మంత్రిపై బురదజల్లిన వరద బాధితులు.. | Villupuram Locals Throw Mud On Tamil Nadu Minister Ponmudy | Sakshi
Sakshi News home page

వరదల్లో డీఎంకే మంత్రి పరామర్శ.. ఆగ్రహంతో బురదజల్లిన బాధితులు..

Published Tue, Dec 3 2024 5:46 PM | Last Updated on Tue, Dec 3 2024 6:05 PM

Villupuram Locals Throw Mud On Tamil Nadu Minister Ponmudy

చెన్నై: ఫెంగల్‌ తుపాను తమిళనాడులో బీభత్సం సృష్టించింది. తుపాన్‌ కారణంగా ఇప్పటికే పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. భారీగా ఆస్తి నష్టం జరిగింది. వరద నీటికి ధాటికి పలు ప్రాంతాల్లో​ వాహనాలు కొట్టుకుపోయిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

మరోవైపు.. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోని వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక, భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలను పరామర్శించేందుకు వెళ్లిన మంత్రికి చేదు అనుభవం ఎదురైంది. ఆగ్రహంతో ఉన్న ప్రజలు.. సదరు మంత్రిపైనే బురద చల్లారు. దీంతో, ఈ ఘటన తమిళనాడు రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

తమిళనాడు అటవీ శాఖ మంత్రి కె. పొన్ముడి సోమవారం విల్లుపురం జిల్లాలో​ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కొన్నారు. తుపాన్‌ సమయంలో తమకు సహాయక చర్యలు అందలేదని ఎవరూ పట్టించుకోలేదని మండిపడ్డారు. ఇదే సమయంలో మంత్రి, ఆయన కుమారుడి సికామణిపై స్థానికులు బురదజల్లారు. దీంతో.. మంత్రి, సిబ్బంది చేసేదేమీలేక అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

 ఇక, ఈ ఘటనపై తమిళనాడు బీజేపీ చీఫ్‌ అన్నామలై స్పందించారు. వీడియోను ట్విట్టర్‌లో​ షేర్‌ చేస్తూ.. తమిళనాడులో ప్రస్తుత పరిస్థితి ఇది.  చెన్నై వీధుల్లో సీఎం, ఉపముఖ్యమంత్రి ఫొటోలు దిగుతూ బిజీగా ఉన్నారు. చెన్నైకి బయట ఘటనలను ట్రాక్ చేయడానికి డీఐపీఆర్‌.. డీఎంకే మీడియా విభాగంలా ప్రవర్తిస్తుంది. వాస్తవాల నుండి ప్రజలను మళ్లించడానికి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అవినీతితో కూరుకుపోయిన డీఎంకే ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. ప్రజల నిరసన తారాస్థాయికి చేరుకుంది. అందుకే ఇలాంటి దాడులు చేస్తున్నారు. ఇది కేవలం శాంపిల్‌ మాత్రమే అంటూ ఘాటు విమర్శలు చేశారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement