Chennai: చెన్నైలో భారీ వర్షం.. స్కూల్స్‌ బంద్‌! | Tamil Nadu Heavy Rain: Holiday Declared For Schools, And Colleges In Tamil Nadu Due To Heavy Rains - Sakshi
Sakshi News home page

Chennai: చెన్నైలో భారీ వర్షం.. స్కూల్స్‌ బంద్‌!

Published Mon, Jan 8 2024 9:03 AM | Last Updated on Mon, Jan 8 2024 9:29 AM

IMD Warned For Heavy Rains To Chennai - Sakshi

చెన్నై: తమిళనాడులో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలో ఆదివారం నుంచి భారీ వర్షం కురుస్తూనే ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో నాలుగు జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్‌ అలర్ట్‌ విధించింది. 

భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో స్కూల్స్‌, కాలేజీలకు సెలవు ప్రకటించారు. ఈరోజు(సోమవారం) తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. చెన్నైలోని అడయార్‌, అన్నాసాలై, వేప్పేరి, గిండి, కోయంబేడులో ఎడతెరిపిలేని వర్షం పడుతోంది. నాగపట్నం, కరైకల్‌, పుదుచ్చేరిలో భారీ వర్షం కురిసినట్టు వాతావరణ శాఖ పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement