low temperatures
-
Telangana: గజ గజ.. ఇంకెన్ని రోజులంటే..!
సాక్షి, ఆదిలాబాద్: రాష్ట్రంలో పలు జిల్లాలో చలి పంజా విసురుతోంది. పగటిపూట ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కనిపిస్తున్నా.. వేకువ ఝామున, రాత్రి సమయాల్లో లో టెంపరేచర్ల కారణంగా చలి ప్రభావం విపరీతంగా ఉంటోంది. మరో నాలుగైదు రోజుల పాటు ఈ ప్రభావం ఇలాగే కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తెలంగాణలో.. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్‌లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. తాజాగా.. ఉమ్మడి ఆదిలాబాద్ పరిధిలోని కుమ్రంబీమ్ జిల్లా సిర్పూర్లో 6.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. తిర్యానిలో 8 డిగ్రీలు, కెరమెరిలో 6.8 డిగ్రీలుగా నమోదైంది. ఆదిలాబాద్ బజారాత్నూర్ లో 7.4 డిగ్రీలు, బేల 7.6 డిగ్రీలు, పోచ్చేరలో 7.7 డిగ్రీలు, జైనథ్ 7.9 డిగ్రీలు, నేరడిగొండ 8.2 డిగ్రీలు, బోరజ్ 8.1డిగ్రీలు, తలమడుగులో 8.4 డిగ్రీలు చలికి వణుకుతున్నా ప్రజలు. నిర్మల్ కుంటాల 9.9 డిగ్రీల సెల్సియస్, మంచిర్యాల దండేపల్లి వెల్గనూర్‌లో 11 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక సంగారెడ్డి నల్లవల్లీ.. సిద్ధిపేట నంగనూర్లో 10 డిగ్రీల సెల్సియస్, మెదక్ కౌడిపల్ల 11 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. హైదరాబాద్‌లోనూ చలి ప్రభావం విపరీతంగా కొనసాగుతోంది. నాలుగైదు రోజుల్లో పరిస్థితి సాధారణానికి చేరుకున్నా.. ఆపై పదిరోజులకు మళ్లీ చలి గాలులు మొదలు కావొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. -
మంచు దుప్పటి
సాక్షి, విశాఖపట్నం/బి.కొత్తకోట: రాష్ట్రంపై చలి పులి పంజా విసురుతోంది. వారం రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతూ కలవరపెడుతున్నాయి. అన్నిచోట్లా సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గాయి. దీనికి తోడు ఏపీ తీరం వెంబడి ఉత్తర గాలులు, రాయలసీమ మీదుగా తూర్పు గాలులు తక్కువ ఎత్తున వీస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత రోజు రోజుకూ పెరుగుతోంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాలు మినహా రాష్ట్రంలో అన్నిచోట్లా సగటు ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. రాయలసీమలోనూ చలి తీవ్రత పెరుగుతోంది. శీతల గాలులు వీస్తుండటంతో ఇళ్ల నుంచి బయటికి రావాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విశాఖ మన్యంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చింతపల్లిలో సోమవారం ఉదయం 5 గంటలకు 3.1 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదై ఎముకలు కొరికేలా చలి పెరిగిపోయింది. ఉదయం 5 గంటల సమయంలో జి.మాడుగులలో 4.7, అరకులో 5.3, ముంచంగిపుట్టులో 5.8, పాడేరులో 6.1, మారేడుమిల్లిలో 9.6, మడకశిరలో 10, తిరుమల, పెదబయలులో 10.2, హుకుంపేట, కునుర్పి, రొద్దాంలో 10.7, ఆలూరులో 11.3, మదనపల్లెలో 11.7, మంత్రాలయంలో 11.9, ఓబులదేవర చెరువులో 12, వై.రామవరంలో 12.1, గుమ్మగుట్టలో 12.4, బేతంచెర్ల, గుత్తిలో 12.5 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హార్సిలీ హిల్స్‌పై తిరుమల కంటే తక్కువగా.. రాయలసీమలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలంలో సోమవారం నమోదయ్యాయి. బి.కొత్తకోట మండలంలో సముద్ర మట్టానికి 4,141 అడుగుల ఎత్తులో గల హార్సిలీ హిల్స్‌పై కనిష్ట ఉష్ణోగ్రత 6.6 డిగ్రీలుగా నమోదైంది. హార్సిలీ హిల్స్ కంటే తిరుమల కొండలు తక్కువ ఎత్తు కావడంతో ఇక్కడ 10.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. -
బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, హైదరాబాద్: ఈశాన్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది తీవ్రంగా మారి రాగల 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే దక్షిణ ఛత్తీస్‌గఢ్ దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావాలతో సోమవారం ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, అనేక చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. మంగళవారం కొన్నిచోట్ల భారీ వర్షాలతోపాటు ఒకట్రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు తెలిపారు. గత 24 గంటల్లో దుండిగల్‌లో 6 సెంటీమీటర్లు, గజ్వేల్, బజర్హతనూర్, తూప్రాన్లలో 5 సెంటీమీటర్ల చొప్పున, ధర్మసాగర్, నర్మెట్ట, వర్నిలలో 4 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. హైదరాబాద్‌లో 11 శాతం అధిక వర్షపాతం జూన్‌లో హైదరాబాద్‌లో 11 శాతం అధిక వర్షపాతం నమోదైంది. సాధారణంగా ఈ నెల రోజుల్లో 105.6 మిల్లీమీటర్ల (ఎంఎం) వర్షం కురవాల్సి ఉండగా 116.9 ఎంఎం కురిసింది. కరీంనగర్ జిల్లాలో ఆరు శాతం అధిక వర్షపాతం నమోదైంది. నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించడంతో రాష్ట్రవ్యాప్తంగా 35 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఈ నెల రోజుల్లో రాష్ట్రంలో సరాసరి 132 ఎంఎం వర్షం కురవాల్సి ఉండగా 86.2 ఎంఎం కురిసింది. ఖమ్మం జిల్లాలో మాత్రం ఏకంగా 73 శాతం లోటు వర్షపాతం నమోదవడం గమనార్హం. జిల్లాలో గత నెల రోజుల్లో సాధారణంగా 130.5 ఎంఎం మేర వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా కేవలం 35.2 ఎం.ఎం. మాత్రమే నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. -
మళ్లీ చలి పంజా
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో చలి మళ్లీ ఉధృతమైంది. పది రోజుల క్రితం పెథాయ్ తుపాను సందర్భంగా రాష్ట్రంపై పంజా విసిరిన చలిపులి.. మరోసారి తన ప్రతాపం చూపిస్తోంది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా చలిగాలులు తీవ్రం కావడంతో జనం వణికిపోయారు. పలుచోట్ల ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ఆదిలాబాద్‌లో రికార్డు స్థాయిలో 4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్లో ఇంత తక్కువ ఉష్ణోగ్రత నమోదు కావడం ఇదే తొలిసారి. ఇక వికారాబాద్ జిల్లా తాండూరులో 5.2 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. 2013 డిసెంబర్ 9న 5.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, తాజాగా అంతకంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. మెదక్‌లో శుక్రవారం 6.8 డిగ్రీలుగా నమోదైన ఉష్ణోగ్రత.. శనివారం 5.8 డిగ్రీలకు పడిపోయింది. దక్షిణ కోస్తా ఒడిశా, ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీనంగా మారడంతో రాష్ట్రంలో రాగల మూడ్రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కొమురంభీం, మంచిర్యాల, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో ఆదివారం చలిగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్‌నూ చలి వణికిస్తోంది. శనివారం గ్రేటర్లో రికార్టు స్థాయిలో 9.9 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. 2010 డిసెంబర్ 21న 8.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా, ఎనిమిదేళ్ల తర్వాత సాధారణం కన్నా ఐదు డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రత నమోదైంది. చలి కారణంగా ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నవారు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. చల్లటి గాలులు వీస్తుండడంతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. స్వైన్‌ఫ్లూ మరింత విజృంభించే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. -
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గజగజ..
సాక్షి, ఆదిలాబాద్‌టౌన్: ఉమ్మడి జిల్లాపై చలి పంజా విసురుతోంది. పెథాయ్ తుపాన్ ప్రభావంతో వీస్తున్న చలిగాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో చల్లటి గాలులు వస్తుండడంతో గజగజ వణుకుతున్నారు. దీనికి తోడు కనిష్ట ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పడిపోతుండడంతో ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. గత వారం, పది రోజుల క్రితం కనిష్ట ఉష్ణోగ్రతలు 12 నుంచి 15 డిగ్రీలు నమోదు కాగా, రెండు, మూడు రోజుల నుంచి చలి తీవ్రత పెరిగింది. నవంబర్లోనే సాధారణ స్థాయిని దాటిన కనిష్ట ఉష్ణోగ్రతలు.. ప్రస్తుతం మరింత దిగజారాయి. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. ఉదయం పది గంటలు దాటుతున్నా సాధా రణ స్థాయికి రాని పరిస్థితి నెలకొంది. చలి గాలులకు చిన్నారులు, వృద్ధులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పెథాయ్ తుపాన్ ప్రభావం.. ఉమ్మడి జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. నైరుతి బంగాళఖాతంలో కొనసాగుతున్న పేథాయ్ తుఫాన్ ప్రభావం ఉమ్మడి జిల్లా ప్రజలను వణికిస్తుంది. దీంతో గత మూడు, నాలుగు రోజుల నుంచి కనిష్ట ఉష్ణోగ్రతలు అమాంతం పడిపోతున్నాయి. ఈనెల 13న 14.2 డిగ్రీల వరకు నమోదు కాగా, ఆదివారం తెల్లవారుజామున 6.4 డిగ్రీలకు కనిష్ట ఉష్ణోగ్రత పడిపోయింది. ఈఏడా ది అత్యల్పంగా నవంబర్ మాసంలో 7.9 డిగ్రీలు నమోదు కాగా, ఆ తర్వాత 6.4 డిగ్రీలు కనిష్టంగా నమోదైంది. తెల్లవారుజామున మంచు కురుస్తుండడంతో పాల వ్యాపారులు, పేపర్‌బాయ్‌లు, పారిశుధ్య కార్మికులు, ఉదయం పూట పనులకు వెళ్లే ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో రాష్ట్రంలోనే అత్యల్పంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. గాలిలో తేమ శాతం పెరిగిపోవడం, వాతావరణంలో వచ్చిన మార్పుల మూల ంగా చలి తీవ్రత పెరుగుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాత్రి వేళల్లో చలి తక్కువగా ఉన్నప్పటికీ తెల్లవారుజామున, ఉద యం పూట దీని ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. చలి తీవ్రత పెరుగుతుండడంతో గ్రామాలు, పట్టణాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో యువకులు, వృద్ధులు చలిమంటలు కాగుతున్నారు. కమ్ముకుంటున్న పొగమంచు.. పెథాయ్ తుఫాన్ కారణంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో పొగ మంచు కమ్ముకుంటోంది. ఉమ్మడి జిల్లాలో గతేడాది కనిష్ట ఉష్ణోగ్రత 3.5కి పడిపోయింది. రాష్ట్రంలోనే అత్యల్పంగా 3.5 డిగ్రీలు, గరిష్టంగా 29.7 డిగ్రీ సెల్సియస్‌గా ఉష్ణోగ్రత నమోదైంది. కాగా ఇప్పటి వరకు ఇంత తక్కువ ఉష్ణోగ్రత నమోదు కాలేదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. పెథాయ్ తుఫాన్ కారణంగా ఉష్ణోగ్రతల్లో హెచ్చు తగ్గులతో ప్రజలు చలితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజామున పొగమంచు కమ్ముకోవడంతో బయటకురాలేని పరిస్థితి ఉంటుంది. రాత్రి 7 గంటలు దాటితే చలి పంజా విసురుతోంది. గ్రామాల్లో, అటవీ çపరిసర ప్రాంతాల్లో చలి మరింత తీవ్రంగా ఉంటోంది. అత్యల్పంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు ఈసారి అత్యల్పంగా నమోదువుతన్నాయి. గత నాలుగైదు రోజుల నుంచి వణికిస్తున్న చలి ప్రకా రం డిసెంబర్, జనవరిలో తీవ్రత మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా జిల్లాలో 2012 జనవరిలో కనిష్ట ఉష్ణోగ్రత 3.7 డిగ్రీలకు పడిపోయింది. 2014 డిసెంబర్లో కనిష్ట ఉష్ణోగ్రత 3.9 డిగ్రీలుగా నమోదైంది. 2017 జనవరిలో కనిష్ట ఉష్ణోగ్రత 4 డిగ్రీలకు పడిపోయింది. 2018 జనవరిలో కనిష్ట ఉష్ణోగ్రతలు 3.5 డిగ్రీలకు పడిపోయాయి. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు.. తేదీ గరిష్టం కనిష్టం 10 31.8 16.4 11 31.8 14.7 12 28.8 12.0 13 27.8 14.2 14 27.8 12.2 15 27.8 10.8 16 26.8 6.4 ఏజెన్సీ ప్రాంతాల్లో జీవనంపై ప్రభావం.. ఉమ్మడి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరగడంతో జనజీవనంపై ప్రభావం చూపుతుంది. పంట పొలాల్లో రైతులు పంటకు నీరివ్వడం, చెట్లు, చెరువులు ఉన్న ప్రాంతాల్లో చలికి జనం అల్లాడిపోతున్నారు. చలి తీవ్రతకు వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 10 గంటలు దాటితే గాని భానుడు కనిపించడం లేదు. పట్టణాలు, గ్రామాలు అని తేడా లేకుండా ఉదయం, సాయంత్రం చలి మంటలు కాగుతూ ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. తెల్లవారుజామున విపరీతంగా మంచు కురుస్తుండడంతో ఉదయం పూట పనులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల అవస్థలు వర్ణణాతీతం. రాబోయే రోజుల్లో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశముందని వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. చలి నుంచి ఉపశమనం ఇలా.. శీతాకాలంలో వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. ఉదయం చలి తీవ్రత తగ్గిన తర్వాత 7 నుంచి 8గంటలకు నడకకు వెళ్లడం మంచిది. తాజా ఆకుకూరలు, ఉసిరికాయలు, బొప్పాయి, అనాస వంటి పండ్లు, ఖర్జూరం ఎక్కువగా తీసుకోవాలి. కూల్‌డ్రింక్స్, ఫాస్ట్‌ఫుడ్ తీసుకోవడం తగ్గించాలి. చలి తీవ్రత తగ్గేంత వరకు ఉన్ని దుస్తులు ధరించాలి. వాహనాలపై వెళ్లేవారు ముఖానికి హెల్మెట్ లేదా మాస్క్‌ను ధరించాలి. పొడి చర్మం ఉన్నవారు మాయిశ్చరైజింగ్ కోల్డ్క్రీములతో మర్థన చేసుకోవాలి. స్నానానికి వాడే సబ్బుల్లో సున్నం శాతం ఎక్కువగా ఉండే విధంగా చూసుకోవాలి. పూర్తి చన్నీళ్లతో కాకుండా గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. తుపాన్‌తో వాతావరణంలో మార్పులు పెథాయ్ తుపాన్ కారణంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. గంటకు 12 నుంచి 15 కిలో మీటర్ల వేగంతో బలంగా గాలులు వీస్తున్నాయి. సోమవారం 20 మిల్లీ మీటర్ల వర్షం పడే అవకాశముంది. ఈ గాలులు వారం రోజుల పాటు ఇలాగే ఉంటే శనగ, మొక్కజొన్న తదితర పంటలపై ప్రభావం చూపనుంది. చీడపీడలు పట్టే అవకాశముంది. పంట దిగుబడి కోసం రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. మనుషులతో పాటు జంతువులపై కూడా చలి ప్రభావం ఉంటుంది. – శ్రీధర్ చౌహాన్, వ్యవసాయ శాస్త్రవేత్త, ఆదిలాబాద్ -
రాష్ట్రంలో పెరిగిన చలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చలి మొదలైంది. తెలంగాణలో అన్ని చోట్లా రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు చలి పెరిగింది. ఆదిలాబాద్‌లో రాత్రి ఉష్ణోగ్రత ఏకంగా 10 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. రామగుండంలో 16, హన్మకొండలో 17 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో రెండు డిగ్రీలు తక్కువగా 17 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇదిలావుంటే పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయవ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తా ఆంధ్ర, దక్షిణ ఒడిశా ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అలాగే నైరుతి బంగాళాఖాతం నుంచి ఉత్తర బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిం ది. ఫలితంగా గురువారం రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. -
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు మూడు డిగ్రీల మేర తగ్గాయి. గత 24 గంటల్లో ఆదిలాబాద్‌లో 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రామగుండంలో 3 డిగ్రీలు తక్కువగా 13 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్‌లో 14 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయింది. భద్రాచలం, హకీంపేట, హన్మకొండ, ఖమ్మం, నల్లగొండల్లో 15 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్, హైదరాబాద్‌లో 17 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒకట్రెండు డిగ్రీలు అటూఇటుగా నమోదయ్యాయి. -
సంక్రాంతి నుంచి పెరగనున్న చలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. కానీ సంక్రాంతి నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నాయని‘సాక్షి’కి హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి తెలిపారు. గడచిన 24 గంటల్లో హకీంపేట, ఖమ్మంలలో సాధారణం కంటే కాస్తంత తక్కువగా రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హకీంపేటలో 14, ఆదిలాబాద్‌లో 15, ఖమ్మంలో 16 డిగ్రీల సెల్సియస్ చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మిగిలిన చోట్ల సాధారణం కంటే రెండు మూడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పగటి ఉష్ణోగ్రతలు కూడా అన్ని చోట్లా సాధారణం కంటే కాస్తంత ఎక్కువగానే రికార్డు అయ్యాయి. వచ్చే నాలుగు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని వై.కె.రెడ్డి తెలిపారు. -
లంబసింగి @గజగజ
అరకు: మన్యం ప్రాంతాన్ని మంచు దుప్పటి కప్పేసింది. మన్యం ప్రాంతంలో చలితీవ్రత రోజురోజుకు అధికమవుతోంది. విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరీ స్వల్పంగా నమోదవుతుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదివారం రాత్రి లంబసింగిలో 5.5 డిగ్రీలు, చింతపల్లిలో 8.5 డిగ్రీలు, మినుములూరు, అరకులో 9 డిగ్రీలు, పాడేరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దట్టమైన పొగమంచు వల్ల వాహనదారులు ప్రతిరోజు వేకువజామున రోడ్డు స్పష్టంగా కనిపించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
పెరిగిన రాత్రి ఉష్ణోగ్రతలు
- సాధారణం కంటే ఆరు డిగ్రీలు అధికంగా నమోదు - నాలుగైదు రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధా రణం కంటే కాస్తంత పెరిగాయి. ఆకాశం మేఘా వృతమై ఉండటంతో ఈ పరిస్థితి నెలకొంది. గత 24 గంటల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 6 డిగ్రీల వరకు అధికంగా నమోదయ్యాయి. భద్రాచలంలో సాధారణం కంటే 6 డిగ్రీలు అధికంగా 23 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లోనూ రాత్రి ఉష్ణోగ్రత సాధారణం కంటే 5 డిగ్రీలు అధికంగా 21 డిగ్రీలు నమోదైంది. మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, మెదక్, హకీంపేటల్లో 3 డిగ్రీల చొప్పున అధికంగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యారుు. ఒక్క హన్మకొండలో మాత్రమే 2 డిగ్రీలు తక్కువగా 15 డిగ్రీలు నమోదైంది. మరో రెండ్రోజులపాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డెరైక్టర్ వై.కె.రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. మరోవైపు నాలుగైదు రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అది ఆ తర్వాత వాయుగుండంగా మారే అవకాశం ఉందని, దీనివల్ల రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. -
వణికిస్తున్న చలి
లంబసింగిలో 3, ఆదిలాబాద్‌లో 8 డిగ్రీలు సాక్షి, విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాలు చలికి గజగజ వణుకుతున్నాయి. ఉత్తర, ఈశాన్య గాలులు ఉధృతమవుతుండడంతో కనిష్ట ఉష్ణోగ్రతలు రోజురోజుకు క్షీణిస్తున్నాయి. సాధారణం కంటే తెలంగాణలో 2 నుంచి 4, ఆంధ్రప్రదేశ్‌లో 2 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువగా రికార్డవుతున్నాయి. సోమవారం విశాఖ జిల్లా లంబసింగిలో 3, పాడేరులో 5, చింతపల్లిలో 6, తెలంగాణలోని ఆదిలాబాద్‌లో 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైయ్యాయి. మరో నాలుగైదు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రానున్న 4 రోజులు తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో తీవ్ర చలిగాలులు వీస్తాయని ఐఎండీ సోమవారంరాత్రి విడుదల చేసిన నివేదికలో హెచ్చరించింది. -
రాష్ట్రాన్ని వణికిస్తున్న చలి
- తెలంగాణవ్యాప్తంగా గణనీయంగా పడిపోయిన కనిష్ట ఉష్ణోగ్రతలు -రామగుండంలో 9, నిజామాబాద్‌లో 10 డిగ్రీల కనిష్టం నమోదు - అన్ని జిల్లాల్లోనూ 2 నుంచి 6 డిగ్రీల మేరకు తగ్గిన ఉష్ణోగ్రతలు హైదరాబాద్ : తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. గత 24 గంటల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్‌లలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని చోట్లా కనిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 6 డిగ్రీల వరకు నమోదయ్యాయి. ఆదిలాబాద్‌లోనైతే 4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కావడం విశేషం. మెదక్‌లో 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డు అయింది. అక్కడ సాధారణం కంటే 6 డిగ్రీలు తక్కువగా రికార్డు అయింది. రామగుండంలో 9 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయింది. అక్కడ కూడా సాధారణం కంటే 6 డిగ్రీలు తక్కువగా నమోదు కావడం గమనార్హం. నిజామాబాద్‌లో 10 డి గ్రీలు కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అక్కడ సాధారణం కంటే 4 డిగ్రీలు తక్కువగా రికార్డు అయింది. హైదరాబాద్‌లో 12.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక్కడ సాధారణం కంటే 2.4 డిగ్రీలు తక్కువగా నమోదైంది. ఒక్క హన్మకొండలో మాత్రమే సాధారణం కంటే ఒక డిగ్రీ అదనంగా 17 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నెలాఖరు వరకు రాష్ట్రంలో చలిగాలుల తీవ్రత కారణంగా ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రాంతాలవారీగా వాతావరణశాఖ చరిత్రలో రికార్డు స్థాయిలో నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతలు : 1) ఆదిలాబాద్- జనవరి 26, 2006 : 5.2 2) భద్రాచలం- జనవరి 5, 1962 : 8.4 3) హన్మకొండ- డిసెంబర్ 29,1902 : 8.3 4) హైదరాబాద్- జనవరి 8,1946 : 6.1 5) ఖమ్మం- జనవరి 8, 1946 : 9.4 6) మహబూబ్‌నగర్- జనవరి 16,2009 : 9.1 7) మెదక్- డిసెంబర్ 11, 1981 : 6.9 8) నల్లగొండ- డిసెంబర్ 22, 2010 :10.6 9) నిజామాబాద్- డిసెంబర్ 17,1897 : 4.4 10) రామగుండం- జనవరి 14,2012 : 6.8 -
మన్యంలో చలిగాలులు
వారం రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతం లంబసింగిలో 9 డిగ్రీలు వృద్ధులు, చిన్నారులు విలవిల పాడేరు/చింతపల్లి: మన్యంలో చలిగాలులు వీస్తున్నాయి. వారం రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శీతల గాలులతో రెండు రోజులుగా చలితీవ్రత పెరిగింది. ఆదివారం పాడేరులో 13 డిగ్రీలు, మోదాపల్లిలో 10 డిగ్రీలు, చింతపల్లిలో 12 డిగ్రీలు, లంబసింగిలో 9 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దట్టంగా కాఫీ తోటలు ఉండే మోదాపల్లి, మినుములూరు, అరకు, అనంతగిరి, చింతపల్లి, జీకేవీధి ప్రాంతాల్లో పగలు కూడా చలి వణికిస్తోంది. పొగమంచు దట్టంగా కురుస్తోంది. ఉదయం 10 గంటలు వరకు మంచు తెరలు వీడడం లేదు. సాయంత్రం 5 నుంచే ఆదివాసీలు ఇళ్లకు పరిమితమవుతున్నారు. రాత్రిళ్లు నెగడులను ఆశ్రయిస్తున్నారు. ఏజెన్సీలో ఏటా నవంబర్ నుంచి చలి ముదురుతుంది. పది రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో చలితీవ్రత పెరిగింది. ఆదివారం ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో వృద్ధులు, చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. ఉన్ని దుస్తులకు డిమాండ్ ఏర్పడింది. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డి.శేఖర్ తెలిపారు. -
మంచు గుప్పెట్లో మన్యం
లంబసింగిలో 1, పాడేరు ఘాట్‌లో 2, చింతపల్లి, పాడేరుల్లో 4, మినుములూరులో 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు పాడేరు: విశాఖ ఏజెన్సీలో 5 రోజుల నుంచి చలిగాలులు విజృంభిస్తున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో చలి తీవ్రత అధికంగా ఉంది. మన్యం ప్రజలు చలిగాలులతో వణుకుతున్నారు. సోమవారం చింతపల్లి, పాడేరు ప్రాంతాల్లో 4 డిగ్రీలు, లంబసింగిలో 1 డిగ్రీ, పాడేరు ఘాట్‌లోని పోతురాజు స్వామి గుడి వద్ద 2 డిగ్రీలు, మినుములూరు కాఫీ బోర్డు వద్ద 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాయంత్రం 4 గంటల నుంచి వాతావరణం మరింత చల్లగా ఉంటుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గిరిజనులంతా తమ ఇంటి పరిసరాల్లో చలి మంటలు వేసుకొని ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాత్రి వేళల్లో చలి మరింత విజృంభిస్తుండటంతో ప్రజలు నరకయాతన పడుతున్నారు. అర్ధరాత్రి నుంచే పొగమంచు దట్టంగా కురుస్తోంది. ఉదయం 10 గంటల వరకు ఏజెన్సీలో మంచు తెరలు వీడకపోవడంతో వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ పనులకు వెళ్లే గిరిజనులు సూర్యోదయం అయ్యేంతవరకు ఇళ్లకే పరిమితమవుతున్నారు. చిన్నారులు, వృద్ధులు చలిని తాళలేక అవస్థలు పడుతున్నారు. వేకువజామునే నీళ్ల సేకరణకు వెళ్లే మహిళలు కూడా వణికించే చలితో భయాందోళనలు చెందుతున్నారు. సంక్రాంతి సెలవులు రావడంతో అనేక కుటుంబాలు చలికి భయపడి మైదాన ప్రాంతాలకు తరలి వెళ్లారు. పర్యాటకుల సంచారం కూడా తక్కువగానే ఉంది. మినుములూరు కాఫీబోర్డు, ఏపీఎఫ్డీసీ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల కుటుంబాలు, కాఫీ తోటల్లో పనులకు వెళ్లే కార్మికులు చలికి అవస్థలు పడుతున్నారు. -
చలి@11.2
తగ్గని శీతలగాలుల ఉద్ధృతి వచ్చే 24 గంటల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుముఖం సిటీబ్యూరో: ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలులు, మంచు గ్రేటర్‌పై ముసురుకుంటున్నాయి. గత మూడు రోజులుగా కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పడిపోతున్నాయి. చలిసిటీజనులను గజ గజలాడిస్తోంది. సోమవారం కనిష్టంగా 11.2 డిగ్రీలు, గరిష్టంగా 27.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. గాలిలో తేమ 41 శాతానికి పడిపోయింది. చలికితోడు ఉదయం వేళ కురుస్తున్న మంచు కారణంగా ఆస్తమారోగులు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు అవస్థలు పడుతున్నారు. ఇళ్లలో ఉన్నా చలి వణికిస్తోంది. అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. రాగల 24 గంటల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గడంతో పాటు, శీతల గాలుల ఉద్ధృతి పెరిగే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర భారతంలో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పడిపోతుండడంతో నగరం వైపు వీస్తున్న శీతల గాలులు ఉద్ధృతి తీవ్రంగా ఉందని చెబుతున్నారు. మరికొన్ని రోజులు ఈ పరిస్థితి తప్పదని హెచ్చరిస్తున్నారు. తప్పనిసరై, చలిలో బయటికి వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. -
మన్యం విలవిల
కనిష్ట ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్న గిరిజనులు లంబసింగిలో 0, పాడేరు ఘాట్‌లో1 డిగ్రీ చింతపల్లిలో 3, మినుములూరులో 4 డిగ్రీలు నమోదు ఉదయం 10 గంటల తరువాతే సూర్యోదయం చింతపల్లి: కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదుతో ఏజెన్సీ వాసులు విలవిల్లాడిపోతున్నారు. చింతపల్లి మండలం లంబసింగి, పాడేరు మండలంమినుములూరుతోపాటు మిగతా ప్రాంతాల్లోని వారు వణికించే చలితో నరకయాతన పడుతున్నారు. ఆదివారం పర్యాటక ప్రాంతం లంబసింగిలో సున్నా ,పాడేరు ఘాట్‌లోని పోతురాజుస్వామి గుడి వద్ద ఒక డిగ్రీ, చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 3 డిగ్రీలు, మినుములూరు కేంద్ర కాఫీబోర్డు, అనంతగిరి, అరకుల్లో 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 10 గంటలు దాటాకే సూర్యుడు కనిపిస్తున్నాడు. సముద్ర మట్టానికి ఎత్తయిన ప్రదేశం కావడంతో ఏజెన్సీలో ఈ పరిస్థితి అని, జనవరిలో చలితీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డి.శేఖర్ తెలిపారు. ఉత్తర భారతదేశంలో మాదిరి ఇక్కడ శీతల గాలులు వీస్తుండటం వల్ల ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయన్నారు. 2010 డిసెంబరు 19న చింతపల్లిలో అతి స్వల్పంగా 3 డిగ్రీలు నమోదుకాగా, లంబసింగిలో మైనస్ డిగ్రీలు, 2012 జనవరి 14, 15 తేదీల్లో చింతపల్లిలో ఒక డిగ్రీ, లంబసింగిలో మైనస్ 2 డిగ్రీలు నమోదయ్యాయి. మరుసటి రోజయిన 16వ తేదీన చింతపల్లిలో 2 డిగ్రీలు నమోదయ్యాయి. 2013 డిసెంబరు 13న చింతపల్లిలో అతి స్వల్పంగా 5 డిగ్రీలు, లంబసింగిలో 2 డిగ్రీలు నమోదయ్యాయి. ఈ ఏడాది డిసెంబరు 20న చింతపల్లిలో 5 డిగ్రీలు, లంబసింగిలో 2 డిగ్రీలు, 21న చింతపల్లిలో 3 డిగ్రీలు, లంబసింగిలో సున్నా డిగ్రీలు నమోదైనట్లు శేఖర్ తెలిపారు. సాయంత్రం 4 గంటల నుంచే చలిగాలులు వీస్తున్నాయి. ఉదయం 10 గంటలు వరకు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు. చలి తీవ్రతతో రాత్రిళ్లు నిద్ర పట్టని దుస్థితి. నెగడులు(చలిమంటలు) వేసుకుని ఉపశమనం పొందుతున్నారు. పగటి పూట కూడా ఉన్ని దుస్తులు ధరిస్తున్నారు. కాఫీ తోటల్లో పండ్ల సేకరణకు వెళుతున్న వారి పరిస్థితి దయనీయంగా ఉంది. దట్టమైన మంచుతో పర్యాటకులు, వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. -
వామ్మో ఇదేం చలి!
తాండూరు: కనిష్ట ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో పడిపోతుండటంతో జనాలు చలితో గజగజ వణుకుతున్నారు. ఉదయం 10 గంటలైనా దీని తీవ్రత తగ్గని పరిస్థితి. సాయంత్రం 6 గంటలకే ప్రజలు దుప్పట్లు ముసుగేస్తున్నారు. ఆదివారం ఈ సీజన్లోనే అత్యల్ప ఉష్ణోగ్రత 7.9. డిగ్రీలు నమోదు కావడం చలి తీవ్రత ఎంతగా ఉందో తెలుస్తోంది. ఉత్తర, వాయవ్యం నుంచి దక్షిణ దిశకు శీతల వాయువులు వీస్తుండటంతో కనిష్ట ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయి.. చలి విపరీతంగా పెరుగుతోందని తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త సుధాకర్ పేర్కొన్నారు. ఈ నెల 18న 9.6 డిగ్రీలు, 19న 11.6, 20న 8.8, 21న 7.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయన్నారు. కనిష్ట ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతుండటంతో ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. బయటకు వెళ్లేటప్పుడు తలతో పాటు శరీరానికి రక్షణగా స్వెటర్లు కచ్చితంగా ధరించాలని, చేతులకు గ్లౌస్లు వేసుకోవాలంటున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు చలి ప్రభావం బారిన పడకుండా దుస్తులు ధరించాలని సూచిస్తున్నారు. -
మన్యానికి చలి
దట్టంగా కురుస్తున్న పొగమంచు పాడేరు ఘాట్, లంబసింగిలో 4 డిగ్రీలు మినుములూరు, చింతపల్లిలో 7 డిగ్రీల నమోదు పాడేరు: విశాఖ ఏజెన్సీలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో చలిగాలులు విజృంభిస్తున్నాయి. పాడేరు సమీపం మినుములూరు కాఫీబోర్డు వద్ద శుక్రవారం 7 డిగ్రీలు, చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 7 డిగ్రీలు, చింతపల్లి మండలం పర్యాటక ప్రాంతమైన లంబసింగిలో 4 డిగ్రీలు, పాడేరు ఘాట్‌లోని పోతురాజు స్వామి గుడి వద్ద 4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాయంత్రం 4 గంటల నుంచే చలితో మన్యంవాసులు వణికిపోతున్నారు. రాత్రివేళల్లో చలి తీవ్రత మరింత అధికంగా ఉండటంతో చలిమంటలు వేసుకుంటున్నారు. ప్రస్తుతం ఏజన్సీలో వరిపంట నూర్పుల సమయం కావడంతో వరి కుప్పల వద్ద కాపలాకాసే గిరిజనులు నరకయాతన పడుతున్నారు. మంచు దట్టంగా కురవడంతో శుక్రవారం పాడేరు సంతకు వచ్చిన గిరిజనులంతా చలితో వణికిపోయారు. -
గత ఏడాది కంటే తగ్గిన ఉష్ణోగ్రత
చింతపల్లి: ఆంధ్రా కశ్మీరుగా గుర్తింపు పొందుతున్న లంబసింగిలో కొద్ది రోజులుగా చలి గజగజ వణికిస్తోంది. గత ఏడాదితో పోల్చి చూస్తే ఈ ఏడాది ఎక్కువసార్లు స్వల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత ఏడాది నవంబరు 27న చింతపల్లిలో 9, లంబసింగిలో 6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవ్వగా ఈ ఏడాది అక్టోబరు 29 నుంచే చలి ప్రారంభమైంది. చింతపల్లిలో అక్టోబరు 29న 16, 31న 15 డిగ్రీలు, నవంబరు 27,28 తేదీల్లో 9 డిగ్రీలు, 29న 10 డిగ్రీలు, 30న, డిసెంబరు 1 8 డిగ్రీలు నమోదు కాగా, లంబసింగిలో 5 డిగ్రీలు నమోదైంది. మంగళవారం చింతపల్లిలో 7 డిగ్రీలు, లంబసింగిలో4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా బుధవారం నాటికి మాత్రం ఒక్కో డిగ్రీ పెరిగింది. గత ఏడాది డిసెంబరు 16,17 తేదిల్లో చింతపల్లిలో 5 డిగ్రీలు, లంబసింగిలో 2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆ ఏడాదికి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలే అతిస్వల్పం కాగా ఈ ఏడాది నవంబరు నెలాఖరు నుంచే ఉష్ణోగ్రతలు భారీగా తగ్గిపోతున్నాయి. రానున్న రోజుల్లో లంబసింగిలో 0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పరిశోధన స్థానం శాస్త్రవేత్త డి.శేఖర్ తెలిపారు. గత ఏడాది నవంబరు, డిసెంబరు నెలల్లో వాతావరణంలో చోటుచేసుకున్న మార్పుల కారణంగా చలి తక్కువగా ఉండేదని, ఈ ఏడాది ఆ పరిస్థితి కనిపించడం లేదని ఆయన తెలిపారు. -
పాడేరు ఘాట్ @ 3 డిగ్రీలు
విశాఖ ఏజెన్సీలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సముద్రమట్టానికి మూడువేల పైచిలుకు అడుగుల ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గిపోయి గిరిజనులు చలికి గజగజ వణికిపోతున్నారు. ఆదివారం పాడేరుఘాట్‌లోని అతిశీతల ప్రాంతమైన పోతురాజుస్వామి గుడి వద్ద 3డిగ్రీలు, పర్యాటక ప్రాంతం లంబసింగిలో 5డిగ్రీలు, మినుములూరు కేంద్ర కాఫీబోర్డు వద్ద 6 డిగ్రీలు, చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మన్యమంతటా పెద్ద ఎత్తున చలిగాలులు వీస్తున్నాయి. -
ఏజెన్సీని వణికిస్తున్న చలి
పాడేరు/చింతపల్లి: విశాఖ ఏజెన్సీలో చలి తీవ్రత రోజు రోజుకు అధికమవుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్నరోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని పరిశోధన స్థానం శాస్త్రవేత్త దేశగిరి శేఖర్ తెలిపారు. మన్యమంతటా చలిగాలులు వీస్తున్నాయి. గురువారం పర్యాటక ప్రాంతాలైన లంబసింగిలో 6 డిగ్రీలు, పాడేరు ఘాట్‌లోని పోతురాజు స్వామి గుడివద్ద 7 డిగ్రీలు, చింతపల్లిలో 9 డిగ్రీలు, పాడేరుకు సమీపంలోని మినుములూరు వద్ద 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏజెన్సీలో గత నెల 29 నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. తుఫాన్ ప్రభావం వల్ల కొద్ది రోజులు చలి తీవ్రత తగ్గినప్పటికి 3 రోజులుగా ఈ ప్రాంతంలో మళ్లీ చలి విజృంభిస్తోంది. పొగమంచు దట్టంగా వర్షం మాదిరి కురుస్త్తోంది. ఏజెన్సీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడి అందాలను వీక్షించేందుకు వస్తున్న పర్యాటకులు గజగజ వణుకుతున్నారు. సాయంత్రం 4 గంటల నుంచే చలిగాలులు వీస్తున్నాయి. అర్థరాత్రి నుంచే మంచు దట్టంగా కురుస్తుంది. సూర్యోదయం ఆలస్యమవుతోంది. ఉదయం 10 గంటల వరకు సూర్యకిరణాలు కనిపించడం లేదు. గిరిజనులంతా చలిమంటలను ఆశ్రయిస్తున్నారు. ఏజెన్సీలో ఉన్ని దుస్తుల వినియోగం కూడా అధికమైంది. -
మన్యమా..మరో కాశ్మీరమా..
పాడేరు/చింతపల్లి: మన్యం వాతావరణం మరో కాశ్మీర్‌ను తలపిస్తోంది. కొద్ది రోజులుగా ఇక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.ముఖ్యంగా సముద్ర మట్టానికి 3 వేల మీటర్ల ఎత్తులో ఉన్న లంబసింగిలో రోజు ఉదయం 10 గంటల వరకు పొగమంచు దట్టంగా కమ్ముకుంటోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదుతో మన్యం వాసులు గజగజ వణుకుతున్నారు. ఈ వాతావరణం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. చింతపల్లి,పాడేరు సమీపంలోని మినుములూరులో మంగళవారం 11 డిగ్రీలు, నిత్యం చల్లటి ప్రాంతాలుగా గుర్తింపు పొందిన లంబసింగి,పాడేరు ఘాట్‌లోని పోతురాజుస్వామి గుడి వద్ద 8 డి గ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బుధవారం ఉష్ణోగ్రత మరింత తగ్గింది. మినుములూరు ,చింతపల్లి కేంద్రాల్లో 10 డిగ్రీలు, పాడేరు ఘాట్, లంబసింగిలో ఏడు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాయంత్రం నాలుగు గంటల నుంచే చలి వణికిస్తోంది. పొగ మంచు దట్టంగా కురుస్తోంది. ఉదయం 10 గంటల వరకు సూర్యుడు కనిపించడం లేదు. సూర్యోదయం వరకు జనం చలితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం వేళల్లో పాఠశాలలకు వెళ్లే చిన్నారులు,వ్యవసాయ పనులకు వెళ్లే గిరిజనులు నరకయాతన పడుతున్నారు. వచ్చే ఏడాది జనవరి రెండో వారం వరకు ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు కనిష్టంగానే నమోదవుతాయని చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త శేఖర్ సాక్షికి తెలిపారు. -
వామ్మో.. చలి
జగిత్యాల జోన్, న్యూస్‌లైన్ :అకాల వర్షాలు భయపెడుతున్నాయి. ఈదురుగాలులు కలవరపెడుతున్నాయి. వాతావరణ మార్పులతో కురుస్తున్న వర్షాలకు తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లాలో చలి తీవ్రత పెరుగుతోంది. గరి ష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నా యి. వేసవి ప్రారంభమైన ఈ తరుణంలో గరిష్ట ష్ణోగ్రతలు 25 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీలకంటే తక్కువకు పడిపోవడం కలవరపెడుతోంది. గాలిలో తేమశాతం అధికంగా ఉండడం, ఆకాశం మేఘావృతమై ఉండడంతోపాటు ఈదరగాలులు వీస్తున్నాయి. విజృంభిస్తున్న చలి తీవ్రతతో ఇటు వృద్ధులు, అటు చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జలుబు, జ్వరంతో చిన్నారులు అసుపత్రుల బారిన పడుతున్నారు. ఆకాల వర్షాలు అకాల వర్షాలు ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ నెలల్లో ఎప్పుడో ఓ సారి కురుస్తుంటాయి. గంటల్లోనే దీని ప్రభావం ముగుస్తుంది. అకాల వర్షాలకు అల్పపీడన ద్రోణి జతకావడంతో నాలుగైదు రోజులుగా జిల్లాలో వర్షాలు, వడగండ్ల వాన కురుస్తోంది. ఫలితంగా మొక్కజొన్న, మామిడి తదితర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చలితీవ్రత సాధారణంగా చలి ప్రభావం ఫిబ్రవరి నెలాఖరు వరకే ఉంటుంది. శివరాత్రికి చలి శివశివా.. అంటూ వెళ్తుందని చెబుతుంటారు. కానీ, శివరాత్రి అయిపోయిన తర్వాత చలిగాలుల తీవ్రత పెరిగింది. సాధారణ రోజుల్లో గంటకు 3 నుంచి 5 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు అల్పపీడన సమయంలో మాత్రం 12 నుంచి 20 కి.మీ. వేగంతో వీస్తుంటాయి. ఈ గాలు లు భూభాగం పైకి వచ్చే సమయంలో, మార్గమధ్యలో ఏదైనా ఆటంకం ఎదురైతే గాలులు దిశను మార్చుతాయి. దీనివల్ల వర్షాలు, తేమ శాతం కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఫలితంగా చలి ప్రభావం పెరుగుతుంది. జిల్లాలో ప్రస్తుతం ఇవే పరిస్థితులు కొనసాగుతున్నాయి. అల్పపీడన ద్రోణి ప్రభావం మరో రెండు రోజులు ఉండే అవకాశం ఉంది. అంటే ఈదరగాలుల ప్రభావం మరో రెండు రోజుల తప్పదన్నమాటే.