ఆదిలాబాద్: జిల్లాలో మావోయిస్టుల సంచరిస్తున్నట్లు ఆదిలాబాద్ జిల్లా పోలీసులుకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో జిల్లాలోని కోతపల్లి, వేమనపల్లి, దేహగాం, బెజ్జూరు మండలాల్లోని అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు. అలాగే ప్రాణహిత నదీపరివాహక ప్రాంతంలో కూడా పోలీసులు వేట కొనసాగుతుంది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి జిల్లాలోకి భారీగా మావోయిస్టులు జిల్లాలోకి ప్రవేశించారని నిఘా వర్గాలు పోలీసులుకు వెల్లడించాయి.