
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. దీంతో జిల్లాలో హైటెన్షన్ వాతావరణ నెలకొంది. మావోయిస్టు పార్టీ అగ్రనాయకులు ప్రభాత్, భాస్కర్, వర్గీస్, రాము, అనిత సంచరిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. బోథ్ మండలంలోని కైలాస్ టేకిడి ప్రాంతంలో పోలీసు బలగాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. ఈ కూంబింగ్‌లో మావోలకు సంబంధించిన గ్రెనేడ్ లభ్యమైంది. అయితే దీనిని పోలీసులు ధ్రువీకరించడం లేదు. గోప్యంగా ఉంచుతున్నారు. కానీ మావోల కోసం భారీగా బలగాలతో కూంబింగ్ కొనసాగిస్తున్నారు. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment