సాక్షి ప్రతినిధి, చెన్నై: విల్లుపురం పట్టణానికి చెందిన కరుణానిధి (45) తన తాత మలేషియా నుంచి తెచ్చిన వద్ద రూ.2 కోట్ల విలువైన వజ్రాల నగలున్నాయని చెబుతూ వాటి విక్రయానికి సిద్ధమయ్యాడు. తన ఇంటికి రంగులు వేసేందుకు వచ్చిన శివ అనే యువకునితో నగలు కొనుగోలు చేసేవారు ఎవరైనా ఉంటే చెప్పమని కోరాడు. చెన్నైలో తనకు తెలిసిన ఇద్దరు ఉన్నారని, వారి ద్వారా అమ్మవచ్చని శివ నమ్మబలికాడు. చెన్నై సాలిగ్రామానికి చెందిన అరుళ్ మురుగన్ (55), వడపళినికి చెందిన సెంథిల్ (44)లను తీసుకెళ్లి కరుణానిధికి పరిచయం చేశాడు. చెన్నై నుంచి ఇద్దరు వ్యక్తులు వస్తున్నారని, నగలు దిండివనం తీసుకురమ్మని కరుణానిధికి చెప్పారు. దీంతో కరుణానిధి స్నేహితుడు రావణన్‌ను వెంట బెట్టుకుని కారులో దిండివనం చేరుకున్నాడు. అరుళ్ మురుగన్, సెంథిల్ మార్గమధ్యంలో కారును ఆపి నగలు కొనేవారు తీవనూరులో ఉన్నారని మళ్లించారు. ఎదురుగా మరోకారులో ఐదుగురు వచ్చి కరుణానిధి కళ్లలో కారంపొడి చల్లి నగలు ఎత్తుకెళ్లారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment