ఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాలను చలి వణికిస్తోంది. పలుచోట్ల కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దట్టమైన పొగ మంచు కారణంగా కారణంగా విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. మరోవైపు.. ఢిల్లీ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది.
ఉత్తరాదిన పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు అలుముకుంది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు చలికి వణికిపోతున్నారు. ఢిల్లీలో కనిష్టంగా 7.6 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా.. గరిష్టంగా 16 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది. ఢిల్లీలో జనవరి 8 వరకు పొగమంచు కమ్ముకునే అవకాశం ఉంది.. జనవరి 6న తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
#WATCH | Delhi: Dense fog engulfs the national capital as cold wave grips the city.
(Visuals from Akshardham) pic.twitter.com/ePXNPWLPGO— ANI (@ANI) January 3, 2025
దట్టమైన పొగమంచు కారణంగా విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఢిల్లీ నుంచి బయలుదేరే విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. అలాగే, ఢిల్లీ నుంచి వెళ్లే, అక్కడి వచ్చే రైలు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. మరికొన్ని రైలు సర్వీసులను రద్దు చేసినట్టు కూడా అధికారులు వెల్లడించారు.
Update issued at 06:35 hours.
Kind attention to all flyers!#Fog #FogAlert #DelhiAirport pic.twitter.com/IAEHvyua0w— Delhi Airport (@DelhiAirport) January 3, 2025
ఇదిలా ఉండగా.. తెలుగు రాష్ట్రాల్లో కూడా చలి తీవ్రత పెరిగింది. ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగ మంచు కారణంగా చలి తీవ్రత పెరిగింది. దట్టమైన పొగమంచు సైతం అలుముకుంది. ఇటు తెలంగాణలో కూడా చలి తీవ్రత ఎక్కువైంది. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి.
#WATCH | Assam: A dense layer of fog blankets the Guwahati city as the cold wave grips the city. pic.twitter.com/KlxCmxJgBq
— ANI (@ANI) January 3, 2025
#WATCH | Delhi: A thick layer of fog engulfs the national capital as cold wave grips the city.
Visuals from area near Akshardham pic.twitter.com/H36B4Dbhrb— ANI (@ANI) January 3, 2025
CRAZY COLD WEATHER grips Telangana as 3rd spell of coldwave going strong now this season. Sirpur recorded 6.5°C lowest in Telangana
Hyderabad too under serious chill with few parts like UoH and BHEL recorded 8.8°C. Further drop in temp expected tonight 🥶🥶 pic.twitter.com/BLWWnj1WZ9— Telangana Weatherman (@balaji25_t) January 3, 2025
Comments
Please login to add a commentAdd a comment