పాడైపోయిన పాస్‌పోర్టులు మళ్లీ ఇస్తాం
చెన్నైలో భారీ వర్షాలు, వరదల కారణంగా ముఖ్యమైన పత్రాలను చాలామంది పోగొట్టుకున్నారు. వాటిలో పాస్‌పోర్టులు కూడా ఉన్నాయి. అలా పాస్‌పోర్టులు పాడైపోయిన వాళ్లకు ఉచితంగా మళ్లీ వాటిని జారీచేస్తామని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు.
వరదల్లో పాస్‌పోర్టులు పోయినా, పాడైనా చెన్నై నగరంలో ఉన్న మూడు పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో ఏదో ఒకదానికి వెళ్లాలని, అక్కడ ఉచితంగా కొత్త పాస్‌పోర్టు జారీ చేస్తారని ఆమె ట్వీట్ చేశారు.
If your passport is lost or damaged in floods, pl go to any of three PSKs in Chennai. They will issue u fresh passport free of charge. Pl RT
— Sushma Swaraj (@SushmaSwaraj) December 7, 2015