diamond jewellery
-
వజ్రాభరణాలు : షైనింగ్ పోకుండా ఉండాలంటే ఎలా? పాలిష్ చేయించొచ్చా?!
పండుగలు పెళ్లిళ్లలో అందమైన పట్టుచీరకు, డైమండ్ నగలు మరింత అందాన్ని తెస్తాయి. ఒకసారి వేసుకొని మర్చిపోయేవుకాదు డైమండ్ ఆభరణాలు అంటే. చాలా ఖరీదైనవి కూడా. ఎప్పటికి మన అందాన్నీ ఇనుమడింప చేసే డైమండ్ నగలు మెరుపు పోకుండా షైనింగ్ ఉండాలంటే ఏం చేయాలి? ఇవిగో టిప్స్ మీకోసం!స్నానం చేసేటప్పుడు డైమండ్ ఆర్నమెంట్స్‌ను తీయాలి. మైల్డ్ సోప్, మైల్డ్ షాంపూ అయితే ఫరవాలేదు. కానీ గాఢత ఉన్న సబ్బులు, షాంపూలతో స్నానం చేస్తే వాటిలోని రసాయనాల దుష్ప్రభావం ఆభరణాల మీద పడుతుంది.రోజువారీ ధరించే చెవి దిద్దులు, ఉంగరాలు, లాకెట్, బ్రేస్లెట్లు ఎక్కువగా సొల్యూషన్ బారిన పడుతుంటాయి. వాతావరణంలో సొల్యూషన్ కారణంగా ఆభరణాల్లో అమర్చిన డైమండ్ మీద మురికి పేరుకుంటుంది. జిడ్డుగా కూడా మారుతుంది. దాంతో డైమండ్ మెరుపు తగ్గుతుంది. వేడి నీటిలో లిక్విడ్ సోప్ నాలుగు చుక్కలు కలిపి అందులో ఆభరణాన్ని పది నిమిషాల సేపు నానపెట్టి ఆ తర్వాత మెత్తటి బ్రష్‌తో సున్నితంగా రుద్దాలి. సబ్బు అవశేషాలు ఆభరణం మీద మిగలకుండా శుభ్రమైన నీటిలో ముంచి కడగాలి. నీటిలో నుంచి తీసి మెత్తని నూలు వస్త్రం మీద పెట్టి మెల్లగా అద్దినట్లు తుడవాలి. బేకింగ్ సోడా మంచి క్లీనింగ్ ఎలిమెంట్. కానీ తక్కువ క్వాలిటీ డైమండ్ ఆభరణాలను శుభ్రం చేయడానికి బేకింగ్ సోడా వాడకూడదు. పైన చెప్పుకున్నవి కట్ డైమండ్స్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అన్‌కట్ డైమండ్స్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆభరణం తయారీలో అన్‌కట్ డైమండ్ వెనుక సిల్వర్ ఫాయిల్ అమరుస్తారు. వెండి వస్తువులు గాలి తగిలితే నల్లబడినట్లే అన్‌కట్ డైమండ్ ఆర్నమెంట్స్ కూడా అంచులు నల్లబడతాయి. వాటిని గాలి దూరని బాక్సులో భద్రపరచాలి.ఇటీవల వేడుకల్లో ఎయిర్‌కూలర్‌లో పెర్ఫ్యూమ్ కలుపుతున్నారు. వాటి ప్రభావంతో కూడా అన్‌కట్ డైమండ్ ఆర్నమెంట్స్ నల్లబడే ప్రమాదముంది. అన్‌కట్ డైమండ్ ఆర్నమెంట్ మెరుపు విషయంలో ఇంట్లో ఏ ప్రయత్నమూ చేయకూడదు. అవి చాలా డెలికేట్‌గా ఉంటాయి కాబట్టి ఆభరణాల తయారీ దారులతో పాలిష్ చేయించుకోవాలి.ఆభరణాలు పెట్టే ప్లాస్టిక్ బాక్సులకు ముఖమల్ క్లాత్‌ని గమ్‌తో అతికిస్తారు. డైమండ్ ఆర్నమెంట్స్‌ను బీరువాలో భద్రపరిచేటప్పుడు ఈ గమ్ బాక్సుల్లో పెట్టకూడదు. ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆ బాక్సు నుంచి తీసి మెత్తని తెల్లని క్లాత్ మీద అమర్చి భద్రపరుచుకోవాలి. -
పూరీలో తెరుచుకున్న.. రత్నభండార్
భువనేశ్వర్: అశేష భక్తజనం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచి్చంది. ఒడిశాలోని ప్రఖ్యాత పూరీ జగన్నాథ స్వామికి శతాబ్దాలుగా రాజులు, భక్తులు కానుకగా సమరి్పంచిన వజ్రాభరణాలు, వెండి, బంగారు నిల్వలను దాదాపు 46 ఏళ్ల తర్వాత తొలిసారిగా తనిఖీచేయనున్నారు. ఆభరణాలను తూకం వేసి, నాణ్యత లెక్కించి, అవసరమైతే మరమ్మతులు చేయనున్నారు. ఆలయంలోని రహస్య ఖజానా గది జీర్ణావస్థకు చేరిన నేపథ్యంలో గదికి మరమ్మతులు చేయనున్నారు. అంతవరకు అపారమైన ఖజానాను జాగ్రత్తగా వేరేచోట భద్రపరచనున్నారు. ప్రభుత్వ కమిటీ సభ్యులు ఆదివారం మధ్యాహ్నం ఆలయానికి చేరుకున్నారు. ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు చేసి ఖజానా యజమానులైన విమలా మాత, మహాలక్షీ ఆజ్ఞ తీసుకున్నారు. తర్వాత ఖజానాకు రక్షకుడైన లోకనాథ్ స్వామి అనుమతి తీసుకున్నారు. మధ్యాహ్నం 1.28 గంటలకు ఖజానా గది తలుపులు తెరిచారు. 11 మంది మాత్రమే సంప్రదాయ దుస్తుల్లో గదిలోకి వెళ్లారు. ఆభరణాలను లెక్కించకుండానే సాయంత్రం 5.20కి బయటికి వచ్చారు. తరలింపు మరో రోజున‘‘లోపలి గది తాళాలు తెరుచుకోకపోవడంతో వాటిని పగలగొట్టి తెరిచాం. ఆభరణాలు, విలువైన వస్తువులను తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్‌లోకి తరలించి సీల్ వేశాం. అన్నింటినీ ఒకే రోజు తరలించడం కష్టం. త్వరలో తేదీని నిర్ణయించి తరలింపు మొదలెడతాం. రిపేర్ల తర్వాత ఆభరణాలకు విలువ కట్టే పని మొదలుపెడతాం’ అని ఏఎస్ఐ శాఖ అధికారులు వెల్లడించారు. గదిలోని ఆభరణాలను తరలించేందుకు సిద్ధం చేసిన 4.5 అడుగుల పొడవు, 2.5 అడుగుల వెడల్పు, 2.5 అడుగుల లోతున్న పెద్ద టేకు చెక్కపెట్టెలను గది వద్దకు తెప్పించారు. గదిలో పాములేవీ లేవని తేలింది. -
అనంత్-రాధిక ప్రీ-వెడ్డింగ్ : పాక్ జీడీపీ, నీతా నగలపై సెటైర్లు
రిలయన్స్ అధినేత బిలియనీర్ ముఖేష్ అంబానీ, రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఇంటర్నెట్లో పెద్ద సంచలనంగా మారాయి. అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లి ఈ ఏడాది జూలై నిర్వహించేందుకు ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 1, 2, 3 తేదీల్లో ప్రీ వెడ్డింగ్ బాష్ అంగరంగ వైభంగా జరిగింది. పలువురు సెలబ్రిటీలు ఈ వేడుకల్లో సందడి చేశారు. అయితే ఈ సందర్బంగా అంబానీ కుటుంబం ఈ వేడుకులకు ఖర్చు పెట్టిన కోట్లాది రూపాయలపై పెద్ద చర్చ నడిచింది. ప్రీ వెడ్డింగ్ వేడుకలకే ఇంత హంగామా అని కొందరు, లక్షల కోట్లకు అధిపతి అయిన ముఖేష్ అంబానీ 12 వందల కోట్లు వెచ్చించడం పెద్ద ఖర్చే కాదని మరికొందరు వాదించారు. దీంతోపాటు వందల కోట్ల విలువ చేసే అంబానీ భార్య నీతా అంబానీ, పెద్ద కొడలు శ్లోకామెహతా, కుమార్తె ఇషా అంబానీ ధరించి డైమండ్ నగలు, కాబోయే వరుడు అనంత్ అంబానీ డైమండ్ వాచ్ గురించి ఇంటర్నెట్ తీవ్ర చర్చ నడిచింది. ఇదంతా ఒక ఎత్తయితే నీతా అంబానీ ధరించి రూ. 500-600 కోట్ల విలువైన డైమండ్ నెక్లెస్ వైరల్‌గా మారింది. పాకిస్తాన్ జీడీపీ కంటే నీతా అంబానీ డైమండ్ నెక్లెస్ ధరే ఎక్కువ అంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే ఇన్‌స్టాలో పలు పోస్ట్‌లు వైరల్‌గా, తాజాగా ఏఎన్ఐ షేర్ చేసిన వీడియోపై ఇదే కమెంట్లు కనిపించడం గమనార్హం. కాగా ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం పాకిస్తాన్ జీడీపీ దాదాపు 341 కోట్ల డాలర్లు (రూ. 28.23 లక్షల కోట్లు)గా ఉన్న సంగతి తెలిసిందే. Etched with the initials Anant Ambani and Radhika Merchant, Nita Ambani dons the world-famous handloom Kanchipuram saree designed by Swadesh and handcrafted by artisans. She was seen thanking the Jamnagar Reliance Parivar for their love and support during Anant and Radhika's… pic.twitter.com/YEOYdVOmjp — ANI (@ANI) March 7, 2024 -
ఐటీ సోదాల్లో రూ.102 కోట్ల సొత్తు స్వాధీనం
న్యూఢిల్లీ: కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న సోదాల్లో ఇప్పటి వరకు రూ.102 కోట్ల సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు సోమవారం ఆదాయ పన్ను(ఐటీ)శాఖ తెలిపింది. ఈ నెల 12వ తేదీ నుంచి బెంగళూరు సహా 55 ప్రాంతాల్లో దాడులు జరిపి లెక్కల్లో చూపని రూ.94 కోట్ల నగదుతోపాటు రూ.8 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలు, 30 ఖరీదైన విదేశీ తయారీ గడియారాలు కలిపి మొత్తం రూ.102 కోట్ల సొత్తును పట్టుకున్నామని వివరించింది. అక్రమ సొత్తుకు సంబంధించి డాక్యుమెంట్ల హార్డు కాపీ, డిజిటల్ డేటా తదితర సాక్ష్యాధారాలను కూడా చేజిక్కించుకున్నామని తెలిపింది. బోగస్ కొనుగోలు రసీదుల ద్వారా భారీగా పన్ను ఎగవేతకు గురైనట్లు కూడా గుర్తించామంది. -
లండన్‌లో సమంత.. ఆమె ధరించిన డైమండ్ జువెలరీ ఎన్ని కోట్లంటే?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో సమంత ఒకరు. ఇటీవలే ఆమె ప్రధానపాత్రలో నటించిన శాకుంతలం చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఆమె సిటాడెల్ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. ఇంగ్లీష్‌లో రూసో బ్రదర్స్ తెరకెక్కించిన ఈ సిరీస్‌లో ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడెన్ జంటగా నటిస్తున్నారు. ఇదే సిరీస్ ఇండియన్ వెర్షన్లో సమంత, వరుణ్ ధావన్ కలిసి నటిస్తున్నారు. దీనికి రాజ్ అండ్ డేకే దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా హాలీవుడ్ సిటాడెల్ ప్రీమియర్ షో ఈవెంట్ లండన్‌లో జరిగింది. ఈ వేడుకలో సమంత బ్లాక్ డ్రెస్‌లో, డైమండ్ నెక్లెస్‌తో సమంత సరికొత్త స్టైల్లో దర్శనమిచ్చింది.. అందులోనూ స్పెషల్ డైమండ్ జువెలరీతో మరింత అట్రాక్షన్‌గా కనిపించిది. ప్రస్తుతం సమంత ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. సమంత ధరించిన డ్రెస్, డైమండ్స్ నగలపైనే ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. లండన్‌లో జరిగిన సిటాడెల్ ప్రీమియర్‌లో దాదాపు రూ.65 వేల ఖరీదు చేసే విక్టోరియా బెక్‌హామ్ క్రోచెట్ ప్యాచ్‌వర్క్ స్కర్ట్ ధరించినట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్లుగానే బల్గారీ డైమండ్ జ్యువెల్లరీతో మెరిసింది సామ్. సమంత ధరించిన స్నేక్ నెక్లెస్ ధర అక్షరాలా రూ.2.9 కోట్లు కాగా, చేతికి వేసుకున్న బ్రెస్లైట్ ధర రూ.2.6 కోట్లు ఉంటుందని సమాచారం. ఈ ప్రీమియర్ షోకు హాజరైన పలువురు సెలబ్రిటీలను సమంత తన కొత్త లుక్‌తో ఆకట్టుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను సమంత తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. సమంత ధరించిన జువెలరీ ధర తెలుసుకున్న నెటిజన్స్ అవాక్కవుతున్నారు. ఈ డబ్బులతో ఏకంగా ఒక సినిమానే తీయొచ్చని కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. సమంత సిటాడెల్ ఏప్రిల్ 28న అమెజాన్‌లో స్ట్రీమింగ్ కానుంది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
Hyderabad: వజ్రాలు కొట్టేసి..గోవా చెక్కేసి.. డైమండ్స్ విలువ తెలియక..
సాక్షి, హైదరాబాద్: ఫిలింనగర్లో ఈ నెల 20న రాత్రి జరిగిన భారీ దొంగతనం కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడిని బంజారాహిల్స్ డివిజన్ క్రైం పోలీసులు సోమవారం గోవాలో అదుపులోకి తీసుకున్నారు. చింతలబస్తీకి చెందిన చాపల అంజలప్ప అలియాస్ మచ్చ అలియాస్ అంజి స్థానిక చేపల మార్కెట్లో పని చేసేవాడు. బంజారాహిల్స్‌లోని సింగాడికుంటకు చెందిన మైలారం పవన్‌కుమార్‌తో స్నేహం, జల్సాలకు దారి తీసింది. గంజాయితోపాటు మద్యం సేవించడం అలవాటుగా చేసుకున్నారు. ఇందులో భాగంగా దొంగతనానికి స్కెచ్ వేసిన వీరు.. ఈ నెల 20న రాత్రి నంబర్ ప్లేటు లేని స్కూటీపై వీధుల్లో తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని తిరుగుతుండగా ఓ ఇంటి తాళాలు వేసి ఉండటం కనిపించింది. ఇద్దరు ఆ ఇంటి వెనుక కిటికీలో నుంచి లోపలికి దూరి నగదు, నగల కోసం యత్నిస్తుండగా ఓ లాకర్ కనిపించింది. లాకర్ తీసుకుని బంజారాహిల్స్ రోడ్‌నంబరు 13లోని ఓ స్మశాన వాటికలో పగులగొట్టి అందులో ఉన్న ఆభరణాలు, వజ్రాలను పంచుకున్నారు. దొంగతనం జరిగిన రెండు రోజుల తర్వాత పవన్‌కుమార్ పోలీసులకు చిక్కాడు. అదే రోజు అంజిని పట్టుకోవడానికి యత్నించగా పోలీసుల కదలికలను గుర్తించిన అతను తన వద్ద ఉన్న ఆభరణాలు మణప్పురంలో తాకట్టు పెట్టి రూ. 1.50 లక్షలు తీసుకున్నాడు. లక్డీకాపూల్‌లో బస్సు ఎక్కి బెంగుళూరులో దిగి అక్కడి నుంచి గోవాకు చెక్కేశాడు. పవన్‌కుమార్‌ను విచారించగా పోలీసులకు ఎంతకూ సహరించలేదు. అయితే పవన్ చేతి మీద ఓ ఫోన్ నంబరు రాసి ఉండటాన్ని గుర్తించిన క్రైం పోలీసులు ఆ నంబరు ఎవరిదని ఆరా తీశారు. స్పష్టమైన సమాధానం చెప్పకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆ నంబరుపై నిఘా పెట్టగా అది అంజలప్ప అనే పేరు మీద ఉన్నట్లు గుర్తించారు. ఆ నంబరును ఆధారంగా చేసుకొని చోరీ జరిగిన రాత్రి టవర్ డంప్ పరిశీలించగా అక్కడే రెండు గంటల పాటు తిరిగినట్లు గుర్తించారు. చదవండి: హడలెత్తించిన చిరుత.. 24 గంటల్లో 15 మందిపై దాడి.. వీడియో వైరల్ దీంతో ప్రధాన నిందితుడు అంజికి సంబంధించిన నంబరును గుర్తించి లోకేషన్ పెట్టగా గోవాలో ఉన్నట్లు తేలింది. వెంటనే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ క్రైం పోలీసులు గోవాకు వెళ్లి ఓ లాడ్జిలో తలదాచుకున్న అంజిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే టాస్క్‌ఫోర్స్ పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలిస్తుండగానే గోవాలో చిక్కాడు. పోలీసులను తక్కువ అంచనా వేసి ఇక తాను దొరకనని గోవాలో మకాం వేసిన అంజిని సాంకేతికతతో పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి దొంగతనం చేసిన సొత్తును రికవరీ చేశారు. నల్లమోతు పవన్ అనే ఆభరణాల వ్యాపారి ఫిలింనగర్లో శమంతక డైమండ్ షోరూంను నిర్వహిస్తుండగా అందులోనే ఈ దొంగతనం జరిగింది. ఈ షోరూంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో, ఈ రోడ్లపైన సీసీ కెమెరాలు లేకపోవడంతో నిందితుల జాడ చిక్కలేదు. అయితే సింగాడికుంటలో ఓ వ్యక్తి తన ఇంటి ముందు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాల ద్వారా నిందితుల్లో ఒకరైన మైలారం పవన్ దొరకడం, అతన్ని విచారిస్తే ప్రధాన నిందితుడు పట్టుబడటం జరిగిపోయాయి. డైమండ్స్ విలువ తెలియక.. తాము దొంగతనం చేసిన డైమండ్స్ రూ.లక్షలు విలువ చేస్తాయనే విషయం తెలియక నిందితులు పవన్‌కుమార్, అంజి వాటిని తమ గదుల్లో డబ్బాలో వేసి ఓ మూలన పెట్టారు. వాటిని అమ్మితే రూ.లక్షలు వస్తాయనే విషయం తెలియకనే కేవలం బంగారు ఆభరణాలు మాత్రమే తాకట్టు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. -
కల్లుచెదిరే వజ్రాల గొడుగు.. 12 వేల డైమండ్లు.. ధరెంతో తెలుసా?
James & Jewellery International Exhibition: ప్రపంచ వ్యాపార సాంమ్రాజ్యంలో సూరత్‌కు ప్రత్యేకస్థానం ఉంది. ఈసారి జరిగిన జేమ్స్ అండ్ జ్యువెలరీ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్లో సూరత్ వజ్రాల వ్యాపారులు తయారు చేసిన అరుదైన ఆభరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సూరత్ వ్యాపారులు వజ్రాలతో తయారు చేసిన గొడుగు సెంటర్ ఆఫ్ ది ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఆ విశేషాలు మీకోసం.. ఈ డైమండ్ గొడుగును తయారు చేసిన చేత్న మంగూకియా మాటల్లో.. ‘175 క్యారెట్ల డైమండ్‌ను ఈ గొడుగులో ప్రత్యేకంగా అమర్చాం. అంతేకాకుండా 12 వేల వజ్రాలు, 450 గ్రాముల బంగారంతో తయారుచేశాం. దాదాపు 25 నుంచి 30 మంది వర్కర్లు 25 రోజులపాటు దీనిని తయారు చేశారు. డైమండ్ మార్కెట్లో దీని ధర 25 నుంచి 30 లక్షల వరకు పలకొచ్చు. సాధారణంగా అమెరికా, యూరప్, హాన్‌కాంగ్ వంటి దేశాల నుంచి మాకు ఆర్డర్లు వస్తున్నాయని’ మీడియాకు వెల్లడించారు. చదవండి: Smart Phone Addiction: స్మార్ట్ ఫోన్‌కు అడిక్టయి.. గతం మర్చిపోయిన యువకుడు ఈ ఎగ్జిబిషన్‌ను చూసిన గ్రేసీ అనే మహిళ ‘ఒకటికంటే ఎక్కువ వజ్రాలు పొదిగిన ఆభరణాలు ఇక్కడ ఉన్నాయి. వీటన్నింటికంటే వజ్రాల గొడుగు ప్రతిఒక్కరినీ ఆకర్షిస్తోంద’ని పేర్కొంది. మరోవైపు కరోనా మహమ్మారి ప్రభావం అన్ని రంగాలపై పడుతుంటే.. వజ్రాల పరిశ్రమ మాత్రం రెక్కలు విప్పుకుంటున్నట్లు అనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కొనుగోలుదారులను ఆకర్షించడానికి ఈ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసింది. చదవండి: వృత్తేమో టీచర్... వారానికోసారి మాత్రమే స్నానం.. కాస్తమీరైనా చెప్పండి!! -
నీతా అంబానీ : తగ్గేదే..లే! ఈ విషయాలు మీకు తెలుసా?
సాక్షి, ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఫౌండేషన్, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ స్థాపకురాలు, రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ నీతా అంబానీ. రిలయన్స్ ఛైర్మన్ వ్యాపార దిగ్గజం ముఖేశ్ అంబానీ భార్యగా కంటే, కుటుంబ వ్యాపారంలో పాలు పంచుకుంటూ, సంక్షేమ కార్యక్రమాలతోపాటు, దాతగా, వ్యాపారవేత్తగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. • 1985లో 20 ఏళ్ళ వయసులో ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీతో వివాహం • ఆకాష్, ఇషా, అనంత్ అనే ముగ్గురు పిల్లలు • ఫోర్బ్స్ 'ఆసియాలో అత్యంత ప్రభావవంతమైన మహిళా వ్యాపారవేత్తల' జాబితాలో చోటు • ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)లో సభ్యురాలు • నీతా అంబానీకి లగ్జరీ కార్లంటే మోజు • ఆడి ఏ9 కమేలియన్ అత్యంత విలాసవంతమైన కారున్న తొలి భారతీయ మహిళ • ఈ ప్రత్యేక ఎడిషన్ కారు ఖరీదు సుమారు 100 కోట్ల రూపాయలు • ఈ కారు డ్రైవర్ జీతం సంవత్సరానికి రూ. 24 లక్షలు. • నీతా అంబానీ కార్ల లిస్ట్‌లో రోల్స్ రాయిస్ ఫాంటమ్, బెంట్లీ ఫ్లయింగ్ స్పర్, మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్, పోర్షే లాంటి మోడల్ కార్లు ఉన్నాయి. • నీతా అంబానీ డిజైన్స్ , స్టైల్స్ విషయంలో చాలా అప్డేట్గా ఉంటారు. నీతా జ్యుయల్లరీ కలెక్షన్ చూస్తే కళ్లు తిరగాల్సిందే. వేసింది మళ్లీ వేసేదే లే.. సాంప్రదాయ బంగారు ఆభరణాలు, హారాలు, వడ్డాణాలు వజ్రాల ఉంగరాలు, అరుదైన డైమండ్ చోకర్లు ఇలా కోట్లాది రూపాయల కలెక్షన్ ఆమె సొంతం. నీతా అంబానీ అత్యంత ఖరీదైన చెప్పులు, షూ కలెక్షన్ గురించి చాలా మందికి తెలియదు. వేసినవి మళ్లీ వేయకుండా లగ్జరీకి, రాయల్టీకి పెట్టింది పేరుగా ఉంటాయి. పెడ్రో, జిమ్మీ చూ, గార్సియా మార్లిన్ తదితర విలాసవంతమైన బ్రాండ్లను ఆమె వాడతారు. రూ.40 లక్షల చీర నీతా అంబానీ సారీ కలెక్షన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంతటి సెలబ్రిటీలైనా నీతా తరువాతే ఎవరైనా. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చీరలలో ఒకటిగా పేరొందిన రూ.40 లక్షల చీరను ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతాల వివాహానికి ధరించడం విశేషం. జాకెట్టు వెనుక భాగంలో ఎంబ్రాయిడరీ చేసిన శ్రీకృష్ణుడి అందమైన చిత్రం హైలైట్‌గా నిలిచింది. ఈ చీరను చెన్నై సిల్క్స్ డైరెక్టర్ శివలింగం డిజైన్ చేశారు. కేవలం పట్టు చీరలు, బంగారంతో, చేతితో నేసిన చీరలే కాదు రియల్ డైమండ్స్, రూబీ, పుఖ్రాజ్, పచ్చ, ముత్యాలు, ఇతర మరెన్నో అరుదైన రత్నాలు పొదిగిన చీరలు ఆమె వార్డ్ రోబ్‌లో కొలువు దీరాయి. కళ్లు చెదిరే లిప్‌స్టిక్ కలెక్షన్ సాంప్రదాయ దుస్తులు, అరుదైన ఆభరణాలు, హై-బ్రాండ్ షూసే కాదు నీతా అంబానీకి లిప్‌స్టిక్‌లపై కూడా పిచ్చి ప్రేమ. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లిప్‌స్టిక్‌ల అరుదైన సేకరణ ఆమె సొంతం. లిపిస్టిక్ ప్యాకేజ్లే బంగారం, వెండితో తయారు చేసినవి అంటే ఆమె రేంజ్ అర్థం చేసుకోవచ్చు. నీతా అంబానీ లిప్‌స్టిక్ కలెక్షన్ విలువ రూ. 40 లక్షలట. కార్పొరేట్ జెట్ 2007లో, ముఖేశ్ అంబానీ తన అందమైన భార్య నీతాకు విలాసవంతమైన కార్పొరేట్ జెట్‌ను పుట్టినరోజు గిఫ్ట్‌గా ఇచ్చారు. దీని అంచనా ధర రూ. 240 కోట్లు. కస్టమ్-ఫిట్ చేసిన ఆఫీస్, ఒక ప్రైవేట్ క్యాబిన్, శాటిలైట్ టెలివిజన్ సెట్లు, వైర్లెస్ కమ్యూనికేషన్, మాస్టర్ బెడ్రూమ్, విలాస వంతమైన బాత్రూమ్లు ఇందులో ఉన్నాయి. మరో పుట్టినరోజుకు దుబాయ్ నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన కారును బహుమతిగా ఇచ్చారు ముఖేశ్. 3 లక్షల వజ్రాలు పొదిగిన దీని ధర రూ.30 కోట్లు. కోట్ల విలువచేసే జపనీస్ టీ సెట్ పురాతన అరుదైన వస్తువుల పట్ల నీతా అంబానీకి అమితమైన ప్రేమ. జపాన్‌లోని పురాతన కత్తుల సెట్ తయారీదారులు నోరిటాకేకుచెందిన స్పెషల్ టీ సెట్ దీనికి ఉదాహరణ. దీని అంచనా ధర రూ. 1.5 కోట్లు. లగ్జరీ హ్యాండ్‌బ్యాగ్‌లు ఫ్యాషన్ ఐకాన్‌గా డేన్సర్గా, డిజైనర్‌గా ఆకట్టుకునే 'కార్పొరేట్ లేడీ' నీతా అంబానీ లగ్జరీ హ్యాండ్‌బ్యాగ్‌ల గురించి పత్ర్యేకంగా చెప్పుకోవాల్సిన పనేలేదు. కార్పొరేట్ మీట్ నుండి ఫ్యామిలీ ఈవెంట్ల వరకు, నీతా అంబానీకి అత్యంత ఖరీదైన హ్యాండ్‌బ్యాగ్ ఉండాల్సిందే. ప్రపంచంలోనే ఖరీదైన బ్రాండ్స్ ఫెండి, సెలిన్ నుండి హెర్మేస్ వరకు ప్రతీదీ స్పెషల్ ఎట్రాక్షనే. దీంతోపాటు ఆమె ధరించే కార్టియర్, బల్గారీ, గూచీ లాంటి పాపులర్ బ్రాండ్ల వాచెస్ మరో ప్రత్యేక ఆకర్షణ ఫిట్‌గా ఉండేందుకు డైట్, వర్క్అవుట్స్ కఠినమైన డైట్ ప్లాన్ పాటిస్తారు నీతా. ఉదయాన్నే కొన్ని డ్రై ఫ్రూట్స్ , ఎగ్ వైట్ అల్పాహారం. మధ్యాహ్న భోజనంలో సూప్, తాజా ఆకుకూరలు, కూరగాయలను ఇష్టపడతారు. రాత్రి భోజనంలో కూరగాయలతో పాటు, మొలకలు, సూప్ తీసుకుంటారు. రోజంతా మధ్యలో పండ్లు తీసుకుంటారు. అంతేకాదు ఎంత రాత్రి అయినా, ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా వర్కౌట్ సెషన్‌ను అస్సలు మిస్ కారు. స్విమ్మింగ్, యోగా శాస్త్రీయ నృత్యం వంటి అనేక శారీరక వ్యాయామాలను చేస్తారు. తనను తాను హైడ్రేట్‌గా ఉంచుకునేందుకు డిటాక్స్ వాటర్‌తోపాటు, బీట్రూట్ రసాన్ని డిటాక్స్ వాటర్‌గా తాగడానికి ఇష్టపడతారు నీతా. బీట్రూట్ జ్యూస్ శరీరం నుండి హానికరమైన టాక్సిన్స్‌ను బయటకు పంపుతుంది. అందుకే ఆమె చర్మం ఎపుడు మెరుస్తూ, తాజాగా ఉంటుంది. ఇంటి నుండి బయటకి అడుగుపెట్టిన ప్రతిసారీ ఆమెకు కొత్త చెప్పులు లేదా షూస్ ఉండాల్సిందే. అలాగే ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్పర్సన్ అయిన నీతా అడ్మిషన్ సీజన్లో అస్సలు ప్రయాణాలు పెట్టుకోరు. ఈ ప్రక్రియను వ్యక్తిగతంగా దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తారు. బాలికా విద్యా, మహిళా క్రీడాకారులకు అండగా నిలుస్తారు. దీంతోపాటు కరోనా సమయంలో అనేక చారిటీ కార్యక్రమాలను కూడా నిర్వహించారు. - సాక్షి, వెబ్‌డెస్క్ ప్రత్యేకం -
రూ.2 కోట్ల విలువైన వజ్రాల నగల అపహరణ..
సాక్షి ప్రతినిధి, చెన్నై: విల్లుపురం పట్టణానికి చెందిన కరుణానిధి (45) తన తాత మలేషియా నుంచి తెచ్చిన వద్ద రూ.2 కోట్ల విలువైన వజ్రాల నగలున్నాయని చెబుతూ వాటి విక్రయానికి సిద్ధమయ్యాడు. తన ఇంటికి రంగులు వేసేందుకు వచ్చిన శివ అనే యువకునితో నగలు కొనుగోలు చేసేవారు ఎవరైనా ఉంటే చెప్పమని కోరాడు. చెన్నైలో తనకు తెలిసిన ఇద్దరు ఉన్నారని, వారి ద్వారా అమ్మవచ్చని శివ నమ్మబలికాడు. చెన్నై సాలిగ్రామానికి చెందిన అరుళ్ మురుగన్ (55), వడపళినికి చెందిన సెంథిల్ (44)లను తీసుకెళ్లి కరుణానిధికి పరిచయం చేశాడు. చెన్నై నుంచి ఇద్దరు వ్యక్తులు వస్తున్నారని, నగలు దిండివనం తీసుకురమ్మని కరుణానిధికి చెప్పారు. దీంతో కరుణానిధి స్నేహితుడు రావణన్‌ను వెంట బెట్టుకుని కారులో దిండివనం చేరుకున్నాడు. అరుళ్ మురుగన్, సెంథిల్ మార్గమధ్యంలో కారును ఆపి నగలు కొనేవారు తీవనూరులో ఉన్నారని మళ్లించారు. ఎదురుగా మరోకారులో ఐదుగురు వచ్చి కరుణానిధి కళ్లలో కారంపొడి చల్లి నగలు ఎత్తుకెళ్లారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
ఒక దొంగ..66మంది పోలీసులు
సాక్షి, హైదరాబాద్ : బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ల పరిధిలో నెల రోజుల వ్యవధిలోనే సంచలనం సృష్టించిన రెండు భారీ చోరీ కేసుల్లో నిందితుడొక్కరేనని పోలీసులు అనుమానిస్తున్నారు. దొంగతనం జరిగిన తీరు, సీసీ ఫుటేజీలో నిందితుడి ఆనవాళ్లు ఒకేరకంగా ఉండటం ఈ అనుమానాలకు తావిస్తోంది. ఈ రెండు కేసుల్లోనూ నిందితుడి నడక, ఇళ్లల్లోకి చొరబడిన విధానం, చేతులకు వేసుకున్న గ్లౌజ్‌లు, ముఖానికి మాస్క్ ఒకేరకంగా ఉండటంతో ఈ రెండు దొంగతనాలకు పాల్పడింది ఒక్కరేనని నిర్ధారణకు వచ్చారు. దీంతో పాటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ల పరిధిలో పోలీసులు సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్నారు. జులై 22న తెల్లవారుజామున జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్–28లో ఉంటున్న విల్లామేరీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఫిలోమినా ఇంట్లోకి దొంగ పక్కింటి ప్రహరీ దూకి నేరుగా మొదటి అంతస్తులోకి చేరుకున్నాడు. కిటికీ డోరుతీసి లోపలికి ప్రవేశించి రూ.లక్ష నగదు, రూ.25 లక్షల విలువైన బంగారు వజ్రాభరణాలను దొంగిలించాడు. ఫెలోమినా ఇంటి చుట్టూ 12 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నప్పటికీ రెండు కెమెరాల్లో మాత్రమే నిందితుడి జాడ కనిపించింది. దీని ఆధారంగానే పోలీసులు దొంగకోసం గాలింపు చేపట్టారు. బంజారాహిల్స్‌లో.... బంజారాహిల్స్ రోడ్ నెంబర్–2లోని రియల్టర్ తిక్కవరపు ఉత్తమ్‌రెడ్డి ఇంట్లో ఆగస్టు 27న భారీ చోరీ జరిగింది. నిందితుడు ఇంటి వెనకే ఉన్న జపనీస్ గార్డెన్ ప్రహరీ దూకి వెనుకాల గ్లాస్ డోర్ తెరుచుకొని సరాసరి బెడ్రూమ్లోకి వెళ్లి కబోర్డులో ఉన్న సుమారు రూ.2 కోట్ల విలువైన వజ్రాభరణాలను మూటకట్టుకొని వచ్చినదారిన ఉడాయించాడు. ఉత్తమ్‌రెడ్డి ఇంట్లో 14 సీసీ కెమెరాలు ఉండగా కేవలం రెండింట్లో మాత్రమే నిందితుడి జాడ కనిపిస్తోంది. మిగతా కెమెరాలన్నీ అడ్డదిడ్డంగా ఏర్పాటు చేయడం వల్ల నిందితుడికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలు దొరకడం లేదు. అయితే గేటులోకి రావడం, లోపలికి ప్రవేశించడం అన్నీ కనిపిస్తుండటంతో కొంత సమాచారం లభ్యమైంది. చేతులకు గ్లౌజులు, ముఖానికి మాస్క్, కాళ్లకు చెప్పులు లేకుండా ఉత్తమ్‌రెడ్డి ఇంట్లో దొంగతనం చేసిన వ్యక్తే ఫిలోమినా ఇంట్లోనూ ఇదే తరహా లో చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. రెండు దొంగతనాలకు దగ్గరి ఆనవాళ్లు కనిపిస్తుండటంతో పాటు రెండు సీసీ ఫుటేజీల్లోనూ అతడి నడక ఒకేలా ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఈ రెండు దొంగతనాలు ఒక్కడే చేసినట్లుగా ఇప్పటికే నిర్ధారణకు వచ్చిన పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఇప్పటివరకు రెండు పోలీస్స్టేషన్ల పరిధిలో ఉన్న 150 సీసీ కెమెరాలను జల్లెడ పట్టారు. పరిసర పోలీస్స్టేషన్ల పరిధిలోనూ దొంగతనం జరిగిన సమయాన్ని ప్రమాణికంగా తీసుకొని సీసీ కెమెరాలు వడపోస్తున్నారు. రెండు పోలీస్స్టేషన్ల పరిధిలోని క్రైం పోలీసులతో పాటు టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇప్పటి వరకు 250 సీసీ కెమెరాలను పరిశీలించారు. ఉత్తమ్‌రెడ్డి ఇంట్లో అర్ధరాత్రి 2 నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు దొంగ ఇంట్లోనే ఉన్నట్లు సీసీ ఫుటేజీల్లో స్పష్టం కావడంతో అంతకుముందు ఆ తర్వాత ప్రధాన రోడ్డులో రాకపోకలపై పోలీసులు దృష్టి సారించారు. మొత్తానికి రెండు దొంగతనాలకు పాల్పడిన దొంగ కోసం 66 మంది పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. -
అమెరికాలోని శ్రీవారికి వజ్రాలతో ఆభరణాలు
సాక్షి, తెనాలి: శిల్పకళల్లో ఖండాంతర ఖ్యాతిని పొందిన గుంటూరు జిల్లా తెనాలికి చెందిన అక్కల సోదరుల్లో ఒకరైన ‘కళారత్న’ అక్కల శ్రీరామ్ అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం క్యారీ నగరంలో కొలువైన శ్రీ వేంకటేశ్వరస్వామికి వజ్రాభరణాలను రూపొందించారు. ఆలయ నిర్వాహకుల ప్రతిపాదనల మేరకు స్వామివారికి కఠి హస్తము, వరద, శంఖు, చక్ర హస్తములు, పాదాలను వెండితో తయారు చేసి ముంబయి నుంచి తెప్పించిన అమెరికన్ వజ్రాలను వీటిలో పొదిగారు. ఈ ఆభరణాల రూపకల్పనకు తొమ్మిది నెలల సమయం పట్టిందని శ్రీరామ్ వెల్లడించారు. ఆభరణాలను మంగళవారమే అమెరికాకు పంపుతున్నట్టు చెప్పారు. త్వరలోనే అమెరికాలోని శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి వజ్ర కిరీటాన్ని కూడా తయారు చేయనున్నట్టు తెలిపారు. కాగా, ఆభరణాల్లో వాడిన వజ్రాల విలువ రూ.10 లక్షలు పైగానే ఉంటుందని చెప్పారు. -
శ్రీవారి ఆభరణాలపై చెన్నారెడ్డి కీలక వ్యాఖ్యలు
-
శ్రీవారి ఆభరణాల మాయం నిజమే: చెన్నారెడ్డి
సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్ధానం (టీటీడీ) పై జరుగుతున్న పరిణామాలపై తాజాగా పురావస్తుశాఖ మాజీ డైరెక్టర్ పెద్దారపు చెన్నారెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీకి శ్రీ కృష్ణ దేవరాయులు ఇచ్చిన అనేక వజ్రాలు, ఆభరణాలు మాయమయ్యాయని వెల్లడించారు. వెంకన్న స్వామిని కృష్ణ దేవరాయులు ఏడు సార్లు దర్శించుకున్నారన్నారు. ఆసమయంలో ఆయన ఇచ్చిన అభరణాలను చాలావరకు కరిగించారని, పలు వజ్రాలు విదేశాలకు తరలిపోయాయని పేర్కొన్నారు. కృష్ణ దేవరాయలు ఇచ్చిన ఆభరణాలు, వజ్రాలు పదిశాతం కూడా లేవని తెలిపారు. తాను డైరెక్టర్‌గా ఉన్నప్పుడు భక్తులు ఇచ్చిన అభరణాలపై 2012 లో ఓ కమిటి వేశామని, సదరు కమిటీ విచారణలో ఈ విషయాలు బయటపడ్డాయని స్పష్టం చేశారు. మరోవైపు టీటీడీ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం ముగిసిన అనంతరం ఈవో మాట్లాడుతూ...టీటీడీ నిధులు ఎక్కడా దుర్వినియోగం కాలేదని తెలిపారు. ఆగమ శాస్త్రం ప్రకారమే పనులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని అంశాలపై చట్టప్రకారం ముందుకు వెళతామని చెప్పారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని సీఎం ఆదేశించినట్లు ఈవో తెలిపారు. స్వామివారి ఆభరణాలన్నీ సురక్షితంగా ఉన్నాయని, వాటికి సంబంధించిన నివేదికను ముఖ్యమంత్రికి అందచేసినట్లు ఆయన పేర్కొన్నారు. -
మూడు కోట్ల వజ్రాల హారం ఎత్తుకెళ్లారు
న్యూఢిల్లీ: దాదాపు రూ.మూడు కోట్లు విలువ చేసే వజ్రాల ఆభరణాలు దొంగలు దోచుకెళ్లారు. బాధితురాలు ఎయిర్ లైన్ కు చెందిన ఓ ఎగ్జిక్యూటివ్ కూతురు. పోలీసుల వివరాల ప్రకారం ఆనంద్ లోక్ ప్రాంతంలో ఉంటున్న ఎయిర్ లైన్ కు చెందిన ఓ అధికారి కూతురు తన కుటుంబంతో కలిసి ఓ వివాహ కార్యక్రమానికి వెళ్లారు. రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో వెళ్లిన వారు తెల్లవారు జామున 4గంటల ప్రాంతంలో తిరిగొచ్చారు. ఆ సమయంలో ఇంట్లో పనిచేసే వాళ్లు ఇంటి వెనుక భాగంలో నిద్రపోయారు. అయితే, పెళ్లికి వచ్చేవారు తిరిగొస్తారు కదా అనే గేట్ కు తాళం వేయలేదు. అలాగే కిటికీలు కూడా సరిగా మూయలేదు. దీన్నే అదనుగా చేసుకున్న దొంగలు కిటికీల ద్వారా ఇంట్లో దూరి ఓ గదిలోకి వెళ్లి అల్మారా పగులగొట్టి మూడు కోట్లు విలువైన వజ్రాల హారాన్ని ఎత్తుకెళ్లారు. దాంతోపాటు రూ.60 వేలు కూడా దోచుకెళ్లారు. పెళ్లికి వెళ్లొచ్చిన వారు ఇది చూసి అవాక్కయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఆభరణాల విలువ 53 కోట్లు!
‘మ్యాడ్ మాక్స్ ద ఫ్యూరీ రోడ్’ చిత్రానికిగాను ఉత్తమ ఎడిటర్‌గా అవార్డు గెల్చుకున్న ‘మార్గరెట్ సిక్సెల్’కు ప్రియాంకా చోప్రా అవార్డు ప్రదానం చేశారు. తెలుపు రంగు గౌను, వజ్రాలు పొదిగిన చెవి దుద్దులు, బిగించి కట్టిన జుత్తు, తక్కువ మేకప్‌తో ప్రియాంక చాలా క్యూట్‌గా కనిపించారు. రెడ్ కార్పెట్‌పై క్యాట్ వాక్ చేసినప్పుడూ, వేదిక మీదకు వెళుతున్న సమయంలోనూ ఆమెలో తడబాటు కనిపించలేదు. విజేతను వేదిక పైకి ఆహ్వానిస్తున్నప్పుడు మాటల్లో ఆత్మవిశ్వాసం కనిపించింది. మొత్తానికి మన దేశీ గాళ్ విదేశీయులతో భేష్ అనిపించేసుకున్నారు. ఇక.. ప్రియాంక ధరించిన గౌను, పెట్టుకున్న ఆభరణాల గురించి చెప్పాలంటే... మూడు ఉంగరాల్లో ఒకదాని ఖరీదు 23 కోట్లు, మరోటి 6 కోట్లు, ఇంకోటి 2 కోట్లు. చెవిదుద్దుల ఖరీదు 22 కోట్ల రూపాయలట. మొత్తం 53 కోట్ల విలువైన డైమండ్ జ్యువెలరీలో ప్రియాంక ధగాధగా మెరిసిపోయారు. ప్రతిష్ఠాత్మక అవార్డు వేడుక కాబట్టి, ప్రియాంక ఆ రేంజ్లో వెళ్లి ఉంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ జుహైర్ మురాద్ ఆమె గౌనుని డిజైన్ చేశారు. పైకి బాగానే కనిపించినా అవార్డు ఇస్తున్న సమయంలో కొంచెం నెర్వస్ అయ్యానని ప్రియాంక పేర్కొన్నారు. -
వజ్రాభరణాలపై తనిష్క్ 20శాతం డిస్కౌంట్
హైదరాబాద్ : నూతన సంవత్సరం సందర్భంగా టాటా గ్రూప్‌కు చెందిన తనిష్క్ సంస్థ వజ్రాల ఆభరణాలపై డిస్కౌంట్ ఇస్తోంది. 20 శాతం వరకూ తగ్గింపుతో వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. అంతేకాకుండా దోషరహితంగా రూపొందించిన చెవి రింగులు, పెండెంట్లు, చేతి ఉంగరాలను...సంప్రదాయ, నవయుగ అభరణాలు అత్యుత్తమ కలయికతో తనిష్క్ అందజేస్తోంది. ఆన్లైన్లో కూడా ఆభరణాలను కొనుగోలుచేసే సదుపాయాన్ని తనిష్క్ వినియోగదార్లకు అందుబాటులో ఉంచింది. www.tanishq.co.in కు లాగాన్ చేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.