ఏజెన్సీని వణికిస్తున్న చలి | Low temperatures in Visakha Agency | Sakshi
Sakshi News home page

ఏజెన్సీని వణికిస్తున్న చలి

Published Fri, Nov 28 2014 2:05 AM | Last Updated on Sat, Sep 2 2017 5:14 PM

ఏజెన్సీని వణికిస్తున్న చలి

ఏజెన్సీని వణికిస్తున్న చలి

పాడేరు/చింతపల్లి: విశాఖ ఏజెన్సీలో చలి తీవ్రత రోజు రోజుకు అధికమవుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్నరోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని పరిశోధన స్థానం శాస్త్రవేత్త దేశగిరి శేఖర్ తెలిపారు. మన్యమంతటా చలిగాలులు వీస్తున్నాయి. గురువారం పర్యాటక ప్రాంతాలైన లంబసింగిలో 6 డిగ్రీలు, పాడేరు ఘాట్‌లోని పోతురాజు స్వామి గుడివద్ద 7 డిగ్రీలు, చింతపల్లిలో 9 డిగ్రీలు, పాడేరుకు సమీపంలోని మినుములూరు వద్ద 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.  ఏజెన్సీలో గత నెల 29 నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి.

తుఫాన్ ప్రభావం వల్ల కొద్ది రోజులు చలి తీవ్రత తగ్గినప్పటికి 3 రోజులుగా ఈ ప్రాంతంలో మళ్లీ చలి విజృంభిస్తోంది. పొగమంచు దట్టంగా వర్షం మాదిరి కురుస్త్తోంది. ఏజెన్సీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడి అందాలను వీక్షించేందుకు వస్తున్న పర్యాటకులు గజగజ వణుకుతున్నారు. సాయంత్రం 4 గంటల నుంచే చలిగాలులు వీస్తున్నాయి. అర్థరాత్రి నుంచే మంచు దట్టంగా కురుస్తుంది. సూర్యోదయం ఆలస్యమవుతోంది. ఉదయం 10 గంటల వరకు సూర్యకిరణాలు కనిపించడం లేదు. గిరిజనులంతా చలిమంటలను ఆశ్రయిస్తున్నారు. ఏజెన్సీలో ఉన్ని దుస్తుల వినియోగం కూడా అధికమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement