villupuram
-
మంత్రిపై బురదజల్లిన వరద బాధితులు..
చెన్నై: ఫెంగల్ తుపాను తమిళనాడులో బీభత్సం సృష్టించింది. తుపాన్ కారణంగా ఇప్పటికే పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. భారీగా ఆస్తి నష్టం జరిగింది. వరద నీటికి ధాటికి పలు ప్రాంతాల్లో వాహనాలు కొట్టుకుపోయిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.మరోవైపు.. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోని వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక, భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలను పరామర్శించేందుకు వెళ్లిన మంత్రికి చేదు అనుభవం ఎదురైంది. ఆగ్రహంతో ఉన్న ప్రజలు.. సదరు మంత్రిపైనే బురద చల్లారు. దీంతో, ఈ ఘటన తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.తమిళనాడు అటవీ శాఖ మంత్రి కె. పొన్ముడి సోమవారం విల్లుపురం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కొన్నారు. తుపాన్ సమయంలో తమకు సహాయక చర్యలు అందలేదని ఎవరూ పట్టించుకోలేదని మండిపడ్డారు. ఇదే సమయంలో మంత్రి, ఆయన కుమారుడి సికామణిపై స్థానికులు బురదజల్లారు. దీంతో.. మంత్రి, సిబ్బంది చేసేదేమీలేక అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.This is the current state of affairs in Tamil Nadu. The CM and the Deputy Chief Minister were busy taking photos in the streets of Chennai while the city received very little rain and did not bother to keep track of the happenings beyond Chennai. The DIPR behaves like the media… pic.twitter.com/DvZN3UT1f0— K.Annamalai (@annamalai_k) December 3, 2024 ఇక, ఈ ఘటనపై తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై స్పందించారు. వీడియోను ట్విట్టర్లో షేర్ చేస్తూ.. తమిళనాడులో ప్రస్తుత పరిస్థితి ఇది. చెన్నై వీధుల్లో సీఎం, ఉపముఖ్యమంత్రి ఫొటోలు దిగుతూ బిజీగా ఉన్నారు. చెన్నైకి బయట ఘటనలను ట్రాక్ చేయడానికి డీఐపీఆర్.. డీఎంకే మీడియా విభాగంలా ప్రవర్తిస్తుంది. వాస్తవాల నుండి ప్రజలను మళ్లించడానికి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అవినీతితో కూరుకుపోయిన డీఎంకే ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. ప్రజల నిరసన తారాస్థాయికి చేరుకుంది. అందుకే ఇలాంటి దాడులు చేస్తున్నారు. ఇది కేవలం శాంపిల్ మాత్రమే అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
సినిమా వేరు.. రాజకీయం వేరు.. అయినా తగ్గేదేలే: విజయ్ పవర్ఫుల్ స్పీచ్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తమిళగ వెట్రి కళగం(టీవీకే) పేరుతో పార్టీని స్థాపించిన ఆయన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవనున్నారు. అందులో భాగంగానే ఇవాళ భారీ బహిరంగ సభ నిర్వహించారు. విల్లుపురంలో నిర్వహించిన సభలో తమిళనాడు రాజకీయాలపై విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.సినీరంగంతో పోలిస్తే రాజకీయాలు చాలా సీరియస్ అని విజయ్ కామెంట్స్ చేశారు. అయినా సరే పాలిటిక్స్‌లో భయపడేది లేదని స్పష్టం చేశారు. నా కెరీర్ పీక్స్ దశలో ఉన్నప్పుడే సినిమాలు వదిలేసి వచ్చానని తెలిపారు. తాను ఎవరికీ కూడా ఏ టీమ్.. బీ టీమ్ కాదని అన్నారు. ఈ సందర్భంగా టీవీకే పార్టీ సిద్ధాంతాలు, భవిష్యత్ కార్యాచరణను ఆయన ప్రకటించారు. ఈ భారీ బహిరంగ సభకు లక్షల సంఖ్యలో విజయ్ అభిమానులు హాజరయ్యారు.ద్రవిడ, తమిళ జాతీయవాద సిద్ధాంతాలను అనుసరిస్తామని విజయ్ ప్రకటించారు. తమిళనాడు గడ్డకు అవీ రెండు కళ్ల లాంటివన్నారు. లౌకిక, సామాజిక న్యాయ సిద్ధాంతాలే మా పార్టీ భావజాలమని ఆయన స్పష్టం చేశారు. పెరియార్ ఈవీ రామస్వామి, కె.కామరాజ్, బాబాసాహెబ్ అంబేడ్కర్, వేలు నాచియార్, అంజలి అమ్మాళ్ ఆశయాలతో పార్టీని ముందుకు తీసుకెళ్తామని విజయ్ వెల్లడించారు. నాకు రాజకీయ అనుభవం లేకపోయినా భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తొలి సభలోనే డీఎంకే, బీజేపీపై విమర్శలు చేశారు. గతంలో ఎన్టీఆర్, ఎంజీఆర్ సైతం విమర్శలు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. తనను ఆర్టిస్ట్ అంటూ విమర్శలు చేస్తున్న వారికి గట్టి కౌంటర్ ఇచ్చారు. తొలి బహిరంగ సభలోనే తన స్పీచ్‌తో అదరగొట్టారు హీరో, టీవీకే అధినేత విజయ్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని సభ వేదికగా విజయ్ ప్రకటించారు. Tamil Nadu | Actor and TVK President Vijay says "In terms of ideology, we are not going to separate Dravidian Nationalism and Tamil Nationalism. They are two eyes of this soil. We shouldn't shrink ourselves to any specific identity. Secular Social Justice ideologies are our… pic.twitter.com/tclhef2BUk— ANI (@ANI) October 27, 2024 -
అమృత హస్తాలు
33 ఏళ్ల సర్వీసు. 10 వేల డెలివరీలు. విలుప్పురం ప్రభుత్వాస్పత్రి నుంచి గత నెలలో రిటైర్ అయిన నర్సు ఖతీజాబీని తమిళనాడు ప్రభుత్వం సత్కరించి మరీ వీడ్కోలు పలికింది.కారణం ఆమె మొత్తం సర్వీసులో ఒక్క శిశువు కూడా కాన్పు సమయంలో మృతి చెందలేదు. ప్రాణం పోసే పని ఎంతటి బాధ్యతాయుతమైనదో ఖతీజాను చూసి తెలుసుకోవాలంటారు సాటి నర్సులు. ఇలాంటి నర్సులే ప్రతిచోటా కావాలి. ‘ఆ రోజుల్లో ప్రయివేటు ఆస్పత్రులు చాలా తక్కువ. ఎంతటి వాళ్లయినా ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి రావాల్సిందే. క్షణం తీరిక ఉండేది కాదు’ అని గుర్తు చేసుకుంది 60 ఏళ్ల ఖతీజాబీ. ఆమె గత నెలలోనే విల్లుపురం ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి పదవీ విరమణ పొందింది. తమిళనాడు ఆరోగ్య శాఖామంత్రి సుబ్రమణియన్ ప్రత్యేక పురస్కారం అందించి మరీ ఆమెను సత్కరించాడు. ‘అందుకు కారణం నా మొత్తం సర్వీసులో ఒక్క పసికందు కూడా కాన్పు సమయంలో ప్రాణం పోగొట్టుకోకపోవడమే’ అంటుందామె సంతృప్తిగా. ► తల్లి కూడా నర్సే ఖతీజాబీ ఏదో వేరే పని దొరక్క నర్సు కాలేదు. ఆ వృత్తి పట్ల ప్రేమతోనే అయ్యింది. ‘మా అమ్మ జులేఖా కూడా నర్సుగా పని చేసేది. కాని ఆమె కాలంలో కాన్పు సమయాలు చాలా ఘోరంగా ఉండేవి. తల్లి, బిడ్డ క్షేమంగా బయటపడతారనేది చెప్పలేము. నేను ఆమెను చూస్తూ పెరిగాను. చిన్నప్పుడు సిరంజీలతో ఆడుకున్నాను. అమ్మ వెంట హాస్పిటల్‌కు వెళుతూ హాస్పిటల్ వాసనకు అలవాటు పడ్డాను. 1990లో నేను కూడా నర్సుగా ఉద్యోగం ప్రారంభించాను. అయితే అప్పటికే నాకు పెళ్లయ్యి ఏడు నెలల గర్భిణిగా ఉన్నాను. అలా ఉంటూనే కాన్పులు చేయడం ప్రారంభించాను. నా కాన్పు అయ్యాక కేవలం రెండు నెలలు బ్రేక్ తీసుకుని మళ్లీ డ్యూటీకి హాజరయ్యాను’ అంది ఖతీజా. ► స్త్రీల వేదన 1990లలో మన దేశంలో ప్రతి లక్ష కాన్పుల్లో 556 మంది శిశువులు మరణించేవారు. నవజాత శిశువుల్లో ప్రతి 1000 మందికి 88 మంది మరణించేవారు. ‘సిజేరియన్ ఆపరేషన్లు చాలామటుకు స్త్రీలను, శిశువులను కాపాడాయి. నేను పని చేసే ఆస్పత్రిలో కేవలం ఒక డాక్టరు, ఇద్దరు నర్సులు ఉండేవాళ్లం. సిజేరియన్ చేసే సామాగ్రి మా దగ్గర ఉండేది కాదు. అందుకే కాన్పు కాంప్లికేట్ అవుతుందని డౌట్ రాగానే జిల్లా (కడలూర్) ఆస్పత్రికి పంపేసేదాన్ని. ఆ తర్వాత కూడా సిజేరియన్‌కు స్త్రీలు భయపడితే ధైర్యం చెప్పేదాన్ని. కానీ ఇవాళ మామూలు నొప్పులు వద్దని స్త్రీలు సిజేరియనే కోరుకుంటున్నారు’ అని తెలిపింది ఖతీజా. ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వసతులు పెంచడం, స్త్రీల అక్షరాస్యత కోసం శ్రద్ధ పెట్టడం తదితర కారణాల వల్ల ప్రసూతి మరణాలు తగ్గుముఖం పట్టాయని ఖతీజా అంటోంది. ‘ఇవాళ మన దేశంలో ప్రతి లక్ష కాన్పుల్లో కేవలం 88 మంది పిల్లలే మరణిస్తున్నారు. నవజాత శిశువుల్లో వెయ్యికి 27 మంది మరణిస్తున్నారు’ అందామె. ► ఎంతో సంతృప్తి ‘2008 మార్చి 8 నా జీవితంలో మర్చిపోలేను. ఆ రోజు డ్యూటీకి రావడంతోటే ఇద్దరు స్త్రీలు నొప్పులతో ఉన్నారు. వారి కాన్పుకు సాయం చేశాను. రోజులో ఇద్దరు సాధారణమే. కాని ఆ తర్వాత ఆరు మంది వచ్చారు. వారంతా కూడా ఆ రోజే కాన్పు జరిగి పిల్లల్ని కన్నారు. బాగా అలసటగా అనిపించింది. కాని సాయంత్రం డ్యూటీ దిగి వెళుతుంటే ఎనిమిది మంది చంటి పిల్లలు తల్లుల పక్కన పడుకుని కేరుకేరు మంటుంటే ఏడుస్తుంటే చాలా సంతోషం కలిగింది. కాన్పు సమయంలో స్త్రీలు ఎంతో ఆందోళనగా ఉంటారు. వారికి ముందుగా ధైర్యం చెప్పడంపై నేను దృష్టి పెట్టేదాన్ని. బిడ్డను కనే సమయంలో వారు ఎంత బాధ అనుభవించినా బిడ్డ పుట్టి కేర్మన్నాక తప్పనిసరిగా నవ్వు ముఖంతో బిడ్డవైపు చూసేవారు. వారి ఆ నవ్వు నాకు ఎంతో సంతృప్తినిచ్చేది. రిటైరయ్యానన్న మాటేగాని నా మనసు మాత్రం అలాంటి తల్లుల సేవలోనే ఉండమని చెబుతోంది’ అని ముగించింది ఖతీజా. మారిన దృష్టి ‘నేను కాన్పులు చేసిన కొత్తల్లో రెండో సంతానంగా, మూడో సంతానంగా కూడా ఆడపిల్లే పుడితే ఆ తల్లులు అంతులేనంతగా ఏడ్చేవారు. అసలు తండ్రులు చూడ్డానికి కూడా వచ్చేవారు కాదు. ఇవాళ ఆ ధోరణిలో మార్పు వచ్చింది. అమ్మాయిలు పుట్టినా అబ్బాయిలు పుట్టినా కేవలం ఇద్దరు చాలని ఎక్కువమంది అనుకుంటున్నారు. నా మొత్తం సర్వీసులో 50 మంది కవలలకు పురుడు పోశాను. ఒక కాన్పులో ట్రిప్లెట్ పుట్టారు’ అందామె. -
సాయం పేరిట ఘోరం.. ఆశ్రమం ముసుగులో అవయవాల దోపిడీ?
పేరుకు అనాథ ఆశ్రమ నిర్వాహకులు.. కానీ వారి మనసంతా కాలకూట విషమే. అవును.. మానసిక వికలాంగులు, దిక్కులేని వారిని ఆదరిస్తామంటూ తమ ఆశ్రమంలో చేర్చుకుని.. వారిపై లైంగిక దాడులు చేయిస్తూ సొమ్ము దండుకుంటున్నారు. అంతేకాక కొందరి అవయవాలను సైతం ప్రైవేటు ఆస్పత్రులకు అడ్డోగోలుగా అమ్మేస్తూ.. నరరూప రాక్షసులను తలపిస్తున్నారు. విల్లుపురం జిల్లాలో వెలుగు చూసిన ఈ ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సాక్షి, చెన్నై: అభాగ్యులను చేరదీస్తామనే ముసుగులో దారుణాలకు పాల్పడుతున్న అన్బు జ్యోతి అనాథ ఆశ్రమ బండారం గురువారం అధికారుల విచారణలో బయటపడింది. ఇప్పటి వరకు ఈ ఆశ్రమం నుంచి 14 మంది అదృశ్యమైనట్లు వెలుగు చూసింది. ఇక తమ దారుణాలు బయటి ప్రపంచానికి తెలియడంతో అనారోగ్యం పేరిట నాటకాలాడిన నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు. అన్బుజ్యోతి ఆశ్రమం (ఇన్సెట్) పోలీసులు రక్షించిన అభాగ్యులు వివరాలు.. విల్లుపురం జిల్లా విక్రవాండి సమీపంలోని గుండల పులియూర్‌లో అన్బుజ్యోతి పేరుతో ఓ అనాథ ఆశ్రమం ఉంది. దీనిని కేరళకు చెందిన జుబీన్(45), ఆయన భార్య మరియ జుబీన్ నిర్వహిస్తున్నారు. ఈ ఆశ్రమంలో ఉన్న వారు తరచూ కనిపించకుండా పోతున్నట్లుగా చాలా కాలంగా ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం తిరుప్పూర్‌కు చెందినన హనీదుద్దీన్ తన బంధువు జబరుల్లా(45)ను ఈ ఆశ్రమంలో చేర్పించారు. మానసిక రుగ్మతతో బాధ పడుతున్న వారికి ఇక్కడ ప్రత్యేక చికిత్స ఇస్తుండడంతో అనేక మంది యువతులు, మహిళలను వారి కుటుంబాలు తీసుకొచ్చి ఇక్కడ వదిలి పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారం క్రితం జబరుల్లా బెంగళూరులో ప్రత్యక్షం కావడంతో హనీదుద్దీన్కు అనుమానం వచ్చింది. దీంతో వెంటనే పోలీసులతో పాటు కోర్టును కూడా ఆశ్రయించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడుతున్న అధికారులు కోర్టు ఆదేశాలతో పోలీసులు రహస్యంగా దర్యాప్తు చేపట్టారు. అదే సమయంలో ఆశ్రమంలో ఉంటున్న కోల్క తాకు చెందిన ఓ యువతి విచారణలో తనకు మత్తు మందు ఇచ్చి రాత్రిళ్లు లైంగిక దాడికి పాల్పడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల అదుపులో ఆశ్రమ సిబ్బంది ఆశ్రమం సీజ్..? ఆశ్రమంలో ఉన్న రికార్డుల ఆధారంగా బాధిత కుటుంబాలకు సమాచారం అందించారు. కొందరు వచ్చి తమ వారిని వెంట బెట్టుకెళ్లారు. మరి కొందరి బంధువులు రాకపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సెంజి డీఎస్పీ ప్రియదర్శిని నేతృత్వంలోని బృందం దృష్టి సారించింది. కలెక్టర్ పళణి ఆదేశాల మేరకు ఆశ్రమాన్ని సీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ ఆశ్రమంలోని మానసిక రోగులు, అనాథలను పొలీసు సంరక్షణలో ఉంచారు. ఈ ఆశ్రమానికి అనుబంధం ఉన్న మరో భవనంలో 27 మంది మానసిక రోగులను నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లతో ఉంచడం అనుమానాలకు తావిస్తోంది. వీరంతా తమకు వైద్య పరీక్షలు నిర్వహించారని చెప్పడంతో అవయవాల విక్రయం కోసమే ఇదంతా చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఆశ్రమం నుంచి 14 మంది అదృశ్యం అయినట్లు తేలింది. వీరి సమాచారంపై ఆందోళన నెలకొంది. విచారణ జరుపుతున్న పోలీసులు అలాగే ఇక్కడి అనాథలు, మానసిక రోగుల అవయవాలను ప్రైవేటు ఆసుపత్రులకు అమ్ముకుంటున్నారనే అంశానికి సంబంధించిన రికార్డులు బయటపడినట్లు కూడా ప్రచారం సాగుతోంది. బాధితుడు జబరుల్లాను ఆశ్రమ నిర్వాహకులు బెంగళూరుకు పంపించడంతో అక్కడి ఆసుపత్రులతో ఈ ఆశ్రమానికి ఉండే సంబంధాలపై ఆరా తీస్తున్నారు. సోదాలు...రక్షింపు.. బుధవారం రాత్రి పోలీసులు, రెవెన్యూ, వైద్యాధికారులు ఆశ్రమంలో పెద్దఎత్తున సోదాలు చేశారు. ఇక్కడ మొత్తం 150 మంది మానసిక రోగులు, 27 మంది అనాథలు ఉన్నట్లు తేలింది. అయితే అనేక మంది మహిళలు తమకు రాత్రుల్లో మత్తు మందు ఇస్తున్నారని, తమపై కొందరు లైంగిక దాడి చేస్తున్నారని పోలీసుల ఎదుట వాపోయారు. దీంతో ఆశ్రమ నిర్వాహకులను అరెస్టు చేయడానికి రంగం సిద్ధమైంది. ఈ సమాచారంతో జుబీన్, ఆయన భార్య మరియా అనారోగ్యం బారిన పడ్డామంటూ విల్లుపురం ముండియం బాక్కం ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. దీంతో పోలీసులు ఆశ్రమ మేనేజర్ కేరళకు చెందిన విజయ మోహన్(46), సిబ్బంది అయ్యప్పన్, గోపీనాథ్, ముత్తమారితో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. వీరిపై 13 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిర్వాహకులు జుబీన్, ఆయన భార్య మరియా ఆరోగ్యంగానే ఉన్నట్టు వైద్యులు తేల్చడంతో గురువారం అరెస్టు చేశారు. -
తమిళనాడులో విషాదం.. వరకట్న వేధింపులతో..
సాక్షి, చెన్నై: వరకట్న వేధింపులు తాళలేక బిడ్డతో కలిసి తల్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన శుక్రవారం తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాలు.. విల్లుపురం జిల్లా సెంజి సమీపంలోని కడకల్ తోపుకు చెందిన లాలూ బాషా కుమార్తె ఫిర్దోస్ (22)కు తిరువణ్ణామలై జిల్లా కిలిపెన్నత్తూరుకు చెందిన అబ్దుల్లా(25)తో గతేడాది ఫిబ్రవరి 14న వివాహం జరిగింది. తిరువణ్ణామలైలోని ఓ దుకాణంలో అబ్దుల్లా పనిచేస్తున్నాడు. ఫిర్దోస్ గర్భం దాల్చడంతో ప్రసవం కోసం పుట్టింటికి వచ్చింది. 50 రోజుల క్రితం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పాపకు హయాన అని పేరు పెట్టారు. ఈ నెల 2వ తేదీ బిడ్డతో కలిసి ఆవూరులోని భర్త ఇంటికి వెళ్లింది. అనంతరం ఈ నెల 17న తల్లి ఇంటికి తిరిగి వచ్చింది. శుక్రవారం సాయంత్రం ఫిర్దోస్, చిన్నారి కనిపించకుండాపోయారు. తల్లిదండ్రులు చుట్టుపక్కల గాలించారు. రాత్రి 10 గంటలకు వ్యవసాయ బావిలో చిన్నారి శవమై తేలడాన్ని ఆ ప్రాంత వాసులు గుర్తించి ఫిర్దోస్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు. సెంజి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రియదర్శిని, ఇన్స్పెక్టర్ తంగం, సబ్ ఇన్స్పెక్టర్ శంకర సుబ్రమణ్యం, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అబ్దుల్లా వరకట్నం తేవాలని వేధించేవాడని తెలిసింది. వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుని ఉంటుందని ప్రాథమికంగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ముండియంబాక్కం ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి అబ్దుల్లాని అరెస్టు చేశారు. -
కులం పేరుతో అవమానం.. ఖండించిన కమల్ హాసన్
చెన్నై: కులం పేరుతో అవమానించిన వ్యవహారం విల్లుపురంలో సంచలనం కలిగించిన ఘటనపై జిల్లా కలెక్టర్ విచారణ జరిపారు. అనంతరం పోలీసులు 50 మందిపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. తిరువెన్నైనల్లూరు సమీపంలోని ఒట్టందల్ గ్రామంలో రెండు కులాలకు చెందిన నివాసప్రాంతాలున్నాయి. శుక్రవారం ఒక కులం ప్రజలు ఉంటున్న ప్రాంత ఆలయంలో ఉత్సవాలు జరిగాయి. కరోనా లాక్‌డౌన్‌ను మీరి ఉత్సవాలకు ఏర్పాటు చేయడంతో మరో వర్గానికి చెందిన యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో తిరువెన్నైనల్లూరు పోలీసులు ఆలయం వద్దకు వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. తమకు సమాచారం తెలిపిన యువకుడి గురించి ఉత్సవ నిర్వాహకులకు తెలిపారు. దీంతో ఇరువర్గాల మధ్య గొడవలు జరిగాయి. దీనికి సంబంధించిన ఊరి పంచాయతీలో ఆలయ ఉత్సవ నిర్వాహకులు ముగ్గురిని మరో వర్గం కాళ్లకు మొక్కింపజేసి అవమానపరిచింది. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో సంచలనం ఏర్పడింది. దీనిగురించి విల్లుపురం జిల్లా కలెక్టర్ అన్నాదురై, ఎస్పీ రాధాకృష్ణన్ ఒట్టందల్ గ్రామానికి నేరుగా వెళ్లి విచారణ జరిపారు. ఇరువర్గాలపై తిరువెన్నైనల్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. మొదటగా ఎనిమిది మందిపై కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేశారు. ఆ తర్వాత ఉత్సవాలు నిర్వహించిన 50 మందిపైనా కేసు నమోదైంది. ఈ సంఘటనను సినీనటుడు కమల్ హాసన్ తీవ్రంగా ఖండించారు. చదవండి: ఇండియన్–2 షూటింగ్ ఆలస్యానికి కారణం లైకా సంస్థే: శంకర్ -
రూ.2 కోట్ల విలువైన వజ్రాల నగల అపహరణ..
సాక్షి ప్రతినిధి, చెన్నై: విల్లుపురం పట్టణానికి చెందిన కరుణానిధి (45) తన తాత మలేషియా నుంచి తెచ్చిన వద్ద రూ.2 కోట్ల విలువైన వజ్రాల నగలున్నాయని చెబుతూ వాటి విక్రయానికి సిద్ధమయ్యాడు. తన ఇంటికి రంగులు వేసేందుకు వచ్చిన శివ అనే యువకునితో నగలు కొనుగోలు చేసేవారు ఎవరైనా ఉంటే చెప్పమని కోరాడు. చెన్నైలో తనకు తెలిసిన ఇద్దరు ఉన్నారని, వారి ద్వారా అమ్మవచ్చని శివ నమ్మబలికాడు. చెన్నై సాలిగ్రామానికి చెందిన అరుళ్ మురుగన్ (55), వడపళినికి చెందిన సెంథిల్ (44)లను తీసుకెళ్లి కరుణానిధికి పరిచయం చేశాడు. చెన్నై నుంచి ఇద్దరు వ్యక్తులు వస్తున్నారని, నగలు దిండివనం తీసుకురమ్మని కరుణానిధికి చెప్పారు. దీంతో కరుణానిధి స్నేహితుడు రావణన్‌ను వెంట బెట్టుకుని కారులో దిండివనం చేరుకున్నాడు. అరుళ్ మురుగన్, సెంథిల్ మార్గమధ్యంలో కారును ఆపి నగలు కొనేవారు తీవనూరులో ఉన్నారని మళ్లించారు. ఎదురుగా మరోకారులో ఐదుగురు వచ్చి కరుణానిధి కళ్లలో కారంపొడి చల్లి నగలు ఎత్తుకెళ్లారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
దయచేసి ఎవరూ ఇలా చేయకండి
-
దయచేసి ఎవరూ ఇలా చేయకండి..
చెన్నై: తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. లాటరీ విషయంలో మోసపోయిన ఓ కుటుంబం గురువారం ఆత్మహత్యకు పాల్పడింది. తమ చావుకు ఆర్థిక ఇబ్బందులే కారణమని ఓ వీడియో తీసిమరీ తనువు చాలించారు. తమిళనాడులోని విల్లుపురంలో ఈ దారుణం చోటుచేసుకుంది. వివరాలు.. సితేరికరై ప్రాంతంలో నివసిస్తున్న అరుణ్(33) వ్యాపారం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తాజాగా వ్యాపారంలో నష్టం రావడంతో అధిక సొమ్ము వెచ్చించి.. అక్రమంగా నిర్వహిస్తున్న లాటరీకి సంబంధించిన టికెట్లు కొనుగోలు చేశాడు. కాగా లాటరీ విషయంలో కూడా మోసపోవడంతో చివరికి కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముందుగా తమ ముగ్గురు పిల్లలకు సైనేడ్ ఇచ్చి... అనంతరం భార్య, భర్తలిద్దరూ కూడా చనిపోయారు. చనిపోయే ముందు అరుణ్ తీసిన వీడియో అందరిని కంటతడి పెట్టిస్తోంది. వీడియోలో.. ‘‘లాటరీ టిక్కెట్లు కొనడం వల్ల అప్పులపాలయ్యాను. సమాజంలో న్యాయం, చట్టం ఏవీ లేవు. నా ముగ్గురు పిల్లలకు విష గుళికలు ఇచ్చాను. నా కూతుళ్లు నా కళ్ల ఎదుటే చనిపోయారు. కాసేపట్లో మేము కూడా విషం తీసుకోనున్నాం. మేము బతికి ఉండాలని కోరుకోవడం లేదు. మాకోసం ఎవరూ ఏం చేయకండి. మేము ఎవరికి భారం కావాలని అనుకోవడం లేదు. మీరైనా సంతోషంగా జీవించండి. మాలాగా అవ్వకండి. అలాగే అక్రమంగా జరిగే లాటరీ అమ్మకాలను నిషేధించాలని తమిళనాడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. అలా చేయడం వల్ల మాలాంటి అనేక మంది ఇలాంటి అప్పుల బాధ నుంచి తప్పించుకోగలరు’’ అని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ వీడియోను చనిపోయే కొన్ని క్షణాల ముందు తన స్నేహితులకు వాట్సాప్ చేయగా.. వీడియో చూసిన స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునేలోపు కుటుంబంలోని అయిదుగురు (అరుణ్, భార్య శివగామి, కూతుళ్లు.. ప్రియదర్శిని, యువశ్రీ, భారతి) అప్పటికే మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం విల్లుపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానికులను పోలీసులు విచారించగా అరుణ్‌కు దాదాపు రూ. 30 లక్షల వరకు అప్పులు ఉన్నాయని తేలింది. ఇక వీరి మరణంతో రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ లాటరీ అమ్మకాల విషయం వెలుగులోకి వచ్చింది. కాగా ఈ ఏడాది రాష్ట్రంలో 200 కంటే ఎక్కువ అక్రమ లాటరీ కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. -
జైన సన్యాసిని జీవసమాధి
టీ.నగర్(తమిళనాడు): ఏడు రోజులపాటు సల్లేఖన వ్రతం చేపట్టిన 65 ఏళ్ల జైన సన్యాసిని శుక్రవారం జీవసమాధి పొందారు. ఈ ఘటన తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో చోటుచేసుకుంది. సల్లేఖన వ్రతంలో భాగంగా జైనులు క్రమంగా ఆహర స్వీకరణ తగ్గించి, చివరకు అన్నపానీయాల పూర్తిగా మానివేసి ప్రాణాలు విడుస్తారు. జైన సాంప్రదాయంలో ఈ వ్రతానికి చాలా ప్రాధాన్యత ఉంది. కర్ణాటక రాష్ట్రం హవారి ప్రాంతానికి చెందిన శ్రీ సుబ్రబావుమతి 2012 సంవత్సరంలో కుటుంబ జీవనాన్ని విడనాడి సన్యాసం చేపట్టారు. తర్వాత మాతాజీగా దీక్ష పొంది శ్రీసుబ్రబావుమతి మాతాజీగా వ్యవహరించబడ్డారు. పలు ప్రాంతాల్లో ఉన్న జైన ఆలయాలకు వెళ్లి పూజలు నిర్వహించిన ఈమె జైనుల ప్రధాన కేంద్రమైన మేల్‌సిత్తామూరులోని మఠంలో సల్లేఖన వ్రతం చేపట్టి జీవసమాధి పొందేందుకు నిర్ణయించారు. దీంతో ఒకటిన్నర నెల క్రితం మాతాజి ఇద్దరు దిగంబరస్వాములు, 9 మంది మాతాజీల తో విల్లుపురం జిల్లా సెంజి సమీపంలోగల మేల సిత్తామూరు మఠం చేరుకున్నారు. ఈమె ఏప్రిల్ 27నుంచి ఆహారం, నీరు సేవించకుండా శుక్ర వారం రాత్రి 8.50 గంటలకు జీవసమాధి పొందారు. మాతాజీ అంత్యక్రియలు శనివారం జరిగాయి. అనేక మంది భక్తులు పూలమాలలు, నెయ్యితో పూజలు నిర్వహించారు. -
ఐపీఎల్ చూసి వెళుతూ అనంత లోకాలకు..
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ చూసి తిరిగి వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. ఈ ఘటన తమిళనాడులోని విల్లుపురం జిల్లా చిన్నకుప్పం సమీపంలో శనివారం జరిగింది. తిరువారూరు జిల్లా మన్నార్‌కుడి తాలూకా వడవూరుకి చెందిన కన్నదాసన్ (42), సేలం జిల్లా ఏర్కాడుకు చెందిన మహాలింగం (32), అరుణ్‌కుమార్ (35), బాలమురుగన్ (35), కేరళలోని పాలక్కాడు వాసులు సునీల్ (37), కృష్ణదాస్ (37), సతీష్ (28)లు తిరుప్పూరులోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. వీరు చెన్నైలో జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ చూసేందుకు శుక్రవారం తెల్లవారుజాము 2 గంటలకు కారులో బయలుదేరారు. సేలానికి చెందిన బాలమురుగన్ కారును నడిపాడు. రాత్రి ఐపీఎల్ మ్యాచ్ చూసి శనివారం తెల్లవారుజామున తిరుప్పూరుకు తిరుగు ప్రయాణమయ్యారు. ఉదయం 6 గంటల సమయంలో విల్లుపురం జిల్లా చిన్నసేలం సమీపంలో పెట్రోలు బంకు నుంచి రోడ్డుపైకి వచ్చిన లారీ వీరి కారుని ఢీకొంది. కారు ముందుభాగం నుజ్జునుజ్జుకాగా డ్రైవింగ్ సీటులో ఉన్న బాలమురుగన్‌తోపాటు అరుణ్‌కుమార్, సతీష్ అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రగాయాలైన నలుగురిని కల్లకురిచ్చి ప్రభుత్వాసుపత్రిలో స్థానికులు చేర్పించారు. వీరిలో కన్నదాసన్, కృష్ణదాస్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం సేలం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్, చిన్నసేలానికి చెందిన రమేష్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. -
రోడ్డు ప్రమాదంలో ఎంపీ దుర్మరణం
సాక్షి, చెన్నై : ఏఐఏడీఎంకే ఎంపీ రాజేంద్రన్ (62) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. శనివారం ఉదయం ఆయన ప్రయాణిస్తున్న వాహనం విల్లుపురం జిల్లా దిండివనమ్ సమీపంలో ప్రమాదానికి గురైంది. వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొనటంతో ఎంపీ అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదానికి అతి వేగమే కారణంగా తెలుస్తోంది. మరోవైపు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా రాజేంద్రన్ 2014 లోక్‌సభ ఎన్నికల్లో విల్లుపురం నుంచి ఎన్నికయ్యారు. ఎంపీ మృతి పట్ల ఏఐఏడీఎంకే పార్టీ దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. రాజేంద్రన్ కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపింది. -
రైలింజన్ పైకెక్కి నిరసన.. ఊహించని షాక్!
సాక్షి, చెన్నై: కావేరీ మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలంటూ తమిళనాడు వ్యాప్తంగా బుధవారం చేపట్టిన నిరసన కార్యక్రమాలతో జనజీవనం దాదాపు స్తంభించింది. కడలూర్, ధర్మపురి, మెట్టూరు, విల్లుపురం ప్రాంతాల్లోనైతే ఆందోళనలు హోరెత్తాయి. బోర్డు ఏర్పాటుచేయమని సుప్రీంకోర్టు చెప్పినా వినిపించుకోకుండా మోదీ సర్కార్ ఒంటెత్తుపోకడ పోతున్నదని తమిళపార్టీలు ఆరోపించాయి. కేంద్ర మాజీ మంత్రి అన్బుమణి రాందాస్ నేతృత్వంలోని పీఎంకే పార్టీ రైల్‌రోకోకు పిలుపివ్వగా, ప్రధాన ప్రతిపక్షం డీఎంకే మద్దతు తెలిపింది. ఈ రెండు పార్టీలకుతోడు వందలాది సంఘాలు, వేల మంది రైతులు నిరసనల్లో పాల్గొన్నారు. ఊహించని షాక్: రైల్‌రోకో ఆందోళనలో భాగంగా పీఎంకే కార్యకర్త ఒకరు ఆగిఉన్న రైలింజన్ పైకి ఎక్కి నిరసన తెలుపుతుండగా, ఊహించని కరెంట్ షాక్ తగిలి, మంటలు అంటుకున్నాయి. విల్లుపురం జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన తాలూకు వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయింది. షాక్‌కు గురైన వ్యక్తి పేరు రంజిత్(32)గా గుర్తించారు. హైవోల్టేజ్ ధాటికి అతను మాడి మసైపోయాడని తొలుత వార్తలు వచ్చినా, అది నిజం కాదని వైద్యులు పేర్కొన్నారు. ‘‘హైటెన్షన్ వైర్లను అతను ముట్టుకోలేదు. కానీ అత్యంత సమీపానికి వెళ్లడంతో ఒక్కసారే షాక్ కొట్టి, మంటలు చెలరేగాయి. ఒక మోస్తారుకు మించి బాధితుడు గాయపడ్డాడని, ప్రాణాపాయం లేనప్పటికీ, కోలుకోవడానికి సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. -
తమిళనాడు రైల్‌రోకో ఆందోళనలో ఊహించని ఘటన
-
ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి
సాక్షి, చెన్నై : తమిళనాడు రోడ్డు మరోసారి నెత్తురొడింది. ఆదివారం ఉదయం విలుపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఉలుందుర్‌పెట్ మండలం ఉలుందుర్పెట్టై పట్టణ పంచాయితీ సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
9 నిమ్మకాయలు 68 వేల రూపాయలు!
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులోని మురుగన్ ఆలయంలో నిర్వహించిన వేలం పాటలో 9 నిమ్మకాయలు రూ. 68,100 పలికాయి. విల్లుపురం జిల్లా ఒట్టనందల్ గ్రామంలోని పురాతన రత్నవేల్ మురుగన్ ఆలయంలో ఏటా 10 రోజుల పాటు కావడి ఉత్సవాలను నిర్వహిస్తారు. 11వ రోజు అర్ధరాత్రి ముగింపు కార్యక్రమంలో పది రోజుల పాటు మురుగన్ వద్ద శూలానికి గుచ్చి ఉంచే 9 నిమ్మకాయలను వేలం వేస్తారు. మంగళవారం జరిగిన ఈ వేలం పాటలో తొలి నిమ్మకాయను రూ. 27 వేలకు ఓ భక్తుడు కొన్నాడు. 2, 3 నిమ్మకాయలు రూ.6 వేలు, నాలుగోది రూ.5,800, ఐదోది రూ.6,300, ఆరోది రూ. 5 వేలు, 7వది రూ. 5,600, ఎనిమిదోది రూ. 3,700, తొమ్మిదోది రూ. 2,700లకు కొనుగోలు చేశారు. ఈ నిమ్మకాయను దక్కించుకున్న వ్యక్తి భార్య మరుసటి రోజు గింజలతో తిన్నట్లయితే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. -
అత్యాచారం..హత్య : మైనర్ అరెస్ట్
చెన్నై: విల్లుపురం సమీపంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనకు సంబంధించి కేసును పోలీసులు ఛేదించారు. తమిళనాడులోని విల్లుపురం సమీప ప్రాంతానికి చెందిన రైతు నటేషన్ (48)కు కుమార్తె జీవిత (18) ఉంది. సేలంలో ఉన్న ప్రైవేటు పాఠశాలలో నర్సింగ్ చేస్తోంది. సంక్రాంతి సెలవుల కోసం సొంతూరుకు వచ్చిన జీవిత 19వ తేదీన ఇంట్లో గాయాలతో అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులకు అదే ప్రాంతానికి చెందిన కేటరింగ్ కళాశాల విద్యార్థి, జీవితను హత్య చేసినట్టు తెలిసింది. దీంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. 'జనవరి 19వ తేదీన జీవిత ఇంటికి వెళ్లాను. ఒంటరిగా ఉండడంతో ఆమెపై బలాత్కారం చేయడానికి ప్రయత్నించాను. అందుకు ఆమె తిరస్కరించడంతో గొంతును గట్టిగా పట్టుకున్నాను. అదే సమయంలో అమె స్పృహ తప్పి పడిపోయింది. ఆమెపై అత్యాచారం చేసి అక్కడి నుంచి పారిపోయా' అని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో విద్యార్థి పేర్కొన్నాడు. ఆ తర్వాత ఆమె మృతి చెందినట్టు తెలిసిందని నిందితుడు పోలీసులకు తెలిపాడు. అరెస్టు చేసిన బాలుడిని విల్లుపురం కోర్టులో హాజరు పరచి సెంజి జువైనల్ హోమ్‌కి తరలించారు. -
రౌడీషీటర్ దారుణ హత్య
కేకే.నగర్: విల్లుపురంలో రౌడీషీటర్ దారుణహత్యకు గురి కాగా, చె న్నైలో అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతదేహం లభ్యమైంది. వివరాలు.. విల్లుపురం జిల్లాలో మంగళవారం బాంబుతో దాడి జరిపి రౌడీని వేటకత్తులతో దారుణంగా హత్య చేసిన సంఘటన సంచలనం కలిగించింది. విల్లుపురం జిల్లా వానూర్ తాలూకా కుయిలాపాళయం శక్తికోవిల్ వీధికి చెందిన జనార్ధనన్(23) రౌడీషీటర్‌గా చలామణి అవుతున్నాడు. ఇతనిపై హత్య, కిడ్నాప్ వంటి పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. జనార్ధనన్ అనుచరులకు, మరొక రౌడీ రాజ్‌కుమార్ అనుచరులకు మధ్య తరచూ ఘర్షణలు జరిగేవి. ఈ ఘర్షణల్లో ఇరు వర్గాలకు చెందిన కొందరు హత్యకు గురయ్యారు. ఈ నేపథ్యంలో తిరుకోవిలూర్ ప్రాంతానికి చెందిన చెల్లపాండి అనే ఉపాధ్యాయుడిని కిడ్నాప్ కేసుపై విచారణ విల్లుపురం జిల్లా సెషన్స్ న్యాయస్థానంలో మగళవారం ఉదయం జరిగింది. ఈ కేసులో రౌడీ జనార్ధనన్, సురేష్‌లు హాజరయ్యారు. కేసు విచారణ అనంతరం జనార్ధనన్, సురేష్ ద్విచక్ర వాహనాలపై పుదుచ్చేరికి వెళుతున్నారు. ఆ సమయంలో ఐదు మందికి పైగా వ్యక్తులు మోటారు బైకుపై వారిని వెంబడించారు. రైల్వే వంతెనపై వెళుతుండగా వారిపై నాటు బాంబులను విసిరారు. దీనితో వారు అదుపుతప్పి కింద పడ్డారు. సురేష్ స్పల్ప గాయాలతో తప్పించుకుని పారిపోగా జనార్ధనన్‌పై ఆ ముఠా కత్తులతో దాడి చేసి హత్య చేశారు. వెంటనే ఆ ముఠా బైకులపై పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని జనార్ధనన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ముండియపాక్కం ప్రభుత్వాసుపత్రికి పంపారు. పరారీలో ఉన్న హంతకుల కోసం గాలిస్తున్నారు. అనుమానాస్పద స్థితిలో మృతదేహం లభ్యం : పల్లికరనై సమీపంలోని కోవిలంపాక్కం, తుైరె పాక్కం- పల్లావరం రేడియల్ రోడ్డుపై టాస్మాక్ దుకాణం ఉంది. ఈ దుకాణం సమీపంలోని చెట్టుకు 40 ఏళ్ల వ్యక్తి మృతదేహం వేలాడుతూ కనిపించింది. అతని శరీరంపై గాయాలు ఉన్నాయి. దీనిపై సమాచారం అందుకున్న పల్లికరనై పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. మృతుడి వివరాలు తెలియరాలేదు. మద్యం మత్తులో ఏర్పడిన తగాదాలో అతడిని హత్య చేసి చెట్టుకు వేలాడదీశారా? లేక పాతకక్షలు కారణమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
విశాఖ–విల్లుపురం మధ్య సువిధ రైళ్లు
సాక్షి, విశాఖపట్నం : ప్రయాణికుల రద్దీని దష్టిలో ఉంచుకుని తూర్పు కోస్తా రైల్వే విశాఖపట్నం–విల్లుపురంల మధ్య సువిధ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపనుంది. అక్టోబర్ 3 నుంచి నవంబరు 15 వరకు వారానికి మూడుసార్లు చొప్పున తిరగనున్నాయి. రైలు నంబర్ 82853తో అక్టోబర్ 3 నుంచి నవంబర్ 11 వరకు విశాఖ–విల్లుపురంల మధ్య సోమ, బుధ, శనివారాల్లో నడుస్తాయి. ఈ రైలు విశాఖలో రాత్రి 11 గంటలకు బయలుదేరి మర్నాడు మధ్యాహ్నం 3.30 గంటలకు విల్లుపురం చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో 82854 నంబరుతో విల్లుపురం–విశాఖపట్నంల మధ్య మంగళ, గురు, ఆదివారాల్లో అక్టోబరు 4 నుంచి ఈ సువిధ రైళ్లు బయలుదేరతాయి. అక్టోబరు 4 నుంచి 15 వరకు రాత్రి 8.30కి బయలుదేరి మర్నాడు సాయంత్రం 3.15కి విశాఖ వస్తుంది. ఈ రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, సూళ్లూరుపేట, చెన్నై ఎగ్మోర్, తాంబరం, చెంగల్పట్టు స్టేషన్లలో ఆగుతాయి. ఈ సువిధ రైలుకు సెకండ్ ఏసీ–1, థర్డ్ ఏసీ–3, స్లీపర్–7, సాధారణ భోగీలు–4, లగేజీ–2 వెరసి 16 బోగీలు ఉంటాయి. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని వాల్తేరు డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎం.ఎల్వేందర్ యాదవ్ కోరారు. -
సమగ్ర విచారణ
* సీఎం ఆదేశంతో ఉరకలు * రంగంలోకి రెండు బృందాలు * న్యాయ విచారణకు పార్టీల ఒత్తిడి * నేడు కోర్టులో విచారణ * విద్యార్థినుల లేఖలో మనోవేదన సాక్షి, చెన్నై: విల్లుపురం సమీపంలోని ఎస్బీఎస్ సిద్ధ వైద్య కళాశాల విద్యార్థినుల మృతి మిస్టరీ తేల్చేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. సమగ్ర విచారణకు సీఎం జయలలిత ఆదేశించడంతో పోలీసు యంత్రాంగం ఉరుకలు పరుగులతో దర్యాప్తును వేగవంతం చేసింది. మరణించిన విద్యార్థులు రాసినట్టుగా పేర్కొనబడుతున్న లేఖలో వారు ఎదుర్కొన్న తీవ్ర ఆవేదన గురించి వివరించబడి ఉండడంతో అక్కడి విద్యార్థులు ఏ మేరకు కష్టాలు పడుతున్నారో స్పష్టం అవుతోంది.విల్లుపురం సమీపంలోని కళ్లకురిచ్చి వద్ద ఉన్న ఎస్వీఎస్ వైద్య కళాశాలకు చెందిన మోనీషా, ప్రియాంక, శరణ్య అనుమానాస్పద స్థితి లో మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై న్యాయ విచారణకు ప్రతి పక్షా లు, ప్రజా సంఘాలు, విద్యార్థి లోకం డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. శరణ్య, ప్రియాంక కుటుంబాలు అధికారుల బుజ్జగింపులకు తలొగ్గాయి. ఆ ఇద్దరు మృత దేహాల్ని తీసుకుని అంత్యక్రియలు సైతం పూర్తి చేశారు. అయితే, మోనీషా మృత దేహం మాత్రం ఇంకా మార్చురీలోనే ఉంది. ఇందుకు కారణం ఆమె తండ్రి తమిళరసన్ కోర్టును ఆశ్రయించి ఉండడమే. బుధవారం ఈ కేసు విచారణ హైకోర్టులో జరగనుంది. ఈ వ్యవహారంపై కోర్టు ఏ విధంగా స్పందించనున్నదో అన్న ఉత్కంఠ బయలు దేరి ఉంది. ఈ సమయంలో సీఎం జయలలిత ఈ కేసుపై తీవ్రంగా స్పం దించి ఉన్నారు. సమగ్ర విచారణను త్వరితగతిన చేపట్టాలని ఆదేశించడంతో పాటుగా, మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు తలా రూ.లక్ష చొప్పున ప్రకటించా రు. సీఎం జయలలిత సమగ్ర విచారణకు ఆదేశించడంతో ఆ జిల్లా ఎస్పీ దేవేంద్రనాయర్ అధికారులతో సమాలోచించారు. రెండు ప్రత్యేక బృందాల్ని రంగంలోకి దించారు. డిప్యూటీ సూపరింటెండెంట్ మదివానన్ నేతృత్వంలో ఇద్దరు ఇన్స్పెక్టర్లు, నలుగురు సబ్ ఇన్స్పెక్టర్లు, 12 మంది పోలీసులతో ఓ బృందం, ఇన్స్పెక్టర్ కుమార్ నేతృత్వంలో మరో బృందం రంగంలోకి దిగింది. ఈ రెండు బృందాల్లో 28 మంది సిబ్బం దిని నియమించారు. ఈ బృందాలు ఆగమేఘాలపై మంగళవారం పలు కోణాల్లో దర్యాప్తు సాగించాయి. బుధవారం కోర్టుకు నివేదిక సమర్పించాల్సి ఉండడంతో అందుకు తగ్గ కసరత్తుల్ని సైతం వేగవంతం చేసి ఉన్నారు. ఆ విద్యార్థినులు రాసినట్టుగా పేర్కొన బడుతున్న లేఖను మీడియాకు విడుదల చేశారు. అందులో ఆ విద్యార్థినులు నానా ఇబ్బందులకు గురి కాబడ్డట్టు పేర్కొన బడి ఉన్నది. అక్కడ చదువుకుంటున్న విద్యార్థినుల ద్వారా మరుగు దొడ్లు కడిగించడం, కళాశాల పరి సరాల్ని శుభ్రం చేయించడం, వంట చేయించడం వంటి చర్యలతో పాటుగా తాము ఎదుర్కొన్న చీవాట్లను అందులో వివరించి ఉన్నారు. అలాగే లక్షలాది రూపాయల్ని దండుకోవడమే కాకుండా మేనేజర్ వెంకటేష్ విద్యార్థినులతో అసభ్యకరంగా వ్యవహరించడం, కరస్పాండెంట్ వాసుకీ నోటికి వచ్చినట్టు అసభ్య పదజాలాలతో దూషించడం వంటి వ్యవహారాలను ఆలేఖలో వివరించ బడి ఉండడం బట్టి చూస్తే, విద్య పేరుతో విద్యార్థినులు అక్కడ ఎన్నికష్టాలు పడుతున్నారో స్పష్టమవుతోంది. తమ మరణం తర్వాతైనా ఈ కళాశాలపై చర్యలు తీసుకోండని, ఇన్నాళ్లు ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకున్న వాళ్లు లేరని, ఇక తప్పకుండా తమ కళాశాల వైపు అందరూ పరుగులు తీస్తారని, వీరందరూ శిక్షించబడాలని ఆ లేఖను ముగించి ఉంది. అందులోని కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేసి ఉన్నారు. మేనేజర్ వెంకటేష్ ఓ సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయంగా చలామణి కావడమే కాకుండా, విద్యార్థినులను లైంగిక వేధింపులకు సైతం గురి చేసినట్టుగా వచ్చిన సంకేతాలతో అతడి కోసం వేట తీవ్రతరమైంది. అయితే పోలీసుల విచారణతో ఒరిగేది శూన్యమేనని, న్యాయ విచారణకు ఆదేశించాలని డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్, ఎంపీ కనిమొళి, టీఎన్‌సీసీ నేత ఈవీకేఎస్ ఇళంగోవన్, పీఎంకే నేత రాందాసు డిమాండ్ చేస్తున్నారు. తమ పార్టీ వర్గాల నేతృత్వంలో అక్కడి వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకునేందుకు నిజ నిర్ధారణ కమిటీని బీజేపీ రంగంలోకి దించింది. ఇదిలా ఉండగా, దర్యాప్తు వేగం పెరగడంతో, పోలీసులకు చిక్కకుండా తమ న్యాయవాదుల ద్వారా కోర్టుల్లో లొంగిపోయేందుకు కరస్పాండెంట్ వాసుకీ, చైర్మన్ సుబ్రమణ్యన్, మేనేజర్ వెంకటేష్ ప్రయత్నాలు వేగవంతం చేసినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. -
భారీ జన సమీకరణే లక్ష్యం
డీఎండీకే మహానాడుకు భారీ ఎత్తున జన సమీకరణ చేపట్టాలని నిర్ణయించింది. 50 లక్షల మందిని సమీకరించడం లక్ష్యంగా పార్టీ శ్రేణులు కసరత్తుల్లో పడ్డారు. ‘ఏకం అవుదాం... అవినీతిని నిర్మూలిద్దాం’ అనే నినాదాన్ని మహానాడు పేరుగా తీర్మానించారు. సరికొత్త హంగులతో కూడిన లోగోలను, ప్రజాకర్షణ నినాదాల పిలుపుతో కూడిన ఎస్ఎంఎస్లను ఆ పార్టీ విడుదల చేసింది. సాక్షి, చెన్నై:రాష్ట్రంలోని డీఎంకే, కేంద్రంలోని బీజేపీ, కాంగ్రెస్‌లు తన చుట్టూ పొత్తు కోసం తిరుగుతుండటంతో డీఎండీకే అధినేత విజయకాంత్ తన వ్యూహాలకు పదును పెట్టే పనిలో పడ్డారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తన సత్తాను అటు డీఎంకేకు ఇటు జాతీయ పార్టీలకు రుచి చూపించేందుకు నిర్ణయించారు. ఫిబ్రవరి రెండో తేదీ విల్లుపురం జిల్లా ఉలందరూ పేట వేదికగా భారీ మహానాడుకు పిలుపునిచ్చారు. 250 ఎకరాల స్థలాన్ని ఈ మహానాడుకు ఎంపిక చేశారు. భారీ వేదికతో పాటుగా యాభై లక్షల మందిని జనసమీకరించడం లక్ష్యంగా కసరత్తుల్లో పడ్డారు. సోమవారం ఆ పార్టీ కార్యాలయంలో ఇందుకు సంబంధించిన లోగోల ఆవిష్కరణ, ప్రజాకర్షణ నినాదాలతో కూడిన ప్రచార భేరికి శ్రీకారం చుట్టారు. ఏకమవుదాం: కోయంబేడులోని పార్టీ కార్యాలయంలో ఉదయం డీఎండీకే యువజన నేత సుదీష్, పార్టీ ఎమ్మెల్యేలు చంద్రకుమార్, పార్థసారథి, పార్థీబన్, అనగై మురుగేషన్ నేతృత్వంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. మహానాడు వేదికపై ఏర్పాటు చేయనున్న కటౌట్ నమూనాను సుదీష్ విడుదల చేశారు. ఏకం అవుదాం...అవినీతిని నిర్మూలిద్దాం నినాదాన్ని మహానాడుకు పేరుగా నామకరణం చేశారు. అశేష జన సమూహం నడుమ విజయకాంత్ ఉండే రీతిలో ఆ లోగో తీర్చిదిద్దారు. చూపుడు వేలు సంకేతంగా మరో లోగోను, కార్యకర్తలు ధరించాల్సిన రబ్బర్బ్యాండ్లను విడుదల చేశారు. సరికొత్తగా రూపొందించిన ఎస్ఎంఎస్ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అనంతరం నేతలు మీడియాతో మాట్లాడుతూ, మహానాడు వివరాల్ని వెల్లడించారు. యాభై లక్షలు లక్ష్యం రాష్ట్ర చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో తమ మహానాడుకు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఉలందరూ పేటలో 250 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశామని వివరించారు. యాభై లక్షల మంది ఈ మహానాడుకు హాజరు కాబోతున్నారన్నారు. ఇతర రాష్ట్రాల్లోని అభిమానులు, కార్యకర్తలు, నాయకులు రైళ్లలోను, విదేశాల్లో ఉన్న నాయకులు విమానాల్లోను ఇక్కడికి రాబోతున్నారని వివరించారు. అవినీతికి వ్యతిరేకంగా రాష్ట్రంలో పోరాడుతున్న ఏకైక పార్టీ డీఎండీకే మాత్రమేనన్నారు. అన్నాడీఎంకే గతంలో అవినీతి ఊబిలో కూరుకు పోయిన పార్టీ అని, వాళ్లల్లో మార్పు వచ్చిందని భావించిన తాము గత ఎన్నికల్లో కలసి పోటీ చేశామన్నారు. అయితే, వారిలో ఎలాంటి మార్పు రాలేదని, రాష్ట్రాన్ని దోచుకుంటుండడంతోనే, తాము ఆ కూటమి నుంచి బయటకు వచ్చామని స్పష్టం చేశారు. త్వరలో కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ పెను రాజకీయ మార్పు చోటుచేసుకోబోతోందన్నారు. లోగోలో ఉన్న చూపుడు వేలు సంకేతం ఎవర్ని సూచిస్తున్నట్టు..? అని విలేకరులు ప్రశ్నించగా, అసెంబ్లీలో తమ నేత విజయకాంత్ చూపుడు వేలు చూపించారన్న నెపంతో సస్పెండ్ చేశారని గుర్తు చేశారు. ఆ రోజు తమకు జరిగిన అన్యాయం, అసెంబ్లీలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు ప్రజల్లోకి తీసుకెళ్లడం లక్ష్యంగా చూపుడు వేలు లోగోను ప్రచారాస్త్రంగా నిర్ణయించామన్నారు.