న్యూఢిల్లీ: కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న సోదాల్లో ఇప్పటి వరకు రూ.102 కోట్ల సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు సోమవారం ఆదాయ పన్ను(ఐటీ)శాఖ తెలిపింది.
ఈ నెల 12వ తేదీ నుంచి బెంగళూరు సహా 55 ప్రాంతాల్లో దాడులు జరిపి లెక్కల్లో చూపని రూ.94 కోట్ల నగదుతోపాటు రూ.8 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలు, 30 ఖరీదైన విదేశీ తయారీ గడియారాలు కలిపి మొత్తం రూ.102 కోట్ల సొత్తును పట్టుకున్నామని వివరించింది. అక్రమ సొత్తుకు సంబంధించి డాక్యుమెంట్ల హార్డు కాపీ, డిజిటల్ డేటా తదితర సాక్ష్యాధారాలను కూడా చేజిక్కించుకున్నామని తెలిపింది. బోగస్ కొనుగోలు రసీదుల ద్వారా భారీగా పన్ను ఎగవేతకు గురైనట్లు కూడా గుర్తించామంది.
Comments
Please login to add a commentAdd a comment