సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. కానీ సంక్రాంతి నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నాయని‘సాక్షి’కి హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి తెలిపారు. గడచిన 24 గంటల్లో హకీంపేట, ఖమ్మంలలో సాధారణం కంటే కాస్తంత తక్కువగా రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
హకీంపేటలో 14, ఆదిలాబాద్‌లో 15, ఖమ్మంలో 16 డిగ్రీల సెల్సియస్ చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మిగిలిన చోట్ల సాధారణం కంటే రెండు మూడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పగటి ఉష్ణోగ్రతలు కూడా అన్ని చోట్లా సాధారణం కంటే కాస్తంత ఎక్కువగానే రికార్డు అయ్యాయి. వచ్చే నాలుగు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని వై.కె.రెడ్డి తెలిపారు.
సంక్రాంతి నుంచి పెరగనున్న చలి
Published Wed, Jan 11 2017 3:22 AM | Last Updated on Tue, Sep 5 2017 12:55 AM
Advertisement