ఈ ప్రకృతి విపత్తుపై ప్రజలు స్పందించిన తీరు తనకు అద్భుతంగా అనిపించిందంటున్నాడు సిద్దార్థ్. ' జీవితంలో తొలిసారిగా నేను నా ఇంటిని కోల్పోయాను.. మూడు స్టూడియోలు, మూడు కార్లు ఈ వరదల్లో పాడైపోయాయి. నా పరిస్థితే ఇలా ఉంటే ఒక్క రోజులో సర్వం కోల్పోయిన సామాన్యుల పరిస్థితి ఏంటి..?' అని చెన్నై వరద పరిస్థితులపై స్పందించాడు. తన ఇంట్లో నీరు నిలిచిపోవటంతో గత ఆరు రోజులుగా తన ఇంటికి దూరంగా ఉంటున్నాడు సిద్దార్ధ్. అయితే ఇలాంటి పరిస్థితుల్లో బాధితులకు సాయం చేయడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు ముందుకు రావటం ఆనందం గా ఉందన్నాడు. ప్రస్థుతం బాధితులకన్నా సాయం చేసేవారు ఎక్కువగా ఉండటం చాలా ఆనందంగా ఉందన్నాడు. ముఖ్యంగా సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం మూలంగానే ఈ స్పందన సాధ్యమైందన్నాడు. ప్రస్తుతం చెన్నై పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉన్న మాట వాస్తవమే అయినా.. సోషల్ మీడియాలో మరింత భయానకంగా చూపిస్తారని, అలాంటి ప్రచారాలు మానుకోవాలని చెప్పాడు. ప్రభుత్వం పై వస్తున్న విమర్శలను కూడా సిద్దార్ధ్ ఖండించాడు. ఇంతటి భారీ విపత్తు సంభవించినప్పుడు ఏ ప్రభుత్వమైన అయిదు రోజుల్లో అంత సరిచేయలేదని అందుకు సమయం పడుతుందన్నాడు. ఇదే విషయం పై కమల్ హాసన్ చేసిన కామెంట్స్ పై స్పందించడానికి సిద్దార్ధ్ నిరాకరించాడు. -
కోటి విరాళం ఇచ్చిన సూపర్ స్టార్
బాలీవుడ్ సూపర్‌స్టార్, కోల్‌కతా నైట్‌రైడర్స్ సహ యజమాని షారుక్ ఖాన్.. చెన్నై వరద బాధితులను ఆదుకోడానికి కోటి రూపాయల విరాళం ప్రకటించాడు. ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించినట్లు తెలుస్తోంది. కాజోల్‌తో కలిసి 'దిల్వాలే' సినిమాలో మళ్లీ నటిస్తున్న షారుక్.. గతంలో దీపికా పదుకొనేతో కలిసి చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమాలోనూ నటించాడు. తాను తమిళనాడు బాధితులను ఆదుకునేందుకు కోటి రూపాయల విరాళం ఇస్తున్నట్లు సీఎం జయలలితకు ఓ లేఖ కూడా రాసినట్లు తెలుస్తోంది. తమిళనాడు వరదల్లో 280 మంది మరనించారు. నగరం మొత్తం అస్తవ్యస్తంగా మారింది. ఇప్పటికీ కోలుకోలేదు. దాంతో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులందరూ కూడా పెద్దమనసు చేసుకుని ముందుకొస్తున్నారు. -
పాడైపోయిన పాస్‌పోర్టులు మళ్లీ ఇస్తాం
చెన్నైలో భారీ వర్షాలు, వరదల కారణంగా ముఖ్యమైన పత్రాలను చాలామంది పోగొట్టుకున్నారు. వాటిలో పాస్‌పోర్టులు కూడా ఉన్నాయి. అలా పాస్‌పోర్టులు పాడైపోయిన వాళ్లకు ఉచితంగా మళ్లీ వాటిని జారీచేస్తామని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. వరదల్లో పాస్‌పోర్టులు పోయినా, పాడైనా చెన్నై నగరంలో ఉన్న మూడు పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో ఏదో ఒకదానికి వెళ్లాలని, అక్కడ ఉచితంగా కొత్త పాస్‌పోర్టు జారీ చేస్తారని ఆమె ట్వీట్ చేశారు. If your passport is lost or damaged in floods, pl go to any of three PSKs in Chennai. They will issue u fresh passport free of charge. Pl RT — Sushma Swaraj (@SushmaSwaraj) December 7, 2015 -
విమానంలో రెస్టు తీసుకున్న కింగ్ కోబ్రా!
భారీ వర్షాల కారణంగా చెన్నైలో మనుషులకే కాదు.. జంతువులకు కూడా రక్షణ లేకుండా పోయింది. ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండటంతో తలదాచుకోడానికి సురక్షిత ప్రాంతం వెతుక్కుంటూ వెళ్లిన ఓ కింగ్ కోబ్రా.. చివరకు ఎంచక్కా ఓ విమానం ఎక్కేసి అందులో నిద్దురపోయింది. నగరంలోని విమానాశ్రయం కూడా భారీ వర్షాలతో మూతపడిన విషయం తెలిసిందే. అక్కడ పార్క్ చేసిన ఓ విమానం చక్రం కంపార్టుమెంటు లోపల ఈ కింగ్ కోబ్రా విశ్రమించింది. చెన్నై విమానాశ్రయంలో సోమవారం నుంచి కార్యకలాపాలు తిరిగి ప్రారంభం అవ్వడంతో సిబ్బంది విమాన చక్రాలను శుభ్రం చేస్తుండగా ఈ కింగ్ కోబ్రా కనిపించింది. దాన్ని సురక్షితంగా బయటకు తీసి, విమానాశ్రయానికి దూరంగా ఉన్న ప్రాంతంలో వదిలిపెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. వర్షాల కారణంగా చెన్నై విమానాశ్రయం ఐదు రోజుల పాటు మూతపడింది. ప్రధాన రన్‌వేతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా నీళ్లు నిలిచిపోవడంతో అక్కడి నుంచి విమానాలను నడిపించలేకపోయారు. ఇప్పుడు కూడా కేవలం స్వదేశీ ప్రయాణాలకు సంబంధించిన విమానాలను మాత్రమే నడుపుతున్నారు తప్ప అంతర్జాతీయ విమానాలను టేకాఫ్ గానీ, ల్యాండింగ్ గానీ చేయడం లేదు. -
దుప్పట్లు, టవల్స్ కావాలి.. పంపండి: శ్రుతి
భారీవర్షాలు, వరదలతో అల్లకల్లోలంగా మారిన చెన్నైలో ఎప్పుడు ఏం కావాలో.. ఎవరెవరి నుంచి సాయం అందుతోందో అనే విషయాలను సెలబ్రిటీలు కూడా బాగా ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా హీరో సిద్దార్థ, హీరోయిన్ శ్రుతిహాసన్ వేర్వేరుగా తమ అభిమానులు, ఇతరుల ద్వారా సేవా కార్యక్రమాలను సమన్వయం చేస్తూ చెన్నై వాసులను ఆదుకోడానికి తమవంతు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం చెన్నైవాసుల్లో చాలా మందికి దుప్పట్లు, టవల్స్ అవసరమని, వాటితోపాటు పారిశుధ్యానికి సంబంధించిన ప్రాథమిక అవసరాలు కూడా ఉన్నాయని.. సాయం చేసేవాళ్లు ముందుకు రావాలని శ్రుతిహాసన్ ట్విట్టర్ ద్వారా అభిమానులను కోరింది. పంజాబీ- కెనడియన్ అమ్మాయి సుఖ్మన్ ఫంగురా, కమల్.. శ్రుతిలకు వీరాభిమాని అయిన శ్రీరామ్ తదితరులు సహాయ కార్యక్రమాల్లో చాలా చాలా సాయం చేస్తున్నారని, అందుకు వాళ్లకు బోలెడంత అభినందనలని చెప్పింది. వీళ్ల కృషితో చాలా మేలు జరిగిందని ప్రశంసించింది. Need of the hour- people need blankets and towels and basic hygiene amenities - please help !! #chennai #support — shruti haasan (@shrutihaasan) December 7, 2015 A big shout out to @SukhmanPhangura and @SriramShruti for helping so so much with the relief work !! You guys have made a big difference — shruti haasan (@shrutihaasan) December 7, 2015 -
నగరమా.. నరకమా?
నరకం అంటే ఇంతకంటే భయంకరంగా ఉంటుందా..? ఏమో.. ఆ నరకాన్ని తలపించే హృదయవిదారక దృశ్యాలు మాత్రం చెన్నైలో ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. ఎప్పుడో పూడ్చిన శవాలు వరద నీటికి ఉబ్బి, పైకిలేస్తున్నాయి. జనావాసాల్లోకి కొట్టుకొస్తున్నా యి. వాటిని చూసి పిల్లలు, మహిళలు భయంతో వణికిపోతున్నారు. ఇల్లునొదిలి ఎక్కడికైనా వెళ్దామంటే దొంగల బెడద.. అక్కడే ఉందామంటే మురుగునీరు, శవాల నుంచి వెలువడుతున్న దుర్వాసన. ఇలా బతకలేక, బయట పడలేక ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నారు . చెన్నై నుంచి నందగోపాల్, సాక్షి ప్రతినిధి: తమిళనాడుకు తలమానికంగా నిలిచిన చెన్నై నగరం వర్షాలు, వరదలతో చెదిరిపోయింది. తమిళులు ముద్దుగా పిలుచుకునే ‘సుందర చెన్నై’ అనే మాటకు అర్థమే లేకుండా తన రూపురేఖలను సమూలంగా కోల్పోయి హృదయవిదారకంగా మారింది. ఇది ఊహకందని ఉపద్రవం. మాటల్లో చెప్పలేని, రాతల్లో రాయలేని విషాదం. శనివారం నాటికి వర్షాలు తగ్గుముఖం పట్టినా జనవాసాల్లో నిలిచిపోయిన నీరు బయటకు వెళ్లే మార్గమే కనిపించడంలేదు. చెంబరబాక్కం చెరువు నుండి వెలువడిన నీటితో మునిగిన ప్రాంతాల పరిస్థితి ఇంకా అలాగే ఉంది. లక్షలాది మంది మూడురోజులుగా మిద్ద్దెలపైనే గడుపుతూ తిండి, నీళ్లు లేక అల్లాడుతున్నారు. ఇళ్లను వదిలిపోతే దొంగలు వచ్చి దోచుకెళతారని భయపడుతున్నారు. ఉన్నదంతా తుడిచిపెట్టుకుపోగా ఆకలి తీర్చుకునేందుకు ఒంటిపై ఉన్న నగలను కుదువపెడుతున్నారు. బంగారు నగ ఖరీదైనదైనా కుదువలో రూ.2వేలు, రూ.3వేలు మించి దక్కడం లేదు. నగరంలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఇంకా పునరుద్ధరించలేదు. చీకట్లో గడపలేక క్యాండిల్ కోసం వెళ్లితే చిన్నపాటి సైజు క్యాండిల్‌ను రూ.60లకు అమ్ముతున్నారు. సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన కుటుంబాలు మేమెక్కడికి వెళ్లాలి, ఎలా నివసించాలని వాపోతున్నారు. వారంరోజులుగా ఒకే వస్త్రంతో కాలం వెళ్లదీస్తున్నామని మహిళలు వాపోతున్నారు. తడిసిపోయిన పుస్తకాలను, సర్టిఫికెట్లు, యూనిఫారాలను విద్యార్థులు ఆరబెట్టుకుంటున్న దృశ్యాలు కన్నీరుపెట్టిస్తున్నాయి. నగరంలోని అనేక ప్రాంతాల్లో పర్యటించేందుకు వచ్చిన మంత్రులను ప్రజలు ఆగ్రహంతో తరుముకున్నారు. ఇప్పటివరకు వరదల్లో చిక్కుకొని మరణించినవారి సంఖ్య 350 చేరింది. శనివారం సైతం ఆవడి చెరువు నుండి ఒక యువతి మృతదేహం జనవాసాల్లోకి కొట్టుకు వచ్చింది. రక్షించేవారికి కోసం ఎదురుచూస్తూ మునిగిపోయిన ఇళ్లలోనే గడుపుతున్న ప్రజలు, ముఖ్యంగా చిన్నారులు రాత్రి వేళ్లలో కొట్టుకువస్తున్న మృతదేహాలను చూసి వణికిపోతున్నారు. కొట్టుకువచ్చిన అనేకశవాలు రోడ్లపైనే నానుతున్నాయి. ఒకవైపు కుళ్లిపోయిన శవాల నుండి వెలువడే దుర్వాసన, మరోవైపు వరద ప్రవాహంతోపాటూ ఇళ్లలోకి చేరిన చెత్తవల్ల దుర్గంధం మధ్య ప్రజలు గడుపుతున్నారు. -
ఏటీఎంలు, పెట్రోలు బంకులు కిటకిట
-
వర్షాల కారణంగా వాయిదా
గత 20 రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు సామాన్య ప్రజలతో పాటు సినీ రంగాన్ని కూడా తీవ్రంగా దెబ్బ తీశాయి. పొంగల్ రేసులో స్టార్ హీరోలు బరిలో ఉంటారని భావించి, ముందే రిలీజ్‌కు సిద్దమైన చిన్న సినిమాలు ఈ వర్షాలతో వాయిదా వేసుకోక తప్పలేదు. ఇప్పటికే వేదలం, తుంగావనం లాంటి సినిమాలు వర్షాల కారణంగా కలెక్షన్లు పొగొట్టుకోగా చాలా సినిమాలు వాయిదా పడ్డాయి. వరుస హిట్స్‌తో ఫాంలో ఉన్న శివకార్తీకేయన్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ రజనీమురగన్ ఈ శుక్రవారం విడుదల కావల్సి ఉండగా ఆ సినిమా వాయిదా పడింది. ఈ సినిమాతో పాటు అధర్వ, శ్రీదివ్య జంటగా తెరకెక్కిన ఏటి, నేషనల్ అవార్డ్ విన్నర్ బాబీ సింహా లీడ్ రోల్లో తెరకెక్కిన ఉరుమీన్, తిరుట్టు రైల్ లాంటి సినిమాల రిలీజ్‌లను వాయిదా వేశారు. -
ఏటీఎంలు, పెట్రోలు బంకులు కిటకిట
దాదాపు వారం రోజులకు పైగా విపరీతమైన వర్షాలు, వరదలతో అల్లాడుతున్న చెన్నైలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. నగరం పాక్షికంగా సాధారణ స్థితికి చేరువ అవుతోంది. రోడ్ల మీద నీళ్లు తగ్గుతుండటంతో.. ఏటీఎంలు, పెట్రోలు బంకుల వద్ద పొడవాటి క్యూలైన్లు కనిపిస్తున్నాయి. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి వరుసపెట్టి కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటివరకు సుమారు 245 మంది మరణించినట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. మంగళవారం నుంచి వరద ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. ప్రధానంగా రోడ్లు కొట్టుకుపోవడం, రైలు మార్గాలు పాడవ్వడం, విమానాశ్రయంలోకి కూడా నీళ్లు చేరుకోవడంతో ఆకాశ మార్గం కూడా మూసుకుపోయింది. కొట్టుపురం, ముడిచూర్, పల్లిక్కరనై లాంటి చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ నీళ్లు నిలిచే ఉన్నాయి. నిత్యావసర వస్తువుల కొరత పట్టి పీడిస్తోంది. అతి కొద్దిసంఖ్యలో మాత్రమే ఏటీఎంలు, పెట్రోలు బంకులు తెరవడంతో.. వాటివద్ద పొడవాటి క్యూలైన్లు కనపడుతున్నాయి. రెండు రోజుల్లో చాలావరకు పెట్రోలు బంకులు తెరుస్తారని, ప్రజలు ఆందోళన చెందవద్దని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఆదివారం అయినా బ్యాంకులు పనిచేస్తాయని చెప్పారు. ఎప్పుడూ బిజీగా ఉండే ఎగ్మూర్ - తాంబరం స్టేషన్ల మధ్య రైళ్లు నడిపిస్తామని దక్షిణ రైల్వే ప్రకటించింది. దాంతో స్థానికులకు చాలావరకు ఇబ్బందులు తొలగిపోతాయని భావిస్తున్నారు. తాంబరం సహా చాలా ప్రాంతాల్లో టెలిఫోన్ ల్యాండ్లైన్లను పునరుద్ధరిస్తున్నారు. మొబైల్ సేవలు కూడా క్రమంగా పుంజుకుంటున్నాయి. శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం కూడా కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. దాంతో సహాయ పనులకు ఆటంకం కలిగింది. కూరగాయలు, పాలు మాత్రం ఇంకా కొరతగానే ఉండటంతో వాటి ధర ఆకాశాన్ని అంటుతోంది. -
ఈ పాప తప్పిపోయింది.. సాయం చేయండి
తమిళనాడు వరదల నేపథ్యంలో కొందరు సినీతారలు బాధ్యత తలకెత్తుకుని సామాజిక స్పృహను అందరికీ గుర్తుచేస్తున్నారు. టాలీవుడ్, కోలీవుడ్‌లలో టాప్ హీరోయిన్గా ఉన్న శ్రుతిహాసన్ కూడా అదే కోవలో ఉంది. ఇంకా సీసాలో పాలుతాగే వయసున్న ఓ చిన్నారి తప్పిపోవడంతో.. ఆమె ఫొటో తీసి, తన ట్విట్టర్లో షేర్ చేసింది. ఈ చిన్నారి చెన్నై వరదల్లో తప్పిపోయిందని, ఆమె తల్లిదండ్రుల వద్దకు ఆమెను చేర్చడంలో సాయం చేయాలని కోరింది. తన ట్వీట్‌ను వీలైనంత ఎక్కువగా షేర్ చేయాలని, దాంతో అందరికీ విషయం తెలిసి, వాళ్ల తల్లిదండ్రులు కనపడే అవకాశం ఉంటుందన్నట్లుగా చెప్పింది. This little girl is lost in Chennai floods pls help her find her parents. Pls share as much as you can pic.twitter.com/XCAq3Qz3cW — shruti haasan (@shrutihaasan) December 4, 2015 -
కరెంటు లేదు.. అందుకే మావాళ్లు చనిపోయారు!
''కరెంటు పోయింది.. జనరేటర్ రూంలోకి నీళ్లు వరదలా వచ్చేశాయి.. దాంతో కరెంటూ లేదు, ఆక్సిజన్ సహా ఇతర లైఫ్ సపోర్ట్ సిస్టంలు కూడా పనిచేయలేదు.. అందుకే మావాళ్లు చనిపోయారు'' అని చెన్నై ఎంఐఓటీ ఆస్పత్రిలో మరణించినవాళ్ల బంధువులు వాపోతున్నారు. ఈ ఘటనపై ఎంఐఓటీ ప్రతినిధులు నోరు విప్పలేదు గానీ, దీనిపై విచారణ జరిపిస్తామని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జ్ఞానదేశికన్ హామీ ఇచ్చారు. ఎంఐఓటీ ఆస్పత్రి లోతట్టు ప్రాంతంలో ఉందని, అలాంటప్పుడు తగినంత విద్యుత్ సరఫరా, జనరేటర్లను సరైన స్థానంలో పెట్టుకోవడం లాంటి విషయాలు చూసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యం మీదే ఉంటుందని, అయితే ఆస్పత్రి యాజమాన్యం మాత్రం పూర్తిగా పేషెంట్లను గాలికి వదిలేసిందని, దీనిపై చట్టం తనపని తాను చేసుకుకపోతుందని చీఫ్ సెక్రటరీ చెప్పారు. ఆ ఆస్పత్రి ఐసీయూలో మొత్తం 75 మంది రోగులు ఉండగా, వాళ్లోల 57 మంది వెంటిలేటర్ మీద ఉన్నారని, వాళ్లందరినీ బయటకు పంపేశారని ఆరోగ్యశాఖ కార్యదర్శి జె.రాధాకృష్ణన్ తెలిపారు. మిగిలినవాళ్లు గత రెండు మూడు రోజులలో మరణించారని చెప్పారు. కేవలం విద్యుత్ లేకపోవడం వల్లే రోగులు మరణించారని మాత్రం అప్పుడే చెప్పలేమన్నారు. ఎంఐఓటీ ఆస్పత్రిలో మరణించినవాళ్లంతా పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నవాళ్లేనని ఆయన అన్నారు. అడయార్ ప్రాంతంలో నీటిమట్టం పెరుగుతోందని తెలిసినప్పుడే తాము తమవాళ్లను వేరే ఆస్పత్రికి తరలించాలని క ఓరినా.. ఎంఐఓటీ యాజమాన్యం మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోలేదని మృతుల బంధువులు ఆరోపించారు. ఆస్పత్రికి ఎలాంటి ఇబ్బంది లేదనే వాళ్లు చివరి వరకు చెప్పారని.. ఇప్పుడు తాను తన తండ్రిని కోల్పోయానని దేవీప్రసాద్ అనే యువకుడు వాపోయారు. -
సొంతూళ్లకు వెళ్లేందుకు ఉచిత బస్సులు
చెన్నై: భారీ వర్షాలతో అల్లాడుతున్న చెన్నై నగరంలో తమిళనాడు ప్రభుత్వం సహాయక చర్యలు వేగవంతం చేసింది. చెన్నై నుంచి సొంత ఊర్లకు వెళ్లేవారి కోసం ఉచిత బస్సు సదుపాయాన్ని కల్పించింది. అదేవిధంగా నగరంలో నాలుగురోజులపాటు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. మరోవైపు ఐటీ కంపెనీలు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఐటీ దిగ్గజం విప్రో చెన్నై నుంచి ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు వంద బస్సులను రంగంలోకి దింపింది. కోయంబెడు బస్టాప్ నుంచి ఉదయం 7 నుంచి 8.30 గంటల మధ్య వంద బస్సుల్లో ఉచితంగా ప్రజలను తరలించేందుకు విప్రో ఏర్పాట్లు చేసింది. మరోవైపు చెన్న విమానాశ్రయంలో పాక్షిక విమాన సేవలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతానికి టెక్నికల్ విమానాలు వెళ్లేందుకు వీలు కల్పించారు. పూర్తిస్థాయిలో వాణిజ్య విమానాలు నడిపేందుకు మరో రెండురోజుల సమయం పడుతుందని కేంద్రమంత్రి మహేశ్ శర్మ తెలిపారు. -
కిలో వంకాయలు 200.. టమోటా 120!
భారీ వర్షాలతో అస్తవ్యస్తంగా మారిన చెన్నై నగరంలో జనజీవనం దుర్భరంగా తయారైంది. వంకాయలు కిలో రూ. 200, టమోటా రూ. 120 పెట్టి కొనుక్కోవాల్సి వస్తోంది. ఏటీఎంలు కూడా పనిచేయకపోవడంతో చాలామందికి ఖాతాల్లో డబ్బులున్నా, చేతిలో చిల్లిగవ్వ లేక అల్లాడుతున్నారు. నిత్యావసరాల కొరత పట్టిపీడిస్తోంది. ఈరోజు కూడా వర్షాలు కురుస్తాయని చెప్పడంతో అంతటా ఆందోళన నెలకొంది. దాదాపు ఆరు రోజులుగా చెన్నైలో చాలా ప్రాంతాలు అంధకారంలోనే ఉన్నాయి. ప్రాంతాల వారీగా కరెంటును పునరుద్ధరిస్తామని అధికారులు చెబుతున్నా, ఇంకా నీరు నిల్వ ఉండటంతో ఎప్పటికి వస్తుందో చెప్పలేకపోతున్నారు. టెలికం వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. కొన్ని శివారు ప్రాంతాల్లో మాత్రమే ఫోన్లు పనిచేస్తున్నాయి. బీఎస్ఎన్ఎల్, ప్రైవేటు ఆపరేటర్ల ఫోన్లు ఏవీ పనిచేయడం లేదు. దాంతో తమవాళ్లు ఎలా ఉన్నారో, ఎక్కడున్నారో తెలియక సతమతం అవుతున్నారు రవాణా ఇంకా అనుమానమే తమిళనాడు నుంచి ఇతర ప్రాంతాలకు రవాణా వ్యవస్థ ఏ మార్గంలోనూ ఇంకా సరిగా లేదు. రోడ్డు, రైల్వే, విమాన ప్రయాణాలు ఏవీ ఇంకా మొదలు కావట్లేదు. శుక్రవారం నాడు మెరీనా బీచ్ నుంచి నాలుగు రైళ్లను హైదరాబాద్, బెంగళూరు లాంటి ప్రాంతాలకు నడిపించారు గానీ శనివారం మళ్లీ రైళ్లు ఆగిపోయాయి. కోయంబేడు బస్టాండు నుంచి కూడా పదుల సంఖ్యలో మాత్రమే బస్సులు వెళ్తున్నాయి. కోయంబేడు బ్రిడ్జి మీద నుంచి నీళ్లు ప్రవహిస్తుండటంతో రాకపోకలు సాధ్యపడటం లేదు. ఇక అరక్కోణం విమానాశ్రయం నుంచి చిన్నచిన్న విమానాలను నడిపించాలని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు భావించారు. ఈరోజు తనిఖీలు చేశాక తుది నిర్ణయం తీసుకుంటారు. తాంబరం ఎయిర్‌పోర్టు నుంచి అరక్కోణం తీసుకెళ్లి, అక్కడ నుంచి విమానాలు నడిపించాలని చూస్తున్నారు. అన్నీ సర్వనాశనం: స్థానికులు నాలుగు రోజుల నుంచి కరెంటు లేదని, తొలుత పీకలోతు వరకు ఉండే నీళ్లు ఇప్పుడు కొంచెం తగ్గాయని, అయితే ఒక్కళ్లు కూడా తమను చూసేందుకు రాలేదని స్థానికులు వాపోయారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న సామాన్లు అన్నీ పాడైపోయాయని, వాహనాలు సర్వనాశనం అయ్యాయని చెప్పారు. రెండు కిలోమీటర్ల దూరం వెళ్లి లీటరు పాలు రూ. 150 పెట్టి కొనుక్కురావాల్సి వస్తోందని తెలిపారు. ఎవరికైనా ఏమైనా చెబుదామంటే ఫోన్లు పనిచేయడం లేదని అన్నారు. అంబులెన్సును పిలవాలన్నా వీలుపడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
‘చెన్నై శివగామి’లా సీఎం..!
* భారీ వరద నీటి మధ్య చిన్నారిని ఎత్తుకుని.. * విమర్శలకు తావిస్తున్న హోర్డింగ్ సాక్షి, చెన్నై : బాహుబలి సినిమా సినిమా (తమిళ వెర్షన్లో మహాబలి) గుర్తుందా!? ఆ చిత్రంలోని కీలకమైన పాత్రల్లో రమ్యకృష్ణ పోషించిన శివగామి పాత్ర ఒకటి. నదిలో తాను పూర్తిగా మునిగిపోయినా పసికందుగా ఉన్న బాహుబలిని ఒంటి చేత్తో నీళ్లలోంచి పెకైత్తి పట్టుకుని నదిని దాటుతున్న సన్నివేశం సినిమాను మలుపు తిప్పే సన్నివేశాల్లో ఎంతో కీలకమైనదే. సినిమా విడుదలకు ముందు ఈ సన్నివేశంతో వచ్చిన ట్రైలర్ ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడమే కాకుండా సినిమాపై అంచనాలనూ పెంచింది. విడుదల తర్వాత ఎంతగా బాక్సాఫీసును షేక్ చేసి, రికార్డులు కొల్లగొట్టిందో ఇక చెప్పనవసరం లేదు. ఈ సన్నివేశం గురించి ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ముఖ్యమంత్రి జయలలిత అదే సన్నివేశంలో ఉంటే ఎలా ఉంటుందో ఓసారి ఊహించండి. ఆ సన్నివేశాన్ని ప్రతిబింబించేలా అన్నాడీఎంకే నాయకులు, కార్యకర్తలు పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ అధినేత్రిని ఏకంగా ‘చెన్నై శివగామి’ని చేశారు.! భారీ వరద నీటి మధ్య జయలలిత తన చేతుల్లో చిన్నారిని ఎత్తుకున్నట్లు చూపుతూ చెన్నై వీధుల్లో పెద్ద హోర్డింగ్ ఏర్పాటు చేశారు. ఇది వివాదాస్పదమైంది. ఓ వైపు చెన్నై నగరం వరద నీటిలో మునిగిపోతుంటే.. ‘చెన్నైని కాపాడే అమ్మ’ అంటూ బాహుబలి చిత్రంలో శివగామి పాత్రలా హోర్డింగ్ ఉండటం విమర్శలకు తావిస్తోంది. ఓ వైపు వరదల్లో ప్రజలు నానా కష్టాలు పడుతుంటే, వారిని పట్టించుకోకుండా ప్రచారం కోసం ఇలాంటి చర్యలు అవసరమా? అని విపక్షాలు మండిపడుతున్నాయి. -
72 ఏళ్ల వయసులో.. పడవలో వెళ్లి సాయం చేశారు
జనజీవనాన్ని అతలాకుతలం చేసిన చెన్నై వరదల పై సామన్యులతో పాటు ప్రముఖులు కూడా బాగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా సినీ రంగానికి చెందిన చాలామంది ఇప్పటికే తమవంతుగా విరాళాలు ప్రకటించగా, మరికొందరు ప్రత్యక్షంగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అదే బాటలో ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా కూడా స్వయంగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సాయం చేయడానికి ఎంత డబ్బయినా ఇచ్చే స్థోమత ఉన్నా, అక్కడి పరిస్థితి స్వయంగా తెలుసుకోవాలని భావించిన ఇళయరాజా, 72 ఏళ్ల వయసులో కూడా పడవలో ప్రయాణిస్తూ లిటిల్ ఫ్లవర్ అంధుల పాఠశాలకు వెళ్లి అక్కడి విద్యార్థులకు ఆహార పొట్లాలను అందించారు. కాసేపు వారితోనే గడిపిన రాజా వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. -
అమ్మా, ది గ్రేట్ బాహుబలి
చెన్నై: కుండపోత వర్షాలకు చెన్నై నగరమంతా కకావికలమై ప్రజలు అహోరాత్రులు కూడు, గూడు లేకుండా అల్లాడిపోతుంటే కార్యరంగంలోకి దూకి సహాయక చర్యల్లో తలమునకలు కావాల్సిన అధికార ఏఐడీఎంకేకు చెందిన ఎమ్మెల్యేలు కొందరు అమ్మ జపంలో తరించిపోతున్నారు. నీట మునిగి పోతున్న ప్రజలను అమ్మ మాత్రమే కాపాడుతోందన్న అర్థంలో పోస్టర్లు వేసి గురుభక్తిని చాటుకుంటున్నారు. తిరునల్వేలి ఎమ్మెల్యే ముత్తుకరప్పన్ ఒక్క అడుగు ముందుకేసి అమ్మను బాహుబలిలాగా ఫొటోషాపులో చిత్రీకరించి ఆ ఫొటోలను పెద్దపెద్ద బిల్ బోర్డులపై ఏర్పాటు చేసి అమ్మా ది గ్రేట్ అంటున్నారు. భారీ వర్షంలో వరద నీటిలో కొట్టుకుపోకుండా ఒంటిచేత్తో చంటిపాపను ఒడ్డుకు చేరుస్తున్న బాహుబలిలాగా ఆ పోస్టర్లో అమ్మను చిత్రీకరించారు. అమ్మ మాత్రమే ఇలాంటి సాహసం చేస్తోందన్న భావంతో కామెంట్ కూడా రాశారు. జయలలిత పట్ల తమకున్న వీరాభిమానాన్ని చాటుకోవడం తమిళనాట కొత్తేమి కాదు. అమ్మ కోసం శరీరాలను చేతులారా తగులబెట్టుకున్న వాళ్లు, శిలువకు శరీరాలను దిగేసికున్న వారూ లేకపోలేదు. ఇప్పుడు అసందర్భంగా అమ్మను బాహుబలిలా చిత్రీకరించడం పట్ల సోషల్ మీడియా మండిపడుతోంది. వరదల్లో చిక్కుకున్న చెన్నై మహానగరాన్ని ప్రత్యక్షంగా వీక్షంచడానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెలికాప్టర్ నుంచి పరిస్థితిని పరిశీలిస్తున్న దృశ్యాన్ని కూడా ఫొటోషాపులో మార్ఫింగ్చేసి సాక్షాత్తు పీఐబీ విడుదల చేయడం ఇప్పటికే వివాదమైన విషయం తెల్సిందే. గతంలో జయలలిత హెలికాప్టర్లో వరద పరిస్థితిని వీక్షించినప్పుడు కూడా ఇలాంటి మార్ఫింగే చేశారు. -
ఆక్సిజన్ అందక 18 మంది మృతి
చెన్నై: భారీ వర్షాలు చెన్నైలో 18 మంది రోగుల ప్రాణాలు బలిగొన్నాయి. కరెంట్ లేకపోవడంతో ఐసీయూలో ఆక్సిజన్ అందక రోగులు మృతి చెందారు. మద్రాస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆర్ధోపెడిక్స్ అండ్ ట్రామటాలజీ(ఎంఐటీ) ఆస్పత్రిలో విషాదం చోటుచేసుకుంది. భారీవర్షాలు, వరదలు కారణంగా ఆస్పత్రిలో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. గంటల తరబడి విద్యుత్ లేకపోవడంతో వెంటిలేటర్లు పనిచేయకపోవడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న 75 మందిలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. కరెంట్ లేకపోవడం, ఆక్సిజన్ సిలెండర్లు అయిపోవడంతో రోగులు మృతి చెందినట్టు తెలుస్తోంది. 18 మంది రోగులు మృతి చెందినట్టు తమిళనాడు ఆరోగ్యశాఖ కార్యదర్శి రాధాకృష్ణన్ ధ్రువీకరించారు. ఎంఐటీ ఆస్పత్రిలో 570 మందికి చికిత్స అందిస్తున్నారని తెలిపారు. ఇక్కడి నుంచి 57 మందిని వివిధ ఆస్పత్రులకు తలించినట్టు చెప్పారు. ఆరోగ్యశాఖ మంత్రితో కలిసి ఆయన ఎంఐటీ ఆస్పత్రిని సందర్శించారు. రోగుల మరణానికి కారణాలు తెలియరాలేదని, దర్యాప్తుకు ఆదేశించామని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. -
ఆక్సిజన్ అందక 18 మంది మృతి
-
ప్రధాని ఫొటోతోనూ ఆటలా?
న్యూఢిల్లీ: సాక్షాత్తు ప్రధానమంత్రి పాల్గొన్న కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను కూడా తప్పుగా అందిస్తారా? అది కూడా.. ప్రభుత్వరంగ సమాచార సంస్థల నుంచి వచ్చే ఫొటోలు తప్పువి ఉంటాయని ఎవరైనా ఊహించగలరా? కానీ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) సరిగ్గా ఇలాగే చేసింది. చెన్నైలో భారీ వర్షాలు, వరదలు రావడంతో అక్కడ పర్యటించిన ప్రధానమంత్రి.. నగరంలో ఏరియల్ సర్వే నిర్వహించారు. హెలికాప్టర్లో తిరుగుతూ నగరంలో పరిస్థితి మొత్తాన్ని చూశారు. అయితే, ఈ సందర్భంగా పీఐబీ అధికారికంగా విడుదల చేసిన ఫొటోలు వివాదానికి కారణం అయ్యాయి. సాధారణంగా ఏరియల్ వ్యూలో చూసినప్పుడు కింద అంతా సువిశాలంగా కనిపిస్తుంది తప్ప.. ఇళ్లు, అపార్టుమెంట్లు స్పష్టంగా కనిపించవు. ప్రధాని అలా చూస్తున్నప్పుడు కిటికీ లోంచి కనపడే సాధారణ దృశ్యం స్థానంలో బాగా క్లోజప్‌లో తీసిన ఒక ఫొటోను ఫొటోషాప్‌లో అతికించి ఆ ఫొటోను ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. అయితే.. ఈ విషయాన్ని ట్విట్టర్ యూజర్లు వెంటనే కనిపెట్టేశారు. అసలు ఫొటోకు, ఫొటోషాప్‌లో మార్చిన దానికి తేడా ఆ మాత్రం తెలియదనుకుంటున్నారా అంటూ ఒక్కసారిగా కామెంట్లు, మిగిలిన సరదా ఫొటోలతో విరుచుకుపడ్డారు. దాంతో నాలుక కరుచుకున్న పీఐబీ.. వెంటనే తన తప్పును సరిచేసుకుని, అసలు ఫొటోను మళ్లీ ట్వీట్ చేసింది. -
వందల కోట్లుండి.. లక్షలు బిచ్చమేస్తారా?
చెన్నై వర్షాల మీద రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించాడు. ఎప్పటిలాగే దేవుడి మీద, సినిమా నటుల మీద తీవ్రస్థాయిలో సెటైర్లు వేశాడు. వందల కోట్లు ఉన్న సూపర్స్టార్లు కేవలం లక్షల్లో మాత్రమే విరాళాలు ప్రకటించడం, బాగా పెద్దనటులు కొంతమంది అసలు స్పందించకపోవడం, ఇంకొందరు కేవలం ప్రార్థనలతో సరిపెట్టేయడం.. అన్నింటినీ విమర్శించాడు. వర్మ ఏమన్నాడో ఆయన మాటల్లోనే... ''వర్షాలు కురిసేది దేవుడివల్లే కాబట్టి.. ప్రతిఒక్కరూ ప్రార్థించడానికి బదులు దేవుడిని విమర్శించాలి. లేకపోతే చెన్నైవాసులందరూ పాపులని, అందుకే దేవుడు శిక్షించాడని చెప్పాలి. చెన్నై వాసులను చూసి చాలా బాధపడుతున్నాను, సోకాల్డ్ దేవుడి మీద, ఆయన సాగించిన ఉగ్రవాద విధ్వంసం మీద పిచ్చ కోపంగా ఉన్నాను. సెలబ్రిటీలందరూ ప్రార్థించడానికి బదులు దేవుడి చర్యను ఖండించాలి. ఇకనైనా ప్రజలు వెన్నుపోటుదారుడైన దేవుడిని నమ్మి సమయం వృథా చేసుకోడానికి బదులు తమ మీద తాము నమ్మకం పెట్టుకోవాలి. చెన్నైలో దేవుడు సృష్టించిన విధ్వంసం ముందు ప్రపంచంలో ఏ ఉగ్రవాద చర్య అయినా బలాదూరే. చెన్నై వాసుల కష్టాలు చూసి నా గుండె చెదిరిపోతోంది. అందుకే నేను రాయడానికి వీల్లేనంత దారుణమైన భాషలో దేవుడిని తిడుతున్నాను. చెన్నై కష్టాల నేపథ్యంలో దేవుడిని ప్రార్థించిన సెలబ్రిటీలందరినీ కూడా నేను ఖండిస్తున్నాను. ఇది ఉగ్రవాదిని ప్రార్థించడం లాంటిదే అవుతుంది. చెన్నైవాసులు ఇప్పటికైనా తమ దేవుడిని మార్చుకోవాలి. వందల వందల కోట్లున్న సూపర్ స్టార్లు.. వేలవేల కోట్లు నస్టపోయిన చెన్నై వాసులకు ఐదు, పది లక్షలు బిచ్చమేయడం ఏంటి? అయ్యబాబోయ్.. సూపర్ స్టార్లు 10 లక్షలు, 5 లక్షలు ఇస్తే అంత డబ్బు ఏం చేసుకోవాలో తెలియక చెన్నై ప్రజలు మూర్ఛపోతారు. దానికంటే ఇవ్వకపోవడం బెటర్. నా విషయానికొస్తే, నేనెప్పుడూ ఒక్క రూపాయి కూడా దానం చేయలేదు. నేను చాలా స్వార్థపరుడిని. సెలబ్రిటీలలా క్వింటాళ్ల కొద్దీ ప్రార్థనలు, టన్నులకొద్దీ ప్రేమ కురిపించలేను. ఆ సెలబ్రిటీలు కూడా ఇవన్నీ ఇస్తారు గానీ, రూపాయల దగ్గరకొచ్చేసరికి మాత్రం చాలా తక్కువ ఇస్తారు. ఎందుకంటే ప్రార్థనలు, ప్రేమ అంటే చవగ్గా వస్తాయి గానీ డబ్బులు కాదుకదా!'' కొసమెరుపు: అవును, అసలు ఈ వర్షాలను ఆపడానికి రజనీకాంత్ ఎందుకు ఏమీ చేయలేదోనని నేను ఆశ్చర్యపోతున్నాను. Since rain is act of God instead of praying shouldn't every1 b condemning God,unless they blve all Chennaities r sinners n God is punishing — Ram Gopal Varma (@RGVzoomin) December 3, 2015 I feel so sad for the Chennaities and I feel so fucking angry about the so called God and his this dastardly terrorist act — Ram Gopal Varma (@RGVzoomin) December 3, 2015 All the celebs instead of praying should condemn God unless they believe that Chennaities are sinners — Ram Gopal Varma (@RGVzoomin) December 3, 2015 Chennai situation is proof enough that people should start believing in themselves instead of wasting their time on the betrayer God — Ram Gopal Varma (@RGVzoomin) December 3, 2015 No act of any Terrorist in the world can create more tragedy than what the Act of God created in Chennai — Ram Gopal Varma (@RGVzoomin) December 3, 2015 My heart goes out to the sufferings of Chennaities and I condemn God in the most harshest unprintable language for this dastardly act — Ram Gopal Varma (@RGVzoomin) December 3, 2015 I condemn all celebs who pray to God in context of Chennai sufferings because it amounts to praying to a Terrorist for his dastardly act — Ram Gopal Varma (@RGVzoomin) December 3, 2015 Like one votes out a government for a dastardly act Chennaites should change their God hereafter — Ram Gopal Varma (@RGVzoomin) December 3, 2015 Vandala vandala kotlunna super starlu vela vela kotlu nashtaoyina chennailaki aidhu Padhi lakshalu bichchameyyadam? — Ram Gopal Varma (@RGVzoomin) December 3, 2015 Ayyababooi super starlu 10 lakshalu 5 lakshslu isthe antha dabbu yem chesulovalo theliyaka chennaiprajalu moorchapotharu.ivvakapovadam btr — Ram Gopal Varma (@RGVzoomin) December 3, 2015 As per me I never donated one rupee and am supremely selfish unlike celebs who give quintals of prayers and tonnes of love — Ram Gopal Varma (@RGVzoomin) December 3, 2015 Celebs give quintals of prayers and tonnes of love,but very very few rupees because prayers and love are cheap and money costs money — Ram Gopal Varma (@RGVzoomin) December 3, 2015 I wonder why Rajnikant dint do anything to stop the rain? — Ram Gopal Varma (@RGVzoomin) December 3, 2015 -
చెన్నై - నెల్లూరు.. ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రయాణం
''ఎప్పుడో మంగళవారం మధ్యాహ్నం తిన్న భోజనం.. ఆ తర్వాత తిండి అన్నదే లేదు. రోజు మొత్తం కరెంటు ఉండేది కాదు.. రాత్రిపూట రెండు గంటలు ఇవ్వడంతో కష్టమ్మీద సెల్ఫోన్లు చార్జింగ్ పెట్టుకున్నాం. కానీ మాట్లాడాలన్నా, వాట్సప్.. ఫేస్బుక్లో షేర్ చేద్దామన్నా సిగ్నళ్లు లేవు. నానా తిప్పలు పడి గురువారం రాత్రి 9.30కి నెల్లూరు చేరుకున్న తర్వాత మళ్లీ తిండి మొహం చూడగలిగాం'' .... ఇదీ చెన్నైలో యాక్సెంచర్ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న కార్తీక్, క్యాప్ జెమినిలో పనిచేస్తున్న వాళ్ల బంధువు చైతన్యల ప్రత్యక్ష అనుభవం. నెల్లూరుకు చెందిన వీరిద్దరూ బంధువులే కావడంతో కారపాక్కం అనే ప్రాంతంలో ఒక రూం అద్దెకు తీసుకుని అక్కడ ఉంటున్నారు. చెన్నై నగరంలో కురిసిన భారీ వర్షాలు, వరదలు వాళ్ల పరిస్థితిని నరకప్రాయం చేశాయి. ఈ విషయాలను వాళ్లు 'సాక్షి వెబ్సైట్'తో ప్రత్యేకంగా పంచుకున్నారు. వాళ్లు చెప్పిన విషయాలు వాళ్ల మాటల్లోనే... ''మంగళవారం ఉదయం నుంచే కరెంటు లేదు. రాత్రి ఒక రెండు గంటలు ఇచ్చాడు. ఇప్పటికీ మా స్నేహితులు వేల్చారి ప్రాంతంలో ఇరుక్కుపోయి ఉన్నారు. చుట్టూ నడుం లోతు నీళ్లు. రెస్క్యూ బోట్లు కూడా ఒకటీ అరా మాత్రమే తిరుగుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం తర్వాత తిండి మొహం చూడలేదు. ఇక గురువారం మధ్యాహ్నానికి ఎలాగైనా నెల్లూరు బయల్దేరి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాం. తీరా చూస్తే జేబులో డబ్బులు కొంచెమే ఉన్నాయి. మామూలుగా అయితే వెళ్లచ్చు గానీ, ఆటోలు, బస్సుల టికెట్లు ఎక్కువగా ఉంటే ఎలాగో అర్థం కాలేదు. బయట ఏటీఎం సెంటర్లు ఏవీ పనిచేయడం లేదు. కరెంటు లేదు కదా.. అన్నీ అవుటాఫ్ ఆర్డర్. అకౌంట్లలో జీతం పడినా, అందులోంచి రూపాయి కూడా తీసుకునేందుకు వీలు పడలేదు. అయినా తప్పదు. మేం చెన్నై సెంట్రల్ స్టేషన్‌కు గానీ, కోయంబేడు బస్టాండుకు గానీ వెళ్లాలి. కారపాక్కం నుంచి బస్సులు ఆటోలు ఏవీ నడవడం లేదు. దాంతో ఓ లారీ దొరికితే దాని వెనకాల ఎక్కి, తిరువనమ్మియార్ వరకు వెళ్లాం. అక్కడ టికెట్ కౌంటర్ దగ్గర లైన్లో దాదాపు 300 మందికి పైనే ఉన్నారు. చెన్నై నుంచి చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇలా బయల్దేరుతున్నారు.. ఎంక్వైరీలో అడిగితే చెన్నై సెంట్రల్ నుంచి రైళ్లేవీ లేవని చెప్పారు. ఇక బస్సు ఎక్కి వెళ్లడం తప్ప వేరే మార్గం లేదు. సో ఆ స్టేషన్ బయట షేర్ ఆటో ఎక్కి గిండి చేరుకున్నాం. అక్కడి నుంచి కోయంబేడుకు బస్సులు ఏవీ లేకపోవడంతో పక్కనే ఉన్న అల్లుందూర్కి నడిచి వెళ్లి మెట్రో ఎక్కాం. అందులో జనం రద్దీ అంతా ఇంతా కాదు.. ఒకటే తొక్కేసుకుంటున్నారు. ఎలాగో కోయంబేడులో దిగాం. అక్కడ జనాల రద్దీ బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమల క్యూలైనును గుర్తు చేసింది. ఆ జనాల్ని తోసుకుంటూ ఏపీఎస్ ఆర్టీసీ వాళ్లు ఏర్పాటుచేసిన స్పెషల్ పల్లెవెలుగు బస్సు ఎక్కి నెల్లూరు చేరుకున్నాం. సాధారణంగా చెన్నై నుంచి నెల్లూరుకు 3-4 గంటల ప్రయాణం కానీ, మేం వచ్చింది మాత్రం రాత్రి 9.30 గంటలకి. రాగానే స్నానం చేసి.. అన్నం మొహం చూస్తే.. అప్పుడు అన్నం విలువ ఏంటో తెలిసింది'' -
మరో మూడు రోజులు అతి భారీ వర్షాలు
-
భయం వద్దు.. భరోసాగా మేమున్నాం
-
'భయం వద్దు.. భరోసాగా మేమున్నాం'
చెన్నై: భారీ వర్షాలతో అల్లాడుతున్న తమిళనాడులోని దుర్భర పరిస్థితులను, జరిగిన నష్టాన్ని తాను స్వయంగా చూశానని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఈ ఆపత్కాలంలో తమిళనాడు ప్రజలతో భుజం భుజం కలిపి.. కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మోదీ భరోసా ఇచ్చారు. సహాయ కార్యక్రమాల కోసం స్వతరమే రూ. వెయ్యి కోట్లు తమిళనాడుకు విడుదల చేయాలని ఆదేశాలు ఇచ్చినట్టు ఆయన స్పష్టం చేశారు. గతంలో వర్షాల సందర్భంగా కేంద్రం తమిళనాడుకు రూ. 940 కోట్ల సహాయం అందజేసిందని, దానికి అదనంగా ప్రస్తుతం ఈ మొత్తాన్ని ఇస్తున్నామని ప్రధాని ట్విట్టర్ లో తెలిపారు. వర్షాలకు ఛిన్నాభిన్నమైన తమిళనాడులోని చెన్నై, కంచిపురం, తిరువళ్లూరు జిల్లాల పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏరియల్ సర్వే నిర్వహించారు. అంతకుముందు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో భేటీ రాష్ట్రంలోని బీభత్సంపై అడిగి తెలుసుకున్నారు. -
వరదలపై లోక్‌సభలో హోంమంత్రి ప్రకటన
-
తల్లి శవం పక్కనే 20 గంటలు...
చెన్నై: భారీ వర్షాలతో చెన్నై వాసులు కనీవినీ ఎరుగని రీతిలో కష్టాలు పడుతున్నారు. తినడానికి తిండి, తాగడానికి నీరు దొరకడం లేదు. కనీసం అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా చోటులేకపోవడంతో ప్రజలు బాధలు వర్ణణాతీతంగా ఉన్నాయి. అశోక్ నగర్ ప్రాంతంలో ఓ మహిళ తన తల్లి శవం పక్కనే కూర్చుని దాదాపు 20 గంటలుగా జాగారం చేస్తోంది. తనకు సహాయం చేయాలని సదరు మహిళ స్నేహితులను కోరడం, వారు మీడియాను అభ్యర్థించడంతో ఈ విషయం వెలుగుచూసింది. 'మా అమ్మ డయాలిసిస్ పేషెంట్. నిన్ననే ఆమె చనిపోయింది. కరెంట్ లేకపోవడంతో భౌతికకాయం చీకటిలోనే ఉంది. శవాన్ని శ్మశానానికి తరలించేందుకు దయచేసి ఎవరైనా వాహనం పంపించండి. ఇప్పటికే భౌతికకాయం పాడైపోయ్యే స్థితిలో ఉంది. నాకు సహాయం చేయండి' అని ఆమె వేడుకుంది. దీంతో కరిగిపోయిన ఆమె స్నేహితులు మీడియాకు సమాచారం అందించారు. కాగా, వరదలు పోటెత్తడంతో చెన్నైకు సంబంధాలు తెగిపోయాయి. సహాయక కార్యక్రమాలు చురుగ్గా సాగడం లేదు. సైన్యం, నావికా దళం, వాయుసేన తదితర బలగాలు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. -
ఆస్పత్రుల పరిస్థితి దయనీయం
తమిళనాడులో వర్షాలు ఇప్పట్లో తగ్గే అవకాశం లేకపోవడంతో ఆస్పత్రుల పరిస్థితి దయనీయంగా ఉంది. వర్షం కొద్దిగా తెరిపి ఇవ్వగానే నర్సులు, ఇతర సిబ్బంది ఇళ్లకు వెళ్లారు. కానీ, వాళ్లు మళ్లీ తిరిగి ఆస్పత్రులకు చేరుకునే పరిస్థితి కనిపించడంలేదు. మరోవైపు గోడలు కూలి, ఇతర కారణాల వల్ల చాలామంది క్షతగాత్రులు ఆస్పత్రులకు వెళ్తున్నా, అక్కడ చికిత్స అందించే పరిస్థితి కనిపించడంలేదు. తాను కష్టమ్మీద ఇంటికి చేరుకునేసరికి ఇంట్లోకి నీళ్లు వచ్చేస్తున్నాయని.. దాంతో సర్టిఫికెట్లు తీసుకుని దగ్గర్లో ఉన్న ఓ స్కూల్లో ఆశ్రయం పొందుతున్నానని ప్రభుత్వాస్పత్రిలో పనిచేసే మారిముత్తు అనే మేల్ నర్సు చెప్పారు. ఆయన భార్య కూడా నర్సుగానే పనిచేస్తున్నారు. ఆమె మాత్రం ఎలాగోలా ఎగ్మోర్‌లో ఉన్న తన ఆస్పత్రికి వెళ్లారు గానీ మళ్లీ తిరిగి ఇంటికి చేరుకోలేకపోయారు. ఇక ఆస్పత్రుల్లో కూడా పరిస్థితులు దుర్భరంగా ఉన్నాయి. విద్యుత్ సరఫరా లేకపోవడం, జనరేటర్లలోకి డీజిల్ నిల్వలు కూడా అడుగంటిపోవడంతో చాలాచోట్ల లైట్లు కూడా వెలగడం లేదు. ఎమర్జెన్సీ సేవలకు మాత్రం సిబ్బంది అందరినీ సిద్ధంగా ఉంచారు. కీల్పాక్ మెడికల్ కాలేజి ఆస్పత్రిలోకి నీళ్లు చేరుకున్నాయి. వాటిని మోటార్లతో తోడి బయటకు పంపుతున్నట్లు డీన్ నారాయణ బాబు తెలిపారు. రోడ్లు మొత్తం పాడవ్వడం, అన్నిచోట్లా నీళ్లు ప్రవహిస్తుండటంతో అంబులెన్సు డ్రైవర్లు రోగులను ఆస్పత్రులకు తీసుకురావడం కూడా కష్టంగా మారింది. సాధారణంగా 20 నిమిషాల్లో వెళ్లిపోయే దూరానికి కూడా ఇప్పుడు 40 నిమిషాలకు తక్కువ పట్టడం లేదని 108 అంబులెన్సు డ్రైవర్లు వాపోతున్నారు. మీనంబాకం లాంటిచోట్ల ట్రాఫిక్ జామ్ మరింత ఎక్కువగా ఉంది. తాంబరం ప్రాంతానికి అదనంగా 5 అంబులెన్సులను కేటాయించామని, ముందుగా గర్భిణులను తరలించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నామని జీవీకే ఈఎంఆర్ఐ సంస్థ ప్రతినిధి ప్రభుదాస్ చెప్పారు. ఈ రెండు మూడు రోజుల్లో సాధారణం కంటే వెయ్యికి పైగా కాల్స్ వచ్చాయని ఆయన అన్నారు. -
మరిన్ని వర్షాలు.. మరిన్ని కష్టాలు
దాదాపు శతాబ్ద కాలంగా ఎన్నడూ లేనంత భారీ వర్షపాతం నమోదు కావడంతో తమిళనాడు.. ముఖ్యంగా రాజధాని చెన్నై నగరం అస్తవ్యస్తంగా మారింది. అయితే ఈ వర్షాలు అప్పుడే తగ్గే పరిస్థితి లేదని.. మరిన్ని రోజుల పాటు పడతాయని జాతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాబోయే మూడు నాలుగు రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఇప్పట్లో ఊరట లభించకపోవచ్చని జాతీయ వాతావరణశాఖకు చెందిన లక్ష్మణ్ సింగ్ రాథోడ్ తెలిపారు. భారీ వర్షాలు, గతం నుంచి ఉన్న వరదల కారణంగా ఇప్పటివరకు తమిళనాడులో 197 మంది మరణించగా, చెన్నై నగరంలో గత 24 గంటల్లో 200 మంది తీవ్రంగా గాయపడినట్లు హోం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు తెలిపారు. తాను, తన స్నేహితుడు పీకల్లోతు నీళ్లలో నడుచుకుంటూ ఎత్తయిన ప్రదేశానికి వెళ్లామని, అక్కడి నుంచి ఆర్మీ ట్రక్కులో కష్టమ్మీద ఇంటికి చేరామని రూపమ్ చౌధురి అనే వైద్యుడు తెలిపారు. ఆయన ఆస్పత్రి చెన్నై నడిబొడ్డున ఉంది. ఇక తన ఆస్పత్రిలో పేషెంట్లకు ఆక్సిజన్ స్టాకు కూడా అయిపోయిందని, జనరేటర్లలో డీజిల్ లేదని చెన్నైలోని ప్రముఖ డయాబెటిస్ ఆస్పత్రి చీఫ్ డాక్టర్ ఎ.రామచంద్రన్ ఫోన్లో తెలిపారు. నగరంలో చాలావరకు సెల్ఫోన్లు పనిచేయడం లేదు. ఆహార పదార్థాల నిల్వలు కూడా అడుగంటాయి. జీతాలు రాకముందే వర్షాలు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు చేసుకునేవాళ్లకు ఒకటో తారీఖు వస్తే తప్ప చేతిలో డబ్బులుండవు. ఆ తర్వాత మాత్రమే నెలకు సరిపడ సరుకులు, బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులు తెచ్చుకుంటారు. కానీ 30వ తేదీ నుంచే భారీ వర్షాలు పడుతుండటంతో.. ముందుగా సరుకులేవీ తెచ్చుకోలేకపోయారు. చేతికి జీతాలు వచ్చినా ఇప్పుడు సరుకులు తెచ్చుకునే పరిస్థితి లేదు. దాంతో నెలాఖరుకు నిండుకున్న సరుకులను మళ్లీ నింపుకోడానికి కూడా వీల్లేకుండా పోయింది. -
చెన్నై జలమయం
-
సాఫ్ట్వేర్.. కుదేల్
తమిళనాడు రాజధాని చెన్నై నగరం మొత్తాన్ని అతలాకుతలం చేసిన భారీ వర్షాలతో సాఫ్ట్వేర్ కంపెనీలు కుదేలయ్యాయి. ఉద్యోగులు ఇళ్ల నుంచి కదిలే పరిస్థితి లేకపోవడం, ఆఫీసులలోకి కూడా నీళ్లు వచ్చేయడంతో చాలా కంపెనీలు ఆదివారం వరకు సెలవు ప్రకటించాయి. ప్రభుత్వం నుంచి కార్మిక శాఖ ఇప్పటికే రెండు రోజులు సెలవులు ప్రకటించింది. వీలైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయించాలని చూస్తున్నా, ఎక్కడా విద్యుత్ సరఫరా గానీ, ఇంటర్నెట్ లాంటి సదుపాయాలు గానీ లేకపోవడంతో దానికి కూడా వీలు కుదరట్లేదు. ఇన్ఫోసిస్, యాక్సెంచర్, టీసీఎస్, ఐబీఎం లాంటి ప్రధాన కంపెనీలన్నింటిపైనా కూడా వర్షాల ప్రభావం తీవ్రంగానే ఉంది. ఇంతకుముందు వర్షాలు వచ్చినప్పుడు కూడా కొంత ఇబ్బంది అయ్యింది. అప్పట్లో చాలా కంపెనీలు దగ్గర్లో ఉన్న బెంగళూరుకు వెళ్లి పని చేయాలని ఉన్నతోద్యోగులను కోరాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా కనుచూపు మేరలో కనిపించడం లేదు. నగరం నుంచి బయటకు వెళ్లే దారులు దాదాపుగా అన్నీ మూసుకుపోయాయి. విమానాశ్రయం కూడా పూర్తిగా నీళ్లలో మునిగిపోవడంతో వాయుమార్గం ఆప్షన్ సైతం లేదు. తాత్కాలికంగా నౌకాదళానికి చెందిన ఎయిర్‌బేస్‌ను పౌర విమానాశ్రయంగా ఉపయోగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం ఎయిర్‌బస్ ఎ 320 విమానం ఒకదాన్ని అక్కడ ల్యాండ్ చేసి పరీక్షించారు. అయితే, ఆ ఎయిర్‌బేస్ నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో అక్కడివరకు వెళ్లడం కూడా పెద్ద సమస్యగానే ఉంది. మరో నాలుగు రోజుల పాటు కూడా వర్షాలు పడుతూనే ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దాంతో సాఫ్ట్వేర్ కంపెనీల యాజమాన్యాల గుండెల్లో గుబులు పట్టుకుంది. ఐబీఎం కంపెనీకి భారతదేశంలో దాదాపు లక్ష మంది ఉద్యోగులు ఉండగా, వాళ్లలో ఐదోవంతు కేవలం చెన్నైలోనే పనిచేస్తున్నారు. కాగ్నిజెంట్ కంపెనీకి అయితే ఒక్క చెన్నైలోనే 2.19 లక్షల మంది ఉద్యోగులు ఉన్నట్లు అంచనా. మొత్తమ్మీద వర్షాలు మాత్రం చెన్నై కేంద్రంగా ఉన్న సాఫ్ట్వేర్ పరిశ్రమకు చుక్కలు చూపిస్తున్నాయి. -
వరద ఉధృతిలో మానవహారం కట్టి..!
చెన్నై గుండె చెరువైంది. ఎటుచూసినా నీళ్లు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు. నగరం నిండా కన్నీళ్లు, కడగండ్లు నింపింది. వానలు సృష్టిస్తున్న బీభత్సంతో నగరమంతా అతలాకుతలమవుతున్న వేళ చెన్నై వాసి మొక్కవోని గుండె ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. వరద ఉధృతిలో చిక్కుకున్న ఓ వ్యక్తిని చెన్నైవాసులు సాహసోపేతంగా కాపాడారు. ఐదారుగురు వ్యక్తులు మానవహరం కట్టి.. వరద ఉధృతిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి యుట్యూబ్లో పెట్టారు. వరద ఉధృతిలో పూర్తిగా చిక్కుకున్న వ్యక్తిని వారు మానవహరంగా ఏర్పడి.. చాకచక్యంగా కాపాడారు. ఇక చెన్నైలో భారీగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తాగునీరు, నిత్యావసరాల వస్తువులు అందుబాటులో లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. మొబైల్, ఇంటర్నెట్ సేవలు కూడా ఆగిపోయాయి. -
మానవత్వం తలుపులు తెరిచింది!
చెన్నై: ఎడతెరిపిలేని వర్షాలు.. వరద నీళ్లతో చెరువులను తలపిస్తున్న రోడ్లు. మూతపడిన రైల్వేస్టేషన్లు, విమానాశ్రయం. ఆగిపోయిన రవాణావ్యవస్థ. ఇంటర్నెట్, ముబైల్ సేవలు బంద్. నిండుకుండను తలపిస్తున్న చెన్నై మహానగరం. ఇంత కష్టకాలంలో, ఈ అనుకోని వర్ష బీభత్సంలోనూ చెన్నైవాసులు గుండెలోపలి మానవత్వాన్ని తట్టిలేపారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడానికి తమ ఇంటి తలుపులు తెరిచారు. వర్షబీభత్సంలో చిక్కుకున్నవారికి సురక్షితంగా ఉన్న తమ ఇంట్లో ఆశ్రయం ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఈ మేరకు చాలామంది చెన్నైవాసులు ట్విట్టర్, ఫేస్బుక్లో సందేశాలు పెట్టారు. అదృష్టవశాత్తు తమ తమ నివాసాలు నీటిలో మునిగిపోలేదని, వర్షాల్లో చిక్కుకుపోయిన ఎవరైనా భద్రత, ఆశ్రయం కావాల్సివస్తే తమ ఇంటి తలుపును తట్టవచ్చునని సోషల్ మీడియాలో తెలిపారు. తమ ఇంటి చిరునామా, ఫోన్ నెంబర్లు ఇచ్చారు. వర్షాలు ఆగకపోతే ఈ రాత్రి తమతోపాటు గడుపవచ్చునని మానవత్వాన్ని చూపారు. నిజానికి గత వందేళ్లలోనే రికార్డుస్థాయిలో నమోదైన వర్షంతో చెన్నై నగరం స్తంభించిపోయింది. జనజీవనం అస్తవ్యస్తమైంది. చాలా ఇళ్లు నీటమునిగాయి. రోడ్లు చెరువులను తలిపిస్తుండటం, వరద ఉధృతికి సైదాపెట్ ఆనకట్ట ఊగిపోతుండటం.. అక్కడి వర్షబీభత్సాన్ని చాటుతోంది. మోకాళ్లలోతు నీళ్ల చేరిన రోడ్లపై వాహనాలను నడుపలేక.. ఇళ్లకు చేరలేక ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ఇలాంటి కష్టకాలంలో బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన చెన్నైవాసుల పెద్ద హృదయం పలువురి ప్రశంసలందుకుంటున్నది. Our flat in #ValmikiNagar, # Thiruvanmyur is dry with Internet and electricity. Please get in touch if you need help #ChennaiFloods — Jayashree (@javashree) December 1, 2015 Raja (96-00-721345), Bachelors room in Thoraipakkam, can accommodate people. #chennairains #ChennairainsHelp #ChennaiFloods #Chennai — Venkat Ramakrishnan (@flyvenkat) December 1, 2015 -
చెన్నై వాసులను ఎలా ఆదుకుందాం?
కనీవినీ ఎరుగని వర్షబీభత్సంతో అతలాకుతలం అవుతున్న చెన్నైలోని పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ సీనియర్ మంత్రులతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో బిక్కుబిక్కుమంటున్న చెన్నై వాసులను ఆదుకోవడంపై చర్చించారు. చెన్నైలో అత్యవసరంగా చేపట్టాల్సిన సహాయక, రక్షణ చర్యలపై మంత్రులతో మాట్లాడారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, అరుణ్‌జైట్లీ, సుష్మాసర్వాజ్, వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. వర్షాలతో నిండుకుండగా మారిన చెన్నైకి సహాయక బృందాలు చేరుకుంటున్నాయి. ఇప్పటికే జాతీయ విపత్తు సహాయక దళానికి (ఎన్డీఆర్ఎఫ్) పది బృందాలను చెన్నైకి తరలించారు. ఆర్మీ, నేవీ బృందాలు కూడా రంగంలోకి దిగుతున్నాయి. ఇక చెన్నై రైల్వే స్టేషన్లలో భారీ ఎత్తున చిక్కుకున్న ప్రయాణికులకు తాగునీరు, మౌలిక వసతులు కల్పిస్తున్నట్టు రైల్వే అధికారి అనిల్ సక్సేనా తెలిపారు. రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుండటంతో చెన్నై వాసుల కష్టాలకు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. -
కారు కంటే బోటే నయం
సాధారణంగా సిటీలో అటూ ఇటూ తిరగాలంటే కారు చేతిలో ఉండాలని అనుకుంటాం. సిటీబస్సుల్లో తిరగలేక.. బైకులయితే కాలుష్యం భరించలేక నానా ఇబ్బందులు పడుతుంటారు. అందుకే సొంత కారులో అయితే ఎంచక్కా వెళ్లొచ్చని భావిస్తారు. కానీ, ప్రస్తుతం చెన్నై నగరంలో పరిస్థితి తిరగబడింది. ఎక్కడికక్కడ పార్కింగ్ చేసిన కార్లు కూడా మునిగిపోతున్నాయి. దాంతో జనం మొత్తం పడవల్లోనే తిరుగుతున్నారు. బోటులో వెళ్తున్న వాళ్లకు పక్కనే కారు పూర్తిగా మునిగిపోయి కనిపిస్తుంటే, దాన్ని దాటుకుంటూ ఆ పక్క నుంచే పడవలో వెళ్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. గతంలో కూడా చెన్నైలో భారీ వర్షాలు కురిసిన సమయంలో ఓలా క్యాబ్స్ లాంటి సంస్థలు క్యాబ్‌లకు బదులు పడవలను నడిపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు జనం కూడా ఇలాంటి సీజన్లో చేతిలో కారుకు బదులు మంచి మోటారు బోటు ఉంటే బాగుండునని భావిస్తున్నారట! -
కారు కంటే బోటే నయం
-
చెన్నై ప్రజలకు సినీ ప్రముఖుల చేయూత
జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్న భారీవర్షాల నుంచి చెన్నై ప్రజలు సురక్షితంగా ఉండాలంటూ సామాన్య ప్రజలతో పాటు సినీ తారలు కూడా కోరుతున్నారు. తన సోషల్ నెట్వర్కింగ్ సైట్ల ద్వారా ప్రజలకు కావాల్సిన సమాచారాన్ని అందించటంతో పాటు అభిమానులు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలంటూ కోరుతున్నారు. సిద్దార్థ, లారెన్స్ లాంటి మరికొంత మంది ప్రత్యక్షంగా సాయం చేయడానికి రెడీ అవుతున్నారు. వర్షాలు, వరదలు కారణంగా ఆకలితో అలమటిస్తున్న ప్రజానీకానికి సాయం చేయడానికి హీరో సిద్దార్ధ్ ముందుకు వచ్చాడు. ఆహార పొట్లాలను ఇవ్వదలచిన వారు తనకు ఫోన్ చేయాలంటూ తన ట్విట్టర్లో పోస్ట్ చేసిన సిద్దార్థ్, సాయం చేసే ఉద్దేశం లేనివారు ఇంట్లోనే ఉండాలంటూ కోరాడు. అలాంటి వారు రోడ్ల మీదకు రావడం వల్ల సహాయ కార్యక్రమాలకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉందంటూ ట్వీట్ చేశాడు. చెన్నైలోని చాలా ప్రాంతాల్లో పరిస్థితిని కూడా తన ట్విట్టర్లో తెలిపాడు సిద్దార్ధ్. మరో తమిళ స్టార్ లారెన్స్ కూడా చెన్నై వర్షాలపై స్పందించాడు. చాలాకాలంగా రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ ఆద్వర్యంలో సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్న లారెన్స్.. చెన్నై వరద బాధితుల కోసం పదిలక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించాడు. వీరితో పాటు కుష్బూ, ఐశ్వర్య ధనుష్, అనిరుధ్, సౌందర్య రజనీకాంత్, విశాల్, అమీజాక్సన్ లాంటి కోలీవుడ్ స్టార్స్, ఇంకా బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా కూడా చెన్నై పరిస్థితి పై ట్విట్టర్లో స్పందించారు. If you can organise food packets in chennai please contact me. We will have it picked up and delivered. Batches of 50-100 packets. #TNflood — Siddharth (@Actor_Siddharth) December 2, 2015 If you are not part of relief work please stay indoors. People crowding bridges to see flood sights are a nuisance. Stay home. #TNflood — Siddharth (@Actor_Siddharth) December 2, 2015 Please help..#ChennaiFloods #ChennaiHelps https://t.co/c1IM7giwv6 — khushbusundar (@khushsundar) December 2, 2015 Food packets.relief materials all being distributed.if any affected areas r in need.pls lemme know.includin transport.step in n do yr bit.gb — Vishal (@VishalKOfficial) December 2, 2015 #ChennaiFloods #chennairains pic.twitter.com/Pq4M5A8CLJ — Aishwaryaa.R.Dhanush (@ash_r_dhanush) December 1, 2015 -
ఇరుక్కున్న హన్సిక
హీరోయిన్ హన్సికకు ఇదో మర్చిపోలేని అనుభవమైంది. వానలో షూటింగ్ అలవాటున్న ఈ అందాల రాశికి, వాన నీళ్ళలో ఇరుక్కుపోవడమంటే ఏమిటో తెలిసొచ్చింది. ఆ సంగతి గురించి హన్సిక చెబుతూ, ‘‘ఈ నవంబర్ 24ని ఎప్పటికీ మర్చిపోలేను. ముంబయ్కో, విదేశాలకో వెళ్లి, తిరిగొచ్చినప్పుడు ఎలా చెన్నై వస్తానో అలానే ఆ రోజు చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో దిగాను. భారీ వర్షాల కారణంగా చెన్నై పరిస్థితి దారుణంగా మారిన విషయం నాకు తెలియదు. నా హోటల్ రూమ్‌కి వెళ్లడానికి కారు ఎక్కాను. సమయం గడుస్తోందే తప్ప హోటల్ రావడం లేదు’’ అని గుర్తుచేసుకున్నారు. తుపానుతో ఎడతెగని వర్షాల కారణంగా చెన్నై రోడ్లన్నీ జలమయం కావడంతో కొన్ని ఏరియాల్లో ఆ నగరవాసులు పడవ ప్రయాణం చేస్తున్నారు. కారులో ప్రయాణం అంటే ఇక గమ్యం చేరినట్లే. హన్సికకు అదే జరిగింది. ఇలా అయితే ఎప్పటికీ హోటల్‌కి చేరుకోలేమని భావించిన ఈ బ్యూటీ కారు దిగారు. దగ్గరలోనే వేరే ఏదైనా హోటల్లో బస చేయాలనుకున్నారు. పూనమల్లి రోడ్డులో కత్తిపరా ఫ్లై ఓవర్ మీదుగా నడక మొదలుపెట్టారు. వానలో పూర్తిగా తడిసిపోయారు. ఈలోపు హన్సికను కొంతమంది గుర్తుపట్టారు. కానీ, ఆమెను ఇబ్బందిపెట్టలేదు. ఎలాగోలా ఆమె హోటల్ చేరారు. ‘‘ఉత్తరాది అమ్మాయినైనా సౌత్‌ని నా హోమ్ టౌన్లానే భావిస్తాను. ప్రకృతి వైపరీత్యం కారణంగా తమిళనాడు ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలి’’ అన్నారు. మొత్తానికి, చెన్నై తుపాను వర్షాలు హన్సికకు ఒక అనుభవాన్నిచ్చాయన్నమాట. -
సాఫ్ట్వేర్ కంపెనీలకు చుక్కలు చూపిస్తున్న వర్షాలు
భారీ వర్షాలతో సాఫ్ట్వేర్ కంపెనీలు అతలాకుతలం అవుతున్నాయి. ఉద్యోగులు ఎవరూ ఆఫీసులకు వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో.. ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటున్నాయి. మరోవైపు క్లయింటులు మాత్రం తమ అవసరాల కోసం యాజమాన్యాల మీద ఒత్తిడి తేవడం మానట్లేదు. చెన్నైలో పనిచేస్తున్న వాళ్లలో కీలక ఉద్యోగులు చాలామందిని వేరే ప్రాంతాలకు పంపేసి.. అక్కడినుంచి పని చేయాల్సిందిగా కోరతున్నారు. ప్రధానంగా ఐబీఎం, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, క్యాప్ జెమిని, టీసీఎస్.. ఇలాంటి పలు కంపెనీల ఉద్యోగులు చాలామంది భారీ వర్షాల కారణంగా ఆఫీసులకు వెళ్లలేకపోతున్నారు. దాంతో, చెన్నైలో ఉన్న చాలా కంపెనీలు దగ్గర్లో ఉన్న బెంగళూరుకు వెళ్లి పని చేయాలని ఉన్నతోద్యోగులను కోరుతున్నాయి. పోనీ కనీసం కొంతమందినైనా 'వర్క్ ఫ్రమ్ హోమ్' ఆప్షన్ ఉపయోగించుకుని పని చేయిద్దామంటే, చెన్నైలో చాలా ప్రాంతాలలో కరెంటు ఉండట్లేదు. దాంతో పాటు.. మొత్తం జలమయం అయిపోవడంతో ఇంటర్నెట్ సదుపాయం కూడా అంతంతమాత్రంగానే ఉంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్లతో పని చేయించడం ఎలాగో అర్థం కాక, పని జరిగే వీలు లేక యాజమాన్యాలు తలపట్టుకుంటున్నాయి. చెన్నై కేంద్రంగా చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. చెన్నై నగరంలో భారీ వర్షాల కారణంగా రోడ్లు, విద్యుత్ లైన్లు బాగా పాడయ్యాయి. కేవలం వీటి రూపంలో కలిగిన నష్టాలే దాదాపు రూ. 8,481 కోట్ల మేరకు ఉంటాయని తమిళనాడు ప్రభుత్వం అంచనా వేసింది. ఇక వస్తుసేవలు, ఇలాంటి సాఫ్ట్వేర్ సేవలన్నింటినీ కూడా లెక్కలోకి తీసుకుంటే ఆ నష్టం ఎన్ని లక్షల కోట్లకు చేరుకుంటుందో చూడాలి. ఐబీఎం కంపెనీకి భారతదేశంలో దాదాపు లక్ష మంది ఉద్యోగులు ఉండగా, వాళ్లలో ఐదోవంతు కేవలం చెన్నైలోనే పనిచేస్తున్నారు. దాంతో అక్కడి ఉన్నతోద్యోగులను అత్యవసరంగా బెంగళూరు పంపేసి.. అక్కడినుంచి ప్రాజెక్టుల పని చూస్తున్నారు. కాగ్నిజెంట్ కంపెనీకి అయితే ఒక్క చెన్నైలోనే 2.19 లక్షల మంది ఉద్యోగులు ఉన్నట్లు అంచనా. వాళ్లు కూడా ఇదే వ్యూహాన్ని అనుసరిస్తూ.. వేర్వేరు నగరాలకు సిబ్బందిని పంపుతున్నారు. మొత్తమ్మీద వర్షాలు మాత్రం చెన్నై కేంద్రంగా ఉన్న సాఫ్ట్వేర్ పరిశ్రమకు చుక్కలు చూపిస్తున్నాయి. -
వరదల్లో చిక్కుకుని అష్టకష్టాలు పడ్డ హీరోయిన్
చెన్నై: తెలుగు, తమిళ ఇండస్ట్రీలో మాంచి జోరుమీదున్న ముద్దుగుమ్మ హన్సిక.. తమిళనాడు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన వరదల్లో చిక్కుకుందట. ఊహించని ఈ పరిణామానికి తెగ టెన్షన్ పడింది. చివరికి చెన్నై విమానాశ్రయం నుంచి హోటల్ కు చేరడానికి చాలా పెద్ద సాహసమే చేసింది. చెన్నై రోడ్లపై హోరువానలో గంటపాటు నడిచి తెల్లవారుఝామున మూడు గంటలప్రాంతంలో హోటెల్ కు చేరింది. అటు జోరువాన.. ట్రాఫిక్ జామ్, ఇటు చూస్తే మోకాళ్ల లోతు నీళ్లు. మరోవైపు సిగ్నల్స్ లేక కనెక్ట్ కాని మొబైల్స్. ఇలా దాదాపు గంటల నరకయాతన అనుభవించి.. చివరికి ఎలాగోలా బయటపడ్డానుంటూ ఈ విషయాలను స్వయంగా హన్సికానే మీడియాకు వివరించింది. 'చలికి వణికిపోయా... వానకెదురు నడుస్తోంటే....కాళ్లు నొప్పులు.. అభిమానులు గుర్తు పట్టేశారు.. పేరు పెట్టి పిలవడం మొదలు పెట్టారు. అయినా ఎలాగోలా చేరాను .దాదాపు ముంబై దాడులప్పుడు కూడా ఇలాంటి సిట్యుయేషన్‌నే ఎదుర్కొన్నాఅపుడు నా స్నేహితులు చాలామంది సాయం చేశారంటూ' ఆనాటి జ్ఞాపకాలను మీడియాతో షేర్ చేసుకుంది. స్టాలిన్ సరసన జాలీ ఎల్ ఎల్ బి అనే చిత్రంలో నటిస్తున్న హన్సిక ఈ మూవీ షూటింగ్ నిమిత్తం ముంబై నుంచి చెన్నైకి బయలుదేరింది. ఈ సందర్భంగానేఈ పాలబుగ్గల సుందరి చిక్కుల్లో పడిందట. విపరీతమైన ట్రాఫిక్ జామ్ తో అటు ముందుకు వెళ్లలేక ఇటు వెనక్కి వెళ్లలేక మద్యలోనే చిక్కుకు పోయింది. ఎడతెరిపిలేని వానలు నగరాన్ని ముంచెత్తడంతో దాదాపు మోకాళ్ల లోతు నీటిలో కనీసం గంటపాటు ఇరుక్కుపోయిందట. ఇక ఎటూ పాలుపోని పరిస్థితుల్లో సుదీర్ఘంగా అంటే గంటపాటు నడక సాగించాల్సొచ్చిందంట. తనకు కేటాయించిన హోటెల్ కు చేరుకోవాలంటే కనీసం గంటా రెండు గంటల టైమ్ పడుతుందట.. అభిమానులు చుట్టుముట్టి గందరగోళం సృష్టించినా చివరకి నడుచుకుంటూనే హోటల్ కు చేరిందట.