కోటి విరాళం ఇచ్చిన సూపర్ స్టార్ | Shah Rukh Khan donates Rs. 1 crore for Chennai flood victims | Sakshi
Sakshi News home page

కోటి విరాళం ఇచ్చిన సూపర్ స్టార్

Published Mon, Dec 7 2015 8:28 PM | Last Updated on Sun, Sep 3 2017 1:38 PM

కోటి విరాళం ఇచ్చిన సూపర్ స్టార్

కోటి విరాళం ఇచ్చిన సూపర్ స్టార్

బాలీవుడ్ సూపర్‌స్టార్, కోల్‌కతా నైట్‌రైడర్స్ సహ యజమాని షారుక్ ఖాన్.. చెన్నై వరద బాధితులను ఆదుకోడానికి కోటి రూపాయల విరాళం ప్రకటించాడు. ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించినట్లు తెలుస్తోంది. కాజోల్‌తో కలిసి 'దిల్‌వాలే' సినిమాలో మళ్లీ నటిస్తున్న షారుక్.. గతంలో దీపికా పదుకొనేతో కలిసి చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమాలోనూ నటించాడు.

తాను తమిళనాడు బాధితులను ఆదుకునేందుకు కోటి రూపాయల విరాళం ఇస్తున్నట్లు సీఎం జయలలితకు ఓ లేఖ కూడా రాసినట్లు తెలుస్తోంది. తమిళనాడు వరదల్లో 280 మంది మరనించారు. నగరం మొత్తం అస్తవ్యస్తంగా మారింది. ఇప్పటికీ కోలుకోలేదు. దాంతో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులందరూ కూడా పెద్దమనసు చేసుకుని ముందుకొస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement