Vizag agency
-
Photo Feature: దర్జీ సంతసం
రడీమేడ్ దుస్తులు వచ్చిన తర్వాత చాలా మంది దర్జీలకు ఉపాధి కరువైంది. దీంతో వారంతా ఇతర వృత్తుల వైపు వెళ్లకుండా.. ఆదాయం పొందే మార్గాలను అన్వేషించారు. కొందరు సంచార దర్జీలుగా మారారు. అందులో భాగంగానే వారపు సంతల్లో కుట్టుమిషన్లు పెట్టుకుని స్వయం ఉపాధి పొందుతున్నారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పాడేరు, చింతపల్లి, అరకులోయ యూత్ శిక్షణ కేంద్రాల ద్వారా వందలాది మంది గిరిజన మహిళలకు కుట్టు శిక్షణ ఇప్పించారు. 2006 నుంచి 2009 వరకు శిక్షణ పొందిన గిరిజన మహిళలందరికీ ప్రభుత్వమే ఉచితంగా నాణ్యమైన కుట్టు మిషన్లు పంపిణీ చేసింది. ప్రస్తుతం ఏజెన్సీలోని వారపు సంతలతో పాటు గిరిజన గ్రామాల్లో ఈ మహిళలంతా కుట్టు మిషన్ల ద్వారా స్వయం ఉపాధి పొందుతున్నారు. సిమిలిగుడకు చెందిన పాంగి మిధుల అనే మహిళ అరకులోయ మండలం మారుమూల లోతేరు వారపు సంతలో దుస్తులు కుడుతున్న చిత్రం ఇక్కడ చూడొచ్చు. –సాక్షి, పాడేరు -
ఇవిగో ఈత పళ్లు
గిరిజన ప్రాంతాల్లో ఈత పళ్ల సీజన్ ప్రారంభమైంది. మైదాన ప్రాంతాల్లో ఈత చెట్లు పెద్దవిగా ఉండడంతో పాటు పండ్ల పరిమాణం పెద్దవిగానే ఉంటాయి. ఏజెన్సీలో మాత్రం చిన్న మొక్కల మాదిరిగా ఈత చెట్లు ఉండగా వాటికి కాసే పండ్లు పరిమాణం కూడా చిన్నవిగా ఉంటాయి. జి.మాడుగుల, జి.కె.వీధి, పాడేరు, హుకుంపేట, పెదబయలు, అరకులోయ, అనంతగిరి మండలాల్లో ఈతచెట్లు అధికంగా ఉన్నాయి. ఈత చెట్లు ఉన్న కొండల్లో వేరే వృక్ష జాతి ఏమి ఉండవు. గిరిజనులు ఈత మొక్కల నుంచి బొడ్డెంగులు తవ్వి తింటుంటారు. ఈ సీజన్లో మాత్రం ఈత పండ్లను సేకరించి ఇంటిల్లపాది తినడంతో పాటు వారపు సంతలు, మండల కేంద్రాల్లో విక్రయిస్తుంటారు. ప్రస్తుతం ఈత పళ్ల సీజన్ కావడంతో గిరిజనులు వాటిని సేకరించి అమ్మకాలు జరుపుతున్నారు. విద్యాలయాలకు వేసవి సెలవులు కావడంతో గిరిజన చిన్నారులు కూడా ఈ పళ్లను సేకరిస్తున్నారు. గ్లాస్ రూ.10 చొప్పున విక్రయిస్తున్నారు. –సాక్షి, పాడేరు -
తృటిలో తప్పించుకున్న మావోయిస్టు అగ్రనేత.!
సాక్షి, అమరావతి/సీలేరు (పాడేరు) : విశాఖ ఏజెన్సీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాదిగమళ్లు అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగి ఒక్క రోజు కూడా గడవకముందే సోమవారం మరో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఆదివారం తప్పించుకున్న మావోయిస్టులు లక్ష్యంగా పోలీసులు కూంబింగ్ జరుపుతుండగా ఎదురు కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. పేములగొండి గ్రామ సమీపంలో సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఈ ఎదురు కాల్పులు జరిగాయి. ఇద్దరు మావోలు మృతి చెందినట్లు, మూడు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ సవాంగ్ సోమవారం రాత్రి ప్రకటించారు. అయితే మృతి చెందిన వారిని ఇంకా గుర్తించలేదు. రెండు రోజుల వ్యవధిలో అయిదుగురు మావోలు ఎన్కౌంటర్లో మృతి చెందారని తెలిపారు. పట్టుబడ్డ ఆయుధాల్లో ఏకే 47 ఉండటంతో మృతుల్లో మావో అగ్రనేత ఉండి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఆదివారం ఎన్కౌంటర్లో మరణించిన వారిని ఛత్తీస్‌గఢ్, ఒడిశాకు చెందిన బుద్రి, విమల, అజయ్‌గా గుర్తించారు. ఎన్‌కౌంటర్‌తో ప్రతీకార దాడులు ఆది, సోమవారాల్లో విశాఖ ఏజెన్సీలో జరిగిన ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోలు ప్రతీకార దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఏజెన్సీలో ప్రజాప్రతినిధులు బందోబస్తు లేకుండా తిరగవద్దంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఎన్కౌంటర్ అనం తరం తాజా పరిణామాలపై విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల ఎస్పీలతోపాటు గ్రేహౌండ్స్, ప్రత్యేక బలగాలకు నేతృత్వం వహిస్తున్న అధికారులతో డీజీపీ సోమవారం టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. ఇదిలాఉండగ.. సోమవారం జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేతలు అరుణక్క, జగన్ తప్పించుకున్నారని విశాఖ జిల్లా ఎస్పీ అట్టాడ బాపూజీ వెల్లడించారు. ధారకొండ అటవీ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతోందని తెలిపారు. ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు, సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మవోయిస్టులు మృతి చెందారని చెప్పారు. రెండు సార్లు జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేతలు తప్పించుకున్నారని ఎస్పీ పేర్కొన్నారు. రెండోసారి జరిగిన ఎదురుకాల్పుల్లో మృతి చెందినది ఇద్దరూ పురుషులేనని అన్నారు. వారు చత్తీస్‌గఢ్ ప్రాంతీయులుగా అనుమానం వ్యక్తం చేశారు. -
0 డిగ్రీల లంబసింగి వెళ్లొద్దామా?
నగరాల్లోనే చలి వణికిస్తోందనుకుంటే.. ఇక విశాఖ మన్యంలో ఉష్ణోగ్రతలు గజగజలాడిస్తున్నాయి. ప్రతిసారీ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే లంబసింగిలో కనిష్ఠ ఉష్ణోగ్రత 0 డిగ్రీలకు చేరుకుంది. దాంతో అక్కడ సాయంత్రం అయ్యేసరికే అంతా నిర్మానుష్యంగా మారుతోంది. రాత్రిపూట అస్సలు ఎవరూ బయటకు రావడం లేదు. మరోవైపు ఇదే సమయంలో అక్కడ పర్యాటకుల సందడి కూడా పెరుగుతుంది. లంబసింగితో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. చింతపల్లిలో 3, మెదాపల్లిలో 5, అరకులో 6, మినుములూరులో 7, పాడేరులో 8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. -
అసలు విషయాన్ని బయటపెట్టిన రావెల
బాక్సైట్ జీవో రద్దుచేయలేదని బయటపెట్టిన మంత్రి మోదకొండమ్మ జాతర సాక్షిగా బయటపడిన టీడీపీ కుట్ర కలవరపడుతున్న గిరి పుత్రులు మన్యంలో మళ్లీ రగులుకుంటున్న బాక్సైట్ ఉద్యమం అమాయక గిరిజనంపై ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు అమ్మవారి జాతరను అడ్డుపెట్టుకున్నారు.. ప్రభుత్వ ఉత్సవంగా గుర్తించామంటూనే మన్యంలో సంతోషాన్ని లాగేసుకున్నారు.. నాడు ఆదివాసీ దినోత్సవం వేదికగా బాక్సైట్ తవ్వుతున్నామని సీఎం చంద్రబాబు ప్రకటిస్తే, నేడు గిరిజన ఉత్సవం సందర్భంగా మంత్రి రావెల కిశోర్‌బాబు అదే మాటను పునరుద్ఘాటించారు. బాక్సైట్‌పై అడవి బిడ్డలు చేసిన పోరాటాలు, త్యాగాలకు తలొగ్గి వెనక్కు తగ్గినట్లు ఇన్నాళ్లూ నటించిన ప్రభుత్వం తెరవెనుక కుట్రలు బయటపడుతున్నాయి. విశాఖపట్నం : బాక్సైట్ తవ్వకాలకు అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.97ను గిరిజనులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డితో సహా పార్టీ యంత్రాంగం చేసిన బాక్సైట్ వ్యతిరేక ఉద్యమం నేపధ్యంలో తాత్కాలికంగా నిలిపివేస్తూ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. ఆ తర్వాత ఉద్యమం సద్దుమణిగింది. ఇక బాక్సైట్ జోలికి ప్రభుత్వం రాదనుకునే సంతోషంతో గిరిజనులు మోదకొండమ్మ అమ్మవారి జాతర జరుపుకుంటున్నారు. ఈ జాతరకు వచ్చిన రాష్ర్ట గిరిజన శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు బాక్సైట్ గురించి అక్కడ ఏమీ మాట్లాడలేదు. పైగా గిరిజనులు అడవిని కాపాడుకోవడం వల్లనే పచ్చగా ఉన్నారని తేనె పలుకులు పలికి వెళ్లిపోయారు. జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించామని, రూ.50 లక్షలను నిర్వహణ ఖర్చులుగా ప్రభుత్వం ఇస్తోందని ప్రకటించారు. కానీ ఆ ఆనందాన్ని గిరజనులకు ఆయన ఎంతో సేపు నిలువనివ్వలేదు. నర్సీపట్నం వెళ్లగానే తన నిజస్వరూపాన్ని బయటపెట్టారు. తవ్వకాల కోసం జారీ చేసిన జీవోను రద్దు చేయలేదని, గిరిజనుల ఆమోదం తోనే బాక్సైట్ తవ్వకాలకు ముందుకు వెళతామన్నారు. సోమవారం కూడా అరకులో ఇవే వ్యాఖ్యలు చేశారు. తొలిసారిగా బాక్సైట్ తవ్వుతున్నామనే విషయాన్ని కూడా గిరిజనులు సంతోషంగా జరుపుకుంటున్న ఆదివాసీ ఉత్సవాల్లోనే చంద్రబాబు ప్రకటించి చిచ్చు పెట్టారు. మళ్లీ అదే విధంగా గిరిజనుల ఆనందాన్ని హరించేలా వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షంపైనా కుట్ర అమ్మవారి పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించడం వెనుక కూడా ప్రభుత్వ కుట్ర ఉన్నట్లు కనిపిస్తోంది. ఆలయ కమిటీ చైర్‌పర్సన్‌గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి వ్యవహరిస్తున్నారు. ఆమె నేతృత్వంలోనే జాతర ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. కనీవినీ ఎరుగని రీతితో అత్యంత వైభవంగా జాతర జరిపేందుకు ఎమ్మెల్యే చేస్తున్న ప్రయత్నం గురించి తెలుసుకున్న ప్రభుత్వం జాతర విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని భావించింది. అంతేకాకుండా ప్రతిపక్ష ఎమ్మెల్యే ప్రాధాన్యాన్ని తగ్గించాలనుకుంది. మరోవైపు రూ. 50 లక్షలు ఇవ్వడం ద్వారా గిరిజనులకు తామోదో మేలు చేస్తున్నట్లు చూపించి, ఇదే అదునుగా బాక్సైట్ తవ్వకాలకు మళ్లీ అంకురార్పణ చేయాలని కుట్ర పన్నింది. అదే రావెల వ్యాఖ్యల్లో బయటపడింది. ఎమ్మెల్యేకు ఎరవేసింది ఇందుకేనా! అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు ఇటీవల టీడీపీలోకి జంపయిన విషయం తెలిసిందే. భారీగా ముడుపులు ఆశచూపి ఆయనను చేర్చుకున్నారని ఆరోపణలు వచ్చాయి. అయితే ముడుపులతో పాటు బాక్సైట్ తవ్వకాలను గిరిజనులు వ్యతిరేకించకుండా ఉండేలా చేయడం కూడా కిడారి చేరికలో భాగమని తెలుస్తోంది. బాక్సైట్ తవ్వకాలను తీవ్రంగా వ్యతిరేకించిన కిడారి సొంత నియోజకవర్గంలో బాక్సైట్‌కు అనుకూలంగా మంత్రి మాట్లాడే ధైర్యం చేయడం వెనుక కుట్ర ఇదేనని గిరిజనులు భావిస్తున్నారు. కేవలం రాజకీయ, స్వార్థ ప్రయోజనాల కోసం టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు చేస్తున్న కుట్రలకు కిడారి వంటి గిరిజన ద్రోహులు చేస్తున్న ప్రయత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సాగనివ్వమని, అవసరమైతే మళ్లీ బాక్సైట్ ఉద్యమ దివిటీని రగిలిస్తామని వారు అంటున్నారు. ఏది ఏమైనా గిరిజనులు అత్యంత పవిత్రంగా, సంతోషంగా జరుపుకునే మోద కొండమ్మ జాతర సమయంలో వారి జీవితాలను చిదిమేయాలనే ప్రభుత్వ కుట్రలు బయటపడటం మన్యంలో కలకలం రేపింది. -
ఆంధ్రప్రదేశ్‌లో దుర్మార్గపు పాలన: పి.మధు
సాక్షి, విజయవాడ బ్యూరో : రాష్ట్రంలో దౌర్జన్యకర దుర్మార్గపు పాలన సాగుతోందని, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్, వామపక్ష పార్టీల నేతలపై నాన్‌బెయిలబుల్ కేసులు బనాయించి ప్రభుత్వం బెదిరింపులకు దిగుతోందని సీపీఎం రాష్ర్ట కార్యదర్శి పి.మధు తీవ్రంగా దుయ్యబట్టారు. రాష్ర్టప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఐక్యపోరాటాలతో ఎదుర్కొంటామని హెచ్చరించారు. రెండు రోజులపాటు జరిగిన పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాల తీర్మానాలను ఆయన శనివారం మీడియాకు వెల్లడించారు. బాక్సైట్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న వైఎస్సార్సీపీ, సీపీఎం నాయకులు, కార్యకర్తలపై హత్య కేసు బనాయించడం దారుణమన్నారు. విశాఖ ఏజన్సీలో మావోయిస్టులు చేసిన హత్యను ఆసరాగా చేసుకుని వైఎస్సార్సీపీ, సీపీఎం శ్రేణులను రోజుల తరబడి పోలీసులు చిత్రవద చేసి భయానక పరిస్థితి కల్పించారని ఆరోపించారు. బీజేపీతో జట్టుకట్టిన టీడీపీ మత దురహంకారంతో మేధావుల హత్యలు, మైనారిటీలపై దాడులు. రోహిత్ ఆత్మహత్యపైన కనీసం స్పదించడంలేదని తప్పుబట్టారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఫిబ్రవరి 20 నుంచి వామపక్షాల బస్సుయాత్ర చేపడతామన్నారు. వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీల కోసం, పేదలకు ఇళ్ల స్థలాలు, రైతుల భూములకు భరోసా, ప్రాజెక్టుల్లో నిర్వాసితులకు న్యాయం చేయాలంటూ మార్చి 10న చలో అసెంబ్లీ నిర్వహిస్తామన్నారు. 45 మండలాలకు మంచినీరు అందించే కండలేరు ప్రాజెక్టు రద్దుకు నిరసనగా జనవరి 31న జరిగే ప్రత్యక్ష ఆందోళనలోను, భోగాపురంలో బలవంతపు భూసేకరణకు నిరసనగా ఫిబ్రవరి 4న జరిగే కార్యక్రమంలోను పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పాల్గొంటారన్నారు. రాజధాని, ఎయిర్‌పోర్టులు, ప్రోజెక్టుల పేరుతో రైతాంగం నుంచి చట్టవిరుద్ధంగా ప్రభుత్వం బలవంతంగా భూములు గుంజుకోవడంపై అన్ని జిల్లాల్లోనూ పోరాట కార్యక్రమాలు చేపడతామన్నారు. వంశధార, పులిచింతల రిజర్వాయర్లు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో నిర్వాసితులకు న్యాయం చేయకుండా వెళ్లగొట్టేందుకు ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సింగపూర్ కన్సార్టీయం పేరుతో కార్పొరేట్ కంపెనీలకు రాజధాని పనులు అప్పగించే ఏకపక్ష నిర్ణయాలు భవిష్యత్‌లో ఇబ్బందికరంగా పరిణమిస్తాయన్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక స్థానిక సంస్థలను కాదని జన్మభూమి కమిటీలకు అప్పగించడం దారుణమని, జన్మభూమి కమిటీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సంపన్నవర్గాలు, కార్పొరేట్లకు భూ పందేరంతో సహా అనేక రాయితీలిస్తున్న ప్రభుత్వం చిరుద్యోగులు, రైతులు, పేదలు పట్ల కక్షపూరిత ధోరణి అవలంబిస్తోందని విమర్శించారు. విలేకరుల సమావేశంలో సీపీఎం రాష్ట్ర నాయకులు పాటూరి రామయ్య, వై.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
విశాఖ ఏజెన్సీలో కనిష్ట ఉష్ణోగ్రతలు
విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. చలి తీవ్రత రోజురోజూకి పెరిగిపోతుంది. విశాఖ ఏజెన్సీలో సముద్రమట్టానికి మూడు వేల పైచిలుకు అడుగుల ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గిపోయి గిరిజనులు చలికి గజగజ వణికిపోతున్నారు. ఏజెన్సీలోని అరకు, లంబసింగిలో 10 డిగ్రీలు, చింతపల్లిలో 13 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయింది. విశాఖ ఏజెన్సీ అంతటా పెద్ద ఎత్తున చలిగాలులు వీస్తున్నాయి. దీంతో గిరిజనులు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. -
విశాఖ ఏజెన్సీలో కొనసాగుతున్న చలి తీవ్రత
విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. చలి తీవ్రత రోజురోజూకి పెరిగిపోతుంది. విశాఖ ఏజెన్సీలో సముద్రమట్టానికి మూడు వేల పైచిలుకు అడుగుల ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గిపోయి గిరిజనులు చలికి గజగజ వణికిపోతున్నారు. ఏజెన్సీలోని చింతపల్లిలో 8 డిగ్రీలు.... అలాగే లంబసింగిలో 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయింది. విశాఖ ఏజెన్సీ అంతటా పెద్ద ఎత్తున చలిగాలులు వీస్తున్నాయి. దీంతో గిరిజనులు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. -
విశాఖ ఏజెన్సీలో కొనసాగుతోన్న చలి తీవ్రత
విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. చలి తీవ్రత రోజురోజూకి పెరిగిపోతుంది. విశాఖ ఏజెన్సీలో సముద్రమట్టానికి మూడు వేల పైచిలుకు అడుగుల ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గిపోయి గిరిజనులు చలికి గజగజ వణికిపోతున్నారు. ఏజెన్సీలోని పాడేరులో 12 డిగ్రీలు.... అలాగే మినుములూరులో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయింది. విశాఖ ఏజెన్సీ అంతటా పెద్ద ఎత్తున చలిగాలులు వీస్తున్నాయి. దీంతో గిరిజనులు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. -
విశాఖ ఏజెన్సీలో కొనసాగుతున్న చలి తీవ్రత
విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. చలి తీవ్రత రోజురోజూకి పెరిగిపోతుంది. విశాఖ ఏజెన్సీలో సముద్రమట్టానికి మూడు వేల పైచిలుకు అడుగుల ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గిపోయి గిరిజనులు చలికి గజగజ వణికిపోతున్నారు. ఏజెన్సీలోని అరుకు, పాడేరులో 10 డిగ్రీలు.... అలాగే మినుములూరులో 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయింది. విశాఖ ఏజెన్సీ అంతటా పెద్ద ఎత్తున చలిగాలులు వీస్తున్నాయి. దీంతో గిరిజనులు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. -
విశాఖ ఏజెన్సీలో కొనసాగుతున్న చలి తీవ్రత
విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. చలి తీవ్రత రోజురోజూకి పెరిగిపోతుంది. విశాఖ ఏజెన్సీలో సముద్రమట్టానికి మూడు వేల పైచిలుకు అడుగుల ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గిపోయి గిరిజనులు చలికి గజగజ వణికిపోతున్నారు. ఏజెన్సీలోని లంబసింగిలో 7 డిగ్రీలు, చింతపల్లి 9.5 డిగ్రీలు, అరకు, పాడేరులో కూడా ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. విశాఖ ఏజెన్సీ అంతటా పెద్ద ఎత్తున చలిగాలులు వీస్తున్నాయి. దీంతో గిరిజనులు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. -
విశాఖ ఏజెన్సీలో చలి తీవ్రత
విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. చలి తీవ్రత రోజురోజూకి పెరిగిపోతుంది. విశాఖ ఏజెన్సీలో సముద్రమట్టానికి మూడు వేల పైచిలుకు అడుగుల ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గిపోయి గిరిజనులు చలికి గజగజ వణికిపోతున్నారు. ఏజెన్సీలోని లంబసింగిలో 5 డిగ్రీలు, చింతపల్లి 7 డిగ్రీలు, అరకు, పాడేరులో 8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విశాఖ ఏజెన్సీ అంతటా పెద్ద ఎత్తున చలిగాలులు వీస్తున్నాయి. దీంతో గిరిజనులు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. -
విశాఖ ఏజెన్సీలో కొనసాగుతున్న చలి తీవ్రత
విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. చలి తీవ్రత రోజురోజూకి పెరిగిపోతుంది. విశాఖ ఏజెన్సీలో సముద్రమట్టానికి మూడు వేల పైచిలుకు అడుగుల ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గిపోయి గిరిజనులు చలికి గజగజ వణికిపోతున్నారు. ఏజెన్సీలోని లంబసింగిలో 5 డిగ్రీలు, మినుములూరులో 7 డిగ్రీలు, చింతపల్లి, పాడేరులో 8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విశాఖ ఏజెన్సీ అంతటా పెద్ద ఎత్తున చలిగాలులు వీస్తున్నాయి. దీంతో గిరిజనులు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. -
విశాఖ ఏజెన్సీలో పడిపోయిన ఉష్ణోగ్రతలు
చింతపల్లి: విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయాయి. బుధవారం ఉదయం లంబసింగిలో ఉష్ణోగ్రత 3 డిగ్రీలు నమోదైంది. ఇది ఈ సీజన్లోనే కనిష్ణ ఉష్ణోగ్రత. ఇక మినుములూరులో, చింతపల్లిలో 6 డిగ్రీలు, పాడేరులో 8 డిగ్రీలు, అరకులో 10 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు తగ్గాయి. పొగమంచు, చలితీవ్రతతో గిరజనులు అవస్థలు పడుతున్నారు. అరకు, లంబసింగి ప్రాంతాల్లో పర్యాటకుల సందడి పెరిగింది. -
‘అరకు’ కాఫీ ఘుమఘుమలు!
- మార్కెట్లోకి విడుదల - తొలిరోజే రూ.10 లక్షల ఆర్డరు - 50, 100, 200, 500 గ్రాముల్లో లభ్యం సాక్షి, విశాఖపట్నం: అరకు వ్యాలీ కాఫీ మార్కెట్లోకి విడుదలైంది. విశాఖ ఏజెన్సీలో పండిన కాఫీని గిరిజన సహకార సంస్థ (జీసీసీ) తొలిసారిగా రిటైల్ మార్కెట్ ద్వారా అమ్మకాలకు శ్రీకారం చుట్టింది. ఆదివారం రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖా మంత్రి రావెల కిశోర్‌బాబు అరకు వ్యాలీ కాఫీ మార్కెట్లోకి విడుదల చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ విశాఖ మన్యంలో ఇప్పటికే లక్ష ఎకరాల్లో కాఫీ పంట సాగవుతోందని, కాఫీ తోటల అభివృద్ధి పథకంలో భాగంగా రూ.526 కోట్లతో అదనంగా లక్ష ఎకరాల్లో కాఫీ తోటలను సాగు చేస్తామన్నారు. గిరిజన రైతులు పండించే కాఫీని పార్చుమెంట్ రకం కిలో రూ.180, చెర్రీ రకం రూ.92కు ఇకపై జీసీసీ కొనుగోలు చేస్తుందని, దీనివల్ల రైతుకు రెట్టింపు ఆదాయం వస్తుందని, దళారుల బెడద తప్పుతుందని పేర్కొన్నారు. ఇన్నాళ్లూ దళారులు కాఫీ గింజల కొనుగోళ్లతో గిరిజన రైతులు రూ.700 కోట్ల వరకు నష్టపోయినట్టు గుర్తించామన్నారు. ఇక్కడ పండే ఆర్గానిక్ కాఫీకి విదేశాల్లో మంచి గిరాకీ ఉన్న దృష్ట్యా అరకువ్యాలీ కాఫీని తయారు చేసి మార్కెట్లోకి ప్రవేశపెడ్తున్నామన్నారు. 100 టన్నుల కాఫీ అమ్మకాలు లక్ష్యం జీసీసీ ఎండీ ఎఎస్పీఎస్ రవిప్రకాష్ మాట్లాడుతూ తమ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, అరకువ్యాలీ కాఫీకి కూడా అనతికాలంలోనే జాతీయ స్థాయి కాఫీ మార్కెట్లో అగ్రగామి అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖ ఏజెన్సీ కాఫీని ఇప్పటిదాకా విదేశీయులే తప్ప తెలుగు రాష్ట్రాల వారు గాని, దేశీయులు గాని రుచి చూడలేదన్నారు. ఇకపై అరకువ్యాలీ కాఫీతో స్వచ్ఛమైన కాఫీని వీరు రుచి చూడడానికి వీలవుతుందన్నారు. 50, 100, 200, 500 గ్రాముల ప్యాక్‌ల్లో దీనిని జీసీసీ రిటైల్ దుకాణాలు, సూపర్మార్కెట్లలోనే కాక ఆన్లైన్ షాపింగ్ ద్వారా అందుబాటులో ఉంచుతామని చెప్పారు. తొలి సంవత్సరం రూ.4 కోట్ల విలువైన 100 టన్నుల కాఫీని రిటైల్ మార్కెట్లో అమ్మకం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీవో హరినారాయణ, కాఫీ రైతులు పాల్గొన్నారు. -
మిస్టరీగా మారిన మావోయిస్టుల ఎన్కౌంటర్!
విశాఖ: విశాఖ జిల్లా ఏజెన్సీలో మావోల ఎన్కౌంటర్ మిస్టరీగా మారింది. మావోయిస్టుల అలజడితో అప్రమత్తమైన పోలీసులు ఏజెన్సీలను జల్లెడపడుతున్నారు. ఒడిశా నుంచి 150 మంది మావోయిస్టులు దిగారని సమాచారం అందడంతో పోలీసులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. దీంతో శుక్రవారం కుంబింగ్ ముమ్మరం చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇందులో భాగంగా ఇరగాయి పంచాయతీ చెల్లుబడి సమీపంలో మావోల డంప్‌ను గుర్తించారు. చెల్లాచెదురుగా పడి ఉన్న 14 సిట్ బ్యాగులు, విప్లవ సాహిత్యం, వంటసామాగ్రి, బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
విశాఖలో భారీ వర్షం.
-
విశాఖ ఏజెన్సీలో కుండపోత వర్షం
-
విశాఖ ఏజెన్సీలో కుండపోత వర్షం
పాడేరు: విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో మంగళవారం మధ్యాహ్నం నుంచి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పాడేరు, పెద్దబయలు సహా ఇతర ప్రాంతాల్లో మధ్యాహ్నం 12 గంటలకు భారీ వర్షం మొదలు కాగా, 2.30 గంటల సమయంలోనూ కొనసాగుతోంది. దీంతో రోడ్లు, పొలాలు జలమయమయ్యాయి. పరదనిపొట్టు వద్ద, పాడేరు-రాయగడ మధ్య మత్స్యగడ్డ పొంగి ప్రవహిస్తుండడంతో ఆయా మార్గాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. -
'చంద్రబాబు, కొత్తపల్లి గీత కుమ్మక్కయ్యారు'
విశాఖ : విశాఖ ఏజెన్సీలోని బాక్సైట్ తవ్వకాలు జరిపితే రాష్ట్రం ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తున్నారని పాడేరు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. బాక్సైట్ తవ్వకాలు చేపడితే గిరిజన ఎమ్మెల్యేగా గిరిజన హక్కుల ఉల్లంఘటన కింద తీవ్ర నిరసన తెలియచేస్తామని ఆమె బుధవారమిక్కడ హెచ్చరించారు. అరకు ఎంపీ కొత్తపల్లి గీతపై అనర్హత వేటు వేయాలని ఇప్పటికే లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. వైఎస్ఆర్ సీపీ ఎంపీ అయినప్పటికీ టీడీపీతో కొత్తపల్లి గీత కుమ్మక్కయ్యారని, అది ఆమె అవకాశ వాదానికి నిదర్శనమన్నారు. చంద్రబాబు, కొత్తపల్లి గీత ఇద్దరూ కుమ్మక్కై గిరిజన ప్రాంత అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని గిడ్డి ఈశ్వరి విమర్శించారు. ఎంపీ కొత్తపల్లి గీత ఎస్టీ కాదు ఎస్సీ అని స్క్రూటినీ కమిటీ నివేదిక ఇచ్చినా నేటికీ చంద్రబాబు సర్కార్ ఆ విషయాన్ని బహిరంగం చేయలేదని ఆమె అన్నారు. -
రూ. 596 కోట్లతో విశాఖలో కాఫీ ప్లాంటేషన్
విశాఖపట్నం : దేశంలోనే మరెక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ ఏజెన్సీలో రూ.596కోట్ల అంచనా వ్యయంతో ఒకేసారి లక్ష ఎకరాల్లో భారీఎత్తున కాఫీ ప్లాంటేషన్ చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి రావెల కిషోర్‌బాబు వెల్లడించారు. శుక్రవారం విశాఖ జీసీసీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... అటవీ విస్తీర్ణత 33 శాతం ఉండాల్సి ఉండగా ప్రస్తుతం ఏపీలో కేవలం 24 శాతం మాత్రమే ఉందనీ, అటవీ విస్తీర్ణాన్ని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని వెల్లడించారు. కాఫీ ప్లాంటేషన్ ప్రాజెక్టు కూడా ఇందులో భాగమేనన్నారు. కాఫీ ప్లాంటేషన్ ప్రాజెక్టు కోసం సగం నిధులు ట్రైబల్ సబ్ ప్లాన్ నుంచి సమకూర్చుతుండగా, మిగిలిన సగం నిధులు కాఫీ బోర్డు సబ్సిడీ రూపంలో అందజేస్తుందన్నారు. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా వేలాది మంది గిరిజనులకు ఉపాధి లభించనుందన్నారు. ఇంత భారీ ఎత్తున ప్లాంటేషన్ చేపట్టడం దేశంలోనే ఇదే తొలిసారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, వారి అభ్యున్నతి కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేసేందుకైనా వెనుకాడబోమని అన్నారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈ ఏడాది గిరిజన సబ్‌ప్లాన్ కోసం రూ. 1900 కోట్లు బడ్జెట్లో కేటాయించడమే ఇందుకు నిదర్శనమన్నారు. -
జి మాడుగులలో మావోల బీభత్సం!
-
ప్రేమ విఫలం.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
విశాఖ జిల్లా ముంచంగిపుట్టు సమీపంలోని మత్స్యగడ్డలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మరణించింది. ప్రేమ విఫలం అవ్వడంతోనే ఆమె చనిపోయిందంటూ విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలంటూ ముంచంగిపుట్టు నాలుగురోడ్ల జంక్షన్లో విద్యార్థులు ధర్నా చేశారు. -
బాక్సైట్ దోపిడీకే బాబు విదేశీ పర్యటనలు: రఘువీరా రెడ్డి
పాడేరు: విశాఖ ఏజెన్సీలో విలువైన బాక్సైట్ ఖనిజ సంపదను దోచుకునే ఎజెండాతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్, జపాన్, మలేషియా వంటి దేశాల పర్యటనకు వెళుతున్నారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు. హుద్‌హుద్ తుపానుతో నష్టపోయిన గిరిజన ప్రజలను పరామర్శించి, మృతి చెందిన కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రూ.లక్ష చొప్పున పరిహారం చెక్కులు, రగ్గులు, చీరల పంపిణీ చేసేందుకు సోమవారం పాడేరు ప్రాంతంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా వనుగుపల్లి పంచాయతీ మారుమూల బంగారుమెట్ట గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం ఆరునెలల పరిపాలన అస్తవ్యస్తంగా ఉందని, గిరిజనులు, దళితుల సంక్షేమాన్ని కూడా విస్మరిస్తోందని దుయ్యబట్టారు. గత ఎన్నికల్లో పెట్టుబడి పెట్టిన బడాబాబులందరికీ గిరిజన సంపదను దోచిపెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. ఈ రెండు ప్రభుత్వాల కుట్రలను భగ్నం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ గిరిజనుల పక్షాన పోరాడుతుందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అసెంబ్లీలో గిరిజనుల పక్షాన పోరాటం చేశారని, తమకు అసెంబ్లీలో స్థానం లేనందున ప్రజాకోర్టుల ద్వారా బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. గిరిజన శాసనసభ్యుడు ఉన్నప్పటికి మంత్రిని కూడా చేయకుండా గిరిజనులను టీడీపీ ప్రభుత్వం అవమాన పరుస్తోందని విమర్శించారు. ఏజెన్సీలో బాధితులను ఆదుకోవడంలో తాము విఫలమయ్యామని సాక్షాత్తు మంత్రి రావెల కిశోర్ బాబే ప్రకటించడాన్ని బట్టి టీడీపీ ప్రభుత్వ నిరంకుశ పాలన అర్థమవుతుందన్నారు. కాఫీ తోటల ధ్వంసమైన బాధితులందరికి పెద్ద మొత్తంలో పరిహారం చెల్లించాలని లేనిపక్షంలో రాష్ట్ర గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. అనంతరం బాధిత గిరిజనులకు రగ్గులు, చీరలను రఘువీరా రెడ్డి పంపిణీ చేశారు. కక్షతో టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు విశాఖపట్నం: చంద్రబాబు కక్షతో, ఉద్దేశపూర్వక ంగా శంషాబాద్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టారని పీసీసీ అధ్యక్షుడు పి. రఘువీరారెడ్డి ఆరోపించారు. సోమవారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ పనితీరుపై ధ్వజమెత్తారు. చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల కంటే సింగపూర్‌పై దృష్టి సారించి ‘సింగపూర్ బాబు’లా మారాడని ఆయన చమత్కరించారు.