
మిస్టరీగా మారిన మావోయిస్టుల ఎన్‌కౌంటర్!
విశాఖ జిల్లా ఏజెన్సీలో మావోల ఎన్‌కౌంటర్ మిస్టరీగా మారింది.
విశాఖ: విశాఖ జిల్లా ఏజెన్సీలో మావోల ఎన్‌కౌంటర్ మిస్టరీగా మారింది. మావోయిస్టుల అలజడితో అప్రమత్తమైన పోలీసులు ఏజెన్సీలను జల్లెడపడుతున్నారు. ఒడిశా నుంచి 150 మంది మావోయిస్టులు దిగారని సమాచారం అందడంతో పోలీసులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. దీంతో శుక్రవారం కుంబింగ్ ముమ్మరం చేసినట్టు పోలీసులు తెలిపారు.
ఇందులో భాగంగా ఇరగాయి పంచాయతీ చెల్లుబడి సమీపంలో మావోల డంప్‌ను గుర్తించారు. చెల్లాచెదురుగా పడి ఉన్న 14 సిట్ బ్యాగులు, విప్లవ సాహిత్యం, వంటసామాగ్రి, బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.