తమిళనాడులో విషాదం.. ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి! | Landslide Hits Tamil Nadu Seven Family Trapped | Sakshi
Sakshi News home page

తమిళనాడులో విషాదం.. ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి!

Published Mon, Dec 2 2024 8:10 PM | Last Updated on Mon, Dec 2 2024 8:22 PM

Landslide Hits Tamil Nadu Seven Family Trapped

చెన్నై: ఫెంగల్‌ తుపాన్‌ కారణంగా తమిళనాడులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కొండచరియలు విరిగి పడిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతిచెందారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

వివరాల ప్రకారం.. ఫెంగల్‌ తుపాన్‌ ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా పలు చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. కాగా, సోమవారం మధ్యాహ్నం తిరువణ్ణామలైలో దేవాలయం వద్ద ఉన్న నివాసంపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తులు మరణించారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రెస్య్కూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.

ఇదిలా ఉండగా.. వర్షాల కారణంగా ఇప్పటికే తమిళనాడులో కొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. ఆదివారం సాయంత్రం కొండచరియలు విరిగిపడటంతో అందులో కొందరు చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు.. తుపాన్‌ కారణంగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. పలు చోట్ల వరదల ధాటికి బస్సులు, కార్లు కొట్టుకుపోతున్నాయి. ఇప్పటికీ పలు జిల్లాలకు రెడ్‌, ఆరెంజ్‌ అలర్ట్‌ కొనసాగుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement