కొడుకు మృతిపై అనుమానం
తిరువళ్లూరు: తన కొడుకు మృతిపై అనుమానం ఉందని ఆరోపిస్తూ తల్లి కడంబత్తూరు పోలీసులకు పిర్యాదు చేసింది. తన కొడుకును భార్య ఆమె బంధువులే చంపేశారని ఆరోపించింది. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా కాట్టాన్‌కొలత్తూరు గ్రామానికి చెందిన పాల్‌రాజ్ కుమారుడు ప్రేమ్‌రాజ్(38). ఇతనికి చిట్రంబాక్కం గ్రామానికి చెందిన దీప అనే మహిళతో పదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు.
ఈ క్రమంలో భార్యభర్త మధ్య తరచూ మనస్పర్థలు రావడంతో దీప పుట్టింటికి వెళ్లిపోయింది. పెద్దల పంచాయితీతో ఇటీవల కాట్టాన్‌కొలత్తూరులోని ఇంటిని విక్రయించిన ప్రేమ్‌రాజ్ తన భార్య వద్దకు వెళ్ళినట్టు తెలుస్తోంది. అక్కడే భార్యభర్త కలిసి నివాసం వుంటున్న క్రమంలో అనుమానస్పద రీతిలో మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి తల్లి జ్యోతి కడంబత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కొడుకు మృతిలో అనుమానం వుందని, విచారణ జరిపి న్యాయం చేయాలని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment