లంబసింగి @గజగజ
అరకు: మన్యం ప్రాంతాన్ని మంచు దుప్పటి కప్పేసింది. మన్యం ప్రాంతంలో చలితీవ్రత రోజురోజుకు అధికమవుతోంది. విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరీ స్వల్పంగా నమోదవుతుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదివారం రాత్రి లంబసింగిలో 5.5 డిగ్రీలు, చింతపల్లిలో 8.5 డిగ్రీలు, మినుములూరు, అరకులో 9 డిగ్రీలు, పాడేరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దట్టమైన పొగమంచు వల్ల వాహనదారులు ప్రతిరోజు వేకువజామున రోడ్డు స్పష్టంగా కనిపించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.