Lambasingi
-
శ్వేత మయూరం మన కశ్మీరం
పచ్చటి పర్వత శ్రేణులను ముద్దాడుతున్న మేఘమాలలు..దట్టంగా కమ్ముకున్న పొగమంచు.. శ్వేత వర్ణంలో మెరిసిసోయే మంచు దుప్పట్లు.. మలుపు తిరిగే కొండ అంచుల్లో కనువిందుచేసే అటవీ అందాలు.. ఓవైపు చల్లని గాలులు మరోవైపు ఆకుపచ్చని హరిత అందాలు.. అడవులపై పరిచినట్టుగా పవళించే మేఘాలు.. ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంజాయ్ చేయాలంటే కశ్మీర్ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. లంబసింగిని సందర్శిస్తే సరిపోతుంది. ఇక్కడ ప్రకృతి అందాలను చూస్తేవావ్ అనాల్సిందే. చింతపల్లి: మండలంలోని లంబసింగికి తెలుగు రాష్ట్రాల్లో ఓ ప్రత్యేకత ఉంది. చలికాలంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం ఇదే కావడం అందుకు కారణం. చలికాలం బాగా ఉధృతంగా ఉండే తరుణంలో ఇక్కడ సగటు ఉష్ణోగ్రత మూడు డిగ్రీలకు మించదు. అత్యల్ప ఉష్ణోగ్రత ఒక డిగ్రీ సెల్సియస్‌గా ఇక్కడ వివిధ సందర్భాల్లో నమోదైంది. 3,600 అడుగుల ఎత్తులో.. సముద్రమట్టానికి 3,600 అడుగుల ఎత్తున ఉన్న లంబసింగి ఒకప్పుడు ఎలాంటి ప్రత్యేకతలూ లేని చిన్న గిరిజన పల్లె. అటవీశాఖ చెక్‌పోస్టు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఆశ్రమ గురుకుల పాఠశాల మాత్రమే ఉండేవి. విశాఖపట్నం, నర్సీపట్నం, పాడేరు నుంచి బస్సులు మాత్రం ఈ ప్రాంతం మీదుగా తరచూ తిరిగేవి. ⇒ శీతాకాలంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడం వల్ల చలి తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ ఉన్న చెక్‌పోస్టు సెంటర్లో చాలాకాలం క్రితం ఓ చెట్టుకింద ఒక వ్యక్తి చలికి కొయ్యబారి చనిపోయాడని చెబుతుంటారు. అందువల్ల ఈ ప్రాంతాన్ని కొర్రబయలు అని కూడా పిలిచేవారు. ⇒ మైదాన ప్రాంతంలో సాధారణంగా ఏడాదికి నాలుగు నెలలు మాత్రం చలి ఉంటుంది. కానీ లంబసింగి ప్రాంతంలో అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు చలి వణికిస్తుంది. సెపె్టంబర్ మొదటి వారం నుంచి చలి ప్రభావం కనిపిస్తుంది. డిసెంబర్లో ఒక డిగ్రీ సెంటీగ్రేడ్ నమోదైన సందర్బాలు ఉన్నాయి. ఇక్కడికి 20 కిలోమీటర్ల దూరంలో ఉండే చింతపల్లిలో ఉష్ణోగ్రత ఇక్కడకన్నా రెండు డిగ్రీలు ఎక్కువగా ఉంటుంది. నిత్యం భోగి మంటలే.. ప్రతీ ఇంట్లో అందరికీ పెద్ద రగ్గులు ఉంటాయి. స్వెటర్లు, కంబళ్లు తప్పనిసరి. మంట కోసం కట్టెలు సిద్ధంగా ఉంచుకుంటారు. సాయంత్రమయ్యేసరికి ప్రతి ఇంట్లో అన్నం వండుకోవడానికన్నా ముందు కుంపట్లు సిద్ధం చేసుకుంటారు.తాజంగిలో బోటు షికార్, జిప్‌లైన్ తాజంగి జలాశయంలో ఐటీడీఏ ఏర్పాటుచేసిన బోట్ షికార్ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. లంబసింగి వచ్చే పర్యాటకులందరూ 20 నిమిషాలు బోటులో షికారు చేసి ఎంతో సంతోషం పొందుతుంటారు. జలాశయం మీదుగా ఏర్పాటుచేసిన జిప్వే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సుమారు 250 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ జిప్ లైన్ ద్వారా కొండపై నుంచి చెరువు వరకు జారుతూ ప్రకృతి అందాలను తిలకిస్తూ పర్యాటకులు ఎంజాయ్ చేస్తుంటారు. మరో వ్యూపాయింట్ నర్సీపట్నం నుంచి లంబసింగి వచ్చే మార్గంలో బోడకొండమ్మ ఆలయం వద్ద మరో వ్యూపాయింట్ అందుబాటులోకి వచ్చింది. గత అరకు ఎంపీ మాధవి నిధులు వెచ్చించి దీనిని నిర్మించారు. ⇒ నర్సీపట్నం నుంచి ప్రయాణం ప్రారంభించాక చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతంలో మలుపులతో కూడిన రోడ్లు, పచ్చని చెట్ల మధ్య ఆహ్లాదకరంగా ప్రయాణం సాగుతుంది. ఈ మార్గంలో కాఫీ, మిరియం తోటలు ఆకట్టుకుంటాయి. ⇒ విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ నుంచే కాకుండా ఏకంగా బెంగళూరు నుంచి కూడా వాహనాల్లో పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు. దీనిని బట్టి ఈ ప్రదేశానికి ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. విశాఖపట్నం, నర్సీపట్నం నుంచి ఈ ప్రాంతానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది.పర్యాటక సీజన్లో కళకళ పర్యాటక సీజన్ వచ్చిందంటే చాలు లంబసింగి పర్యాటకులతో కళకళలాడుతుంది. ఇక్కడ పూర్తిస్థాయిలో వసతులు లేనందున సమీప నర్సీపట్నంలో బస చేసి తెల్లవారుజామున ఇక్కడి పర్యాటకులు వచ్చేవారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసింది. పర్యాటకశాఖ ఆధ్వర్యంలో రిసార్ట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రైవేట్ కాటేజీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి.కొండల్లో ‘పాల సముద్రం’ చెరువులవేనం కొండల్లో ప్రకృతి అందాలు పాలసముద్రాన్ని తలపిస్తాయి. ఈ ప్రాంతం లంబసింగికి సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో పొగమంచు దట్టంగా కమ్మి ఉంటుంది. మేఘాలు మనతో మాట్లాడుతున్నాయా అనిపిస్తుంది. ఈ అపురూప అందాలను తిలకించేందుకు ఎక్కడెక్కడినుంచో ప్రకృతి ప్రేమికులు ఇక్కడికి వస్తుంటారు. పర్యాటకులకు సౌకర్యవంతంగా ఉండేలా పాడేరు ఐటీడీఏ వ్యూపాయింట్‌ను నిర్మించింది. ⇒ శీతల వాతావరణం ప్రారంభమైన నాటి నుంచి వచ్చే పర్యాటకులతో తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి లంబసింగి సెంటర్ జాతరను తలపిస్తుంది. వీకెండ్లో అయితే ఇక చెప్పనక్కర్లేదు. శని, ఆదివారాల్లో అయితే చెరువులవేనం జనసంద్రంగా మారుతుంది. కొంతమంది శనివారం రాత్రి లంబసింగి వచ్చి గుడారాలు వేసుకొని రాత్రంతా జాగారం చేస్తూ దట్టంగా కురుస్తున్న పొగమంచును ఆస్వాదిస్తూ గడుపుతారు. వేకువజామున చెరువులవేనం వెళ్లి ప్రకృతి అందాలను తిలకిస్తారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే అభివృద్ధి ఏజెన్సీలో పర్యాటక అభివృద్ధికి గత ప్రభుత్వం రూ.కోట్లలో నిధులు వెచ్చించి అభివృద్ధి చేసింది. తాజంగిలో స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణం చేపట్టింది. చెరువులవేనం, బోడకొండ గుడి వద్ద వ్యూపాయింట్లు నిర్మించింది.కృష్ణాపురం వద్ద ఎకో టూరిజం ప్రాజెక్ట్‌ను ఏర్పాటుచేసింది. తాజంగి జలాశయాన్ని అభివృద్ధి చేసింది. – మత్స్యరాస విశ్వేశ్వరరాజు, పాడేరు ఎమ్మెల్యేకనీస వసతులు అవసరం పర్యాటక ప్రాంతంగా పాచు ర్యం పొందడంతో ఈ ప్రాంత అందాలను చూడడానికి ఎంతోమంది కుటుంబాలతో వ స్తున్నారు.ఈ ప్రాంతంలో కనీస వసతులు లేక పోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం ఏర్పాటుకు అ««ధికారులు చర్యలు చేపట్టాలి.వాహనాల నిలుపుదలకు పార్కింగ్ సౌకర్యం కల్పించాలి. – ప్రశాంత్, పర్యాటకుడు విజయనగరం -
ఓటీటీ ప్రియులకు పండగే.. ఈ వారం 15 చిత్రాలు స్ట్రీమింగ్!
చూస్తుండగానే మరో వారం వచ్చేసింది. ఇప్పుడిప్పుడే వేసవి సెలవులు ప్రారంభమవుతున్నాయి. ఇక రాబోయే రెండు నెలల్లో విద్యాసంస్థలకు సెలవులు రానున్నాయి. ఈ హాలీడేస్‌లో ఫ్యామిలీతో కలిసి చిల్ అయ్యేది ఒక్క ఎంటర్టైన్మెంట్ మాత్రమే. ముఖ్యంగా సినీ ప్రియుల కోసం ఈ వారంలో అలరించేందుకు సినిమాలు సిద్ధమైపోయాయి. ఈ వారం థియేటర్లలో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దీంతో పాటు మలయాళ బ్లాక్ బస్టర్ మంజుమ్మల్ బాయ్స్ తెలుగు ప్రేక్షకులను అలరించనుంది. సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన తమిళ చిత్రం మాయవన్ ఏడేళ్ల తర్వాత టాలీవుడ్లో ప్రాజెక్ట్-జెడ్ పేరుతో రిలీజవుతోంది. వీటితో పాటు భరతనాట్యం, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ బహుముఖం లాంటి చిన్న చిత్రాలు సైతం బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. అయితే ఈ వారంలో ఓటీటీలోనూ సందడి చేసేందుకు పలు చిత్రాలు వచ్చేస్తున్నాయి. గోపీచంద్ నటించిన భీమా, టాలీవుడ్ భామ దివి చిత్రం లంబసింగి, హనుమాన్ ఓటీటీలో సందడి చేయనున్నాయి. దీంతో పాటు బాలీవుడ్ మూవీ ఫర్రీ ఓటీటీకి వచ్చేస్తోంది. అంతే కాకుండా పలు వెబ్ సిరీస్‌లు, హాలీవుడ్ సినిమాలు సందడి చేయనున్నాయి. ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగా కానుందో మీరు ఓ లుక్కేయండి. నెట్‌ఫ్లిక్స్ టుగెదర్(వెబ్ సిరీస్)- ఏప్రిల్ 02 ఫైల్స్ ఆప్ ది ఆన్ఎక్స్ప్లెయిన్డ్(వెబ్ సిరీస్)- ఏప్రిల్ 03 రిప్ లే(వెబ్ సిరీస్)- ఏప్రిల్ 04 పారాసైట్- ది గ్రే(కొరియన్ సిరీస్)- ఏప్రిల్ 05 స్కూప్- హాలీవుడ్ సినిమా- ఏప్రిల్ 025 అమెజాన్ ప్రైమ్ మ్యూజికా(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 04 యే మేరీ ఫ్యామిలీ(వెబ్ సిరీస్)- సీజన్ 3- ఏప్రిల్ 04 హౌ టూ డేట్ బిల్లీ వాల్ష్- (హాలీవుడ్ చిత్రం)- ఏప్రిల్ 05 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లంబసింగి- (తెలుగు సినిమా)- ఏప్రిల్ 02 భీమా (టాలీవుడ్ చిత్రం) ఏప్రిల్ 5 హనుమాన్(తమిళం, కన్నడ, మలయాళం వర్షన్)- ఏప్రిల్ 05 జీ5 ఫర్రీ- (బాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 05 యాపిల్ టీవీ ప్లస్ లూట్ సీజన్- 2(వెబ్ సిరీస్)- ఏప్రిల్ 03 సుగర్(హాలీవుడ్ చిత్రం)- ఏప్రిల్ 05 సోనీలివ్ ఫ్యామిలీ ఆజ్ కల్(హిందీ సినిమా)- ఏప్రిల్ 03 -
రెండు వారాల్లోనే ఓటీటీలోకి 'బిగ్ బాస్' బ్యూటీ సినిమా.. అధికారిక ప్రకటన
బిగ్‌బాస్ ఫేం దివి హీరోయిన్గా నటించిన తాజా చిత్రం ‘లంబసింగి’.‘ఎ ప్యూర్ లవ్ స్టోరీ’ అనేది ఉపశీర్షిక. నవీన్ గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని టాలీవుడ్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కురసాల నిర్మించాడు. ఈ మూవీ ద్వారా భరత్ రాజ్ హీరోగా పరిచయం అయ్యాడు. మార్చి 15న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కొంతమేరకు మెప్పించింది. ఇప్పుడు ఓటీటీలోకి విడుదల కానుంది. ఈమేరకు హాట్‌స్టార్ నుంచి అధికారిక ప్రకటన కూడా వెలువడింది. పోలీసు-నక్సలైట్ల పోరు నేపథ్యంలో జరిగే ఓ అందమైన ప్రేమ కథే ‘లంబసింగి’. హరిత అనే పాత్రలో హీరోయిన్ దివి ఒదిగిపోయింది. ఆమె పాత్ర ఇచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. తెరపై కొత్త దివిని చూస్తారు. అంతలా మెప్పించిన లంబసింగి చిత్రం ఏప్రిల్ 2 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. సినిమా విడుదలైన రెండు వారాలకే ఈ చిత్రం ఓటీటీలోకి రానున్నడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ ద్వారా దివికి మంచి గుర్తింపు వచ్చింది.నాలుగో సీజన్లో పాల్గొని మంచి క్రేజ్ తెచ్చుకున్న తెలుగమ్మాయి దివి. ఈ షోలో పాల్గొని బయటకొచ్చిన తర్వాత పలు సినిమాలు, సిరీసుల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇప్పటికే చిరంజీవి ఆచార్య చిత్రంలో నటించిన దివి పలు వెబ్ సిరీస్‌లలో కూడా నటించిన విషయం తెలిసిందే. -
ఆ బాధ నాకు తెలుసు.. అందుకే 'లంబసింగి' నిర్మించా: డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ
కాన్సెప్ట్ ఫిలిమ్స్ బ్యానర్‌పై మార్చి 15న విడుదలైన సినిమా 'లంబసింగి'. 'బిగ్‌బాస్' ఫేమ్ దివి హీరోయిన్. భారత్ రాజ్ హీరో. 'బంగార్రాజు' డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ నిర్మించగా, నవీన్ గాంధీ దర్శకత్వం వహించాడు. హైదరాబాద్‌లో ఆదివారం ఈ చిత్ర సక్సెస్ మీట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు అందరూ పాల్గొన్నారు. (ఇదీ చదవండి: కాస్ట్లీ నెక్లెస్‌తో సెన్సేషనల్ హీరోయిన్.. రేటు ఎంతో తెలుసా?) టాలెంట్ ఉన్నాసరే అవకాశాలు లేక చాలామంది ఉంటారు, నేను కూడా అలా ఛాన్సులు కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డాను. అందుకే నేను కొందరికి అవకాశం ఇద్దామని సినిమా నిర్మాణంలో అడుగు పెట్టా. దివి లాంటి చాలామంది తెలుగమ్మాయిలు ఉన్నారు అందరికి అవకాశాలు రావాలి. ఈ సినిమాని అందరూ చూసి ఎంకరేజ్ చెయ్యాలని కోరుకుంటున్నా అని కల్యాణ్ కృష్ణ చెప్పుకొచ్చారు. కళ్యాణ్ కృష్ణ.. ఒక తెలుగు అమ్మాయి కావాలని నన్ను ఈ సినిమాకు తీసుకోవడం నాకు చాలా ఆనందమేసింది. ఈ ఛాన్స్ ఇచ్చిన ఆయనకు స్పెషల్ థాంక్స్. తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వండి, గుర్తించండి, మేము కూడా కష్టపడతాము అని దివి చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: సౌత్ సినిమాలపై కంగన ఇంట్రెస్ట్.. అదే కారణమా?) -
Divi Vadthya: చీరలో చూడముచ్చటగా ‘బిగ్‌బాస్’ దివి క్యూట్‌నెస్ (ఫొటోలు)
-
లంబసింగి మూవీ సక్సెస్ మీట్ (ఫోటోలు)
-
‘లంబసింగి’ మూవీ రివ్యూ
టైటిల్: లంబసింగి నటీనటులు: భరత్ రాజ్, దివి, వంశీ రాజ్, కిట్టయ్య, నిఖిల్ రాజ్, జనార్దన్, అనురాధ, మాధవి, నవీన్ రాజ్, ప్రమోద్, రమణ, పరమేష్ తదితరులు. నిర్మాణ సంస్థ: కాన్సెప్ట్ ఫిలింస్ నిర్మాత: ఆనంద్.టి సినిమాటోగ్రఫీ: కె.బుజ్జి సంగీతం:ఆర్ఆర్.ధ్రువన్ విడుదల తేది: మార్చి 15, 2024 ‘లంబసింగి'కథేంటంటే.. వీరబాబు(భరత్ రాజ్) కానిస్టేబుల్ ఉద్యోగం వస్తుంది. తొలి పోస్టింగ్ లంబసింగి అనే ఊరిలో పడుతుంది. అక్కడ నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఊర్లోకి వెళ్లిన తొలి రోజే హరిత(దివి)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె లొంగిపోయి సాధారణ జీవితం గడుపుతున్న నక్సలైట్ కోనప్ప కూతురు. కోనప్పతో పాటు చాలా మంది నక్సలైట్లు లొంగిపోయి అదే ఊరిలో సాధారణ జీవితం గడుపుతుంటారు. పోలీసు శాఖే వారికి పునరావాసం కల్పిస్తుంది. హరిత ఆ ఊరి ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తూ తండ్రికి తోడుగా ఉంటుంది. సంతకాల పేరుతో రోజు కోనప్ప ఇంటికి వెళ్తూ హరితను ఫాలో అవుతుంటాడు వీరబాబు. అలా వారిద్దరి మధ్య స్నేహం పెరుగుతుంది. ఓ రోజు వీరబాబు ప్రపోజ్ చేస్తే హరిత రిజెక్ట్ చేస్తుంది. అదే బాధలో ఉండగా.. పోలీసు స్టేషన్‌పై నక్సలైట్లు దాడి చేస్తారు. ఆ దాడిలో గాయపడిన వీరబాబుకి ఊహించని షాక్ తగులుతుంది. అదేంటి? అసలు హరిత ఎవరు? వీరబాబు ప్రేమను ఎందుకు నిరాకరించింది? ఆమె కోసం వీరబాబు తీసుకున్న నిర్ణయం ఏంటి? చివరకు హరిత ప్రేమను వీరబాబు పొందాడా లేదా? అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. ఎలా ఉందంటే.. పోలీసు-నక్సలైట్ల పోరు నేపథ్యంలో జరిగే ఓ అందమైన ప్రేమ కథే ‘లంబసింగి’. దర్శకుడు నవీన్ గాంధీ ఎంపిక చేసుకున్న పాయింట్ కొత్తగా ఉంది. కానీ తెరపై అంతే కొత్తగా చూపించడంలో కాస్త తడబడ్డాడు. సినిమా ప్రారంభం స్లోగా అనిపిస్తుంది. హరిత, వీరబాబుల మధ్య పరిచయం పెరిగాక కథనంలో వేగం పుంజుకుంటుంది. హీరోయిన్ ట్రాక్ ను దర్శకుడు డిఫరెంట్‌గా డిజైన్ చేశాడు ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోతుంది. ఊహించని ట్విస్ట్ ఇచ్చి సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచేలా చేశాడు. ఇక ద్వితియార్థం మాత్రం మొదటి నుండి ఇంట్రెస్టింగ్ గా నడిపించాడు దర్శకుడు. ఎక్కడా కూడా ప్రేక్షకులు ఆలోచనలో పడే టైం ఇవ్వడు. స్క్రీన్ ప్లేని చాలా పగడ్బందీగా డిజైన్ చేసుకున్నాడు. వీరబాబు, రాజు గారు పాత్రలతో చేయించిన కామెడీ అలరిస్తుంది. క్లైమాక్స్ చాలా ఎమోషన్స్‌గా ఉంటుంది. బరువైన హృదయంతో ప్రేక్షకులు థియేటర్స్ నుంచి బయటకు వస్తారు. ఎవరెలా చేశారంటే.. వీరబాబు పాత్రలో భరత్ చక్కగా నటించాడు. క్లైమాక్స్ లో ఇతని ఎమోషనల్ పెర్ఫార్మన్స్ తో మంచి మార్కులు వేయించుకుంటాడు. అలాగే కామెడీతో అలరించాడు అని చెప్పాలి. హరిత అనే పాత్రలో దివి ఒదిగిపోయింది. ఆమె పాత్ర ఇచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. తెరపై కొత్త దివిని చూస్తారు. క వంశీ రాజ్, కిట్టయ్య, నిఖిల్ రాజ్, జనార్దన్, అనురాధ, మాధవి, ఈవీవీ, నవీన్ రాజ్ సంకరపు, ప్రమోద్, రమణ, పరమేష్, సంధ్య.. వంటి నటీనటులు కూడా తమ తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. ఆర్.ఆర్.ధృవన్ నేపథ్య సంగీతం..పాటలు సినిమాకు చాలా ప్లస్ అయింది. సినిమాలోని ప్రతి పాట ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
రవితేజ సినిమాలో చాన్స్.. రాత్రికి రాత్రే మార్చేశారు: హీరోయిన్ దివి
సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం. ఈ రంగంలో రాణించాలంటే చాలా కష్టపడాలి. మనలో ఉన్న టాలెంట్‌ని నిరూపించుకోవడానికి అవకాశం వచ్చే వరకు ఎదురు చూస్తూనే ఉండాలి. అందం, అభినయం అన్నీ ఉన్నా.. నటించే అవకాశం రాక వెనుదిరిగిన వాళ్లు చాలా మంది ఉన్నారు. ఒక సినిమాలో నటించే అవకాశం అంత ఈజీగా రాదు. వారసత్వాన్ని పక్కన పెడితే బయట నుంచి వచ్చే వాళ్లు తొలి సినిమా కోసం ఓ మినీ యుద్ధమే చేస్తారు. నటి దివి కూడా సినిమా చాన్స్‌ల కోసం పెద్ద యుద్దమే చేసిందట. అవకాశాల కోసం ఆఫీసుల చుట్టు తిరిగి తిరిగి అలిసిపోయిన సందర్భాలు ఉన్నాయట. ఒకనొక సందర్భంలో రవితేజ సరసన నటించే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయిందంట. బిగ్‌బాస్ ద్వారా ఫేమస్ అయిన ఈ బ్యూటి..తాజాగా లంబసింగి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నెల 15న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తన సినిమా కష్టాల గురించి చెబుతూ ఎమోషనల్ అయింది. మోడలింగ్ నుంచి వచ్చిన నేను సినిమా అవకాశాల కోసం చాలా కష్టపడ్డాను. చాలా ఆఫీసుల చుట్టు తిరిగాను. ఎన్నో ఆడిషన్స్ ఇచ్చాను. చాలా మంది రిజెక్ట్ చేశారు. కొంతమంది ఫోన్ చేస్తామని చెప్పి..మళ్లీ టచ్‌లోకి కూడా రాలేదు. మరికొంతమంది మొహం మీదే తిరస్కరించారు. సన్నగా ఉన్నానని ఒకరు .. లావుగా ఉన్నావంటూ మరొకరు రిజెక్ట్ చేసేవారు. ఆ సమయంలో చాలా బాధపడేదాన్ని. బాత్రూమ్లో షవర్ పెట్టుకొని, నోరు మూసుకొని ఎన్నోసార్లు ఏడ్చాను. బెడ్‌పై దిండు కవర్ చేసుకొని వెక్కివెక్కి ఏడ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. చాన్స్‌ల కోసం ఓ పాటలో నటిస్తే..డాన్స్ సరిగా చేయలేదని ట్రోల్ చేశారు. ఇంకా ఘోరం ఏంటంటే.. ఓ సినిమాలో సెలెక్ట్ చేసి.. రాత్రికి రాత్రే మార్చేశారు. అది రవితేజ గారి సినిమా. అందులో రవితేజ పక్కన లీడ్ రోల్. ఐదు రోజుల్లో షూటింగ్ స్టార్ట్ అవుతుండగా రాత్రికి రాత్రే నన్ను మార్చేశారు. -
లంబసింగి ట్రైలర్.. కట్టిపడేసిన దివి!
వేసవిలో సిమ్లా, ఊటీ, కశ్మీర్ వంటి హిల్ స్టేషన్స్‌కు టూర్ వేయాలని చాలా మంది అనుకుంటారు! ఎందుకంటే… అక్కడ చల్లగా ఉంటుంది కాబట్టి! ఆంధ్రాలోనూ అటువంటి హిల్ స్టేషన్ ఒకటి ఉంది. ఆంధ్రా కశ్మీర్‌గా పాపులర్ అయ్యింది. అదే ‘లంబసింగి’. ఇప్పుడు ఆ ఊరిలో జరిగిన ఒక ప్రేమ కథ సినిమాగా రూపొందుతోంది. ‘లంబసింగి’ చిత్రంతో ప్రముఖ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టారు. నవీన్ గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆయన సమర్పకులు. భరత్ రాజ్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ ‘బిగ్ బాస్’ ఫేమ్ దివి కథానాయికగా కాన్సెప్ట్ ఫిల్మ్స్ పతాకంపై ఆనంద్.టి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘ఎ ప్యూర్ లవ్ స్టోరీ’ అనేది ఉపశీర్షిక. ఇటీవల విడుదలైన "నచ్చేసిందే... డోలారే... వయ్యారి గోదారి పాటలకు అద్భుతమైన స్పందన లభించింది. లేటెస్ట్గా లంబసింగి ట్రైలర్‌ను దర్శకుడు హరీష్ శంకర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'కళ్యాణ్ కృష్ణ సినిమా చేస్తున్నాడు అంటే నా సొంత సినిమాలా అనిపించింది. ట్రైలర్ బాగుంది, అందమైన లొకేషన్స్‌లో సినిమాను చిత్రీకరించిన విధానం బాగుంది. దర్శకుడు నవీన్ గాంధీ ఒక అందమైన ప్రేమకథను లంబసింగి సినిమా ద్వారా చెప్పబోతున్నారు. దివికి, అలాగే భరత్ రాజ్‌కు ఈ మూవీ మంచి పేరు తెచ్చి పెట్టాలని కోరుకుంటున్నాను. మార్చి 15న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న లంబసింగి సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా' అన్నారు. చదవండి: అయోధ్య బాలరామున్ని దర్శించుకున్న ఉపాసన! -
‘బిగ్‌బాస్’ ఫేం దివి హీరోయిన్గా ‘లంబసింగి’, రిలీజ్ ఎప్పుడంటే?
బిగ్‌బాస్ ఫేం దివి హీరోయిన్గా నటిస్తున్న తాజా చిత్రం ‘లంబసింగి’.‘ఎ ప్యూర్ లవ్ స్టోరీ’ అనేది ఉపశీర్షిక. నవీన్ గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంతో డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కురసాల నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ మూవీ ద్వారా భరత్ రాజ్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న లంబసింగి చిత్రం మార్చి 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా మొదటిపాట ‘నచ్చేసిందే నచ్చేసిందే…’ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా నుండి వయ్యారి గోదారి సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. జవేద్ అలీ ఆలపించిన ఈ సాంగ్ ను కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. ఆర్ఆర్ ధ్రువన్ సంగీతం అందించారు. డిఫరెంట్ మెలోడీ గా సాగే ఈ సోంగ్ కు మ్యూజిక్ లవర్స్ నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది.అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా సినిమా ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. మార్చి 15న ప్రపంచ వ్యాప్తంగా లంబసింగి సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది. -
విశాఖ జిల్లాకు ఆయువుపట్టుగా మారిన పర్యాటకం
-
పాడేరు–లంబసింగి రహదారికి పచ్చజెండా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో రెండు రహదారులు, ఒక రోడ్ ఓవర్ బ్రిడ్జ్ (ఆర్వోబీ) నిర్మాణానికి జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పాడేరు–లంబసింగి రహదారి నిర్మాణానికి ఆమోదముద్ర వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. దాంతోపాటు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సీతారాంపురం–దుత్తలూరు రహదారితోపాటు ఓ ఆర్వోబీ నిర్మాణానికి ఆమోద ముద్ర వేసింది. ఈ మూడు ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.545 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లను ఖరారు చేసింది. దుత్తలూరు రోడ్డుకు రూ.267 కోట్లు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో సీతారామపురం నుంచి దుత్తలూరు వరకు 36.40 కి.మీ. మేర పావడ్ సోల్డర్స్‌తో రెండు లేన్ల రహదారి నిర్మాణానికి ఎన్హెచ్ఏఐ నిర్ణయించింది. అందుకోసం రూ.267 కోట్లతో టెండర్ల ప్రక్రియను ఖరారు చేసింది. అన్నమయ్య జిల్లా మదనపల్లి సమీపంలోని చిన్నతిప్ప సముద్రం సమీపంలోని రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద ఆర్వోబీ నిర్మాణానికి ఎన్హెచ్ఏఐ నిర్ణయించింది. సేతు భారతం ప్రాజెక్ట్ కింద ఈ రెండు లేన్ల ఆర్వోబీ నిర్మాణానికి రూ.72.50 కోట్లతో టెండర్లను ఖరారు చేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యాటక ప్రాంతాలను అనుసంధానిస్తూ రహదారులను విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. అందులో భాగంగా ఇప్పటికే రాజమహేంద్రవరం నుంచి రంపచోడవరం మీదుగా అరకుకు నాలుగు లేన్ల రహదారి నిర్మిస్తున్నారు. మరోవైపు జిల్లా కేంద్రం పాడేరు నుంచి లంబసింగికి కూడా రహదారి నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆంధ్రా కశ్మిర్‌గా గుర్తింపు పొందిన లంబసింగిని పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చేయవచ్చన్నది ప్రభుత్వ ఉద్దేశం. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్రం పాడేరు–లంబసింగి మధ్య 48 కి.మీ. మేర పావడ్ సోల్డర్స్‌తో రెండు లేన్ల రహదారిని నిర్మించాలని నిర్ణయించింది. అందుకోసం రూ.206 కోట్లతో టెండర్ల ప్రక్రియను ఇటీవల ఖరారు చేసింది. త్వరలోనే పనులు ప్రారంభించి 2024 మార్చి కల్లా పూర్తి చేయాలని ఎన్హెచ్ఏఐ భావిస్తోంది. -
పర్యాటకులను ఆకర్షిస్తున్న లంబసింగి రిసార్ట్స్
-
గిరి సీమల్లో విదేశీ విరులు
సాక్షి, అమరావతి: ఆంధ్రా కాశ్మీర్‌గా పేరొందిన లంబసింగి పరిసర ప్రాంతాల్లో విదేశీ పూల సోయగాలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం పరిశోధనలు ఫలించడంతో సంప్రదాయ పంటలు సాగు చేసే గిరిజనులకు పూల సాగుపై ఆసక్తి పెరిగింది. ఫలితంగా గిరి సీమల్లో పూలసాగు విస్తరణకు బాటలు పడ్డాయి. పూల వనాలను అగ్రి టూరిజం స్పాట్స్‌గా తీర్చిదిద్దడంతో గిరిజనులకు రెట్టింపు ఆదాయం వస్తోంది. పర్యాటకుల ద్వారా అదనపు ఆదాయం పూల వనాలను చూసేందుకు పర్యాటకుల నుంచి వసూలు చేస్తున్న టోకెన్ చార్జీల ద్వారా సీజన్లో రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఈ ప్రాంత రైతులు అదనపు ఆదాయం ఆర్జిస్తున్నారు. నాణ్యమైన పూలు ఉత్పత్తి అవుతుండడంతో నర్సీపట్నం, విశాఖ, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ ప్రాంతాల నుంచి హోల్‌సేల్ పూల వ్యాపారులు నేరుగా రైతు క్షేత్రాల నుంచే కొనుగోలు చేస్తున్నారు. రకాన్ని బట్టి ఎకరానికి రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు చేస్తుండగా.. పెట్టుబడులు పోను రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకు ఆదాయం వస్తోంది. పూల సాగుపై ఆసక్తి విదేశీ పూల రకాలు లంబసింగి పరిసర ప్రాంతాలు ఎంతో అనువైనవి. గిరిజన రైతులు ఇప్పుడిప్పుడే ఈ దిశగా ఆసక్తి చూపిస్తున్నారు. పూల సాగుతో పాటు పర్యాటకం ద్వారా కూడా మంచి అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. చట్టవిరుద్ధమైన పంటలను సాగు చేసే వారిని పూల సాగువైపు మళ్లించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నాం. – ఎం.సురేష్‌కుమార్, ప్రధాన శాస్త్రవేత్త, చింతపల్లి పరిశోధనా కేంద్రం విదేశీ పూల సాగుపై ఫలించిన పరిశోధనలు సాధారణంగా కొండ ప్రాంతాల్లో వరి, మొక్కజొన్న, వేరుశనగ, కందులు, వలిశెలు, రాజ్మా చిక్కుళ్లుతో పాటు పసుపు, అల్లం, కాఫీ వంటి పంటలు సాగు చేస్తుంటారు. అకాల, అధిక వర్షాల వల్ల ఆశించిన దిగుబడులు రాక గిరిజనులు నష్టపోతున్నారు. ఈ పరిస్థితుల్లో చట్టవిరుద్ధమైన గంజాయి తదితర పంటల్ని సాగు చేస్తూ కొందరు తరచూ కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల వైపు మళ్లించే లక్ష్యంతో గిరిసీమల్లో వాణిజ్య పంటలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించింది. చింతపల్లి పరిశోధనా కేంద్రం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయాన్నిచ్చే విదేశీ పూల సాగుపై విస్తృత పరిశోధనలు చేసింది. రెండేళ్లుగా గ్లాడియోలన్, లిబియం, చైనా ఆస్టర్, జెర్బరా, తులిప్ వంటి విదేశీ పూల మొక్కల సాగుపై జరిపిన పరిశోధనలు ఫలించాయి. నెదర్లాండ్స్, డెన్మార్క్ నుంచి తెచ్చిన సీడ్స్‌తో లంబసింగి ప్రాంతంలో ప్రయోగాత్మక సాగు సత్ఫలితాలనివ్వడంతో ఆ దిశగా రైతులను ప్రోత్సహిస్తున్నారు. లంబసింగిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ఇక్కడ సాధారణ వర్షపాతం 1,240 మి.మీ. కాగా.. కనిష్ట ఉష్ణోగ్రతలు 4–12 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రతలు 23–38 డిగ్రీల మధ్య నమోదవుతుంటాయి. చల్లని వాతావరణం, అధిక తేమ శాతం పూల సాగుకు కూడా అనుకూలం కావడంతో చింతపల్లి ఆర్ఎఆర్ఎస్ ద్వారా హెచ్‌ఏటీ జోన్లో విదేశీ పూల సాగుపై ఇప్పటివరకు సుమారు 400 మందికి శిక్షణనిచ్చారు. గంజాయి కేసుల్లో ఇరుక్కున్న వారు సైతం పూలసాగుపై దృష్టి సారించేలా చేస్తున్నారు. 45 రోజుల్లోనే దిగుబడులు విదేశాలతోపాటు హిమాచల్‌ప్రదేశ్, శ్రీనగర్, బెంగళూరు, పూణే, మదనపల్లి ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి వివిధ రకాల పూల రకాలను రైతులకు అందిస్తున్నారు. రైతు క్షేత్రాల్లో డ్రిప్ ఏర్పాటు చేసి ఎత్తయిన బెడ్లు, మల్చింగ్ విధానంలో సాగు చేయడంతో 45 రోజుల్లోనే దిగుబడులు మొదలవుతున్నాయి. -
ఇక లంబసింగి.. లెక్క పక్కా..!
సాక్షి, విశాఖపట్నం: లంబసింగి.. ఈ పేరు వింటే అందరికీ గుర్తుకొచ్చేది అందమైన, ఎత్తయిన కొండ ప్రాంతం. రాష్ట్రంలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఓ కుగ్రామం. పర్వత శ్రేణుల్లో మంచు సోయగాలతో పర్యాటకులను అమితంగా ఆకర్షించే పర్యాటక ప్రదేశం. ఆంధ్రా కశీ్మరుగా ఖ్యాతి గడించింది. ‘0’(సున్నా) డిగ్రీల కనిష్ట (రాత్రి) ఉష్ణోగ్రతల నమోదుతో తన ప్రత్యేకతను చాటుకుంటోంది. అందుకే శీతాకాలం వచ్చిందంటే చాలు.. లంబసింగికి టూరిస్టులు క్యూ కడతారు. దేశ, విదేశాల నుంచి వచ్చి వాలతారు. అక్కడ ప్రకృతి అందాలను తనివి తీరా ఆస్వాదిస్తారు. శీతాకాలంలో లంబసింగిలో ‘జీరో’ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందట! అంటూ జనం తరచూ విశేషంగా చర్చించుకుంటారు. కానీ ఆ లెక్క పక్కా కాదని ఎంతమందికి తెలుసు? అక్కడ ఉష్ణోగ్రతలను గాని, వర్షపాతాన్ని గాని నమోదు చేసే యంత్రాంగం లేదు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో లంబసింగి ఉంది. ఇక్కడికి 19.7 కిలోమీటర్ల దూరంలోని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం (ఆర్‌ఏఆర్‌ఎస్)లో నమోదయ్యే కనిష్ట ఉష్ణోగ్రతల కంటే లంబసింగిలో రెండు డిగ్రీలు తక్కువగా రికార్డయినట్టు చెబుతున్నారు. ఉదాహరణకు చింతపల్లిలో 2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైతే లంబసింగిలో ‘0’ డిగ్రీలు రికార్డయినట్టు అంచనా వేస్తున్నారు. ఇన్నాళ్లూ దీనినే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో లంబసింగిలో ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ (ఏడబ్ల్యూఎస్)ను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ చాన్నాళ్లుగా ఉంది. దీనిని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఏర్పాటు చేయాల్సి ఉంది. గతంలో దీనిపై కొంత కసరత్తు జరిగినా ఆ తర్వాత మరుగున పడింది. లంబసింగిలో ఏఆర్జీ.. తాజాగా భారత వాతావరణ విభాగం (ఐఎండీ) లంబసింగిలో ఆటోమేటిక్ రెయిన్ గేజ్ (ఏఆర్జీ) స్టేషన్‌ను మంజూరు చేసింది. లంబసింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) సమీపంలో దీనిని ఏర్పాటుకు స్థలాన్ని ఎంపిక చేశారు. ఈ ఏఆర్జీ ఏర్పాటయితే ఆ ప్రాంతంలో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలతో పాటు వర్షపాతం, గాలిలో తేమ శాతం రికార్డవుతాయి. దీని నిర్వహణను విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం (సీడబ్ల్యూసీ) చూస్తుంది. మరికొన్నాళ్లలో లంబసింగిలో ఏఆర్జీ సిస్టం అందుబాటులోకి వస్తుందని, అప్పటినుంచి అక్కడ కచ్చితమైన వాతావరణ సమాచారం రికార్డవుతుందని సీడబ్ల్యూసీ డైరెక్టర్ సునంద ‘సాక్షి’కి చెప్పారు. సముద్రమట్టానికి 3 వేల అడుగుల ఎత్తులో.. లంబసింగి తూర్పు కనుమల పర్వత శ్రేణుల్లో ఎత్తయిన ప్రదేశంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంది. చుట్టూ కాఫీ తోటలు, యూకలిప్టస్ చెట్లతో నిండి ఉంటుంది. సముద్రమట్టానికి అరకు 2,700 అడుగులు, చింతపల్లి 2,800 అడుగుల ఎత్తులోనూ ఉంటే లంబసింగి 3,000 అడుగుల (వెయ్యి మీటర్ల) ఎత్తులో ఉంది. దీంతో లంబసింగి శీతాకాలంలో పొగమంచు దట్టంగా అలముకుని ఆహ్లాదం పంచుతుంది. మంచు ఐస్‌లా గడ్డ కట్టుకుపోతుంది. అంతేకాదు.. అత్యల్ప (0–3 డిగ్రీల) ఉష్ణోగ్రతలు నమోదవుతూ ప్రత్యేకతను చాటుకుంటోంది. లంబసింగి అందాలను చూడడానికి వచ్చే పర్యాటకుల కోసం పర్యాటకశాఖ గుడారాలను కూడా ఏర్పాటు చేసింది. కొర్రబయలు నుంచి లంబసింగి.. లంబసింగికి కొర్రబయలు అనే పేరు కూడా ఉంది. కొర్ర అంటే కర్ర. బయలు అంటే బయట అని అర్థం. ఎవరైనా చలికాలంలో మంచు తీవ్రతకు ఇంటి బయట పడుకుంటే తెల్లారేసరికి కొయ్యలా బిగుసుకుపోతారని, అందుకే కొర్రబయలు పేరు వచ్చిందని చరిత్ర కారులు చెబుతారు. -
గిరిజన ప్రాంత అభివృద్ధి పై సీఎం జగన్ కు ప్రత్యేక శ్రద్ద : మంత్రి రోజా
-
గిరిజనులతో కలిసి డాన్స్ అదరకొట్టిన మంత్రి రోజా
-
అందాల హరివిల్లు
-
బిగ్‌బాస్ దివి నటించిన 'నచ్చేసిందే నచ్చేసిందే' సాంగ్ విన్నారా?
భరత్ హీరోగా, బిగ్‌బాస్ ఫేమ్ దివి హీరోయిన్గా నటించిన చిత్రం లంబసింగి. ఎ ప్యూర్ లవ్‌స్టోరీ అనేది ఉపశీర్షిక. నవీన్ గాంధీ దర్శకత్వం వహించారు. డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ కురసాల సమర్పణలో జీకే మోహన్ నిర్మించారు. ఈ సినిమాలోని తొలి పాట 'నచ్చేసిందే నచ్చేసిందే..'ని అక్కినేని నాగార్జున రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా దర్శకుడు కల్యాణ్ కృష్ణ కురసాల కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ నిర్మించిన మూవీ లంబసింగి. ఈ చిత్రంలోని నచ్చేసిందే నచ్చేసిందే పాట బాగుంది. అందరూ వినండి అన్నారు. నవీన్ గాంధీ మాట్లాడుతూ.. విశాఖ సమీపంలోని లంబసింగి నేపథ్యంలో రూపొందిన ప్రేమకథా చిత్రమిది. సినిమా అంతా లంబసింగిలోనే తీశాం. హీరోహీరోయిన్ల మధ్య ప్రేమను తెలిపే గీతమే నచ్చేసిందే నచ్చేసిందే. సిద్ శ్రీరామ్ గాత్రం, కాసర్ల శ్యామ్ సాహిత్యం, ఆర్ఆర్ ధృవన్ సంగీతానికి మంచి స్పందన వస్తోంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కె.బుజ్జి, సంగీతం: ఆర్ఆర్ ధృవన్, నిర్మాణం: కాన్సెప్ట్ ఫిలింస్. చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లాడిన బిగ్‌బాస్ కంటెస్టెంట్, పెళ్లి ఫొటోలు చూసేయండి బిగ్‌బాస్ షోలో బాబా భాస్కర్, ప్రోమో చూశారా? -
Lambasingi: లంబసింగికి చలో చలో
చింతపల్లి: మంచు ముసుగేసుకున్న ప్రకృతిని.. శీతల గాలుల మధ్య వీక్షించేందుకు పర్యాటకులు లంబసింగికి పరుగులు తీస్తారు. అత్యంత ఎత్తులో ఉన్న ఆ ప్రదేశంలో వాతావరణం భిన్నంగా ఉంటుంది. అక్కడ రాత్రి బస చేస్తే ఆ అనుభూతే వేరు. అలాంటి ఎన్నో మధురానుభూతులను సొంతం చేసుకునేందుకు టూరిజం శాఖ ప్రత్యేక ప్యాకేజీని ప్రారంభించింది. శనివారం పర్యాటకులు ప్రత్యేక బస్సులో విశాఖ నుంచి లంబసింగి చేరుకున్నారు. స్థానిక టూరిజం మేనేజర్ సూరెడ్డి అప్పలనాయుడు అక్కడి నుంచి లాంఛనంగా ఈ యాత్రను ప్రారంభించారు. ప్రతి రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు.. ఈ యాత్ర విశాఖ ఎంవీపీ కాలనీలోని ఏపీ టూరిజం వారి హరిత హోటల్ నుంచి ప్రతి రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతుందని టూరిజం మేనేజర్ అప్పలనాయుడు తెలిపారు. అక్కడ భోజనాలు చేసిన తర్వాత బయలుదేరి నర్సీపట్నం మీదుగా లంబసింగి చేరుకుని ఇక్కడ రాత్రి బస చేస్తారు. ఇక్కడి అందాలను వేకువజామున వీక్షించిన తర్వాత అల్పాహారం ముగించి జి.మాడుగుల మండలం కొత్తపల్లి జలపాతాలకు బయలుదేరుతారు. అక్కడ నుంచి పాడేరు మోదకొండమ్మ ఆలయం, హుకుంపేట మండలంలోని మత్స్యగుండం పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. అక్కడ నుంచి పాడేరు మీదుగా విశాఖపట్నం తిరుగు పయనమవుతారు. పర్యాటకులు బయలుదేరిన దగ్గర నుంచి లంబసింగిలో బస, రెండు రోజుల భోజనం, అల్పాహారం, బస్సు చార్జీతో కలిపి పెద్దలకు రూ.1970, పిల్లలకు రూ.1650లు టికెట్ ధరగా నిర్ణయించారు. వావ్.. బొర్రా కేవ్స్ అనంతగిరి (అరకు): ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రా గుహలకు పర్యాటకులు శనివారం పోటెత్తారు. ప్రస్తుతం పిక్నిక్ సీజన్ కావడంతో మన్యంలోఅందాలు తిలకించేందుకు భారీగా తరలివస్తున్నారు. వలిసెపూల తోటలు పర్యాటకులను ఆహ్వానం పలుకుతున్నాయి. అరకు–డుంబ్రిగుడ, అనంతగిరి విశాఖ ప్రధాన రహదారి ఆనుకుని వలిసెపూల మధ్య సెల్ఫీలు, ఫొటోలు తీసుకుంటూ సందడిచేస్తున్నారు. శనివారం బొర్రాగుహలను 5400 మంది తిలకించగా, సుమారు రూ.3.74 లక్షల ఆదాయం వచ్చిందని మేనేజర్ గౌరీ శంకర్ తెలిపారు. కొత్తపల్లి.. అందాల లోగిలి జి.మాడుగుల: పలు ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులతో కొత్తపల్లి జలపాతాల వద్ద సందడి నెలకొంది. వీకెండ్ కావడంతో భారీగా పర్యాటకులు తరలివచ్చారు. జలపాతాల్లో గంటలు తరబడి సందర్శకులు జలకాలాడారు. జలపాతాల వ్యూపాయింట్ వద్ద సెలీ్ఫలతో సందడి చేశారు. సీతమ్మ పర్వతం.. అద్భుతం హుకుంపేట : మన్యంలో అతిపెద్ద కొండ సీతమ్మ పర్వతాన్ని (జెండాకొండా) సబ్ కలెక్టర్ వి.అభిõÙక్ సందర్శించారు. శనివారం వేకువ జామునే పాడేరు నుంచి తీగలవలస పంచాయతీ ఓలుబెడ్డా గ్రామానికి చేరుకుని అక్కడనుంచి గిరిజనులతో కలిసి వేకువ జామునే సుమారు నాలుగు కిలోమీటర్లు మేర కాలినడకన ప్రయాణించారు. కొండలు, గుట్టలు, వాగులు దాటుకుంటూ కొండపైకి చేరుకుని మంచు అందాలను ఆస్వాదించారు. కొండాలో ఉన్న చరిత్ర కలిగిన తేనేపట్టు గుహలు, దింసారాళ్లు, తిరిగలి రాళ్లు, బ్రిటిషు వాళ్లు నిర్మించిన జెండా కోటను చూసి ఆకర్షితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్‌లో జెండాకొండ పర్యాటక కేంద్రంగా భాసిల్లడం ఖాయమన్నారు. సబ్ కలెక్టర్‌కు సన్మానం జెండా కొండకు మొదటిసారి సబ్ కలెక్టర్ అభిషేక్ రావడంతో గిరిజనులు, వైఎస్సార్సీపీ నాయకులు, జిల్లా వ్యవసాయ సలహామండలి సభ్యుడు ముత్యంగి విశ్వేశ్వరరావు, తీగలవలస సర్పంచ్ పంగి బేసు, ఎంపీటీసీ కొర్ర నాగరాజు, నాయకులు భవాణి శంకర్ తదితరులు సత్కరించారు. మంచుకురిసే వేళలో.. పాడేరు : పొగమంచుతో పాటు మేఘాల కొండగా విశ్వవ్యాప్తి పొందిన వంజంగి హిల్స్‌కు శనివారం వేకువజామున పర్యాటకులు పోటెత్తారు. రెండవ శనివారం కావడంతో వీకెండ్ డేస్‌ను దృష్టిలో పెట్టుకుని అనేక ప్రాంతాల నుంచి పర్యాటకులంతా వంజంగి హిల్స్‌కు చేరుకుని ఇక్కడ ప్రకృతి అందాలను వీక్షించారు. పర్యాటకుల రద్దీతో వంజంగి హిల్స్‌లోని అన్ని ప్రాంతాలు సందడిగా మారాయి. ఇక్కడ ప్రకృతి అందాలను పర్యాటకులు వీక్షించి పరవశించారు. ఉదయం 10గంటల వరకు వంజంగి హిల్స్‌లో పర్యాటకుల తాకిడి నెలకొంది. అలాగే పాడేరు ఘాట్‌తో పాటు మోదకొండమ్మ తల్లి ఆలయానికి కూడా పర్యాటకులు భారీగా తరలివచ్చారు. -
గొడ్డళ్లతో గంజాయి స్మగ్లర్ల దాడి
చింతపల్లి/నర్సీపట్నం/సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకున్న కాల్పుల ఘటన కలకలం రేపింది. లంబసింగి సమీపంలో గంజాయి స్మగ్లర్లను తరలిస్తున్న తెలంగాణ పోలీసులపై అక్రమ రవాణా ముఠా దాడికి ప్రయత్నించడంతో ఆత్మరక్షణ కోసం వారు గాలిలోకి కాల్పులు జరిపినట్లు విశాఖ ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు తెలిపారు. నల్లగొండ పోలీసుస్టేషన్లో నమోదైన గంజాయి కేసులో నిందితుల కోసం తెలంగాణ పోలీస్ ప్రత్యేక బృందం విశాఖకు వచ్చిందన్నారు. 15–20 మంది గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేస్తుండగా రోడ్డుకు అడ్డంగా టిప్పర్‌ను నిలిపి కత్తులు, గొడ్డళ్లు, రాళ్లతో దాడికి దిగి పోలీసు వాహనాన్ని ధ్వంసం చేయడంతో గాల్లోకి నాలుగు రౌండ్ల కాల్పులు జరిపినట్లు ఎస్పీ తెలిపారు. ఈ ఘటనలో ఓ గంజాయి స్మగ్లర్కి గాయాలయ్యాయని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు. చింతపల్లి మండలం తురబాలగెడ్డ సమీపంలో లంబసింగి ఘాట్‌రోడ్డులో ఈ ఘటన జరిగింది. గాలిపాడుకు చెందిన ముగ్గురు వ్యక్తులు గత వారం అక్రమంగా గంజాయి రవాణా చేస్తూ నల్లగొండ పోలీసులకు పట్టుబడ్డారు. ఈ కేసులో ఈ నెల 15వ తేదీన కిల్లో బాలకృష్ణ (30), కిల్లో భీమరాజు (26), నారా లోవ (30) అనే వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
మన్యంలో మ్యూజియం.. ప్రకృతి అందాల మధ్య ఏర్పాటు
సాక్షి, అమరావతి: తెల్లదొరలను గడగడలాడించిన మన్యం వీరుల స్ఫూర్తిని భావితరాలకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. బ్రిటీష్ పాలకులపై వీరు సాగించిన సాయుధ పోరాటానికి కేంద్రంగా నిలిచిన విశాఖ జిల్లా తాజంగిలో మన్యం వీరుల స్మారక మ్యూజియం నిర్మాణం చేపట్టింది. ప్రకృతి సహజసిద్ధమైన రమణీయ అందాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ‘ఆంధ్ర కాశ్మీరం’ లంబసింగి ప్రాంతంలో ఇది ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అందమైన ఉద్యానవనం మధ్య అరుదైన విశేషాలతో రూపుదిద్దుకోనున్న ఈ గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం మన్యం పోరాటాన్ని ప్రతిబింబించనుంది. మొత్తం రూ.35 కోట్లతో చేపట్టిన ఈ మ్యూజియం నిర్మాణానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, పాడేరు ఎమ్మెల్యే కె. భాగ్యలక్ష్మి శుక్రవారం శంకుస్థాపన చేశారు. గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణా సంస్థ (టీసీఆర్–టీఎం–ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ మిషన్) ఆధ్వర్యంలో ఈ గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియంను 21 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ప్రధాన భవనాన్ని అల్లూరి సీతారామరాజు, ఆయన అనుచరులు గాం గంటందొర, గాం మల్లుదొర చేబట్టిన విల్లు, బాణాలను గుర్తుకు తెచ్చే రీతిలో డిజైన్ చేశారు. యాంపి థియేటర్‌తో పాటుగా వివిధ అంశాల ప్రదర్శనలోనూ డిజిటల్ టెక్నాలజీని, ఆడియో, వీడియోలను సమకూర్చనున్నారు. మ్యూజియం గోడలను, పై కప్పును సంప్రదాయ గిరిజన కళాకృతులతో అలంకరించనున్నారు. మ్యూజియం పరిసరాలను పర్యాటకులకు ఆహ్లాదం కలిగించేలా తీర్చిదిద్దనున్నారు. అలాగే, అక్కడికి వచ్చే పర్యాటకుల కోసం గిరిజన సంస్కృతిని ప్రతిబింబించే ఆధునిక రెస్టారెంట్, రిసార్ట్‌ను కూడా ఏర్పాటుచేయనున్నారు. ఈ నిర్మాణం పనులను 2023 మార్చి నాటికి పూర్తిచేయాలని నిర్ణయించారు. మొదటి తిరుగుబాటు ఇక్కడే.. విశాఖపట్నం జిల్లా పాడేరు నియోజకవర్గం చింతపల్లి మండలం లంబసింగి సమీపంలోని తాజంగి గ్రామానికి మన్యం విప్లవ చరిత్రలో ఎంతో ప్రాధాన్యం ఉంది. మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు బ్రిటీష్ పాలకులపై సాగించిన సాయుధ పోరాటంలో ఇది చాలా కీలక ప్రాంతం. పోడు వ్యవసాయాన్ని నిషేధించిన అప్పటి బ్రిటీష్ పాలకులు ఉపాధి కోల్పోయిన గిరిజనులను లంబసింగి–నర్సీపట్నం రోడ్డు నిర్మాణంలో కూలీలుగా ఉపయోగించుకునే వారు. వీరికి కూలీ సరిగ్గా చెల్లించకపోగా వారిపై అత్యాచారాలకు, అకృత్యాలకు తెగబడేవారు. దీంతో తెల్లదొరల అరాచకాలపై అల్లూరి సీతారామరాజు తాజంగి ప్రాంతంలోనే మొట్టమొదటిసారిగా తిరగుబాటు బావుటా ఎగురవేశాడు. గాం గంటందొర, గాం మల్లుదొరలతో కలిసి పోరాటం చేసి వారిని తరిమికొట్టాడు. ఇంతటి విశిష్టత కలిగినందునే మన్యం వీరుల మ్యూజియం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తాజంగి ప్రాంతాన్ని ఎంపిక చేసింది. మ్యూజియంలో 4 జోన్లు.. విశాఖ మన్యంలో నిర్మించనున్న ఈ మ్యూజియంను ఏ, బీ, సీ, డి అనే నాలుగు జోన్లుగా విభజించి పలు అంశాలను ప్రదర్శిస్తారు. అవి.. ► జోన్–ఏలో ఉండే మూడు గ్యాలరీలలో బ్రిటీష్ ప్రభుత్వం రాకకు ముందునాటి గిరిజనుల పరిస్థితులు, వారి జీవన విధానం, అప్పటి సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక స్థితిగతులను గురించి తెలియజేసే ప్రదర్శనలు ఉంటాయి. ► జోన్–బిలో గిరిజనుల జీవితాల్లోకి తెల్లదొరలు చొరబడిన కాలమాన పరిస్థితులను ప్రదర్శిస్తారు. వీటి ద్వారా సందర్శకులు ఆనాటి పరిస్థితులను అనుభూతి చెందే విధంగా వృక్ష, జంతు జాలాలను కళ్లకు కడుతూ డిజిటల్ ఆడియో, వీడియో విధానాలను కూడా ఏర్పాటుచేస్తారు. ► జోన్–సీలో బ్రిటీషర్ల అరాచకాలకు వ్యతిరేకంగా గిరిజనుల్లో వచ్చిన తిరుగుబాటు, వారి పోరాటాలను తెలిపే ప్రదర్శనలు ఉంటాయి. ► ఇక జోన్–డీలో ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న గిరిజనుల జీవన ప్రమాణాలను, వారి నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలను తెలిపే ప్రదర్శనలు ఉంటాయి. -
లంబసింగి స్ట్రాబెర్రీ జామ్: జుర్రుకుని తినేయొచ్చు
తాడేపల్లిగూడెం: బ్రెడ్‌కి జామ్ రాసుకొని తింటే మహా రుచిగా ఉంటుంది. చాలా మందికి ఇది అల్పాహారం. బ్రెడ్డే కాదు.. ఇంకా చాలా ఆహార పదార్ధాలతో జామ్ తినొచ్చు. ఇందుకు మార్కెట్లో చాలా రకాల జామ్‌లు దొరుకుతాయి. కానీ.. మన రాష్ట్రంలోని లంబసింగి నుంచి వచ్చే జామ్ ప్రత్యేకమైనది. ఎందుకంటే.. ఇది అక్కడి రైతులు పండించిన స్ట్రాబెర్రీ నుంచి తయారు చేసినది. ఈ జామ్ మిగతా వాటికంటే సూపర్ టేస్ట్. మృదుఫలంగా పిలిచే స్ట్రాబెర్రీని జామ్లా జుర్రుకు తినొచ్చు. ఇదెలా సాధ్యమైందంటే.. విశాఖ జిల్లా చింతపల్లి మండలంలోని మన్యం గ్రామాలైన లంబసింగి, రాజుపాక గ్రామాల రైతులు స్ట్రాబెర్రీ పండించడంలో దిట్టలు. మూడేళ్లుగా రికార్డు స్థాయిలో పంట దిగుబడి సాధిస్తున్నారు. లంబసింగి ప్రాంతాలకు వచ్చే పర్యాటకులకు స్ట్రాబెర్రీ పండ్లను విక్రయిస్తూ మంచి ఆదాయాన్ని గడిస్తున్నారు. కోవిడ్ కారణంగా గతేడాది లంబసింగి ప్రాంతానికి పర్యాటకుల రాక తగ్గింది. దీంతో స్ట్రాబెర్రీ విక్రయాలకు తీవ్ర అవరోధం కలిగింది. పండ్లను పారబోసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. భారీగా పెట్టుబడులు పెట్టిన రైతులు అయోమయంలోకి వెళ్లారు. ఈ విషయం వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయ ఉప కులపతి డాక్టర్ తోలేటి జానకిరామ్, పరిశోధన సంచాలకులు డాక్టర్ ఆర్వీఎస్కే రెడ్డి, పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ విభాగ అధిపతి డాక్టర్ డి.వెంకటస్వామి దృష్టికి వచ్చింది. వారు స్ట్రాబెర్రీ రైతుల సమస్యకు పరిష్కారాన్ని కనుగొన్నారు. రైతులు పండించిన స్ట్రాబెర్రీలను వెంకట్రామన్నగూడెంలోని పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ విభాగానికి రప్పించారు. వాటిని ఇక్కడ సహజ విధానాలతో శుభ్రం చేయించి, తాజా పండ్లకు వాణిజ్య హంగులు అద్ది ప్యాకింగ్ చేసి విక్రయించే ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ మిగిలిపోయిన పండ్లను గుజ్జుగా మార్చారు. ఆ గుజ్జును పంచదారతో మిశ్రమం చేసి జామ్‌గా తయారు చేశారు. దానిని సీసాల్లో పోసి అందంగా ప్యాకింగ్ చేశారు. లంబసింగి రైతులు పండించిన తాజా స్ట్రాబెర్రీలను వినియోగించడంతో 250 గ్రాముల జామ్ బాటిల్ ధర రూ.250 ధర పలికింది. అంటే కిలోకు రూ.వెయ్యి దక్కింది. స్ట్రాబెర్రీ ప్రాసెసింగ్‌ను పరిశీలిస్తున్న ఉద్యాన వర్సిటీ వీసీ జానకిరామ్, పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ విభాగాధిపతి డాక్టర్ డీవీ స్వామి ఎకరానికి రూ.2.20 లక్షల లాభం ఎకరానికి 800 కేజీల స్ట్రాబెర్రీ పండ్ల దిగుబడి వస్తుంది. ఆ పండ్లను కిలో రూ.150 చొప్పున విక్రయిస్తుంటారు. ఆ విధంగా పండ్లను నేరుగా విక్రయిస్తే రైతుకు రూ.1,20,000 ఆదాయం లభిస్తుంది. కానీ.. ఆ పండ్ల నుంచి గుజ్జు (పల్ప్) తీస్తే 546 కిలోలు వస్తుంది. దీనిని ప్రాసెసింగ్ చేసి 250 గ్రాముల చొప్పున బాటిల్ ప్యాకింగ్ చేయించాం. 2,025 బాటిల్స్ వచ్చాయి. రిటైల్ మార్కెట్లో 250 గ్రాముల స్ట్రాబెర్రీ జామ్ సీసా రూ.250 పలుకుతోంది. రైతులు గుత్తగా ఒక్కో సీసాను రూ.175 చొప్పున విక్రయించగా.. రైతుకు రూ.3,54,375 ఆదాయం లభించింది. సాగుతోపాటు రవాణా, ఇతర అన్నిరకాల ఖర్చులు కలిపి రూ.1,35,000 అయినట్టు అంచనా వేశారు. ఖర్చులన్నీ పోను రైతుకు ఎకరానికి రూ.2.20 లక్షల నికరాదాయం లభించినట్టు తేల్చారు. పండ్లగా విక్రయించడం కంటే.. జామ్ రూపంలో విక్రయిస్తే ఎకరానికి అదనంగా రూ.లక్ష వరకు అదనపు ఆదాయం వస్తుంది. పండ్లగా విక్రయించే సందర్భంలో అవి కుళ్లిపోయినా.. ధర తగ్గినా.. పండ్లు అమ్ముడుకాకపోయినా ఆ మేరకు రైతు నష్టపోతాడు. జామ్ చేయడం వల్ల ఒక్క పైసా కూడా నష్టం ఉండదు. పైగా ఇది 9 నెలలు నిల్వ ఉంటుంది. రైతులకు మేలు చేయగలిగాం రైతులు పండించిన పంటలకు వాణిజ్య విలువలు తీసుకురావడంలో డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం ముందుంటోంది. లంబసింగి రైతుల సమస్యను తెలుసుకుని స్ట్రాబెర్రీలను వర్సిటీ ఆధ్వర్యంలో జామ్‌గా తయారు చేయించి వారికి మేలు చేయగలిగాం. – డాక్టర్ తోలేటి జానకిరామ్, ఉప కులపతి, వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ ఆనందంగా ఉంది లంబసింగి రైతులు పండించిన స్ట్రాబెర్రీలను జామ్‌గా మార్చడానికి సహకారం అందించినందుకు ఆనందంగా ఉంది. వీసీ, పరిశోధన సంచాలకులతో కలిసి జామ్ తయారు చేయించి రైతులకు లాభాలు వచ్చేలా చూడగలిగాం. – డాక్టర్ డీవీ స్వామి, విభాగాధిపతి, పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ -
విశాఖ ఏజెన్సీలో గజగజ వణికిస్తున్న చలి
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో చలి తీవ్రత భారీగా పెరిగిపోయింది. ఏజెన్సీ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో స్థానికులు చలికి గజగజ వణుకుతున్నారు. ఏజెన్సీలోని మినుములూరులో 11 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్నోగ్రత నమోదవ్వగా, పాడేరు, లంబసింగిలో 12 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక, అరకు, చింతపల్లిలో 14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. -
విశాఖ ఏజెన్సీలో కొనసాగుతున్న చలి తీవ్రత
సాక్షి, విశాఖపట్నం : విశాఖ ఏజెన్సీలో చలి తీవ్రత కొనసాగుతోంది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో జనం గజగజలాడుతున్నారు. లంబసింగిలో 3 డిగ్రీలు, చింతపల్లి 5, జికె వీది 5, పాడేరు 4, మినుములూరు 2, జి మాడుగుల 4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
చలి గుప్పిట్లో విశాఖ ఏజెన్సీ
సాక్షి, విశాఖపట్నం : తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో జనం గజగజలాడుతున్నారు. విశాఖ ఏజెన్సీలోనూ పరిస్థితి ఇలాగే ఉంది. ఆంధ్రా కశ్మీర్‌గా పేరొందిన లంబసింగి, చింతపల్లిలో కూడా ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పడిపోతున్నాయి. లంబసింగిలో '0' డిగ్రీలు, చింతపల్లి, జికె వీది 3, పాడేరు 9, మినుములూరు 7.2, జి మాడుగుల 7.2 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రత లు నమోదయ్యాయి. -
ఆంధ్ర కాశ్మీర్‌కు అదనపు హంగులు
విశాఖపట్నం, చింతపల్లి: ఆంధ్రా కశ్మీర్ లంబసింగి అదనపు శోభను సంతరించుకోనుంది. రూ.8 కోట్లతో పర్యాటకాభివృద్ధిని చేపడుతున్న ఆ శాఖ మరో రూ.ఆరు కోట్లు మంజూరు చేసింది. లంబసింగికి సమీపంలోని తాజంగి జలాశయంలో బోటు షికారు ఏర్పాటు చేసేందుకు ఐటీడీఏ అధికారులు చర్యలు చేపట్టారు. పర్యాటకులకు వసతి కల్పించడానికి గుడారాలు ఏర్పాటు చేయనుంది. పర్యాటకులకు సౌకర్యాలు కల్పించడంతో పాటు యువతకు ఉపాధి కల్పించాలన్నది ఐటీడీఏ అధికారుల లక్ష్యం. గత ఏడాది ప్రైవేటు వ్యక్తి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇక్కడ బోటు షికారు ఏర్పాటు చేసి పర్యాటకుల వద్ద పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేసేవారు. అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. పర్యాటకానికి ఊపు లంబసింగి ప్రాంతం సముద్రమట్టానికి దాదాపు 3600 అడుగుల ఎత్తులో ఉంటుంది. దీంతో శీతాకాలంలో అతితక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ఉదయం 10 గంటల వరకు పొగమంచు దట్టంగా కమ్ముకుని ఉంటుంది. డౌనూరు నుంచి పది కిలోమీటర్ల మేర ములుపులతో కూడిన ఘట్రోడ్డులో తెల్లవారినా లైట్లు వేసుకుని ప్రయాణించడాన్ని పర్యాటకులు ఆస్వాదిస్తారు. ప్రతి ఏటా పర్యాటకుల తాకిడి పెరుగుతున్నప్పటికీ తగిన సౌకర్యాలు లేక ఇబ్బంది పడేవారు. పర్యాటకులకు సౌకర్యాలు కల్పించేందుకు నాలుగేళ్ల కిందటే రూ.8 కోట్లు మంజూరు చేశారు. పట్టాలెక్కిన అభివృద్ధి పనులు లంబసింగిలో 18 ఎకరాల భూమిలో 40 రిసార్ట్స్, రెండు రెస్టారెంట్లు, కాన్ఫరెన్స్ హాల్, ఓపెన్ థియేటర్, స్విమ్మింగ్‌పూల్, ఆయుర్వేద హెల్త్‌స్పా వంటివి నిర్మించాలని అధికారులు ప్రణాళికలు తయారు చేశారు. ప్రస్తుతం అన్ని సౌకర్యాలతో కూడిని ఎస్జీ టెన్సైల్ కాటేజీల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరో ఆరు కోట్లు పర్యాటక శాఖ కేటాయించడంతో మరిన్ని సౌకర్యాలు కలగనున్నాయి. మన్యంలో అరుకు తరువాత లంబసింగి పర్యాటక ప్రాంతంగా కీర్తిగాంచనుంది. -
లంబసింగిలో అల్లూరి పార్కు
చింతపల్లి(పాడేరు): ఆంధ్ర కశ్మీర్ లంబసింగిలో అల్లూరి సీతారామరాజు పార్కు ఏర్పాటుకు చర్యలు చేపట్టామని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపాల్ కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ తెలిపా రు. ఆదివారం ఆయన లంబసింగి ప్రాంతంలో పర్యటించి పర్యాటక అభివృద్ధి పనులను పరిశీలించారు. పర్యాటకంగా లంబసింగిని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. 30 ఎకరాల్లో అల్లూరి సీతారామరాజు పార్కును నిర్మిస్తామన్నారు. ఇందుకు అవసరమైన స్థలం కేటాయించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. పార్కులో స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. శీతాకాలంలో అతితక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో పర్యాటలకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారని, సౌకర్యాలు కల్పిస్తే వేసవి విడిదిగా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందని తెలిపారు. పర్యాటకంగా అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటి వరకు మంజూరు చేసిన నిధులు, చేపట్టిన పనులకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో పర్యటించి కాఫీ సాగుచేస్తున్న గిరిజన రైతులతో మాట్లాడారు. కాఫీకి ప్రభుత్వం కల్పిస్తున్న గిట్టుబాటు ధరలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాఫీ రైతులకు ఐటీడీఏ అందిస్తున్న సహాకారంపై గిరిజనులను అడిగి తెలుసుకున్నారు. గిరిజనులు వ్యవసాయపరంగా వివిధ రకాల పంటల సాగుతో పాటు ఉద్యానవనశాఖ అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుని లాభసాటి పంటలను చేపట్టాలన్నారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన యాపిల్ సాగు విజయవంతమైతే గిరిజనులు కాఫీతో పాటు యాపిల్‌ను సాగు చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఉమామహేశ్వరరావు, ఎంపీడీవో ప్రేమాకర్,గిరిజన సంక్షేమ శాఖ డీఈఈ రాజు, సర్పంచ్ కొర్రా రఘునాథ్ పాల్గొన్నారు. -
మన్యంలో మంచు దుప్పటి
సాక్షి, విశాఖ: మన్యం మంచు దుప్పటి కప్పుకుంది. విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతోంది. గత వారం రోజులుగా వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అరకు, పాడేరు, లంబసింగి, మినుమలూరు ప్రాంతాల్లో పది గంటలు దాటిన సూర్యుడు కనిపించకుండా తెల్లటి పొగమంచు కమ్మేసింది. శుక్రవారం రాత్రి మినమలూరులో 9 డిగ్రీలు, పాడేరులో 11 డిగ్రీలు, లంబసింగిలో 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
ఏజెన్సీలో తగ్గుతున్న ఉష్ణోగ్రతలు
సాక్షి, విశాఖపట్టణం: విశాఖ జిల్లాలోని ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. లంబసింగిలో 11, చింతపల్లిలో 13 డిగ్రీల కనీస ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం పూట మొత్తం మంచుతో కప్పబడి ఉన్నట్లుగా ఉంటోంది. అంతేగాక మధ్యాహ్నం 12 గంటలు అయినా సూర్యుడు కనిపించని పరిస్థితి నెలకొంది. అయితే... అక్టోబర్ చివరి వారంలోనే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం విశేషం. ప్రతి ఏడాది నవంబర్ చివరి వారం, డిసెంబర్, జనవరిలో కనీస ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా ఈ ఏడాది ముందుగానే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో చలి పులి చంపేసేటట్లుగా ఉంటుందని పలువురు భావిస్తున్నారు. -
లంబసింగి @గజగజ
అరకు: మన్యం ప్రాంతాన్ని మంచు దుప్పటి కప్పేసింది. మన్యం ప్రాంతంలో చలితీవ్రత రోజురోజుకు అధికమవుతోంది. విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరీ స్వల్పంగా నమోదవుతుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదివారం రాత్రి లంబసింగిలో 5.5 డిగ్రీలు, చింతపల్లిలో 8.5 డిగ్రీలు, మినుములూరు, అరకులో 9 డిగ్రీలు, పాడేరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దట్టమైన పొగమంచు వల్ల వాహనదారులు ప్రతిరోజు వేకువజామున రోడ్డు స్పష్టంగా కనిపించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
0 డిగ్రీల లంబసింగి వెళ్లొద్దామా?
నగరాల్లోనే చలి వణికిస్తోందనుకుంటే.. ఇక విశాఖ మన్యంలో ఉష్ణోగ్రతలు గజగజలాడిస్తున్నాయి. ప్రతిసారీ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే లంబసింగిలో కనిష్ఠ ఉష్ణోగ్రత 0 డిగ్రీలకు చేరుకుంది. దాంతో అక్కడ సాయంత్రం అయ్యేసరికే అంతా నిర్మానుష్యంగా మారుతోంది. రాత్రిపూట అస్సలు ఎవరూ బయటకు రావడం లేదు. మరోవైపు ఇదే సమయంలో అక్కడ పర్యాటకుల సందడి కూడా పెరుగుతుంది. లంబసింగితో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. చింతపల్లిలో 3, మెదాపల్లిలో 5, అరకులో 6, మినుములూరులో 7, పాడేరులో 8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. -
విశాఖ ఏజెన్సీలో పడిపోయిన ఉష్ణోగ్రతలు
చింతపల్లి: విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయాయి. బుధవారం ఉదయం లంబసింగిలో ఉష్ణోగ్రత 3 డిగ్రీలు నమోదైంది. ఇది ఈ సీజన్లోనే కనిష్ణ ఉష్ణోగ్రత. ఇక మినుములూరులో, చింతపల్లిలో 6 డిగ్రీలు, పాడేరులో 8 డిగ్రీలు, అరకులో 10 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు తగ్గాయి. పొగమంచు, చలితీవ్రతతో గిరజనులు అవస్థలు పడుతున్నారు. అరకు, లంబసింగి ప్రాంతాల్లో పర్యాటకుల సందడి పెరిగింది. -
మన్యంలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
విశాఖ ఏజెన్సీ వణుకుతోంది. ఉష్ణోగ్రతలు ఆదివారం మరింతగా పడిపోయాయి. లంబసింగిలో ఆదివారం ఉదయం 3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చింతపల్లిలో 6 డిగ్రీలుగా ఉంది. ఇక పాడేరు, మోదపల్లిలో 7 డిగ్రీలు నమోదైంది. లంబసింగిలో శనివారం ఉదయం 7 డిగ్రీల ఉష్ణోగ్రత, చింతపల్లిలో 10 డిగ్రీలు ఉండగా ఆదివారం ఉదయం నాటికి బాగా తగ్గినట్టు తెలుస్తోంది. చలి గాలులు, మంచుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 20 అడుగుల దూరంలో ఏమీ కనిపించని పరిస్థితి నెలకొంది. -
వణుకుతున్న విశాఖ ఏజెన్సీ
విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. చలి తీవ్రత రోజురోజూకి పెరిగిపోతుంది. విశాఖపట్నం ఎజెన్సీలో సముద్రమట్టానికి మూడు వేల పైచిలుకు అడుగుల ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గిపోయి గిరిజనులు చలికి గజగజ వణికిపోతున్నారు. లంబసింగిలో 7 డిగ్రీలు... చింతపల్లిలో 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విశాఖ ఏజెన్సీ అంతటా పెద్ద ఎత్తున చలిగాలులు వీస్తున్నాయి. జనవరి నెలాఖరు వరుకు ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుముఖం పడతాయన్న సంగతి తెలిసిందే. మధ్యాహ్నం మూడు గంటల నుంచే చలిగాలులు వీస్తున్నాయి. ఉదయం 9 గంటలు దాటితే గానీ ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. -
అదుపుతప్పిన బస్సు: తప్పిన ప్రమాదం
చింతపల్లి టౌన్: విశాఖపట్ణణం జిల్లాలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పింది. ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. వివరాలు.. జిల్లాలోని తుని డిపోకు చెందిన బస్సు చిత్రకొండ నుంచి తునికి వెళుతుండగా లంబసింగి ఘాట్‌రోడ్డులో అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. అయితే డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 15 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. -
త్వరలోనే మార్కెట్లోకి ఆంధ్రా ఆపిల్
-
ఆంధ్ర కశ్మీర్ లంబసింగి
సమున్నత గిరి శిఖరాలు.. కనుచూపుమేరా పచ్చని తివాచీలు పరిచినట్టు అగుపించే మనోహరమైన లోయలు.. గిరుల పాదాలకు మువ్వల పట్టీలు చుట్టినట్టు గలగలలాడే సెలయేళ్లు.. వనకన్యల సిగల్లో గుత్తులుగా అమరినట్టుండే అడవి పూల మాలికలు.. మైదాన ప్రాంతం నుంచి ప్రయాణించి, మలుపుమలుపూ దాటుతూ ఎత్తుకు పోయే కొద్దీ కనిపించే అందం అద్భుతం. సముద్రమట్టానికి సుమారు 3,600 అడుగుల ఎత్తులో ఉన్న లంబసింగి వెళుతున్నకొద్దీ తిప్పుకోలేనంత శోభాయమానమైన సొగసు చూపరుల కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది. ఈ దారిలో ప్రయాణిస్తున్నప్పుడు కనిపించే లోయలు కశ్మీరాన్ని తలపిస్తాయంటే అతిశయోక్తి కాదు. లంబసింగిని దత్తత తీసుకుని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించడంతో ఈ ప్రాంతీయుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. చింతపల్లి: చింతపల్లి మండలంలోని ఈ గూడేంలో ఏళ్లతరబడి సుమారు మూడు వందల పీటీజీ కుటుంబాలు నివసిస్తున్నాయి. రోడ్డు కిరువైపులా లోయల మధ్య ప్రయాణం మనస్సును కొత్తలోకాల్లోకి తీసుకు వెళ్తోంది. ఇక్కడికి వస్తున్న సందర్శకులకు లంబసింగి అందాలు కట్టిపడేస్తున్నాయి. దీనిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మెండుగా అవకాశాలున్నాయి. ఇక్కడి నుంచి మైదాన ప్రాంతాల గ్రామాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. మన్యంలో కశ్మీర్ వాతావరణం తలపించే లంబసింగిని దత్తత తీసుకుని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించడంతో ఈ ప్రాంతీయుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఇదేమాట గతంలోనే అప్పటి మంత్రి పసుపులేటి బాలరాజు ప్రకటించారు. ఇక్కడ సీతాకోక చిలుకల పార్కును ఏర్పాటు చేస్తామని చెప్పారు. అది ఆచరణకు నోచుకోలేదు. తాజాగా మంత్రి గంటా నోట అదేమాటతో మరోసారి పర్యాటక హంగులపై ఆశలు కలుగుతున్నాయి. కశ్మీరు వాతావరణం ఉండే లంబసింగి ప్రాంతం సముద్ర మట్టానికి సుమారు 3,600 అడుగుల ఎత్తులో ఉంంది. ఏజెన్సీ ముఖద్వారమైన డౌనూరు నుంచి సుమారు 20 కిలోమీటర్లు దూరం ప్రయాణిస్తే లంబసింగి వస్తుంది. ఈ మార్గమంతటా కొండలు, దట్టమైన అడవులు ఉన్నాయి. ఎన్నో మలుపులు తిరుగుతూ సాగే ఈ మార్గం ప్రయాణికులకు వింత అనుభూతి కలిగిస్తుంది. శీతాకాలంలో ఎర్రగా విరగ్గాసే కాఫీ తోటలు, పసుపు ఆరబోయినట్లు ఉండే వలిసెపూల తోటలు పర్యాటకుల మనస్సులను దోచుకుంటాయి. వేసవిలో కూడా లంబసింగి ప్రాంతంలో చల్లగా ఉంటుంది. శీతాకాలంలో ఉదయం 10 గంటల వరకు దట్టంగా కమ్ముకునే పొగమంచు ప్రకృతి ప్రియుల మనస్సులను దోచుకుంటాయి. మంచు తెరలను చీల్చుకుంటూ వచ్చే సూర్యకాంతి పరవశింపజేస్తుంది. తాజంగి రిజర్వాయర్, పర్యాటకులను ఆకట్టుకుంటుంది. రిజర్వాయర్‌లో ఇటీవల ప్రైవేటు వ్యక్తులు బోటు షికారును కూడా ఏర్పాటు చేశారు. దట్టమైన అడవులు, అద్భుతమైన అనుభూతులను పంచే ఈ ప్రాంతంలో ఇటీవల బోడకొండమ్మ ఆలయానికి సమీపంలో ఒక అద్భుతమైన జలపాతం కూడా వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రయాణికుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. రాష్ట్రం నలుమూలలతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు కూడా ఇక్కడ అందాలను తిలకించేందుకు భారీగా తరలి వస్తున్నారు. అయితే ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు లేకపోవడం వల్ల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్సీపట్నంలో బస చేసి ఇక్కడికి రావడం అసౌకర్యంగా ఉంటోంది. లంబసింగిలో పర్యాటకుల బసకు అనువైన వసతులు ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఈమేరకు గతంలోనే పర్యాటకశాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఈ ప్రాంత అభివృద్ధికి రూ.3 కోట్లు నిధులు కూడా కేటాయించినట్లు ప్రకటించారు. అవేవీ ఆచరణకు నోచుకోలేదు. ప్రైవేటు వ్యక్తులు ఈ ప్రాంత అభివృద్ధికి చర్యలు చేపడుతున్నారు. స్టాళ్లు, పర్యాటకులు బస చేసేందుకు అవసరమైన వసతులు కల్పించేందుకు స్థానిక గిరిజనుల నుంచి భూములను లీజుకు తీసుకుంటున్నారు. ఈ దశలో మంత్రి గంటా ప్రకటన ఈ ప్రాంత అభివృద్ధిపై మరిన్ని ఆశలు రేకెత్తించాయి. ఆయన హమీలు ఎంత వరకు అమలవుతాయో వేచి చూడాల్సిందే. -
తెలంగాణ గజగజ
రాష్ట్రంలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్‌లో ఏడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు హైదరాబాద్‌లో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత ఈనెల 15 వరకూ చలి తీవ్రతే: వాతావరణశాఖ ఏపీనీ వణికిస్తున్న చలి లంబసింగిలో సున్నా డిగ్రీలు నమోదు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో చలిగాలుల తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. హైదరాబాద్ చలిగుప్పిట్లో వణుకుతోంది. ఈ నెల 15వ తేదీ వరకు పొగమంచు, చలిగాలుల తీవ్రత ఇదే విధంగా ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ డెరైక్టర్ వై.కె.రెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. ఉత్తర భారతదేశం నుంచి తీవ్రమైన చలిగాలులు వస్తున్నందున చలి తీవ్రత పెరిగిందని ఆయన పేర్కొన్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో సంక్రాంతి వరకు 9 నుంచి 10 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని ఆయన వివరించారు. ముఖ్యంగా ఆదిలాబాద్‌లో అత్యంత తక్కువగా 6 నుంచి 7 డిగ్రీల వరకు పడిపోవచ్చని చెప్పారు. గత నెలలో ఆదిలాబాద్‌లో 3.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కాగా, గత 24 గంటల్లో ఆదిలాబాద్‌లో అత్యంత తక్కువగా 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్‌లో 8 డిగ్రీలు, హైదరాబాద్, నిజామాబాద్, రామగుండంలలో 10 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. భద్రాచలం, నల్లగొండల్లో 12 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. అన్ని ప్రాంతాల్లోనూ సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు చలితో వణికిపోతున్నారు. చలికి స్వైన్‌ఫ్లూ వైరస్ విజృంభిస్తుండటంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. జలుబు, జ్వరం, తలనొప్పి, ఒంటినొప్పులు ఉన్నవారు అనుమానంతో ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. సంక్రాంతి తర్వాత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని, అప్పుడు స్వైన్‌ఫ్లూ వైరస్ ప్రమాదం కూడా తగ్గుతుందని అటు వాతావరణశాఖ, ఇటు వైద్యశాఖ చెబుతున్నాయి. లంబసింగిలో సున్నా డిగ్రీలు పాడేరు/ చింతపల్లి : ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ ఏజెన్సీలో చలితీవ్రత అధికంగా ఉంది. చింతపల్లి మండలంలోని పర్యాటక ప్రాంతమైన లంబసింగిలో ఆదివారం సున్నా డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. చలి తీవ్రతకు మన్యం ప్రజలు విలవిలలాడుతున్నారు. చింతపల్లిలో మూడు, పాడేరుకు సమీపంలోని మినుములూరు కాఫీబోర్డు వద్ద ఐదు డిగ్రీలు, అలాగే పాడేరు ఘాట్‌లోని పోతురాజు గుడి ప్రాంతంలో రెండు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదుయ్యాయి. నందిగామ, రెంటచింతలలో 10, అనంతపురంలో 11.9, కర్నూలులో 12.9, ఆరోగ్యవరం, బాపట్లలో 13, కళింగపట్నంలో 13.6, విజయవాడలో 15, తిరుపతిలో 15.5, కాకినాడలో 16.2, నెల్లూరులో 19.4, విశాఖపట్నంలో 19.5 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
లంబసింగి వేడెక్కింది
రెండు వారాల్లో మార్పు ఏజెన్సీలో పెరిగిన ఉష్ణోగ్రతలు అల్పపీడనం ప్రభావం లంబసింగిలో 13, చింతపల్లిలో 16 డిగ్రీలు ఊరట చెందుతున్న గిరిజనులు విశాఖపట్నం : అంతలోనే ఎంత మార్పు? రెండు వారాల క్రితం ఏజెన్సీలోని లంబసింగిలో ‘0’ (సున్నా) డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. వణికించే చలి. ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి. మంచుదుప్పటి కప్పుకున్నట్టుగా ఉండేది. సూర్యుడు ఉన్నాడో లేడోనన్న అనుమానం కలిగేది. మరి ఇప్పుడు వణికించే చలి లేదు. మంచు ముంచేస్తుందన్న భయమూ లేదు. చలి మంటల అవసరమూ లేదు. హాయిగా ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు. పిల్లలు బడులకు వెళ్తున్నారు. పెద్దలు పనులకు వెళ్తున్నారు. ఇదంతా బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం పుణ్యమే. అల్పపీడనంతో ఆకాశంలో మేఘాలు ఏర్పడ్డాయి. మబ్బుల వల్ల చలి తీవ్రత తగ్గుతుంది. డిసెంబర్ 28 నుంచి జనవరి 2 వరకూ అల్పపీడన ప్రభావం కొనసాగింది. ఫలితంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. రాష్ట్రంలోనే అత్యల్ప డిగ్రీలు నమోదవుతూ రికార్డులకెక్కే జిల్లాలోని చింతపల్లి మండలం లంబసింగిలో డిసెంబర్ 21న ’0’ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. 22న ఒక డిగ్రీ, 23న రెండు, 24న ఒక్కసారిగా 11డిగ్రీలకు ఉష్ణోగ్రత పెరిగింది. 25, 26, 27 తేదీలో 15, 28న16 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. 28 నుంచి అల్పపీడనం మొదలయ్యాక ఉష్ణోగ్రతలు నిలకడగా ఉన్నాయి. 29న 16 డిగ్రీలు రికార్డయింది. తాజాగా గురు,శుక్రవారాల్లో లంబసింగిలో 13 డిగ్రీలు, చింతపల్లిలో 16, పాడేరులో 14, ఘాట్‌లో 14 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఫలితంగా ఇప్పుడు విశాఖ ఏజెన్సీలో ఆహ్లాదకరమైన వాతావరణం కొనసాగుతోంది. మరికొద్ది రోజులు పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఆకాశంలో మబ్బులు వెళ్లిపోతే ఉష్ణోగ్రతలు క్షీణించి శీతల ప్రభావం కనబడుతుందని,మళ్ళీ చలితీవ్రత పెరిగే అవకాశం ఉందని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డి.శేఖర్ తెలిపారు. మొత్తమ్మీద అల్పపీడనం వచ్చి మన్యం వాసులకు ఊరటనిచ్చింది. -
చలి చంపేస్తోంది..
తెలంగాణ, ఏపీల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు మరో రెండు రోజుల పాటు చలి తీవ్రత సాక్షి, హైదరాబాద్, విశాఖపట్నం: చలిగాలుల తీవ్రత కొనసాగుతోంది. దక్షిణ తెలంగాణతో పోల్చితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి ప్రభావం అధికంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోనూ చలి గజగజలాడిస్తోంది. విశాఖ మన్యంలో అత్యల్పంగా సున్నా డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రికార్డు స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో జనం అల్లాడిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు. మరో రెండు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నెల 27న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు ఆ శాఖ నిపుణులు వెల్లడించారు. దీని ప్రభావంతో ఉష్ణోగ్రతలు కాస్త పెరగనున్నాయి. దీంతో చలి నుంచి కొంత ఉపశమనం లభించనుంది. ఇప్పటికే దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అల్పపీడనం వల్ల ఆకాశంలో మేఘాలు ఆవరిస్తాయని, ఫలితంగా ఉష్ణోగ్రతలు పెరిగి చలి తీవ్రత తగ్గుతుందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం మాజీ అధికారి ఆర్.మురళీకృష్ణ తెలిపారు. అల్పపీడనం ప్రభావం ముఖ్యంగా దక్షిణకోస్తాంధ్ర, రాయలసీమపై కనిపిస్తుందన్నారు. అయినప్పటికీ మేఘాలు ఆవరించడం వల్ల తెలంగాణ, కోస్తాంధ్రల్లో ఇప్పటికన్నా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వివరించారు. ఉత్తరాది నుంచి చలిగాలుల ప్రభావం ఉత్తరాది నుంచి వీస్తున్న చలి గాలుల వల్ల తెలంగాణ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో చలి ఎక్కువగా ఉంది. రానున్న 24 గంటల్లో రాష్ట్రంలోని ఆదిలాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో చలిగాలులు అధికంగా వీచే అవకాశముందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) బుధవారం రాత్రి విడుదల చేసిన బులెటిన్‌లో తెలిపింది. అదే సమయంలో ఏపీలోని దక్షిణకోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురవవచ్చని పేర్కొంది. గడచిన 24 గంటల్లో కోస్తాంధ్రలో సాధారణంకంటే 3 డిగ్రీలు, తెలంగాణలో 4 డిగ్రీలు తక్కువగా, రాయలసీమలో 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా చూస్తే.. గడచిన 24 గంటల్లో ఆదిలాబాద్ జిల్లాల్లో అత్యల్పంగా 7.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్ జిల్లాలో 11, వరంగల్‌లో 14.1, కరీంనగర్ 12.1, నిజామాబాద్‌లో 13.7, హైదరాబాద్/రంగారెడ్డి జిల్లాల్లో 14.7, ఖమ్మం జిల్లాలో 14.8, నల్లగొండ జిల్లాలో 15.4, మహబూబ్‌నగర్ జిల్లాలో 16.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక విశాఖ ఏజెన్సీలో ఎన్నడూ లేని విధంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పాడేరుకు సమీపంలోని మినుములూరు కేంద్ర కాఫీబోర్డు కార్యాలయం వద్ద బుధవారం 3 డిగ్రీలు, పాడేరు ఘాట్‌లోని పోతురాజు స్వామి గుడి వద్ద 0 డిగ్రీలు, చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 5 డిగ్రీలు, లంబసింగిలో 2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పర్యాటకులు చలిని తట్టుకోలేక సాయంత్రానికే మైదాన ప్రాంతాలకు పయనమవుతున్నారు. కాగా, వచ్చే 24 గంటల్లో హైదరాబాద్‌లో రాత్రి ఉష్ణోగ్రతలు 13 డి గ్రీల కంటే తక్కువగా నమోదయ్యే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది. -
రాష్ట్రాలను వదలని చలి
కోస్తాంధ్రలో నమోదవుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు తెలంగాణలోనూ గజగజ సాక్షి, విశాఖపట్నం/పాడేరు: చలి తీవ్రత కొనసాగుతూనే ఉంది. కోస్తాంధ్రలో శీతల ప్రతాపం అధికంగా ఉంది. 3 డిగ్రీలు తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాయలసీమలో మాత్రం సాధారణ ఉష్ణోగ్రతలే రికార్డవుతున్నాయి. అక్కడ కొన్నిచోట్ల చిరుజల్లులు కూడా కురుస్తున్నాయి. కాగా, తెలంగాణలో సాధారణంకంటే 3 నుంచి 5 డిగ్రీలు తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వచ్చే రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ విభాగం మంగళవారం నివేదికలో తెలిపింది. రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలో చలి ప్రభావం బాగా ఉంటుందని వివరించింది. తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ జిల్లాలో తీవ్రమైన చలిగాలులు వీస్తాయని వెల్లడించింది. కాగా, విశాఖ ఏజెన్సీలో కనిష్ట ఉష్ణోగ్రతల నమోదుతో చలిగాలులు విజృంభిస్తున్నాయి. ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు దిగజారడంతో పాటు మంచు దట్టంగా కురుస్తోంది. లంబసింగిలో ఆదివారం సున్నా డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదు కాగా మంగళవారం 3.5 డిగ్రీలు నమోదైంది. చలి తీవ్రతకు పది మంది మృతి సాక్షి నెట్వర్క్: చలి తీవ్రతకు వేర్వేరు జిల్లాల్లో మంగళవారం పది మంది మృత్యువాత పడ్డారు. వరంగల్ జిల్లాలో పుసపాటి ఉప్పలయ్య(56) , ముదిగిరి కొమురయ్య(70), గాడిపల్లి కాశీం(80), పాపమ్మ(65)లు చలికి తట్టుకోలేక తనువు చాలించారు. అలాగే, మహబూబ్‌నగర్ జిల్లాలో కువ్వ బాలన్న(50) మెదక్ జిల్లాకు చెందిన బాలమ్మ (80) చలితీవ్రతకు చనిపోయారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆత్రం భీంరావు(65), ఆత్రం పూసిబాయి(70), ఆత్రం భీంరావు(65)లు సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు వేర్వేరు సందర్భాల్లో మరణించారు. ఖమ్మం జిల్లాకు చెందిన నాగులు(80) చలికి తట్టుకోలేక మృతిచెందాడు. -
లంబసింగిలో ‘0’ డిగ్రీల ఉష్ణోగ్రత
పాడేరు: విశాఖ ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఎన్నడూ లేని విధంగా డిసెంబరు మూడోవారం నాటికే అత్యల్ప ఉష్ణోగ్రతలు నెలకొనడంతో ఏజెన్సీలోని ప్రజలు వణుకుతున్నారు. ఆదివారం పర్యాటక ప్రాంతమైన లంబసింగిలో సున్నా డిగ్రీలు, చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 3 డిగ్రీలు, పాడేరుకు సమీపంలోని మినుములూరు కేంద్ర కాఫీబోర్డు వద్ద 4 డిగ్రీలు, పర్యాటక ప్రాంతమైన పాడేరు ఘాట్‌లోని పోతురాజుస్వామి గుడి వద్ద ఒక డిగ్రీ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలిగాలులు విజృంభించాయి. శనివారం మినుములూరులో 6 డిగ్రీలు, చింతపల్లిలో 5 డిగ్రీలు, లంబసింగిలో 2 డిగ్రీలు, పాడేరు ఘాట్‌లోని పోతురాజుస్వామి గుడివద్ద 3 డిగ్రీలు నమోదవగా ఒక రోజు వ్యవధిలోనే మరింత అత్యల్ప ఉష్ణోగ్రతలు నెలకొనడం, దట్టమైన పొగమంచు, చలిగాలుల తీవ్రతతో మన్యంవాసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 2 రోజుల నుంచి చలి విజృంభిస్తుండడంతో గిరిజన గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆశ్రమ పాఠశాలల్లో గిరిజన విద్యార్థుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పర్యాటకులు సైతం వణికించే చలిని తాళలేక ఇబ్బందులు పడుతున్నారు. పొగమంచు దట్టంగా కురుస్తుండటంతో ఉదయం 10 గంటల తర్వాత సూర్యోదయం అవుతోంది. తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీలోని మారేడుమిల్లి ప్రాంతంలో రాత్రి ఉష్ణోగ్రత 5 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతోంది. చలికి ముగ్గురి మృతి సాక్షి నెట్వర్క్: చలి తీవ్రతను తట్టుకోలేక తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో ముగ్గురు మృతిచెందారు. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం మధుపాం గ్రామానికి చెందిన పొలాకి సూరమ్మ (62) అనే వృద్ధురాలు ఆదివారం మృతిచెందింది. గత రెండు రోజులుగా చలిగాలుల తీవ్రత పెరగడంతో తట్టుకోలేక ఆమె మృతి చెందినట్టు గ్రామస్తులు తెలిపారు. ఈ మేరకు తహశీల్దార్ డీవీ బ్రహ్మాజీరావుకు సమాచారం అందించారు. విషయూన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తానని ఆయన చెప్పారు. కాగా తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామానికి చెందిన వేగుళ్ల నారాయణమూర్తి(80), రాజవొమ్మంగికి చెందిన ఇసుకపల్లి అప్పారావు(75) చలిగాలులకు తట్టుకోలేక ఆదివారం మృతిచెందారు. -
విశాఖ ఏజెన్సీలో వణికిపోతున్న గిరిజనులు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతున్నాయి. చలితీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ లోని లంబసింగిలో శనివారం ఉష్ణోగ్రత అత్యల్పంగా 3 డిగ్రీలకు పడిపోయింది. విశాఖ ఏజెన్సీలో సముద్రమట్టానికి మూడువేల పైచిలుకు అడుగుల ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గిపోయి గిరిజనులు చలికి గజగజ వణికిపోతున్నారు. ఆంధ్రా ఊటీ అరుకులో 5 డిగ్రీలు, చింతపల్లి - 5 డిగ్రీలు, పాడేరు - 6 డిగ్రీలు, మినుములూరు కేంద్ర కాఫీ బోర్డు - 6 డిగ్రీలు, మోదాపల్లి - 5, దాలాలపల్లి - 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. విశాఖ ఏజెన్సీ అంతటా పెద్ద ఎత్తున చలిగాలులు వీస్తున్నాయి. -
లంబసింగిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రత
-
లంబసింగిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రత
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతున్నాయి. చలితీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. విశాఖపట్నం జిల్లా లంబసింగిలో ఉష్ణోగ్రత 5 డిగ్రీలకు పడిపోయింది. విశాఖ ఏజెన్సీలో సముద్రమట్టానికి మూడువేల పైచిలుకు అడుగుల ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గిపోయి గిరిజనులు చలికి గజగజ వణికిపోతున్నారు. పాడేరుఘాట్‌లోని అతిశీతల ప్రాంతమైన పోతురాజుస్వామి గుడి వద్ద 3డిగ్రీలు, పర్యాటక ప్రాంతం లంబసింగిలో 5డిగ్రీలు, మినుములూరు కేంద్ర కాఫీబోర్డు వద్ద 6 డిగ్రీలు, చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మన్యమంతటా పెద్ద ఎత్తున చలిగాలులు వీస్తున్నాయి. -
లంబసింగిలో 7 డిగ్రీలు
చింతపల్లి: విశాఖ మన్యం వాతావరణం మరో కశ్మీరును తలపిస్తోంది. కొద్ది రోజులుగా ఇక్కడ చలి గజగజలాడిస్తోంది. జనవరి వరకు చలి తీవ్రత ఇలాగే ఉంటుందని, రానున్న రోజుల్లో సున్నా డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని పరిశోధన స్థానం శాస్త్రవేత్త దేశగిరి శేఖర్ తెలిపారు. సముద్ర మట్టానికి మూడువేల మీటర్ల ఎత్తులో ఉన్న లంబసింగిలో రోజూ ఉదయం 10 గంటల వరకు పొగమంచు దట్టంగా కమ్ముకునే ఉంటుంది. బుధవారం లంబసింగిలో 7 డిగ్రీలు, చింతపల్లిలో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆంధ్రా కశ్మీరుగా గుర్తింపు పొందుతున్న లంబసింగి అందాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక వాహనాల్లో తెల్లవారుజామునే ఈ ప్రాంతానికి చేరుకుంటున్నారు. పొగమంచులో లైట్లు వేసుకుని వాహనాల్లో ప్రయాణించడం వీరికి వింత అనుభూతి కలిగిస్తోంది. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి మళ్లీ చలిగాలులు వీస్తున్నాయి. సాయంత్రం నాలుగు గంటలైతే ఈ ప్రాంతంలో చలిమంటలు వేసుకుని సేదదీరాల్సిన పరిస్థితి నెలకొంది. -
లంబసింగి @ 9 డిగ్రీలు
చింతపల్లి : విశాఖ ఏజెన్సీలో చలి గజగజ వణికిస్తోంది. రానున్న కొద్ది రోజుల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయే అవకాశం ఉందని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డి.శేఖర్ తెలిపారు. మంగళవారం లంబసింగిలో 9 డిగ్రీలు, చింతపల్లిలో 12 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చింతపల్లిలో గత నెల 29న 14 డిగ్రీలు, 31న 13 డిగ్రీలు నమోదయ్యాయి. ఐదు రోజులుగా చలి తీవ్రత పెరిగింది. లంబసింగిలో ఉదయం పది గంటల వరకు మంచు తెరలు వీడటం లేదు. సాయంత్రం 4 గంటలకే చీకటి అలముకుంటోంది. గిరిజనులు చలిమంటలు, నెగడులను ఆశ్రయిస్తున్నారు. ఉదయాన్నే పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు మంచులో తడిసి ముద్దవుతున్నారు.