
చెన్నై: వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయం సాధిస్తుందని కేంద్ర హోమంత్రి అమిత్‌షా జోస్యం చెప్పారు. ఇవాళ అమిత్ షా తమిళనాడులోని పలు జిల్లాల్లో బీజేపీ పార్టీ కార్యాలయాల్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా అమిత్ షా.. తమిళ రాజకీయాలు, అసెంబ్లీ ఎన్నికలు, డీఎంకేలో అవినీతి వంటి అంశాలపై మాట్లాడారు. తమిళనాడులో అవినీతిలో మాస్టర్స్ డిగ్రీ చేసిన అవినీతి పరులంతా ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) సభ్యత్వం తీసుకున్నారు. ఒకరు క్యాష్ ఫర్ జాబ్ స్కామ్, మనీ లాండరింగ్, ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమ ఆస్తుల కేసులు నమోదయ్యాయి.
నాకు కొన్ని సార్లు అనిపిస్తుంది అవినీతి పాల్పడే వారికి సభ్యత్వం ఇచ్చి డీఎంకే తన పార్టీలోకి చేర్చుకుంటుందేమోనని. తమిళనాడు డీఎంకే అధినేత, సీఎం ఎంకే స్టాలిన్, అతని కుమారుడు డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్‌లు రాష్ట్ర సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఆ ఇద్దరు నేతలు డీలిమిటేషన్‌పై సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ డీలిమిటేషన్‌పై ప్రధాని మోదీ స్పష్టం చేశారు.డీలిమిటేషన్ తర్వాత దక్షణాది రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానల సీట్లలో ఎలాంటి మార్పు ఉండబోదని.
అన్నీ అవాస్తవాలే
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రధాని మోదీపై ఆరోపణలు చేస్తున్నారు. కేంద్రం రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా అన్యాయం చేస్తోందని. ఆయన చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు. రాష్ట్రానికి నిధుల కేటాయింపులపై యూపీఏ, ఎన్డీయేలను పోల్ల్చి చూస్తే.. ఎన్డీయే ప్రభుత్వం తమిళనాడుకు ఎక్కువ మొత్తంలో నిధుల్ని కేటాయించింది. మోదీ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలలో తమిళనాడుకు రూ. 5 లక్షల కోట్ల రూపాయలు కేటాయించింది’ అని అమిత్ షా అన్నారు.
కూటమిదే అధికారం..
వచ్చే ఏడాది తమిళనాడులో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. కుటుంబ రాజకీయాలు, అవినీతి అంతమొందిస్తాం. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని రాష్ట్రం నుంచి పంపించేస్తాం’ అని అమిత్ షా స్పష్టం చేశారు.
దేశంలో జనగణన (Census) జరపాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రక్రియ అనంతరం లోక్‌సభ స్థానాల విభజన ప్రక్రియ ఉంటుందని సమాచారం. ఇప్పుడు ఇదే అంశాన్ని తమిళనాడు అధికార ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) అధినేత, సీఎం ఎంకే స్టాలిన్ వ్యతిరేకిస్తున్నారు. ఇదే అంశంపై చర్చించేందుకు మార్చి నెలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 40 పార్టీలకు ఆహ్వానించారు.
జన గణన ప్రక్రియ అనంతరం లోక్‌సభ స్థానాల విభజన ప్రక్రియ ఉండనుంది. అయితే, జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తీవ్రంగా నష్టపోయేది దక్షిణాది రాష్ట్రాలే అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై ఎంకే స్టాలిన్ ఆల్ పార్టీ మీటింగ్‌కు పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment