విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. చలి తీవ్రత రోజురోజూకి పెరిగిపోతుంది. విశాఖ ఏజెన్సీలో సముద్రమట్టానికి మూడు వేల పైచిలుకు అడుగుల ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గిపోయి గిరిజనులు చలికి గజగజ వణికిపోతున్నారు.
ఏజెన్సీలోని చింతపల్లిలో 8 డిగ్రీలు.... అలాగే లంబసింగిలో 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయింది. విశాఖ ఏజెన్సీ అంతటా పెద్ద ఎత్తున చలిగాలులు వీస్తున్నాయి. దీంతో గిరిజనులు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు.
విశాఖ ఏజెన్సీలో కొనసాగుతున్న చలి తీవ్రత
Published Sat, Jan 23 2016 8:17 AM | Last Updated on Sun, Sep 3 2017 4:10 PM
Advertisement