0 డిగ్రీల లంబసింగి వెళ్లొద్దామా?
నగరాల్లోనే చలి వణికిస్తోందనుకుంటే.. ఇక విశాఖ మన్యంలో ఉష్ణోగ్రతలు గజగజలాడిస్తున్నాయి.
నగరాల్లోనే చలి వణికిస్తోందనుకుంటే.. ఇక విశాఖ మన్యంలో ఉష్ణోగ్రతలు గజగజలాడిస్తున్నాయి. ప్రతిసారీ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే లంబసింగిలో కనిష్ఠ ఉష్ణోగ్రత 0 డిగ్రీలకు చేరుకుంది. దాంతో అక్కడ సాయంత్రం అయ్యేసరికే అంతా నిర్మానుష్యంగా మారుతోంది. రాత్రిపూట అస్సలు ఎవరూ బయటకు రావడం లేదు. మరోవైపు ఇదే సమయంలో అక్కడ పర్యాటకుల సందడి కూడా పెరుగుతుంది.
లంబసింగితో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. చింతపల్లిలో 3, మెదాపల్లిలో 5, అరకులో 6, మినుములూరులో 7, పాడేరులో 8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.